పోలయ్య కూకట్లపల్లి కి 30.09.2024న హైదరాబాద్ కళాభారతి ( సిటి కల్చరల్ సెంటర్ )లో సన్మానం

 
















హైదరాబాద్ కళాభారతిలో కవితా గానం... 
కవి పోలయ్య కూకట్లపల్లికి ఘన సన్మానం...

భారతీయ సాహిత్య అనువాద ఫౌంఢేషన్
మరియు ఆరికపూడి సేవా ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో చిక్కడపల్లి కళాభారతిలో 
ప్రముఖ కవి కళారత్న బిక్కికృష్ణ అధ్యక్షతన 
జరిగిన అంతర్జాతీయ అనువాద దినోత్సవ 
వేడుకల్లో యం.నరసింహప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ నవలా కారులు 
భగీరథ రాసిన 'నాగలాదేవి' నవలపై 
సమీక్షా సమావేశం జరిగింది

ఈ సందర్భంగా పెద్దూరి వెంకటదాసు 
రాధా కుసుమ సమన్వయ కర్తలుగా 
నిర్వహించిన కవిసమ్మేళనంలో పాల్గొని...
ప్రముఖ కవి పోలయ్య కూకట్లపల్లి...
"నా భరతమాత ముద్దుబిడ్డలారా"...
శీర్షికతో కవితను గానం చేస్తూ...

ఓ నా భరతమాత 
ముద్దు బిడ్డలారా..!
మీరు పాపులు కాదు 
పవిత్రులు... 
మీరు వృద్ధులు కాదు 
బలహీనులసలే కాదు 
మీరు అనంత శక్తి సంపన్నులు..!

మా వల్లకాదు 
మేమేమీ చేయలేమనకండి..!
పిరికి పందలుగా 
బానిసలుగా బ్రతక్కండి..!
మీరు వీరులై...శూరులై 
విజయ శంఖారావం పూరించండి..! 

ఓ నా భరతమాత 
ముద్దు బిడ్డలారా..!
మేము ఏదైనా సాధించగలమనే
అఖండ విశ్వాసంతో వుండండి..!
ఈనాడు మనకు కావలసింది 
ఇనుప కండరాలు...ఉక్కునరాలు
చాలా కాలం ఏడ్చారు 
ఇక ఏడ్పులాపండి..!
చిరుతపులులై ముందుకు దూకండి..!

ఓ నా భరతమాత 
ముద్దు బిడ్డలారా..!
లేవండి..! నిద్ర లేవండి..! 
మీరు సింహాలని 
పులులని గుర్తుంచుకోండి..!
మీ గమ్యం చేరేవరకు
మీ పరుగును ఆపకండి..!

దేనికీ భయపడకండి..! 
ధైర్యంగా బలంగా వుండండి..!
బలము సత్సంకల్పమే 
అభివృద్ధికి సోపానం..!
బలమహీనతన్నది 
మృత్యువుతో సమానం..!

ఓ నా భరతమాత 
ముద్దు బిడ్డలారా..!
బద్దకం మనకు 
ఒక బద్దశత్రువు అదొకరోగం
ఆ రోగంతో బయట 
తిరిగే హక్కు మనకెక్కడిది..?

వెలిగే సూర్యున్ని చూస్తే 
చీకటి భయపడుతుంది..!
శ్రమించే మనిషిని చూస్తే 
ఓటమి భయపడుతుంది..!

మీరిక విశ్రమించక శ్రమించాలి..!
స్వేదాన్ని చిందించాలి..!
విశ్వవిజేతలై వర్ధిల్లాలి..! అంటూ 
యువతకు వివేకానందుని 
చక్కని సందేశాన్ని అందించారు

తదనంతరం ...డా. నరసింహప్ప... 
డా. బిక్కికృష్ణ...ఆరికపూడి సేవా 
ట్రస్టు అధ్యక్షులు డా. రఘు...నాళేశ్వరం శంకరం...డా.విద్యాధర్...చేతుల 
మీదుగా పోలయ్య కవి కూకట్లపల్లికి 
ఘనంగా సన్మానం జరిగింది

కవి పోలయ్యను తోటి కవులు 
శ్రేయోభిలాషులు అభినందించారు...
తనను సన్మానించిన సాహితీమూర్తులకు 
కూకట్లపల్లి కృతజ్ఞతలు తెలియజేశారు.




Comments