139... స్పూర్తి కవితలు...రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్... చరవాణి...9110784502

 5...139...స్పూర్తి కవితలు 

139...OK/Old/స్పూర్తి కవితల1ndex

1. 9 నెలలు...9గంటలు...9సెకండ్లు
2. అన్నపోలన్న సుభాషితం  
    విన్న మీకు శుభోదయం...
3. మీ వొత్తిళ్ళను (Tensions) 
    తగ్గించుకొనే చక్కని మార్గాలు మూడు..
4. మనమాటలు... నీటిమూటలైతే... 
5. ఓ యువతా మీ కోసం ఓ కవిత
6. కాలాతీత,విఖ్యాత? 
    విశ్వ విజేత ఎవరు?
7. ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
    (యువతకు వివేకానందుని సందేశం)
8. సక్సెస్ మంత్ర....
9. వద్దువద్దు 
    ఆత్మహత్యలకు పాల్పడవద్దు
10. గురువులారా ! గుర్తుంచుకోండి
11. అంతరంగ అన్వేషణ...
12. మంచుకొండల్లో మండే సూర్యులు
13. పితామహుడు మన పీవీ 
14. శుభాలనొసగే సూర్యోదయం...
15. జీవితమంటే ఏమిటి?
16. చాలు... చాలు...
17. కవి పేరుతో కవిత...
18.మంచుకొండల్లో రక్తపుటేరులు
19. పచ్చి నిజం... పిచ్చి జనం 
20. నక్కజిత్తుల డ్రాగన్
21. చిరుకాల స్నేహం...
22. ఎవరు వారు ? వారే మన వీరజవాన్లు
23. మీ జీవితానికి మీరే కర్తలు...
24. రక్తతిలకం దిద్దాలంటే...
25. (కాంతి) కిరణాలు...
26. తెలివిగా బ్రతకడం తెలియదు పాపం ? 
27. అక్షర నీరాజనం....
28. అమరవీరజవానుకు అశ్రునివాళి...
29. ఓ యువతా ! విను నా కవిత !! 
30. విజయానికి పది సూత్రాలు
31. స్వేఛ్ఛ ఎక్కడో ప్రాణభయమక్కడ...
32. శుభోదయం శుభసందేశం..... 
33. కప్పా ? చిప్పా ? 
ఏది కావాలో తేల్చుకో
34. ఆశకు హద్దుండాలి  
      మనిషికి బుద్ధుండాలి....
35. వేగం" ప్రధానం 
36. మాట మీద నిలబడటం వేరు 
37. ఆత్మవిశ్వాసమే నీఆయుధం కావాలి.... 
38. జాబు వచ్చినందుకా? 
      జన్మ నిచ్చినందుకా? 
39. ఒక చిన్న కండీషన్ ఏమిటది? 
40. విజయం - అపజయం 
41. నడిసంద్రంలో నావ
42. ఒద్దురా వొద్దురా !
      వెలిగితేనెే ముద్దురా!!
43. పంచాంగ శ్రవణం 
44 .ప్రయత్నమెక్కడో !ప్రతిఫలమక్కడ!!
45. నిద్రలో సైతం నీ లక్ష్యాన్ని మరువకు
46 .సహాయమందించే
      వారే సహృదయులు
47. బరి గురి ఉరి సిరి
48. నీకు నాకేం తెలుసు
      నిమ్మకాయ పులుసు !!!
49. మూర్ఖులు - ముసలి లక్షణాలు
50. సంస్కారం- సాస్టాంగ నమస్కారం
51. నేడే తెలిసింది ఒక నిండునిజం 
52. వెంగళప్ప వేదాంతం 
53. బంగారంలాంటి అవకాశం 
      రానే రాదు వస్తే?
54. ముందుచూపు లేనివారు.... 
55. ముందు పోల్చుకో! 
     తరువాత తేల్చుకో!! 
56. నమ్మకు నమ్మకు
     నమ్మితే నరకమే
57. మంచి ఆలోచనలకు 
     జన్మస్థానమేది? 
58. అడగుతూ, వెదుకుతూ
     తడుతూనే వుండాలి.... 
59. విలువ ఎరిగినవారే విజ్ఞులు
60. స్పందించు స్నేహహస్త మందించు 
61. నమ్మరాదు నమ్మరాదు నమ్మనేరాదు
62. విజ్ఞులకే నా విజ్ఞప్తి
63. గట్టి దెబ్బ ఒక్కటి తగిలితే చాలు 
64. నా నమస్కారం వాడి సంస్కారం
65. విశ్వవిజేతవై
      విజయఢంకా మ్రోగించు  
66. రాజ్యాధికారమే లక్ష్యంగా...!
67. ఎవరితరం కాదు 
68. కలిసి వుంటే కలదు సుఖం 
69 .అదీ టైం దొరికినప్పుడు మాత్రమే 
70 .ప్రశ్నలు నావి - సమాధానాలు మీవి
71. సృష్టి మీదనే కొందరి దృష్టి 
72 .ఈ పిచ్చి" ముదరక ముందే.... 
73. పిల్లలు తిరుగుబోతులైతే? 
      పచ్చి త్రాగుబోతులైతే? 
74. హంస" లా హాయిగా జీవించు
75. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు 
76. అన్నకు వందనం అభివందనం 
77. ఒద్దురా వొద్దురా !(R) 
     వెలిగితేనెే ముద్దురా!
78. మాటే మంత్రం 
      మనసే బంధము
79. విశ్వవిజేతవై
      విజయఢంకా మ్రోగించు 
80. ఒకేపనిని అదేపనిగా 
       పదేపదే చేస్తే? 
81. కన్నీళ్ళు కడివెడు కష్టాలు పుట్టెడు 
82. బంగారంలాంటి అవకాశం 
      రానే రాదు వస్తే? 
83. నడక నీది పడక 
      ఆ పరమాత్మది 
84. ఎవరు నీవు? 
      మనిషివా? మూగమృగానివా 
85. పాపం అది సభాశాపం 
86. కాదు కాదు ఆకొంగ 
      నీవే నిజమైన దొంగ 
87. 12 పాఠాలు  ?
      నీవు నిత్యం నేర్పించు ఇలా  
88. క్రమబద్దమైన జీవితమంటే
      ఏమిటి? (for Retiree)
89. వద్దురా  వద్దురా నమ్మొద్దురా
90. కోడిగుడ్లు - ఆమ్లేట్లు   
91. నడిసంద్రంలో నావ
92. మీరు పరమ పిసనారులా? 
      పరమాత్మస్వరూపులా? 
93. అవివేకం - అపచారం
94. ఆప్రయాణం శుభప్రదం
95. వద్దురా వద్దురా 
      ఘర్షణలు వద్దురా
96. నీకు నాకేం తెలుసు
      నిమ్మకాయ పులుసు
97. నిర్దిష్టమైన లక్ష్యం + 
      పటిష్ఠమైన ప్రణాళిక = విజయం
98. ఎలా బ్రతకాలంటే...???
99. సాధించాలంటే 
      సంపాదించాలంటే
100. ఎప్పుడేమి చెయ్యాలి? 
        ఇప్పుడేమి చెయ్యాలి??
111. అఖండ విజయమే నీ ఆశయమైతే???
112. కంట్రోల్ తప్పితే కష్టాలే 
       కన్నీళ్లే కలవరింతలే...
113. కష్టేఫలి కాదంటారా?
114. ఆడవాళ్ళతో 
       అడవిమృగాలతో కాపురం?...
115. పాలు పెరుగు మజ్జిగ వెన్న 
116. ఎవడు భాగ్యవంతుడు ???
117. కష్టేఫలి కాదంటారా? ఔనంటారా ?
118. ప్రాప్తం"అంటే ఒక్కరూపాయికే 
        లక్షరూపాయల "లాటరి" 
119. ఆరోగ్యం వుండాలంటే....,?
       ఆయుస్సు పెరగాలంటే....?
120. వీరుడుకాదు,విజ్ఞతకాదు...
121. చచ్చి సాధించేదేమిటి ? 
       ఇచ్చే సందేశమేమిటి?
122. వద్దు వద్దు 
        ఆత్మహత్యలకు పాల్పడవద్దు...
123. మరణం వెనుక మర్మమేమిటి?
124. తిరిగితే ... కొవ్వు కరిగితే...
125. నవ్వండి నవ్వండి 
        నువ్వుతూనే వుండండి
126. నిత్యం నరకమే - చేదు జ్ఞాపకమే
127. ఒక గమ్యం 
        ఒక లక్ష్యంతో ముందుకు....
128. వారెవరో కనిపెట్టడండి?...
129. వాడు కాక పుట్టించే కామాంధుడు
130. ఇష్టపడి కష్టపడితే....
131. ఏడడుగుల బంధం...
       ఎన్నెన్నో జన్మల బంధం...
132. అందిన అవకాశం ...పొందిన ఆనందం
133. దొరబాబులా ? దోపిడిదొంగలా ?
134. మీకోసం ఓ శుభసందేశం...
135. నిఘా పెట్టి వుంచాలి...
136. సత్కవిత సందేశం...
137. కృషి చేస్తే సమస్తం సాధ్యమే!!!
138 .రెండక్షరాల వైరస్
139 .పాఠాలు నేర్పే పావురాలు...
        (చిత్ర కవిత)


