83... నవంబర్ నెల 2023 కవితలు

 83...నవంబర్ నెల 2023 
       కవితల ఇండెక్స్ 

1. ఇజ్రాయెల్...పాలు తేనెలు
    ప్రవహించే పవిత్రదేశం....? 
2. పదిమందిని ప్రేమించి చూడు..!
3. కాలానికి మూడు కళ్ళు...?
4. పక్షి ఇచ్చే పచ్చని సందేశం...? 
5. రామబాణాలు మూడు...?
6. నిజమైన ధనవంతులెవరు ఈధరణిలో
7. చిరునవ్వులు నవ్వే... చిరుతపులులు
8. జంట కవులు..!!
9. నా లక్ష్యం ఒక్కటే..!
10. విజయమా ? వీరస్వర్గమా...?
11. ఆత్మవిశ్వాసం ఆకాశమంత..!  
12. శంభో శంకర...కుక్కతోక వంకర...
13. ఎందుకని...ఏమో...?
14. పోలన్న పలుకు...పాలకోవే...
15. ఆరోగ్యం ఎక్కడుంది..?
16. ఖాళీ వలలు...కరిగిన కలలు...
17. తిరుగులేని నాలుగు తీర్పులు..?
18. కలలో...తలలో...చేతిలో...??? 
19. నవ్వుల నదిలో...పువ్వుల పడవ..?
20. సంస్కరించాలి..! సత్కరించాలి...!!
21. తప్పెవరిది..?
      విసిరిన కలానిదా..?
      చిరిగిన కాగితానిదా..?
22. నా ఓటు ఎవరికంటే...?
23. వద్దు వద్దు...మాకు 
      ఉచితాలు వద్దు... 
      సుపరిపాలనే ముద్దు... 
24. కాపురం లో కారుచిచ్చు రేగితే...?
25. సంసారంలో సఖ్యత...
26. ఓటరు దేవుళ్ళారా..! 
      మీకు వందనం పాదాభివందనం..!!
27. పురుషుడిగా పుట్టి లాభమేమి?
28. నీ నిర్ణయాలకు 
       నీవేకదా నిర్మాత..?
29. ప్రేమాభిషేకం... 
    ‌‌  వెనుకే కనకాభిషేకం... 
30. వరల్డ్ క్రికెట్ మ్యాచ్ 
       ఒక గొప్ప గుణపాఠం...?
31. బాధ...భారతీయులకు..!
      ఆనందం...ఆస్ట్రేలియాకు..!
32. ఎంతకాలం..? ఎంతకాలం..? 
33. వ్యక్తి రూపం...శక్తి శాపం...?
34. నా సూక్తులు నా శుభాషితాలు
35. నేటి మొగ్గలే...రేపటి పువ్వులు
36. ఆరు వరాలు పొందాలంటే..?
37. మహాకవి మన కాలేజీ...
38. బిక్ష కాదది బిడ్డగా మీ భాధ్యత..!
39. ఆయుష్మాన్ భవా...!
40. ఆ గాలిపటాలకు
       ఆధారం...ఆ దారమే...!
41. కవిత అంటే...?
42. గానమా..! నా ప్రాణమా...!!
43. గట్టున గవ్వలు...
      మునిగితె ముత్యాలు...
44. జయహో..! జయహో..! 
       శీతల్ దేవి..! జయహో..! 
       (చిత్ర కవిత)
45. ఏది వైరల్ ? ఏది నిజం?...
46..నరుడా ! ఓ నరుడా !!
47. వాల్మీకి వారసులారా..! 
      మీరు ధన్యులు..!
48.  అన్నా..! ఓ ఓటరన్నా..! 
        నీవు ఓడరాదు..!
        నీ ఓటు ఓడరాదు..!
49.  ఓటర్లంటే...ఎవరు?
       మట్టికరిపించే మాంత్రికులు..!
50. ఓటరు మాంత్రికుల్లారా ఒక్కమాట...? 
51. ఉచితాలు మాకొవద్దు... 
     సుపరిపాలనే మాకు ముద్దు... 
52. నా ఓటు ఎవరికంటే...?
53. నిజమైన ప్రజాప్రతినిధికే మన ఓటు ?
54. నిన్న నీ కాళ్ళకు మ్రొక్కాము..!
      నేడు నీ చేతికి చిక్కాము...!
55. ఓటరన్న కెన్ని
      అతీంద్రియ శక్తులు..? 
56. అభ్యర్థులకు అగ్నిపరీక్ష...?
57. ఓటరన్న ఒక త్రినేత్రుడు..!
58. శిరీష విజయం..!
      కొల్లాపూర్ విజయం..!!
59. నిరుద్యోగుల ప్రతినిధి...
      నిరుపేదల ఆశాజ్యోతి...శిరీష
60. విజిలేస్తే...కొల్లాపూర్ 
      విజయం...శిరీషకే...!
61. అన్నా..! ఓ ఓటరన్నా..!
     నీ ఓటే నీ "వజ్రాయుధం"..!
62. అన్నా..! ఓ ఓటరన్నా..!
      నీవు గెలవాలి..! నీ ఓటు గెలవాలి..!
63. రామబాణం సంధించు..!
       రామరాజ్యం స్థాపించు..!
64. ప్రతిభకు జరగాలి పట్టాభిషేకం  
65. శిరీష అంటే...ఒక బర్రెలక్క కాదు...?
66. నిరుద్యోగుల ప్రతినిధి...
       నిరుపేదల ఆశాజ్యోతి...శిరీష
67. శిరీష విజయమంటే..?
68. అమరత్వానికి ఆహ్వానం.?
69. డబ్బు...పొదుపు నోరు.....అదుపు
70. ఒక ప్రణాళిక... 
      ఒక ప్రయత్నం... 
      .ఒక ప్రతిఫలం...
71. చిత్ర కవిత(ఒక పాట మ్యూజిక్ విని)
72. జాలర్ల వింత జాతకాలు..?
73. భారత మాతకు జేజేలు...! 
      బంగరు భూమికి జేజేలు...! 
74. బృహత్ గ్రంధపఠనం...
75. అస్తమించిన"అభినవ అల్లూరి"...
76. నీకు తప్ప..! నీ ఓటుకు తప్ప..!
77. నీ హృదయంలో 
     ఉషోదయమెప్పుడు..?
78. తరుణోపాయం..?
79. నాలుగు చక్రాలు
     నాలుగు వేదాలు 
80. జాతకం ఒక జలపాతమైతే..?
81. ఆకలి...నవ్వుతోంది....
82. చిత్ర కవిత...
83. అంతరాత్మ ప్రబోధం..?

1. ఇజ్రాయెల్...పాలు తేనెలు
    ప్రవహించే పవిత్రదేశం....? 

బైబిల్ గ్రంధం చెబుతోంది 
ఇజ్రాయెల్ పాలు తేనెలు
ప్రవహించిన పవిత్ర దేశమని
నేడు అమాయకపు ప్రజల
రక్తం ఏరులై ప్రవహిస్తున్న 
భద్రత కరువై భయంతో
ప్రజలు బంకర్లలో 
బ్రతుకుతున్న ఓ చిన్న 
దేశం ఇజ్రాయేల్ దేశం...

ఎన్నో ఏళ్ళతరబడి
ఇరుగు పొరుగు దేశాలతో
ఎన్నో యుద్ధాలు చేసింది
శత్రువులను హతమార్చింది
ఎందరినో పౌరులను 
యుధ్దవీరులను కోల్పోయింది 
ఇజ్రాయేల్ దేశం...ఐనా 
నేడు ప్రపంచంలో అత్యాధునిక 
రక్షణ వ్యవస్థ కలిగిన అత్యంత
శక్తివంతమైన దేశం ఇజ్రాయేల్ దేశం.

ఈ చిన్న
క్రిష్టియన్ కంట్రీకి 
చుట్టూ ఉన్నది
అత్యాధునికమైన 
మారణాయుధాలు...
ధరించిన శత్రుమూకలే... 
గుంటనక్కలే గుడ్లగూబలే...
కయ్యానికి కాలు దువ్వే
కసితో బుసలు కొట్టే కాలనాగులే...
చుట్టూ ఆకలితో 
అక్కసుతో ఉన్న అరబ్బుదేశాలే....

నిజమే ఇజ్రాయెల్ 
నేడు సింహాల బోనులో
చిక్కుకున్న దానియేలే...అది
కత్తుల బోనులో ఉన్న సింహమే
ఐనా సింహం సింగిల్ గా వస్తుంది 
గొర్రెలు మేకలే గుంపులుగా వస్తాయి

అక్టోబర్ 7న
20 నిమిషాలలో
5000 రాకెట్లు విసిరిన 
తనతోకను త్రొక్కిన...
భూగర్భ సొరంగాలలో నక్కిన...
222 ముంది తన దేశ పౌరులను 
సైనికులనుబంధీలుగా చేసినందుకు.. 

10 లక్షల మంది పాలస్తీనా ప్రజలను 
దక్షిణ దిక్కుకు పంపి గాజాను గాలించి
హమాస్ మిలిటెంట్లను ఏరివేసేందుకు...  
శత్రుమూకల్ని మట్టు పెట్టేంతవరకు... 
"ఆ భూగర్భ సొరంగాలనే అతిపెద్ద
సమాధులుగా" మార్చేంతవరకు...
కునుకు తియ్యనని...వెనుతిరగనని...
ప్రతిన పూనిన దేశం ఇజ్రాయేల్ దేశం...

నాడు అక్కడ ప్రవహించింది పాలు తేనెలు
నేడు ఎక్కడ చూసినా ప్రవహిస్తోంది 
ఏ పాపమెరుగని యుద్దానికర్థం తెలియని 
అమాయకపు ప్రజల రక్తపు టేరులు.......
ఓ దైవమా ! ఈ ముస్కరులు ఈమూఢులు
ఆపేదెప్పుడు భీకరమైన ఈబాంబుదాడులు 

2. పదిమందిని ప్రేమించి చూడు..!

ఓ మిత్రమా..! 
నా ప్రియ నేస్తమా..!! 
కంటికి 
కనిపించే 
అందరిని నీవు
కౌగిలించుకోకున్నా... 
అందరిపై నీవు 
కరుణను కురిపించకున్నా...
నీ హృదయం విప్పి 
స్వచ్చమైన నీ ప్రేమను
ఓ పదిమందికి పంచిచూడు...

నిన్ను ప్రేమించే 
100 మందిలో నీవు 
10 మందిని తిరిగి ప్రేమిస్తే చాలు...

నిన్ను ద్వేషించే 
"ఆ నలుగురి" గురించి 
ఆలోచించే సమయం నీకెక్కడిది..?

రేపు వారే తమ తప్పును 
తాము తెలుసుకుని తిరిగి 
నీకు ప్రాణమిత్రులు కావొచ్చు...

కడవరకు నీకు తోడుండొచ్చు...
కాటివరకు నీకు తోడురావొచ్చు...ఆపై
నీలో ఏ అంతర్గతఘర్షణకు ఏ ఒత్తిడికి 
ఏ ఆందోళనకు ఏ ఆవేదనకు తావుండదు
శత్రువులులేని మరణం ఒక గొప్ప వరమే...

ఇక నీ మనసంతా తరగని ప్రశాంతతే...
నీ బ్రతుకంతా వేకువలా ప్రకాశవంతమే...
ఇది సత్యం ఎవరూ కాదనలేని నగ్న సత్యం.

3. కాలానికి మూడు కళ్ళు...?

కళ్ళకు కనిపించని
కాలచక్రభ్రమణాన్ని... 
ఆగని కడలిలోని
అలల విన్యాసాన్ని 
ఆపడం ఎవరితరం..?
ఆ కడలి...ఆ కాలం...మనిషికి
జీవిత పాఠాలు నేర్పే గురువులు

కాలం 
చేస్తోంది ఇంద్రజాలం... 
ఆడిస్తోంది బొమ్మలాట... 
చేయిస్తుంది ఆకలి వేట...
చూపిస్తుంది బ్రతుకు బాట...  

కాలానికి మూడు కళ్ళు 
నిన్న...నేడు...రేపు...
రేపు అగమ్య గోచరం... 
వర్తమానం ఒక చక్కని వరం...
భవిష్యత్తు ఓ బంగారు ఆభరణం... 

ప్రతి మనిషి ఓ ఆశాజీవి... 
ఆశలు నెరవేరలేదని...
కోరిక కోర్కెలు తీరలేదని...  
నిరాశ నిస్రృహలకు గురికారాదు... 
చీకటి గుహలో చిక్కుకుపోరాదు...
 
కనిపించని ఆ కాలాన్ని ఆ దైవాన్ని 
ఆదుకోని ఆప్తులను నిందించరాదు... 
ఆత్మవిశ్వాసం మనలో ఆవిరి కారాదు...

ఆశ ఒక మధురమైన ఊహ అది
రేపు నిర్మించబోయే ఓ ఇంద్రభవనం... 
చేతికి అందబోయే ఓ అమృతఫలం...
కష్టేఫలి...కాలమే కలల కల్పతరువు... 
కాలమే...మన భవిత భవన నిర్మాత...

4. పక్షి ఇచ్చే పచ్చని సందేశం...? 

అనగనగా 
ఓ పచ్చని వృక్షం 
దాని మీద పకపకమని
నవ్వే ఓ పక్షి కుటుంబం..!

చెట్టు కింద పుట్టలో 
బుసలు కొట్టే బద్ధ 
శత్రువైన ఓ విషసర్పం..!

వేటగాళ్లొచ్చారు 
గండ్రగొడ్డళ్ళకు 
పదును పెడుతున్నారు
పాము పుట్టను చీల్చాలని..!
పచ్చని చెట్టును కూల్చాలని..!
 
ప్రమాదాన్ని
పసిగట్టిన పక్షి
శతృత్వం మరచి
తనకు బద్ధ శత్రువైన 
పామును హెచ్చరించే
తక్షణమే పారిపొమ్మని..!

ప్రతి మనిషికి ఈ పక్షి ఇచ్చే 
పచ్చని సందేశమొక్కటే..!
పగలు ప్రతీకారాలు వద్దని..!
అసూయా ద్వేషాలు అనర్థమని..!

ప్రతి మనిషిగుండెలో
ప్రేమలతలను పెంచాలని..!
శత్రుత్వాన్ని జయించాలని..!
శత్రువులను సైతం ప్రేమించాలని..!

5. రామబాణాలు మూడు..?

మిసైల్ మ్యాన్ 
మాజీ భారత
రాష్ట్రపతి 
అమరజీవి 
అబ్దుల్ కలాం
యువతకు అందించిన 
అద్భుత సందేశమిదే...

ఒంటరిగా చీకటిలో 
కూర్చుని చింతించవద్దని... 
కమ్మని కలలు కనమని...
 
కన్న ఆ కమ్మని కలలన్ని 
సాకారం అయ్యేంతవరకు 
కునుకు తియ్యనే రాదని...

రేపటి విజయాన్ని 
నేడే దర్శించాలని... 
విజయమనే శిలను 
అందమైన సుందరమైన 
శిల్పంగా చెక్కే శిల్పివి నీవేనని...
 
ఆ ఘనవిజయాన్ని 
అందుకోవడానికి 
నీ కళ్ళముందున్నవి 
మూడే మూడేదారులని... 

...నిరంతర శ్రమ... 
...బలమైన కోరిక... 
...పటిష్టమైన ప్రణాళికని... 

6. నిజమైన ధనవంతులు 
    ఎవరు ఈ ధరణిలో...?

ఎత్తైన ఏడంంతస్తుల 
విలాసవంతమైన
పాలరాతితో కట్టిన 
ఇంద్రభవనంలాంటి ఇల్లు... 

ఆ ఇంటిలో అందమైన 
సుందరమైన మెత్తని 
పరిమళించే పూలపాన్పు... 

ఆ ఇంటి ముందర 
అతి ఖరీదైన కారు... 

ధరించే కోటు... 
సూటు...బూటు...
ఇంటినిండా ఆర్జించిన 
లక్షల కోట్ల కరెన్సీకట్టలు... 

దోచుకొని 
స్విస్ బ్యాంక్ లో 
దాచుకున్న ధనం... 

ఇంట్లో ఇనప్పెట్టెలో 
ధగధగ మెరిసే నగలు... 
బంగారు ఆభరణాలు...
పట్టుచీరెలు ఉన్నవారు కాదు...

విదేశాల్లో విమానాల్లో 
విచ్చలవిడిగా 
విహారం చేస్తూ... 
ప్రతి నిత్యం 
విందులు వినోదాలలో
మునిగితేలే వారు కాదు...

జీవితంలో...కష్టపడి 
ఆర్జించిన సొమ్ములో 
కొంత భార్యా బిడ్డలకు...
కొంత అభాగ్యులకు... 
అనాథలకు నిరుపేదలకు...
కొంత దైవికకార్యాలకు పంచి...

సంపూర్ణమైన సంతృప్తితో 
ప్రశాంతంగా...హాయిగా 
ఆనందంగా...సంతోషంగా 
నిశ్చింతగా నిద్రపోయేవారే... 
కాళీ చేతులతో కాటికెళ్ళే వారే... 
నిజమైన ధనవంతులు ఇలలో...
మీరేమంటారు మిత్రులారా..?
ఊ అంటారా..? ఊహూ అంటారా...?

7. చిరునవ్వులు 
    నవ్వే...చిరుతపులులు

చంటి పిల్లల వంటి 
చల్లని మంచి మనసున్న 
పశువుల డాక్టర్ దిశను
అక్కా అంటూ పలకరించి
నక్కల్లా నటించి,నవ్వి,నమ్మించి
చిత్రహింసలకు గురిచేసి చంపిన 
ఆ నీచ,నికృష్ట మనస్తత్వం కలిగిన 
రాక్షసులు ఇంకెంతమంది మనచుట్టు 
ముసుగు కప్పుకొని తిరుగుతున్నారేమో...
జరా జాగ్రత్త.... చెల్లీ...

