పాస్టర్ ప్రవీణ్ పగడాల...24.03.2025 వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు...ఒక కవిత కొన్ని ఫోటోలు... మీకోసం... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

 
















































































జ్ఞాన సూర్యుడు...పాస్టర్ 
ప్రవీణ్ పగడాలకు కన్నీటి వీడ్కోలు..!

(పార్టు...1)

అణగారిన వర్గాల 
ఆశా కిరణం... 
మతోన్మాద 
మదపుటేనుగుల
గుంపును ఎదిరించిన
ఒక నిశ్శబ్ద విప్లవ వీరుడు... 
కాషాయ వస్త్రాల
కంచుకోటల్ని కదిలించిన
ఒక క్రిస్టియన్ కెరటం... 
సప్త సముద్రతీరాలను దాటి 
ప్రవహించిన ఓ మత ప్రభోదకుడు...
అజ్ఞానాంధకారాన్ని తుడిచిన
ఒక దళిత నాయకుడు... 
మట్టివాసన నుండి పుట్టిన 
ఒక బహుజన బాంధవుడు... 
మానవతావాది ప్రవీణ్ పగడాల...
24 మార్చి 2025 అర్థరాత్రి వేళ 
ఆంధ్రలో అత్యంత కిరాతకంగా... 
అతిదారుణంగా హత్యకు గురైపోయే... 

ఒక ముస్లిం తండ్రికి... 
ఒక దళిత తల్లికి...
పుత్రరత్నంగా జన్మించినా...
 
యుక్త వయసులో 
సైతాన్ సామ్రాజ్యంలో 
విచ్చలవిడిగా వ్యవహరించినా...

ఎంతో అందమైన... 
అతి సుందరమైన... 
ఒక సినీహీరోలా... 
చెరగని చిరునవ్వుతో...
ముచ్చటైన ముఖవర్చస్సుతో...
సూటు బూటు ఆహార్యంతో...
సుందర రూపంతో
అందరినీ ఆకర్షించడంలో
అన్యాయాల్ని ఎదిరించడంలో
మతగ్రంధాలెన్నో భక్తితో ఆసక్తితో
మదించి...పగలురాత్రి పరిశోధించి  
లోతుగా అధ్యయనం చేసిఔపాసన పట్టి

రక్షణటీవీ ఆధ్వర్యంలో పట్టపగలే 
మేఘాల మధ్య మెరుపులా... 
మతోన్మాదులతో ముఖాముఖిచర్చల్లో 
"అక్షరాలను అస్త్రాలుగా"మార్చి... 
పరుష పదజాలాన్ని మెరుపులా విసిరి...
లోతైన భావాల సంద్రంలో ముంచి... 
తాను నమ్మిన సిద్ధాంతాన్ని 
కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించి... 
చిరుమందహాసంతో బలమైన 
వాగ్ధాటితో ప్రత్యర్ధులను ఒప్పించడంలో...
మనువాదులను మట్టి కరిపించడంలో... 
పాపాల లోపాల పుట్టను పెకలించడంలో..
మహాదిట్ట...పాస్టర్ ప్రవీణ్ పగడాల...

(పార్టు...2)

అంబేద్కర్ ఆశయాలను 
గగనచుంబిత శిలలతో పోల్చి... 
బ్రాహ్మణ భావజాలాన్ని 
వంకర గాలిపటంలా చీల్చి... 
ముస్లింల అతివాదాన్ని 
చీకటి మేఘంగా ఎదుర్కొని... 
న్యాయం అనే ఇంద్రధనుస్సుతో 
అందరిని అర్థనగ్నంగా బంధించి...

హృదయాన్ని హత్తుకునేలా 
ఉదాహరణల కాంతులు వెలిగించి 
సత్యాన్ని సూర్యోదయంగా చూపడంలో... 
మెత్తగా కత్తులు విసరడంలో ...
తర్కాన్ని పదునైన ఖడ్గంగా మార్చి... 
ప్రత్యర్ధిని చిత్తు చేయడంలో... 
సిద్ధహస్తుడు...బహుభాషా ప్రవీణుడు మతప్రభోదకుడు...మన ప్రవీణ్ పగడాల...

10 మంది పిల్లల 
బంగారు భవిష్యత్తును 
శిలువలా భుజాన వేసుకుని 
ఆశీర్వాదం వర్షమై కురిసే ప్రభు సేవకుడు 
ప్రేమామయుడు..పాస్టర్ ప్రవీణ్ పగడాల...

సహనానికి నిలువెత్తు నిదర్శనమై...
సంఘసంస్కరణలకు దివ్యమైన దివిటిగా.
స్థితప్రజ్ఞతకు చిరునామాగా మారిన..
గౌతమ బుద్ధుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల...

అణగారిన...అణచివేయబడిన
తరతరాలుగా అట్టడుగునున్న 
బడుగు... బలహీన...బహుజన వర్గాల 
ఆశలకు ఆకాశమే హద్దని చూపించిన...
అభ్యున్నతికై అహర్నిశలు శ్రమించిన...
అభినవ అంబేద్కర్..మన ప్రవీణ్ పగడాల

(పార్టు...3)

మూఢాచారాల మేఘాలు కమ్ముకున్నా... 
అంధవిశ్వాసాల చీకటి చుట్టుముట్టినా... 
సత్యజ్యోతిని చేపట్టిన సాహసి...
సంఘ సంస్కర్త...మన ప్రవీణ్ పగడాల...