1. 9 నెలలు...9గంటలు...9సెకండ్లు

కొందరుమిత్రులకు పోస్ట్ చేసిన కవితలు
చిల్లికుండలో పోసిన పాలైపోతున్నాయి
చదివి,సమయమున్నా స్పందించకున్నారు
తమ ఆనందాన్ని షేర్ చేయలేకపోతున్నారు

నీరుపోస్తేనేగా ఏ మొక్కైనా ఎదిగేది
తల్లిపాలు పడితేనేగా ఏ బిడ్డైనా పెరిగేది
కాస్త మెచ్చుకోలు ప్రోత్సాహం వుంటేనేగా
ఏ కలమైనా కదిలేది ఏకవితైనా కళ్ళు తెరిచేది

కాస్త ప్రోత్సాహిస్తే ఖర్చేముంది? చెప్పండి
కొన్ని కలాలకు ఆక్సిజన్ అందడం తప్ప
ఆకలితో వున్నఅనాధలకు అన్నం పెడితే 
పోయేదేముంది ఇంతపుణ్యం రావడంతప్ప
ఒక బిడ్డ పుట్టడానికి ఒక తల్లి పడేశ్రమ "9 నెలలు"
ఒక చక్కని సందేశం కోసం కావాలి మాకు"9 గంటలు"
కానీ,చదివి స్పందించడానికి చాలు మీకు "9 సెకండ్లు".
ఆలోచించండి స్పందించేందుకు సదా ముందుండండి.

2. అన్నపోలన్న సుభాషితం  
    విన్న మీకు శుభోదయం...

సమాజంలో మార్పు రావాలంటే...
బలహీనులకు ధైర్యం నూరిపోయాలి
అజ్ఞానులను చైతన్యవంతం చెయ్యాలి
నిరుపేదలకు,కూలీలకు, శ్రమజీవులకు
దోపిడీని గురించి అవగాహన కలిగించాలి
అన్నపోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

సమాజంలో మార్పు రావాలంటే...
ముందు మధ్యతరగతి వారిలో మార్పు రావాలి
వారెంతటి శక్తిస్వరూపులో వారికి తెలియజేయాలి
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడరాదు
నమ్మితే నరకమని,స్వశక్తియే స్వర్గమని తెలియాలి
అన్నపోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

సమాజంలో మార్పు రావాలంటే...
ధనవంతులంరూ ఆస్తి అంతస్తుల మీద ఆసక్తి ఉన్నా
నాదినాది అనుకున్నదేదీ నీదికాదన్న నిజంతెసుకోవాలి 
సేవాగుణం, కలిగివుండాలి,దయాగుణం దాతృత్వం
మంచితనం, మానవత్వం, మచ్చంటూలేని వ్యక్తిత్వం
అన్నపోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

సమాజంలో మార్పు రావాలంటే...
కులాలు,మతాలంటూ కుమ్ములాటలుండరాదు
ప్రజలను,ప్రభుత్వాలు ఓట్లకోసమే వాడుకోరాదు
ప్రజా సంక్షేమమే పునాదిగా సుపరిపాలన సాగాలి
ప్రజలందరు సమానత్వం సౌభ్రాతృత్వంతో మెలగాలి
అన్నపోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

3. మీ వొత్తిళ్ళను (Tensions) 
    తగ్గించుకొనే చక్కని మార్గాలు మూడు..

ఒకటి...

వచ్చిన ఆ సమస్య నిజంగా మీదేనా?  కాదు 
ఖచ్చితంగా మీకు సంబంధించిందేనా? కాదు 
ఐతే అదెవరిదో "వారికే దాన్ని వదిలెయ్యండి" 
Now, See, How Tension Free you are

రెండు...

వచ్చిన ఆ సమస్య నిజంగా మీదేనా ?  ఔను
ఖచ్చితంగా మీకు సంబంధించిందేనా ? ఔను
ఐతే దాన్ని  ఆ "పరమాత్మకు వదిలెయ్యండి"
Now, See, How Tension Free you are

మూడు...