ఇంటి నుండి బయలు దేరినప్పటినుండి
ఏదో వూహించని అఘాయిత్యానికి పాల్పడే
అపరిచితులు అడుగుడున దాగి వుండవచ్చు

తక్కువ చర్జీతో ఆటో 
ఎక్కించుకు పోయే ఆటోవాడిలో 
మాటిమాటికీ కేబిన్ కి రమమ్మంటూ,
దొంగచూపులు చూసే బాస్ లో...
అడగకపోయినా లిఫ్టు లిస్తూ
తాకాలని చిన్నచిన్న గిఫ్ట్ లు ఇస్తూ 
తాకితే తన్మయత్వం చెందే మిత్రులలో...
ఏదో దురాలోచనతో పార్టీకి, 
పార్క్ కు రమ్మనే బోయ్ ఫ్రెండులో
ఏ అపరిచితుడు దాగివున్నాడో...ఎవరికెరుక ?

అందుకే వీరి బారిన పడకుండా
తప్పించుకోవాలంటే నీకు శక్తినిచ్చే
ఏదో ఒక ఉపాయం
ఏదో ఒకరి స్మరణ
ఏదో ఒక గొప్ప వాక్యం నీకు కావాలి
ఏదో ఒక దేవత నిన్ను ఆవహించాలి
అఖండ శక్తి నీలోకి ప్రవహించాలి
నీవు నిర్భయంగా వుండాలి 
నీవు నిప్పులా మండాలి
నిన్ను తాకిన వారు మాడి,మసైపోవాలి

అందుకే ఓ అమాయకపు చెల్లీ ...
నీవు తప్పుచేయబోయే ఆ బలహీనమైన
క్షణాలనుండి బయటపడాలంటే
నీవు వీరిలో,ఒక్కరినైనా గుర్తు చేసుకోవాలి
నీ అమ్మానాన్నలనో
నీ గురువునో 
ఆ భగవంతుడినో
తప్పు చేయని ఆ సీతమ్మతల్లినో
ఏ బైబిల్, భగవద్గీత, ఖురాన్ లోని 
ఏదైనా ఒక బంగారు వాక్యాన్నో 
గుర్తు చేసుకుంటే చాలు 
పెద్ధగండం నుండి నీవు గట్టెక్కినట్లే, 
లేదంటే 
నీ శీలాన్ని చీల్చే 
చిరుతపులికి నీవు చిక్కీనట్లే...
పైకిక రాలేని కామపు
ఊబిలోకి నీవు జారిపోయినట్లే...

8. జంట కవులు..!!

దానధర్మాలు..!
మాయా మర్మాలు..!! 

పాపపుణ్యాలు..! 
దయాదాక్షిణ్యాలు..!!

కోపతాపాలు..! 
కామ క్రోధాలు..!!
 
మంచి చెడులు..!
పరువు ప్రతిష్టలు..!! 

సుఖదుఃఖాలు..!
చీకటి వెలుగులు..!! 

జేగంట మ్రోగించే
జంట కవులు...!!!

అవి ఒక కంట... 
పవిత్ర గంగాజలాన్ని... 
ప్రోహింపజేస్తాయి..!!

మరో కంట... 
కణకణమండే...
నిప్పు రవ్వల్ని కురిపిస్తాయి..!!

9. నా లక్ష్యం ఒక్కటే..!

పాతాళం నుండి 
పైకి రావడం కాదు..!
ఎవరెస్టు శిఖరమంత
ఎత్తుకు ఎదగడం....!

ఎవరెస్టు శిఖరం 
ఎక్కేవారెందరో..!
కానీ ఆ శిఖరం 
అంచుకు 
చేరేది కొందరే..!
కష్టేఫలి అన్నవారే..!
ప్రయత్నం సగం
విజయమన్నారు...!

ఎందరో
ఎవరెస్ట్ శిఖరాన్ని 
అధిరోహించలేక 
మధ్యలోనే 
మంచుపొరల్లో 
కూరుకుపోతారు..!
కొందరే శిఖరం అంచుకు చేరి   
విజయపతాన్ని ఎగురవేస్తారు..! 
విశ్వవిజేతలుగా కీర్తిని గడిస్తారు..!

వారే
చరిత్రలో చిరంజీవులు..!
వారే మహనీయులు మహాత్ములు..!
వారే సాహసవీరులు మార్గదర్శకులు ..!
ముందుతరాలకు గొప్ప స్ఫూర్తి ప్రదాతలు..! 

10. విజయమా ? వీరస్వర్గమా...?

ఓ మనిషీ..! 
అనంతమైన అఖండమైన 
ఆత్మశక్తి నీలో దాగి ఉందని... 
నీవు అసమర్థుడివి...అజ్ఞానివి...
అవివేకివి...బలహీనుడవు కాదని... 
నీవొక బాహుబలివని...బలశాలివని...
నీ మనోఫలకంపై లిఖించుకో...

నేనేమీ చేయలేను...
నాకేమీ తెలియదన్న...  
"పరమ పిరికిపదాలను"...
నీ నరంలేని నాలుకకు నేర్పకు...
వాటిని కలనైనా ఉచ్చరించకు...

ఓ మనిషీ..! 
నాకు సర్వం తెలుసని...
నేవేదైనా చేయగలనని...
"ఆ పరమాత్మ"... 
నా వాడని...నా నీడని...
నాకు తోడని గట్టిగా నమ్ము... 

జయించడానికే 
నేను జన్మించానని... 
ఓటమి నా శత్రువని... 
దాన్ని ఎదిరించి... 
పోరాడి ఓడించి... 
గెలుపు గుర్రమెక్కాలనుకో... 

11. ఆత్మవిశ్వాసం ఆకాశమంత..!  

ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!

సమస్యల వలయంలో
చిక్కుకొని బిక్కుబిక్కు 
మంటూ భయంతో బ్రతకమాక... 

నీ చిక్కుసమస్య 
నీ కంటే పెద్దది కావొచ్చు 
కానీ ఏ జఠిల సమస్యైనా 
ఆ దైవంకన్న పెద్దదికాదన్న
"ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని" 
నీ గుండెల నిండుగా నేడే నింపుకో... 

ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
విజయమో...
వీరస్వర్గమమో...
నీ "నిత్య నినాదం"...కావాలి 

పాతాళంనుండి 
పైకి రావడానికి కాదు... 
ఎవరెస్టు శిఖరమంత 
ఎత్తుకు ఎదగడం...
నీ "ఆఖరి ఆశయం"...కావాలి 

విజయం...
నీ కీర్తి కిరీటమైతే...
దాన్ని ధరించడం... 
నీ "అంతిమలక్ష్యం"...కావాలి 

12. శంభో శంకర కుక్క తోక వంకర..?

ఆకాశంలో 
ఎగిరే "రాబందు"...
దృష్టి చచ్చిన శవాలపైనే...

బంగారు సింహాసనంపై
ఎక్కి" కుక్క"... కూర్చున్నా
చూపు ఎంగిలి విస్తరిపైనే...

పన్నీటితో "పందికి"...
స్నానం చేయించినా తన సరదా
తీరేది తిరిగి బురదలో దొర్లితేనే...

కట్టుకున్న భార్య
అతిలోక సుందరియైనా
కళ్ళు పొరలు కమ్మిన
కామాంధుడికి అందరూ
అప్సరసలే రంభా ఊర్వశి మేనకలే...

రుచి మరిగిన పులి
జింకలవెంట పడినట్లు...
దారితప్పిన భార్యకు
కట్టుకున్న తన భర్త తప్ప 
తనను పొగిడే పోకిరోళ్ళందరూ హీరోలే... 

13. ఎందుకని...ఏమో...?

పక్షులకూ 
పిల్లలుంటాయి 
కాని ఏ పక్షి పాలివ్వదు
ఎందుకని... ఏమో...

జంతువులకు 
కొమ్ములు వుంటాయి
కుక్క జంతువే 
కాని కొమ్ములుండవు
ఎందుకని... ఏమో...

పక్షులకు 
తోకలుంటాయి
ఈకలుంటాయి 
నెమలి ఈకలే
అందమైనవి 
అతిసుందరమైనవి
ఎందుకని... ఏమో...

కోడి రెండు రెక్కల పక్షి
కానీ పావురంలా కొంగలా
ఆకాశంలో విహరించలేదు
ఎందుకని... ఏమో...

గుర్రాలు జింకలు
శరవేగంగా పరుగులు
తీసే జంతువులు
పామూ జంతువే
కానీ పాదాలు లేకున్న
బుసలు కొడుతూ పొదల్లో
శరవేగంగా పరుగులు తీస్తుంది
ఎందుకని...ఏమో...ఎవరికెరుక..?
సృష్టించిన ఆ పరమాత్మకు తప్ప...
అందుకే...ఓ దైవమా...!
ఈ ధర్మసందేహాలు తీర్చుమా..!

14. స్వార్థమే జీవిత పరమార్థమా..?

కష్టం వస్తే అది నీదే 
నీవే అనుభవించాలి 
కష్టానికి ప్రతిఫలం 
కన్నీరైతే అవి నీవే త్రాగాలి... 

కానీ నీ శ్రమకు ప్రతిఫలం
అంబరాన్ని తాకే సంబరమైతే 
ఆ సంతోషామృతాన్ని 
అందరం సమిష్టిగా పంచుకోవాలి 
ఆనందంతో గంతులు వేయాలి 
తన్మయత్వంతో నృత్యం చేయాలి
ఇదే స్వార్ధం...ఇదే స్వార్ధం...
ఇది కారాదు నీ జీవిత పరమార్థం...

ఔను
ఆపదలో 
ఆదుకున్నోడే...
ఆపద్బాంధవుడు...
దయార్ద్రహృదయుడు... 
దానకర్ణుడు దైవస్వరూపుడు...
 
అత్యవసరం పీక పిసికే వేళ 
ఎదకు హత్తుకున్నోడే"మనోడు" 
దూరంగ ఉన్నోడు "దుష్టుడే"

ఎదుటివారు ఇరుగుపొరుగువారు 
ఊపిరాడని ఇబ్బందుల్లో ఉంటే 
చేయగలిగి సహాయం చేయనివాడు  
కొంచమైనా కనికరం జాలిలేని కసాయి
పాపాత్ముడు...పాశాణహృదయుడు
ఆ పరమాత్మకు...వాడు పరమ శత్రువు

15. ఎక్కడుంది...ఆరోగ్యం ?

ఎక్కడుంది...ఆరోగ్యం ?
అనుభవగ్నులైన డాక్టర్లు 
వ్రాసే మందుల్లో...
కార్పోరేట్ హాస్పిటల్లో 
చేసే ఆపరేషన్లలో...
...ఇదే నా ధృఢనమ్మకం...
ఓ పేషెంట్...అంతరంగ ఆవిష్కరణ 

ఎక్కడుంది...ఆరోగ్యం?
పచ్చని ప్రకృతిలో...
పంచభూతాలలో...
స్వచ్ఛమైన పర్యావరణంలో... 
...ఇదే నా ధృఢనమ్మకం...
ఓ ప్రకృతి 
ఆరాధకుడి...అంతరంగ ఆవిష్కరణ

ఎక్కడుంది...ఆరోగ్యం?
నిత్యం మనం
గుళ్ళు గోపురాల్లో
ఆ పరమాత్మ స్వరూపాలైన
విగ్రహాలకు భక్తి శ్రద్ధలతో 
పాలతో ఫలపుష్పాదులతో చేసే
అర్చన ఆరాధన అభిషేకాలలో...
...ఇదే నా ధృఢనమ్మకం...
ఓ ఆస్తికుని...అంతరంగ ఆవిష్కరణ

ఎక్కడుంది...ఆరోగ్యం?
ప్రశాంతమైన చిత్తంలో...
ప్రేమించే హృదయంలో...
అమృతం కురిసే ఆత్మలో...
...ఇదే నా ధృఢనమ్మకం...
ఓ యోగ గురువు...అంతరంగ ఆవిష్కరణ

16. ఖాళీ వలలు...కరిగిన కలలు...

చెరువులో దిగి 
స్వేదం చిందించి
పట్టుకొచ్చిన రొయ్యల్ని 
తిరిగి నీళ్ళలోకి విసిరేశారు
చెరువు యజమాని జాలితో 

గట్టున పడి 
గిలగిల కొట్టుకోవలసిన ‌
కుండలో కమ్మని కూరగా 
మారవలసిన రొయ్యలు 
జాతకాలు మారి చెరువుకు చేరి
స్వేచ్ఛగా తిరుగుతున్నాయి
మీసాలు మెలిపెడుతున్నాయి

నేడు విలవిల లాడుతుంది
విషాదంలో మునిగింది
ఆకలితో నకనకలాడుతుంది
ఖాళీ వలలు చూసుకుని...
కరిగిన కలలు తలచుకొని...
కన్నీళ్లతో తిరిగొచ్చిన మత్స్య కారులే...

17. తిరుగులేని నాలుగు తీర్పులు..?

ఈ జీవితంలో  
నలుగురు ప్రధాన 
న్యాయమూర్తులు 
మనకు తారసపడతారు
వారు తిరుగులేని తీర్పునిస్తారు 

"కాలమనే"...
"ప్రధాన న్యాయమూర్తి" 
ఇచ్చే మొదటి తీర్పు... 
"ఈ జీవితంలో 
"ఎవరిని‌ మనం కలవాలని"...

"హృదయమనే" 
"ప్రధాన న్యాయమూర్తి"
ఇచ్చే రెండవ తీర్పు.... 
"ఈ జీవితంలో  "
"ఎవరు మనకు కావాలని" ... 

"ప్రవర్తననే 
ప్రధాన న్యాయమూర్తి"
ఇచ్చే మూడవ తీర్పు... 
ఈ జీవితంలో  
" ఎవరు మనతో 
"కలిసి కడదాకా ఉంటారని"...

"దైవమనే"
"ప్రధాన న్యాయమూర్తి"...
ఇచ్చే తుది తీర్పు...ఒక్కటే
ఈ భౌతిక ప్రపంచంలో " 
"ఈ నేల మీద మనల్ని 
"ఎంతకాలం ఉంచాలని"...
"ఎవరితో మనబంధాలను త్రెంచాలని"

18. కలలో...తలలో...చేతిలో...??? 

ఓ ప్రియమిత్రమా !
గతం గతః అనుకో...
భవిష్యత్తు భారమనుకో...
వర్తమానం వరమనుకో....

రాని...కానరాని  
వస్తాయన్న గ్యారెంటీ 
లేని వాటి గురించి 
నిరీక్షించడమెందుకు..? 
నిట్టూర్పులు ఎందుకు...?
నిరాశ చెందడమెందుకు..?

గతం...నీ "తలలో " ఉంది
భవిష్యత్తు...నీ "కలలో " ఉంది 
వర్తమానం....నీ "చేతిలో " ఉంది
నీ కళ్ళముందే నీ కాళ్ళముందే ఉంది

అందుకే ఓ మిత్రమా ! 
అందిన ఆ అపురూపమైన అవకాశాన్ని...
పొందిన ఈ 24 గంటల సమయాన్ని...
సత్సంకల్పంతో క్రమశిక్షణతో
శ్రద్ధగా సద్వినియోగం చేసుకో... 
ఓటమి నీకు బానిసౌతుంది...
విజయం నీకు విందౌతుంది...

19. నవ్వుల నదిలో...పువ్వుల పడవ..?

జీవితంలోని
సుఖదుఃఖాలకు
సుడిగుండాలకు
మూలకారణం 
నీ అడుగులే...

నీ అడుగుల 
ఆకలి తీరేదెప్పుడు..?
నీ ఆలోచనల 
ఆక్రందనలు ఆగేదెప్పుడు..?

నీ ఆశల 
ఆవేశం ఆరేదెప్పుడు..?
నీ జీవితం
నవ్వుల నదిలో పువ్వుల 
పడవలా మారేదెప్పుడు..?

20. సంస్కరించాలి...సత్కరించాలి...!!

ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
మనం 
తినేటప్పుడు...
తృప్తిగా తినాలి..! 

వినేటప్పుడు... 
వినయంతో వినాలి..!
మాట్లాడేటప్పుడు... 
మర్యాదగా మాట్లాడాలి..!

చెప్పేటప్పుడు... 
సంస్కారంతో చెప్పాలి..!
అడిగేటప్పుడు... 
ఆప్యాయతగా అడగాలి..!

మనం సమతావాదులను... 
కలిసినప్పుడు...ప్రేమతో 
...పలకరించాలి..!
హృదయానికి హత్తుకోవాలి..!
నవ్వుతూ చేతులు జోడించి 
...నమస్కరించాలి..!

సహృదయులందరినీ...
సద్భుద్దితో...
సంస్కారంతో...   
సద్భావనలతో... 
 
సత్సంకల్పంతో...
సమయస్ఫూర్తితో... 
సకల సద్గుణాలతో... 

సహనంతో...
సమానత్వంతో...
సౌబ్రాతృత్వంతో...
...సంస్కరించాలి..!

సంఘ సంస్కర్తలను...
మేళతాళాలతో....
పూలహారాలతో... 
ఉత్సవాలతో... 
ఊరేగింపులతో...
ఘనంగా...గర్వంగా...
సగౌరవంగా...సత్కరించాలి..!

21. తప్పెవరిది..?
      విసిరిన కలానిదా..!
      చిరిగిన కాగితానిదా..!

తప్పులు 
చేసేది మనమే...
తప్పులు 
వ్రాసేది మనమే...

కానీ
పిచ్చి కోపంతో 
రెచ్చి పోతాం...
జుట్టుపీక్కుంటాం...

చేతిలో కాగితాన్ని 
ముక్కలు ముక్కలుగా
చించివేస్తాం...
కసిగా కలాన్ని 
నేలకేసి కొడతాం...
దూరంగా విసిరేస్తాం...

ఇదేమి వింతో కదా 
"తప్పు ఒకరిది... 
"శిక్ష మరొకరికి.... 
తిట్టేది...నాలుక 
పగిలేది...దౌడ
ఊడేది...పళ్ళు 
మోత మోగేది వీపు...

ఔను అసలు 
తప్పెవరిది...?
విసిరిన కలానిదా కాదే..!
చిరిగిన కాగితానిదా కాదే..!
నీ బుర్రది నీ బుద్ధిది..!
ఆ బుర్రలో ఆ బుద్ధిలో 
జ్వాలలా చెలరేగిన 
నీ గజిబిజి భావనలది..!
 
అవును కనిపించే 
చీమైనా...దోమనైనా
కొట్టగలం...తిట్టగలం..!
కానీ "కనిపించని దాన్ని 
దేనినీ మనం శాసించలేం"..!

అది 
వీచే వాయువైనా..!
విద్యుత్ తరంగమైనా..!
విధియైనా ఆ విధాతయైనా..!
కడకు కనిపించని ఆ మృత్యువైనా..!!

