నందమూరి చందమామ...28.05.2024 న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అక్షరాంజలి... వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కమనీయమైన కవితలు రమణీయమైన రంగుల్లో చదవండి ఆనందించండి నచ్చితే స్పందించండి...పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
నందమూరి చందమామ...! (కవిత)
(తేది 28.05.2024 న శ్రీ నందమూరి
తారక రామారావు గారి జయంతి సందర్భంగా)
ఆరుకోట్ల
ఆంధ్రుల అందగాడు
అసాధారణ నటనకు...
ఆత్మ గౌరవానికి
ప్రతిరూపం...
క్రమశిక్షణకు...
సమయ పాలనకు...
చెరగని చక్కని చిరునామా...
ఎవరు బ్రదర్...? ఇంకెవరు..?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే..!
చిత్రసీమ చరిత్రలో
బాక్సాఫీస్ రికార్డులను
బద్దలు కొట్టి మైలురాళ్ళ
వంటి 306 పౌరాణిక
సాంఘిక జానపద
చారిత్రక చిత్రాల్లో తన
అసాధారణ అపూర్వ
అధ్భుత అద్వితీయ నటనతో
కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన
ఆంధ్రుల అభిమాన...కథానాయకుడు
శ్రీ కృష్ణునిగా శ్రీరామునిగా. దుర్యోధనుడిగా దుశ్శాసనుడిగా
పూరాణ పాత్రల్లో జీవించిన
వెండితెరపై వెలిగిన ధృవతార అభినవ...అవతార యుగపురుషుడు
అట్టడుగు బడుగు బలహీన
బహుజన వర్గాల ఆత్మబంధువు
ఎవరు బ్రదర్..? ఇంకెవరు...?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే..!
సమాజమే దేవాలయం...
ప్రజలే నా దేవుళ్ళను నినాదంతో
పేదలపార్టీ పెట్టి ఆరుకోట్ల
ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట
ఎన్నికల శంఖారావం...పూరించి
9 నెలల కాలంలోనే...
కాంగ్రెస్ కంచుకోటను...బద్దలు కొట్టి
అఖండ మెజారిటీతో
ముఖ్యమంత్రి పీఠాన్ని...
అధిరోహించిన...
అఖండుడు...సింహబలుడు...
పేదప్రజల పక్షపాతి...
సంక్షేమ పథకాల రధసారధి...
ఆంధ్రుల ఆత్మగౌరవానికి
నిలువెత్తు నిదర్శనం...
ఎవరు బ్రదర్..? ఇంకెవరు...?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే..!
పటేల్ పట్వారీ వ్యవస్థను
రద్దుచేసి...మద్యపాన నిషేధం...
రెండు రూపాయలకే బియ్యం...
మహిళలకు ఆస్తిలో సమానహక్కు...
పచ్జచని పథకాలతో జనరంజకంగా
రామరాజ్యపాలన...అందించిన...
అభినవ రఘురాముడు...
ఘనుడు...త్యాగధనుడు
తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఆశాజ్యోతి ...ఆరాధ్యదైవం... అమరజీవి...అజాత శత్రువు
ఎవరు బ్రదర్..? ఇంకెవరు..?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే...!
ట్యాంక్ బండ్ మీద
కనుమరుగై పోతున్న కవీశ్వరుల
నిలువెత్తు విగ్రహాలతో
తెలుగుభాష వికాసానికి పట్టంకట్టి
తెలుగుజాతికి ఖండాంతర
ఖ్యాతిని ఆర్జించి పెట్టి
కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా
అఖండకీర్తిని ఆర్జించిన...
చరిత్ర సృష్టించిన...మన జననేత
తెలుగు జాతి ముద్దుబిడ్డ అందరికీ అన్నగా సుపరిచితుడు సుచరితుడు
ఎవరు బ్రదర్..? ఇంకెవరు..?
విశ్వవిఖ్యాత నటరత్న నటసార్వభౌమ
శ్రీ నందమూరి చందమామే...!
రచన :
"కవి రత్న"
"సహస్ర కవిభూషణ్"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502




























.png)
Comments
Post a Comment