వచ్చిన ఆ సమస్య నిజంగా మీదేనా ?  ఔను
ఖచ్చితంగా మీకు సంబంధించిందేనా ? ఔను
ఐతే వెంటనే మీరా సమస్యతో "రాజీపడండి"
దానికి సంబంధించిన వారితో, "రాజీపడండి"
Now, See, How Tension Free you are

4. మనమాటలు... నీటిమూటలైతే... 

మిత్రులారా !
మన మాటలు  
నీటిలో దాచిపెట్టిన
ఉప్పుమూటలు కారాదు
ఇసుకలో వ్రాసిన పిచ్చివ్రాతలు కారాదు
ఎంత బరువైన ఉప్పుమూటైనా
నీళ్ళలో వుంచగానే కరిగిపోవడం ఖాయం
ఇసుకలో వ్రాసిన అక్షరాలు ఎంత అందమైనవైనా 
అలలువస్తే అక్షరాలు చెల్లాచెదురై పోతాయి
మెలుకువ వస్తే కమ్మనికల కరిగి పోయినట్లు

మిత్రులారా !
మన మాటలు
రాతి మీద చెక్కిన
అందమైన అక్షరాలు కావాలి
ఆ అక్షరాలు ఆరాయి ముక్కలైనా 
మరో ముక్కమీద మిగిలివుంటాయి
ఆ రాయిని పిండిపిండి చేస్తే తప్ప 
అక్షరాలు చెక్కుచెదరవు 

ఆ రాళ్ళకు చావులేదు
కారణం రాళ్ళకు జీవమేలేదు
జీవముంటేనే కదా మరణముండేది
శిధిలమైన శిలలపై చెక్కిన 
దేవతా శిల్పాలెన్నో,గుళ్ళల్లో 
వేలయేళ్ళుగా పూజలందుకుంటూ
గర్భగుడుల్లో దర్జాగా దర్శనమిస్తున్నాయిగా

5. ఓ యువతా మీ కోసం ఓ కవిత

వయసొచ్చిన
పిల్లలను తిట్టరాదు 
కొట్టరాదు భయపెట్టరాదు
వెటకారంగా వ్యంగంగా 
ఎగతాళిగా వెకిలిగా పిలవరాదు
నలుగురిలో తగ్గించి మాట్లాడరాదు
ఉలిక్కిపడేలా ఉక్కిరి బిక్కిరయ్యేలా 
ఊపిరి ఆగిపోయేలా దండించరాదు
నీవు వెర్రి వెంగళప్పవు వట్టి శుంఠవు
తుమ్మ మొద్దువంటూ శపించరాదు
అదిరిపోయేలా బెదిరిపోయేలా 
ఆలోచనలు చెదిరిపోయేలా 
గజగజ వణికేలా గద్దించరాదు
దీనంగా దిక్కులుచూసేలా 
కుమిలిపోయేలా కృంగిపోయేలా 
హెచ్చరికలు జారీచేయరాదు
ప్రేమతో పలకరించాలి 
ముద్దుమురిపాలు పంచాలి
బుజ్జగించాలి బుద్దిచెప్పాలి 
చిరునవ్వుతో దగ్గరకు తీసుకోవాలి
భుజం తట్టాలి ముందుకు నెట్టాలి
నూరినూరి క్తత్తిలా పదును పెట్టాలి 
నీతిని, నిజాయితీని, నిస్వార్థాన్ని
మధురమైన మానవీయ విలువలల్ని
ఉక్కు సంకల్పాన్ని నూరిపోసి 
అన్ని ఆయుధాలనందించి,ఆశీర్వదించి
వీరతిలకం దిద్ది యుద్దానికి సిద్ధంచేస్తే చాలు
ప్రపంచ రికార్డులను బద్దలు చేస్తారు
వేడినెత్తురు సలసల పొంగే 
ఆ యువకిశోరాలు,ఆ అగ్గిరవ్వలు
దూకమంటే అగ్నిగుండంలో దూకేస్తారు
ఎక్కమంటే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేస్తారు
దాటమంటే సప్తసముద్రాలను దాటేస్తారు
రాకెట్లలా రామబాణాల్లా దూసుకుపోతారు
రాళ్ళలో రత్నాలై,మట్టిలోమాణిక్యాలై
రాజ్యాల నేలే రాజులౌతారు 
దేశాలనేలే మహానేతలౌతారు
అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు
కని,కలలెన్నోకని,పెంచిన అమ్మానాన్నలకు  
జ్ఞానభిక్ష పెట్టిన ఆ గురుదేవుళ్ళకు
బంగరు తల్లి భరతమాతకు 
అఖండ కీర్తిని ఆర్జించిపెడతారు
ముందు తరాలకు ఆదర్శమూర్తులౌతారు
చరిత్రలో చిరంజీవులుగా మిగిలి పోతారు

6. కాలాతీత,విఖ్యాత? 
    విశ్వ విజేత ఎవరు?

ఓ యువకా!
నిరాశపడవద్దు
నీరుగారి పోవద్దు
సింహం పంజా విసిరినట్టు
చిరుత పరుగు పెట్టినట్టు
మొండిగా వుండు దైర్యంగా వుండు 
నిలబడకుండు నిప్పులా మండు 

మొన్న ఓడినా నిన్న గెలిచావు
నిన్న పడినా నేడు లేచావు
నన్ను నిన్ను నడిపేది
నమ్మకమేనని, ఆ నమ్మకమే 
నీ గెలుపు ఆయుధమని గుర్తుంచుకో

ఓడిపోవడానికి ఇష్టపడితే 
గెలుపు కష్టం
కావాలి నిరంతరం గెలుపే నీమంత్రం
మిషన్ గన్నును మించిపో
రేసుగుర్రంలా రెచ్చిపో

కసీ, కృషీ, తపన, పట్టుదల 
వుంటే చాలు,అధిరోహించవచ్చు 
అవలీలగా,ఉన్నత శిఖరాలెన్నో,ఎన్నెన్నో

ఔను,పిరికితనం ఒక రోగమే 
పులి తన ఆకలిని తీర్చుకోవాలన్నా
పులినుండి జింక తప్పించు కోవాలన్నా 
రెంటికీ కావలసింది మెరుపు వేగమే

కన్న కమ్మనికలలు నిజమైతే
అనుకున్న లక్ష్యం చేరువైతే
కోరుకున్న ఫలితమే దక్కితే ఇక 
నీవే కదా కాలాతీత, విఖ్యాత విశ్వ విజేతవు 
నీకే కదా సకల సన్మానాలు సత్కారాలు
నీవే కదా ముందు తరాలకు ఆదర్శము

7. ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
(యువతకు వివేకానందుని సందేశం)

ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
మీరు పాపులు కాదు పవిత్రులు 
మీరు వృద్ధులు, బలహీనులు కాదు 
మీరు అనంత శక్తి సంపన్నులు
మా వల్లకాదు మేమేమీ చెయ్యలేమనకండి
పిరికితనంతో బానిసలుగా బ్రతక్కండి
వీరులై విజయశంఖారావం పూరించండి 

ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
మేము ఏదైనా సాధించగలమనే
అఖండ విశ్వాసంతో వుండండి
మనకు  కావలసింది ఇప్పుడు
ఇనుప కండరాలు ఉక్కునరాలు
చాలకాలం ఏడ్చారిక ఏడ్పులాపండి
చిరుత పులులై ముందుకు దూకండి

ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
లేవండి మీరు సింహాలని గుర్తుంచుకోండి
మీ గమ్యం చేరేవరకు మీ పరుగు ఆపకండి
భయపడకండీ ధైర్యంగా బలంగా వుండండి
బలము సత్సంకల్పమే అభివృద్ధికి సోపానం
బలమహీనతే మృత్యువుతో సమానం

ఓ నా భరతమాత ముద్దుబిడ్డలారా
బద్దకం మనకు ఒక బద్దశత్రువు అది ఒకరోగం
ఆ రోగంతో బయట తిరిగే హక్కు మీకెక్కడిది?
వెలిగే సూర్యున్ని చూస్తే చీకటి భయపడుతుంది
శ్రమించే మనిషిని చూస్తే ఓటమి భయపడుతుంది
విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి
విశ్వవిజేతలై భరతమాతకు అఖండ కీర్తినార్జించిండి

8. సక్సెస్ మంత్ర....

కంటికి కనిపించనివి రెండు
ఒకటి దైవం రెండు కాలం
అనంతమైనది కాలం
ఎంతో విలువైనది కాలం
ఎంతో ఖరీదైనది కాలం
మళ్ళీతిరిగి రానిది గడిచిన కాలం 

సృష్టి, స్థితి, లయలకు 
మూలకారణం కాలమే,
ఇది కాదనలేని నగ్నసత్యమే
ఈ జీవితం కాలంలో 
ఎన్ని చేదు,తీపిజ్ఞాపకాలో

క్షణమాగక పరుగులుపెట్టే
ఈ కాలంతో పోటీపడి
పొందిన సమయాన్ని
అందిన అవకాశాలను
సద్వినియోగం చేసుకున్న
ఎందరో మహానుభావులు
చరిత్రలో చిరంజీవులయ్యారు

కాలమహిమ నెరగక
దుర్వినియోగం చేసుకున్న
ఎందరో దురహంకారులు
కాలగర్భంలో కలిసిపోయారు
కాలాన్ని నమ్ముకుంటే
అది కడుపు నింపుతుంది
కాలాన్ని కాలదన్నితే
అది కాలనాగై కాటు వేస్తుంది

ఈ జీవితం చాలాచిన్నది
సమయం పోనియ్యక 
సద్వినియోగం చేసుకోవాలి
ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికెళ్ళాలి
చిలిపి చేష్టల చిచ్చరపిడుగులా 
జున్ను తింటారో మన్ను తింటారో
బాలగోపాలునిలా పాలుత్రాగుతారో
వెన్నదొంగిలిస్తారో మీ ఇష్టం మీ అదృష్టం

So,
"Don't postphone till tomorrow
What you can do today"
కల్ కా కామ్ ఆజ్ కరో
ఆజ్ కా కామ్ అభ్ కరో 
This is the Success Mamtra
Keep it always in your mind.

9. వద్దువద్దు 
    ఆత్మహత్యలకు పాల్పడవద్దు(Final)

ఆత్మహత్యలకు సిద్దపడే
ఓ అజ్ఞానులారా ! అవివేకులారా !
ఓ అమాయకులారా ! నవయువకులారా !
ఆవేశంలో, మొండితనంతో
మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటారు
మీ కంటిని మీరే పొడుచుకుంటారు
మీ ఇంటికి మీరే నిప్పు పెట్టుకుంటారు
మీ గొయ్యిని మీరే తవ్వుకుంటారు
మీ సమాధిని మీరే కట్టుకుంటారు
అందుకే మీరు అంధులు పిరికిపందలు

సమస్యలు ఎదురైతే ఒక వీరునిలా 
చిట్టచివరి శ్వాస వరకు పోరాడాలి
ఆవేశపడి చచ్చి సాధించేది ఏముంది?
చావు సమస్యలకు పరిష్కారం కానేకాదు

మిమ్మును అణగదొక్కేవారికి 
మీ అభివృద్ధిని, మీ పచ్చదనాన్ని 
చూసి ఓర్వలేనివారికి,విమర్శించేవారికి
అకారణంగా నిందలు వేసేవారికి
మానసికంగా హింసించినవారికి

మిమ్మల్ని చిన్నచూపు చూసేవారికి
నమ్మించి నట్టేటముంచేవారికి
వెనుక లోతుగా గోతులు త్రవ్వేవారికి
మీ చావుకోసం నిత్యం ఎదురు చూసేవారికి
మీరు అకస్మాత్తుగా చీకటిలోకి వెళ్ళిపోతే
మీ పతనాన్ని కోరుకునే వారికి పండగే కదా

అసలు ఈ జీవితమే ఒక యుద్ధరంగం
శత్రువులతో పోరాడాలి పోరాడి గెలవాలి
వెర్రివారిలా వెనుతిరగిపోరాదు
పిరికి పందల్లా పారిపోరాదు
చిట్టచివరి రక్తపు బొట్టువరకు 
చివరి శ్వాస వరకు పోరాడాలి
బద్దవిరోధులందరికి బుద్ది చెప్పాలి
గుడ్డిగా విమర్శించేవారికి గుణపాఠం నేర్పాలి
అప్పుడే మీ జన్మకు సార్థకత
అప్పుడే మీ చావుకు ఒక అర్థం

పరీక్షలో ఫెయిలైనందుకో
ప్రేమ విఫలమైనందుకో
వ్యయసాయంలోనో, వ్యాపారంలోనో 
భారీగా నష్టం వచ్చినందుకో
ఏ పురుగుమందు త్రాగో
ఏ ఫ్యానుకు ఉరివేసుకొనో 
ఏ ఎత్తైన బిల్డింగ్ పైకెక్కిదూకో

ఛస్తే ఏముంది ?
కట్టై స్మశానంలో కాలడం తప్ప
కన్నతల్లిదండ్రులకు గుండెకోత తప్ప
వద్దు వద్దు ఆత్మహత్యలకు పాల్పడవద్దు
మీబంగారు భవిష్యత్తును బలిచేసుకోవద్దు

10. గురువులారా ! గుర్తుంచుకోండి!!

మీ చేతుల్లో
బుక్సున్నాయి బోధించేందుకు 
బెత్తాలున్నాయి శిక్షించేందుకు

మీ చేతిలో
మట్టి ముద్దలు సిద్దంగా ఉన్నాయి
కావడిలో కుండలుగా మారేందుకు

మీ చేతిలో 
చిరుదివ్వెలున్నాయి చిమ్మ చీకటిని
చీల్చి వెలుగులను విరజిమ్మేందుకు

మీ చేతుల్లో
ఉలులున్నాయి ఎన్నో శిలలున్నాయి
సుందరమైన శిల్పాలను చెక్కేందుకు

మీ చేతుల్లో
ఎదిగే అమాయకపు పిల్లల బంగారు 
భవిష్యత్తులు‌న్నాయి తీర్చిదిద్దేందుకు

మీ చేతుల్లో
విరిసీవిరవని మొగ్గలున్నాయి గుబాళించే
పూలున్నాయి పూజకు సమర్పించేందుకు

గురువులారా! గుర్తుంచుకోండి!!
మీరే వారికి మార్గ నిర్దేశకులు 
మీరే వారికి  కనిపించే దైవాలు 
మీరే వారికి కనని తల్లిదండ్రులు 

గురువులారా! గుర్తుంచుకోండి!!
మీ విద్యార్థుల్ని, వీరులుగా శూరులుగా
రాళ్ళలో రత్నాలుగా, మట్టిలో మాణిక్యాలుగా
భావిభారత పౌరులుగా, భరతమాత ముద్దుబిడ్డలుగా
తీర్చిదిద్దే బాధ్యత మీదే, గురువుల ఋణం 
తల్లిదండ్రుల ఋణం తీర్చుకునే బాధ్యత విద్యార్ధులదే

11. అంతరంగ అన్వేషణ...

నిన్ను నీవు 
నిందించుకుంటే 
పతనం తప్పదు
నిన్ను నీవు 
ద్వేషించుకుంటే 
దుర్గతి తప్పదు, కానీ
నిన్ను నీవు 
ప్రేమించు కుంటే 
ప్రమిదవై వెలుగిపోతావు
నిన్ను నీవు మెచ్చుకుంటే
జింకవై చెంగున దూకేస్తావు

నిన్ను నీవు 
వెన్ను తట్టుకుంటే
భుజంపై కొట్టుకుంటే  
శహబాష్ అనుకుంటే
ముందుకు నెట్టుకుంటే
నీవు సింహమైపోతావు 
అడవికి రాజువైపోతావు
నీవు గరుడపక్షివైపోతావు
సప్తసముద్రాలనే దాటేస్తావు

ఒక్కసారి 
నీలోకి తొంగిచూడు
నీ అంతరంగాన్ని అణ్వేషించు
ప్రజ్వలించే నీ ఆత్మను దర్శించు
ఉంది, నీలోనే నీ ఆత్మలోనే
అనంతమైన శక్తి దాగివుంది
నీవీ పరమసత్యాన్ని గ్రహించిననాడు 
నీకిక ఎదురేలేదు ఏటికెదురీదగలవు
రామబాణమై దూసుకుపోగలవు
అరుణోదయకిరణమై చొచ్చుకుపోగలవు

ఎవరెస్టు శిఖరాన్ని
అవలీలగా అధిరోహించగలవు
ఖణఖణ మండే 
అగ్నిగుండంలో దూకగలవు
కొండలను పిండిచేయగలవు
వీరుడివై విజయకాంక్షతో 
రగిలిపోగలవు
విధిని ఎదురించగలవు
దాని గుండెల్లో నిదురించగలవు
అఖండ విజయాన్ని సాధించగలవు

ప్రపంచ రికార్డుల్ని 
బ్రద్దలు కొట్టగలవు
విశ్వవిజేతవై నీవు
కీర్తికిరీటాన్ని ధరించగలవు
కురిసే ప్రశంసల కుంభవర్షంలో  
తడిసి తడిసి ముద్దైపోగలవు
ఉడుకు రక్తముప్పొంగే ఓ యువకా
నాడు చరిత్రలో సువర్ణాక్షరాలతో 
లిఖించ బడుతుంది నీ ఈ ఘనకీర్తి 
ముందుతరాలకు నీవే గొప్పస్పూర్తి 

12. మంచుకొండల్లో మండే సూర్యులు

మన దేశరక్షణకోసం
130 కోట్లమంది భారతీయ 
కుటుంబాల భద్రత కోసం
ఎత్తైన మంచుకొండల్లో
ఎముకలుకొరికే చలిలో
చిమ్మచీకట్లలో డెగకళ్ళతో నిఘాపెట్టి
భారత భూభాగంలోకి దొంగచాటుగా 
చొరబడే శత్రువుల్ని మట్టుపెట్టడానికి 
చేతుల్లో మరతుపాకులు ధరించి,
నిద్దురలేక నిరంతరం సరిహద్దుల్లోపహారాకాసే

ఓ వీరసైనికులారా!
ఓ భరతమాత ముద్దుబిడ్డలారా !
మంచుకొండల్లో మండే ఓ సూర్యులారా!
వందనం !అభివందనం !మీకు పాదాభివందనం!!

మీరు నిద్రలేచి జపించే మంత్రం వందేమాతరం
మీరు కలలో సైతం కలవరించేది త్రివర్ణపతాకం
మీరు యుద్దవీరులు,శూరులు, విక్రమార్కులు
మీరు శత్రువులగుండెల్ని చీల్చే మరఫిరంగులు

మీ గుండెల చప్పుడు లబ్ డబ్ అనికాదు 
జైహింద్, జై భారత్ మాతా, జై జవాన్ అనే
మీరు ఎప్పుడూ సిద్దం శతృమూకలతో పోరాడేందుకు  రక్తాన్నిచిందించేందుకు,మృత్యువును ముద్దాడేందుకు

అందుకే ఓ వీరసైనికులారా!
ఓ భరతమాత ముద్దుబిడ్డలారా !
మంచుకొండల్లో మండే ఓ సూర్యులారా!
వందనం !అభివందనం !మీకు పాదాభివందనం!!
 
