66...మే నెల 2023...కవితల ఇండెక్స్
1. అది "సచివాలయమా" కాదు
తెలుగు తల్లి" దేవాలయం...!
2. సచివాలయం ..! మరో మణిహారం..!
3. తెలంగాణ వైట్ హౌస్"
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నూతన సచివాలయం..!
4. ఆకాశమంత ఎత్తులో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నూతన సచివాలయం...
5. ఆరో అంతస్తులో...
ఆరు ఫైళ్ళపై సంతకాలు..!
6. తెలంగాణ "వైట్ హౌస్"
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నూతన సచివాలయం..!
7. గదిలో గబ్బిలంలా బ్రతక్కు...
8. బంగారుగుడ్లు పెట్టే బాతులు..?
9. కుబేరులెవరు...?
10. బొమ్మలాట...?
11. అగ్ని పరీక్షలు...?
12. గుంటనక్కలకు గుణపాఠం..?
13. పోలన్న కవి సూక్తి సుధ
14. తల్లిదండ్రులూ జాగ్రత్త..!
తస్మాత్ జాగ్రత్త..!!
15. చీకటిలో "చిరుదీపం"
16. భయమే భూతం..!
ధైర్యమే దారిదీపం..!
17. మూర్ఖుల రాజ్యం..?
18. కాలమా కరుణించుమా...!
19. ఆ మూడు వరాలు...?
20. గాలిపటం...అలల కెరటం
21. బ్రిటిష్ కింగ్ చార్లెస్...3 పట్టాభిషేకం
22. బ్రిటిష్ రాజదంపతుల పట్టాభిషేకం..?
23. పైనున్న ఆ పరమాత్మే కాదా...?
24. సమాధులనుండి సందేశం...?
25. ఆటబొమ్మ కన్న అమ్మయేమిన్న...
26. తనకు మాలిన ధర్మం
మొదలు చెడ్డ బేరమా..?
27. అడుగడుగున...
గండాలే సుడిగుండాలే...
28. కవి పోలన్న నోట
ఓ కమ్మని మాట..!
29. కవి పోలన్న నోట..!
ఓ కమ్మని మాట...!
30. కన్న అమ్మానాన్నలే
కనిపించే దేవతలు..?
31. పర్యావరణ "ఉగ్రవాది"..?
32. శిల్పి చేతిలో శిలవా..? ఎవరు నీవు?
33. "కళ్ళులేని కప్ప"
పాలుత్రాగే పాము" (హాస్య కవిత)
34. బలమైన ప్రభుత్వం
బలహీనుల చేతుల్లో...?
35. గట్టిబంధమంటే ! అదే వుంటే ?
36. బంగారు బ్రతుకులు...?
37. నాటి కరోనా కష్టకాలంలో...
38. ఎండలు బాబోయ్ ఎండలు..,!
39. జల్లికట్టుకు జయహో..!
40. గొడవ...మునిగే పడవ...?
41. త్రాగుబోతు యోగి కాదు రోగి..?
42. 2000 నోటుపై గొడ్డలి వేటు...
43. కర్ణాటక ఫలితం
నన్ను కత్తితో పొడిచింది
44. ఓటర్లు...ఒప్పందపత్రాలు...
45. హీరో శరత్ బాబుకి శ్రద్దాంజలి
46. మద్యం మత్తుకు
బానిసలైతే ఇక మరణమే..?
47. కనువిప్పు కలిగించిన కర్ణాటక...?
48. మూడు గుర్తులు...?
49. కలలు కలతనిద్ర....
50. ఇది నిజం నమ్మలేని పచ్చినిజం...?
51. ఏరులై పారిన నల్లధనం...?
52. అస్తమించే సూర్యుడు...
53. ఆకలి తీర్చిన అడవి...?
54. శ్రమ..?
55. ఆహా ఏమి చాకచక్యం..?
(మినీ హాస్య కవిత)
56. అది పార్లమెంటా...? కాదు
ప్రజాస్వామ్య దేవాలయం..!
57. మూడు ముఖద్వారాల ముచ్చట..?
58. కవి పోలన్న నోట..!
ఓ కమ్మని మాట..!
59. చిత్ర కవిత...
60. ఆత్మ విశ్వాసం...
ఒక అఖండ జ్యోతి...
61. అపూర్వమైన ఓ ఆత్మీయ కలయిక
62. సెల్లుకు బానిసలైతే..?
63. పూరిగుడిసెల్లో
పుట్టిన పులులే మీరు..!
64. ఓ అమ్మా..! నీకు వందనం..!
అభివందనం..! పాదాభివందనం..!
65. మద్యం మత్తుకు
బానిసలైతే మరణమే..?(పార్టు...1)
66. మద్యం మత్తుకు
బానిసలైతే మరణమే? (పార్టు...2)
1. అది "సచివాలయమా" కాదు
తెలుగు తల్లి" దేవాలయం...!
ఒక వైపు...
రాష్ట్రావతరణ కోసం
రక్తాన్ని చిందించి...
ప్రాణాలు అర్పించిన...
"అమరవీరుల స్మారక స్థూపం"
మరో వైపు...
భారత రాజ్యాంగ నిర్మాత...
సుపరిపాలనా స్పూర్తి ప్రదాత...
"డాక్టర్ బిఆర్ అంబేద్కర్...
"125 అడుగుల భారీ విగ్రహం"
మరో వైపు...
రాజ్యాలను కుప్పకూల్చే
నీటి "యుద్దాలు" వద్దని...
"మతసామరస్యమే" ముద్దని...
బోధించే...గంభీరమైన
"గౌతమ బుద్ధుని" ప్రతిమ
మరో వైపు...
చల్లని గాలులతో...
ప్రశాంతమైన వాతావరణంలో...
ఉరుకుపరుగుల భాగ్యనగరవాసులకు
హూషారునిచ్చే..."హుస్సేన్ సాగర తీరం"
మధ్యలో...
ఆకాశమంత ఎత్తులో...
కేంద్రానికి కన్నుకుట్టేలా...
ఇరుగుపొరుగు
రాష్ట్రాలకు ఈర్ష్య పుట్టేలా...
తెలంగాణ చరిత్రలో
చిరస్థాయిగా నిలిచిపోయేలా...
"అత్యున్నత ప్రమాణాలతో"...నిర్మించిన
"అపురూపమైన ప్రతిష్టాత్మకమైన కట్టడం"...
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం...
ఔనిది "సచివాలయమా"...కాదు
తెలంగాణ రాష్ట్ర ప్రజల "దేవాలయం"..
అందులో కొలువై ఉన్న..."దైవమెవరు?"
ఇంకెవరు? సాహసోపేత నిర్ణయాలకు...
భారీ నిర్మాణాలకు... "కేరాఫ్ అడ్రస్ గా
మారిన దళిత బంధువు...దీన బంధువు
రైతు బంధువు...ఉద్యోగ బంధువైన
మన ప్రియతమ ముఖ్యమంత్రి..."కేసీఆర్"
జయహో ! జయహో !
సియం కేసీఆర్ కి జయహో !
జయహో ! జయహో !
తెలంగాణ తెలుగు తల్లికి జయహో !
2. సచివాలయం ..! మరో మణిహారం..!
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నూతన "సచివాలయం"...
తెలంగాణ రాష్ట్ర
ప్రజలకు "దేవాలయం"
ఈ సచివాలయం
దేశానికే దిక్చూచి...
తెలంగాణా తల్లి మెడలో
మెరిసే "మరో మణిహారం"...
ఔనిది
"సచివాలయం"...కాదు
తెలంగాణ రాష్ట్ర
ప్రజల "దేవాలయం"..
కొలువై ఉన్న..."దైవం"
సాహసోపేత నిర్ణయాలకు...
భారీ నిర్మాణాలకు
"కేరాఫ్ అడ్రస్ గా"
మారిన మన ప్రియతమ
ముఖ్యమంత్రి..."కేసీఆర్"
ఈ సచివాలయం కేసీఆర్ కలలుగన్న
సుందర సుపరిపాలనా ఆకాశ సౌధం
ఇది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం
రండి రండి..!
మయసభలా...మనసును దోచే...
హరివిల్లులా.....అందరిని అబ్బురపరిచే...
సచివాలయ అందాలను తిలకిద్దాం రండి..!
తిలకించి ఒకసారి పులకించిపోదాం రండి..!
3. తెలంగాణ వైట్ హౌస్"
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నూతన సచివాలయం..!
వనపర్తి సంస్థానం
రాజమందిరంలా
రాజసం ఉట్టిపడేలా...
గుజరాత్ హనుమాన్
మందిరంలా మనోహరంగా...
మైసూర్ మహారాజా ప్యాలెస్
హైకోర్టు డిల్లీ సెక్రటేరియట్ డోములతో
తెల్లని రాజహంసలా...
అందాల హరివిల్లులా...
భాగ్యనగరానికి వన్నెతెచ్చేలా...
అమెరికా వైట్ హౌస్ ను తలదన్నేలా...
ఆణిముత్యంలా...మిలమిల
మెరిసే సి.యం కేసీఆర్ కలగన్న
సుందర సుపరిపాలనా ఆకాశ సౌధం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం
చెన్నై కి చెందిన
బిల్డింగ్ డిజైనర్లు...
పొన్ని...ఆస్కార్ డిజైన్ చేసిన
రాజస్తాన్ ధోల్ పూర్ మైన్
నుండి తెచ్చిన రెడ్ స్టోన్ తో
అత్యున్నత ప్రమాణాలతో
అద్భుతంగా ఓ "మయసభలా"
ఓ "ఇంద్రభవనంలా"
అతిసుందరంగా తీర్చిదిద్దిన
అధ్భుతంగా నిర్మించిన అపురూపకట్టడం
ఈ అంబేద్కర్ సచివాలయం...లోపల....
విశాలమైన కారిడార్లు...
మందిరం...మసీదు...చర్చి
రిసెప్షన్ హాలు...క్యాంటీన్
రెండు బ్యాంకులు...డిస్పెన్సర్
పోలీసు కంట్రోల్ రూం...
రైల్ బస్ రిజర్వేషన్ కౌంటర్ లు...
ఇంకా ఇంకా ఎన్నో వింతలు విశేషాలు...
రండి రండి..! తిలకిద్దాం రండి..!
మనసు దోచే...అబ్బుర పరిచే అందాలను
తిలకించి ఒకసారి పులకించిపోదాం రండి..!
4. ఆకాశమంత ఎత్తులో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నూతన సచివాలయం...
పాత సచివాలయ
వాస్తుదోష నివారణకు...
కొత్త భవననిర్మాణానికి
వాస్తు నిపుణులు ...
సుద్ధాల సుధాకర్ తేజ...
సూచనల మేరకు
617 కోట్లకంతకు మించి...
28 ఎకరాలలో...
265 అడుగుల ఎత్తులో...
6 అంతస్తులతో...
24 లిఫ్ట్ లతో...
634 గదులతో...
34 డోములతో...
30 కాన్ఫరెన్స్ హాళ్ళతో...
విందు వినోదాల కోసం...
విదేశీ ప్రతినిధుల కోసం...
ప్రత్యేక అతిథుల కోసం...
సభలు సమావేశాల కోసం...
28 అడుగుల ఎత్తులో...
2 హాళ్ళతో...
4 ముఖద్వారాలతో...
అత్యున్నత ప్రమాణాలతో...
అధునాతనంగా సకలసౌకర్యాలతో...
హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన...
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం...
తెలంగాణా రాష్ట్ర ప్రజలకు దేవాలయం...
రండి రండి..! తిలకిద్దాం రండి..!
తిలకించి ఒకసారి పులకించిపోదాం రండి..!
5. ఆరో అంతస్తులో...
ఆరు ఫైళ్ళపై సంతకాలు..!
మొన్న ఆదివారం
వాస్తుశాస్త్ర నిపుణులు
"సుద్దాల సుధాకర్ తేజ"
ఆధ్వర్యంలో ఏర్పాటైన
"యజ్ఞశాల" శృంగేరిపీఠ
వేదపండితుల రుత్విక్కుల
మంత్రోచ్చారణలతో
మారుమ్రోగిపోగా...
భక్తితో చండీయాగం...
సుదర్శన యాగం...వాస్తు...లక్ష్మీ
పూర్ణాహుతి పూజలు చేసి హారతి గైకొని...
వేదపండితుల ఆశీర్వచనాలతో...
"ఆరో అంతస్తులోని" తన చాంబర్ లో
మిట్టమధ్యాహ్నం 1.29 ని. లకు
11 మంది వేదపండితులు
నిర్ణయించిన సుముహూర్త వేళ
"తెలంగాణ సింహంలా" తన
సింహాసనం పై సుఖాసీనులై
"ఆరు ఫైళ్ళపై" సంతకాలు చేసిన
"సి.యం కేసీఆర్"
పెట్టిన తొలిసంతకంతో
5544 మంది కాంట్రాక్టు
ఉద్యోగుల జీవితాలలో
"వెన్నెల వెలుగులు" విరజిమ్మాయి
జయహో ! జయహో !
సియం కేసీఆర్ కి జయహో !
జయహో ! జయహో !
తెలంగాణ తెలుగుతల్లికి జయహో !
6. తెలంగాణ "వైట్ హౌస్"
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
నూతన సచివాలయం..!
వనపర్తి సంస్థానం
రాజమందిరంలా...
రాజసం ఉట్టిపడేలా...
గుజరాత్ హనుమాన్
మందిరంలా మనోహరంగా...
మైసూర్ మహారాజా ప్యాలెస్...
హైకోర్టు ఢిల్లీ సెక్రటేరియట్ డోములతో...
తెల్లని రాజహంసలా...
అందాల హరివిల్లులా...
భాగ్యనగరానికి వన్నెతెచ్చేలా...
అమెరికా వైట్ హౌస్ ను తలదన్నేలా...
ఆణిముత్యంలా...మిలమిల
మెరిసే సి.యం కేసీఆర్ కలలుగన్న
సుందర సుపరిపాలనా ఆత్మగౌరవ సౌధం...
డాక్టర్ బిఆర్ అంబేద్కర్
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం...
చెన్నై
బిల్డింగ్ డిజైనర్లు...
పొన్ని...ఆస్కార్ డిజైన్ చేసిన
రాజస్తాన్ ధోల్ పూర్ మైన్
నుండి తెచ్చిన రెడ్ స్టోన్ తో
అత్యున్నత ప్రమాణాలతో
ఓ "మయసభలా"
ఓ "ఇంద్రభవనంలా"
అతి సుందరంగా తీర్చిదిద్దిన
అద్భుతంగా నిర్మించిన
అద్వితీయ అపురూప కట్టడం...
