డాక్టర్ అక్కినేని జయంతి సందర్భంగా వివిధ దిన పత్రికల్లో ప్రచురితమైన ఓ కమ్మని అక్కినేని కవిత మిత్రులారా మీకోసం పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
రామాపురం ఊరిలో
ఉదయించిన సూర్యకిరణం...
నిరుపేద రైతు కుటుంబంలో
వెంకటరత్నం పున్నమ్మలను
పుణ్య దంపతులకు జన్మించిన
పుత్రరత్నం నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని
"ధర్మపత్ని"తో బాలకిరణమై
వెండితెరపై వెలిగి 255
చిత్రాల్లో నటించి ఏడు దశాబ్దాలు
తెలుగు చలనచిత్ర సామ్రాజ్యాన్ని ఏలి
"మనం"చిత్రంతో క్యాన్సర్ తో
మరలిరాని లోకాలకు తరలిపోయె...
ఆంధ్ర ప్రేక్షకుల గుండెల్లో ఆరనిదీపమాయే
తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ
నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని...
జానపదం నుంచి పౌరాణికం వరకు
ప్రతిపాత్రకు ప్రాణప్రతిష్ట చేసిన శిల్పి
ఘంటసాల గీతాల్లో లిప్ మాయతో
రొమాంటిక్ స్టెప్స్ తో
కుర్రకారును ఉర్రూతలూగించి...
నవరాత్రులు చిత్రంలో
తొమ్మిది పాత్రలు పోషించిన...
ద్విపాత్రాభినయం చేసిన "తొలిహీరో"...
నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని...
భక్త తుకారాం భక్తి...
దేవదాసు దుఃఖం...
బుద్ధిమంతుడి తెలివి...
ప్రేమాభిషేకం అనురాగం...
అక్కినేని అద్భుత నటనా
చాతుర్యానికి నిలువెత్తు నిదర్శనం...
"శ్రీరామ జననం"లో
"రాముని పాత్రలో ...చెంచులక్ష్మి లో
"విష్ణుమూర్తి పాత్రలో జీవించిన...
"రామకథను వ్రాసిన కవికోకిల మహర్షి
"వాల్మీకి పాత్రను" ధరించిన...ధన్యజీవి
"నాస్తికుడైన నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని
22 ఎకరాల అన్నపూర్ణ స్టూడియోస్
అధినేతకు దర్శక రత్న దాసరి దర్శకత్వంలో
కాసులు కురిపించిన...
అఖిలాంధ్ర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన...
హైదరాబాద్ లో 533 రోజులు ఆడిన...
బ్లాక్ బస్టర్ మూవీ...ప్రేమాభిషేకం...
అది అక్కినేని నటనకు...పట్టాభిషేకం...
అనార్కలిలో అక్బర్ సలీంగా...
లైలా మజ్నులో మజ్నుగా...
ప్రేమనగర్ లో భగ్నప్రేమికుడిగా...
మహాకవి పండితుడైన కాళిదాసుగా...
మద్యానికి బానిసైన దేవదాసుగా...
"ట్రాజెడీ కింగ్" గా నటించి...
అఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాలను
కొల్లగొట్టిన అగ్రశ్రేణినటుడు అక్కినేని...
గుడివాడ ఏఎన్నార్ కాలేజీకి...
వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీకి...
భూరీ విరాళమిచ్చిన
అపరదానకర్ణుడు అమరజీవి అక్కినేని
చదివింది నాలుగో తరగతేఐనా
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే
నడిచే విశ్వవిద్యాలయం...
తోటినటులకు, హీరోయిన్ లకు
ఒక ఆదర్శం...ఒక నటనాలయం
నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని...
అమెరికా ఆస్ట్రేలియా జపాన్ జర్మనీ
రష్యా ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించి...
ఉత్తమ నటుడిగా...
మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు...
పద్మ విభూషణ్ పురస్కారం...
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులందుకొని...
అవార్డులకే వన్నెతెచ్చిన వెండితెర వేల్పు
నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని...
తెలుగు సినిమా పరిశ్రమ
చెన్నై నుంచి హైదరాబాద్
రాకకు ఓ ప్రేరణాత్మక దీపస్తంభం...
ఆధ్యుడు...అమరజీవి డాక్టర్ అక్కినేని...
ఈ మహానటుడి కీర్తి
అజరామరం...ఆచంద్రతారార్కం...
వారు ప్రేక్షకులగుండెల్లో ఓ ఆరనిదీపం...
కులమతాలకు...
కుళ్ళు కుతంత్రాలకు...
రాజకీయాలకు అతీతంగా...
పదవీవ్యామోహం లేని...
అరమరికలులేని...
అవినీతి మరకలులేని...
అసూయా ద్వేషాలులేని...
నిండుకుండ...నిగర్వి "అంచేత"వారు
హద్దులు మీరని బుద్దిమంతుడు...
దర్జాగా బ్రతికిన దసరా బుల్లోడు...
అందరు అభిమానించే అందాలరాముడు
మరణం లేని మహానటుడు...
నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు
వారికిదే నా అక్షర నీరాజనం...
రచన:
కవి రత్న
సాహిత్య ధీర
సహస్ర కవి భూషణ్
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్





















Comments
Post a Comment