13. పితామహుడు మన పీవీ ( Revised)

ఒక వర్గం, అధికార దాహం 
ధనబలం, కులబలం లేకున్నా
గుండెబలంతో,రాజకీయచతురతతో
ప్రధానమంత్రి పదవిని అలంకరించి
ఒంటిచేత్తో భారత రథచక్రాలను 
నడిపించిన రథసారథి మన పీవీ

స్వాతంత్ర్య సమరయోధుడు
వ్యూహరచనా దురంధరుడు
అపరచాణక్యుడు 
ఆర్థిక సంస్కరణలకు,పితామహుడు 
కాకలుతీరిన రాజకీయనాయకుడు
రాజనీతిజ్ఞతకు, స్థితప్రజ్ఞతకు 
చెరగని సంతకం మన పీవీ

ఇన్సైడర్ ఆత్మకథను వ్రాసిన,వేయిపడగలను
హిందీలోకి అనువదించిన సాహితీసార్వభౌముడు
ప్రపంచాన కాగడాపెట్టి వెతికినా కనిపంచని
18 భాషల్లో ప్రావీణ్యతగల బహు భాషాకోవిదుడు
ఒకే ఒక్కడు తెలంగాణ తెలుగుబిడ్డ పీవీ నరసింహుడు

తెలంగాణ మట్టిలో ఒక మొక్కలా పుట్టి
వటవృక్షమై విశ్వమంతా విస్తరించిన
ఆ మహనీయునికి ఆ అపరమేధావికి 
ఈ శతజయంతి ఉత్సవాలలో 
అర్పిస్తున్న అక్షర నీరాజనం 

జయహో ! జయహో ! ఓ జాతినేత !
పాదాభివందమయ్యా ఓ పాములపర్తి నరసింహ!
మీ స్మరణే ! మా అందరికి గొప్ప ప్రేరణ !
మీ అడుగుల్లో అడుగులు వేస్తాం !
మీ ఆశయాలకు అంకిత మౌతాం !

14. శుభాలనొసగే సూర్యోదయం...

అందమైన
ఆనందకరమైన
మధురమైన 
మంగళకరమైన
సుందరమైన
శుభకరమైన 
సూర్యోదయం 
తిలకించిన చాలు

మనుషులందరు
పులకించి పోయెదురు
హృదయాలు
ఉప్పొంగును
మనసులు పరవశించును
కళ్ళురెండు
కలవరించును

కలువలు విరబూయును
పక్షులు కుహూ కుహూయని
కూనిరాగాలు తీయును
పచ్చని చెట్లు తలలూపుతూ
సంతోషంతో చప్పట్లు కొట్టును

కొండలు కోనలు
తనివితీరా మనసారా
స్వాగతం సుస్వాగతమంటూ 
ఆనందగీతాలు ఆలపించును
నెమళ్ళు పురివిప్పి నాట్యమాడును

రైతులు ఆడుతూ 
పాడుతూ సేద్యం చేయుదురు 
హలమును పుట్టి పొలమును దున్నెదరు
పిల్లలు బిలబిలమంటూ బడికి వెళ్ళెదరు
ఉద్యోగులు ఆఫీసులకు పరుగు పెట్టెదరు

15. జీవితమంటే ఏమిటి?

ఈ జీవితం ఒక గొప్ప సవాల్ 
మనిషి తనకు తాను పరిసరాల 
ప్రభావాన్ని బట్టి ప్రవర్తనను మార్చుకోవాలి 
ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎదగాలి

ఏదీ తనంత తానే మన దరికి రాదని...
శోధించి సాధించాలని,అదే ధీరగుణమంటూ
చీకటిలో చిరుదీపం వెలిగించాడు శ్రీశ్రీ. 

ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. 
ఎవరికివారే కావలసినవి వడ్డించుకోవాలి. 

కొందరు తమలో ఎంత టాలెంట్ ఉన్నా ఏదో లోపం 
ఉందనుకుంటూ తమ ప్రగతిని తామే అడ్డుకుంటారు

"నా కర్మ, నా రాత" అనుకోరాదు, అపజయాలను అంగీకరించక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
ఎవరికి వారే తమ రాతను తామే రాసుకోవాలి

అపజయాలనే అవకాశాలుగా భావించి 
సమస్యల అడ్డుగోడలను ఆత్మస్థైర్యంతో 
అధిగమించాలి అద్భుతాలు" సాధించాలి

ఓపిక ఉన్నంతవరకు కాదు 
ఊపిరి ఉన్నంతవరకు పోరాడాలి
"ఆత్మ విశ్వాసం"నీ చేతిలో ఆయుధం కావాలి

మిత్రమా సాహసంతో ముందుకు సాగితే 
"ఓటమి" నీ కాళ్ళకింద మట్టవుతుంది... 
"గెలుపు" నీ నెత్తి మీద కిరీటమవుతుంది

16. చాలు... చాలు...

ఒక చిరునవ్వు చాలు 
చింతలు చీకాకులు 
ఎగిరిపోవడానికి

ఒక చల్లని చూపు చాలు
ఆరని కన్నీటిధారలు 
ఆగిపోవడానికి

ఒక మధురమైన మాట చాలు
గుండెల్లో రగిలే మంటలు 
చల్లారడానికి

ఒక అభయహస్తం చాలు 
నీ వెనుక నేనున్నానని
భరోసానివ్వడానికి

ఇంత చేయూత నిస్తే చాలు
పడిపోయిన వారు 
తిరిగి పైకి లేవడానికి

గుప్పెడంత ఆశ వుంటే చాలు
విడిపోయిన వారు మళ్ళీ 
కలిసి జీవించడానికి

గోరంత ఆధారముంటే చాలు
చెడిపోయిన వారు 
తిరిగి బాగుపడడానికి

పైనుండి పిలుపు వస్తే చాలు
పరమాత్మను చేరడానికి 
ఆయనలో లీనమైపోవడానిక

17. కవి పేరుతో కవిత...

*కె* - రటం నాకు ఆదర్శం పడినందుకు
కాదు,పడినా తిరిగి పైకి లేచినందుకు 

*పో* - రాడు, పోరాడితే పోయేదేముంది?
నీ బానిస బ్రతుకు బాగుపడడం తప్ప 

*ల* - క్ష్యం లేని జీవితానికి విలువెక్కడిది? 
అలలులేని కడలికి అందమెక్కడిది ?, వె 

*య్య* - కు నిచ్చెన ఆకాశానికి, మూసివెయ్యకు 
తలపుల్ని అవకాశాలకు, అదృష్టానికి 

*క* - మ్మని కలలు కను, కంటినిండా నిద్రపో, కాని
ఆ కలలు నిజమయ్యేంత వరకు కునుకుతియ్యకు

*వి* - జయం వస్తుంది, ముందే నిలుస్తుంది
వీరులను, విజేతలను విందుకు పిలుస్తుంది

18.మంచుకొండల్లో రక్తపుటేరులు

ఆ ప్రేమ ఎందుకు?
మనిషిలోని మానవత్వాన్ని
మేల్కొల్పేందుకు

ఈ ద్వేషమెందుకు ?
ప్రాణాలకు తెగించి ప్రత్రర్థులపై
ప్రతీకారం తీర్చుకునేందుకు

ఆ పరశురాముని గొడ్డలెందుకు?
అడవిలోని విషవృక్షాలను
తెగనరికేందుకు

ఈ మారణాయుధాలెందుకు?
యుద్ధములో శత్రువులను
హతమార్చేంచేందుకు

ఆగని ఆ కన్నీటి ధారలెందుకు?
20 మంది భారతమాత బిడ్డలు
మంచుకొండల్లో నేలకొరిగినందుకు

ఈ గులాబీ పూలెందుకు ?
దేశరక్షణకై ప్రాణాలర్పించిన
ఆ వీరజవాన్ల పాదపద్మాలపై చల్లేందుకు
అశృనయనాలతో శ్రద్దాంజలి ఘటించేందుకు