ఈ అంబేద్కర్ సచివాలయం...
అడుగడుగునా...
విస్మయం గొలిపే
విశాలమైన కారిడార్లు...
హిందువులకు...మందిరం...
ముస్లింలకు...మసీదు...
క్రైస్తవులకు...చర్చి
రిసెప్షన్ హాలు...క్యాంటీన్
బ్యాంకులు...డిస్పెన్సర్
పోలీసు కంట్రోల్ రూం...
రైల్ బస్ రిజర్వేషన్ కౌంటర్ లతో...
ఇంకా ఇంకా...ఎన్నో ఎన్నో...
నమ్మశక్యం కాని వింతలు...విశేషాలతో
ఒక రాజమందిరంలా...
ఒక భూతల స్వర్గంలా...
భారత రాజ్యాంగ నిర్మాత...
సుపరిపాలనా స్పూర్తి ప్రదాత...
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు
ప్రతిరూపమై అలరారే...మనసు దోచే...
అబ్బుర పరిచే నూతన సచివాలయం...
అందాలను రండి రండి..!తిలకిద్దాం రండి..!
తిలకించి ఒకసారి పులకించిపోదాం రండి..!
7. గదిలో గబ్బిలంలా బ్రతక్కు...
పైకి క్రిందికి
వ్రేలాడుతూ గదిలో...
గాఢాంధకారంలో...
"గబ్బిలంలా" బ్రతక్కు
మురికి
బట్టలు మోస్తేనేమి..?
గొడ్డుచాకిరి చేస్తేనేమి..?
యజమాని మెప్పును
పొందు "గాడిదలా" బ్రతుకు
గుట్టుగా
"నీటిలో మాత్రమే"
స్వేచ్ఛగా జీవించి...
గట్టున పడీపడగానే
ప్రాణాలు కోల్పోయే
చెరువులో "చేపలా" బ్రతక్కు
నీటిలో ఉండి
నీరెండి పోగానే
నేలపైన సైతం
హాయిగా స్వేచ్ఛగా...
తిరుగే "కప్పలా" బ్రతుకు
"కావు కావు"
మంటూ కాటిలో పెట్టే
"పిండాలకోసం"ఆశపడే...
ఆరాటపడే "కాకిలా" బ్రతక్కు
లేత మావిచిగురులు తింటూ...
కుహూ కుహూ అంటూ...
కోటిరాగాలు కమ్మగా ఆలపించే
కొమ్మల్లో "కోయిలమ్మలా" బ్రతుకు
8. బంగారుగుడ్లు పెట్టే బాతులు..?
ఎన్నికల వేళ
అరచేతిలో స్వర్గం
చూపే మన నాయకులు
నిద్రలో లేపినా చెబుతారు
తీయంగ...." నీతులు"
భద్రంగ వెనుక తీస్తారు
లోతుగ......"గోతులు"
పేదల కొంపలు
కాల్చి కూల్చే ఈ
కొండమీది..."కోతులు"
కాదురా బాబు
రేపు బంగారు గుడ్లు
పెట్టే.........."బాతులు"
9. కుబేరులెవరు...?
ఎన్నికల్లో గెలవగానే...
ఏదో పదవి రాగానే...
కుర్చీలో కూర్చోగానే...
కుబేరులైపోతారు మన
రాజకీయ నాయకులు
బ్రతకలేని...
మెతుకులేని...
బీదలపై నిరుపేదలపై
వీరికెన్నో..."భక్తి శ్రద్ధలు"
ప్రజాసేవ పేరుతో
మ్రింగేస్తారు కోట్ల
కోట్ల నోట్ల..."వెన్న ముద్దలు"
గద్దెలనెక్కి
గారడి చేస్తూ...పేదల
రక్తాన్ని పీల్చే..."ఈ పెద్దలు"
గుట్టుగా
చెంతకు చేరి...
చిరునవ్వుల బాణాలతో
గుండెల్ని చీల్చే..."గ్రద్దలు"
10. బొమ్మలాట...?
ఎన్నికల వేళ
వాగ్దానాల వర్షం
కురిపించే మన నాయకులు
బాగు చేస్తామంటారు
బీదల........"బ్రతుకుబాటలు"
అతిమధురంగా చెబుతారు
అందరికి...."మాయమాటలు"
తెలుసుకున్ననాడు
ప్రజలు వీరి..."తెలివితేటలు"
బయట పడకపోవును కదా ఈ
నాయకుల..."బొమ్మలాటలు"
11. అగ్ని పరీక్షలు...?
కుదురుతుంది
కుదురుతుంది
ఓ పిచ్చి సంబందం
తిరిగి తిరిగి అరిగిపోగా
అరిగిపోగా పది జతల....."పాదరక్షలు"
పెద్ద చదువులు
చదివిన పెళ్ళి కొడుకు
కన్న కూతురు మెళ్ళోవేసె p
మూడుముళ్ళ ఖరీదు..."ముప్పైలక్షలు"
అత్తారింట అడుగు
పెట్టిన నాటి నుండి తన
కన్నకూతురనుభవించేది
కారుచీకటిలో కఠిన..."కారాగార శిక్షలు"
అయ్యో !
ఓ శ్రీరామచంద్రా ! ఆడపిల్లల తండ్రులకే
ఎందుకయ్యా ఇన్ని ....."అగ్ని పరీక్షలు"
12. గుంటనక్కలకు గుణపాఠం..?
ఎలచ్చన్లు వచ్చాయని
"ఎంకడు" ఎగిరి పల్లేదు
కొత్త నోటు చూపినా
"కోటిగాడు" నోరెళ్ళ బెట్టలేదు
సారాయి ఘాటు తగిలినా
"సత్తిగాడు" సచ్చుబడి పోలేదు
కారణం వాళ్ళు మొన్న
ఓట్లు వేస్తూ అనుకున్నారు
ఆ ఓట్లే అన్యాయాలకు
అక్రమాలకు..."వెన్నుపోట్లని "...
ఆ ఓట్లే ఆకలికి..." రోకటిపోట్లని"...
కాని జరిగింది వేరు...
మిగిలింది కంటినిండా కన్నీరు...
ఆ ఓట్లె "అంతులేని
అవినీతికి" ఆజ్యం పోశాయి...
ఆ ఓట్లే వారి "ఆకలి
చావులకు" కారణమయ్యాయి....
కానీ అక్కడ చోటానాయకులు
బార్లలో బీర్లు కొడుతున్నారు
ఇక్కడ వీరు కార్చే...చెమట ఖర్చుతో...
కానీ అక్కడ బడానాయకులు
కోట్లకోట్ల నోట్ల కట్టలతో
ఖజానాలు నింపుకుంటున్నారు
ఇక్కడ వీరు కార్చే...కన్నీటిచుక్కలతో...
అందుకే వారంతా మూకుమ్మడిగా
"నిప్పులాంటి నిర్ణయం" తీసుకున్నారు....
"కూలివాన్ని...కూటికి లేనివాన్ని"...
"కుక్కలకంటె"...హీనంగా చూసే...
ఆ"గుంటనక్కలకు గుణపాఠం" నేర్పాలని...
నవ్వుతూ చాటుమాటుగా కాటువేసె
ఆ"కాలనాగులకు" ఓటు వెయ్యరాదని...
"స్వశక్తియే స్వర్గాన్ని" చూపుతుందని...
"నమ్మితే వారిని నరకమే"మిగులుతుందని..
13. పోలన్న కవి సూక్తి సుధ
పడగవిప్పిన
విషనాగుల మధ్య
పరుండవచ్చునురా..!
తలదూర్చి పులినోట తప్పించుకోవచ్చునురా..!
కానీ వడ్డీవ్యాపారుల చేజిక్కిన
వారి నడ్డి విరుగుట తథ్యమురా..!
అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీకు శుభోదయం...!!
ధనము ఉన్నచో నీవు
ఘనమైన దైవమురా..!
శూన్యమైనచో నీవు
శునకం కన్నా హీనమురా..!
డబ్బు...డబ్బు...డబ్బు...
ఇదేరా ఈ మనిషికున్న జబ్బు..!
అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీకు శుభోదయం...!!
14. తల్లిదండ్రులూ జాగ్రత్త..!
తస్మాత్ జాగ్రత్త..!!
హాస్టల్ విద్యార్థులు
జైల్లో కుక్కిన ఖైదీలు...
పంజరంలో బంధించిన పక్షులు...
అంటున్నారు కొందరు ప్రత్యక్ష సాక్షులు...
మంచిమార్కులు రాకున్ననేమి..?
"స్టేట్ ర్యాంకులు" రావాలని...
ఐఐటీలలో "సీట్లు" రావాలని...
కార్పోరేట్ కాలేజీలలో చదవాలని...
సాప్ట్వేర్ ఇంజనీర్లై విదేశాలలో
లక్షలు...కోట్లు...ఆర్జించాలని...
ఓ కన్నతల్లీదండ్రులారా..!
మీరు "పగటి కలలు" కనకండి..!
మీ పిల్లలకనే "కమ్మని" కలలేమిటో...?
కాసుల మధ్య...
కార్పోరేట్ కాలేజీల
ర్యాంకుల రేసుల మధ్య...
నలిగిపోయే మీ పిల్లల
రేపటి బంగారు భవిష్యత్ ఏమిటో...?
ఖరీదైన కార్పొరేట్ కాలేజీలు
ముక్కుపిండి వసూలు చేసిన ఆ
లక్షల ఫీజులు గంగలో విసిరినట్లేనా..?
అక్కడ పిల్లలు విద్యనే అభ్యసిస్తున్నారో...
మానసిక క్షోభను ఆందోళనను ఒత్తిడిని
"ప్రత్యక్ష నరకాన్ని" అనుభవిస్తున్నారో...
అడకత్తెరలో పోకచెక్కలై అల్లాడుతున్నారో
కార్పోరేట్ వారు మీ కళ్ళకు
కట్టిన "గంతలు" విప్పి చూడండి..!
"నిఘానేత్రాలతో "...పరిశీలించండి..!
"నిప్పులాంటి నిజాలను" తెలుసుకోండి..!
అక్కడ పిల్లలకు నేర్పేది"చదువే"కాదు
చదువు పేర జరిగేది "చీకటి వ్యాపారం"
మీ పిల్లలు వారి చేతుల్లో "కీలుబొమ్మలు"
వారికి ర్యాంకులు ఆర్జించే "రేసుగుర్రాలు"
తల్లిదండ్రులూ జాగ్రత్త..! తస్మాత్ జాగ్రత్త..!!
15. చీకటిలో "చిరుదీపం"
కమ్ముకున్న
ఈ కారుచీకట్లెంతవరకు..?
చీకటిలో "చిరుదీపం"
వెలిగించేంత...వరకు...
ముసురుకున్న...
ఈ కారు మబ్బుల
దాగుడుమూత లెంతవరకు..?
నింగిలో "సూర్యుడు"
తొంగి చూసేంత...వరకు...
ఎగిసెగిసిపడే...
ఆ అలల
ప్రయాణమెంతవరకు..?
అలసిసొలసి
"ఆవలితీరం" చేరేంత...వరకు...
ఉరుకు పరుగుల
ఉద్యోగ జీవితంలో
ఈ ట్రాఫిక్ జామ్ ల
ట్రబులెంత వరకు..?
రెడ్ సిగ్నల్ మాయమై
గ్రీన్ సిగ్నల్ కనిపించి వెళ్ళు...
కానీ "జీవితం" విలువైనది
"వేగం" అతి ప్రమాదకరమైనదన్న...
"చిరు సందేశం" అందేంత వరకు...
16. భయమే భూతం..!
ధైర్యమే దారిదీపం..!
అసలీ లోకంలో ఏదీ ఆగదు
ఆగితే అది ముందుకు సాగదు
భయపడకండి..."భయమే"
ఒక భయంకరమైన భూతమండి..!
అది ఆలోచించనివ్వదు...
అభివృద్ధి చెందనివ్వదు...
అడుగు ముందుకెయ్యనివ్వదు...
ధైర్యంగా వుండండి..."ధైర్యమే"
మనకు దారిలో వెలిగే దీపమండి..!
ఆ వెలుతురులో
మమెంత దూరమైనా వెళ్ళవచ్చు...
ఏదైనా సాధించవచ్చు...వుండొచ్చు...
ఎంతో హాయిగా...
ఎంతో ఆనందంగా...ఎంతో ఆరోగ్యంగా...
ఎంతో సంతోషంగా...ఎంతో ప్రశాంతంగా...
17. మూర్ఖుల రాజ్యం..?
అందరూ మెట్లెక్కితే...
తాను మాత్రం లిఫ్ట్ లోనే
వెళ్ళాలని భావించేవాడు...
ఏ కాలక్షేపం లేక
ఏ టీవీకో...ఏ సెల్లుకో 24/7
"లక్కలా" అతుక్కు పోయేవాడు...
తను తప్పులు చేసి
ఇతరులను నిందించేవాడు...
తాను విషం త్రాగి
ఇతరులు మరణించాలనుకునేవాడు...
తానెప్పుడూ సురక్షితమైన
జోన్ లోనే ఉండాలనుకునే వాడు...
తనను చిన్న చీమైనా కుట్టరాదని...
తనపై చిన్న దోమమైనా వాలరాదనేవాడు..
జీవితంలో ఏ లక్ష్యం లేనివాడు...
ఆవగింజంత శ్రమకూడా చేయనివాడు...
ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని...
అంతరిక్షంలో తిరగాలని ఆశించేవాడు...
పగటి కలలెన్నో కంటూ
క్షణాల్లో అద్భుతాలు జరిగిపోవాలని... తపించేవాడు...జాతకాలు జపించేవాడు...
అట్టి వాడెవడైనా
ఈ భూమి మీద వుంటే...!
వాడు వెర్రివాడే...
వాడు వెయ్యి తలల నాగరాజే...!
మూర్ఖుల రాజ్యానికి
వాడొక మకుటంలేని మహారాజే...!
18. కాలమా కరుణించుమా...!
ఖరీదైనది...కాలమని...
పవిత్రమైనది...శీలమని...
ప్రతిమనిషి గుర్తుంచుకోవాలి
కాలమెంతో విలువైనది...
