అమెరికా అంతరిక్ష వ్యోమగాములు సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ లు 9 నెలల తర్వాత నిక్ హేగ్ అలేగ్జాండర్ గోర్భునోవ్ లతో కలిసి భూమి మీదకు సురక్షితంగా 19.03.2025 తెల్లవారుఝామున 3.27ని.లకు అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన వేళ... ప్రపంచమంతా ఆనంద హేల... కొన్ని కవితలు అరుదైన కొన్ని దృశ్యమాలికలు మీకోసం మితృలారా...తిలకించి పులకించి పొండి...పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
నక్షత్ర పయనం నడిచిన నడక...
విశ్వాంతరాళంలో వెలిగే జ్యోతి...
భూమి కౌగిటి నుంచి అంబర వీధిలో
వేగవంతమైన కలల కదలిక - సునీత..!
సాహసమే శ్వాసగా
సాగిన ప్రయాణం...
గురుత్వాకర్షణను
అధిగమించిన ఆత్మస్థైర్యం..!
రోజు ఆమె అంతరిక్షంలో
తిలకించి పులకించేను...
పదహారుసార్లు సూర్యోదయాలు...
పదహారుసార్లు సూర్యాస్తమయాలు..!
మహాసముద్రాలు...
మేఘాల కదలికలు...
ముత్యాల వీణలై మురిసే ప్రకృతి...
అంతరిక్షం అనురాగ గీతం పాడగా...
వైజ్ఞానిక విజయం మెరిసిన తరుణం..!
సునీత విలియమ్స్
సాహసానికి ప్రతిరూపం...
అంతరిక్షం వెలిగించిన నవ్వే నక్షత్రం..!
2. రోదసీ రాణి...సునీతా విలియమ్స్..!
పుడమితల్లి
పులకించిన వేళ...
ఆమె అడుగులు
నేలను ముద్దాడిన వేళ...
సునీత నవ్వు ఒక నక్షత్ర కాంతి...
ఆమె ఆత్మస్థైర్యం ఒక ఖగోళ గీతం...
ఓ రోదసీ రాణి..!
ఓ అంతరిక్ష ఆణిముత్యమా...
జయహో..! జయహో..!
ఓ సునీతా విలియమ్స్...జయహో..!
నాడు 9 నెలలు...తల్లి గర్భంలో...
9 రోజులు...సముద్ర గర్భంలో...
నేడు 9 నెలలు...ఆకాశ గర్భంలో...
పరిశోధనలు చేసిన ఓ సునీతా...జయహో
గురుత్వాకర్షణ
కట్టి వేసిన సంకెళ్లు తెంచి...
విశ్వాంతరాళంలోవిజయగాథను
లిఖించిన ఓ సునీతా...జయహో...!
విశ్వమంతా తిలకించింది
మీ అంతరిక్ష సాహస యాత్ర...
ఆడుతూ పాడుతూ
భుమి చుట్టూ పరిభ్రమిస్తూ...
16 సూర్యోదయాలు...
16 సూర్యాస్తమయాలు...
తిలకించిన...ఓ సునీతా జయహో..!
4576 సార్లు
భూమిచుట్టూ భ్రమణం...
19.50 కోట్ల కిలోమీటర్ల
వేగవంతమైన నక్షత్ర యానం...
చేసిన ఓ సునీతా... జయహో..!
భూమి తల్లి ఒడిలో
1650 డిగ్రీల వేడిని దాటుకొని...
డాల్ఫిన్ల హర్షధ్వానాల మధ్య...
సురక్షితంగా లాండైన క్రూ డ్రాగెన్"ఫ్రీడం".
9 నెలల ఉత్కంఠకు తెరపడిన వేళ...
140 కోట్లమంది భారతీయులు
భరత నాట్యం చేసిన శుభవేళ...
సీనియర్ వ్యోమగాములు...
సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్.
నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బసేవ్ లు
పుడమి తల్లి ఒడిలో వాలిన వేళ...
"జయహో జయహో "
ఓ వ్యోమగాములారా...
ఓ అంతరిక్ష యాత్రికులారా...
"గ్రాండ్ వెల్ కం టు బ్యాక్ ఆన్ ఎర్త్!"
అంటూ ప్రపంచమంతా వారికి
హర్షధ్వానాలతో ఆహ్వానం పలికింది...
సురక్షిత సుఖమయ ప్రయాణానికి
శుభాకాంక్షలు చెప్పింది...