సనాతనధర్మమను సంకెళ్లలో బంధీలైన 
మతోన్మాదుల కలల్ని భగ్నం చేసిన... 
కంట్లోకారమై...గుండెల్లో గునపమై...
పంటికింద రాయిలా...చెవిలో జోరీగలా... 
ప్రక్కలో బల్లెమై గర్జించిన...దళితపులి...

పుస్తకాలను 
అక్షర దేవతలుగా ఆరాధించిన... 
బూజుపట్టిన గ్రంధాల్లో 
గూఢార్ధాలను వెలికితీసిన...
రాత్రినిద్రను త్యజించిన... 
జ్ఞానజ్యోతి వెలిగించిన...
అంతులేని అధ్యయన వీరుడు...
ఆలోచనా పరుడు..పాస్టర్ ప్రవీణ్ పగడాల

వేదికలపై వెలుగులు ప్రసరించి...
నిజాల్ని కుండబద్దలు కొట్టినట్టు 
విజ్ఞాన విస్ఫోటనం గావించి...
సామాన్యుల హృదయాల్లో 
ఆశల పునాదులు వేసే వాగ్ధాటికి 
త్రిశక్తి స్వరూపం...ప్రవీణ్ పగడాల...

బాల్యానికి ఆశలస్వప్నం చూపించిన...
అనాధల ఆకలి తీర్చిన..."అన్నదాతను" 
"జ్ఞానదాతను"..."స్పూర్తి ప్రదాతను"...

ఫలాల కిరణాలను 
ప్రసరించే పచ్చని వృక్షాన్ని... 
కిరాయి గుండాలతో...
నిర్దాక్షిణ్యంగా నేలకొరిగించినా...
కిరాతకులు కిలకిల నవ్వినా...
కుట్రల మేఘాలు కమ్ముకున్నా...
ఆత్మ లయంకాని అమరజీవి...
ప్రతి రోజూ యూట్యూబ్లో కనిపించే 
స్వరాన్ని వినిపించే నిశ్శబ్ద విప్లవకారుడు 
ప్రభు సేవకుడు...పాస్టర్ ప్రవీణ్ పగడాల... 

(పార్టు...4)

ఊరికి ఉపకారిలాంటి 
సమతా వాదిని...
మానవతా మూర్తిని... 
తన భావజాలం గిట్టని 
ఉన్మాదులు మతోన్మాదులు 
ప్రవీణ్ ను మట్టుపెట్టాలని...
కుట్రలు కుతంత్రాలెన్నో పన్ని 
ఉరికంబం ఎక్కించారని 
ఉలిక్కిపడిన క్రిస్టియన్ సమాజం 
కన్నీటి వర్షంలో తడిసి...

హైందవమైనా...ఇస్లామైనా... 
కడకు క్రైస్తవమైనా...అది ఏదైనా 
మనిషి మనిషి మధ్య
"మంటలు రేపే మతం" మనకొద్దని... 
"మంచితనం మానవత్వమే" ముద్దని 
సమానత్వం సౌభ్రాతృత్వమే మన హద్దని
కులమత భూతాలను కూల్చాలని... 
ఛాందస భావాలను కాల్చాలని...

అంబేద్కర్ ఆశయాలే 
మనకు ఆయుధాలని...
కుల వివక్షతతో కుళ్ళిపోయిన 
సమాజ రుగ్మతలకవి ఔషదాలని... 
చెడు సంస్కృతులను చెరపట్టి 
ప్రభువు పాదాల చెంతకు చేర్చాలని...
 
అభ్యుదయ భావాల అమృతాన్ని 
అందరికీ పంచుతూ విజ్ఞానదాయకమైన 
ప్రసంగాలతో ప్రకంపనాలు సృష్టిస్తూ...
నిమ్న జాతిని నిద్రలేపుతూ...
జాగృతం చేస్తూ చైతన్య పరుస్తూ...
సుడిగాలిలా...సునామీలా... 
ముందుకు దూసుకుపోతున్న... 

గాడ్ ఈజ్ మై కింగ్ ఆయనే నా రాజు 
నా రాజ్యం పరలోక రాజ్యం అంటూ 
పరలోకానికి పయణమైన...ప్రభోధకుడు 
జ్ఞానసూర్యుడు...ప్రవీణ్ పగడాల...
"అమర్ రహే" అమర్ రహే" అంటూ...
దిక్కులు పిక్కటిల్లేలా కడలి కెరటాల్లా 
కదిలి వచ్చిన క్రిష్టియన్ సమాజం గళమెత్తి 
వీడ్కోలు పలికింది అశ్రునయనాలతో ...


రచన: 
కవిరత్న 
సహస్ర కవి భూషణ్ 
పోలయ్య కూకట్లపల్లి 
అత్తాపూర్ హైదరాబాద్





Comments