అది కనులకు కనిపించక
శరవేగంతో రామబాణంలా
ముందుకు దూసుకుపోతోంది
రవికిరణమై వెలుగునిస్తుంది
క్యాలెండర్లో "తేదీలు"
రెక్కలొచ్చిన పక్షుల్లా...ఎగిరిపోతాయి
కాలం...కొవ్వొత్తిలా...కరిగిపోతుంది
ఆయుష్షు...వయసు...తరిగిపోతుంది
కాలాన్ని వృధా పోనివ్వక
ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి
ఘనవిజయాలు సాధించాలి
పది కాలాలపాటు పచ్చగా ఉండాలి
జీవితాన్ని సంతృప్తిగా అనుభవించాలి
ఔను గడిచే కాలంలో
"ప్రతి నెల"...
ఒక కమ్మని కలే...
"ప్రతి వారం"...
ఒక ముత్యాల హారమే...
"ప్రతి ఘడియ"...
ఒక గంగా ప్రవాహమే...
"ప్రతి నిముషం"...
ఒక వసంత గానమే...
"ప్రతి గంట"...
ఒక పచ్చని పంటే...
"ప్రతి నిమిషం"...
ఒక నిత్యకళ్యాణం రచ్చతోరణమే...
19. ఆ మూడు వరాలు...?
ప్రతి మనిషి జీవితంలో
ఖరీదైనవి... విలువైనవి...ఘనమైనవి...
సకలజీవులకు సమంగా
ఆ పరమాత్మ ప్రసాదించిన
వరాలు మూడు
...సమయం...
...సంపద.......
...శక్తి సామర్థ్యాలు...
బాల్యంలో...
...సమయం...
...శక్తిసామర్థ్యాలు...పుష్కలం
...కానీ ప్రయోజనమేమి...?
...చేతిలో సంపద...శూన్యమాయె..!
యవ్వనంలో...
...సంపద...
...శక్తి సామర్థ్యాలు...పుష్కలం
...కానీ ప్రయోజనమేమి...?
...విలువైన సమయం...శూన్యమాయె..!
వృద్ధాప్యంలో...
...సమయం...
...సంపద...పుష్కలం...
...కానీ ప్రయోజనమేమి...?
...శక్తి సామర్థ్యాలు...శూన్యమాయె..!
ఇదే జీవితమంటే "రెండు"పుష్కలమే కానీ
విలువైన"ఆ ఒక్కటిలేక "జీవితం నిష్ఫలమే.
20. గాలిపటం...అలల కెరటం...
హాయి హాయిగా
గాలిలో స్వేచ్ఛగా
విహంగములా
విహరించే
"గాలిపటం"
దారం తెగింది
గంగలో మునిగింది
పొంగిన
కడలిలో
ఎగిసిపడే
"అలలకెరటం"
ఆకలి తీరక
ఆకాశానికి ఎగిసింది
ఔనదొక ప్రకృతి వికృత చేష్ట
కష్టం + అదృష్టం
కలిసొస్తే...కొందరు
"జలపాతాలై"...
జలజల దూకుతారు
"ఏరులై...సెలఏరులై"...
గలగల గంగలా ప్రవహిస్తారు
"తారాజువ్వలై"... రివ్వున
అంతరిక్షంలోకి దూసుకుపోతారు
కానీ...
సోమరితనం + పిరికితనం
ఏకమైతే కొందరు
"అపజయానికి"...చిరునామౌతారు
"అథఃపాతాళాకి"...జారిపోతారు
"అకాలమృత్యువును"...ముద్దాడుతారు
విధివక్రిస్తే....వింతలే....విచిత్రాలే...
ఓడలు...బండ్లే...బండ్లు...ఓడలే...
21. బ్రిటిష్ కింగ్ చార్లెస్...3 పట్టాభిషేకం
ఈ భూగోళమంతా...
భయంకరమైన భూకంపాలతో...
వరదలతో...సునామీలతో...
మంచు తుఫానులతో...
రాజ్యకాంక్షతో...భీకరయుద్దాలతో...
ఎటుచూసినా రక్తపుటేరులే పారుతువుంటే...
ఆకలిచావులతో ధరణి దద్దరిల్లిపోతూవుంటే...
ఏ పాపమెరుగని అమాయకపు ప్రజలు
రెక్కలు విరిగిన పక్షుల్లా పిల్లాపాపలతో
ఇరుగుపొరుగు దేశాలకు ప్రాణభయంతో
పరుగులు పెడుతూవుంటే...
ప్రపంచ ప్రజలు...దుర్భర దారిద్ర్యంలో
బిక్కుబిక్కుమంటూ బ్రతుకులీడుస్తూవుంటే
విధివంచితులూ...క్షతగాత్రులు
ఆసుపత్రిల్లో సకాలంలో వైద్యం
అందక అల్లాడిపోతూవుంటే...
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూవుంటే...
అనాధలై...అస్థిపంజరాలై...
"అన్నమో రామచంద్రా" అంటూ
ఆకలికి అలమటిస్తూవుంటే...
ఆపన్న హస్తాలకోసం
ఆశతో ఎదురు చూస్తూవుంటే...
బడుగు దేశాల ప్రజలెందరో
విలువైన పోషకాహారం...విద్య
వైద్యం అందక విలవిల్లాడుతూవుంటే...
కడుపునిండా తిండిలేక...
కంటినిండా నిద్రలేక...
ఒంటినిండా బట్టల్లేక...
జీవశ్చవాల్లా జీవిస్తూవుంటే...
నేడు పట్టాభిషిక్తులైన
ఓ రాజదంపతులారా..!
అట్టివారి ఆకలికేకలు
మీ చెవులకు వినిపించడం లేదా..?
అట్టి వారి కన్నీటి ధారలు
మీ కళ్ళకు కనిపించడం లేదా..?
ప్రేమ దయ జాలి కురిపించి
ఉదారహృదయంతో వారిని ఆదుకోక...
ఈ పురాతన ప్రమాణ స్వీకార...కిరీట ధారణ...పట్టాభిషేక...మహోత్సవాలేమిటి?
కోటానుకోట్ల ఖర్చుతో
ఈ రాచరికపు అంగరంగ వైభోగమేమిటి..?
ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి..!
గతంలో...
ఎన్నో దేశాలమీద
దండయాత్రలు చేసి...
వారిని బానిసలుగా మార్చి...
ఎన్నో ఏళ్లు ఆ దేశాలను పరిపాలించి...
వాటి సంపదనంతా దోచుకొని దాచుకొని
రవి అస్తమించని సామ్రాజ్యంగా కీర్తి గడించి
మీకోసం మీపిల్లల పిల్లల కోసం...
వెయ్యేళ్ళకైనా తరగని...కరగని
లెక్కకందని...స్థిరచరాస్తుల్ని కూడబెట్టి
కడకేమి..."పట్టుకు" పోదామని...?
ఏమి "మూటకట్టుకు" పోదామని..? ఈ
కోటానుకోట్ల ఆస్తుల ఆర్జన...ఎందుకని..?
నేడు పట్టాభిషిక్తులైన
ఓ రాజదంపతులారా..!
ఆలోచించండి..!
ఒక్కసారి ఆలోచించండి..!
మొన్న కరోనా మహమ్మారికి బలై
కన్నుమూసి కాటికెళ్ళిన కోటీశ్వరులంతా
సమాధులనుండి పంపిన సందేశం ఒక్కటే...
నాది నాది అనుకున్నదేదీ నీదికాదని...
రాణులైనా...రాజులైనా...చక్రవర్తులైనా...
కుబేరులైనా...కూటికిలేని నిరుపేదలైనా...
"మృత్యుదేవత"ముందర
అందరూ సమానులేనని"...
ఈ నేలపై ఈ మనిషి...
జీవితం...మూన్నాళ్ళ ముచ్చటేనని...
22. బ్రిటిష్ రాజదంపతుల పట్టాభిషేకం..?
ప్రపంచదేశాలకే...
ప్రజాస్వామ్యపాఠాలు నేర్పిన
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో...
ఆర్భాటంగా...అట్టహాసంగా...
అంగరంగ వైభోగంగా...
లండన్ వెస్ట్ మినిస్టర్ అబేలోని చర్చిలో...
2000 మంది విదేశీ అతిథుతుల నడుమ
కింగ్ చార్లెస్...3"ఈ ప్రమాణ స్వీకార...కిరీట
ధారణ...పట్టాభిషేక...మహోత్సవమేమిటి
74 ఏళ్ల చార్లెస్...700"సంవత్సరాల నాటి
సింహాసనంపై ఆసీనులు కావడమేమిటీ..?
అతి బరువైన...అతి పురాతనమైన
"బంగారు అంగవస్రాన్ని"ధరించడమేమిటి..?
జెరూసలేం నుండి తెచ్చిన"పవిత్ర తైలాన్ని"
రాజదంపతులపై...చిలకరించడమేమిటి..
కింగ చార్లెస్ కి 360" సంవత్సరాలనాటి
వజ్రాలు పొదిగిన "కిరీట ధారణ" ఏమిటి..?
ఒక చేతిలో "రాజముద్ర"...
మరో చేతిలో "రాజదండం" ఏమిటి..?
బంగారు గుర్రపుబగ్గీలో ఊరేగడమేమిటి..?
బకింగ్ హామ్ ప్యాలెస్ బాల్కనీ నుండి
దివినుండి దిగివచ్చిన దేవతల్లా దేవుళ్ళా
ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వడమేమిటి..?
అతిపురాతనమైన
ఈ రాచరికపు ఆచారాలేమిటి..?
హారతి కర్పూరంలా
ఈ కోటానుకోట్ల ఖర్చేమిటి..?
ఈ ఆధునిక సమాజంలో...
ఈ కంప్యూటర్ యుగంలో...
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో...
ఏమిటి ఈ రాచరికపు "రచ్చ"...?
పట్టాభిషేకం పేర ప్రజాస్వామ్యానికి
కాదా ఇది ఒక మాయని "మచ్చ"...?
అందుకే ఈరాచరికపు రాజకీయాలు వద్దు
ప్రజాశ్రేయస్సు కోరే ప్రజాస్వామ్యమే ముద్దు
23. పైనున్న ఆ పరమాత్మే కాదా...?
ఏ దిక్కులేని వారికి
దేవుడే దిక్కంటారే
అట్టి వారినాదుకున్న "నేతలకు"...దిక్కెవరు..?
పైనున్న ఆ పరమాత్మే కాదా..?
మందులిచ్చి మొండి
రోగాలను మాయం చేసే
డాక్టర్లకే రోగాలొస్తే..?
ఆ "ప్రాణదాతలను"
ఆదుకునేదెవరు..?
పైనున్న ఆ పరమాత్మే కాదా..?
పరుల
సుఖశాంతులకోసం
నిత్యం పరితపిస్తూ
ఆపదలో ఉన్నవారిని
ఆదుకున్న "శాంతిదూతలకే"
ఆపదలొస్తే ఆదుకునేదెవరు..?
పైనున్న ఆ పరమాత్మే కాదా..?
అందుకే
కనిపించకపోయినా
కరుణను కురిపించే
ఆ పరమాత్మకు
నా ప్రార్థన ఒక్కటే...
ఈ మహానేతలపై...
ఈ ప్రాణదాతలపై...
ఈ శాంతిదూతలపై...
వారి కరుణా కటాక్ష వీక్షణాలు
నిరంతరం నిండుగా ఉండాలన్నదే...
24. సమాధులనుండి సందేశం...?
నాటి కరోనా
మహమ్మారికి
బలైపోయిన
ప్రపంచ కుబేరులెందరో
"సమాధులనుండి
పంపిన సందేశం" ఒక్కటే...
నాదినాది
అనుకున్నదేదీ
నీదికాదని...
నిన్న ఎవరికో చెందింది
నేడు నీకు అందిందని...
నేడు నీకు చెందింది...
రేపు మరెవరికో అందుతుందని...
అందుకే నీవెందుకు
బాధపడతావు..?
వస్తూ వస్తూ నీవేమీ తెచ్చావని..?
కాటికి పోతూపోతూ చేత
నీవేమి పట్టుకు పోదామని..?
నీవేమి మూటకట్టుకు పోదామని..?
ఆశపడి శ్రమపడి భ్రమపడి అంతులేని
ఈ అక్రమ ఆస్తుల ఆర్జన...ఎందుకని..?
ఏదీ నీ వెంటరాదంటారు... ఔను
నీ చేతిలో సెల్ ఫోనైనా" నీవెంట...నో
నీ "వ్రేలికున్న ఉంగరమైనా"నీవెంట...నో
నీ "జేబులో పెన్నైనా"నీవెంట...నో
నీ "కాలి మన్నైనా"నీవెంట ...నో కారణం
(స్నానం చేయిస్తారు గనుక)...చివరికి
నీ "ఇంట్లో చీపురు పుల్లైనా"నీవెంట...నో ...
కాదనలేని కారణమొక్కటే...
నీవు ఖాళీ చేతులతో వచ్చావు...
తిరిగి ఖాళీచేతులతోనే కాటికెళతావు...
25. ఆటబొమ్మ కన్న అమ్మయేమిన్న...
ఆశలు ఆవిరైపోయేటి
బంజరు భూముల కన్నా...
ఆకలి మంటలు తీర్చేటి
ఆ పచ్చని పంటలే మిన్న...
అర్ధాంగి....అనురాగం కన్నా...
అమ్మ......ఆప్యాయతే మిన్న...
చెలి చిలిపి......ఒడి కన్నా...
అమ్మ కన్నీటి...తడి మిన్న...
ఉరిమే.....ఉరుముల కన్నా...
మెరిసే.....మెరుపుల కన్నా...
గర్జించే.....మేఘాల కన్నా ...
రైతన్న.....పంట పొలాలపై....
కురిసేటి...మేఘాలే మిన్న...
రాని రాగాలు తీసేటి....కాకి కన్నా...
కూని రాగాలు తీసేటి...కోకిలే మిన్న...
ఆడించి ఓడించి
ఏడ్పించేటి.......ఆటబొమ్మకన్న...
అలసి సొలసి ఇంటికొస్తే...
ఆకలి తీర్చేటి...అమ్మేమిన్న...
ఎడారిలోని........ఎండమావుల కన్నా...
దాహం తీర్చేటి...ఒయాసిస్సులే మిన్న...
ఆశతో పేరాశతో ప్రార్థించేటి...పెదవుల కన్నా
నిస్వార్ధంతో సేవలు చేసేటి....చేతులే మిన్న
విద్యనందించే గురువులుండు...బడి కన్నా
కోనేటిరాయుడు కొలువుండు....గుడే మిన్న
ఔను నిన్నా...మొన్నల కన్నా.....నేడే మిన్న
26. తనకు మాలిన ధర్మం
మొదలు చెడ్డ బేరమా..?
దరిద్రులను
ఆదుకున్నవారు
ధరణిలో దరిద్రులౌతారా..?