22. నా ఓటు ఎవరికంటే...?

నా ఓటు 
...త్యాగధనులకే...
నా ఓటు 
...నీతిమంతులకే...
నా ఓటు 
...నిస్వార్థపరులకే... 
నా ఓటు 
...ప్రేమమూర్తులకే...
నా ఓటు 
...ప్రజాప్రతినిధులకే...
అని నేడు నేను 
ప్రమాణం చేస్తున్నా...
అంబేద్కర్ అందించిన 
నా ఈ ఓటు...
"ఒక వజ్రాయుధమని" 
నేను నమ్ముతున్నా....

నేను 
ఏ బీరుకో...
ఏ బిర్యానీకో... 
ఏ ఉచితాలకో...
ఏ పచ్చనోటుకో...
ఆశపడి నా ఈ
"విలువైన ఓటును"
ఎవరికీ అమ్ముకోనని... 
రేపు నా వ్రేలిమీద వేసే 
ఒకే ఒక్క సిరాచుక్క మీద
ప్రమాణం చేసి చెబుతున్నా...

23. వద్దు వద్దు...
      ఉచితాలు వద్దు... 
      సుపరిపాలనే ముద్దు... 

ఉచితాలకిఆశపడితే 
ఉచ్చులో చిక్కుకున్నట్లే..!

ఉచితాలకు ఆశపడితే
ఊబిలోకి జారిపోయినట్లే..!

ఉచితాలంటూ
ఊకదంపుడు
ఉపన్యాసాలు విని మెడకు 
ఉరిత్రాళ్ళు బిగించుకోకండి..!

ఉచితాలన్నవి
ఉరుములు మెరుపులే
కరుణలేని కారుమేఘాలే..!

నేడు ఉచిత బస్సు 
రెపు తుస్సు బుస్సు.!

నేడు 5000 పెన్షన్
రేపు వస్తుందో రాదో టెన్షన్..!

నేడు ఉచిత గ్యాస్ బండ
రేపు మననెత్తిన గుదిబండ..!

నేడు ఉచిత కరెంట్ ఒక చీటింగ్ 
రేపు పన్నుల్తో మనజేబుల్ కటింగ్..!

అందుకే వద్దు వద్దు...మాకు 
ఉచితాలు వద్దు...సుపరిపాలనే ముద్దు..!

24. కాపురం లో కారుచిచ్చు రేగితే...?

కనులున్నాక...కలలు తప్పవని...
కడలి అన్నాక...అలలు తప్పవని...
కాపురమన్నాక...కలతలు తప్పవని...
కన్నీళ్లు కలహాలులేని కాపురాలే లేవని... 

"లాగు లాగు తెగేదాకా వేస్తే ఆగు"
అన్న "సంసారసూత్రాన్ని" ప్రతినిత్యం 
ఇద్దరూ గాయత్రిమంత్రంలా జపించాలని... 
 
ముఖాముఖి చర్చలే
మనస్పర్థలకు... మందులు...
ఆ లౌక్యం ఎరుగని
ఆలూమగలిద్దరూ అంధులు ...
అన్న "జీవన సత్యాన్ని" గ్రహించాలని...

వివాదం ముదిరి విడిపోతే విషాదమని...
ఇద్దరు కలిసి ఉంటేనే  కలదు సుఖమని...
సఖ్యత ఉన్న సంసారమే ఒక స్వర్గసీమని...
జగడాలులేని జంటలే అందరికీ ఆదర్శమని

తక్షణమే దంపతులిద్దరూ తెలుసుకోవాలి...
కలిసి కలకాలం బ్రతకాలి నూరేళ్లు వర్ధిల్లాలి.

25. సంసారంలో సఖ్యత...

కుటుంబమనే బండికి
భార్యా భర్తలిద్దరు 
రెండుచక్రాలని...
సంసారం ఒక సాగరమని...
సంసారంలో సఖ్యత ఐక్యత 
సర్దుబాటుగుణం ముఖ్యమని...

భార్యా భర్తలిద్దరూ
ఒకరిపై మరొకరు అంతులేని...
ప్రేమానురాగాల్ని...ఆప్యాయతల్ని...
కుంభవర్షంలా కురిపించుకోవాలని...
పాలూ నీళ్ళలా కలిసిపోయి 
చిలకా గోరింకల్లా ఉండాలే...గాని
పిల్లిఎలుకల్లా చీటికి మాటికి 
చిన్నవిషయాలకు గొడవపడరాదని"...

మనసు కళుక్కుమనేలా... 
"కత్తులతో పొడిచినట్లుగా... 
"సూదులతో గ్రుచ్చినట్లుగా... 
"పుండుమీద కారం చల్లినట్లుగా... 
విచ్చుకత్తుల్లా గ్రుచ్చుకునే ఎత్తిపొడుపు... 
మాటలబాకులేవీ విసురుకోరాదని... 
విడాకులు తీసుకుందాం విడిపోదామంటూ
పదేపదే...అదేపనిగా...అనరాదని.... 

ఇక కలిసి ఉండలేమని... 
కాపురం చెయ్యలేమని...
అతకని మనసులతో చితికిన...ఈ
అతుకుల గతుకుల బ్రతుకుబండిని...
ఇక లాగలేమని చతికిలపడిపోరాదని...

ఇద్దరి మధ్య అదృశ్యంగా 
అడ్డుగోడలు నిర్మించుకోరాదని...
పెంచుకున్న బంధాలన్నీ త్రెంచుకోరాదని...
కలతలు కలహాలు లేని కాపురం లేదని 
భార్యా భర్తలు దేన్నీతెగేదాకా లాగరాదని
ముఖాముఖి చర్చలే మనస్పర్థలకు...
మందులని...ఆ లౌక్యం ఎరుగని
ఆలూ మగలిద్దరూ అంధులేనని...

ఐతే...
వివాదం ముదిరి... 
విడిపోతే విషాదమని...
కలిసి ఉంటేనే ఇద్దరు కలదు సుఖమని...
సఖ్యత ఉన్న సంసారమే ఒక స్వర్గసీమని...
జగడాలులేని జంటలే అందరికీ ఆదర్శమని
దంపతులిద్దరు ఈసత్యం తెలుసుకోవాలని.

26. ఓటరు దేవుళ్ళారా..! 
      మీకు వందనం పాదాభివందనం..!!

ఓటర్లంటే...
బిక్షగాళ్లు కాదని... 
నేతల తలరాతలు 
వ్రాసే బ్రహ్మదేవుళ్ళని...

ఓటర్లంటే...
అవసరమైతే 
అందలమెఎక్కిస్తారని... 
మోసం చేసే దోచుకునే దొంగల్ని 
అధఃపాతాళానికి అణగద్రొక్కుతారని... 

ఓటర్లంటే...
నిస్వార్థంతో... 
నిత్యం ప్రజాసేవలో... 
నిమగ్నమయ్యే వారిని  
ప్రత్యక్ష దైవాలుగా ఆరాధిస్తారని...

ఐదేళ్ళకోసారి దర్శనమిచ్చే..‌.
వాగ్దానాల వర్షం కురిపించే...
ప్రజాసమస్యలు పట్టించుకోని 
బడానాయకుల భారతం పడతారని...

ఓటర్లంటే... 
అమాయకులు కాదని... 
తలలు పండిన నాయకుల్ని 
సైతం మట్టి కరిపించే మాంత్రికులని...

ఓట్లకోసం...
భారీ మెజారిటీకోసం...
ప్రత్యర్ధి పై గెలుపు కోసం...
ఎన్నో కలలుకంటూ ఎన్నికల బరిలో 
దిగిన అభ్యర్థులందరికి...అర్థం కావాలి...! 
అర్థమైంది..అందుకే ఓటరు దేవుళ్ళారా..! 
మీకు వందనాలు..! పాదాభివందనాలు..!

27. పురుషుడిగా పుట్టి లాభమేమి?

పురుషుడిగా
పుణ్య భూమిలో 
పుట్టి లాభమేమి 
పురుగుల 
జీవించరాదు 

చెదపురుగులా
చీడపురుగులా
పేడ పురుగులా 
జీవించరాదు 
పుణ్య కార్యాలను 
తలపెట్టాలి

పురోభివృద్ధికి 
పునాది కావాలి 
పువ్వుల పడవ 
కావాలి నీ జీవితం
పూరిగుడిసెలో 
పుట్టిననేమి నీవు 
పులిలా గర్జించాలి 
పులిలా బ్రతకాలి 
సింహంలా 
స్వేచ్ఛగా విహరించాలి
ఏనుగులా ఎదురు తిరగాలి 
రేకెట్ లా నింగిలోకి ఎగరాలి  
రామబాణంలా దూసుకుపోవాలి

28. నీ నిర్ణయాలకు 
       నీవేకదా నిర్మాత..?

నీ ఆలోచనలకు 
ప్రతిబింబం 
నీ ఆచరణ... 

నీ ఆచరణకు
ప్రతిరూపం 
నీ కార్యసాధన... 
నీ ప్రణాళికలు... 
నీ ప్రయత్నం... 
నీ ప్రతిఫలం... 

నీ పరిస్థితులకు 
నీవే బానిస...

నీ నిర్ణయాలకు
నీవే నిర్మాత...

నీ సమస్యలకు 
నీవే సృష్టి కర్త ...

ఎవరో ఉన్నారని
ఎందుకు వెతుకుతావు..?
ఎందుకు 
అందరినీ నిందిస్తారు..?
అద్దం ముందు 
నిల్చో నీకె అర్థమైపోతోంది..! 

29. ప్రేమాభిషేకం... 
    ‌‌  వెనుకే కనకాభిషేకం... 

ఆహా ..! 
ఈ ఉదయం
ఎంతటి
ఆహ్లాదకరం... 
ఆనందకరం... 
ఆరోగ్యకరం...
ఉదయమంటేనే...
...ఉషస్సు...

తొంగి చూస్తే 
రవికిరణం 
తొలగును 
...తమస్సు... 

ప్రేమించే 
హృదయం 
ఉంటేనే నీకు 
...యశస్సు...

సంపూర్ణ 
ఆరోగ్యమున్న 
పెరుగును నీ
...ఆయుష్షు...

ఇలాగే 
నీ హృదయం...
ఐతే 
...ప్రేమమయం...
ఆ బ్రతుకెంతో
...వెన్నెలమయం... 

ఎలాగూ 
సంధ్య వేళలో 
...చిమ్మచీకటి... 
కమ్ముకుంటుంది...
పడమటి దిక్కుకు
...సూర్యబింబం...
వాలిపోతుంది 

ఎలాగూ 
ఓ చీకటిరోజు 
నీ ముఖాన్ని  
...మృత్యువు... 
ముద్దాడుతుంది...

అప్పటివరకు 
కులమత భేదం లేక
కురిపిస్తే నీతోటి వారిపై
...ప్రేమాభిషేకం...  
కాదా నీ బ్రతుకంతా 
...కనకాభిషేకం... 

30. వరల్డ్ క్రికెట్ మ్యాచ్ 
       ఒక గొప్ప గుణపాఠం...?

ఆదివారం జరిగిన
క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో 
టాస్ గెలిచి ఆస్ట్రేలియా
బౌలింగ్ ఫీల్డింగ్ ఎంచుకోగానే...
కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ కాగానే...
ఫైనల్లో 240 స్కోరు కొట్టగానే...

విధివెక్కిరించి"స్వప్నం"చెదిరిపోయే...
ఓటమి ఒడిలోకి భారత్ జారిపోయే...
"ఆడక ముందే" 
ఆస్ట్రేలియాకు కప్పు ఖాయమాయే....

ఐనా నిరాశ ఏల?నిట్టూర్పు ఏల..?
కనులున్నాక..."కలలు" తప్పవు...
కాపురమన్నాక..."కలతలు" తప్పవు...
పోటీ అన్నాక "గెలుపు ఓటమి"తప్పదు... 

"Failures are Stepping 
Stones for Success" 
అని సరిపెట్టుకోక తప్పదు... 

ఆరోసారి 13వ ప్రపంచ కప్ 
విజేతగా నిలిచే అదృష్టం 
దక్కింది...ఆస్ట్రేలియాకే... 

ఊహించని ఎదురుదెబ్బ
తగిలింది...టీమిండియాకే...
మిగిలింది...దురదృష్టం దుఃఖం
140 కోట్లమంది భారతీయులకే...

ఈ మ్యాచ్ రేపు పోటీకి సిద్దమయ్యే 
ప్రతి ఆటగాడికి "ఒక గొప్ప గుణపాఠమే"...

31. బాధ...భారతీయులకు..!
      ఆనందం...ఆస్ట్రేలియాకు..!

అనుకున్న దొక్కటి...
అయ్యిందింకొక్కటి...
బోల్తా కొట్టందిలే...
బుల్ బుల్ పిట్ట...అన్నట్టు...

లక్షా 32 వేలమంది 
క్రీడాభిమానులతో కిక్కిరిసిన 
ప్రపంచంలోనే అతి పెద్దదైన
మోడీ క్రికెట్ స్టేడియంలో...
ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో...

కెప్టెన్ రోహిత్ శర్మ
టీమిండియా జట్టుపై
ఎన్నో ఆశలు పెట్టుకొని
2013 ఫైనల్లో మనల్ని ఓడించి
ప్రపంచకప్ ను కైవశం చేసుకున్న 
"ప్రమాదకరమైన మన ప్రత్యర్థి"
ఆస్ట్రేలియాను దిమ్మతిరిగే
బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లతో
భారీస్కోర్ చేసి మట్టికరిపించి...

2023 ఫైనల్లో 16 కోట్ల
ప్రైజ్ మనీతో ఇంటికి పంపి
ప్రతీకారం తీర్చుకోవాలని...
33 కోట్ల ప్రైజ్ మనీ కోసం
భారీ అంచనాలతో...
బరిలోకి దిగిన భారత్ జట్టు

ఫైనల్లో 240 పరుగుల స్కోర్ చేసి
నాడు గంగూలీ సేనలా నేడు
రోహిత్ సేన ఓటమికి గురికాగా
కోటి ఆశలతో టీవీ సెట్లకు
అతుక్కుపోయిన 140 కోట్లమంది 
భారతీయుల "కప్పుకల" చెదిరింది...
అంతులేని ఆవేదనే అందరికి మిగిలింది...

విశ్వకిరీటం...
విజయ సింహాసనం...
13 వ ప్రపంచ క్రికెట్ కప్‌...
ఆరోసారి ఆస్ట్రేలియాకే...దక్కింది
మన ప్రధాని మోడీ చేతులమీదుగా...

ఓడిపోకూడదన్న వ్యక్తిత్వం...
చివరిదాకా పోరాడాలన్న మనస్తత్వం...
ఉన్నవాళ్ళే కదా అవనిలో "విశ్వవిజేతలు"...

ఔను కడకు ఆనందం...ఆస్ట్రేలియాకు..!
దురదృష్టం దుఃఖం....భారతీయులకు..!

32. ఎంతకాలం..? ఎంతకాలం..? 

మీకు ఇష్టమైన... 
వస్తువులను వ్యక్తులను 
అందమైన దృశ్యాలను 
సుందరమైన ప్రదేశాలను 
కనులారా...చూడగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యమే..!

మీకు ఇష్టమైన... 
రుచికరమైన పదార్థాలను 
తృప్తిగా...తినగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యమే..!

మీకు ఇష్టమైన... 
పవిత్రమైన బృహత్ గ్రంథాలను 
విలువైన పుస్తకాలను 
ఏకాగ్రతతో...చదవగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యమే..!

నీకు ఇష్టమైన... 
రేడియోలో టీవీలలో 
వినిపించే మధురమైన 
సంగీతాన్ని...వినగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యం..!

నీకు ఇష్టమైన... 
పుణ్యక్షేత్రాలను 
గుళ్ళు గోపురాలను 
పురాతన దేవాలయాలను 
మందిరాలను చూడాలని 
కాలినడకన మైళ్ళుమైళ్ళు
...నడవగలిగినంతకాలం
ఎన్నో వందల ఎత్తైన మెట్లు
...ఎక్కగలిగినంతకాలం
గర్భగుడిలోని ఆ దైవాన్ని ...
...దర్శించుకోగలిగినంత కాలం 
మీ జీవితం ధన్యమే...
అది అదృష్టమే...అది ఒక వరమే..!

మీకీ శక్తిసామర్థ్యాలను 
ప్రసాదించువాడు మాత్రం 
నిత్యం మీరు "భక్తిశ్రద్ధలతో  
ఆరాధించే ఆ భగవంతుడే" సుమా..!

33. వ్యక్తి రూపం...శక్తి శాపం...?

కొందరు 
ఎంత మంచి పని చేసినా
ఎన్ని మంచిమాటలు చెప్పినా
ఆ మంచిలోనే ఏదో చెడు ఉందని 
ఊహిస్తారు కాగడా పట్టి వెదుకుతారు

కొందర్ని నీతిగా 
నిజాయితీగా ఉండమని
నిప్పులా బ్రతకమని 
నిజాలు చెబుతూ వుంటే 
మీపైనే నిందలు వేస్తారు 
మిమ్మల్ని నీచంగా హీనంగా చూస్తారు 

కొందరు కిటికీలో నుండి 
గుభాళించే గులాబీ పూలనుచూస్తే 
కొందరు గులాబీ ముళ్ళను చూస్తారు 
కొందరు కిటికీలో నుండి 
కొలనులో విరిసిన కమలాన్ని చూస్తే 
కొందరు ఆ కమలం 
కిందున్న బురదను చూస్తారు 

కొందరు చూసి 
రమ్మంటే కాల్చి వస్తారు 
కొందరు ఎదుటివారిలో 
ఎప్పుడూ ఏవేవో తప్పులు 
భూతద్దాలతో వెదుకుతూ ఉంటారు
పచ్చకామెర్ల రోగికి 
ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుంది
నిజానికి ఇదే ఆవ్యక్తుల నిజ స్వరూపం
ఇదే ఆ వ్యక్తులకు ఏదో శక్తి పెట్టిన శాపం
ఇది వ్యక్తుల్లోలోపం కాదు దృష్టిలోలోపం 

34. నా సూక్తులు...నా సుభాషితాలు... 

"సకల 
"జనులకు 
"సుఖాలను 
"శుభాల నొసగే
"నా సుందర 
"సుభాషితాలు...

