భారత రత్న లాల్ కృష్ణ అద్వానీ... వివిధ పత్రికల్లో ప్రచురితమైన కవితలు + చిత్రమాలిక... మీకోసం చదవండి ఆనందించండి స్పందించండి మీ పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్



















 


6. అద్వాని కవితల ఇండెక్స్ 
1. లాల్ కృష్ణ అద్వానీ...అంటే..?
2. అద్వానీకి భారతరత్న...
    అది మోడి గురుదక్షిణ...
3. అద్వానీ కళ్ళల్లో ఆనంద భాష్పాలు...
4. భారత ముద్దుబిడ్డకు 
    భారత రత్న అవార్డు
5. అద్వానీ రాజకీయ ప్రస్థానం...?
6. నెరవేరని "ప్రధాని" కల..! 

 

1. లాల్ కృష్ణ అద్వానీ...అంటే..?

ఎల్ కే అద్వానీ...అంటే..? 
ఒక రాజకీయ వ్యూహకర్తగా... 
లక్షలాది కరసేవకులచే... 
బాబ్రీమసీదును కూల్చివేయించిన 
ఒక సంచలనం.....ఒక ప్రభంజనం... 
ఒక ఎర్ర కమలం...ఒక అగ్నిశిఖరం... 
లాల్ కృష్ణ అద్వానీ...అంటే..? 
కరుడుగట్టిన ఒక 
ఆర్ఎస్ఎస్ కార్యకర్త... 
ఒక దేశభక్తుడు... 
భరతమాత ముద్దుబిడ్డ...
ఒక భారత అభివృద్ధి స్వప్నికుడు... 
ప్రజాసేవకే తన సంపూర్ణ జీవితాన్ని 
అంకితం చేసిన ఒక హిందుత్వవాది... 
అత్యంత గౌరవప్రదమైన ఒక జాతినేత...
నవభారత నిర్మాత ఒక మార్గదర్శకుడు...
ఎల్ కే అద్వానీ... అంటే..? 
కమల దళానికి 
ఖండాంతర ఖ్యాతిని 
ఆర్జించిపెట్టి అంచలంచెలుగా 
ఎదిగిన ఒక రాజకీయ దిగ్గజం... 
కాషాయవనంలో విరిసిన ఒక కమలం... 
ఎన్డీయే రూపశిల్పి...ఒక రాజనీతిజ్ఞుడు...
అట్టి బహుముఖ ప్రజ్ఞాశాలికి...
ఆ రాజకీయ కురువృద్ధునికి...
నాడు "ప్రధానమంత్రి పీఠం" దక్కకున్నా
నేడు "భారతరత్న" పరస్కారం దక్కింది
అది వారి
ఆదర్శ భావాలకు... 
మచ్చలేని వ్యక్తిత్వానికి...
కట్టుబడిన సిద్దాంతాలకు...
ఆదర్శవంతమైన ఆశయాలకు... 
చేపట్టిన రామమందిర రథయాత్రకు...
వారి నిస్వార్థసేవలకు దక్కిన గొప్పగౌరవం
 
2. అద్వానీకి భారతరత్న...
    అది మోడి గురుదక్షిణ...

విశిష్ట సేవలకు గుర్తింపుగా 
భారత ప్రభుత్వం
ప్రధానం చేసే పురస్కారాల్లో 
అత్యున్నతమైనది...
ప్రతిష్టాత్మకమైనది...
"భారతరత్న" పౌర పురస్కారం 
అట్టి కీర్తి కిరీటాన్ని
అందుకున్న ఎల్ కే అద్వానీ  
భాజపా భీష్మ పితామహుడు...
కమలనాథుల్లో కురువృద్ధుడు...
వారు చేపట్టిన రామమందిర రథయాత్ర
ఆనాడొక ప్రభంజనం ఒక సంచలనం
లక్షలాది కరసేవకులచే బాబ్రీమసీదు
కూల్చివేత ఒక చారిత్రాత్మక‌ సంఘటన
ఒక ఆర్ఎస్ఎస్ 
కార్యకర్త...స్థాయి నుండి 
ఒక భారతదేశ ఉపప్రధానిగా...
ఎదిగిన అద్వానీ రాజకీయ 
ప్రస్థానం ఎంతో ప్రశంసనీయం... 
చేసిన నిస్వార్థసేవ చిరస్మరణీయం...
వారి రాజకీయానుభవం ఆదర్శనీయం...
అందుకే నేడు ఎల్ కే అద్వానీకి
దక్కిన ఈ "భారతరత్న" పురస్కారం
అది మోడి సమర్పించుకున్న "గురుదక్షిణ" 

