01.09.2024 న త్యాగరాజ గానసభలో గడ్డం శ్యామల గారి పుస్తకావిష్కరణ సభలో డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి గారి చేతుల మీదుగా పోలయ్య కవి కూకట్లపల్లికి ఘన సన్మానం
















డాక్టర్.ఏనుగు నరసింహారెడ్డి చేతుల 
మీదుగా పోలయ్య కవి కూకట్లపల్లికి                  శ్రీ త్యాగరాజ గానసభలో ఘన సన్మానం 


హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాజ గానసభలో తెలంగాణ గజల్ కవయిత్రుల వేదిక ఆధ్వర్యంలో 
ఆచార్య వి. నిత్యానంద రావు అధ్యక్షత ఇటీవల జరిగిన పుస్తకావిష్కరణ సభలో ప్రముఖ గజల్ రచయిత్రి 
డా.గడ్డం శ్యామల రచించిన సాంధ్యవర్ణాలు 
సాహిత్య దీపిక...శ్యామల స్వరాంజలి...
పుస్తకాల ఆవిష్కరణ సమీక్ష జరిగింది.

ఈ సందర్భంగా శ్రీమతి డా.కోదాడ అరుణ సమన్వయకర్తగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో... ప్రముఖ కవి రచయిత హైదరాబాద్ నివాసి పోలయ్య 
కవి కూకట్లపల్లి పాల్గొని...తప్పెవరిది...? బాధ్యులెవరు...? శీర్షికతో కవితా గానం చేసి ఆహూతులను అలరించారు...

తదనంతరం డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ ఏనుగు 
నరసింహారెడ్డి రెడ్డి...ఆచార్య వి. నిత్యానందరావు... 
ఆచార్య ఎస్. వి రామారావు... సూరారం శంకర్ ...
ఆచార్య ముకుండ సుబ్రహ్మణ్య శర్మ చేతుల మీదుగా పోలయ్య కవి కూకట్లపల్లికి ఘన సన్మానం జరిగింది...

సన్మాన గ్రహీత పోలయ్య కవి సంతోషం వ్యక్తం చేస్తు 
తాను తన గురువుగారైన డా.బిక్కీకృష్ణ గారి ప్రోత్సాహంతో 
3000 పైగా కవితలు వ్రాయడం వ్రాసిన అన్ని కవితలు వివిధ దిన వార మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయని తాను చేస్తున్న సాహితీ సేవను కృషిని గుర్తించి తనను సన్మానించిన సాహితీ మూర్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతా భివందనాలు తెలియజేశారు...

అభిమానులు శ్రేయోభిలాషులు పోలయ్య కవిని అభినందించారు ఈ సభకు శ్రీమతి శాంతి కృష్ణ శ్రీమతి సుబ్బా జ్యోత్స్న మరియు కవులు కవయిత్రులు హాజరై గజల్స్ గానం చేశారు చక్కని విందుతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది 

Comments