"సూర్యకిరణాలు ...
"సుప్రభాతాలు...
"నిత్య సత్యాలు...
"అభ్యుదయ భావాల 
"ఆణిముత్యాలు...

అందరినీ అలరించే... 
కనువిప్పు కలిగించే...
హృదయాలను కరిగించే...
నా సుభాషితాలు...
"నిండు కుండలు...
"నీతికి నిధులు...
"నిప్పురవ్వలు...
"చీకటిలో చిరుదివ్వెలు...

కత్తికన్నా పదునైన...
తేనెకన్నా తియ్యనైన... 
మంచుకన్నా చల్లనైన... 
నా సుభాషితాలు 
"నిజాలకు నిచ్చెనలు...
"నీడనిచ్చే పచ్చని వృక్షాలు...
"వీనులకు విందు...
"మొండి వ్యాధులకు మందు...

35. నేటి మొగ్గలే...రేపటి పువ్వులు

నేటి మొగ్గలే 
రేపు పరిమళించే పువ్వులు 
నేటి మొక్కలే 
రేపటి పచ్చని వృక్షాలు 

నేటి కన్యలే
రేపటి మాతృమూర్తులు
నేటి కూతుర్లే రేపటి కోడళ్ళు  
నేటి కోడళ్ళే రేపటి అత్తలు
నేటి విద్యార్థులే 
రేపటి భావిభారత పౌరులు 

నేడు కలం పట్టి 
కవితలు వ్రాసిన 
ఔత్సాహిక కవివర్యులే...
రేపటి రచయితలు 
గొప్ప సాహితీ శిఖరాలు 

నేడు కాలినడకన 
తిరిగిన వారే...రేపు సైకిల్ కొంటారు 
నేడు సైకిల్ మీద తిరిగినవారే... 
రేపు బైక్ పై తిరుగుతారు ఆపై కారులో 
ఆపై విదేశాల్లో విమానాల్లో విహరిస్తారు

నేడు పొలంలో కూలోడే...
రేపు ఆ పొలానికి యజమాని 
నేడు పొలంలో 
ఎద్దులతో సేద్యం చేసినోడే...
రేపు ట్రాక్టర్లతో సేద్యం చేస్తాడు 

ఇది కదా అభివృద్ధి అంటే...
ఇది కదా వ్యక్తిత్వ వికాసమంటే...
ఇది కదా కథ కంచికి చేరడమంటే...
ఇది కదా పూర్వజన్మ పుణ్యఫలమంటే...
ఇది కదా భగవంతుని వరప్రసాదమంటే...
ఇది కదా మనిషి మనీషిగా మారడమంటే...  
ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరడమంటే.

36. ఆరు వరాలు పొందాలంటే..?

ఆస్తి...
అందం... 
అధికారం... 
ఉన్నవారు...

ఆడే ప్రతి ఆటలో... 
పాడే ప్రతి పాటలో ... 
చెప్పే ప్రతి మాటలో... 
వేసే ప్రతి అడుగులో...
చూసే ప్రతి చూపులో...
చేసే ప్రతి వాగ్దానంలో...
తీసుకునే ప్రతి నిర్ణయంలో...
"అహంకారం"...
అణువణువునా...
తొణికిసలాడుతుందట...! 

ఆస్తి... 
అందం... 
అధికారం...
అహంకారమున్న వారిలో 
"ఆనందం" ఆవగింజంతేనట..!

కానీ "ఆనందంగా" ఉన్నవారు 
అందంగా ఆరోగ్యంగా ఉంటారట 
వారికి ఆయుష్షు కూడా ఓ వరమేనట 
పిల్లాపాపలతో నిండునూరేళ్లు వర్ధిల్లెదరట 

అందుకే ఆస్తి...అందం...అధికారం... 
ఆనందం...ఆరోగ్యం...ఆయుష్షను... 
"ఆరు వరాలు"పొందాలంటే మనిషి 
మనిషిలో మానవత్వం వికసించాలట..! 
మనిషి గుండెల్లో ప్రేమ పొంగిపొర్లాలట..!
దైవత్వం అణువణువున ఆవహించాలట..!  
నరుడే నారాయణుడిగా అవతరించాలట..!

37. మహాకవి మన కాలేజీ...

తెలంగాణ ప్రజా
ఉద్యమ స్ఫూర్తికి 
ప్రతిరూపం...మన కాళోజీ...  
ముక్కుసూటిగా జీవించి
కవిత్వం రాసిన 
కవీశ్వరుడు...మన కాళోజీ...  

నిజాం నిరంకుశ పాలనపై 
కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి
స్వాతంత్య్ర సమరయోధుడు 
పద్మ విభూషణుడు...మన కాళోజీ

ప్రజా ఉద్యమ ప్రతిధ్వని 
తెలంగాణ తొలి పొద్దు...మన కాళోజీ.

అన్యాయాన్నెదిరిస్తే 
నా గొడవకు సంతృప్తి...
అన్యాయం అంతరిస్తే 
నా గొడవకు ముక్తిప్రాప్తి... 
అన్యాయాన్నెదిరించిన 
వాడే నాకు ఆరాధ్యుడు...
అంటూ ఉద్యమమే 
ఊపిరిగా జీవించిన 
ప్రజాకవి...మన కాళోజీ 

ఎక్కడో కర్ణాటకలో పుట్టిన...
తెలంగాణ మట్టిలో పెరిగిన...
రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ 
శ్రీనివాసరాం రాజా కాళోజీ...
సాహితీ సూర్యుడై చేసిన 
తెలంగాణ విమోచనోద్యమాలను
మనం నిత్యం స్మరించుకోవాలి
 
యువతకు వారు స్పూర్తి ప్రదాత
అందుకే యువశక్తి 
వారి అడుగు జాడల్లా నడవాలి 
వారి ఆశయాలకు అంకితం కావాలి
అదే ఆ ప్రజాకవికి మనమిచ్చే 
నిజమైన ఘనమైన నివాళి.... 

38. బిక్ష కాదది బిడ్డగా మీ భాధ్యత..!

బిడ్డలారా..! 
ఒక్క విషయం మీరు
కలనైనా మరువకండి..!
మీ అమ్మానాన్నలను
వృద్దాశ్రమాలలో చేర్చకండి..!
వారి జీవిత సంధ్యా సమయంలో
అక్కున చేర్చుకోవడం...ఆదరించడం..!
ముసలి తల్లిదండ్రులకు ఓ ముద్ద పెట్టడం..!
బిక్ష కాదని అది మీ ప్రాధమిక భాధ్యతని...!
మరిచిపోతె మీరసలు మనుషులే కాదని...! 

అందుకే... 
వృద్దులైన అమ్మానాన్నల్ని
ప్రతిక్షణం గుర్తుంచుకోండి..! 
గుండెల్లో దాచుకోండి..! 
ప్రత్యక్ష దైవాల్లా
ప్రతినిత్యం స్మరించండి..! 
అప్పుడు కదా కొంతైనా
ఆ తల్లిదండ్రుల ఋణం తీరేది..! 
అప్పుడు కదా మీరు 
నిజమైన బిడ్డలుగా గుర్తింపు పొందేది....!
అప్పుడు కదా మీ జన్మ ధన్యమయ్యేది..!

39. ఆయుష్మాన్ భవా...!

ఔను బిడ్డలారా..! 
మీ అభివృద్ధిని చూసి 
ఎందరో చప్పట్లు కొడతారు 
మీరు గర్వంగా గౌరవంగా 
ఈ సభ్యసమాజంలో బ్రతకటానికి... 
మీరు కలనైనా ఊహించని 
ఈ ఉన్నతస్థితికి మీరు చేరడానికి... 

ఎన్నో అవమానాలను భరించిన... 
ఎన్నోసార్లు కటిక చీకట్లో కన్నీరు కార్చిన... 
ఎన్నో రాత్రులు అర్ధాకలితో నిద్రపోయిన... 
కన్నుమూసి కాటికెళ్ళేంతవరకు
మీ బంగారు భవిష్యత్తుకై 
ఎన్నో కమ్మని కలలు కంటూ... 

మీకు చేయూతనిచ్చే 
ఆయుష్మాన్ భవా అంటూ...
అదృశ్యంగా దీవించే
మీ అమ్మానాన్నల్ని...మీరు కలనైనా 
మరువకండి..! నిత్యం గుర్తుంచుకోండి..!

40. ఆ గాలిపటాలకు
       ఆధారం...ఆ దారమే...!

ఆ గగనాన పక్షుల్లా ఎగిరే 
ఆ రంగుల గాలిపటాలు మన
కళ్ళకు అందంగా కనిపించవచ్చు 
కానీ ఆ గాలిపటాలకు ఆధారమైన 
ఆ"దారాలు"ఎవరి కళ్ళకు కనిపించవు 

ఔను బిడ్డలారా..! 
మీరు 
ఎవరెస్టు 
శిఖరమంత 
ఎత్తుకు ఎదిగినా...
మీరు ఏ డాక్టర్లో ఏ ఇంజనీర్లో
ఏ బిజినెస్ మ్యాగ్నెట్లో ఐనా... 
ఆ గాలిపటాలకు..."దారాల్లా"
మీ "ఎదుగుదలకు పునాదులు" 
మిమ్ము కన్న "మీ అమ్మానాన్నలే" 
అన్న ఒకే ఒక పచ్చినిజాన్ని...
మీరు కలనైనా మరువకండి..! 
మీ గుండెల్లో నిత్యం గుర్తుంచుకోండి..!

41. కవిత అంటే...?

కవిత అంటే... ?
క్లుప్తత...
స్పష్టత... 
నవ్యత...ఉండాలి

కవిత అంటే...
కమ్మగా...ఉండాలి
ముగింపు 
ముచ్చటగా...ఉండాలి...

కవిత అంటే... 
కాస్త వేడిగా... 
కాస్త వాడిగా...ఉండాలి... 

కవిత అంటే... 
తేనె చుక్కలా... 
గంధపు చెక్కలా... 
వేగు చుక్కలా... 
పూల మొక్కలా...ఉండాలి... 

కవిత అంటే...
కోయిల గానంలా...
గలగల పారే 
గంగా ప్రవాహంలా...ఉండాలి... 

కవిత అంటే... 
హంస నడకలా... 
నెమలి నాట్యంలా... 
తిరుపతి లడ్డులా... 
హైదరాబాద్ 
దమ్ము బిర్యానిలా...ఉండాలి... 

కవిత అంటే... 
ఉగాది పచ్చడిలా 
రుచికరంగా... 
పంచాంగ శ్రవణంలా... 
శ్రవణానందకరంగా...శుభకరంగా...
మనోహరంగా...మంగళకరంగా...
విజ్ఞాన భరితంగా...చైతన్య పూరితంగా
స్పూర్తిదాయకంగా...అర్థవంతంగా ....  
ఆకర్షణీయంగా...ఆదర్శవంతంగా ఉండాలి

42. గానమా..! నా ప్రాణమా...!!

గానం... 
ఎప్పుడూ మధురమే 
గానం... 
ఎప్పుడూ గంభీరమే... 
గానం... 
ఎప్పుడూ గలగలా 
ప్రవహించే గంగా ప్రవాహమే... 

గానం...
చెవులకు చక్కెరే...
మానని గాయాలకు మందే...

గానం... 
ఎప్పుడు విన్నా 
వీనులకు విందే 
మనసుకు పసందే...
గానం...
ఎప్పుడు విన్నా 
గుండెల్లో విరిసే హరివిల్లే... 
మదిలో కురిసే చిరుజల్లే...

గానమే... 
మన ప్రాణమైతే 
ఈ లోకం ఒక స్వర్గలోకమే... 
గానం... 
గాయకునికి కంఠాభరణమే 
శ్రోతలకు తియ్యనితేనెల విందే...

గానం... 
మత్తెక్కిస్తుంది 
మైమరపిస్తుంది 
ఉల్లాసంతో ఉత్సాహంతో
ఉరకలు వేయిస్తుంది
మనసును ఉయ్యాల లూగిస్తుంది 
అంతరంగాన అమృతం కురిపిస్తుంది

43. గట్టున గవ్వలు...
      మునిగితె ముత్యాలు...

గట్టున తిరిగితేనె...
గవ్వలు దొరికేది 
అంతులేని అగాధ 
జలనిధిలో మునిగితేనె...
ఆణిముత్యాలు దొరికేది... 

జీవితంలో కష్టాలొస్తేనే... 
కన్నీటి విలువ తెలిసేది 
దుఃఖం అనుభవిస్తేనే... 
సుఖం విలువ తెలిసేది... 

రైతు రేయింబవళ్ళు 
రెక్కల్ ముక్కల్ చేస్తేనే...
పచ్చని పంటలు పండేది... 
మన ఆకలిమంటలు ఆరేది... 

రాయిని చెక్కితేనే...
సుందర దేవతా శిల్పం 
మనకు దర్శనమిచ్చేది...
గర్భగుడిని చేరి అర్చనలు 
అభిషేకాలు అందుకునేది...

పట్టుదలతో కఠోరమైన 
శిక్షణ తీసుకుంటేనే...
ఏకాగ్రతతో సాధన చేస్తేనే... 
ఆటలపోటీల్లో ప్రత్యర్థుల్ని మట్టి 
కురిపించి స్వర్ణపతకాలను కొల్లగొట్టేది...

భగభగ మండే నిప్పుల్లో కాల్చితేనే...
బంగారు నగలు...నిగనిగ లాడేది... 
కమ్ముకున్న కరిమబ్బులు కరిగితేనే... 
సూర్యుడు వెలుగులను విరజిమ్మేది...
ఆకాశంలో చిమ్మచీకటి కమ్ముకుంటేనే... 
చుక్కలు మిళమిళ తళతళ మెరిసేది...

ఏ తల్లిఐనా తొమ్మిది నెలలు ప్రసవ 
వేదన పడితేనే...ఓబిడ్డకు జన్మనిచ్చేది... 
ఆకలికి అలమటిస్తేనే...మనిషి రెక్కలు 
ముక్కలు చేసేది ధనాన్ని సంపాదించేది...
తరతరాలకు తరగని ఆస్తులు ఆర్జించేది...

44. జయహో..! జయహో..! 
       శీతల్ దేవి..! జయహో..! 
       (చిత్ర కవిత)

చేతితో 
చక్కని చిత్రాలు 
గీయడం కాదు వైరల్ న్యూస్
రెండు చేతులు కోల్పోయినా 
నోటితో అపురూపమైన 
చిత్రాలను గీయడమే... 
షాకింగ్ షేకింగ్ & హార్ట్ బ్రేకింగ్ న్యూస్ 

ప్రపంచ పారా 
(వికలాంగుల)
ఒలింపిక్స్ పోటీలలో
రెండు చేతులు కోల్పోయిన
శీతల్ దేవి తన రెండు కాళ్ళతో 
విల్లును ఎక్కుపెట్టి 
నోటితో బాణాలను సంధించి 
రెండు బంగారు పతకాలను సాధించడం... 

మన భరతమాత ముద్దుబిడ్డగా
భారతీయులందరూ గర్వపడేలా
విశ్వమంతా విస్మయం చెందేలా
మన‌ భరతజాతి 
త్రివర్ణ కీర్తిపతాకను 
వినువీధుల్లో ఎగురవేయడమే...
షాకింగ్ షేకింగ్ & బ్రేకింగ్ న్యూస్

జయహో..!
జయహో..! శీతల్ దేవి..!
నిన్ను వరించని ఆ విజయాలేవి?
విజయాలనడ్డుకునే ఆ శాపాలేవి?
నీవే యువతకు అనంత స్ఫూర్తి..! 
అజరామరం నీవు 
ఆర్జించిన అఖండ కీర్తి..! 

ఈ శీతల్ దేవి శుభసందేశం ఒక్కటే..!
సాధన శిక్షణ కసి కృషి పట్టుదలలే వుంటే..!
అంగవైకల్యం ఒక శాపము పాపము కాదని 
అదిభగవంతుడు ప్రసాధించిన ఓవరమని..!

45. ఏది వైరల్ ? ఏది నిజం?...

కుక్కలు 
మనుషుల్ని 
కరవడం కాదు వైరల్ న్యూస్
మనుషులు 
కుక్కల్ని కరవడమే 
ఒక షాకింగ్ & బ్రేకింగ్ న్యూస్

ఒక ఎద్దును పదిపులులు 
వేటాడం కాదు వైరల్ న్యూస్
నాలుగు ఎద్దులు
ఒక సింహాన్ని సంహరించడమే 
ఒక షాకింగ్ & బ్రేకింగ్ న్యూస్

కాటికెళ్ళేవారికి కరోనా 
సోకడం కాదు వైరల్ న్యూస్
సోకి,120 ఏళ్ళముసలి 
బామ్మ కోలుకోవడమే 
ఒక షాకింగ్ & బ్రేకింగ్ న్యూస్

కాలిలో ముళ్ళు 
గుచ్చుకోవడం కాదు వైరల్ న్యూస్
కంటిలో ముళ్ళు గుచ్చుకోవడమే 
ఒక షాకింగ్ & బ్రేకింగ్ న్యూస్

కోతులు చెట్లు 
ఎక్కడం కాదు వైరల్ న్యూస్
ఏనుగులు ఎవరెస్టు శిఖరం ఎక్కడమే
ఒక షాకింగ్ & బ్రేకింగ్ న్యూస్

తిరుగుబోతు
త్రాగుబోతు భర్తలు 
భార్యల్ని క్రూరంగా 
హింసించడం కాదు వైరల్ న్యూస్
పరపురుషుల వలలో చిక్కుకున్న  
పతివ్రతలు భర్తలను హతమార్చడమే 
ఒక షాకింగ్  బ్రేకింగ్ & వైరల్ న్యూస్

46..నరుడా ! ఓ నరుడా !!

అతిగా నీవు 
ఆశ పడతావు
శ్రమ పడతావు 
అన్నీ నీవేనని 
భ్రమ పడతావు 
రెక్కలు ముక్కలు చేసి 
రక్తాన్ని స్వేదంగా మార్చి 
ఖరీదైన స్థలాలు పొలాలు...కొంటావు..!

ఇష్టమైన పంటలు పండించి
పుష్టికరమైన ఆహారాన్ని....తింటావు..!
 
విలాసవంతమైన 
విల్లాలు కష్టపడి నిర్మించి 
కుటుంబ సభ్యులతో కలిసి
కుషీ కుషీగా కులాసాగా....ఉంటావు..! 