ఆ మెరుపుదాడు లెందుకు? 
చైనా దురాక్రమణదారుల,గుండెల్లో
తూటాలు పేల్చేందుకు,గుణపాఠం నేర్పేందుకు

బద్దశత్రువులతో ఈ చర్చలెందుకు?
శాంతి పావురాలను ఎగుర వేసేందుకు
మంచుకొండల్లో రక్తపుటేరులను ఆపేందుకు

19. పచ్చి నిజం... పిచ్చి జనం (Final)

రాత్రిచక్కగా నవ్వుతూ పలకరించి 
తెల్లవారేసరికి మనుషులు 
మాయమైపోతున్నఈ కరోనా కాలంలో 
అంత ఖరీదైన బైకు అవసరమా ? 
మనిషి ఆశకు అంతేది? 
విలాసాలకు కులాసాలకు 
అలవాటు పడినవారు
పదిమందిలో నేను గొప్ప అనుకునేవారు
తిన్నదెట్లో అరగనివాళ్ళు 
ఉన్నదెట్ల ఖర్చు చేయాలో ఎరగనివాళ్ళు
ఆ బైకు ఎక్కే ముందు
రాత్రి పడుకునే ముందు ఒక్కసారి
ఆకలికి అలమటించే ఆ అనాధల గురించి
ఉపాధిలేని ఆ వలస కూలీల గురించి
నీడలేని ఆ నిరుపేదల గురించి
ఆసుపత్రుల్లో కళ్ళు తిరిగే బిల్లుల్ని
కట్టలేని ఆ మధ్యతరగతి ప్రజల గురించి
ప్రతిభవుండి విద్యను మధ్యలోనే
ఆపేసిన ఆ విద్యార్థుల గురించి
అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు 
చేసుకునే ఆ రైతన్నల గురించి
కాస్త ఆలోచిస్తే మంచిది కదా
వారి జన్మ ధన్యముకదా 
పోతూపోతు మూటకట్టుకు పోయేదేముంది?  
చేత పట్టుకు పోయేదేముంది?
ఆ బైకులోని ఒక బోల్టునుకూడ వెంట
తీసుకెళ్ళలేరన్న ఒక పచ్చినిజం 
ఎప్పుడు తెలుసుకుంటారో ఈ పిచ్చిజనం...

20. నక్కజిత్తుల డ్రాగన్

సరిహద్దుల్లో
మన వీరజవాన్లు
శత్రువుల చేతిలో చిక్కినా
ఘర్షణలో గాయాలౌతున్నా
రక్తం గంగా ప్రవాహమైనా
చివరి రక్తపుబొట్టువరకు దాడిచేసి
వీలైనంతమంది శత్రువులను 
చంపుతూ చంపుతూ శ్వాసవదిలిన
నేలకొరిగిన, వీరమరణం పొందిన
భారతమాత పాదాలచెంత
పువ్వులై రాలిపోయిన 
కోట్లాదిమంది భారతీయుల 
గుండెల్లో ఆరనిజ్యోతులై 
వెలుగుతున్నఆ 20 మంది 
వీరజవాన్ల ఆత్మలు శాంతించాలని
వారి కుటుంబ సభ్యులకు
ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని
తెలియజేస్తూ అశ్రునయనాలతో
అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తు
వారి ఆత్మబలిదానాలు
దేశరక్షణకై వారు చేసిన 
ఆ ప్రాణత్యాగాలు వృధాకావని
చర్చలంటూ కుట్రలు కుతంత్రాలతో
నక్కజిత్తులతో వ్యూహాత్మకంగా
దుర్బుద్ధితో మారణాయుధాలతో 
ఘోరంగా హింసించి దారుణంగా 
నిరాదీయులైన మన సైనికులను 
హతమార్చిన హద్దుమీరిన 
చైనా దురాక్రమణదారులకు
తగిన రీతిలో బుద్ది చెప్పాలని
పగతో ప్రతీకారంతో రగిలిపోతున్న
మన వీరజవాన్లు సరైన సమయంకోసం
అధికారుల ఆదేశాలకై ఎదురుచూస్తున్నారు
ఆదేశాలు అందితే మీ ఆత్మలు శాంతిస్తాయి
ఆ మంచుకొండల్లో ఆరని మంటలు రేగుతాయి
యుద్దవిమానాలతో విరుచుకుపడి మన వీరుజవాన్లు
సరిహద్దుల్లో శత్రుసైనికులకు సమాధులు సిద్దంచేస్తారు

21. చిరుకాల స్నేహం...

ఓ మిత్రమా ! 
నిన్న నీవన్నావు
స్నేహాన్ని పువ్వుతో పోల్చకు
అది వాడిపోతుందని
కాని నేడు నేనంటున్నాను
స్నేహాన్ని పువ్వుతో పోలిస్తే 
అది పరిమళిస్తుందని

ఓ మిత్రమా ! 
నిన్న నీవన్నావు
స్నేహాన్ని మంచుతో పోల్చకు
అది కరిగిపోతుందని
కాని నేడు నేనంటున్నాను
స్నేహాన్ని మంచుతో పోలిస్తే 
అది చల్లదనాన్నిస్తుందని

ఓ మిత్రమా ! 
నిన్న నీవన్నావు
స్నేహాన్ని ఆకుతో పోల్చకు 
అది రాలిపోతుందని
కాని నేడు నేనంటున్నాను
స్నేహాన్ని ఆకుతో పోలిస్తే 
అది పచ్చదనాన్నిస్తుందని

ఓ మిత్రమా ! నిజం తెలుసుకో
స్నేహాన్ని టానిక్ తో పోలిస్తే
అది అంతులేని శక్తి నిస్తుందని
స్నేహాన్ని అమృతంతో పోలిస్తే
అది మృత్యుభయము లేకుండ
మనల్ని ముందుకు నడిపిస్తుందని, 
దేనితో పోల్చుకోవాలో ఇక నీవే తేల్చుకో

కానీ ఓ మిత్రమా !
ఉండాలి మన ఈస్నేహం చిరకాలం  
వెలుగుతూ వుండాలి మన స్నేహజ్యోతి
సూర్యచంద్రులు ఉన్నంత కాలం, ఆ
నింగిలోతారలు వెలుగుతున్నంతకాలం

