అక్షర యోధుడు రామోజీ అస్తమయం...08.06.2024...అక్షరనీరాజనం...పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
![]() |
1. ఆరని అక్షర దీపం...రామోజీ
ఒక సామాన్య రైతుబిడ్డ...
ప్రతిష్టాత్మకమైన
రామోజీ గ్రూపు
సంస్థల అధినేత...
ప్రముఖ పారిశ్రామికవేత్త...
బహుముఖ ప్రజ్ఞాశాలి...రామోజీ
1936, నవంబర్ 16 వ తేదీన...
కృష్ణాజిల్లా పెదపారుపూడిలో
చెరుకూరి వెంకట సుబ్బారావు
సుబ్బమ్మ పుణ్యదంపతులకు జననం
ప్రజలను చైతన్య
వంతులను చేసేందుకు...
విజ్ఞానవంతులుగా మార్చేందుకు...
తెలుగు బాషా పురోభివృద్ధికి...
తెలుగు జాతి వికాసానికి...
వెలిగించిన అక్షర దీపం...
1974, ఆగస్ట్ 10 వతేదీన...
విశాఖ తీరాన ప్రజాపత్రిక రామోజీ
మానసిక పుత్రిక "ఈనాడు" పత్రికస్థాపన
తెలుగు చలనచిత్ర
సీమకు మకుటాయమానంగా
యావత్ చిత్ర జగత్
విస్తుపోయేలా...2 వేల
ఎకరాల్లో ప్రతిష్టాత్మకమైన
"రామోజీ ఫిల్మ్ సిటీని"... నిర్మించి...
తెలుగు జాతికి ఖండాంతర
ఖ్యాతిని ఆర్జించి పెట్టిన...
బాహుబలి బహుముఖ ప్రజ్ఞాశాలి...
పద్మవిభూషణ్...రారాజు రామోజీ
ఎలక్ట్రానిక్ రంగంలో ప్రవేశించి
తెలుగు ఈటీవిని స్థాపించి...
విభిన్న భాషల్లో విస్తరించి...
గాన గంధర్వుడు బాలుగారి
సారధ్యంలో పాడుతా తీయగా
స్వరాభిషేకంలాంటి కార్యక్రమాలతో
వందలాది టీవీ సీరియల్స్ తో
లక్షలాది కుటుంబాలకు...
వినోదాన్ని విజ్ఞానాన్ని పంచి...
కోట్లాదిమంది హృదయాలను
కొల్లగొట్టిన బుల్లితెర చక్రవర్తి...రామోజీ
వేలాది మందికి
ఉద్యోగ ఉపాధి అవకాశాలను
కల్పించి లక్షలాది కుటుంబాల
ఆకలి బాధను తీర్చిన...అన్నదాత
ఎందరికో ఆత్మబంధువు...
తెలుగుజాతి...ఆరాధ్య దైవం
2024, జూన్ 8 వతేదీన...
అస్తమించిన అక్షరయోధుడు ...
ఆరని అక్షరదీపం...రామోజీరావుకు
అశ్రునయనాలతో...అక్షర నీరాజనం...
ఉద్యోగ ఉపాధి అవకాశాలను
కల్పించి లక్షలాది కుటుంబాల
ఆకలి బాధను తీర్చిన...అన్నదాత
ఎందరికో ఆత్మబంధువు...
తెలుగుజాతి...ఆరాధ్య దైవం
2024, జూన్ 8 వతేదీన...
అస్తమించిన అక్షరయోధుడు ...
ఆరని అక్షరదీపం...రామోజీరావుకు
అశ్రునయనాలతో...అక్షర నీరాజనం...
1...
తెలుగు తల్లికి...
తెలుగు నేలకు...
తెలుగు జాతికి...
తెలుగు భాషకు...
తెలుగు దేశానికి...
తెలుగు మీడియాకు...
తెలుగు సంస్కృతికి...
తెలుగు సినీ పరిశ్రమకు...
ఆరని వెలుగులు ప్రసాదించిన
అక్షర సూర్యుడు...రామోజీ...