కానీ ఒక్కప్రశ్న వేసుకోవు...
ఒక్క క్షణం ఆలోచించవు...
ఈ భోగభాగ్యాలు...
ఈ చిరునవ్వులు...
ఈ సిరిసంపదలు...
ఈ విందులు...
ఈ వినోదాలు...
ఈ విలాసాలు... 
ఈ విహార యాత్రలు...
ఈ బంధాలు అనుబంధాలు...
ఎంత కాలం..? నిజానికి ఈ 
నేలపైన నీవెంతకాలం...ఉంటావోనని..?

ఏదో ఒక రోజు 
భళ్ళున తెలతెలవారగానే 
నీ కళ్ళు రెండూ మూసేస్తావు 
కాటికెళ్తావు చితిలో భగ్గు...మంటావు..!
బూడిదగా మిగిలిపోతావు 

ఈ సత్యమెరిగి ఎందుకు...?
క్షణములో పేలిపోయే 
నీటి బుడగలాంటి 
కళ్ళు తెరిసీ తెరవంగానే 
కరిగిపోయే కమ్మని కలలు...కంటావు..?

నరుడా ! ఓ నరుడా !!
వ్యర్థం చేయకు విలువైన కాలాన్ని...
తెలుసుకో నీ జీవిత పరమార్ధాన్ని...
 
ఉత్కృష్టమైన 
నీ ఈ మానవ జన్మకు 
కారకులైన నీ జననీ జనకుల్ని...
నీకు ప్రాణం పోసి ఈ భూమిపై 
సంచరించే సద్భాగ్యం కలిగించిన 
పరమాత్మున్ని నిత్యం ప్రార్థించు...
అత్యంత భక్తి శ్రద్ధలతో స్మరించు... 
ఆపై ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రించు...  
నీ ఉనికిని నీ సచ్చరితను...నీ సేవలను 
చరిత్రలో చెరగని ముద్రలుగా ముద్రించు... 

47. వాల్మీకి వారసులారా..! 
      మీరు ధన్యులు..!

రామా శ్రీరామా జయజయ 
రామా జానకి రామా యని 
శ్రీరామ నామ జపం చేసే 
రామభక్తులందరూ ధన్యులే..!
సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే 
దశరధనందనుడిగా 
కోదండరాముడిగా అవతరించిన 
ఆ శ్రీరాముని పుణ్యచరితను
పలుభాషల్లో కమ్మని కావ్యాలుగా 
లిఖించిన కవిశ్రేష్టులందరూ ధన్యులే..!

ఎన్నోఏళ్ళు తపస్సు చేసి
బ్రహ్మ నారదమునులచే ప్రేరణపొంది
24000 శ్లోకాలతో 7 కాండలుగా
సంస్కృతంలో రసరమ్యంగా 
రామాయణాన్ని రచించిన ఆదికవి 
వాల్మీకి మహర్షి వారసులందరూ ధన్యులే...!

కానీ ఈ కలియుగంలో 
ఆ రామాయణం రెండు ముక్కలాయె...
విశ్వనాధ వారి రామాయణ కల్పవృక్షంగా...
రంగనాయకమ్మ రామాయణ విషవృక్షంగా..

ఈ దేశంలో వాల్మీకి‌ మహర్షి వారసుల 
రాజ్యాంగ హక్కులు మూడుముక్కలాయె..
బీసీలుగా...ఎస్టీలుగా...ఎస్సీలుగా...

ఐనా ఓ వాల్మీకి వారసులారా..! 
మీరు చింతించకండి..!దిగులు చెందకండి..! 
ఆ నింగిలో ఆ సూర్య చంద్రులు 
ఆ నక్షత్రాలు వెలుగుతున్నంతకాలం 
ఈ వాళ్మీకి రామాయణం ఒక సజీవనదియే

ప్రజలు ఈ రామాయణాన్ని  
పారాయణం చేసినంతకాలం 
ఈ లోకానికి శ్రీరామచంద్రుడే ప్రత్యక్ష దైవం 

ఆ కోదండరామున్ని భక్తులందరూ
ప్రత్యక్ష దైవంగా కొలిచినంతకాలం
ఈ రామాయణం లిఖించిన వాల్మీకి మహర్షి 
చిరంజీవియే...సదా సదా చిరస్మరణీయుడే

అందుకే
ఓ వాల్మీకి వారసులారా..! 
ఓ వాల్మీకి సేవారత్న
వ్యాపారరత్న బిరుదాంకితులారా..!
మీరంతా ప్రశ్నించాలి..!
పోయిన మీ హక్కులకోసం...
సమిష్టిగా ప్రతిఘటించాలి..! 
మీ రాజ్యాంగ హక్కులు 
మీకు దక్కేంతవరకు....
ఆ శ్రీరామచంద్రుడే 
ఈ ప్రభుత్వ పాలకులకు 
అంధులైన ఈ అధికారులకు 
కనువిప్పు కలిగించేంతవరకు...

మీరు పోరాడాలి..! పోరాడాలి..! 
పోరాడితే పోయేదేముంది చెప్పండి...?
నాలుగు లాఠీ దెబ్బలు...జైలుశిక్ష తప్ప...
నాలుగు లాఠీ దెబ్బలు...జైలు శిక్ష...
అనుభవిస్తే పోయేదేముంది చెప్పండి..?
మీ బానిసత్వపు సంకెళ్లు తెగడం తప్ప... 
మీ భావితరాలకు 
ప్రభుత్వ సంక్షేమఫలాలు అందడం తప్ప... 

48.  అన్నా..! ఓ ఓటరన్నా..! 
        నీవు ఓడరాదు..!
        నీ ఓటు ఓడరాదు..!

అయ్య బాబోయ్ వచ్చేస్తున్నాయట..! 
తేళ్ళు...తోడేళ్ళు...విషసర్పాలు... 
ఊసరవెల్లులు...బంగారు బల్లులు...

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..? 
ఓ ఓటరన్నా..! నీకేటి భయం... 

నీ వ్రేలికి ఉందిగా..."సుదర్శన చక్రం"
నీ భుజం మీద ఉందిగా..."గండ్రగొట్టలి"
నీ అరచేతిలో ఉందిగా..."అణుబాంబు" 
నీ వ్రేలిమీద వేసే సిరాచుక్కలో ఉందిగా...
ఓటనే "వజ్రాయుధం"... 
నీ హక్కుల అంబుల పొదిలో ఉందిగా... 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి .ఆర్.
అంబేద్కర్ అందించిన..."రామబాణం"...
ఆ రామబాణాన్ని సంధించాలి
రాజకీయ రాక్షస రావణాసురులను
కారడవులకు పంపాలి 
రామరాజ్యాన్ని స్థాపించాలి
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి...

అమ్మ బాబోయ్ వచ్చేస్తున్నాయట..!
గుడ్లగూబలు...
గుంటనక్కలు...
కులం గజ్జి కుక్కలు...
గోడమీది పిల్లులు...
గోముఖ వ్యాఘ్రాలు...
దోపిడీ దొంగలు...కొల్లేటి కొంగలు... 

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..? 
ఓ ఓటరన్నా..! నీకేటి భయం... 

నీ ఆత్మసాక్షిగా...
నీ ఆయుధాలు నీవు ధరించి...
నిర్భయంగా...నిష్పక్షపాతంగా...
నీళ్ళను పాలను వేరుచేసే హంసలా... 
నీవు విజ్ఞతతో విచక్షణతో ఓటు వేయాలి...
రేపు నీకు పగటిపూటే చుక్కలు చూపించే
ఆ "అవినీతి అనకొండలకు"
ఆ "అడవి పందికొక్కులకు"
నీవు చుక్కలు చూపించాలి 

అయ్య బాబోయ్ వచ్చేస్తున్నారట..! 
మేకవన్య పులులు...
తేనె పూసిన కత్తులు...
మాటల మాంత్రికులు...
అరచేతుల్లో స్వర్గాన్ని 
చూపించే అబద్దాలకోరులు...

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..? 
ఓ ఓటరన్నా..! నీకేటి భయం... 

కానీ ఓ ఓటరన్నా..!
నీతిమంతులను...
నిస్వార్థపరులను... 
సేవాతత్పరులను...
పరమాత్మ స్వరూపులను...
ఘనులను త్యాగధనులను... 
ఆపదలో ఆదుకునే ఆత్మబంధువులను... 
సమస్యలకు స్పందించే సహృదయులైన...
నేతలను నీవు గెలిపించాలి నీవు గెలవాలి...
నీవు ఓడిపోరాదు....నీ ఓటు ఓడిపోరాదు...

49.  ఓటర్లంటే...ఎవరు?
       మట్టికరిపించే మాంత్రికులు..!

ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..! 
ఒక పచ్చినిజం..! తెలుసుకోండి..! 
పకృతిలో పంచభూతాలలో 
స్వేచ్ఛగా విహరించే పక్షులు
చెట్ల మాటున దాగిన వేటగాళ్లు 
విసిరే మత్తుగింజలకాశపడితే...
వలలో చిక్కుకుపోయి
విలవిలలాడుట తథ్యమని...
ఉచితాలకాశపడితే...
వేటగాళ్ల ఉరిలో చిక్కుకున్నట్లే...

ఈ ప్రజాస్వామ్యంలో
ఈ ఎన్నికల జాతరలో
ఓటు హక్కున్న
ఓ ఓటరు పక్షుల్లారా..!
ఏ మత్తు మందుకో...
ఏ మటన్ బిర్యానీకో...
ఏ పచ్చనోటుకో మీరు ఆశపడి...

అతిశక్తివంతమైన... 
అత్యంత విలువైన...
పవిత్రమైన మీ ఓటును... 
ఏ దుష్టులకో...
ఏ దుర్మార్గులకో... 
ఏ దగాకోరులకో...
ఏ దోపిడీదారులకో...
ఏ మోసగాళ్ళకో...
ఏ మాయగాళ్ళకో...
ఏ రాజకీయ రాబందులకో.... 
ఏ మత్తులోనో...
ఏ మైకంలోనో...మీరు అమ్ముకుంటే...

ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..!
ఓ పచ్చినిజం..! తెలుసుకోండి..! 
ఆపై అందలమెక్కేది వారేనని...
అధికారం దక్కేది వారికేనని...
అంధకారంలోకి జారిపోయేది ...
అస్థిపంజరాలుగా 
మారిపోయేది మీరేనని...
అధఃపాతాళానికి 
అణగద్రొక్కేది మిమ్మల్నేనని...

మరో ఐదేళ్ళు మీరంతా 
రెక్కలున్నా ఎగరలేని పక్షులని...
మీ కళ్ళకు గంతలు కట్టినట్లేనని...
మీ గొంతులు మూగబోయినట్లేనని...
ప్రశ్నించేహక్కును కోల్పోయినట్లేనని..

అందుకే ఓ ఓటరు పక్షుల్లారా..!
తెలుసుకోండి..! తెలుసుకోండి..! 
ఒక పచ్చినిజం..! తెలుసుకోండి..! 
అమరజీవి అంబేద్కర్ 
అందించిన ఓటే మీకు 
ఒక వజ్రాయుధమని...
ఆది మీ అరచేతిలో 
దాగిన అణుబాంబని..! 
అదే మీ ఆర్థిక రుగ్మతలకు 
ఒక దివ్యఔషధమని..!

ఐదేళ్ల కోసారి దర్శనమిచ్చే...
వాగ్దానాల వర్షం కురిపించే...
అరచేతిలో స్వర్గం చూపించే... 
నేతల తలరాతల్ని ఆశలను 
అంచనాలను అవినీతిమయ 
జీవితాలను తారుమారు చేసి...
నేతల్ని మట్టికరిపించి...
అవినీతిని అంతం చేసే
మహామాంత్రికులు మీరేనని...

50. ఓటరు మాంత్రికుల్లారా ఒక్కమాట...? 

"నాలుగు పిల్లర్స్" ‌లేకుండా 
ఏ మేస్త్రి 
కొత్తగా ఇళ్లు...కట్టలేడు...

"చేతిలో కత్తెర" 
"మెడలో టేపు" లేకుండా
ఏ టైలరూ 
కొత్తగా డ్రెస్...కుట్టలేడు...

నీతిగా...నిజాయితీగా...
నిస్వార్థంగా ప్రజలకోసమే 
జీవితాలను త్యాగం చేసే
"ప్రజానాయకుడు" లేకుండా 
ఏ గ్రామం...అభివృద్ధి చెందదు...

అందుకే 
ఓటు వేసేముందు
ఒక్కక్షణం ఆలోచించండి...
వజ్రాయుధంవంటి ఓటున్న
ఓ ఓటరు మాంత్రికుల్లారా..! మీ
తిరుగులేని తీర్పు మార్పును తేవాలి... 

కళ్ళబొల్లి మాటలు చెప్పే 
నేతలకు కరెంట్ షాక్ ఇవ్వాలి...
గుంటనక్కలకు గుణపాఠం నేర్పాలి...

నయవంచకులైన 
నాయకులందరికి... 
కన్న కలలన్నీ కల్లలై...
జాతకాలన్నీ తారుమారై....
అంచనాలన్నీ తల్లక్రిందులై... 
కళ్ళుబైర్లు కమ్మి మైండ్ బ్లాక్ కావాలి...

ఎన్నికల బరిలో దిగిన
అభ్యర్థులందరికి అర్దం కావాలి 
ఓటర్లంటే...
మట్టిబొమ్మలు కాదని...
మట్టి కరిపించే మాంత్రికులని... 
ఓటర్లంటే...బిక్షగాళ్లు కాదని...
నేతల తలరాతలు వ్రాసే బ్రహ్మదేవుళ్ళని...

51. ఉచితాలు మాకొవద్దు... 
     సుపరిపాలనే మాకు ముద్దు... 

ఉచితాలకు ఆశపడితే... 
ఉచ్చులో చిక్కుకున్నట్లే..!

ఉచితాలకు ఆశపడితే...
ఊబిలోకి జారిపోయినట్లే..!

ఉచితాలంటూ ఊకదంపుడు
ఉపన్యాసాలు విని మెడకు 
ఉరిత్రాళ్ళు బిగించుకోకండి..!

ఉచితాలన్నవి
ఉరుములు మెరుపులే
కరుణలేని కారుమేఘాలే..!

నేడు ఉచిత బస్సు 
రేపు తుస్సు బుస్సు.!

నేడు 5000 పెన్షన్
రేపు వస్తుందో రాదో టెన్షన్..!

నేడు ఉచిత గ్యాస్ బండ
రేపు మననెత్తిన గుదిబండ..!

నేడు ఉచిత కరెంట్ పక్కాచీటింగ్ 
రేపు పన్నుల్తో మనజేబుల్ కటింగ్..!

అందుకే వద్దు వద్దు..!
ఉచితాలు మాకొవద్దు..!
సుపరిపాలనే మాకు ముద్దు..!
 
52. నా ఓటు ఎవరికంటే...?

రేపు 
ఎన్నికల
బూతులో
నా వ్రేలిమీద వేసే 
ఒకే ఒక్క సిరాచుక్క మీద
ప్రమాణం చేసి చెబుతున్నా...

నేను 
ఏ బీరుకో...
ఏ బిర్యానీకో... 
ఏ ఉచితాలకో...
ఏ పచ్చనోటుకో...
ఆశపడి నా 
"విలువైన ఓటును"
ఎవరికీ అమ్ముకోనని... 

నా ఓటు 
...త్యాగధనులకే...
నా ఓటు 
...నీతిమంతులకే...
నా ఓటు 
...నిస్వార్థపరులకే... 
నా ఓటు 
...ప్రేమమూర్తులకే...
నా ఓటు 
...ప్రజాప్రతినిధులకే...
అని నేడు నేను 
ప్రమాణం చేస్తున్నా...
అంబేద్కర్ అందించిన 
నా ఓటు...నిజంగా 
"ఒక వజ్రాయుధమని" 
నేను గట్టిగా నమ్ముతున్నా....

53. నిజమైన ప్రజాప్రతినిధికే మన ఓటు ?

అన్నా...
అనగానే
విన్నాను...
నేనున్నాను...
వస్తున్నానంటూ
రియల్ హీరో సోనుసూదల్లా
ఏ సమస్య వచ్చినా రెక్కలు 
కట్టుకుని మీ ముందరవాలే
మీ కష్టాలను తన కష్టాలుగా
మీ బాధల్ని తన బాధలుగా భావించే

నిగర్వి...
శాంతమూర్తి...
అందరివాడు...
అజ్ఞాత శతృవు...
నిత్యం నవ్వులు... 
రువ్వే నిర్మలమూర్తి...
అందరికీ ఆత్మబంధువు...
స్నేహశీలి...సేవాతత్పరుడు... 
సమస్యలకు తక్షణమే స్పందించే
సహృదయుడు...దయాసముద్రుడు...

ఊరికిఉపకారి... 
వివాదరహితుడు...
ఉదార స్వభావుడు...
ఊరంతా బాగుండాలి... 
అందులో నేనుండాలనే...
మంచి మనసున్న మహారాజే...
నిజానికి...నిజమైన ప్రజాప్రతినిధి...అట్టి 
నేతకే మన పవిత్రమైన ఓటును వేద్దాం..!
వేసి...ప్రజాస్వామ్యానికే పట్టం కడదాం..!!

54. నిన్న నీ కాళ్ళకు మ్రొక్కాము..!
      నేడు నీ చేతికి చిక్కాము...!

అన్నా..! ఓ ఓటరన్నా..!
నీవే మా దేవుడివని...
నీవే మాకు దిక్కని 
నిన్న నీ కాళ్ళకు మ్రొక్కాము..!
నేడు నీ చేతికి చిక్కాము..!

అన్నా..! ఓ ఓటరన్నా..!
మా పై దయ ఉంచు..! 
జరా జాలి చూపించు..!
మమ్మల్ని కాస్త కరుణించు..!
మా పరువు ప్రతిష్టల్ని కాపాడు..!

అన్నా..! ఓ ఓటరన్నా..!
అభ్యర్థులందరు పూజించే దైవం నీవే
అందరూ కోరేది నీ దయాదాక్షిణ్యాలే...
ఆశించేది నీ కరుణా కటాక్ష వీక్షణాలే....

అన్నా..! ఓ ఓటరన్నా..! రేపు నీవు 
ఎవరిని ఎవరెస్టు శిఖరం ఎక్కిస్తావో..? 
నీ ఉక్కుపాదం మోపి ఓటు పోటుతో
ఎవరిని అధఃపాతాళానికి త్రొక్కేస్తావో..?
ఎవరికెరుక నీ ఓటనే వజ్రాయుధానికి తప్ప

55. ఓటరన్న కెన్ని
      అతీంద్రియ శక్తులు..? 

అన్నా..! ఓ ఓటరన్నా..!
ఓ పచ్చినిజం చెబుతా విను 
"ఆంజనేయుడికి" తన శక్తి 
తనకు తెలియదన్నట్లు...
నీకున్న నీ ఓటుకున్న 
"అఖండమైన శక్తి"
నీకు సైతం తెలియదాయె...

నీ చేతిలో ఉంది ఓటు కాదు
అది ఒక త్రిశూలం...
అది ఒక రామబాణం... 
అది ఒక వజ్రాయుధం...
అది ఒక పదునైన కత్తి...

ఔను నీది ఏ దైవ స్వరూపమో ఏమో...
నీది ఏ దేవతా శక్తి ప్రతిరూపమో ఏమో...

మదించిన మాయమాటల 
"మహిషాసురులను" వధించడానికి...
కామపిశాచులైన "రావణాసురుల" 
పదితలలు తెగ నరకడానికి...
నమ్మించి నట్టేటముంచే నాయక 
"నరకాసురులను" మట్టు పెట్టడానికి...
గుర్తుండిపోయే"గుణపాఠం" నేర్పడానికి...

నీకు సైతం 
ఎన్నో అతీంద్రియ శక్తులున్నాయి
అదృశ్యంగాఎన్నో చేతులున్నాయి
ఆచేతుల్లో ఎన్నో ఆయుధాలున్నాయి

రేపు నీవు 
ఎవరికి విషాన్ని పంచెదవో...
ఎవరికి అమృతాన్ని ప్రసాదించెదవో...
ఎవరిని విషాదంలో ముంచెదవో...
ఎవరిపై విరిజిల్లులు కురిపించిందవో..
ఎవరికి ఎరుక..? నీ చేతుల్లో
అదృశ్యంగా ఉన్న ఆ ఆయుధాలకు తప్ప

రేపు నీవిచ్చే తిరుగులేని ఆ తీర్పు...
తెచ్చేను తెలంగాణ రాష్ట్రంలో 
ఊహించని ఒక విప్లవాత్మకమైన మార్పు...

56. అభ్యర్థులకు అగ్నిపరీక్ష...?

ముగిశాయి ముగిశాయి
హోరాహోరీగా అభ్యర్థుల 
పార్టీల భారీ ప్రచారాలు... 
సభలు సమావేశాలు.... 
ఆవేశపూరిత ప్రసంగాలు...
చెవులు చిల్లులుపడేలా
ఆ కుర్రకారు పాటల హోరు... 
ఆ వరుస వాహనాల జోరు... 

ముగిశాయి ముగిశాయి
మూడు పార్టీల ముచ్చట్లు...
వీధుల్లో జండాల జగడాలు... 
నిప్పురవ్వలా తారాజువ్వలా
నిరుద్యోగుల ప్రతినిధిగా...
ప్రత్యర్థులకు ప్రక్కలో బల్లెంలా...
సోషియల్ మీడియాలో విశ్వమే
విస్తుపోయేలా బర్రెలక్క విశ్వరూపం...

నేటి వరకు నేతల మాయాజాలం...
రేపటి నుండి ఓటరన్న మాయాజాలం... 

ఔను ఏ అభ్యర్థిని...
ఎవరెస్టు శిఖరం ఎక్కిస్తాడో... 
ఎవరిని అధఃపాతాళానికి విసిరేస్తాడో... 
ఎవరికెరుక ?ఆ బ్యాలెట్ బాక్సులకు‌ తప్ప... 

రామరాజ్యమా...?
రాక్షస రాజ్యమా..?
స్వర్గమా...? నరకమా..?
ఔను ఈ ఓటరన్న ఏమి సృష్టించునో 
ఎవరికెరుక ?ఆ బ్యాలెట్ బాక్సులకు తప్ప...

నిజమే ఈ ఎన్నికల రణక్షేత్రంలో
కొందరికి శిక్ష...కొందరికి శ్రీరామరక్ష... 
అభ్యర్థులందరికీ ఇదొక అగ్నిపరీక్ష...

57. ఓటరన్న ఒక త్రినేత్రుడు..!

అన్నా..! ఓ ఓటరన్నా..! రేపు నీవు 
ఎవరి తోకలు కోసేస్తావో..? 
ఎవరి పీకలు పిసికేస్తావో..? 
ఎవరికి గుణపాఠం నేర్పిస్తావో...? 
ఎవరి గుండెలు బ్రద్దలు చేస్తావో...? 
ఎవరికి ఎరుక..? నీకు తప్ప నీ 
చేతిలో ఉన్న...ఆ త్రిశూలానికి తప్ప..?

అన్నా..! ఓ ఓటరన్నా..! రేపు నీవు 
ఎవరిని భారీమెజారిటీతో గెలిపిస్తావో..?
ఎవరి డిపాజిట్లు గళ్ళంతు చేస్తావో..?
ఎవరిని అధికారసింహాసనం ఎక్కిస్తావో..?
ఎవరిని రాజకీయంగా సమాధి చేస్తావో..?
ఎవరికి ఎరుక..? నీకు తప్ప నీ 
చేతిలో ఉన్న...ఆ త్రిశూలానికి తప్ప..?

అన్నా..! ఓ ఓటరన్నా..! రేపు నీవు 
ఎవరి నెత్తిన గెలుపు కిరీటం పెడతావో..? 
ఎవరిని గజమాలతో సత్కరిస్తావో..?
ఎవరిని గండ్రగొడ్డలితో నరికేస్తావో..?
ఎవరికెరుక..? నీకు తప్ప నీ
చేతిలో ఉన్న...ఆ త్రిశూలానికి తప్ప..?

అన్నా..! ఓ ఓటరన్నా..! రేపు నీవు 
ఎవరిని నీళ్ళ ముంచెదవో..? 
ఎవరిని పాలముంచెదవో..? మదించిన 
మహిషాసురులనెందరిని వధించెదవో..?
ఎవరికెరుక...నీకు తప్ప 
నీ చేతిలో ఉన్న...ఆ త్రిశూలానికి తప్ప..?

అన్నా..! ఓ ఓటరన్నా‌..!
అందరి కళ్ళు నీ మీదనే... 
అందరి ఆశలు నీ ఓటుపైనే...
అందరి బ్రతుకులు... 
అందరి జాతకాలు నిప్పులాంటి...
నిష్పక్షపాతమైన రేపటి నీ తీర్పుపైనే...
ఏ‌ ప్రలోభాలకు....లొంగక ఓటెయ్యాలి...
ప్రజాస్వామ్యానికి...ప్రాణం పొయ్యాలి... 

58. శిరీష విజయం..!
      కొల్లాపూర్ విజయం..!!

శిరీష అంటే..?
బర్రెలక్క...
బర్రెలక్క అంటే..?
మెరిసే మెరుపులెక్క...
ఉరిమే ఉరుములెక్క...
శిరీష అంటే..?
పొడిచిన ఓ వేగుచుక్క... 

శిరీష అంటే..?
ఒక కిరణ్ బేడి...
ఒక పూలన్ దేవి...
ఒక జయలలిత...
ఒక మాయావతి... 
ఒక ఝాన్సీ రాణి...
ఒక మమతా బెనర్జీ...

శిరీష అంటే..?
కొల్లాపూర్
నియోజకవర్గ
MLA గా...నిల్చిన
ఓ స్వతంత్ర అభ్యర్థి...

శిరీష విజయమంటే..?
బడుగుల బహుజనుల  
బలహీన వర్గాల విజయం... 

శిరీష విజయమంటే..?
నిరుద్యోగుల విజయం...
శిరీష విజయమంటే..?
ప్రజాస్వామ్య విజయం...
శిరీష విజయమంటే..?
కొల్లాపూర్ ప్రజల విజయం... 
శిరీష విజయమంటే..?
ప్రపంచ వ్యాప్తంగా మార్పును
కోరే...ఆశాజీవుల అఖండ విజయం...

అందుకే...
అన్ని రికార్డుల్ని బ్రద్ధలుగొడుతున్న
బర్రెలక్క"విజిల్ గుర్తుకే " ఓటు వేద్దాం..!
ప్రజాస్వామ్యానికి నేడే ప్రాణం పోద్దాం..!
యువశక్తికి ఎదురులేదని నిరూపిద్దాం..!

59. నిరుద్యోగుల ప్రతినిధి...
      నిరుపేదల ఆశాజ్యోతి...శిరీష

నిన్న శిరీష ఒక గొంతు
నేడు కోటి గొంతుల కలయిక 

నిన్న శిరీషది ఏకాంతం 
నేడు శిరీషది జగమంత కుటుంబం 

నిన్న శిరీష ఒక నిస్సహాయురాలు
నేడు శిరీషచుట్టూ ఓ ఆత్మీయ రక్షణకవచం

నాడు గాంధీజీ పిలుపు వందేమాతర గీతం
భారతీయ యువతను ఉర్రూతలూగించే....

నేడు శిరీష "విజిల్ "మారుమ్రోగే...
కొల్లాపూర్ నియోజకవర్గమంతా...
 
ఢిల్లీ ఎర్రకోటను తాకింది...
ఖండాంతరాలు దాటింది... 
బర్రెలక్క బరిలో దిగిగానే 
పట్టే...అభ్యర్థులకు చెమటలు...

అంచనాలు తారుమారై
ఎవరు బకరౌతారో...
ఎవరు బలౌతారో...అర్థంకాక
అయోమయంలో...అభ్యర్థులు
గోక్కుంటున్నారు....బుర్రలు
పరుగెడుతున్నాయి...గుండెల్లో రైళ్లు  
ఆవహించింది...ఓటమి భయం భూతమై 

అందుకే 
ఈ దాడులు... 
ఈ దౌర్జన్యాలు... 
సోషియల్ మీడియాలో 
ఈ బెదిరింపులు వేధింపులు...
ఈ ప్రలోభాలు పగలు ప్రతీకారాలు... 
ఈ దుర్మార్గమైన వ్యక్తిగత దూషణలు...

పెట్టాలి...శిరీష శిరసున MLA కిరీటం ...
గెలిపించి పంపాలి శిరీషను చట్టసభకు...
నిరుద్యోగుల ప్రతినిధిగా...
నిరుపేదల ఆశాజ్యోతిగా...
యువతీయువకులు స్పూర్తిమంత్రంగా...

60. విజిలేస్తే...కొల్లాపూర్ 
      విజయం...శిరీషకే...!

ఆ యమధర్మరాజు 
వాహనం... 
దున్నపోతట...

కొల్లాపూర్
స్వతంత్ర అభ్యర్థి 
శిరీష వాహనం 
పాలిచ్చే బర్రేనట...

అదిగో... 
ఝాన్సీలక్ష్మీలా
కత్తిని ఝులిపిస్తూ
బర్రెనెక్కి బర్రెలక్క
బయలు దేరింది
ఎన్నికల రణక్షేత్రానికి...

ఆ సింహాలు ఆ తోడేళ్ళు 
ఆ చిరుత పులులు బర్రెను
బలితీసుకోవచ్చు...తమ 
ఆకలిని తీర్చుకోవచ్చు...

కానీ బర్రెనెక్కిన
బర్రెలక్క తానెత్తిన
ఓటనే వజ్రాయుధంతో
ఆ కౄరమృగాలను 
చీల్చి చెండాడుతుంది
ప్రత్యర్థుల గుండెలదిరేలా
కొల్లాపూర్ లో "విజిలేస్తుంది"
శిరీష "విజయభేరీ మ్రోగిస్తుంది"
చరిత్రను సృష్టిస్తుంది ఇది సత్యం 

61. అన్నా..! ఓ ఓటరన్నా..!
     నీ ఓటే నీ "వజ్రాయుధం"..!

అయ్య బాబోయ్ 
వచ్చేస్తున్నారట..! 
మేకవన్య పులులు...
తేనె పూసిన కత్తులు...
మాటల మాంత్రికులు...
అరచేతుల్లో స్వర్గాన్ని 
చూపించే అబద్దాలకోరులు...

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..? 
ఓ ఓటరన్నా..! నీకేటి భయం... 

నీ ఆత్మసాక్షిగా...
నీ ఓటే నీ "వజ్రాయుధం" 
ఆ ఆయుధాన్ని నీవు ధరించి...
నిర్భయంగా...నిష్పక్షపాతంగా...
నీళ్ళను పాలను వేరుచేసే హంసలా... 
నీవు విజ్ఞతతో విచక్షణతో ఓటువేయాలి...
రేపు నీకు పగటిపూటే చుక్కలు చూపించే
ఆ "అడవి పందికొక్కులకు"
ఆ "అవినీతి అనకొండలకు"
నీ "ఓటుతో నీవు చుక్కలు" చూపించాలి...

62. అన్నా..! ఓ ఓటరన్నా..!
      నీవు గెలవాలి..! నీ ఓటు గెలవాలి..! 

అమ్మ బాబోయ్ 
వచ్చేస్తున్నాయట..!
గుడ్లగూబలు...
గుంటనక్కలు...
కులం గజ్జి కుక్కలు...
గోడమీది పిల్లులు...
గోముఖ వ్యాఘ్రాలు...
దోపిడీ దొంగలు...
కొల్లేటి కొంగలు... 

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..? 
ఓ ఓటరన్నా..! నీకేటి భయం... 

రాజ్యాంగ నిర్మాత డాక్టర్
బిఆర్ అంబేద్కర్ అందించిన
రామబాణం ఉందిగా నీ చెంత...

అందుకే ఓ ఓటరన్నా..! నీవు
నీతిమంతులను...
నిస్వార్థపరులను... 
సేవాతత్పరులను...
పరమాత్మ స్వరూపులను...
ఘనులను త్యాగధనులను... 
ఆపదలో ఆదుకునే ఆత్మబంధువులను... 
సమస్యలకు స్పందించే సహృదయులైన...
నేతలను గెలిపించాలి....నీవు గెలవాలి...
నీవు ఓడరాదు....నీ ఓటు ఓడిపోరాదు...

63. రామబాణం సంధించు..!
       రామరాజ్యం స్థాపించు..!

అయ్య బాబోయ్ 
వచ్చేస్తున్నాయట..! 
తేళ్ళు...
తోడేళ్ళు...
విషసర్పాలు... 
ఊసరవెల్లులు...
బంగారు బల్లులు...

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..? 
ఓ ఓటరన్నా..! 
నీకేటి భయం... 

నీ వ్రేలికి ఉందిగా...
"సుదర్శన చక్రం"..!

నీ భుజం మీద ఉందిగా...
"గండ్రగొట్టలి"..!

నీ అరచేతిలో ఉందిగా...
"అణుబాంబు"..!

నీ వ్రేలిమీద వేసే 
సిరాచుక్కలో ఉందిగా...
ఓటనే "వజ్రాయుధం"..!

నీ హక్కుల 
అంబులపొదిలో ఉందిగా... 
రాజ్యాంగ నిర్మాత 
డాక్టర్ బి .ఆర్.అంబేద్కర్ 
అందించిన..."రామబాణం"..!

అందుకే ఓ ఓటరన్నా..!
ఆ రామబాణం సంధించు..!
రాజకీయ రావణాసురులను
కారడవులకు పంపించు..!
రామరాజ్యం స్తాపించు..!
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు..!

64. ప్రతిభకు జరగాలి పట్టాభిషేకం  

ఓం మిత్రమా
నా ప్రియ నేస్తమా 
నీవు ఆవులా...అమాయకంగా 
ఉన్నంతకాలం..! 
నీవు మేకలా....మౌనంగా 
ఉన్నంతకాలం..!
నీవు జింకలా....జంకుతూ
ఉన్నంతకాలం...!
నీవు బావిలో కప్పలా.... 
బ్రతుకుతూ ఉన్నంతకాలం..!

సింహాలు నిన్ను 
వెంటాడుతూనే ఉంటాయి..!
పులులు నిన్ను 
వేటాడుతూనే ఉంటాయి..!

ఓ మనిషీ..! నిజానికి
నీలో దమ్ముంది నీలో ధైర్యముంది..! 
నీలో గొడ్డుచాకిరీచేసే గుణముంది..! 
నీలో పగ ఉంది నీలో పట్టుదల ఉంది..!
ఎవరితోనూ మాట 
పడకూడదనే రోషముంది..!
అవసరమైతే నీవు గుర్రంలా పరుగెత్తగలవు
ఏనుగులా ఎంతటి పనినైనా చేసెయ్యగలవు 

సంధ్య వేళయిందని...సమయం 
మించిపోయిందని నిరాశ చెందకు..!

తొలిపొద్దు పొడుస్తుంది..!
అదిగో తెల్లవారుతుంది..! 
అవిగో అరుణకిరణాలు..! 
అవిగో ఆనందభాష్పాలు..! 
అదిగో నవలోకం..! 
అదిగదిగో నవలోకమే..!
అది నీ కోసం అది నీ కోసమే..! 

మ్రొక్కాలి నీ ఇష్టదైవానికి ..!
ఎక్కాలి ఎవరెస్టు శిఖరం  ..!
నీ చెమటచుక్కకు 
దక్కాలి చక్కని ప్రతి ఫలితం ..! 
నీ ప్రతిభకు జరగాలి పట్టాభిషేకం ..!

65. శిరీష అంటే...ఒక బర్రెలక్క కాదు...?

శిరీష అంటే..?
ఒక సునామీ..!

శిరీష అంటే..?
ఒక సంచలనం..!

శిరీష అంటే..?
ఒక ప్రభంజనం..!

శిరీష అంటే..?
ఒక సింహం పిల్ల..!

శిరీష అంటే..?
ఒక ఉప్పెన..!
ఒక ఉషస్సు..!
ఒక ఉద్యమం..!
ఒక ఉత్తుంగ తరంగం..!
 
శిరీష అంటే..? 
ఒక ధైర్యం..! 
ఒక సాహసం..!
ఒక తిరుగుబాటు..! 
ఒక ధిక్కార స్వరం..!

శిరీష అంటే..?
ఒక సమర శిఖరం..!

