శిరీష ( బర్రెలక్క) కవితలు







 


























1. శిరీష అంటే...ఒక బర్రెలక్క కాదు...?

శిరీష అంటే..?
ఒక సునామీ..!

శిరీష అంటే..?
ఒక సంచలనం..!

శిరీష అంటే..?
ఒక ప్రభంజనం..!

శిరీష అంటే..?
ఒక సింహం పిల్ల..!

శిరీష అంటే..?
ఒక ఉప్పెన..!
ఒక ఉషస్సు..!
ఒక ఉద్యమం..!
ఒక ఉత్తుంగ తరంగం..!
 
శిరీష అంటే..? 
ఒక ధైర్యం..! 
ఒక సాహసం..!
ఒక తిరుగుబాటు..! 
ఒక ధిక్కార స్వరం..!

శిరీష అంటే..?
ఒక సమర శిఖరం..!

శిరీష అంటే..?
ఒక సాగర కెరటం..!

శిరీష అంటే..?
రావణాసురులపై 
ఎక్కుపెట్టిన 
ఒక రామబాణం..!

శిరీష అంటే..?
నిరుద్యోగం
విసిరిన ఒక నిప్పురవ్వ..!

శిరీష అంటే..?
దివినుండి భువికి
దిగివచ్చిన ఓ తారాజువ్వ..!

శిరీష అంటే..?
కోట్లాదిమంది 
నిరుద్యోగులకు ఓ అంబాసిడర్..!
రేపు భయమెరుగని బర్రెలక్క గెలిచి 
విజయదుందుభిని మ్రోగించును గాక..!

2. నిరుద్యోగుల ప్రతినిధి...
    నిరుపేదల ఆశాజ్యోతి...శిరీష

నిన్న శిరీష ఒక గొంతు
నేడు కోటి గొంతుల కలయిక 

నిన్న శిరీషది ఏకాంతం 
నేడు శిరీషది జగమంత కుటుంబం 

నిన్న శిరీష ఒక నిస్సహాయురాలు
నేడు శిరీషచుట్టూ ఓ ఆత్మీయ రక్షణకవచం

నాడు గాంధీజీ పిలుపు వందేమాతర గీతం
భారతీయ యువతను ఉర్రూతలూగించే....

నేడు శిరీష "విజిల్ "మారుమ్రోగే...
కొల్లాపూర్ నియోజకవర్గమంతా...
 
ఢిల్లీ ఎర్రకోటను తాకింది...
ఖండాంతరాలు దాటింది... 
బర్రెలక్క బరిలో దిగిగానే 
పట్టే...అభ్యర్థులకు చెమటలు...

అంచనాలు తారుమారై
ఎవరు బకరౌతారో...
ఎవరు బలౌతారో...అర్థంకాక
అయోమయంలో...అభ్యర్థులు
గోక్కుంటున్నారు....బుర్రలు
పరుగెడుతున్నాయి...గుండెల్లో రైళ్లు  
ఆవహించింది...ఓటమి భయం భూతమై 

అందుకే 
ఈ దాడులు... 
ఈ దౌర్జన్యాలు... 
సోషియల్ మీడియాలో 
ఈ బెదిరింపులు వేధింపులు...
ఈ ప్రలోభాలు పగలు ప్రతీకారాలు... 
ఈ దుర్మార్గమైన వ్యక్తిగత దూషణలు...

పెట్టాలి...శిరీష శిరసున MLA కిరీటం ...
గెలిపించి పంపాలి శిరీషను చట్టసభకు..
నిరుద్యోగుల ప్రతినిధిగా...
నిరుపేదల ఆశాజ్యోతిగా...
యువతీయువకులు స్పూర్తి మంత్రంగా...

3. శిరీష విజయమంటే..?

శిరీష అంటే..?
బర్రెలక్క...
బర్రెలక్క అంటే..?
మెరిసే మెరుపులెక్క...
ఉరిమే ఉరుములెక్క...
శిరీష అంటే..?
పొడిచిన ఓ వేగుచుక్క... 

శిరీష అంటే..?
ఒక కిరణ్ బేడి...
ఒక పూలన్ దేవి...
ఒక జయలలిత...
ఒక మాయావతి... 
ఒక ఝాన్సీ రాణి...
ఒక మమతా బెనర్జీ...

శిరీష అంటే..?
కొల్లాపూర్
నియోజకవర్గ
MLA గా...నిల్చిన
ఓ స్వతంత్ర అభ్యర్థి...

శిరీష విజయమంటే..?
బడుగుల బహుజనుల  
బలహీన వర్గాల విజయం... 

శిరీష విజయమంటే..?
నిరుద్యోగుల విజయం...
శిరీష విజయమంటే..?
ప్రజాస్వామ్య విజయం...
శిరీష విజయమంటే..?
కొల్లాపూర్ ప్రజల విజయం... 
శిరీష విజయమంటే..?
ప్రపంచ వ్యాప్తంగా మార్పును
కోరే...ఆశాజీవుల అఖండ విజయం...

అందుకే...
అన్ని రికార్డుల్ని బ్రద్ధలుగొడుతున్న
బర్రెలక్క"విజిల్ గుర్తుకే " ఓటు వేద్దాం..!
ప్రజాస్వామ్యానికి నేడే ప్రాణం పోద్దాం..!
యువశక్తికి ఎదురులేదని నిరూపిద్దాం..!

4. విజిలేస్తే...కొల్లాపూర్ 
    విజయం...శిరీషకే...!

ఆ యమధర్మరాజు 
వాహనం... 
దున్నపోతట...

కొల్లాపూర్
స్వతంత్ర అభ్యర్థి 
శిరీష వాహనం 
పాలిచ్చే బర్రేనట...

అదిగో... 
ఝాన్సీలక్ష్మీలా
కత్తిని ఝులిపిస్తూ
బర్రెనెక్కి బర్రెలక్క
బయలు దేరింది
ఎన్నికల రణక్షేత్రానికి...

ఆ సింహాలు ఆ తోడేళ్ళు 
ఆ చిరుత పులులు బర్రెను
బలితీసుకోవచ్చు...తమ 
ఆకలిని తీర్చుకోవచ్చు...

కానీ బర్రెనెక్కిన
బర్రెలక్క తానెత్తిన
ఓటనే వజ్రాయుధంతో
ఆ కౄరమృగాలను 
చీల్చి చెండాడుతుంది
ప్రత్యర్థుల గుండెలదిరేలా
కొల్లాపూర్ లో "విజిలేస్తుంది"
శిరీష "విజయభేరీ మ్రోగిస్తుంది"
చరిత్రను సృష్టిస్తుంది ఇది సత్యం 


రచన:
"కవిరత్న"
"సహస్రకవి" 
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments