19.11.2023 ప్రపంచ క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగింది... రెండు కవితలు... వివిధ దినపత్రికల్లో రమణీయమైన రంగుల్లో ప్రచురితమైన కమనీయమైన కవితలు... చిత్ర మాలిక... మీకోసం... చదవండి...వీక్షించండి...ఆనందించండి... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్...9110784502
బాధ...భారతీయులకు..!
ఆనందం...ఆస్ట్రేలియాకు..!
అనుకున్న దొక్కటి...
అయ్యిందింకొక్కటి...
బోల్తా కొట్టందిలే...
బుల్ బుల్ పిట్ట...అన్నట్టు...
లక్షా 32 వేలమంది
క్రీడాభిమానులతో కిక్కిరిసిన
ప్రపంచంలోనే అతి పెద్దదైన
మోడీ క్రికెట్ స్టేడియంలో...
ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో...
కెప్టెన్ రోహిత్ శర్మ
టీమిండియా జట్టుపై
ఎన్నో ఆశలు పెట్టుకొని
2013 ఫైనల్లో మనల్ని ఓడించి
ప్రపంచకప్ ను కైవశం చేసుకున్న
"ప్రమాదకరమైన మన ప్రత్యర్థి"
ఆస్ట్రేలియాను దిమ్మతిరిగే
బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లతో
భారీస్కోర్ చేసి మట్టికరిపించి...
2023 ఫైనల్లో 16 కోట్ల
ప్రైజ్ మనీతో ఇంటికి పంపి
ప్రతీకారం తీర్చుకోవాలని...
33 కోట్ల ప్రైజ్ మనీ కోసం
భారీ అంచనాలతో...
బరిలోకి దిగిన భారత్ జట్టు
ఫైనల్లో 240 పరుగుల స్కోర్ చేసి
నాడు గంగూలీ సేనలా నేడు
రోహిత్ సేన ఓటమికి గురికాగా
కోటి ఆశలతో టీవీ సెట్లకు
అతుక్కుపోయిన 140 కోట్లమంది
భారతీయుల "కప్పుకల" చెదిరింది...
అంతులేని ఆవేదనే అందరికి మిగిలింది...
విశ్వకిరీటం...
విజయ సింహాసనం...
13 వ ప్రపంచ క్రికెట్ కప్...
ఆరోసారి ఆస్ట్రేలియాకే...దక్కింది
మన ప్రధాని మోడీ చేతులమీదుగా...
ఓడిపోకూడదన్న వ్యక్తిత్వం...
చివరిదాకా పోరాడాలన్న మనస్తత్వం...
ఉన్నవాళ్ళే కదా అవనిలో "విశ్వవిజేతలు"...
ఔను కడకు ఆనందం...ఆస్ట్రేలియాకు..!
దురదృష్టం దుఃఖం....భారతీయులకు..!
వరల్డ్ క్రికెట్ మ్యాచ్
ఒక గొప్ప గుణపాఠం...?
ఆదివారం జరిగిన
క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో
టాస్ గెలిచి ఆస్ట్రేలియా
బౌలింగ్ ఫీల్డింగ్ ఎంచుకోగానే...
కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ కాగానే...
ఫైనల్లో 240 పరుగుల స్కోరు కొట్టగానే...
విధివెక్కిరించి"స్వప్నం"చెదిరిపోయే...
ఓటమి ఒడిలోకి భారత్ జారిపోయే...
"ఆడక ముందే"
ఆస్ట్రేలియాకు కప్పు ఖాయమాయే....
ఐనా నిరాశ ఏల?నిట్టూర్పు ఏల..?
కనులున్నాక..."కలలు" తప్పవు...
కాపురమన్నాక..."కలతలు" తప్పవు...
పోటీ అన్నాక "గెలుపు ఓటమి"తప్పదు...
"Failures are Stepping
Stones for Success"
అని సరిపెట్టుకోక తప్పదు...
ఆరోసారి 13వ ప్రపంచ కప్
విజేతగా నిలిచే అదృష్టం
దక్కింది...ఆస్ట్రేలియాకే...
ఊహించని ఎదురుదెబ్బ
తగిలింది...టీమిండియాకే...
మిగిలింది...దురదృష్టం దుఃఖం
140 కోట్లమంది భారతీయులకే...
ఈ మ్యాచ్ రేపు పోటీకి సిద్దమయ్యే
ప్రతి ఆటగాడికి "ఒక గొప్ప గుణపాఠమే"...
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502















Comments
Post a Comment