అనాధలను
ఆదుకున్న వారు
అవనిలో అనాధలైపోతారా..?
ఔనంటుంది చరిత్ర
కాదనకుంది కాలం
అంతులేని దయాగుణంతో
దానకర్ణులుగా కీర్తి గడించిన...
తెలుగు వెండితెర మీద
ఒక వెలుగు వెలిగిన
చేతికి ఎముకలేని
మరపురాని మహానటి సావిత్రి...
అవసానదశలో దిక్కులేని
ధీన స్థితికి దిగజారిపోవడమేమిటి..?
రాత్రంతా కన్నీళ్ళతో స్నానం చేసి
ఉదయం షూటింగ్ లో పాల్గొని
అనేక చిత్రాలలో నటించిన
ధియేటర్లలో ప్రేక్షకుల్ని
కడుపుబ్బ నవ్వించిన
హాస్య చక్రవర్తి రాజబాబు
(పుణ్యమూర్తుల అప్పారావు)
కట్టుకుపోయిన పుణ్యమేమిటి?
అయ్యో పాపమంటూ వారు
ఆర్జించినదంతా పరులకు పంచి
కుటుంబాలకు దూరమై
కుమిలిపోయి
త్రాగుడుకు బానిసలై
తనువును చాలించడమేమిటి?
ఇదేనా తనకు మాలిన ధర్మం
మొదలు చెడ్డ బేరమంటే...?
ఆకలికి అలమటించే అనాధలమీద
నిరుపేదలమీద నిస్సహాయులమీద
అతి జాలిని ...అతి ప్రేమను...
అతి దయను చూపడం..?
కష్టాల్లో ఉన్నవారిని
కన్నీరు కార్చేవారిని చూసి
కరుణతో కరిగిపోవడం ఒక పాపమా..?
అదే వారు చేసిన ఘోరమైన నేరమా..?
ఇది వారి స్వపరాధమా...?
లేక ఏదైనా శక్తి శాపమా...?
ఎవరికి తెలుసు...?
సృష్టి స్థితి లయలకు
కారణభూతుడైన ఆ పరమాత్మకు తప్ప..!
27. అడుగడుగున...
గండాలే సుడిగుండాలే...
కష్టాల్లో ఉన్నవారి
కన్నీటిని తుడిచే ...
"సంస్కారంవంతులకు"...
క్షణక్షణం నిరుపేదల
సంక్షేమం కోసమే
పరితపించే...
"సంఘసంస్కర్తలకు"...
పరులకోసం
సర్వం త్యాగం చేసే
"త్యాగధనులకు"..
"సానుభూతిపరులకు"...
ఇవ్వడమే తప్ప
పుచ్చుకోవడమెరుగని...
"విశాలహృదయులకు"...
ఆకలంటే అన్నం పెట్టే..
"కరుణామయులకు"...
ఆపద అంటే ఆదుకునే
"అనాధ రక్షకులకు"...
అవసరమంటే పరుగెత్తే...
"ఆపద్బాంధవులకు"...
సమస్యల విషవలయంలో
చిక్కుకొని
బిక్కుబిక్కుమనేవారికి
"భయపడకండి"...
మేమున్నామంటూ
భరోసానిచ్చే..." ప్రేమమూర్తులకు"...
అడుగడుగున గండాలేనా..?
సుఖదుఖాల సుడిగుండాలేనా..?
ఓ దైవమా ! ఇదెక్కడి న్యాయం..?
"ప్రేమామృతాన్ని" పంచడం పాపమా..?
"అభయ హస్తాన్ని" అందించడం శాపమా..?
28. కవి పోలన్న నోట
ఓ కమ్మని మాట..!
...సూర్యుని కంటే...
...ముందు లెయ్..!
..."సుఖపడతావ్"..!
...రోజూ సూర్యోదయం
...వ్యాయామం చెయ్..!
..."రోగాలు" రొష్టులుండవ్..!
...పరమాత్మను భక్తితో
...ప్రతినిత్యం ప్రార్థించు..!
..."ప్రమాదాలు" తప్పుతాయ్..!
...ఆహార నియమాల్ని
...తప్పకుండా పాటించు..!
..."ఆరోగ్యంగా" వుంటావ్..!
...పుష్టికరమైన
...ఆహారం తీసుకో..!
..."షష్టిపూర్తి" చేసుకుంటావ్..!
29. కవి పోలన్న నోట..!
ఓ కమ్మని మాట...!
ఆశించకు...ఆశించకు...
ఈ భూమిపై
శాశ్వతంగా జీవించాలని...కానీ
ఆశించు...ఆశించు...
నీ శ్రమకుతగ్గ ఫలితం నీకు చెందాలని..
నిందించకు...నిందించకు...
విధాత వ్రాసిన
నుదుటి వ్రాతను ...కానీ...
నిందించు...నిందించు...
నిన్ను బాధించి సాధించి
వేధించి వెతలకు గురిచేసే
నీ అనుకూల ఆగర్భ శత్రువులను...
పూజించకు...పూజించకు...
భయపడి పులుల...
సింహాల రూపంలోనున్న
మానవ మృగాలను...కానీ
పూజించు... పూజించు...
నిత్యం నీకు జన్మనిచ్చిన
నీ అమ్మానాన్నలను...
నీకు ప్రాణం పోసిన
ఆ పరమాత్మను...
ప్రాదేయపడకు...ప్రాదేయపడకు...
నీ హక్కులను హరించే కుక్కలకు...
కానీ...
ప్రశ్నించు...ప్రశ్నించు...
పోరాడు...పోరాడు...పోయిన
నీ హక్కులు నీకు దక్కేవరకు...
నీవు విజయశిఖరం ఎక్కేవరకు...
నీ శత్రువులు నీ కాళ్ళకు మ్రొక్కే వరకు ...
30. కన్న అమ్మానాన్నలే
కనిపించే దేవతలు..?
ఓ యువతీ
యువకుల్లారా..!
కళ్ళు పొరలుకమ్మి మీరు
అంధులై...కామాంధులై...
సమాజానికి...చీడపురుగులై...
మానవత్వంలేని..మానవ మృగాలై...
డ్రగ్స్ కు బానిసలై...సంఘవ్యతిరేక శక్తులై...
మీ బంగారు భవిష్యత్తు కోసం
కమ్మని కలలెన్నో కంటూ
ఆర్జించిన ఆస్తులన్నీ ప్రేమతో
మీకే పంచిన మీ అమ్మానాన్నలను
ఆనాధాశ్రమాలలో...చేర్చకండి..!
వారి కళ్ళను కన్నీటి
సముద్రాలుగా.........మార్చకోండి..!
వారి గుండెల్లో గునపాలు గ్రుచ్చకండి..!
కని పెంచిన అమ్మానాన్నలే కనిపించే
దేవతలన్న నగ్నసత్యాన్ని...మరువకండి..!
అవసాన దశలో అమ్మానాన్నలను
"ముసలినక్కలని" మూలన పడుండని
అరవకండి..! "కుక్కలవలె" కరవకండి..!
మీరే కంటిపాపలన్న మీ అమ్మానాన్నలను
మీరు "మీ కన్నబిడ్డలకన్న మిన్నగా"
వారి కంట ఒక్క కన్నీటిచుక్కైనా
రాలకుండా చూసుకోవాలి...
కన్నుమూసి కాటికెళ్ళే వేళ...
వారు మీనుండి ఆశించేది
కాసింత శ్రద్ధ...
కడుపుకొక ముద్ద...
ప్రేమపూర్వక పలకరింత...
హృదయపూర్వక కౌగలింత...
అందుకే ఓ యువతా!
అమ్మ ఒడి.....నీకు బడి కావాలి...
నాన్న గుండె...నీకు గుడి కావాలి...
31. పర్యావరణ "ఉగ్రవాది"..?
ఓ మనిషీ !
నీవు మనిషిలా జన్మించి
పశువులా...
ఎందుకు ప్రవర్తిస్తున్నావు...?
"ఉన్మాదిలా" "పర్యావరణ "
ఉగ్రవాదిలా"ఎందుకు జీవిస్తున్నావు..?
నీ విలాసాలకోసం...
నీ వినోదాల కోసం...
నీ సుఖశాంతులకోసం...
ప్రకృతినెందుకు బలిచేస్తున్నావు..?
సకలజీవులకు ఆ సృష్టికర్త
ప్రసాదించిన పంచభూతాలైన
గాలి...నింగీ...నేల...నీరు...నిప్పు
సర్వం ఉచితమే కాలుష్య రహితమే
కానీ నీవు త్రాగే నీరు...నీవు తినే తిండి...
నీవు పీల్చే గాలి...నీకు వినిపించే శబ్దం...
నీవు వాడి పడేసే ప్లాస్టిక్ భూతంతో
నీ పర్యావరణం...కాలుష్యమైపోతోంది
ఆ ప్రకృతియే వికృత రూపం దాలిస్తే...
ఈ నేలపై "నరుని బ్రతుకు నరకమే".
ఓ మనిషీ ! ఈ కాలుష్యపు
విషపుకోరల్లో నీవు చిక్కుకుపోతే ...
"పులినోట" తలదూర్చినట్లే...
"నవనాగరికత" పేర
నీ "గోతిని" నీవు త్రవ్వుకున్నట్లే...
నీవు "కూర్చున్నకొమ్మను"
నీవు నవ్వుతూ నరుక్కున్నట్లే...
అందుకే ఓ మనిషీ !
నీ స్వార్థానికి...అంతులేని
నీ ఆశకు...నీ అత్యాశకు...
ఆ పంచభూతాలు...
భగ్గుమంటున్నాయి జాగ్రత్త!
ఓ దయగల దైవమా !
ఈ మతిలేని మనిషికి
ఈ జల...శబ్ద...వాయు...
వాతావరణ...కాలుష్యపు...
విషపు కోరలనుండి విముక్తి ఎప్పుడు?
మనిషి స్వార్థాన్ని విడనాడినప్పుడే...
ప్రకృతి ధర్మాలకు కట్టుబడినప్పుడే...
సకలజీవుల సంక్షేమాన్ని కాంక్షించినప్పుడే...
కాలుష్య నివారణే పర్యావరణ పరిరక్షణే...
తమ జీవితలక్ష్యమని...పంచభూతాల...
సాక్షిగా ప్రతిమనిషి ప్రమాణం చేసినప్పుడే...
32. శిల్పి చేతిలో శిలవా..? ఎవరు నీవు?
ఓ మానవా..!
నీవు శిల్పి చేతిలో శిలవా..?
పిచ్చివాని చేతిలో రాయివా..?
ఎవరు నీవు..? ముందు తేల్చుకో..!
ఓ మానవా..!
నీళ్ళలోఎంత కాలమున్నా
మెత్తపడని
"రాతి సందేశమేమిటో"తెలుసా?
స్థితప్రజ్ఞత గల మనిషి జీవితంలో
ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా
నిన్న నేడు రేపు నిండుకుండలా...
నిశ్చలంగా నిర్మలంగా ఉంటాడని...
ఎవరో కొండమీద నుండి తెచ్చిన
ఒక బండను రెండు ముక్కలు చేస్తే
ఒక ముక్క..."చాకిరేవుకు" చేరిందట
ఒక ముక్క చక్కని సుందర దేవతా
శిల్పమై........"గర్భగుడికి" చేరిందట
అర్చనలు అభిషేకాలందుకుందట...
ఆపై చాకి రేపుకు చేరిన
"మురికి బట్టలు" శుభ్రమయ్యాయట
కానీ గుడికి చేరిన
"మురికి మనుషులు" మాత్రం
మురికి మనసులతో ఇంటికి తిరిగెళ్ళారట
ఓ మానవా..!
ఏ ముక్క గొప్పదో ముందు తేల్చాలట...
తొక్కితే రాయట...మొక్కితే దైవమట...
ఇసుకపై...నీటిపై...వ్రాసిన వ్రాతలు
చెరిగిపోతాయట కనుమరుగై పోతాయట
కానీ "శిలలపై చెక్కిన అక్షరాలు"శాశ్వతమట
ఓ మానవా..!
నీ కఠినమైన మనసును మార్చుకోవా...
నీ కుటిల కుక్కబుద్ధిని శుద్ది చేసుకోవా...
నీలోని అరిషడ్వర్గాలను అంతంచేసుకోవా..
ఇకనైనా నీవు రాయివో...రాముడివో...
రాక్షసుడివో రక్షకుడివో ముందు తేల్చుకోవా
33. "కళ్ళులేని కప్ప"
"పాలుత్రాగే పాము" (హాస్య కవిత)
వేడి వేడి
"పాలు త్రాగే పామును"
పాపం "కళ్ళులేని కప్ప" వెళ్ళి
కన్నీటితో వేడుకుందట
ఒక "కప్పుపాలు" అప్పిమ్మని...
ఫక్కున నవ్విన పాము
అయ్యో ఒక "కప్పా"
పది కప్పులపాలు
"ఫ్రీగా"తీసుకోవే
"పిచ్చి కప్పా"అందట
అప్పుడు ఆ అమాయకపు
"కళ్ళు లేని కప్ప" ఆనందం పట్టలేక
అది కలయో......నిజమో అర్థంకాక
పరమానందంతో గంతులేస్తూవుంటే...
పాలన్నీ త్రాగేసిన పాము
ఇంకా "ఆకలితీరక" గంతులేసే
"కప్పను" గబుక్కున మింగేసిందట
ఔను ఇది ప్రతిమనిషి
గుర్తుంచుకో దగ్గ "కప్పగుణపాఠం"...
ఆకలేసిన పులికంట పడిన
ఏ "జింక" బ్రతికి బట్టకట్టలేదని...
పాలుత్రాగే "పాము పడగ" నీడలో
ఏ "కప్ప" ప్రశాంతంగా నిద్ర పోలేదని...
34. బలమైన ప్రభుత్వం
బలహీనుల చేతుల్లో...?
మోసగాళ్ళను
పీకలదాక నమ్మి
ప్రతిసారి మోసపోవడం
అమాయకులకు అజ్ఞానులకు
సామాన్య జనులకు సహజం
నీవు మొదటిసారి మోసపోతే
అది మోసంచేసిన వాడి తప్పు
రెండవసారి మూడవసారి సైతం
మోసపోతే "మూర్ఖుడిగా ముద్ర" నీకే...
అది ముమ్మాటికి
నీ అమాయకత్వమే...నీ అజ్ఞానమే....
అందుకే అందరు
అర్థం చేసుకోవాలి
అంధులకు అధికారమిస్తే...
అంతా అరణ్య రోదనేనని...అంతా
అంధకారమేనని...గాఢాంధకారమేనని...