శిరీష అంటే..?
ఒక సాగర కెరటం..!

శిరీష అంటే..?
రావణాసురులపై 
ఎక్కుపెట్టిన 
ఒక రామబాణం..!

శిరీష అంటే..?
నిరుద్యోగం
విసిరిన ఒక నిప్పురవ్వ..!

శిరీష అంటే..?
దివినుండి భువికి
దిగివచ్చిన ఓ తారాజువ్వ..!

శిరీష అంటే..?
కోట్లాదిమంది 
నిరుద్యోగులకు ఓ అంబాసిడర్..!
రేపు భయమెరుగని బర్రెలక్క గెలిచి 
విజయదుందుభిని మ్రోగించును గాక..!

66. నిరుద్యోగుల ప్రతినిధి...
       నిరుపేదల ఆశాజ్యోతి...శిరీష

నిన్న శిరీష ఒక గొంతు
నేడు కోటి గొంతుల కలయిక 

నిన్న శిరీషది ఏకాంతం 
నేడు శిరీషది జగమంత కుటుంబం 

నిన్న శిరీష ఒక నిస్సహాయురాలు
నేడు శిరీషచుట్టూ ఓ ఆత్మీయ రక్షణకవచం

నాడు గాంధీజీ పిలుపు 
వందేమాతర గీతం
భారతీయ యువతను ఉర్రూతలూగించే....

నేడు శిరీష "విజిల్ "మారుమ్రోగే...
కొల్లాపూర్ నియోజకవర్గమంతా...
 
ఢిల్లీ ఎర్రకోటను తాకింది...
ఖండాంతరాలు దాటింది... 
బర్రెలక్క బరిలో దిగిగానే 
పట్టే...అభ్యర్థులకు చెమటలు...

అంచనాలు తారుమారై
ఎవరు బకరౌతారో...
ఎవరు బలౌతారో...అర్థంకాక
అయోమయంలో...అభ్యర్థులు
గోక్కుంటున్నారు....బుర్రలు
పరుగెడుతున్నాయి...గుండెల్లో రైళ్లు  
ఆవహించింది...ఓటమి భయం భూతమై 

అందుకే 
ఈ దాడులు... 
ఈ దౌర్జన్యాలు... 
సోషియల్ మీడియాలో 
ఈ బెదిరింపులు వేధింపులు...
ఈ ప్రలోభాలు పగలు ప్రతీకారాలు... 
ఈ దుర్మార్గమైన వ్యక్తిగత దూషణలు...

శిరీష శిరాన MLA కిరీటం పెట్టాలి
శిరీష చట్టసభలో అడుగు పెట్టాలి
నిరుద్యోగుల ప్రతినిధిగా...
నిరుపేదల ఆశాజ్యోతిగా...
యువతీయువకులకు స్పూర్తి మంత్రంగా...
నేడు కాకపోయినా రేపైనా...

67. శిరీష విజయమంటే..?

శిరీష అంటే..?
బర్రెలక్క...
బర్రెలక్క అంటే..?
మెరిసే మెరుపులెక్క...
ఉరిమే ఉరుములెక్క...
శిరీష అంటే..?
పొడిచిన ఓ వేగుచుక్క... 

శిరీష అంటే..?
ఒక కిరణ్ బేడి...
ఒక పూలన్ దేవి...
ఒక జయలలిత...
ఒక మాయావతి... 
ఒక ఝాన్సీ రాణి...
ఒక మమతా బెనర్జీ...

శిరీష అంటే..?
కొల్లాపూర్
నియోజకవర్గ
MLA గా...నిల్చిన
ఓ స్వతంత్ర అభ్యర్థి...

శిరీష విజయమంటే..?
బడుగు బలహీన 
బహుజన వర్గాల విజయం... 
శిరీష విజయమంటే..?
నిరుద్యోగుల విజయం...
శిరీష విజయమంటే..?
ప్రజాస్వామ్య విజయం...
శిరీష విజయమంటే..?
కొల్లాపూర్ ప్రజల విజయం... 
శిరీష విజయమంటే..?
ప్రపంచ వ్యాప్తంగా మార్పును
కోరే...ఆశాజీవుల అఖండ విజయం...

అందుకే...
అన్ని రికార్డుల్ని బ్రద్ధలుగొడుతున్న
బర్రెలక్క"విజిల్ గుర్తుకే " ఓటు వేద్దాం..!
ప్రజాస్వామ్యానికి నేడే ప్రాణం పోద్దాం..!
యువశక్తికి ఎదురులేదని నిరూపిద్దాం..!

68. అమరత్వానికి ఆహ్వానం.?

ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!
తీర్చవా ఈ ధర్మ సందేహం...?

ఆ దేవుడు 
కనిపించకున్నా
కరుణ కురిపించే 
కరుణామయుడైతే... 
భార్యా భర్తలిద్దరికీ
ఒకేరోజు పంపవచ్చును కదా
"అమరత్వానికి ఆహ్వానం"...?

మిత్రుడి...వివరణ...!
ఔను అది ఈ పిచ్చిమనిషి 
ఆశ అమాయకత్వం అజ్ఞానమే
ఆ కోరిక కోరితే భగవంతుడు
కొరడాలతో కొట్టవచ్చు 
మనిషి వెర్రితనానికి
విరగబడి నవ్వవచ్చు  
కారణం ఇక్కడో తిరకాసుంది

ఇద్దరూ ఒకేసారి 
ప్రయాణంమైపోతే వారికి 
ఆత్మలు శాంతింపజేసే
అంతిమసంస్కారాలు 
కర్మకాండలు నిర్వహించేదెవరు...? 

అసలు 
ఒకరి విలువ...
వారి గొప్పతనం...
వారి మంచితనం... 
వారి సేవా గుణం... 
మచ్చలేని వ్యక్తిత్వం...
ఒకరిమీద ఒకరికి 
వారిలో దాగిఉన్న అంతులేని 
ఆ ప్రేమతత్వం...తెలిసేదెప్పుడు..?
వారు ఒకరి కంటే 
ఒకరు ముందు పోతేనే కాదా...!

ఔను మిత్రమా..!
ఇది కాబోలు ప్రకృతి ధర్మం..! 
ఇది కాబోలు సృష్టి మర్మం...! 

ఇందుకే కాబోలు ఆపరమాత్మ 
ఒకరి తర్వాత ఒకర్ని పిలిచేది..! 
తనలో ఐక్యం చేసుకునేది.......!
ఔను ఇది కదా మనిషికి ఎంతకూ 
అంతుచిక్కని ఓ వింత రహస్యం..!

69. డబ్బు...పొదుపు నోరు.....అదుపు 

ప్రతి మనిషి 
జీవితాన్ని శాసించే
"శక్తులు" రెండు
ఒకటి....డబ్బు
రెండు...నోటి మాట

చేతిలో 
డబ్బులు 
"పొదుపు" 
చేయలేనప్పుడు... 
అన్ని కష్టాలే...ఖర్చులే ... 
అవసరాలు తీరక పోగా 
అన్ని అప్పులే...అవమానాలే...

నోటి
మాటలు 
"అదుపు" 
చేయలేనప్పుడు...
అన్నీ సమస్యలే...
కోపాలు తాపాలే...
కొట్లాటలు గొడవలే... 
వివాదాలు విషాదాలే... 
అపార్ధాలు అవమానాలే...

ఈ రెండు శక్తుల్ని శాసించే
వ్యక్తికి ఇక...ఎదురన్నది...లేదు... 
నియంత్రించకున్న...నిదురన్నది...రాదు.

70. ఒక ప్రణాళిక... 
      ఒక ప్రయత్నం... 
      .ఒక ప్రతిఫలం...

ఒక ప్రణాళిక... 
ఒక ప్రయత్నం... 
ఒక ప్రతిఫలం...దక్కాలంటే... 
ప్రతిక్షణం...ఎంతో శ్రమించాలి... 
ఎంతో దూరం ప్రయాణించాలి... 
ఎంతో సమయాన్ని వెచ్చించాలి...

నిస్వార్థంగా...ఆరోగ్యాన్ని 
సైతం లెక్కచేయకుండా...
ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా... ...

ఎవరిమీద 
ఆధారపడని 
ఆ అమాయకులను... 

నాగరికతకు 
దూరంగా సుదూరంగా 
కొండల్లో కోనల్లో 
జంతువులతో కలిసి జీవించే 
ఎవరికి పట్టని ఆ అడవి బిడ్డలను...

తమ హక్కులు 
తమకు తెలియని 
విందులు వినోదాలు 
ఏ విలాసాలెరుగని ఆ నిరుపేదలను.... 

ఓట్లకోసం 
తమను వాడుకునే 
అవినీతి నేతలను 
ఏమి అడగాలో ఎలా 
ప్రశ్నించాలో తెలియని ఆ అజ్ఞానులను...
ఆదుకోవాలి కొండంత అండగా ఉండాలి...
అట్టి పుణ్యకార్యాన్ని భుజాలపై వేసుకుని
త్రికరణశుద్ధిగా నిస్వార్థంగా నిర్వహిస్తున్న
అమ్మ ఫౌండేషన్ సభ్యులకు పేరు పేరున 
వందనం ! అభివందనం! పాదాభివందనం!!

71. చిత్ర కవిత(ఒక పాట మ్యూజిక్ విని)

ఆహా..! ఓహో..!
ఏదో అధ్భుతం 
ఆవిష్కృతం 
ఔరా ఆ గీతం 
ఆపాతమధురం
ఏమా మాధుర్యం... 
ఎంతటి తన్మయత్వం... 

ఔను సంగీతం 
ఒక సంతోష సాగరం 
ఆహ్లాదకరం ఆనందకరం
అంబరాన్ని తాకే సంబరం
విన్నంతసేపు మనసంతా 
పట్టరాని పరవశమే...
ఉత్సాహమే ఉల్లాసమే... 

ఏదో పూలఊయలలో 
ఊగుతున్నట్లు ... 
ఏదో స్వర్గంలోకంలో 
విహంగమై మనసు 
విహరించినట్లు ...

ఎవరో చెవుల్లో 
చెక్కెర పోస్తున్నట్లు... 
ఏదో లోకంలో 
కాసేపు వీనులవిందుగా
విహారయాత్ర చేసినట్లు...

అనిర్వచనీయమైన 
ఒక ఆనందానుభూతి...
రస స్వాదన స్వాంతన 

నీ కళ్ళు చెబుతున్నాయి 
నువ్ ప్రేమించావని...అన్నట్లు 
నా చెవులు చెబుతున్నాయి రాగాలతో 
మనసు రంజిల్లునన్నది పచ్చినిజమని...

72. జాలర్ల వింత జాతకాలు..?

ఆ జీవులు
నిత్యం చేస్తాయి 
నీళ్ళ మీద నృత్యం
కలలు కనడం తెలియదు 
పాపం వలలు విసరడం తప్ప 
అలల మీద స్వారీ చేయడం తప్ప 
పట్టిన చేపలు బుట్టలో వేసుకోవడం తప్ప
ఇక సుఖజీవనమెక్కడిది సునామీలు తప్ప  

ఆ కడలిలోని ఆ నీటికన్న 
ఆ మత్స్యకారులు కార్చిన కన్నీరే మిన్న... 
వారి బడుగు బ్రతుకులు నీటి బుడగలే... 
కష్టాలు కన్నీళ్లు పగబట్టిన పాముపడగలే... 
వారి బ్రతుకులు దినదిన గండమే...
సుడిగుండాలతో నిరంతర సహవాసమే... 
ప్రమాదకరమైన అంచుల్లో పగలురేయి 
సాహసోపేతమైన సముద్ర ప్రయాణమే... 

సముద్రం అల్లకల్లోలమైతే 
బ్రతుకుల్లో రేగేది తీవ్రతుఫానులే...
చుట్టుముట్టేది సమస్యలసునామీలే...
సాగరంలోనే కాదు సంసారంలోను
అగని అలల...కలల కన్నీటి అలజడులే...

సముద్రంలో వేటకెళ్లి తిరిగొచ్చేంతవరకు 
"మత్స్యకారుని ఇంట మృత్యు ఘోషే"...
ఆ కుటుంబమంతా మునిగి తేలేనిది 
సంతోష సంబరాల స్వర్గసీమలో కాదు
ఖణఖణమండే ఆశల అగ్నిజ్వాలల్లో...
అర్థంకాని...అదృశ్య నరకకూపంలో...
పాపం ఏ దైవం జాలిచూపని ఆ జాలర్ల... 
జాతకాలే అంత...వారి జీవితాలే వింత...

ఓ దైవమా ! ఎప్పుడు ? ఎప్పుడు..?
బాగుపడేను ఈ జాలర్ల జీవితాలు ?
వారి వలలకెప్పుడు వసంతకాలం..?
వారి కలలకెప్పుడు కళ్యాణశోభ....?

73. భారత మాతకు జేజేలు...! 
      బంగరు భూమికి జేజేలు...! 

"భారత మాతకు జేజేలు 
బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల 
జీవధాత్రికి జేజేలు" అంటూ 
ఆ కన్నతల్లి భరతమాతను 
పుట్టిన రత్నగర్భను
నిత్యం స్మరించుకోవాలి... 

నేడు మనం నిర్భయంగా తిరగడానికి 
నాడు భగత్ సింగ్ అల్లూరి 
ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరులెందరూ 
తమ ప్రాణాలను బలి పెట్టినారు 
తృణప్రాయంగా తెగించినారు

గాంధీ నెహ్రూ తిలక్ పటేల్ వంటి 
స్వాతంత్ర సమరయోధులు 
జీవితాంతం దేశ సంక్షేమం కోసం 
ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా తపించారు 
స్వాతంత్రం కోసం... 
పరాయిపాలన 
అంతమొందించడం కోసం... 
తెల్లదొరల బానిసత్వం నుండి 
ఈ భారతజాతిని 
విముక్తి చేయడం కోసం... 
జైలుజీవితం గడిపారు...
సర్వం త్యాగం చేశారు...
 
అందుకే మనం 
ఆ దేశభక్తులను...
ఆ వీరజవాన్లను...
ఆ విప్లవవీరులను... 
ఆ త్యాగమూర్తులను... 
ఆ స్వాతంత్ర సమరయోధులను... 
నిత్యం స్మరించుకోవాలి... 

మన జాతీయపతాకానికి 
వందనం చేస్తూ...
"వందేమాతర"మంటూ 
దిక్కులు పెక్కటిల్లేలా నినదించాలి... 
జనమంతా "జనగణమన 
గీతాన్ని" ఆలపించాలి.... 
"జై జవాన్ జై కిసాన్" 
"ఇంక్విలాబ్ జిందాబాద్" 
అంటూ ముక్తకంఠంతో 
విశ్వమంతా వినిపించాలి...

ప్రతి భారతీయుడు 
విజయగర్వంతో ప్రశాంతంగా... 
సుఖసంతోషాలతో జీవించాలి...  
తలఎత్తుకు ధైర్యంగా తిరగాలి... 
నీతినిజాయితీతో నిప్పులా బ్రతకాలి.. .

నాడు తెల్లదొరల్ని తరిమినా 
నయవంచకులైన 
ఈ నల్లదొరల్ని నమ్మరాదు...కారణం 
నా ఈ వేదభూమిపై ఇంకా ఎన్నో 
వేదనలు వివక్షతలు విహరిస్తున్నాయి
అసమానతలు రాజ్యమేలుతున్నాయి

అందుకే ప్రతి భారతీయుడు 
త్రివర్ణ పతాకం చేతబట్టి...
తల్లి భరతమాతకు ప్రణమిల్లి... 
త్రికరణశుద్ధిగా ప్రమాణం చేయాలి 
కామాంధులను కాల్చివేస్తామని... 
కులవృక్షాలను కూల్చివేస్తామని... 
మతోన్మాదులనుమట్టు పెడతామని...
సమసమాజానికి పునాదిరాళ్ళు ఔతామని.

74. బృహత్ గ్రంధపఠనం...

"మేధస్సుకు మేత" ఔతుంది 
"కళ్ళల్లో కరుణను" మనసులో 
"ప్రేమామృతాన్ని" నింపుతుంది 

మనిషికి 
"క్షమాగుణాన్ని"నేర్పుతుంది 
గాయపడిన 
మనసులకు "సూపర్ టానిక్"

"హృదయం" ఎల్లప్పుడూ 
ఉత్సాహంగా ఉల్లాసంగా 
"జింకపిల్లలా" గంతులు వేస్తుంది 

మేధస్సుకు మేత" ఔతుంది 
"గొప్పసత్యాలెన్నో" బోధపడతాయి 
"నవజీవన సూత్రాలెన్నో" 
నేర్చుకున్నామన్న 
"మెరుగైన జీవనమార్గం" 
తెలుసుకున్నామన్న 
గర్వం మాటల్లో చూపుల్లో 
తొణికిసలాడుతుంది 

సాటి మనిషిని మనిషిలా 
చూడాలన్న "తపన" 
ఆపదలో ఆదుకోవాలన్న
"తాపత్రయం" పెరుగుతుంది 

ఎన్ని సమస్యలనైనా
పరిష్కరించుకోగలమన్న...
ఎట్టి దుష్ట క్లిష్టపరిస్థితులనైనా 
సమర్థవంతంగాఎదర్కోగలమన్న...
గండాలనుండి సుడిగుండాలునుండి 
గట్టెక్కగలమన్న... 
"మొండిధైర్యం" గుండెల్లో 
మెండుగా నిండుగా ఉంటుంది 

ఎంత ఆర్జించాము ఎంతకాలం 
జీవించామన్నది కాక 
ఉన్నంతకాలం "ఉత్తములుగా" 
మచ్చలేని వ్యక్తిత్వంతో
ప్రశాంతంగా...ఉన్నతంగా...
అందరికి ఆదర్శంగా... 
జీవించాలన్న "దృఢ సంకల్పం" 
ఏర్పడుతుంది 

మంచితనంతో...మానవత్వంతో 
బ్రతకాలనిపిస్తుంది 
నిరుపేదలకు...అనాధలకు...
అభాగ్యులకు జీవితాలను 
"అంకితం" చేయాలనిపిస్తుంది 

అనునిత్యం 
ఆ భగవంతుని సన్నిధిలో... 
ఆ పరమాత్మ దివ్యనామస్మరణతో...
నిత్యం జీవించాలనిపిస్తుంది...
జీవించి జపించాలనిపిస్తుంది...
జపించి తపించాలనిపిస్తుంది...
తపించి తరించాలనిపిస్తుంది...
ఔను బృహత్ గ్రంధపఠనంతో...
మనసంతా నిర్మలత్వమే...
మనిషిలో పరిమళించు...
మంచితనం...మానవత్వమే... 

