09.08.2024 అర్థరాత్రి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో... ట్రైనీ డాక్టర్ మౌమితపై సామూహిక అత్యాచారం...దారుణహత్య... వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కన్నీటి కవితలు... విషాదకరమైన దృశ్యాలు... మీకోసం... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
ఆసుపత్రిలో డా.మౌమిత ఆత్మ ఘోష..?
ఆసుపత్రే నా దేవాలయం
అందులో నేనొక వైద్యురాలిని
రోజు అనేక మంది రోగులకు
36 గంటలు వైద్యసేవలందిస్తూనే...
సమయం దొరికితే...
సామాజిక న్యాయం...
సెక్సువల్ వాయిలెన్స్ మీద
కౌన్సెలింగ్ ఇస్తూ...
అనేక సేమినార్లలో పాల్గొంటూ
మహిళలెవరైనా మానభంగాలకు
యాసిడ్ దాడులకు గురై
మానసికంగా కృంగిపోతే
వారికి చక్కని సలహాలనిస్తూ...
ధైర్యంగా...అక్రమార్కులమీద
సామాజిక రుగ్మతల మీద పోరాడే
అభ్యుదయ భావాలుగల యువడాక్టర్ ని
"నరకం ఖాళీగా ఉంది" కారణం
"రాక్షసులందరు భూమి మీదే ఉన్నారు
"అందుకే "రేప్ చేయొద్దు" కాదు
"రేప్ చేయబడవద్దు" అన్నదే నా నినాదం
నా భావాలు గిట్టని నా శత్రువులంతా
నాపై కక్షగట్టి కసితో పగతో రగిలిపోతూ...
నాపై రెక్కీ నిర్వహించి
ఒక పక్కా ప్లాన్ ప్రకారం
నన్ను నిస్సహాయురాలను చేసి...
అర్థరాత్రి వేళ ఓ రాక్షసమూక
సీసీ కెమెరాలులేని కాన్ఫరెన్స్
హాల్ తలుపులు మూసేసి...
అరిచి గీపెట్టినా ఎవరికేమీ వినిపించని...
అక్కడేమి
జరుగుతుందో ఎవరికేమీ కనిపించని...
నేను ఎంతగా ప్రతిఘటించినా
తప్పించుకోలేని విధంగా
నా చుట్టూ వలపన్ని అరిచి
గోల చేయకుండా ముందుగా
నా గొంతు నులిమేసి...
నన్ను మూగదాన్ని చేసి...
నా కాళ్ళు చేతులు విరిచేసి...
గోళ్ళతో పళ్ళతో నన్ను రక్కిరక్కి...
నా ఒంటి నిండా గాయాలు చేసి
రక్తం ఏరులై పారేల గోడకేసి కొట్టారు ...
"నన్ను పంజరంలో చిక్కిన పక్షిని" చేసి
"పులులను ఎదిరించలేని జింకను" చేసి
"తోడేళ్ళను ఎదురించలేని మేకను" చేసి
"ఏనుగుల్ని ఎదిరించలేని ఎలుకను" చేసి అతికిరాతకంగా...అతి నీచాతినీచంగా...
అతిదారుణంగా...నాపై విరుచుకుపడి...
భరించలేని...
ఎదిరించలేని...
తప్పించుకోలేని...
ఎవరికీ చెప్పుకోలేని...
దిక్కులేని దీనస్థితిలో పడేసి...నన్ను
పువ్వును నిలిపినట్టు నలిపేశారు...
చిత్రవధ చేశారు...పదేపదే
నా ఆడతనంతో ఆడుకొన్నారు...
రక్తపు మడుగులో పడి నేను
గిలగిల కొట్టుకుంటున్నా...
కాసింతైన దయాదాక్షిణ్యం లేకుండా
పిచ్చికుక్కల్లా రెచ్చిపోయారు....
యాక్సిడెంట్ జరిగి శరీరం
నుజ్జునుజ్జు ఐనట్టు
నా ఒళ్ళును గుల్లగుల్ల చేసి
రాబందులై అర్థనగ్నంగా పడివున్న
నా అవయవాలతో ఆడుకొన్నారు
రాక్షసానందం పొందారు...నన్ను
కొన్ని గంటలు చిత్రహింసలకు
గురి చేశారు...నాకు నరకాన్ని చూపించారు అతికిరాతకంగా నా ప్రాణాలు తీశారు
సాక్ష్యాలన్నిటిని సమాధి చేశారు...