కానీ కాలమేదైనా...
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో...
ఒక "బలమైన ప్రభుత్వం మాత్రం
బలహీనుల చేతుల్లోనే " వుంటుందని...
35. గట్టిబంధమంటే ! అదే వుంటే ?
ఒకరంటే ఒకరికి ఇష్టం
ఒకరంటే ఒకరికి పిచ్చి
ఒకరికోసం
ఒకరు చచ్చిపోతారు
ఒక్కక్షణం మాట్లాడకపోతే
ఒక్కరోజు చూడకపోతే
భూమి బద్దలైపోతుంది
కాలం ఆగిపోతుంది
తిండి తినబుద్దికాదు
ఏపని చేయబుద్దికాదు
ఎవరితో మాట్లాడబుద్దికాదు
కలవాలని కలిసి మాట్లాడాలని
ఒకటే కలవరింత
నిరాశ నిట్టూర్పులతో నిరీక్షణ
కాస్త దూరమైతే
ఎంతో దూరమైనట్లు
కళ్ళల్లో చిమ్మే కన్నీరు
అట్టి ఆ గట్టిప్రేమ
పెళ్ళైన తర్వాతకూడ
పదికాలాలపాటు
పచ్చగా ఉండాలంటే
కిటుకు ఒక్కటే
రెండు శరీరాలు...
ఒక్కదుప్పటిలో దూరి ఏకమైనట్లే
రెండు మనసులు ఒక్కటి కావాలి
ప్రతిరాత్రి నవరాత్రి కావాలి
ఎలాగంటే...
మత్తెక్కించే మరుమల్లెలు
ఎదురుచూడాలి
తామెప్పుడూ ఇద్దరిమధ్య
నవ్వుతూ నలిగిపోవాలని...
బ్రైట్ గా వెలిగెే బెడ్ లైట్స్
ఎదురుచూడాలి తమనెప్పుడు
ఆకలితో ఆశతో ఆర్పేస్తారోనని...
చల్లని చంద్రుడు మెల్లగా
మబ్బుల చాటున దాక్కోవాలి
గూటిలో గువ్వలు మీ గురించే
గుసగుసలాడుకోవాలి
రాత్రి జరిపే ఆ నిశ్శబ్దయుద్ధంలో
ఇద్దరూ గెలుస్తారు కాబట్టి
ప్రొద్దున లేచిన వెంటనే చాటుమాటుగా
జరిపే శృంగారకేళికి ముగింపుగా
పెట్టుకునే "ఒక్క చిలిపిముద్దు"
గట్టిగా బాహుబందాలలో బంధించుకొని
ఇచ్చిపుచ్చుకొనే "ఒక తియ్యని బిగికౌగిలి"
ఈ రెండు చాలు...ఒకరోజంతా
తియ్యని ఊహల్లో తేలిపోవడానికి...
ఈ రెండూ చాలు...జీవితానికి
ఇసుక సిమెంటులా కలిసిపోవడానికి...
ఈ రెండూ చాలు...జీవితానికి
చెదరని చెక్కుచెదరని
ఒక గట్టిబంధాన్ని నిర్మించుకోవడానికి...
ఆ గట్టి బంధమే ఉంటే
ఇక ఆనందం మీ వెంటే
36. బంగారు బ్రతుకులు...?
సంసారమంటే...?
సంతోషాల సాగరమా?
సమస్యల సరోవరమా?
ఈత నేర్చిన కొందరికి
సంసారమంటే...
సంతోష సాగరమే...
ఈత రాని కొందరికి
సంసారమంటే...
సమస్యల సరోవరమే...
సంసారమంటే...?
చీకటి వెలుగులమయం...
సుఖదుఖాలకు నిలయం...
మూగ ప్రేమంటే...?
ఆవలింతలు
ఆకలి చూపులు
మౌనరాగాలు
మౌన వ్రతాలు
మూగసైగలు
మాయలు మంత్రాలు...
సరస శృంగార భంగిమలు
ఆలుమగల
అనురాగ
బంధమంటే...?
గిల్లికజ్జాలు...
చిలిపి తగాదాలు...
తీపి జ్ఞాపకాలు...
ముద్దు మురిపాలు...
వెన్నెల్లో ముచ్చట్లు...
వేకువ జామున
ముంగురుల చాటున
ముచ్చెమటలు...
మనిషంటే...?
సహనం...సహకారం
మంచితనం...మానవత్వం
సంఘంలో సమానత్వం
విలువైన వ్యక్తిత్వం...
భిన్నత్వంలో ఏకత్వం...
పచ్చని కాపురమంటే...?
సరసాలు....సరదాలు
పరువాలు...ప్రేమపరదాలు
నవ్వులు.....నవరాగాలు
సొగసులు...సోయగాలు
ఓరచూపులు...కిలకిల నవ్వులు
విరుపులు.......వినోదాల మెరుపులు
సుఖజీవన సూత్రమంటే...?
అర్థం చేసుకోవడం...
అపార్థం చేసుకోకపోవడం...
సర్దుకు పోవడం...రాజీ పడడం...
అదే కదా "సుఖజీవన సూత్రమంటే "...
37. నాటి కరోనా కష్టకాలంలో...
ప్రజలకు...
ప్రపంచానికి...
తెలిసి వచ్చినవి...
తెలివి తెచ్చినవి..
ఆకలి చావులు...
ఆస్తులు అంతస్తులు...
తరతమ బేధాలు...
ఎక్కువ తక్కువ తేడాలు...
బేర సారాలు...
సాంఘిక భౌతిక దూరాలు...
స్వలాభము...త్యాగగుణం...
పాపపుణ్యాలు...స్వర్గనరకాలు...
లాభనష్టాలు.....చీకటివెలుగులు...
మంచిచెడులు...తప్పుఒప్పులు...
ధర్మాధర్మాలు... సత్యాసత్యాలు...
ప్రాణభయాలు...కాలమహిమలు...
నాటి కరోనా కష్టకాలంలో...
నాది నాది అనుకున్నదేదీ
నీది కాదన్నది నిత్యసత్యమని...
నీతి నిరంతరం మండే నిప్పని...
నీతిగా నిజాయితీగా బ్రతకాలని..
స్వార్థం ముందున్న ముప్పని...
స్వార్థానికి స్వాగతం పలకరాదని...
నాటి కరోనా కష్టకాలంలో...
అందరికి అర్థమైన
ఆర్థిక సూత్రమొక్కటే...
ఖచ్చితంగా పిచ్చిపిచ్చి
ఖర్చులు తగ్గించుకోవాలని...
క్రమశిక్షణతో కొద్ది కొద్దిగా "
పొదుపు"చేసుకోవాలని...
ఆ "పొదుపును" తెలివిగా...
ధైర్యంగా"మదుపుగా"మార్చుకోవాలని...
ఒక "సజీవ నదిలా" ప్రవహించి
ఆపత్కాలంలో ఆదుకునే
"సంజీవని" వంటి...
ఒక శాశ్వత "ఆర్థిక నిధిని"
సమకూర్చుకోవాలని...సర్వం మరచి...
గతం గతః అనుకొని...అదొక పీడకలని...
మళ్లీ సుఖంగా...ప్రశాంతంగా జీవించాలని...
38. ఎండలు బాబోయ్ ఎండలు..,!
అమ్మో ! అమ్మో !
ఎండలు ఎండలు బాబోయ్ !
కొండలు
పిండౌతున్నాయ్ బాబోయ్ !
ఒకవైపు ఉక్క...
ఉదయభానుడి ఉగ్రరూపం
మరోవైపు "నిప్పులకొలిమి"
ఎన్నడూ లేని ఎండతీవ్రతకు
ఉక్కిరిబిక్కిరైపోతున్న జనం...
వడదెబ్బకు...
పిల్లలు వృద్ధులు
పిట్టల్లా"...రాలిపోతున్నారు
వలస వ్యవసాయ కూలీలు
విల విలలాడి పోతున్నారు
ప్రచండ భానుడు
భగభగ మండుతూ
వడగాల్పుల వలలు...విసురుతూ
ప్రపంచంపై పగ తీర్చుకుంటున్నట్టు
ప్రజలంతా..."చెరువు గట్టున
పడిన చేపపిల్లల్లా"...
గిలగిలా కొట్టుకుంటున్న వైనం...
కేరళ వైపునుండి చల్లని
ఋతుపవనాలెప్పుడు వీచునో
అప్పుడే మనకు...ఉపశమనం
ఔనిది పచ్చినిజం...
"ప్రకృతియే పగబడితే"
"నరుని బ్రతుకు నరకమేనోయ్"
ఉష్ణోగ్రతల విలయతాండవం...
అంతా గజిబిజి గందరగోళం...
ప్రళయం అంచున భూగోళం...
అమ్మో ! అమ్మో !
ఎండలు ఎండలు బాబోయ్ !
కొండలు పిండౌతున్నాయ్ బాబోయ్ !
36. బంగారు బ్రతుకులు...?
37. నాటి కరోనా కష్టకాలంలో...
38. ఎండలు బాబోయ్ ఎండలు..,!
39. జల్లికట్టుకు జయహో..!
మన న్యాయదేవత
కళ్ళకు గంతలు ఎవరు కట్టారో...
ఎందుకు కట్టారో...ఎప్పుడు కట్టారో
ఎవరికీ తెలియదు...కానీ...
మూగజీవుల హింసకు
మూలబిందువైన...
తమిళనాట ఆడే
"జల్లికట్టను"క్రూరమైన క్రీడ...
తమిళుల సాహసమట...
తరతరాల సంస్కృతట...
విషాదంలో వినోదమట...
భిన్నత్వంలో ఏకత్వమట...
కానీ ఆ ఆటలో...
పదునైన కత్తులు కటారుల వంటి
బలిసిన ఆ ఎడ్ల దున్నపోతుల
కొమ్ములకు బలై...కొన ఊపిరితో
రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకునే
యువకులెందరో...ఎందరో...ఎందరో...
ఆఆట ఆడి ఓడి ఒంటినిండా
గాయాలతో ...ఆసుపత్రులపాలై...
కన్నుమూసి కాటికెళ్తే...కుమిలిపోయో
కుటుంబాలెన్నో...ఎన్నో...ఎన్నెన్నో...
ఇది మన కళ్ళెదుటే జరిగే
క్రూరమైన...అతిఘోరమైన
ప్రాణాలు ఫణంగా పెట్టి ఆడే క్రీడ
అందులో ఆనందం ఆవగింజంత
పెనుప్రమాదం...వ్యాపారం కొండంత
అట్టి అతి ప్రమాదకరమైన జంతు క్రీడకు
జైఅంది ఆడుకోమంది అభ్యంతరం లేదంది
సంస్కృతికి సలామంది నా న్యాయదేవత...
ముచ్చట పడి నవ్వింది ఆ మృత్యుదేవత...
అందుకే...
జయహో జయహో...
న్యాయదేవతకు...జయహో...
జయహో జయహో జల్లికట్టుకు జయహో
ఇది జంతువులతో కాదు
మృత్యువుతో ఆడే వికృత క్రీడని...
ఆచారం పేరిట ప్రజలప్రాణాలతో
చెలగాటమేనని...భగ్గుమంటోన్న...
జంతు సంరక్షకులకు...క్షమాపణలతో...
40. గొడవ...మునిగే పడవ...?
ప్రతి
కుటుంబంలో
రావణకాష్టంలా
రగిలే రచ్చలే...రోజూ "గొడవలే"
మూలం......మనస్పర్థలే...
మందులు...ముఖాముఖి చర్చలే...
తెలిసి చేసినా...తెలియక చేసినా
"తప్పు తప్పే...అది..."ఆరని నిప్పే"
అది చర్చలతో సరి దిద్దుకోకపోతే"...?
సలసల మరిగే నీ మనసుకు
సర్దుబాటు గుణం...నేర్పకపోతే
సమస్యల..."నిప్పులకుంపటిని"
సకాలంలో నీవు ఆర్పకపోతే...?
చిలికిచిలికి...గాలివాన...ఔతుంది
"అపార్ధాల అల్పపీడనం"... ఏర్పడి
తుఫాన్ "సునామీగా"మారిపోతుంది
గోటితో పొయేదానికి గొడ్డలి
ఉపయోగించ వలసి వస్తుంది...
చేతులు కాలాక...పచ్చని ఆకులు
పట్టుకొని ప్రయోజనమేముంది...?
చిన్న చిల్లి పడి పెద్ద..."పడవలే"
నీటిలో పూర్తిగా మునిగినట్లు..
పచ్చనికాపురంలో "ఆరనిచిచ్చు"రగిలి
"కుటుంబమను కుండ"...పగిలి
నీ "ఇంటి పరువు"...పేకమేడలా
నీ కళ్ళముందే...కుప్పకూలిపోతుంది...
అందుకే...
ఓ నూతన జంటలారా...!
ఓ పుణ్యదంపతులారా..!
జాగ్రత్త..! తస్మాత్ జాగ్రత్త..!
కడలి అన్నాక...అలలు
కుటుంబం అన్నాక...గొడవలు
కాపురం అన్నాక...కలతలు కన్నీళ్లు
కనులున్నాక...పీడకలలు...సహజమే..!
సహనంతో...సమయస్ఫూర్తితో...
సమభావంతో...సర్దుకు పోవడమే...
కారణం సహనం...నీకు సగం బలం
సమయస్పూర్తి.....నీకు దారిలో దీపం
41. త్రాగుబోతు యోగి కాదు రోగి..?
అయ్యో ! అయ్యో ! ఇదేమి త్రాగుడు...?
ఇదేమి ఊగుడు...? ఇదేమి వాగుడు...?
ఔను అర్థంకాని దొక్కటే
త్రాగితే మనిషి ఋషి ఔతాడా...?
వేదాంతం వళ్ళిస్తాడా...?
త్రాగితే మనిషి బాహూబలి ఔతాడా...?
చెడామడా తిట్టేందుకు...
భార్యా పిల్లలను కొట్టేందుకు...
శత్రువులను ఎదిరించేందుకు...
వెయ్యి ఏనుగుల శక్తి వస్తుందా...?ఏమో
అది త్రాగి...త్రాగి...
తల తిరిగి తిరిగి ఊగి...ఊగి...
వాగుడు కాయలా వాగి...వాగి...
కడకు స్ప్రహ తప్పి ఎక్కడో
ఏ రోడ్డు మీదో.. ఏ మురికి కాలువలో...
పడి...అర్థరాత్రిలో ...గాయాలతో...
అటు ఇంటికో...ఇటు ఆసుపత్రికో చేరే...
సిగ్గూలజ్జా ఆవగింజంతా లేని...
