సాహితీ సన్మానం...(11.11.2023) త్యాగరాజ గాన సభ చిక్కడిపల్లి హైదరాబాద్మ...మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి మహోత్సవ సభలో ... చిత్ర మాలిక...
వాల్మీకి వారసులారా..! మీరు ధన్యులు..!
రామా శ్రీరామా జయజయ
రామా జానకి రామా యని
శ్రీరామ నామ జపం చేసే
రామభక్తులందరూ ధన్యులే..!
సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే
దశరధనందనుడిగా
కోదండరాముడిగా అవతరించిన
ఆ శ్రీరాముని పుణ్యచరితను
పలుభాషల్లో కమ్మని కావ్యాలుగా
లిఖించిన కవిశ్రేష్టులందరూ ధన్యులే..!
ఎన్నోఏళ్ళు తపస్సు చేసి
బ్రహ్మ నారదమునులచే ప్రేరణపొంది
24000 శ్లోకాలతో 7 కాండలుగా
సంస్కృతంలో రసరమ్యంగా
రామాయణాన్ని రచించిన ఆదికవి
వాల్మీకి మహర్షి వారసులందరూ ధన్యులే...!
కానీ ఈ కలియుగంలో
ఆ రామాయణం రెండు ముక్కలాయె...
విశ్వనాధ వారి రామాయణ కల్పవృక్షంగా...
రంగనాయకమ్మ రామాయణ విషవృక్షంగా..
ఈ దేశంలో వాల్మీకి మహర్షి వారసుల
రాజ్యాంగ హక్కులు మూడుముక్కలాయె..
బీసీలుగా...ఎస్టీలుగా...ఎస్సీలుగా...
ఐనా ఓ వాల్మీకి వారసులారా..!
మీరు చింతించకండి..!దిగులు చెందకండి..!
ఆ నింగిలో ఆ సూర్య చంద్రులు
ఆ నక్షత్రాలు వెలుగుతున్నంతకాలం
ఈ వాళ్మీకి రామాయణం ఒక సజీవనదియే...
ప్రజలు ఈ రామాయణాన్ని
పారాయణం చేసినంతకాలం
ఈ లోకానికి శ్రీరామచంద్రుడే ప్రత్యక్ష దైవం...
ఆ కోదండరామున్ని భక్తులందరూ
ప్రత్యక్ష దైవంగా కొలిచినంతకాలం
ఈ రామాయణం లిఖించిన వాల్మీకి మహర్షి
చిరంజీవియే...సదా సదా చిరస్మరణీయుడే...
అందుకే
ఓ వాల్మీకి వారసులారా..!
ఓ వాల్మీకి సేవారత్న
వ్యాపారరత్న బిరుదాంకితులారా..!
మీరంతా ప్రశ్నించాలి..!
పోయిన మీ హక్కులకోసం...
సమిష్టిగా ప్రతిఘటించాలి..!
మీ రాజ్యాంగ హక్కులు
మీకు దక్కేంతవరకు....
ఆ శ్రీరామచంద్రుడే
ఈ ప్రభుత్వ పాలకులకు
అంధులైన ఈ అధికారులకు
కనువిప్పు కలిగించేంతవరకు...
మీరు పోరాడాలి..! పోరాడాలి..!
పోరాడితే పోయేదేముంది చెప్పండి...?
నాలుగు లాఠీ దెబ్బలు...జైలుశిక్ష తప్ప...
నాలుగు లాఠీ దెబ్బలు...జైలు శిక్ష...
అనుభవిస్తే పోయేదేముంది చెప్పండి..?
మీ బానిసత్వపు సంకెళ్లు తెగడం తప్ప...
మీ భావితరాలకు
ప్రభుత్వ సంక్షేమఫలాలు అందడం తప్ప...
రచన:
"కవిరత్న"
"సహస్రకవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502


















Comments
Post a Comment