నా హత్యలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్
పోలీస్ కమిషనర్ డ్రగ్స్ మాఫియా కుట్ర
దాగి ఉంది...ఇదే నా మరణ వాంగ్మూలం
ఓ అమ్మా నాన్నలారా న్యాయపోరటం
చేయండి నాలాగ రేపు మరో నిర్భయ బలికారాదు...ఆ కామాంధులను కాల్చి
చంపాలి ఆ ఉన్మాదులను ఉరితియ్యాలి...
ఇదే నా ఆత్మ సందేశం...
(ఇది కోల్కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రి లో వినిపించే డా.మౌమిత ఆత్మ ఘోష...)
అయ్యో ఓ దైవమా...
ఇదేమి రాక్షసపాలన...స్రీ జాతికేది రక్షణ..?
న్యాయం సామాన్యులకందని ద్రాక్షేనా?
ఆ అడవి సింహాలను వేటాడే దెవరు..?
ఈ జింక పిల్లకు న్యాయం చేసేదెవరు..?
2. పశువులే నయం...! వీరికన్న..!!
ఇది రాబందుల స్వైరవిహారం..!
ఇది మగమృగాల పైశాచికత్వం..!
పచ్చగడ్డి మేసేటి...
ఆ పశువులే నయం...! వీరికన్న..!
ఒంటరి మహిళలపై
కన్నేసే గుంట నక్కల్ని...
కరిచే పిచ్చి కుక్కల్ని...
ముక్కునుండి కళ్ళనుండి
కటిభాగం నుండి రక్తం
చిందేలా రక్కేగజ్జి కుక్కల్ని...
కాళ్ళు చేతులు విరిచే...
చిత్రహింసలకు గురిచేసే...
శీలాన్ని హరించే...
కళ్ళు పొరలు కమ్మిన
కామాంధుల్ని ...ఏం చేయాలి...?
కామంతో నిండిన ఆ
కళ్ళు రెండు పీకేయ్యాలి...
శీలాన్ని హరించినందుకు...
చిత్రహింసలకు గురిచేసినందుకు...
కత్తుల్తో బాకుల్తో పొడిచి చంపాలి....
పెనుగు లాటలో
నరకాన్ని చూపించినందుకు...
కాళ్ళుచేతులు
తలను నరికెయ్యాలి...
నిర్దాక్షిణ్యంగా నిండు
ప్రాణాలను బలిగొన్నందుకు...
కమ్మని కలలను చిదిమేసినందుకు...
ఎకె 47తో కాల్చి బూడిద చెయ్యాలి...
సాక్ష్యాలను సమాధి చేసినందుకు...
ఉన్మాదులపై ఉక్కుపాదం మోపాలి...
గొంతు నులిమి నులిమి చంపినందుకు...
కామాంధులకు కనువిప్పు కలిగేలా...
నడిరోడ్డులో భహిరంగంగా...
ఊరంతా చూస్తుండగా ఉరితియ్యాలి...
అప్పుడే...వీరి క్రూరత్వానికి
బలిపశువైపోయిన ఆ అమాయకపు
ట్రైనీ డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి...
అప్పుడే జీవశ్చవాల్లా బ్రతికే ఉన్న
బాధితులైన కన్నవారికి కాస్త ఉపశమనం
అప్పుడే స్త్రీజాతికి స్వేచ్ఛా స్వాతంత్య్రం
3. రాబందుల రాజ్యంలో?
ఇది రాబందుల స్వైరవిహారం..!
ఇది మగమృగాల పైశాచికత్వం..!
వారికన్న పచ్చగడ్డి
మేసేటి ఆ పశువులే నయం!
ఆమె అబలకాదు సబలన్నారు..!
ఆమె ఆకాశంలో సగమన్నారు...!
ఆడదంటే ఆదిపరాశక్తి అన్నారు..!
స్రీ శక్తి స్వరూపిణి అన్నారు..!
కానీ రక్షణలేక ఆ స్త్రీ నేడు రక్తపు
మడుగులో నిర్జీవంగా పడివున్నదే..!
ఏం జరుగుతోంది
నా వేదభూమిలో..?
ఎటు పోతుందో నాదేశం..?
నా సంసృతి సంప్రదాయాలు
సమాధి అవుతున్నాయే...!
మనిషిలో మానవత్వం
మంట కలిసిపోతున్నదే..!
కామాంధులు రాబందులై
రాజ్యమేలుతున్నారే..?
చట్టమంటే భయంలేక స్వేచ్ఛగా
విచ్చలవిడిగా తిరుగుతున్నారే..!
ఎప్పుడు స్త్రీలు అర్థరాత్రిలో
స్వేచ్ఛగా నిర్భయంగా తిరుగుతారో..!
అప్పుడే మనకు స్వాతంత్ర్యమన్న...
గాంధీజీ కన్న కలలు నెరవేరేదెన్నడు..?
కన్నతల్లి భరతమాత
కళ్ళముందు జరిగే ఈ కామాంధుల
వికృత క్రీడలకు అంతమెప్పుడు..?
పటిష్టమైన చట్టాలు
రూపొందించినప్పుడు...!
ఉన్మాదులైన
కామాంధులను ఉరితీసినప్పుడు...!
4. మగతనమా..? మానవత్వమా..?
సిగ్గూలజ్జా భయం...
పశ్చాత్తాపం...లేశమైన లేకండా
పశువాంఛతో రగిలిపోయే
ఈ కామాంధులకు ఇక భూమిపై
జీవించే హక్కు ఎక్కడిది..?
మరేం చేయాలి..?
మానవత్వం మరచిన...
బరితెగించిన ఈ మానవమృగాలను...?
ఏ "మగతనాన్ని"
చూసుకొని గర్విస్తున్నారో...
మత్తులో మునిగిపోతున్నారో...
విచ్చలవిడిగా తిరుగుతున్నారో...
విషసర్పాలై బుసలు కొడుతున్నారో...
వీరంగం చేస్తున్నారో విర్రవీగుతున్నారో...
పిచ్చికుక్కలై...రెచ్చిపోతున్నారో...
ఆ "మగతనాన్ని" రంపంతో కోయాలి
ప్రపంచమంతా వీక్షిస్తుండగా
బహిరంగంగా ఉరితియ్యాలి..
అప్పుడే...కీచకుల క్రూరత్వానికి
బలిలైపోయిన ఆ అమాయకపు
ట్రైనీ డాక్టర్ మౌమిత ఆత్మకు శాంతి...
జీవశ్చవాల్లా...బాధితుల్లా బ్రతికి ఉన్న
కన్నవారికి కాసింత...ఉపశమనం...
కరుడుగట్టిన కామాంధులకు కనువిప్పు...
5. తల్లీదండ్రులే న్యాయమూర్తులైతే..?
ఈ కామాంధుల
రాబందుల రాజ్యంలో
చట్టాలు రాక్షస
రాజకీయ నాయకుల
చుట్టాలౌతున్నాయి
వారి అండతోనే
ఈ అకృత్యాలు...
ఈ అఘాయిత్యాలు...
మహిళలపై ఈ మానభంగాలు...
కోర్టుకేసులెందుకు ఈ రాక్షసులకు..?
న్యాయవిచారణ ఎందుకు ఈ నీచులకు..?
పవిత్ర దేవాలయం లాంటి
ఆసుపత్రిలో సామూహిక
అత్యాచారానికి బలై...
అతి క్రూరంగా...
అతి కిరాతకంగా...
అతి భయంకరంగా...
అనేక చిత్రహింసలకు గురిచేసి
కళ్లకు నరకాన్ని చూపించి
మానభంగం చేసి ప్రాణదేవత
ప్రాణాలనే బలి తీసుకున్న
ఆ కీచకులకు...ఏశిక్ష విధించాలి..?
ప్రభుత్వాలు చట్టసభలే నిర్ణయించాలి...
బాధితుల తల్లిదండ్రులే
న్యాయమూర్తులుగా...
వారి ఇల్లే ప్రజాకోర్టుగా...
వారిచ్చిందే తుదితీర్పుగా...
వారికి నచ్చిన శిక్ష విధించేలా...
ప్రజల సమక్షంలో ప్రజా కోర్టులో
బహిరంగంగా గరుడ పురాణంలోని
శిక్షలన్ని ఏకకాలంలో అమలు చేసేలా
తక్షణమే కొత్త చట్టాలను చేయాలి....
సలసల కాగే నూనెలో వేసి
మలమల మాడిపోయేలా చేయాలి...
