1.1.2025 బుధవారం డాక్టర్ విడి రాజగోపాల్ గారి పుట్టిన రోజు సందర్భంగా చిక్కడపల్లి లోని తాజ్ హోటల్లో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో పోలయ్య కవి కూకట్లపల్లికి డా.విడి రాజగోపాల్ డా. కళారత్న బిక్కి క్రిష్ణ...డా. జల్దీ విద్యాధర్ గార్లచే సాహితీ సత్కారం... చదివిన కమనీయమైన కవిత... కనువిందు చేసే కొన్ని చిత్రాలు... మిత్రులారా మీకోసం... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

 






















నేను చదివిన నా కవితా శీర్షిక... 
అగాథం నుండి..! 
ఆకాశపు అంచులదాకా..!

మా ఇంటికొస్తే నాకేం తెస్తావు..?
మీ ఇంటికొస్తే నాకేమిస్తావు...?
అని కాక ఇవ్వడమే తప్ప 
పుచ్చుకోవడం ఎరుగకపోవడమే
"మంచితనం...మానవత్వం"... 
 
నిర్భాగ్యులను నిరుపేదలను 
నిస్సహాయులను మోసం చేసి 
అన్యాయంగా అక్రమంగా దోచుకుని "దాచుకోవడమే..."దానవత్వం"... 

కష్టాలలో చిక్కుకున్న 
వారి కంట కన్నీరును తుడిచే 
ఆపదలో ఉన్నవారిని ఆదుకునే 
తమకు ఉన్నంతలో ఇతరులకు 
పెట్టాలని తపించే ప్రేమామయులు
నేడు ఇష్టపూర్వకంగా పేదలకిచ్చి
రేపు పుష్కలంగా ఆ పరమాత్మ నుండి "పుచ్చుకోవడమే..."దాతృత్వం"... 

కుల మతాలకతీతంగా ధనిక పేద 
తారతమ్యాలు లేకుండా ఎవరికి 
ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పందించి
"సహాయమందించడమే..."దైవత్వం"

కష్టజీవుల కష్టాల్ని బాధల్ని తొలిగించి 
వారిలో చైతన్య జ్వాలల్ని రగిలించి... 
కనువిప్పు కలిగించేదే బానిస బ్రతుకు
సంకెళ్ళను త్రెంచి విముక్తిని కలిగించేదే...
జీవితాల్లో వెన్నెల వెలుగుల్ని నింపేదే...
అగాథం నుండి ఆకాశపు అంచులకు
"శ్రమజీవిని చేర్చేదే..."కల్తీలేని కవిత్వం"

అట్టి కవిత్వాన్ని మీరందరూ 
ఈ సంవత్సరంలో వ్రాస్తారని 
వ్రాసి కళాపోషకులైన... 
డాక్టర్ వి.డి రాజగోపాల్ గారిచే...
కళారత్న డాక్టర్  బిక్కికృష్ణ గారిచే...
డాక్టర్ జల్దీవిధ్యాదర్ గారిచే...
సన్మానాలు సత్కారాలు 
అందుకోవాలని మనసారా కోరుకుంటూ...
మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ...

రచన:
"కవి రత్న" 
"సహస్ర కవి భూషణ్"
పోలయ్య కూకట్లపల్లి 
అత్తాపూర్ హైదరాబాద్




మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థచే
పోలయ్య కూకట్లపల్లికి సాహితీ సత్కారం 

హైదరాబాద్ చిక్కడపల్లి:
మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు మైన్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ వి.డి రాజగోపాల్ గారి పుట్టినరోజు మరియు నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 వ తేదీన 
తాజ్ హోటల్లో కవి సమ్మేళనం మరియు 
పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది 

ముఖ్య అతిథిగా పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ 
విశిష్ట ఆత్మీయ గౌరవ అతిథులుగా 
కళారత్న డా. బిక్కి కృష్ణ...విమల సాహితీ 
సమితి వ్యవస్థాపకులు డా.జల్దీ విద్యాధర్
గజల్ క్వీన్ వాసిరెడ్డి మల్లేశ్వరి...సమీక్ష సామ్రాట్ 
నాళేశ్వరం శంకరం..రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి...నటుడు సాధనాల వెంకటస్వామి 
నాయుడు తదితర సాహితీ మూర్తులు సభకు హాజరయ్యారు 