3. అద్వానీ కళ్ళల్లో ఆనంద భాష్పాలు...

కష్టకాలంలో భాజపా పార్టీ 
అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి...
రామమందిర నిర్మాణమే లక్ష్యంగా...
తన గంభీరమైన ఉపన్యాసాలతో... 
కరసేవకులను  ఉర్రూతలూగిస్తూ.. 

సోమనాథ్ దేవాలయం నుండి
అయోధ్యకు సాగిన రామమందిర
రధయాత్రతో...తన కల నెరవేరింది...
బాబ్రీమసీదు కూల్చి వేయబడింది...

కేవలం రెండు 2 ఎంపీ స్థానాలున్న 
భాజాపా 161 ఎంపీ స్థానాలతో
వాజ్ పాయ్ ప్రధానమంత్రిగా
కేంద్రంలో భాజపాకు అధికారం దక్కింది...
మళ్ళీ అయోధ్యకు రామయ్య వచ్చాడు...
తనను "భారతరత్న"పురస్కారం వరించింది...

ఇది "తాను కట్టుబడిన సిద్ధాంతాలకు...
తన ఆశయాలకు...తన ఆదర్శభావాలకు...
చేసిన దేశసేవకు దక్కిన గొప్పగౌరవమంటున్న" 
"అద్వానీ కళ్ళల్లో అవిగో ఆనందభాష్పాలు"...

కానీ కాషాయవనంలో
విరబూసిన‌‌‌ ఈ కమలానికి...
నాడు పార్లమెంటరీ పార్టీ నిర్ణయాలకు 
కట్టుబడిన ఈ కురువృద్ధునికి...
తన సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో
అందని ద్రాక్ష...తీరని కల...ఒక్కటే
అదే "భారతదేశ ప్రధానమంత్రి పదవి"...

4. భారత ముద్దుబిడ్డకు 
    భారత రత్న అవార్డు 

ఒకనాడు
జనతాపార్టీ నుండి విడిపోయి
భారతీయ జనసంఘ్ ను  
భారతీయ జనతా పార్టీగా మార్చి
కష్టకాలంలో భాజపా 
అధ్యక్షుడిగా 
పార్టీ పగ్గాలు చేపట్టి...
పార్లమెంటులో
1984 లో 2 సీట్లున్న
భారతీయ జనతా పార్టీని... 
అంచలంచెలుగా
1989 లో 86 గా... 
1991 లో 120 గా...
1996 లో 161 గా...
దేశంలో అతిపెద్ద 
పార్టీగా అవతరించి
కేంద్రంలో ఏర్పాటు చేసిన 
వాజ్ పాయ్ ప్రభుత్వం 
13 రోజులకే 
కుప్పకూలిపోయినా... 
పార్టీని మళ్ళీ గెలిపించిన... 
సిద్దాంతాలు వేరైనా 
మిత్రపక్షాల సహకారంతో
వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా  
సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటు చేసిన...
రాజకీయ వ్యూహకర్త 
రాజనీతిజ్ఞుడు...
భరతమాత ముద్దుబిడ్డ...
లాల్ కృష్ణ అద్వానీ.... 
అట్టి రాజకీయ కురువృద్ధున్ని...
"భారతరత్న అవార్డు"తో సత్కరించడం
మోడి రాజకీయ చతురతకు 
నిదర్శనం...గురుదక్షిణకు గుర్తు...

5. అద్వానీ రాజకీయ ప్రస్థానం...?

లాల్ కృష్ణ అద్వానీ 
14 సంవత్సరాలకే 
ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా...
కరాచీ విభాగం కార్యదర్శిగా...
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో 
నడిచే "ఆర్గనైజర్" పత్రికలో 
నేత్రను కలం పేరుతో పాత్రికేయునిగా...
భారతీయ జనసంఘ్ 
ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శిగా...
జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా...
దీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా 
నాలుగుసార్లు రాజ్యసభ సభ్యుడిగా... 
గుజరాత్ గాంధీనగర్ నుండి 
వరుసగా ఏడుసార్లు లోకసభ సభ్యుడిగా
మురార్జీ దేశాయ్ ప్రధాని మంత్రివర్గంలో
కేంద్ర సమాచార ప్రసారం శాఖమంత్రిగా...
వాజ్పాయ్ మంత్రివర్గంలో హోమ్ మంత్రిగా
భారత దేశ‌ ఉపప్రధానిగా... 
 
భాజాపా 
అధ్యక్షుడిగా కమలం 
పార్టీని గద్దెక్కించేందుకు...
జనదేశ్ రథయాత్ర...
స్వర్ణజయంతి రథయాత్ర... 
భరత్ ఉదయ్ రథయాత్ర... 
భారత్ సురక్షా రథయాత్ర...
రామమందిర 
నిర్మాణమే లక్ష్యంగా 
సోమనాథ్ నుంచి అయోధ్యకు 
సాహసోపేత రథయాత్రను  
సాగించిన కమల దళ రథసారథిగా...
రాజకీయ ప్రస్థానం సాగించిన
రాజకీయ దురంధరుడు అద్వానీని
అత్యంత ప్రతిష్టాత్మకమైన 
భారత రత్న పురస్కారంతో 
గౌరవించడం...భారతీయులందరికీ 
గొప్ప గర్వకారణం ఒక హోలీ పండుగ...

6. నెరవేరని "ప్రధాని" కల..! 

ఆనాడు రామమందిర 
నిర్మాణమే లక్ష్యంగా...
అయోధ్యకు రథయాత్రను చేపట్టి 
హిందీభాషలో పట్టును సాధించి... 
గంభీరమైన ప్రసంగాలతో ... 
కరసేవకులను రెచ్చగొట్టి...
బాబ్రీమసీదును సమాధి చేసిన...
రామమందిరానికీ పునాది వేసిన...
"ఉద్యమ సూర్యుడు" ఎల్ కే అద్వానీ 
పార్టీ అధ్యక్షుడిగా 
6 రథయాత్రలు చేసి 
2 సీట్ల నుండి 161 సీట్లు సాధించి 
కేంద్రంలో వాజ్ పాయ్ ప్రధానిగా 
బీజేపీని అధికారంలోకి తెచ్చి...
75 ఏళ్ళు నిండినందున...
పార్టీ నిర్ణయాలకు కట్టుబడి
"ప్రధానిమంత్రి" పదవికి దూరమై...
తన సిద్ధాంతాలను వ్యతిరేకించిన 
పార్టీ ప్రముఖులతో విభేదించి...
3 సార్లు పార్టీకి రాజీనామా చేసి...
"మై కంట్రీ మై లైఫ్" ఆత్మకథలో 
తన "ప్రధాని కల" నెరవేరలేదని... 
మదనపడిన మహానేత...అద్వానీ.
నేడు తనను వరించిన ఈ "భారతరత్న"
గురుతుల్యులైన అద్వానీకి వినమ్రంగా 
మోడి సమర్పించుకున్న "గురుదక్షిణ"...



రచన:

"కవి రత్న" 

"సహస్ర కవి" 

పోలయ్య కూకట్లపల్లి

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9110784502






Comments