ఉత్తరప్రదేశ్ హథ్రాస్ జిల్లాలో ఫుల్ రయి గ్రామంలో తొక్కిసలాటలో 121 మంది భక్తుల దుర్మరణం...మూఢ భక్తితో మృత్యుకుహరంలోకి...కవిత రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్... కొన్ని కన్నీటి హృదయ విదారక విషాద కర చిత్రాలు మీకోసం...


























మూఢభక్తితో మృత్యుకుహరంలోకి...

అనగనగా ఒక యోగి పరిపాలనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హథ్రాస్ జిల్లాలో ఫురై గ్రామంలో 02.07.2024 వ తేదీన భోలేబాబా సత్సంగ్ సభకు 2.5 లక్షలకు పైగా హాజరైన అమాయకపు భక్తుల్లో...  

కొందరు మతం మత్తెక్కి... 
భారీ తొక్కిసలాటలో చిక్కి...
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై భోలేబాబా 
కాలిమట్టిలో మహిమలున్నాయని
నమ్మి 121 మంది అమాయకపు మహిళలు మట్టిలో కలిసిపోయారే..!
మూఢాచారాలకు... 
మూఢనమ్మకాలకు బలైపోయారే....!

ఆస్పత్రి ఆవరణలో ఎటు చూసినా 
గుట్టలు గుట్టలుగా మృతదేహాలే...
భక్తుల హాహాకారాలే...
బంధువుల ఆర్తనాధాలే...
ఆథ్యాత్మిక కార్యక్రమంలో 
అమాయకపు భక్తులెందరో
అసువులు బాశారే...
సత్సంగ్ కార్యక్రమానికి వెళ్ళి 
సమాధి అయ్యారే...
అయ్యో ఓ దైవమా..! ఇదేమి ఘోరం..?
ఇదెంతటి దారుణం..? ఎవరిదీ నేరం..? 

దేవుడని భ్రమపడిన భక్తుల పాలిట 
భోలే బాబే ఒక కాలయముడయ్యాడే...
భక్తులనెందరినో బలి తీసుకున్నాడే...

ఎన్నో ఆయుధాలు ధరించి ఉన్న 
ముక్కోటి దేవతల్లో ఒక్కరు కూడా 
అకాలమృత్యువు నాపలేకపోయారే..?
అయ్యో ఓ దైవమా..! ఇదేమి ఘోరం..?
ఇదెంతటి దారుణం..? ఎవరిదీ నేరం..? 

భక్తులను నమ్మించిన భోలే బాబాదా..?
బాబా దర్శనం కోసం పాదధూళి కోసం పోటీపడిన అమాయకపు మహిళలదా..? 
భద్రత కల్పించలేని నిర్వాహకులదా..?
అనుమతిచ్చిన ప్రభుత్వ అధికారులదా..?

తక్షణమే ఆ భోలే బాబా 
బండారం బయట పెట్టాలి..!
చట్టపరంగా కఠినమైన చర్యలు 
తీసుకోవాలి...కటకటాల్లోకి నెట్టాలి..!

ఆ భోలేబాబా ఆస్తుల్ని జప్తు చేసి మృతులకుటుంబాలకు పరిహారమివ్వాలి
ప్రభుత్వం తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స వైద్యం అందజేయాలి..!
ఇట్టి దుర్ఘటనలు పునరావృతం కాకుండా 
ప్రజలే ఈ దొంగబాబాల భరతం పట్టాలి..!


రచన:
"కవి రత్న" 
"సహస్ర కవి" 
పోలయ్య కూకట్లపల్లి 
అత్తాపూర్ హైదరాబాద్ 



 

Comments