డా.వి.డి. రాజగోపాల్ గారు రచించిన 
పుస్తకం(ఓ మనిషి మారవా)ను...ఆచార్య 
కొలకలూరి ఇనాక్ గారు...ఆవిష్కరించి 
అధ్భుతమైన సందేశం ఇచ్చారు ...శ్రీమతి వాసిరెడ్డి మల్లేశ్వరి మరియు నాళేశ్వరం శంకరం క్లుప్త 
సౌందర్యంగా పుస్తకాన్ని సమీక్షించారు 

శ్రీ సాయి నూతన సంవత్సర క్యాలెండర్ ను‌...
వాల్మీకి సమూహ కవన సౌరభాలు ఈ బుక్ ను ఆన్లైన్లో...కళారత్న డాక్టర్ బిక్కికృష్ణ ఆవిష్కరించి 
చక్కని సందేశం ఇచ్చారు. 
కొప్పుల ప్రసాద్ (నా గుండె సవ్వడి) 
గద్వాల సోమన్న (చిరు దివ్వెలు)
వైరాగ్యం ప్రభాకర్ (గిడుగు) పుస్తకాలను 
కూడా సభలో ఆవిష్కరించడం జరిగింది

ఈ సందర్భంగా డా.అరవా రవీంద్ర బాబు 
సమన్వయకర్తగా డా. రాధా కుసుమ 
సమీక్షకురాలిగా నిర్వహించిన కవి సమ్మేళనంలో 
ప్రముఖ కవి రచయిత పోలయ్య కూకట్లపల్లి పాల్గొని...
అగాథం నుండి ఆకాశం అంచులదాకా...అను
కమ్మని కవితను ఆలపించినందుకు
డా.వి.డి రాజగోపాల్..డా. బిక్కికృష్ణ 
డా.విద్యాధర్... వాసిరెడ్డి మల్లేశ్వరి
నాళేశ్వరం శంకరం...తదితర సాహితీ మూర్తులు 
అయోధ్యా మెమొంటోతో దుశాలువతో 
పోలయ్య కవిని ఘనంగా సత్కరించారు...
పసందైన విందుతో సభ దిగ్విజయంగా ముగిసింది...

నిన్నటి సభ గురించి 
ముచ్చటగా మూడు మాటలు...

ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా 
ఎంతో శ్రమకోర్చి ఎంతో సమయాన్ని 
వెచ్చించి అరవా శంకర్ గార్ల సహకారంతో 
ఈ నూతన సంవత్సరంలో తన జన్మదిన 
మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా 
"న భూతో న భవిష్యతే" అన్న రీతిలో 
అధ్భుతంగా నిర్వహించి...
 
కవుల అక్షరాల అక్షింతలను...
అందరి ఆశీస్సులను ఆశీర్వాదాలను...

మనసారా అభినందనలను... 
హృదయపూర్వకమైన శుభాకాంక్షలను...
పొందిన డా.వి.డి రాజగోపాల్ గారు... 

కళాపోషకులు... 
అభినవ రాయలు... 

పూజ్యులు... 
పుణ్యమూర్తులు... 

దాతలు... 
ధన్యజీవులు... 

ఆరాధనీయులు...
అభినందనీయులు...

చరితార్థులు... 
స్పూర్తి ప్రదాతలు...

చిరంజీవులు...
చిరస్మరణీయులు ... 

పసందైన విందుతో 
సభ దిగ్విజయంగా ముగిసింది...మరి
"అన్నదా సుఖీభవ" అని డాక్టర్ వి.డి...
రాజగోపాల్ గార్ని ఆశీర్వాదించక తప్పదు 

అంతటి మహా సభలో చిన్న చిన్న 
సమస్యలు సహజమే...సర్దుకు పోవడమే...

పోలయ్య కవి కూకట్లపల్లి 
అత్తాపూర్....హైదరాబాద్


Comments