10.03.2024 ఆదివారం రవీంద్రభారతిలోని మినీ హాల్ లో...శ్రీ భం సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పోలయ్య కవి కూకట్లపల్లి కి సాహితీ సత్కారం




శ్రీ భం సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో...
పోలయ్య కవికి సాహితీ సత్కారం...

హైదరాబాద్ రవీంద్రభారతిలో
ఆదివారం సాయంకాలం శ్రీ భం సాయి 
సేవా ట్రస్ట్ మరియు భారతీయ సాహిత్య 
అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 
సభా సామ్రాట్ కళారత్న బిక్కీ కృష్ణ అధ్యక్షతన 
వారు వ్రాసిన "మార్మిక నది" పుస్తకావిష్కరణ మరియు కవులకు కళాకారులకు జీవన 
సాఫల్య పురస్కారాల సభ జరిగింది...

సభ ప్రారంభంలో కళారత్న బిక్కికృష్ణ
ఏ.వీ ని ప్రదర్శించారు...అది తిలకించిన 
ప్రతివారు ఆశ్చర్యచకితులైపోయారు
బిక్కీ కృష్ణ చేసిన చేస్తున్న సాహితీ సేవకు మనసులోనే ప్రశంసల వర్షం కురిపించారు


తదనంతరం కళారత్న బిక్కీ కృష్ణ వ్రాసిన 
"మార్మిక నది"పుస్తకాన్ని ఎమ్మెల్సీ ఎన్టీఆర్
సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్
గౌ.టి డి.జనార్థన్ ఆవిష్కరించారు... 
ప్రముఖ కవి విమల సాహితీ సమితి
అధ్యక్షులు జల్దీ విధ్యాధర్ అధ్భుతంగా 
క్లుప్త సౌందర్యంగా సమీక్ష చేశారు...


ప్రముఖ కవి రచయిత పోలయ్య
కూకట్లపల్లి ఈ సభలో పాల్గొని...
"మహిళా మణులే మణిదీపాలు"
అను కమ్మని కవితను ఆలపించారు
ఆహుతులను అలరించారు...

మహిళామణులే మణిదీపాలు..!

మన మహిళామణులే...
మన భారతావనికి 
మణులు...
మాణిక్యాలు...
రామబాణాలు...
రక్షణ కవచాలు... 
రవికిరణాలు...
అందమైన ఆభరణాలు... 
వెలకట్టలేని కోహినూర్ వజ్రాలు... 

మన మహిళామణులే... 
వీరవనితలు...
విప్లవ సింహాలు... 
దివినుండి నుండి భూమికి 
దిగివచ్చిన దేవతలు... 
సుఖసంతోషాలను ప్రసాదించే  
సుందరమైన బృందావనాలు...
కోరికలు తీర్చే కామధేనువులు...
కలలను పండించే కల్పవృక్షాలు... 

మన మహిళామణులే... 
ప్రతి ఇంటికి మణిదీపాలు... 
ప్రేమకు కరుణకు ప్రతిరూపాలు... 
గలగలపారే గంగా గోదావరి నదులు...
నీతికి నిజాయితీకి నిర్భీతికి నిధులు...

మన మహిళామణులే... 
ఆకలి తీర్చేటి అన్నపూర్ణలు... 
శ్రమసౌందర్యానికి సోపానాలు...
కాదు కాదు ఆ బంగారు అమ్మలు...
అంగడిలో అమ్ముడుపోయే ఆటబొమ్మలు

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
సందర్భంగా వ్రాసి 10.03.2024 న
రవీంద్ర భారతిలో జరిగిన బిక్కీకృష్ణ 
పుస్తకావిష్కరణ సభలో చదివిన కవిత)


తదనంతరం హైకోర్టు విశ్రాంత 
న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్...
శ్రీ భం సాయి సేవాట్రస్ట్ చైర్మన్ నరసింహప్ప...
కళారత్న బిక్కీకృష్ణ చేతుల మీదుగా పోలయ్య 
కవి కూకట్లపల్లికి ఘనసన్మానం జరిగింది.తన సాహితీ కృషిని గుర్తించి...తనను‌ సత్కరించిన సాహితీమూర్తులకు పోలయ్య కవి కూకట్లపల్లి కృతజ్ఞతలు తెలియజేశారు


ఈ సభకు సాహితీ ప్రముఖులు దైవజ్ఞశర్మ...
తెలుగు వన్.సి.యం.డీ రవిశంకర్...
ప్రముఖ నవలాకారుడుసినీ డైరెక్టర్ 
ప్రభాకర్ జైనీ...విజయలక్ష్మి 
పండిట్ గజల్ క్వీన్ వాసిరెడ్డి మళ్ళీశ్వరి... 
యాంకర్ పద్మశ్రీ లత తదితరులు కవులు కళాకారులు హాజరయ్యారు ఆరంభంలో 
నోరి దంపతుల గానలహరికి సభికులు ముగ్ధులైపోయారు.












 

Comments