మగతనాన్ని మంటల్లో కాల్చివేయాలి...
ఇట్టి కామాంధుల్ని
ఒక్కసారి చంపరాదు
బాధితులు ఎంతగా నరకాన్ని
అనుభవించారో అదే నరకాన్ని
వారనుభవిస్తూ...అనుభవిస్తూ...
చేసిన నేరానికి...నీచకృత్యానికి...
పశ్చాత్తాప పడుతూ...పడుతూ...
కుమిలిపోతూ...కుమిలిపోతూ...
కుక్కచావు చావాలి...
కారణం వారిది కుక్కజన్మ...గనుక...
6. ఒద్దొద్దు ఉన్మాదులకు ఉరిశిక్ష..!
కామాంధులకు కారాగార శిక్ష..!
అయ్యో అయ్యో మరో నిర్భయపై
సామూహిక హత్యాచారమా..?
ప్రాణాలు పోసే ఆసుపత్రిలో
ప్రాణాలు హరించడమా..?
నమ్మశక్యం కాకున్నదే...
అయ్యో..! అయ్యో..!
గట్టున పడ్డ చేపపిల్లలా...
తోడేళ్ళకు చిక్కిన మేకపిల్లలా
పులులకు చిక్కిన జింకపిల్లలా...
పంజరంలో చిక్కుకున్న పక్షిలా...
గ్రద్ద గోళ్ళకు చిక్కిన కోడిపిల్లలా...
వేటగాళ్ల వలలో చిక్కిన లేడిపిల్లలా...
ఎంతగా గిలగిలాడిందో...
కామాంధుల విషపుకోరల్లో చిక్కి
ఎంతగా విలవిలలాడిందో...
ఒళ్ళంతా గుల్లచేస్తే
ఎంతగా నరకాన్ని అనుభవించిందో...
విధివంచితురాలైన ఆ తల్లికే తెలుసు...
ఆమె నరకాన్ననుభవిస్తూ ఉంటే
స్వర్గ రుచులకోసం అర్రుచాసిన
ఓ సర్పసంతానమా...!
మీకు సజీవ సమాధి కట్టాలిరా..!
కళ్ళనుండి...
నోటి నుండి...
కటిభాగం నుండి...
రక్తం కారుతున్నా...
కాళ్లు చేతులు విరిచేసి
ఒంటినిండా గాయాలుచేసి
గొంతు నులిమేసి
నిర్జీవంగా కట్టెలా పడిఉన్న
ఆమె తనువుతుట్టెనుండి
రాక్షసులై రక్తాన్ని తేనెలా
జుర్రుకున్నారు కదరా...
నిస్సహాయురాలైన
అమాయకురాలైన
అభ్యుదయ భావాలున్న
ఒక స్త్రీ మూర్తిని...
ఒక ప్రాణదేవతను...
చిత్రహింసల గురిచేసి
కామంతో కళ్ళు పొరలుకమ్మి
రక్కిరక్కి రాక్షసానందం పొంది
పొట్టన పెట్టుకున్నారు కదరా...
ఓరి రాక్షసులారా..! రాబందులారా..!
మీరింత విషం పుచ్చుకొని
చావడం మేలు కదరా...
మీకన్నా వీధిలో కుక్కలే నయం కదరా...
ఓరి నీచులారా..! నికృష్టులారా..!
మిమ్మల్ని గండ్రగొడ్డళ్ళతో
ముక్కలు ముక్కలుగా నరికి
కుక్కలకు నక్కలకు కాకులకు
గద్ధలకు విసిరేసినా తప్పులేదు కదరా..!
మీకు విచారణలు...
కోర్టు కేసులెందుకురా...
మిమ్మల్ని నడిరోడ్డులో
ఉరికంబానికి వ్రేలాడేదీసి
చెప్పులతో కొట్టి కత్తులతో పొడిచి
గొడ్డళ్ళతో నరికినా తప్పులేదు కదరా..!
మీది మానవజన్మ కాదురా...
మీరు మగమృగాలురా...
మీది సంకరజాతిరా...
మీకు ఒక్క క్షణం కూడా
ఈ భూమిపై బ్రతికే హక్కులేదురా..
మీరు తక్షణమే చావాలిరా..
మీమ్మల్ని పిట్టల్ని
కాల్చినట్టు కాల్చి చంపాలిరా...
