ముచ్చటగా నాలుగు సన్మానాలు... నాలుగు కవితా గానాలు... చిత్ర మాలిక... వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కమనీయమైన కవితలు రమణీయమైన రంగుల్లో... సన్మానం వార్తలు మీ కోసం...మీ పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్ చూడండి చదవండి ఆనందించండి నచ్చితే స్పందించండి నలుగురికి షేర్ చేయండి...

 




























సాహితీమూర్తి పద్మశ్రీ కొలకలూరి
ఇనాక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...

శీర్షిక: అభినందన మందార మాల

ప్రతి గు...రు...వు...గారికి
మూడు కొమ్ములుంటాయంటారు...
అది నిజమే అది వ్యాకరణమే...
కానీ నేనంటాను ప్రతి గురువు
ఒక రవి కిరణమే...ఒక త్రినేత్రుడే
ఒక నేత్రం...విజ్ఞానం
ఒక నేత్రం...అనుభవం
మరొక నేత్రం...త్యాగం
అట్టి ఆ త్రినేత్రుడే నేడు పుట్టిన
మన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు...

తలపై మిళమిళ మెరిసే...
వెండి కిరీటంతో...
ఒక హిమగిరి శిఖరంలా
వారు సభలో అడుగిడితే...
ఒక మార్మిక నది ప్రవహించినట్లే...
ఒక సాహితీ పారిజాతం వికసించినట్లే...
వేయి ట్యూబ్ లైట్లు వేదికపై వెలిగినట్లే...

వారు వస్తారు మన సాహితీసభలకు
తెల్లని పంచెకట్టుతో...
ఒక సినారేలా...
ఒక సాహితీ శిఖరంలా...

వారు వస్తారు మన సాహితీసభలకు
ప్రసన్న వదనంతో...
చిరు మందహాసంతో...
ఒక ఏఎన్నార్ లా...
ఒక అందాలరాముడిలా...
ఒక అరుణోదయ కిరణంలా...

వారు వస్తారు మన సాహితీసభలకు
తెలుగుదనం ఉట్టిపడేలా గంభీరమైన 
ఒక సుందరమైన అందమైన ఆహార్యంతో
ఒక ఎన్టీఆర్...లా
ఒక నందమూరి చందమామలా...

వారు వస్తారు మన సాహితీసభలకు
ముసిముసి నవ్వులతో
ముఖిలిత హస్తాలతో ఒక మునిలా
ఒక వాల్మీకి మహర్షిలా...
ఒక తెల్లని రాజహంసలా...

సభావేదికపై
వెలిగే తెలుగు తేజం...
మృదుస్వభావి...
నిగర్వి...నిర్మలమూర్తి
సాహితీ చక్రవర్తి...పద్మశ్రీ ఇనాక్ గారు

మంచుముక్కలాంటి...
గందపు చెక్కలాంటి...
మంచి మనసుకున్న
సహృదయులు...సాహితీ శిఖరం...
స్పూర్తి ప్రదాత...పద్మశ్రీ ఇనాక్ గారు...

దివ్యమైన ఒక వెలుగు వుంటుంది
వారి ముఖంలో ...
పరిమళిస్తుంది...
మంచితనం...మానవత్వం
వారి మాటల్లో...
ప్రతి ధ్వనిస్తుంది...
సేవాతత్వం..వారి చేతల్లో...
ప్రవహిస్తుంది...
ప్రేమతత్వం...వారి చల్లని చూపుల్లో
పొంగిపొర్లుతుంది
కవులంటే ఎనలేని అనురాగం... 
ఆప్యాయత... వారి గుండెల్లో...
సహనం...శాంతం వారి సొంతం...
ఓర్పు వారిలో అనంతం...

సమయపాలనకు...
వారు చక్కని చిరునామా... 
మచ్చలేని..స్వచ్చమైన
వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం
మన గురుదేవులు
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు...

వారిలో...
ఒక శాంతమూర్తి...
ఒక సౌజన్యమూర్తి...
ఒక ప్రేమా మయుడు...
ఒక దయా సముద్రుడు...
ఒక దళిత జాతి జ్యోతి....
ఒక బహుజన భానుడు...
ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి...
ఒక కరుణామయుడు కనిపిస్తారు
కవులారా మరి మీరేమంటారు..?
ఔనంటారా...కాదంటారా...?
ఊ అంటారా ఊహు అంటారా...?
సందేహం లేదు అందరూ ఔనంటారు

ఆ మంచితనం...
ఆ హుందాతనం...
ప్రతిసభలో వారందించే
సంక్షిప్త సుందర శుభసందేశం...
అద్వితీయం అద్భుతం అపురూపం

చెరగని చిరునవ్వులతో...
శాలువాలు కప్పి జ్ఞాపికలిచ్చి...
ఎందరో కవులను వేదికలపై
ఘనంగా సన్మానించి సత్కరించి...
తమ అమృతహస్తాలతో...దీవించి...
భుజం తట్టి...ప్రోత్సాహించే...
ప్రేమించే వారి హృదయం నవనీతం...
ఎందరో కవులు వారికి ఋణపడి
ఉన్నారు వారిలో నేనూ ఒకడిని...

మనందరి ఆయుష్షు పోసుకొని...
మన గురుతుల్యులు...
సాహితీ శిఖరం...
సాహితీ సింహం...
సాహితీ సరోవరం...
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు
నిండూ నూరేళ్లు ఆయురారోగ్య 
అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని...
ప్రశాంతమైన శేషజీవితాన్ని
ఆ పరమాత్మ వారికి ప్రసాదించాలని... 
మనసారా కోరుకుంటూ..
వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ...

ఈ సాహితీమూర్తి జన్మించినందుకు
మన తెలుగునేల...
మన తెలుగు తల్లి...
మన తెలుగు జాతి...యావత్తు
పులకించే ఈ శుభవేళ...
కవిరత్న...సహస్ర కవిభూషణ్...
పోలయ్య కవి కూకట్లపల్లి అందిస్తున్న... 
సుందర సుమధుర సుగంధభరిత 
అక్షరాభినందన చందన మందార మాల...
( ఇది కవిత కాదు ప్రశంసా పత్రం)….

రచన: పోలయ్య కవి కూకట్లపల్లి హైదరాబాద్

































Comments