పరువు ప్రతిష్టలను పాతరేసిన...
ఆ పచ్చిత్రాగుబోతులనే అడగాలి
మరునాడు మత్తు...మైకం దిగాక...
మద్యం ఓ మహమ్మారి అంటూ ...
దానికి బానిసలైతే అంటారట...
త్రాగని నా కొడుకెందుకు లోకంలో...
స్వర్గలోక మగపడతది మైకంలో...అని
వాపోయాడు ఓ సినీ గేయకవి ఏనాడో ...
స్వర్గం లోకం...దేవుడెరుగు...
పీకలదాకా త్రాగి
నడిరోడ్డులో పడిపోయిన
త్రాగుబోతుల బ్రతుకు నరకమే...
నలుగురిలో నవ్వులపాలే...
అందుకే ఓ త్రాగుబోతుల్లారా..!
తెలుసుకోండి పచ్చినిజం..!
మీ ఇల్లు గుల్ల...
ఇంటి పరువు గుల్ల...
ఆస్తి గుల్ల...ఆరోగ్యం గుల్ల...
మితిమీరిన మీ త్రాగుడు వల్ల....
నిజానికి ఏ త్రాగుబోతు...యోగి కాదు
భోగి కాదు భయంకరమైన...రోగి మాత్రమే
42. 2000 నోటుపై గొడ్డలి వేటు...
ఓటుకు నోటుకు
రాజకీయ నాయకుల
ఓటమికి ఘన విజయానికి
తలలు పండిన
నేతల తలరాతలు సైతం
తల్లక్రిందులవడానికి
రాత్రికిరాత్రే జాతీయనాయకుల
జాతకాలు మారిపోవడానికి
అదృశ్యంగా అర్థంకాని
ఏదో లింకు ఉన్నట్లే...సందేహం లేదు
నిన్నటి కర్ణాటక ఫలితం
రాజకీయ నాయకుల
గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది
బడా నాయకుల
గుండెల్లో గుబులు రేపింది
కారణం రాజకీయాల్లో
రాణించాలంటే "ఓటుతో నోటును"
కొనుక్కోవడమొక్కటే సులువైన మార్గం
నిన్నటి వరకు
ప్రజలను దోచుకొన్న
తాము బ్యాంకు లాకర్లలో
భద్రంగా దాచుకున్న 2000 నోటుపై
ప్రభుత్వం "గొడ్డలి వేటు" వేసింది
మాయదారి కేంద్రం మాస్టర్ ప్లాన్ వేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2000 రూపాయల నోటును రద్దుచేసింది
కొందరు బడాబాబులకు
కంటిమీద కునుకు లేకుండా చేసింది...
దొరల దొంగదారుల వేట మొదలైంది...
త్వరలో రానున్న అసెంబ్లీ పార్లమెంట్
ఎన్నికల్లో ప్రభుత్వం...ప్రతిపక్షం
రెండు గెలుపు అధికారమే లక్ష్యంగా
"ఓట్లకోసం నోట్లయుద్ధం"ప్రారంభించాయి
43. కర్ణాటక ఫలితం
నన్ను కత్తితో పొడిచింది
నేడు భారతదేశంలో
చలామణిలో ఉన్న నోట్లలో
అతిపెద్ద నోటును...నేనే
అందరిని ఆకర్షించే
"ప్రపంచ సుందరిని"...నేనే.
అందమైన "బాపుబొమ్మను"...నేనే
రంగుల "రవివర్మ చిత్రాన్ని".....నేనే
పేద ప్రజల "బలహీనతను"....నేనే
వారిని నా మత్తులో ముంచి
వారి ఓట్లను గుంజుకోవడానికి...
ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి
మట్టి కరిపించి వారిని శాశ్వతంగా
రాజకీయ సమాధి చేయడానికి...
వారి చేతిలో "వజ్రాయుధాన్ని"...నేనే
బడా బాబులకు...
రాజకీయ కుబేరులకు...
రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్స్ కి...
బంగారు వెండి వ్యాపారస్తులకి...
సినీ సెలబ్రిటీస్ కి...నేనంటే పిచ్చి...
అందుకే వారు
నన్ను దోచుకుంటారు...
బ్యాంకు లాకర్లలో...
స్విస్ బ్యాంకుల్లో ...దాచుకుంటారు
ఇళ్ళల్లో..ఇనుప బీరువాల్లో...
గోడల్లో...గోనెసంచుల్లో...కట్టలుకట్టి
కనపడకుండా కారుచీకట్లో
రహస్యంగా నన్ను బంధిస్తారు
కానీ నిన్నటి "కర్ణాటక ఫలితం"
నన్ను "కత్తితో" పొడిచింది
నా "చావుకు" కారణమైంది
అందుకే నేను
కళ్ళకు కనిపించలేదని
మీరు కన్నీరు కార్చకండి
మరో రూపంలో
మరో చోట దాగి ఉంటాను
మిమ్మల్ని చేరుకుంటాను
ఇంతకీ నేనెవరో మీకు తెలుసా ...?
మొన్న నిన్న మీరు నన్ను
ఎంతగానో ఇష్టపడిన...
మీ జేబుల్లో మీ పార్సుల్లో దాచుకున్న...
"మీ 2000 రూపాయల నోటును"...ఇక
మీ "అందరికీ సెలవు" అశ్రునయనాలతో...
44. ఓటర్లు...ఒప్పందపత్రాలు...
ఔను ఇది రేపటి నిజం
రెండు మూడు 2000 పచ్చనోట్లకు...
మందుకు...మటన్ చికెన్ బిర్యానికి...
అమ్ముడుబోయి అమాయకపు ఓటరు
ముందస్తుగా వ్రాసిచ్చే "ఒప్పందపత్రం"
ఆ అమాయకపు ఓటర్లకు పంచాలని...
ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ఓడించాలని...
అక్రమంగా దోచుకున్నారు
గుట్టుగా దాచుకున్నారు
గోడల్లో గోనెసంచుల్లో బ్యాంకులాకర్లలో
గుట్టలుగా గుట్టలుగా 2000 నోట్లకట్టలు
కర్నాటక ప్రజా తీర్పుతో ఉలిక్కిపడ్డ
మాయదారి కేంద్రం మాస్టర్ ప్లాన్" వేసింది
ప్రత్యర్థులపై ప్రతీకారంతో
ఎన్నికల్లో వారిని చిత్తుగా
ఓడించడమే లక్ష్యంగా
ఓటర్లకు "నోట్ల"...ఎరవేసి
"ఓట్ల చేపలు"... పట్టేందుకు
"2000 నోట్లకట్టల వలల్ని"చించి
వారి కలల్ని... ఎన్నికల ఫలితాల్ని
తారుమారు చేసే దురుద్దేశంతో...
కేంద్రం "2000 నోటును" రద్దుచేసింది
ప్రతిపక్షం ప్రత్యామ్నాయం వెతుకుతోంది
130 రోజుల సమయముంది...
మొన్న దాచిన 2000 నోట్లకట్టలను
రహస్యంగా ఓటర్లకు పంచిపెట్టి
రానున్న అసెంబ్లీ పార్లమెంట్
ఎన్నికల్లో " మీకే ఓటు వేస్తామంటూ"
ఓటర్ల "ముందస్తు ఒప్పందపత్రాలతో "
"కాకలు తీరిన రాజకీయ నేతలు
"కసరత్తులు"... ప్రారంభించారు.
"కరెన్సీ కత్తులు"...విసురుకుంటూ...
"ఎన్నికల శంఖారావం" పూరిస్తూ...
45. హీరో శరత్ బాబుకి శ్రద్దాంజలి...
జననం.1951 జూలై 31
మరణం.2023 మే 22
హీరో శోభన్ బాబులా
"అందాల నటుడు"
శ్రీ శరత్ బాబు అకాలమరణంతో...
తెలుగు తమిళ మలయాళ
కన్నడ హిందీ ఐదు భాషల్లో
హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా
దాదాపుగా 250 సినిమాల్లో
అద్భుతంగా నటించిన మరోనటున్ని
తెలుగు చలనచిత్ర సీమ కోల్పోయింది
శరత్ బాబు మొదటిచిత్రం
"రామరాజ్యం"...
చివరిచిత్రం... "వకీల్ సాబ్"
వారి అసలు పేరు...
సత్యనారాయణ దీక్షితులు
సత్యంబాబు...ముద్దు పేరు
శరత్ బాబుది
ఏడుమంది అన్నదమ్ములు
ఆరుమంది అక్కాచెల్లెళ్ళున్న
ఉత్తరప్రదేశ్ నుంచి ఆముదాలవలసకు
వలస వచ్చిన ఓ సాంప్రదాయ కుటుంబం
సీతాకోక చిలుక...
నోము...ఇది కథ కాదు
గుప్పెడు మనసు...శంకరాభరణం... సాగరసంగమం...స్వాతి ముత్యం...
చిత్రాలలో వారి నటన అద్భుతం...
మరిచిపోలేని మహానటుడు శరత్ బాబు
మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో
హైదరాబాద్ లో మరణించిన
72 సంవత్సరాల రమాప్రభ మాజీ భర్త
శ్రీ శరత్ బాబు గారి ఆత్మకు శాంతి
చేకూరాలని...వారి కుటుంబ సభ్యులకు
ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ...
అశృనయనాలతో...అక్షర నీరాజనం...
46. మద్యం మత్తుకు
బానిసలైతే ఇక మరణమే..?
నిత్యం నిషాలోఉండువాడు...
నీచుడు...నికృష్టుడు...నిత్యదరిద్రుడు
కన్నబిడ్డల్ని కట్టుకున్న భార్యను ఆకలికి
మాడ్చేవాడు...అంధుడు...అవివేకి...అజ్ఞాని
కష్టపడి ఆర్జించిన
సొమ్మునంత కల్లు దుకాణాల్లో
వైన్ షాపుల్లో ఖర్చుచేసి
నిత్యం మందు త్రాగడమంటే...
వాడు కట్టుకున్న భార్య కన్నబిడ్డల
రక్తాన్ని త్రాగడమే...రాక్షసుడిగా మారడమే
పుస్తెలు తాకెట్టెట్టి పీకలదాకా మందుకొట్టి
ఇంటికొచ్చి బూతుపురాణం మొదలుపెట్టి
తల్లీ బిడ్డల్ని... రక్తంత్రాగే రాక్షసుడిలా
హింసిస్తున్నాడంటే ఖచ్చితంగా రేపు
వాడు...పురుగులు పడి...ఛస్తాడని అర్థం
అందరూ వాన్ని...ఒక పురుగులాగా
సమాజానికి...ఒక చీడపురుగులాగా
ఛీకొడతారని...వాడికి తెలీదు
వాడు ఏ సిగ్గు లజ్జా మానంలేని
బ్రతికి ఉన్న...ఓ శవంతో సమానం...
త్రాగుబోతు జీవితం...నిరర్థకం
వాన్ని కట్టుకున్న భార్య...
వాడు కన్నబిడ్డలు...శాపగ్రస్తులే...
వాడు వారికి...నరకం చూపిస్తాడు
నిత్యం...భరించలేని బాధలు పెడతాడు
నలుగురిలో అందరు నవ్వులపాలౌతారు
నాలుగు రోజుల ఆ
వెర్రిసుఖంకోసం...విర్రవీగుతాడు
విచ్చలవిడిగా...విషపురుగులా ప్రవర్తిస్తాడు
ఆపై ఆరోగ్యం చెడి...ఆసుపత్రి పాలౌతాడు
నిజానికి...చచ్చినోళ్ళకు
ఈ...పచ్చిత్రాగుబోతులకు తేడా ఒక్కటే
ఒకరు...సమాధిలో నిర్జీవంగా...
మరొకరు...భూమిమీద సజీవంగా అంతే
అందుకే మద్యానికి...
బానిసలైన ఓ త్రాగుబోతుల్లారా..!
పశువులుగా...ఎందుకు ప్రవర్తిస్తారు...?
పరమాత్మ...సహనాన్నెందుకు పరీక్షిస్తారు..?
ఇకనైనా ఓ పచ్చినిజాన్ని...తెలుసుకోండి....!
ఉత్కృష్టమైనది... ఈ మానవ జన్మని...
దుర్వెసనాలకు...బానిసలైతే దుఃఖమేనని...
మద్యం మత్తుకు బానిసలైతే మరణమేనని.
47. కనువిప్పు కలిగించిన కర్ణాటక...?
మొన్న జరిగిన
అసెంబ్లీ ఎన్నికల్లో
మనువాదుల
కలల్ని కల్లలు చేస్తు
కాంగ్రెస్ పార్టీకి
"పట్టం"కట్టింది...కర్ణాటక
అందుకే ఏనాడో
ముందుచూపుతో
ఆంగ్లేయులను ఒప్పించి
అంబేద్కర్ మహాశయుడు
కల్పించిన "రాజ్యాంగ హక్కును"
"ఓటు విలువను...ఓటరు శక్తిని"
విశ్వమంతా...తెలియజేసి...
ఎందరో రాజకీయ
కురువృద్ధులకు...
"కనువిప్పు" కలిగించిన...
నేతల"తలరాతల్ని"
తారుమారు చేసిన..?
"మనువాదుల్ని"
మట్టి కరిపించిన...
విజ్ఞులైన "కర్ణాటక "
ఓటరు దేవుళ్ళకు"
వందనం...పాదాభివందనం...
"వజ్రాయుధం" వంటి
"ఓటుహక్కును" కల్పించిన
రాజ్యాంగ నిర్మాత..!
స్పూర్తి ప్రదాత...!
అమరజీవి అంబేద్కర్ కు...
వందనం...పాదాభివందనం...
48. మూడు గుర్తులు...?
అందమైన
బాల్యానికి గుర్తు...
ఆటలు పాటలే...
అల్లరి చేష్టలే...
ఆణిముత్యాలను పోలిన
అమాయకపు మాటల మూటలే...
పడుచుదనానికి గుర్తు...
పరువంలో గుర్రపు పరుగులే....
కవ్వించే కలలే...చిలిపి చూపులే...
వలపు పిలుపులే...వసంత గీతాలే...
ముసలితనానికి గుర్తు...
ముఖంమీది ముడుతలే...
పసిపాపల...బోసి నవ్వులే...
నెరిసి మెరిసే నెత్తిన తెల్లనికిరీటమే...
49. కలలు కలతనిద్ర....