మీకు ఉరిశిక్ష సరిపోదురా..
మీరు చేసిన
ఈ నేరానికి...
ఈ ఘోరానికి...
ఈ దారుణానికి...
ఈ నీచకృత్యానికి...మిమ్మల్ని...
నిప్పుల్లో కాల్చి బూడిద చేయాలిరా..!
7. అమ్మానాన్నల ఆవేదన ఆక్రందన..?
అయ్యో అయ్యో మగబిడ్డలని
అతి గారాబంగా పెంచినందుకు...
ఓ నీచులారా...! ఓ నికృష్టులారా..!
మాపరువును గంగలో కలిపేశారు కదరా..!
భారతదేశం గర్వించేలా
బాధ్యతగల పౌరులుగా
మిమ్మల్ని తీర్చిదిద్దాలని
కమ్మని కలలెన్నో కన్న
మా కళ్ళళ్ళో కారం కొట్టి...
మా గుండెల్లో గునపాలు గుచ్చి...
మా కళ్ళను కన్నీటిసంద్రాలు మార్చి...
నైతిక విలువలకు తిలోదకాలిచ్చి...
సంస్కృతి సంప్రదాయాల్ని సమాధిచేసి...
కళ్ళు పొరలు కమ్మి కామాంధులుగా...
మానవత్వం మంట కలిపి
మానవ మృగాలుగా మారి...
సిగ్గూ లజ్జా లేకుండా
చిత్తకార్తె కుక్కల్లా రెచ్చిపోయారు కదరా..!
ఆ నీచ నికృష్ట కార్యానికి
ఒడిగట్టేముందు ఒక్క క్షణమైనా
ఇంటిలోని మీ అమ్మా అక్కా చెల్లి
కట్టుకున్న భార్య కన్నకూతురెవరూ
గుర్తుకు రానంతగా డ్రగ్ మాఫియా
కోరల్లో మీరు చిక్కుకుపోయారు కదరా..!
ఒక లేడి పిల్ల ఆకలిగొన్న
అడివి జంతువులకు చిక్కినట్లు
నిశిరాత్రిలో నిస్సహాయురాలైన
ఒక అమ్మాయిని చేజిక్కించుకొని
మదమెక్కి ఒకరి తర్వాత ఒకరు
ఆమె ఆడతనంతో ఆడుకున్నారు కదరా..!
ఆమె అంగాలను విరిచేసి...
ఆమె అందాలను జుర్రుకొని...
ఆమెను చిత్రహింసలకు గురిచేసి...
ఆమెను కాలికింద సిగరెట్టులా నలిపేసి...
ఆమెకు నరకాన్ని చూపించారు కదరా...!
అమానవీయంగా విశ్వమే విస్తుపోయేలా
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా
స్త్రీ జాతి మీ మూఖాన ఉమ్మి వేసేలా...
"కూడు తిని కుండను" పగులగొట్టినట్టు...
అత్యాచారం చేసి హత్య చేశారు గదరా..!
ఇంతటి దారుణమైన...నీచమైన
దుర్మార్గమైన...హేయమైన...
పాపానికి ఒడిగట్టిన మీకు
చట్టాలే ఒప్పుకుంటే...ప్రజాకోర్టులో
చీపుర్లతో చెప్పులతో దేహశుద్ధి చేసి
ఏ చెట్టుకో కట్టేసి కొరడాలతో కొట్టి కొట్టి
కత్తులతో మీ తలలను నరికి నరికి
మీ శరీరాలను ముక్కలు ముక్కలుచేసి
ఏ కుక్కలకో నక్కలకో కాకులకో గద్దలకో
విసిరేసినా మాకు చింతేమీ లేదురా...!
కారణం ఒక్కటే...
మీరు మనుషులు
కాదు మానవ మృగాలు...
మీరు రాక్షసులు రాబందులు...
మీరు కళ్ళుపొరలు కమ్మిన కామాంధులు..
మీరు కన్నబిడ్డలు కాదు కసాయివాళ్ళు...
మీరు మాకడుపున చెడబుట్టారు కదరా..!
ఇదే అమ్మా నాన్నల ఆవేదన...ఆక్రందన...
రచన:
కవి రత్న
సహస్ర కవి భూషణ్
పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502








































Comments
Post a Comment