సునీత అంతరిక్ష విజయరథానికి
సుమస్వాగతం..ఘన స్వాగతం పలికింది
3. అంతరిక్షంలో మేరిసే...
ఆణిముత్యం...సునీతా విలియమ్స్
అంతరిక్షం
ఆవిష్కరించిన
ఆణిముత్యం...
విశ్వ విహంగమై
రోదసిలో పయనించిన
సునీతా విలియమ్స్...!
సునీత సముద్ర
సిరులను చూసిన
నావికాదళ అధికారిణి...
నాసాలో అచంచల కృషి
ఆకాశాన్నంటిన సాహసం...
అన్వేషణలో నిరంతర పయనం..!
మూడుయాత్రల మధుర స్మృతులు
నక్షత్రాల్లో లిఖించిన అడుగుజాడలు
గ్రహాల హోరులో సాగిన కథలు
భూమిని చుట్టివేసిన
మరుపురాని ప్రయాణాలు
అయినా ఆగని ఆశయ పథాలు..!
పద్మభూషణ్ పురస్కారం
సునీతా మెడలో పచ్చల హారం
భారతమాత ఎదలో పులకింత
ఆమె కన్ను మూసిన కల్పనా చావ్లా
కన్న ఓ సుందర స్వప్నం...!
ఆమె కీర్తి
సహస్ర తారల పతాకం...
ఆమె శక్తి స్వరూపిణి...
విజయవాడ కనకదుర్గ...
ఆమె అంతులేని ఆత్మ విశ్వాసంతో
అంతరిక్షాన్ని అధిగమించిన ధీరవనిత...
ఆదిపరాశక్తికి ఆమె నిలువెత్తు నిదర్శనం.!
సునీతా
ఓ సునీతా...
ఓ విశ్వ విజేత...
ఓ స్పూర్తి ప్రదాత...
నీ నడకలో ఆకాశం మెరిసిన కాంతి
నీ చిరునవ్వులో రోదసి శోభ
నీ ఆత్మస్థైర్యం
సూర్యోదయానికి ప్రతిరూపం...
నీ అంతరిక్ష జ్ఞాన పరిశోధన ముద్ర...
మానవతా వికాసానికి సజీవ సాక్ష్యం...
4. స్పూర్తి ప్రదాతలు..!
సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ లు..!
సునీత విలియమ్స్...
బుచ్ విల్మోర్...లు
9 నెలల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత
సురక్షితంగా భూమిని చేరడం...
ప్రపంచ ప్రజల
ప్రార్థనలకు ప్రతిఫలితం...
గుజరాత్ పునీత గూడుల్లో
బంధువులు పలికిన భక్తి గీతం...
సముద్ర వీచికలపై
సురక్షితంగా దిగిన
అంతరిక్ష వ్యోమనౌక...
అమృత బిందువై...
అంబరాల మాటున
తిరిగొచ్చిన దివ్యదీప్తి...
ఇది ఒక అద్భుతమైన వీరగాథ...
స్పేస్ ఎక్స్-నాసాల సమిష్టి విజయం..
భూమితల్లి ఒడిలో నలుగురు
మృత్యుంజయుల క్షేమాభివందనం...
బాణాసంచా సంబరాలు...
హర్షధ్వానాల నదీ ప్రవాహం...
ఉత్కంఠతతో 9 నెలలు
నిరీక్షణలో 140 కోట్ల మంది
భారతీయులు చేసిన భరతనాట్యం...
అందరి మనసులు ఒకే ఊపిరిగా
చిరునవ్వులు చిందించిన సుందరఘట్టం...
సునీత విలియమ్స్
బుచ్ విల్మోర్...లు
విశ్వ విజేతలు...
మెరిసే అంతరిక్ష తారలు...
మృత్యుంజయులైన
మహా సాహస వీరులు.
వీరు వెలుగై దివిని జయించిన వారు...
చిరునవ్వై భువిని అలరించినవారు..
అంతరిక్ష చరిత్రలో చిరస్మరణీయులు...
ముందు తరతరాలకు స్ఫూర్తిప్రదాతలు...
రచన:
కవి రత్న
సహస్ర కవి భూషణ్
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్


































































Comments
Post a Comment