రామాయణ్ టూర్ టు శ్రీలంక...07.10.2024 to 12.10.2024 ( 5 nights and 6 days tour by Southern Travels with 44 Family members along with Guide Vijay and Tour manager Rajesh Pilot and Co pilot...Temples and important places visited and Star hotels stayed...Some beautiful pics...to see and enjoy...our sweet memories...

 


శ్రీ రామాయణ్ టూర్ టు శ్రీ లంక...

హైదరాబాద్ టు శ్రీలంక 6 డేస్ & 5 నైట్స్ "రామాయణ్ టూర్" 44 మంది కుటుంబ సభ్యులతో సదరన్ ట్రావెల్స్ వారి ఏసీ బస్సులో "విహార యాత్ర" అక్టోబర్ 7 వ తేదీన ఉదయం 11.45 గంటలకు ఇండిగో ఫ్లైట్ లో ప్రారంభమై తిరిగి 12 వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఇండిగో ఫ్లైట్ లో విజయవంతంగా ముగిసింది...

శ్రీలంకలోని చారిత్రాత్మకంగా ప్రసిద్ధిచెందిన 
పుణ్య క్షేత్రాలను చుట్టి వచ్చేలా డిజైన్ చేసిన 
ఈ "రామాయణ్ టూర్" 
రావణబ్రహ్మ రాజ్యంలో రసరమ్యంగా...
కనువిందుగా...మనసుకు పసందుగా... 
ఎంతో ఆహ్లాదకరంగా... ఆనందంగా... సంతోషంగా...ఉల్లాసంగా...ఉత్సాహంగా...
ఎవరూ ఏ ఇబ్బందులకు...
ఎలాంటి అసౌకర్యానికి అనారోగ్య 
సమస్యలకు గురికాకుండా...
వారంరోజులు...ఆకాశంలో పక్షుల్లా 
ఆనందంగా విహరిస్తూ... ఎంతో 
వినోదభరితంగా సాగిన ఈ విహార యాత్రలో...

రోజుకో విలాసవంతమైన మల్టీ స్టార్ హోటళ్ళలో 
బసచేస్తూ రుచికరమైన ఇంటిభోజనం తింటూ 
ప్రతిరోజు ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో 
పాముల్లా మెలికలు తిరిగే రహదారుల్లో 
ఏసీ బస్సులో తిరుగుతూ 
ఆ పచ్చని ప్రదేశాలను... 
అందమైన ఆ టీ గార్డెన్స్...
ఎత్తైన ఆ కొండలు కోనల్ని...
లోతైన ఆ లోయల్ని... 
ఆకాశ హార్మ్యాలను... 
తిలకించి...పులకించిపోతూ... 

ఆహ్లాదకరమైన...ఆరోగ్యకరమైన 
ఆ చల్లని వాతావరణంలో...
అక్కడక్కడ...అప్పుడప్పుడు 
చిరుజల్లులు స్వాగతిస్తుంటే 
చిరునవ్వులు చిందిస్తూ...
అతిపురాతనమై కట్టడాలను 
గుళ్ళు గోపురాలను...
ప్రశాంతత మెండుగా నిండుగా 
ప్రవహించే మనోహరమైన సుందర 
మందిరాల ఆ శిల్ప సౌందర్యాన్ని...

అందులో 
కొలువైవున్న విగ్రహాలను 
దర్శించి వేడుకున్న భక్తులకు 
తమ అభయహస్తాలతో...
కోరుకున్న కోర్కెలు తీర్చే 
ఊహించని వరాలను అనుగ్రహించే 
అందమైన అతి సుందరమైన 
ఆ దేవుళ్ళను ఆ దేవతామూర్తులను
తిలకించి పులకించి
వారి దివ్యమైన ఆశీస్సులను పొంది 
పరవశించిపోయిన మేమంతా 
ఎంతటి అదృష్టవంతులమో...చెప్పలేం 
 
ఇక ఈ జన్మకిది చాలు 
అన్న అనంతమైన 
ఆత్మ తృప్తి కలిగింది మా అందరికీ... 

ఏ జన్మ పుణ్యఫలమో ఏమో 
ఈ జన్మలో ఇన్ని వేల కిలోమీటర్ల 
దూరంలో ఉన్న ఈ దేవాలయాల్లో 
కొలువైఉన్న ఈ శక్తిస్వరూపులైన 
దేవుళ్ళ దేవతామూర్తుల దివ్యమైన 
విగ్రహాల దర్శన భాగ్యం కలిగినందుకు 
మా అందరి జన్మ ధన్యమైనట్లే...
12 వ తేదీన ఈ కమ్మని కలయికలో... 
భారమైన హృదయాలతో... 
అంతులేని ఆథ్యాత్మిక అనుభూతులతో... 
అనేక తీపిజ్ఞాపకాలతో...
చెరగని చిరునవ్వులతో...
కొన్నేళ్లకు సరిపడా ఎనర్జీతో...
క్షేమంగా సురక్షితంగా ఇళ్ళకు చేరుకున్నాం...
మేమంతా...ఆ శ్రీరాముని దివ్యమైన ఆశీస్సులతో...

మా ఈ టూర్ దిగ్విజయంగా జరిగేందుకు 
మాకు అడుగడుగునా ఎంతో ఓర్పుతో 
సహనంతో సహకరించిన లంకన్ గైడ్ విజయ్ కి 
టూర్ మేనేజర్ రాజేష్ కి ఎంతో శ్రమకోర్చి 
ఎంతో శ్రద్ధగా ఎంతో నైపుణ్యంతో బస్సును డ్రైవ్ చేసి మమ్మల్ని క్షేమంగా సురక్షితంగా మా గమ్యస్థానాలకు చేర్చిన పైలెట్ సంపత్ కు ఎంతో కష్టపడి మా లగేజీలను మాతో పాటు రోజూ తెచ్చే కో పైలెట్ కు ప్రతి ఒక్కరికీ 
పేరు పేరున మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం...

పోలయ్య కవి కూకట్లపల్లి 
అత్తాపూర్ హైదరాబాద్...































































































































































Comments