కడలన్నాక......అలలు
కనులున్నాక...పీడకలలు
తప్పవంటారు ఆశాజీవులు
ఔను మనం గాఢనిద్రలో
కమ్మని కలలెన్నోకంటాం
కొన్ని పిచ్చి...పీడకలలు
కొన్ని వెర్రి...వేధించే కలలు
కొన్ని భయానకమైనవి
పిశాచుల్లా పీడించే కలలు
ఎవరో ఎదపైకి ఎక్కితొక్కి
పీకను పిసికినట్లు ఊపిరాడక
ఉక్కిరిబిక్కిరయ్యే కలలు...
కొన్ని పగపట్టిన పాముల్లా
వెంటపడి కాటువేసే కలలు...
కొన్ని తలాతోకాలేని తలతిక్కకలలు
కొన్ని తల కాళ్లు చేతులు నరికేసినట్లు
భయంతో గజగజ వణికించే కలలు...
కొన్ని తాళ్లతో గట్టిగా కట్టినట్లు
రాళ్లతో కొట్టినట్లు గన్నుతో కాల్చినట్లు
ఎత్తైనప్రదేశం నుండి
ఏ లోయలోకో ఏ నీళ్ళలోకో
నిప్పుల్లోకో నెట్టేసినట్లు కలలు...
కొన్ని రాత్రాంతాఎవరో
కత్తులతో పొడిచినట్లు...
గండ్రగొడ్డళ్లతో నరికినట్లు...
రక్తం ఏరులైపారుతున్నట్లు...
రాసి రంపానపెట్టే రాక్షసకలలు...
కొన్ని మనల్ని ఒక ఆట
ఆడించే ఓడించే పీడించే కలలు...
కొన్ని మనకు సంబంధంలేని
వారితో క్రీడించినట్లు కనే
బంగారపు శృంగారపు కలలు...
ఒక్కసారి మనం ఉలిక్కిపడి
కళ్ళురెండు తెరిచి చూస్తే చాలు
మళ్ళీ ఆ పాత ప్రపంచమే...
కళ్ళకు గోచరించేది ఆ పాడులోకమే...
కానీ రాత్రంతా చిత్రమైన విచిత్రమైన
ఓ వింతలోకంలో విహరించి వుంటాం
ఇలా వింత వింతగా కలలుగని నిద్ర లేస్తే...
ఇక ఆరోజు బుర్రనిండా భూతాలే
50. ఇది నిజం నమ్మలేని పచ్చినిజం...?
మడిలో...ఉంటారు
మండుటెండల్లో
చెమటలు కార్చి కార్చి
మట్టిని మెతుకుగా మార్చి మార్చి
ఆకలిమంటలు తీర్చేటి అన్నదాతలు
బడిలో...ఉంటారు
నేటి బాలలను రేపటి డాక్టర్లుగా...
లాయర్లుగా...లక్షాధికారులుగా...
కలెక్టర్లుగా... సినీయాక్టర్లుగా
కంప్యూటర్ ఇంజనీర్లుగా...
సైనికులుగా... సైంటిస్టులుగా...
భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది
బంగారు భవిష్యత్తును ప్రసాదించే
గురువులనే...జ్ఞానసూర్యులు
గుడి...ముందు ఉంటారు
గుంపులు గుంపులుగా
కళ్ళు కాళ్ళు లేని అనాధలు
ఏ ఆధారం లేని
ఎగరలేని గాలిపటాలు
రెక్కలు విరిగిన పక్షులు
ఆకలికి అలమటించే బిక్షగాళ్ళు
గుడికెళ్ళే...వచ్చే...
భక్తులను ప్రాధేయపడతారు
ఇంత "చిల్లర" వేయమని...
కానీ గర్భగుడిలో కొలువైవున్న
ఆ "భగవంతున్ని" వేడుకోరు
తమ "బ్రతుకుల్ని" బాగుచేయమని...
ఇదేమి వింతో ఎంతకూ అర్థం కాదు...
కానీ బిక్షగాళ్ళు బిల్ గేట్స్ గా మారేది
దశ తిరిగితేనే ఏదైనా లాటరి తగిలితేనే
51. ఏరులై పారిన నల్లధనం...?
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
మనువాదుల కలల్ని కల్లలు చేస్తు
కాంగ్రెస్ పార్టీకి పట్టం" కట్టింది...కర్ణాటక
కారణం రహస్యంగా "ఏరులై పారిన
కోట్లకోట్ల నోట్లకట్టల ప్రవాహమేనట"
అందుకే ఒక్కసారి ఉలిక్కిపడ్డ
ఆర్.బి.ఐ హటాత్తుగా పెట్టిన
"2000 నోటు ఉపసంహరణ నిప్పుకు"
"బ్యాంకు లాకర్ల కలుగుల్లో " దాక్కున్న
"2000 నోట్లకట్టల ఎలుకలు"
బయటి కొచ్చేస్తున్నాయి...
ఊపిరాడక...ఉక్కిరిబిక్కిరై....
ఔనీ కర్ణాటక ఎన్నికల ఫలితమే
"2000 రూపాయల నోటును"
కత్తితో పొడిచింది...కనపడకుండా చేసింది
రాజకీయనేతల...గుండెల్లో గుబులురేపింది
52. అస్తమించే సూర్యుడు...
పనిఅని చెవిన పడగానే
రెండు చేతులు కట్టుకునే
కాళ్ళు ముడుచుకుని పడుకునే
మంచం దిగని పరమ సోమరికి...
విందులు వినోదాలలో
మునిగి తేలుతూ
ఖరీదైన బ్రతుకు బ్రతికే
విలాస పురుషుడికి...
నరకంలో సైతం చోటు లేదట...
శ్రమలోనే స్వర్గముంది...
సోమరితనంలోనే నరకముంది...
సాహసమే జీవితం...వికాసమే విజయం...
విస్తరించలేని వాడు అస్తమించే సూర్యుడే...
53. ఆకలి తీర్చిన అడవి...?
నేను అడవిని ఆరగిస్తాను
నేను సముద్రాన్ని మింగేస్తాను
నేను కొండలను పిండి చేస్తాను
నేను ఎత్తైన
పర్వతాలను ఎక్కేస్తాను
నేను అహంకారులను
అధఃపాతాళానికి తొక్కేస్తాను
నేను విషంగ్రక్కేపాములోనున్న
ఆ పరమాత్మకు మొక్కేస్తాను
నేను విధిని ఎదిరించగలను
దాని గుండెల్లో నిదురించగలను
మృత్యువును ముక్కల్ చేయగలను
నేను ఓటమికి భయపడను
శక్తి సంకల్పం నాలో అనంతం
నేను పిరికివాడిని కానేకాదు
నేను ఒక పులిని...
నేను ఒక సింహాన్ని...
నేనొక మదపుటేనుగును...
నేను పిల్లిలా పారిపోను...
ఊసరవెల్లిలా మారిపోను...
చివరి శ్వాస వరకు పోరాడుతాను...
ఆ పరమాత్మ ప్రసాదించిన
ఈ మానవజన్మను సార్ధకం చేసుకుంటాను
54. శ్రమ..?
ఉదయిస్తే
శ్రమలో నుంచే...
స్వేచ్ఛను త్రుంచే...
"స్వేద బిందువులే"
.....నీ నుదుట....
ఉరిపోసుకోవు
సుమా..!
చీకటిని
తొలగించే...
చిత్తాన్ని
వెలిగించే...
"చిరునవ్వులు"
.....నీ ఎదుట....
55. ఆహా ఏమి చాకచక్యం..?
(మినీ హాస్య కవిత)
సింపుల్ గా ఓ బ్లౌజ్ కొనబోతే
ఖరీదైన "కంచి పట్టుచీరే" కొనిపించాడు
"అప్పురేపు" అని వ్రాసి ఉన్నా...
"అయ్యగారి జేబు" ఖాళీగా ఉన్నా...
ఆహా ఆ షాపువాడిది
ఎంతటి చాకచక్యం..!
అర్ధాంగి ఆశ్చర్యం ..!
అంతరంగంలో
పొంగి పొరలే ఆనందం..!
ముఖాన ముసిముసి నవ్వులు..!
చాకచక్యమా నా బొందా..!
వొద్దు వొద్దు అనలేక
ఓకే అన్నాడీ పిరికిపంద...!
నీ అదృష్టం..! నా దురదృష్టం..!
నీవే...నక్కతోక
తొక్కొచ్చావో ఏమో
ఖరీదైన కంచిపట్టుచీర కొట్టేశావ్..!
నేనే...కుక్కతోక తొక్కొచ్చానో ఏమో
ఈ చీరల షాపులో చిక్కుకుపోయా..!
శ్రీవారి స్వగతం..!
అంతరంగంలో
అంతులేని ఆవేదన..!
ముఖాన మాత్రం
చెరగని చిరుమందహాసం..!
56. అది పార్లమెంటా...? కాదు
ప్రజాస్వామ్య దేవాలయం..!
మొన్న ప్రధాని మోడీ
అట్టహాసంగా ప్రారంభించి
జాతికి అంకితం చేసిన
భిన్నత్వంలో ఏకత్వానికి
సుస్థిర సుపరిపాలనకు
సనాతనధర్మాలకు
సంస్కృతి సాంప్రదాయాలకు
ప్రజల ఆశలకు ఆకాంక్షలకు
ప్రతి బింభమైన
ప్రజాస్వామ్య దేవాలయం
నూతన పార్లమెంట్ భవనం
త్రిభుజాకారంలో...
లోక్ సభ జాతీయ పక్షి
నెమలి ఆకృతిలో...
రాజ్యసభ జాతీయ పుష్పం
కమలం ఆకృతిలో...
3 శక్తి జ్ఞాన కర్మ ముఖద్వారాలతో...
4 అంతస్తుల్లో ...
16 ఎకరాల్లో ...
970 కోట్లఖర్చుతో...
1224 మంది పార్లమెంటు సభ్యులకోసం
అహమ్మదాబాద్ ప్రముఖ ఆర్కిటెక్
బిమల్ పటేల్ డిజైన్ చేయగా...
60000మంది కార్మికులచే
టాటా ప్రాజెక్టు లిమిటెడ్
2 సంవత్సరాల 5 నెలల 18 రోజుల్లో
నిర్మించిన చారిత్రాత్మకమైన కట్టడం
కానీ ఎంతో అంగరంగ వైభవంగా
జరిగుతున్న ఈ నూతన పార్లమెంట్
భవన ప్రారంభమహోత్సవానికి
"మాయని మచ్చ" ఒక్కటే....
ఈ ప్రజాస్వామ్య దేవాలయానికి
దేవతగా ఆరాధించబడే గౌరవించబడే
దళితమహిళా రాష్ట్రపతి శ్రీమతి ముర్మును
మొన్న బ్రిటిష్ కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి...
నేటి మన కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి...దూరంగా ఉంచడమే
నిరసనగా ప్రతిపక్షాలు బహిష్కరించడమే
ఇది అంబేద్కర్ అందించిన
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే...
ఇది అత్యున్నత పీఠానికి అవమానమే...
ఇంటిగుట్టు ఈశ్వరునికే ఎరుకన్నట్టు
అంతుచిక్కని ఈ చిదంబర రహస్యం
ఆ మోడికి...అమిత్ షాకి ఆపూజారులకు
ఆవేదపండితులకు ఆమనువాదులకే ఎరుక
ఔను ఈ సువిశాల సుందర పార్లమెంట్
భవనం భారతీయులకు ఓ గొప్పవరం
భారతమాత మెడలో మెరిసే పచ్చలహారం
ఇది భరతజాతి చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించదగిన శుభదినం మోడీ దార్శనికతకిది నిలువెత్తు నిదర్శనం
సాహసోపేత నిర్ణయాలకు సజీవ సాక్ష్యం.
57. మూడు ముఖద్వారాల ముచ్చట..?
అదిగో నేడు...
(28.05.2023)న ఢిల్లీలో
ప్రధానమంత్రి మోడీచే
ప్రారంభించ బడుతున్న
అందమైన
అపురూపమైన
అద్వితీయమైన
సుందరమైన...సువిశాలమైన
త్రిభుజాకారంలో నిర్మించబడిన
నాలుగు అంతస్తుల
నూతన పార్లమెంట్ భవనం...
జ్ఞాన...శక్తి...కర్మ...అను
మురిపించే మూడు ముఖద్వారాలతో
కళకళలాడుతోంది...కనివిందుచేస్తోంది
జ్ఞాన ద్వారానికి...
ఒకవైపు గార్గి యజ్ఞవల్య
సంవాద దృశ్యం...
మరోవైపు నలంద చిత్రాలు
శక్తి ద్వారానికి....
ఒకవైపు చాణిక్య చిత్రం
మరోవైపు మహాత్మా గాంధీ
దండియాత్ర దృశ్యాలు
కర్మ ద్వారానికి...
ఒకవైపు కోణార్క్ చక్రం
మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ల కాంస్యవిగ్రహాలు
58. కవి పోలన్న నోట..! ఓ కమ్మని మాట..!
జాలికి...సానుభూతికి
జోలెపట్టకు...గోలపెట్టకు..!
ప్రేమలేని పలకరింపులకు
ఎన్నడూ పులకరించిపోకు..!
బ్రతుకు భారమనే చోటుకు
వీలైనంత దూరంగా ఉండు..!
నిన్ను దూరంగా నెట్టే వారిని
అతుక్కు పోవాలని ఆశించకు..!
నీ నీతికి నిజాయితీకి విలువలేని
చోట ఒక్క నిముషమైనా నిలవకు..!
నీ ఆత్మాభిమానమే నీకు ధనం గొప్ప
ఇంధనం అని అనుదినం గుర్తుంచుకో..!
నీకై ఎదురు చూడని...గౌరవించని ఇంటికి
ముఖ్యఅతిథిగా వెళ్ళడం నీ మూర్ఖత్వమే!
నీది...కానిదేదీ...నీకు దక్కదని తెలిసీ
ముక్కోటిదేవతలకు మ్రొక్కడం వెర్రితనమే!
అన్నపోలన్న నోట ! పలికే ఓ మంచిమాట !
అది నిత్యసత్యాల ఆణిముత్యాల మూట !
59. చిత్ర కవిత...
టిప్పుసుల్తాన్ వాడిన
కత్తి ఖరీదు 143 కోట్లు..?
అప్పుడు టిప్పుసుల్తాన్
మిలమిల మెరిసే ఆ కరవాలంతో...
ఎన్ని శిరస్సులను చేధించాడో...
ఎదురు తిరిగిన ఎంతమంది
అమాయకులను ఖతం చేశాడో...
ఎవరికెరుక...ఆ అల్లాకు తప్ప
ఇప్పుడది 143 కోట్ల ధర పలికింది...
