1.1.2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు (తెలుగులో...ఇంగ్లీష్ లో )చూడండి...నా కవితలు...చదవండి...ఆనందించండి...స్పందించండి...మిత్రులారా మీకోసం...పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
నా ప్రియ
స్నేహితులారా...
సాహితీ మిత్రులారా...
సరస్వతీ పుత్రులారా...
నా అభిమానులారా...
నా శ్రేయోభిలాషులారా...
ఎన్నో ఆశలను మోసుకొస్తున్న
కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ...
ఈ కొత్త సంవత్సరంలో
మీ ప్రతిక్షణం ప్రతిదినం...
ఆరోగ్యంతో ఆనంద భరితం కావాలని...
మీరు మరింత సంతోషంగా ఉండాలని...
మీ మోములో చిరునవ్వులను
మీ ఎదలో ప్రేమను శాంతిని నింపాలని...
ప్రతి రోజూ గత తీపి
చేదు జ్ఞాపకాలను నెమరు వేస్తూ...
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ...
అభ్యుదయం ఆకాంక్షిస్తూ...
ఈ ఏడాది మీకు అప్రతిహతమైన
అఖండ విజయాలను అందించాలని...
సంబరాలు మిన్నంటే వేళలో...
నింగి నేల కాంతుల హేలలో...
మీ జీవితాలు వెలుగుమయం కావాలని...
పూలతో నిండిన అందమైన తోటలా
మీ మనసంతా సుమధుర సుగంధ
పరిమళాలతో నిండి పోవాలని...
మీరు సరికొత్త
నిర్ణయాలు తీసుకోవాలని...
ఉన్నతస్థాయికి ఎదగాలని...
అత్యున్నత శిఖరాలనధిరోహించాలని...
కొత్త సంవత్సరంలో...
కొత్త ఆశలతో...
కొత్త ఆశయాలతో...
కొత్త అవకాశాలతో...
సరికొత్త ఆనందాలతో మీ జీవితం...
"విందుభోజనం వడ్డించిన విస్తరి"కావాలని
మీపై మీ కుటుంబ సభ్యులపై
ఆ భగవంతుని ఆశీర్వాదాల...
కృపా కరుణా కటాక్ష వీక్షణాలు... కుంభవర్షమై కురవాలని...కోరుకుంటూ...
(మీ అందరికీ నూతన సంవత్సర మరియు
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ...)
2. శుభ నూతన ఆశీర్వచనం...
ఓ నా సాహితీ మిత్రులారా...!
సరస్వతీ పుత్రులారా..!
మీ కోసం"స్వాగతం" పలుకుతూ...
ఈ కొత్త వత్సరాన్ని నే కోరేదొక్కటే.....
మీ ముఖంలో
"చిరునవ్వుల వర్షం"
ప్రతి క్షణమూ కురవాలని...
"ఆనందపు తరంగాలు"
మీ ఎదకడలిలో ఎగిసిపడాలని...
మీ ప్రతిశ్వాసలో "ఆరోగ్యం
"ఆణిముత్యంలా" మెరవాలని...
సంతోషపు సుమాలు
మీ "జీవనతోటలో" విరబూయాలని...
కొత్త "ఆశయాల తోరణాలతో"
అడుగులేస్తూ ముందుకు నడవాలని...
ఈ ఏడాది ప్రతి దినం ప్రతి క్షణం
ఒక "వసంతగీతమై" వినిపించాలని...
రోగాలు మీ ఇంటి గడపను తాకరాదని...
ఆరోగ్యమే మీకు "ఆరనిజ్యోతి" కావాలని
మీరు తలపెట్టిన శుభకార్యాలు
"విజయదీపాలై" వెలుగులను
విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ...
3. కొత్త సంవత్సరానికి
స్వాగతం సుస్వాగతం...!
ఓ నా సాహితీ మిత్రులారా...!
సరస్వతీ పుత్రులారా..!
మీకోసం స్వాగతం పలుకుతూ...
కొత్త ఏడాదిని నేను కోరేదొక్కటే...
వేయి కొత్త వెలుగుల కాంతులు
మీ జాలి గుండెల్లో జ్వలించాలని...
మిమ్మల్ని కోటి శుభాల
"కొత్త దారిలో " నడిపించాలని...
మీ పెదవులపై "మెరిసే ప్రతిచిరునవ్వు"
ఒక "మధుర గీతంగా" మారాలని...
మీ ఆశలు మీ సాహసాలు
మీ పాదాలకు "దారిదీపాలు" కావాలని...
మీలో "కొత్తఆశలు" చిగురించాలని...
మీరు ఊహించని ఘనమైన
"విజయాల విందులను"
మీకు" రుచిచూపించాలని,
"మీ జీవితం
"సంతోష సాగరంలో"
"నవ్వుల పువ్వుల నావగా"
"ముందుకు"సురక్షితంగా" సాగిపోవాలని...
"అది ఆనంద తీరాలను" చేరుకోవాలని...
4. 365 రోజుల జాతర...
ఈ నూతన
సంవత్సరంలో...
12 నెలలు
హాయిగా...
ఆనందంగా...
పరమానందంగా...
52 వారాలు
విలాసవంతంగా...
వినోదభరితంగా...
365 రోజులు
ఖుషీగా...
కులాసాగా...
8760 గంటలు
ఉల్లాసంగా...
ఉత్సాహంగా...
52600
నిమిషాలు
ఆనందంగా...
ఆరోగ్యంగా...
3153600 సెకన్లు
ప్రశాంతంగా...
విజయవంతంగా...ఉండాలని...
మనసారా కోరుకుంటూ...
2025 లో
మీ కలలన్నీ
నెరవేరాలని...
మీ భవిష్యత్తు
బంగారుమయమై...
మీరు హాయిగా ఆనందంగా...
ప్రశాంతంగా...ప్రకాశవంతంగా...
ఉండాలని మనసారా కోరుకుంటూ...
నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
5. 365 పేజీల బ్రతుకు పుస్తకం
ఈ కొత్త సంవత్సరంలో
మీ కలలు నిజం కావాలని...
సంతోషం, శాంతి, అదృష్టం
మంచిని మీకు తీసుకురావాలని...
365 రోజుల ఈ కొత్త సంవత్సరం
365 పేజీల బ్రతుకు పుస్తకమని...
ప్రతి పేజీ సంతోషం ఆనందం ఆరోగ్యం విజయం మనశ్శాంతి దీర్ఘాయుష్షు
అను అందమైన అధ్యాయాలతో...
లక్షల అక్షరాలతో నిండి ఉండాలని...
మీ జీవితంలో మీరు కోరుకున్న
కొత్త మార్పును తీసుకురావాలని...
కొత్త ఏడాది కొత్తశక్తిని నింపాలని...
మీ కలలన్నీ పచ్చని పంటలై పండాలని...
గతాన్ని గురించి
క్షణమైనా చింతించకుండా...
కొత్త అవకాశాలతో...
కొత్త అనుభవాలతో...
కొత్త పరిచయాలతో...
కొత్తగా చిగురించే ఆశలతో
కొత్త జీవితాన్ని మీకు ప్రసాదించాలని...
ఆ పరమాత్మ ప్రార్థిస్తూ...మీకోసం
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ
నూతన సంవత్సర శుభాకాంక్షలతో....
మీ
ఆత్మీయ
సాహితీ మిత్రుడు
పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్....హైదరాబాద్



























Comments
Post a Comment