75. అస్తమించిన"అభినవ అల్లూరి"...

శ్రీ ఘట్టమనేని 
వీరరాఘవయ్యచౌదరి 
శ్రీమతి నాగరత్నమ్మల
ఎన్నోజన్మల పుణ్యఫలంగా...
31 మే 1943 న జన్మించిన 
"బుర్రిపాలెం బుల్లోడు"
శ్రీ ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి
ఇందిర విజయనిర్మలలను
ఇద్దరు భార్యల "ముద్దులమొగుడు"
హీరో రమేష్ బాబు మహేష్ బాబు...
పద్మజ మంజుల ప్రియదర్శినిలను
కంటికి రెప్పలా "కాపాడిన కన్నతండ్రి"

ఏలూరులో అక్కినేనికి జరిగిన
"సన్మానమే" కృష్ణ సినీనటనకు శ్రీకారం
"తేనెమనసులు" చిత్రంతో ప్రారంభమై 
"శ్రీశ్రీ చిత్రంతో "ముగిసిన సినీజీవితం

350 చిత్రాలలో 
రోజుకు మూడు షిఫ్టుల్లో
రాత్రి పదినుండి తెల్లవారుజాము
రెండుగంటల వరకు
సంవత్సరానికి పది చొప్పున 
30 సంవత్సరాలలో 300సినిమాలలో 
నటించిన "అగ్రశ్రేణి నటుడు"
"ఆకాశంలో మెరిసే ఒక తార"
చలనచిత్ర జగత్ లో వెలిగే ధృవతార"
"నటశేఖర...సూపర్ స్టార్ కృష్ణ"

సాహసమే ఊపిరిగా
రామబాణంలా దూసుకుపోతూ
ఈ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో చేసిన 
సాహస కృత్యాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు
తెలుగులో తాను నటించి జీవించిన
...తొలి జేమ్స్ బాండ్ చిత్రం 
"గూడచారి 116" 
...తొలి కౌబాయ్ చిత్రం
 "మోసగాళ్లకు మోసగాడు"
...తొలి ఈస్టమన్ కలర్ చిత్రం
"ఈనాడు" 
...తొలి సెవెంటీ ఎం.ఎం. చిత్రం 
"సింహాసనం" 
...తొలి డి.టి.ఎస్ .చిత్రం
"తెలుగు వీర లేవరా" 
...తొలి సినిమా స్కోప్ చిత్రం
"అల్లూరి సీతారామరాజు" 
ఈ చిత్రమే ధియేటర్లలో 
"కలెక్షన్ల కుంభవర్షం" కురిపించింది
ఎన్టీఆర్ కి శ్రీకృష్ణ పాత్రలా 
సూపర్ స్టార్ కృష్ణకు అల్లూరి 
సీతారామరాజు పాత్ర ప్రేక్షకుల 
హృదయాల్లో చెరగని ముద్రవేసింది 
ధియేటర్లలో 175 రోజులు  
దిగ్విజయంగా ప్రదర్శింపబడింది
ఇట్టి అనన్య సామాన్యమైన
అద్భుత ప్రయోగాలెన్నో చేసి
తెలుగుతెరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని 
అందించిన "సాహసి"సూపర్ స్టార్ కృష్ణ

స్వచ్ఛమైన 
అమ్మ పాలలాంటి 
మంచిమనసున్న 
మచ్చలేని మనిషి...స్నేహశీలి
ఇటు చలనచిత్ర సీమలో 
అటు ప్రకృతి వైపరీత్యాల్లో
విరాళాలు సేకరించి ఎందరినో
అదృశ్యంగా ఆదుకున్న
ఆపద్బాంధవుడు అజాతశతృవు
ఎందరికో ఆరాధ్య దైవం ...
సీనియర్ నటుడు...సినీనిర్మాత
పద్మవిభూషణుడు...
పార్లమెంటు సభ్యుడు...
15 చిత్రాల దర్శకుడు...
పద్మాలయా స్టూడియో అధినేత... 
సాహసాల పుట్ట ప్రయోగాల దిట్ట...
బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టి
సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి
నటించిన "ఘనత శ్రీ ఘట్టమనేనిదే"

2500 అభిమాన 
సంఘాల ఆశిస్సులతో
79 సంవత్సరాలు తెలుగు 
చలనచిత్ర సామ్రాజ్యానికి
"మకుటంలేని మహారాజై"
తన నటనకు జేజేలు పలికిన
మొసగాళ్ళకు మోసగాడు చిత్రం 
ఆంగ్లంలో "ట్రెజర్ హంట్" పేరుతో 
విదేశాలలో విడుదలై 
దిగ్విజయంగా ప్రదర్శింపబడి 
"ఖండాంతర ఖ్యాతిని" ఆర్జించి 
నేడు(15 నవంబర్ 2022 న) 
కాంటినెంటల్ హాస్పిటల్లో కన్నుమూసిన 
"నటశేఖర...సూపర్ స్టార్ కృష్ణ"
నిత్యం వెండితెరమీద "చిరంజీవియే"...
"మరణం లేని మనసున్న మహారాజే...
వారి పవిత్రఆత్మకు శాంతి కలగాలని
మనసారా కోరుకుంటూ...
అశృనయనాలతో...
శోకతప్త హృదయాలతో...
అందిస్తున్న అక్షర నీరాజనం...

76. నీకు తప్ప..! నీ ఓటుకు తప్ప..!

అన్నా..! ఓ ఓటరన్నా..!
ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో
ఎన్నికలబరిలో దిగిన అభ్యర్థుల 
జాతకాలు ఎవరికెరుక...?

నీకు తప్ప....నీ చేతిలోని 
కనిపించని...ఆ కత్తికి తప్ప... 

నీకు తప్ప....నీ చేతిలోని
కనిపించని...ఆ‌ కొడవలికి తప్ప... 

నీకు తప్ప....నీ చేతిలోని 
కనిపించని...ఆ త్రిశూలానికి తప్ప...

నీకు తప్ప....నీ చేతిలోని 
కనిపించని...ఆ కరవాలానికి తప్ప...

నీకు తప్ప....నీ అరచేతిలోని
కనిపించని...ఆ అణుబాంబుకు తప్ప...

నీకు తప్ప....నీ అరచేతిలోనీ
కనిపించని...ఆ వజ్రాయుధానికి తప్ప...

నీకు తప్ప....నీ చేతిలోని
కనిపించని...ఆ రామబాణానికి తప్ప...

నీకు తప్ప...నీ ఆకలికి తప్ప
నీకు తప్ప...నీ ఆవేశానికి తప్ప...

నీకు తప్ప...నీ అంతరంగానికి తప్ప
నీకు తప్ప...నీవు అనుభవిస్తున్న 
నీ అణచివేతకు...నీ బానిసత్వానికి తప్ప...

నీకు తప్ప...నిన్ను 
చుట్టుముట్టిన...ఆ సమస్యల 
సుడిగుండాలకు...ఆ సునామీలకు తప్ప...

77. నీ హృదయంలో 
     ఉషోదయమెప్పుడు..?

ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!! 
ఉరుములు 
ఉరిమితే ఉరమనియ్..! 
మెరుపులు 
మెరిస్తే మెరవనియ్..! 

పిడుగులు 
పడితే పడనియ్..!
వరదలు...
సునామీలు... 
వస్తే రానియ్..!
జరిగేదేదో జరగనియ్..!

మంచి జరిగితే పొంగిపోకు...
చెడు జరిగిందని క్రుంగి పోకు....
అంతా మన మంచికే అనుకో...

మౌనమే ఒక శక్తివంతమైన 
మారణాయుధం..!
దేనికి అతిగా స్పందించకు..!
దేన్నీ నీ హృదయానికి
ముల్లై గ్రుచ్చుకోనీయకు..! 

అప్పుడే
నీ హృదయంలో 
ఉషోదయం..!
అప్పుడే నీ అంతరంగంలో
ఆకాశమంత ప్రశాంతత..!!

78. తరుణోపాయం..?

కడుపులో 
చల్ల కదలకుండా 
కుర్చీకి అంటుకుపోయి...
దుప్పటి నిండుగా కప్పుకొని... 
కాళ్లు చేతులు ముడుచుకొని... 
పదిదాక మంచానికి అతుక్కొని... 

బయట ప్రపంచమెరుగక 
ఎప్పుడూ టీవీ ముందరో
ఏ కంప్యూటర్ ముందరో 
కూర్చొని కుమిలి పోతే ఎలా...? 
"పొట్ట....పెరిగిపోతుందని"...
"కొవ్వు...పేరుకుపోతుందని"...
"తగ్గే తరుణోపాయమే లేదని"...
"కానీ...ఉంది...అదే మంచిమందు...

రోజు ఉదయం 
కాస్త ఆరుబయట 
పిల్లలతో ఆడుకోవచ్చు... 
పార్కుల్లో తిరగవచ్చు తోటి 
పాత మిత్రులతో ముచ్చటలాడవచ్చు... 
వ్యాయామం యోగ ధ్యానం చేయవచ్చు...
ఈ క్రింది"ఆరోగ్యసూత్రాలు" పాటించవచ్చు

పదింటికి పడక...
నాలుగింటికి నడక...

తిరుగు తిరుగు...
తిన్నది అరుగు... 
 
Early to Sleep...
Early to Rise ....
 
Have a Sense... 
Don't eat Nonsense...

Avoid Fat Sweet...
Salty and Oil items....

No tention
Always Smile
Have a Peace of mind...

Be Slow to Promise
But Be Quick to Perform...

Sorry Don't Worry
It is an interest paying
before it is becoming due... 

Don't Postphone till 
tomorrow what you can do today.... 

79. నాలుగు చక్రాలు
     నాలుగు వేదాలు 

మనకున్నవి 
రెండు చేతులు... 
మన కారుకున్నవి 
నాలుగు చక్రాలు.... 
ఆచక్రాలను కదిలించేది 
మన కారును నడిపించేది 
శరవేగంగా పరుగుపెట్టించేది
మన రెండుచేతుల్లోని...స్టీరింగే..!

మన
ఋషులు 
మహర్షులు 
మనకిచ్చారు
నాలుగు వేదాలు... 
అవి ఆ కారుచక్రాల్లా 
నవ భారతనిర్మాణం వైపు 
నడవాలంటే...దేశం సస్యశ్యామలమై
ప్రగతిపథంలో పరుగులు పెట్టాలంటే
సనాతన హిందూ ధర్మమే...స్టీరింగ్..!

80. జాతకం ఒక జలపాతమైతే..?

అందమైన
సుందరమైన 
అంత ఎత్తైన 
అద్భుతమైన 
ఆశ్చర్యకరమైన
అరవై అంతస్తుల 
విలాసవంతమైన
ఖరీదైన ఆ చలువరాతి
ఇంద్ర భవనాన్ని ఆకాశం 
అంచులను తాకేలా పైకి 
లేపిన ఆ అదృశ్యహస్తాలలో...

ఉండొచ్చు...
ఒక బ్యాంకు లోన్ ...
ఉండొచ్చు...  
ఒక ఫైనాన్సియర్ హస్తం...

మార్చి ఉండొచ్చు...ఆ దైవం
ఆ భవంతి యజమాని
జాతకాన్ని ఒక జలపాతంగా... 

ఆ అదృష్టవంతుడి
దశ తిరిగి ఉండొచ్చు... 
శ్రమ ఫలించి ఉండొచ్చు ...
కన్నకల నిజమై ఉండొచ్చు... 

కానీ...
ఏ‌ బిల్డింగ్ ఓనరైనా
విలాసవంతమైన ఆ
విల్లాల్ని చూసి విర్రవీగొద్దు... 
ప్రక్కనున్న పూరిగుడిసెను 
చూసి ఫక్కుమని నవ్వొద్దు...

విధి "ఓ విషపు నవ్వు"
నవ్విన వేళ...
ఓడలు బండ్లౌతాయని...
బండ్లు ఓడలౌతాయని... 
చరిత్రలో చెక్కిన ప్రతిపుట 
సముద్రపు అలలా ఘోషిస్తుంది...

81. ఆకలి...నవ్వుతోంది....

అందమైన
గోరుముద్దలంటి  
అక్షరాలను 
ఆవురావురుమంటూ
తింటున్నందుకు...
కవి కలం కడుపులోని 
ఆకలి...కన్నీరు పెడుతోంది...
 
కొమ్మమీద పిట్టలు కొన్ని 
పిడికెడు పొట్టల్ని నింపుకోలేక 
తిప్పలు పడుతున్నందుకు... 
ఆకలి...ఆలోచిస్తోంది...

ఎన్నో రకాల 
రుచికర పదార్థాలు 
కళ్ళముందే ఊరిస్తుంటే
"నాలుక మాట వింటే నరకమే" 
అన్న డాక్టర్ మాటలు గుర్తొచ్చి 
అన్నీ తినాలని ఆశపడే...
ఏమీ తినలేని కోటేశ్వరున్ని చూసి 
ఆకలి...పకపక నవ్వుతోంది...

పచ్చని పంటలు పండించినా 
రెక్కల్ ముక్కల్ చేసినా 
అన్నపూర్ణ అవతారమెత్తి 
అందరి ఆకలి తీర్చాలని ఎంతో 
ఆశపడిన ఆరాటపడిన అన్నదాత 
తన కడుపు నింపుకోవడానికి 
అష్టకష్టాలు పడుతుంటే...వింతగా 
ఆకలి‌...విరగబడి నవ్వుతోంది...

కన్నవాళ్ళెవరో తెలియక
కడుపు నింపుకునే దారేలేక
చెత్తకుండీల దగ్గర 
కుక్కలతో కుస్తీ పడుతూ 
ఆ కుక్కలు చించిన విస్తరాకుల్లో 
ఎంగిలి మెతుకులు ఏరుకుతినే
అనాధలైన వీధిబాలల్ని చూసి 
విలపిస్తోంది...ఆకలి
 
పగలురేయి 
అష్టకష్టాలు పడినా
కడుకు నింపుకోలేక 
కన్నీళ్ళతోనే కడుపు 
నింపుకునే కష్టజీవిని చూసి 
కన్నీరు కారుస్తోంది...ఆకలి

డిగ్రీలెన్ని ఆర్జించినా 
అర్హతలెన్ని ఉన్నా 
చిన్న ఉద్యోగం రాక 
కడుపు నిండే దారిలేక... 
శిక్ష పడుతుందని తెలిసినా 
చీకట్లో ఓ ఇంట్లో దూరి
భారీ చోరీకి పాల్పడి
"నేరం నాది కాదు ఆకలిది"
అంటూ ఆవేశంతో 
దిక్కులు పిక్కటిల్లేలా... 
నినదించే నిరుద్యోగిని చూసి 
నిట్టూరుస్తోంది...ఆకలి...

82. చిత్ర కవిత...

ఆహా మిత్రమా 
ఎంత శ్రావ్యమైన 
మధుర స్వరాలు ఇద్దరివి...
దంపతులైతే వారి జన్మ ధన్యమే... 
విన్న వారి మది పులకించిపోయేలా 
ఎంతో అధ్భుతంగా... 
ఎంతో తన్మయత్వంతో 
గీతాన్ని ఆలపించారు...
అందరి గుండెల్లో 
కార్తీక దీపాలు  వెలిగించారు ...
వారివి అధ్భుత గళాలు...? 
అందులో ప్రవహించింది 
పవిత్ర గంగా జలాలు...?
ఆహా ఓ దైవమా 
ఎంతటి గంభీరమైన 
గొంతులనిచ్చావయ్యా 
ఆ ఆదిదంపతులకు... 
పాట వింటూ ఉంటే...
పాలు తేనెలు 
ప్రవహిస్తున్నట్టుగా  ... 
అమృతపు చిరుజల్లులు 
కురిసినట్లుగా ఉంది... 
అందుకే అంటారు "స్వరాలు 
గానగంధర్వులకు  వరాలు" అని...
అవి వారికి ఆ  భగవంతుడు 
అందించే హారాలని...కంఠాభరణాలని... 
అభినందనలు మిత్రమా మీకు 
మంచి వీడియో షేర్ చేసినందుకు...

83. అంతరాత్మ ప్రబోధం..?

నాలోని బలహీనత కన్నా...
నా భగవంతుని బలమే మిన్న...

నిత్యం నన్ను వేధించే బాధించే
నా సమస్య నా కన్నా పెద్దదే కావొచ్చు
ఒక భయంకరమైన భూతంలా కంటికి 
కనిపించవచ్చు‌ నన్ను కలవరపెట్టవచ్చు...

ఏ చిక్కుసమస్య 
నా దైవం కన్న పెద్దది కానేరదు 
నా భగవంతుడు 
పరిష్కారించలేనంత క్లిష్టమైనదీ కాదు

అందుకే సమస్యల సృష్టికర్త సైతానైతే...
సమస్యల పరిష్కార కర్త ఆ పరమాత్మే...

నేను ఎన్ని సమస్యల సుడిగుండాలలో 
చిక్కుకున్ననేమి..? కాపాడే సమర్ధుడు... 
సర్వశక్తిమంతుడైన నా దైవముండగా...

నా తప్పిదాల 
నా ఓటమి కన్న
నా దైవం ఓదార్పే మిన్న... 
నా కంటి కన్నీటి ధారలకన్న
నా దైవం నాపై కురిపించే ఆ కరుణేమిన్న...

నాకు నా "అంతరాత్మ ప్రబోధం"
ఒక్కటే ఎవరికెన్ని రహస్యాలు చెప్పినా
మనలోని..."బలహీనతల్ని"...మనం
ఇతరులకు బహిర్గతం చేయరాదని...

చేసిన మరుక్షణం 
ఈ సమాజం మనల్ని
ప్రశాంతంగా బ్రతకనివ్వదని...
మనల్ని చూసి నవ్వుతోందని...
మనకు నరకం చూపిస్తుందని...
మనల్ని వేధించి వెలివేస్తుందని...
మనకు సమాధిని సిద్దం చేస్తుందని...

రచన:
"కవిరత్న"
"సహస్రకవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్ 
చరవాణి...9110784502










































































































 


Comments