ఆహా ఆ కత్తికెంతటి గౌరవం దక్కింది...
దానికి కారణం ఆ కత్తిని తయారు
చేసిన ఆ కళాకారుని నైపుణ్యమే కదా...
తన శత్రువులు ఎవరు ఎప్పుడు
ఏ వైపునుండి దూసుకు వస్తారో
అంచనాలకందక ఆత్మరక్షణకోసం
కత్తిని పడకగదిలో భద్రంగా
దాచుకున్న టిప్పుసుల్తాన్ ...
పాపం కంటినిండా
ఏనాడు కునుకు తీసి ఉండడేమో...
రోజూ"కలత" నిద్రే...
రోజు "పీడకలలే" కాబోలు...కారణం
ఆర్జించిన ఆస్తిఅంతా పరులపాలై
పోతుందన్న అనుమానం...
క్షణక్షణం శత్రువులనుండి ప్రాణభయం...
60. ఆత్మ విశ్వాసం...
ఒక అఖండ జ్యోతి...
కొందరి జీవితాలు
...మూడు పువ్వులు
...ఆరు కాయలు
కొందరి జీవితాలు
...ముందు నుయ్యి
...వెనుక గొయ్యి
కొందరి జీవితాలు
...నిమిషంలో
...మాయమయ్యే
...నీటి బుడగలు
కొందరు జీవితాలు
...ప్రమాదాల
...పాము పడగలు
ఎప్పుడైనా
ఏ క్షణమైనా
అకస్మాత్తుగా నెత్తిన
పడవచ్చు...పిడుగు
అందుకే
ఆ పరమాత్మను...అడుగు
అడ్డుపెట్టమని తన
అభయహస్తమనే...గొడుగు
మీరు కలలో
కూడా ఊహించని
"కష్టాల ఊబిలో"
కూరుకుపోయినప్పుడు
"గట్టును పడిన చేపల్లా" మీరు
గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు...
ఓ కన్నతండ్రిలా...
వచ్చి కాపాడేదెవరు ?
ఓ కన్నతల్లిలా...
వచ్చి ఓదార్చేదెవరు ?
ఓ ప్రాణమిత్రుడిలా...
వచ్చి మీ కన్నీరు తుడిచేదెవరు ?
ఆపదలో చిక్కుకున్న మిమ్మల్ని
ఆదుకునే ఆపద్బాంధవులెవరు ?
ఇంకెవరు మీలో..."అఖండజ్యోతిగా"
అనుక్షణం వెలిగే ...మీ ఆత్మ విశ్వాసమే
అందుకే
చీకటి పడకముందే..."దీపం"వెలిగించాలి
పిడుగు నెత్తిన పడక ముందే
ఆలోచించి..."అడుగు" ముందుకెయ్యాలి
61. అపూర్వమైన ఓ ఆత్మీయ కలయిక
నిజంగా నిన్నటి మనందరి కలయిక
అపూర్వమైన...ఓ ఆత్మీయ కలయిక
మనందరి హృదయాలలో...వెలిగేది
మనలోని...స్వచ్చమైన స్నేహదీపం
అందరి ముఖాలలో...చెరగని చిరునవ్వులే
కబుర్లు...కబుర్లు...కబుర్లు...
కాలమలా...ఐస్ క్రీంలా కరిగిపోయింది
కమ్మని కబుర్లతో... తీపి జ్ఞాపకాలతో ...
అందరి మది మురిసి ముద్దైపోయె
పరమానందంతో పరవశించిపోయె
ఆ ఆనందం ఆ సంతోషం వర్ణణాతీతం
ఆహా ఓహో ఏమా ! ప్రేమపూర్వకమైన
పలకరింపులు...పకపక నవ్వులు
ఎదనిండా ఏవో తెలియని
కలవరింతలు...పులకరింతలు
హృదినిండా ఏన్నో.. ఎన్నెన్నో
...సంతోషాల సరిగమలు
...పరమానందపు పరిమళాలు
అదిగో అందరి ముఖాలలో కురిసేను
...చిరునవ్వుల చిరుజల్లులు
జంటలు జంటలు...
....తనివితీరా...కనుల పంటలు
జంటలు జంటలు
...మ్రోగేనులే...గతజ్ఞాపకాల జేగంటలు
అందరి మదిని దోచాయి చట్నీలోని
...నోరూరించే రుచికరమైన వంటలు
అన్నదాతకు ఆరోగ్య ప్రాప్తిరస్తు
సిరిసంపదలు సుఖశాంతులు సిద్ధిరస్తు
62. సెల్లుకు బానిసలైతే..?
మాయలేడికి
మానవ బాంబుకి
ప్రతిరూపమే సెల్లంటే..!
ఎవరూ సెల్లుకు
బానిసలై పోరాదు
సెల్లుకు బానిసలైతే
బంగారు జీవితం బలైపోయినట్లే...
రాయిలాంటీ ఆరోగ్యం కోల్పోయి
పనులన్నీ కొండలా...పేరుకు పోవడమే...
రోగాల ఊబిలో.......కూరుకు పోవడమే...
సెల్ బానిసల్నెవరూ లెక్కచేయరు
అందరూ ఛీ అని అసహ్యంచుకొనేవారే
ఐతే సెల్ నీ హీరో...గౌరవం ఇక నీకు జీరో
జీవిత సర్వస్వం సెల్లే కారాదు
సెల్ ప్రక్కలోబల్లెమని మరిచిపోరాదు
సెల్లు చేతులో లేకుండా
ఒక్క క్షణం కూడా ఉండలేకపోవడం
ఖచ్చితంగా...ఒక భయంకరమైన రోగమే
దానికి మందూ లేదు మాకూ లేదు
మొన్నటి...ఎయిడ్స్ భూతంలా...
నిన్నటి......కరోనా మహమ్మారిలా...
సెల్లు 24/7 నీ వెంటే ఉంటే చూస్తూ ఉంటే
కంటిచూపు బలి ఖచ్చితంగా రేడియేషన్కి
అందుకే
ఓ సెల్ బానిసలారా..!
తక్షణమే మేల్కొనండి..!
సెల్ కి...లాక్ డౌన్ పెట్టండి..!
సెల్ కు..సెల్యూట్ కొట్టండి..!
కొంచెం విశ్రాంతి తీసుకోండి..!
సెల్ తో "సత్సంబంధాలు"
...సమాధి ఔతున్నాయన్న...
...సెల్ కన్న ఆరోగ్యమే మిన్న"... అన్న
ఒక నిప్పులాంటి నిజాన్ని తెలుసుకోండి..!
63. పూరిగుడిసెల్లో
పుట్టిన పులులే మీరు..!
ఓ బహుజన బిడ్డలారా..!
మీ తాతముత్తాతల
తరంనుండి అంటరానితనం
కస్సుబుస్సుమంటూనే ఉంది
కాలకూటవిషం గ్రక్కుతూనే ఉంది
కాలసర్పమై కాటు వేస్తూనే ఉంది...ఐనా
మీరు బలహీనులే గాని
...బానిసలు కాదు
మీరు పిడుగులే గాని
...పిరికిపందలు కాదు
మీరు కూలీలే గాని
...కుక్కలు కాదు
మీరు మనుషులే గాని
...మరబొమ్మలు కాదు
కానీ ఉరుముల్లా ఉరిమి...
మెరుపుల్లా మెరిసి...
ఉప్పెనలై ఎగిసి...
ఉద్యమాలకు ఊపిరిపోసి...
మనుధర్మ శాస్త్రాన్ని
మంటల్లో కాల్చి బూడిదచేసి
ప్రతిదీ ప్రశ్నించి...ప్రశ్నించి
పరిశోధించి........పరిశోధించి
ప్రతిఘటించి......ప్రతిఘటించి
చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి...
అరుణోదయ కిరణాల్ని
మీ బ్రతుకుల్లో నింపి
కడకు ఆ కులసర్పం కాటుకే బలై
ఆగని కన్నీళ్లతో...ఆరని శోకంతో...
తీరని ఆశలతో....తరలి వెళ్లిన
మీ తల్లిదండ్రులతరం ముగిసింది
ఆ ఊరిపొలిమేరల్లో...ఆ పూరిగుడిసెల్లో...
కానీ ఆ పూరిగుడిసెల్లో
పుట్టిన పులులే మీరంతా...
అమరజీవి అంబేద్కర్
త్యాగం ఒక మేఘమై...
ఉద్యోగం మీకు ఒక వరమై...
ఊరి మధ్యలో మీరు ఊడిపడ్డారు
ఓ బహుజనులారా!
ఇక ఈ తరం మీది
అంతా మీ చేతుల్లోనే...
అంతా మీ ఊహల్లోనే...
అంతా మీ ఊపిరిలోనే...
అంతా మీరు చేసే ఉద్యమాల్లోనే ఉంది గుర్తుంచుకోండి...కలనైనా
మరువకండి ఈ నగ్నసత్యాన్ని...
రాక్తార్పణ చేసైనా...
సాధించి తీరాలి రాజ్యాధికారాన్ని...
64. ఓ అమ్మా..! నీకు వందనం..!
అభివందనం..! పాదాభివందనం..!
నిన్న నేను నిన్ను లోపల తంతూవున్నా...
చిరునవ్వులు చిందిస్తూ...బయటికి రారా
కన్నా నీ లేతపాదాలను ముద్ధాడాలంటూ...
నవమాసాలు మోసి నాకు జన్మనిచ్చి....
నీ ఎర్రనిరక్తాన్ని తెల్లనిపాలుగా మార్చి...
నా బుజ్జి కడుపు నింపి నీ చల్లనిచేతులతో
నీ బంగారు ఒడి ఊయలలో నన్ను ఊపి...
జోలాలి...జోజో లాలి...అంటూ
జోలపాటలు పాడి లాలించి...
నా కోతి అల్లరిని భరించి...
బుజ్జగించి...చందమామ రావే
జాబిల్లి రావే...అంటూ పాటలుపాడి
గోరుముద్దలు తినిపించి...
కమ్మని కథలెన్నో చెప్పి...
ప్రేమామృతాన్ని పంచి...
అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి...
కంటికిరెప్పలా నన్ను కాపాడి...
నా బంగారు భవిష్యత్తుకై
కమ్మని కలలు కన్న...
కన్నీటిని దిగమింగిన...
కడుపులు మార్చుకున్న ...
నా చదువుకై అప్పులెన్నోచేసి
తీర్చలేక నానా తిప్పలు పడిన...
అవమానాలు అష్టకష్టాలెన్నో
ఆనందంగా అనుభవించిన...
ఓ అమ్మా..! నీకు వందనం..!
అభివందనం..! పాదాభివందనం..!
నీవే నా ఆత్మ...
నీవే నా దైవం...
నీవే నా ప్రాణం...
నీవే నా తొలి గురువు...
నీ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీరనిది
నా జీవితం పుష్పం...ప్రేమను కురిపించు
నీ పాదారవిందాలకు అర్పితం...
రేపు నిన్ను
ఆకలికి అలమటించే
"అస్థిపంజరంగా" మార్చను...
రేపు నిన్ను ఆనాధాశ్రమంలో
"అతిథిగా" చేర్చను...
కన్నుమూసేవరకు నిన్ను
కంటికిరెప్పలా కాపాడుకుంటాను...
నీ కొడుకునైన నేను...నేడు
పంచభూతాల సాక్షిగా...
ఆ పరమాత్మ సాక్షిగా ...
పరమపావనమైన నీ పాదాలను
ముద్దాడి చేస్తున్నా...ఈ ప్రమాణం...
65. మద్యం మత్తుకు
బానిసలైతే మరణమే..?(పార్టు...1)
నిత్యం
నిషాలోఉండువాడు
నీచుడు నికృష్టుడు నిత్యదరిద్రుడు
కన్నబిడ్డల్ని
కట్టుకున్న భార్యను
ఆకలికి మాడ్చేవాడు అవివేకి అజ్ఞాని
కష్టపడి ఆర్జించిన
సొమ్మునంత కల్లు దుకాణాల్లో
వైన్ షాపుల్లో ఖర్చుచేసి
నిత్యం మందు త్రాగడమంటే...
వాడు కట్టుకున్న భార్య కన్నబిడ్డల
రక్తాన్ని త్రాగడమే రాక్షసుడిగా మారడమే
పుస్తెలు తాకట్టు పెట్టి
పీకలదాకా మందుకొట్టి
బూతుపురాణం మొదలు పెట్టి
తల్లీ బిడ్డల్ని రాక్షసుడిలా
హింసిస్తున్నాడంటే ఖచ్చితంగా రేపు
వాడు పురుగులుపడి ఛస్తాడని అర్థం
అందరూ వాన్ని ఒక పురుగులాగా
సమాజానికి ఒక చీడపురుగులాగా
ఛీకొడతారని వాడికి తెలీదు
వాడు ఏ సిగ్గులజ్జా మానం లేని
బ్రతికి ఉన్న ఓ శవంతో సమానం...
66. మద్యం మత్తుకు
బానిసలైతే మరణమే? (పార్టు...2)
త్రాగుబోతు జీవితం నిరర్థకం
వాన్ని కట్టుకున్న భార్య...
వాడు కన్నబిడ్డలు శాపగ్రస్తులే...
వాడు వారికి నరకం చూపిస్తాడు
నిత్యం భరించలేని బాధలు పెడతాడు
నలుగురిలో అందరు నవ్వులపాలౌతారు
నాలుగు రోజుల ఆ
వెర్రిసుఖంకోసం విర్రవీగుతాడు
విచ్చలవిడిగా విషపురుగులా ప్రవర్తిస్తాడు
ఆపై ఆరోగ్యం చెడి ఆసుపత్రి పాలౌతాడు
నిజానికి చచ్చినోళ్ళకు
పచ్చిత్రాగుబోతులకు తేడా ఒక్కటే
ఒకరు సమాధిలో...నిర్జీవంగా
మరొకరు భూమిమీద...సజీవంగా అంతే
అందుకే మద్యానికి...
బానిసలైన ఓ త్రాగుబోతుల్లారా..!
మీరు పశువుల్లా ఎందుకు ప్రవర్తిస్తారు...?
పరమాత్మ సహనాన్నెందుకు పరీక్షిస్తారు..?
ఇకనైనా ఓ పచ్చినిజం తెలుసుకోండి....!
సృష్టిలో ఉత్కృష్టమైనది మానవ జన్మని...
దుర్వసనాలకు బానిసలైతే దుఃఖమని...
మద్యం మత్తుకు బానిసలైతే మరణమేనని.
రచన:
"కవిరత్న"
"సహస్రకవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments
Post a Comment