ఎన్నో వేలమంది జర్నలిస్టులకు
తమ గ్రూప్ సంస్థల్లో పనిచేసే
ఉద్యోగుల...కార్మికుల...కుటుంబాల
ఆకలి తీర్చిన అన్నదాత...రామోజీ
పత్రికా రంగంలో
పెనుమార్పులకు...
బుల్లితెర వెండితెర
మీడియా రంగంలో
వినూత్నమైన...
విప్లవాత్మకమైన...
నూతన ఆవిష్కరణలకు...
శ్రీకారం చుట్టిన...
మకుటంలేని మహారాజు...రామోజీ...
రామోజీ అంటే..?
ఒక ఈటీవీ...
ఒక ఈనాడు...
ఒక మార్గదర్శి...
ఒక ప్రియా పికిల్...
ఒక రామోజీ ఫిల్మ్ సిటీ...
ఒక ఉషా కిరణ్ మూవీస్...
ఒక చతుర విపుల సితార అన్నదాత
ఒక బాలభారతం ఒక తెలుగు వెలుగు...
రామోజీ అంటే..?
ఒక టైటాన్...
ఒక దార్శనికుడు...
ఒక పత్రికా దిగ్గజం...
ఒక పద్మ భూషణుడు...
ఒక మీడియా మొఘల్...
ఒక రాజకీయ దురంధరుడు...
తెరవెనుక రాజకీయ
చక్రం తిప్పిన మీడియా చక్రవర్తి...
అజరామరం ఆయన అఖండకీర్తి...
పత్రికా మీడియా రంగంల
వారికి వారే సాటి లేరెవరు పోటీ
ఈ భువిలో మరొక రామోజీ పుట్టడు
కారణం రామోజీ మరణంలేని
పత్రికా ఒక మీడియా మాంత్రికుడు...
దూరదృష్టితో...
కఠోర సాధనతో...
సృజనాత్మకతతో
చేసే...ప్రకంపనలు
పుట్టించే...ప్రయోగాలే..!
ఎవరూ కలనైనా
ఊహించని దారుల్లో...
ఎవరూ సాహసించని
వినూత్నమైన విశిష్టమైన
అధ్భుతమైన ఆవిష్కరణలే...
జ్ఞాన సూర్యుడు అక్షర యోధుడైన...
రామోజీ రావు అదృశ్య అస్త్రాలు..!
ధర్మబద్ధంగా బ్రతకాలి
ప్రజల పక్షాన నిలవాలంటూ
నమ్మిన సిద్ధాంతాలకు
కట్టుబడిన...నరసింహం...రామోజీ..!
సమాజ హితం కోసం...
నిరంతరం తపించిన...
గొప్ప దార్శనికుడు...రామోజీ..!
ఎందరో ప్రభుత్వ
పాలకులకు తెరవెనుక...
రాజకీయ గురువు...రామోజీ..!
పనియే దైవమని...
పనిలోనే విశ్రాంతియని
పని చేస్తూనే మరణించాలనే
రాజీపడని పనిరాక్షసుడు...రామోజీ..!
ప్రముఖ
సంగీత దర్శకుడు
కీరవాణి పలికినట్టు
పుడితే మనిషిగా
రామోజీ రావు గారిలా పుట్టాలి
పుట్టి అనితరసాధ్యమైన
సాహసోపేతమైన కార్యాలు చేపట్టాలి
ఆపై నిశ్శబ్దంగా నిష్క్రమించాలి
వెలుగులు విరజిమ్ముతూ
నింగిలో "ధృవతారగా" నిలిచిపోవాలి
అందుకే
రామోజీ ఒక రారాజు
తెలుగు తల్లికి ఒక ఆభరణం...
మన తెలుగు జాతికి గర్వకారణం....
అక్షరయోధునికిదే నా అక్షరనీరాజనం..
రచన:
కవి రత్న
సహస్ర కవి భూషణ్
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502














Comments
Post a Comment