22. ఎవరు వారు ? వారే మన వీరజవాన్లు

ఎవరు వారు ? వారే మన వీరజవాన్లు
భద్రతా దళాలు భరతమాత ముద్దుబిడ్డలు
వారు నిద్రలేచి జపించే మంత్రం వందేమాతరం
వారు కలలో సైతం కలవరించేది త్రివర్ణపతాకం

ఎవరు వారు ? వారే మన వీర సైనికులు
వారు వీరులు,విక్రమార్కులు, వారుపిడుగులు
వారు శత్రువుల గుండెల్లో పేలే మరఫిరంగులు
వారే భద్రతా దళాలు భరతమాత ముద్దుబిడ్డలు

ఎవరు వారు ? వారే మన వీర సైనికులు
వారి గుండె చప్పుడు లబ్ డబ్ అనికాదు
దేశరక్షణ తల్లిఋణం దేశరక్షణ తల్లిఋణమనే
భద్రతా దళాలు భరతమాత ముద్దుబిడ్డలు

వారు ఎవరు ? వారే మన వీర సైనికులు
ఎముకలుకొరికే చలిలోఎత్తైన మంచుకొండల్లో 
నిత్యం మనకు నిద్రాభంగం కాకుండా నిఘాపెట్టే 
భద్రతా దళాలు భరతమాత ముద్దుబిడ్డలు

వారి చేతుల్లో తుపాకులెందుకు,దొంగచాటుగా
దేశంలో శతృవులు చొరబడితే మట్టుపెట్టడానికి
రాత్రింబవళ్ళు సరిహద్దుల్లో పహారా కాసేదెందుకు
దేశ ప్రజలంతా సుఖంగా సురక్షితంగా జీవించేందుకు 

వారు పోరాడేది శతృవులతోను మృత్యువుతోను 
వారు రోజూ సిద్దమే శత్రృవులను ఎదుర్కోవడానికి
రక్తాన్ని చిందించడానికి,మృత్యువును ముద్దాడడానికి
మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్య ఫలాలను అందించడానికి

23. మీ జీవితానికి మీరే కర్తలు...

పాలను పితకకుండ 
పాలకుండ పట్టుకొని, 
గేదె ఎదురుగా నిలబడి, 
పాలివ్వు పాలివ్వు మంటే 
ఏ గేదె నీకు పాలు ఇవ్వదు

అలాగే నీవు దైవం ముందు నిలుచొని 
ఓ దేవా నా ప్రార్థన విను,నా కోరికలు తీర్చమంటే 
ఏదైవం నీ ప్రార్థన వినడు నీ కోరికలు తీర్చడు

ఆ గేదె నీది కాబట్టి నీవే పాలు పితుక్కోవాలి
త్రాగి తృప్తి చెందాలి  అమ్మి లాభం పొందాలి
ఆ దైవం నీకు అన్నీ అవయవాలిచ్చాడు గనుక
నీవే నీ కార్యాన్ని నిర్వర్తించాలి,ఫలితం పొందాలి

అదెలాగంటే....
నీ గురువు నీకు చక్కగా పాఠాలు బోధించాడు
విజ్ఞానాన్ని అందించాడు బ్రతుకు దారి చూపాడు
కాబట్టి నీవే పాఠాలు శ్రద్దగా చదివి ,పరీక్షలు వ్రాసి
మంచి మార్కులు లేదా ర్యాంకులు తెచ్చుకోవాలి

మీ అమ్మానాన్నలు వెతికి వెతికి 
మీకు చక్కటి సంబంధాలు చూశారు
అప్పులెన్నో చేసి ఘనంగా పెళ్ళి చేశారు
కాబట్టి మీ కాపురాన్ని మీరే నిలబెట్టుకోవాలి 
మీ పచ్చని సంసారంలో కారుచిచ్చు రేగకుండా
మీకు మీరే గుట్టుగా కాపురం చేసుకోవాలి
వారి బాధ్యత ముగిసింది ఇక నీ కర్తవ్యమే మిగిలింది

24. రక్తతిలకం దిద్దాలంటే...

కౄరమైన కరోనా వైరస్ తోప్రపంచంలో 
లక్షలాదిమందికి మరణశిక్షలు విధించిన చైనా
యుద్దానికి సిద్ధమై చర్చలకు ఆహ్వానం పలికి 
కుట్రలు, కుతంత్రాలెన్నో పన్ని ,హద్దుమీరి 
సరిహద్దుల్లో ద్వందనీతితో దొంగదెబ్బ తీసింది 

చల్లని గాల్వాయ్ లోయ మంచుకొండల్లో
శతృవులతో ప్రాణాలకు తెగించి పోరాడిన
మన వీరజవాన్ల ఎర్రని రక్తం ఏరులైపారింది

నేడు మంచుకొండల్లో నేలకొరిగిన 
మన వీరజవాన్ల మరణవార్తతో
సలసలకాగే మన భారతజాతి 
గుండెలు చల్లబడాలంటే,

పోరాడి రక్తాన్ని చిందించి,అమరులై
భారతమాత పాదాలచెంత పువ్వులై రాలిన 
20మంది భారతమాత ముద్దుబిడ్డల
ఆత్మలు శాంతించాలంటే, 

గుండెలు పగిలేలా రోదించాలనివున్నా
భర్తల పార్థివదేహాలున్న 
శవపేటికల ముందు నిశ్చేష్టులై నిలుచుని
జై భారతమాతాకు జై అంటూ నినదిస్తున్న
ఆవీరవనితల నుదుట రక్తంతిలకం దిద్దాలంటే,

మృత్యువులా ముందుకు దూసుకు వస్తున్న 
ఆ ముస్కరులపై ఎదురుదాడి చేయక తప్పదు
కౄరులైన ఆశతృమూకల,గుండెల్లో తూటాలు 
పేల్చక తప్పదు,గుణపాఠం నేర్పక తప్పదు

శాంతి పావురాల రెక్కలు విరిచిన చైనా
పడుకున్న కోడెనాగు తోక తొక్కిన చైనా
వేదభూమియైన భారత్ పై దాడి చేసిన చైనా
భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు

అమరులైన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తూ...
వారి ఆత్మలు శాంతించాలని ఆశిస్తూ... 
అశ్రునయనాలతో చేస్తున్న అక్షరనీరాజనం...

25. (కాంతి) కిరణాలు...

అవిగో అవిగో...
మ్రోగుతున్నాయి గుడిలోగంటలు
రెండు మనసులు ఒక్కటైనందుకు
రెండు కుటుంబాలు కలిసిపోయినందుకు
రెండు జంటలేకమైనందుకు ఒకలోకమైనందుకు

అవిగో అవిగో...
పండుతున్నాయి పచ్చని పంటలు
రేయింబవళ్ళు రైతులు కష్టపడినందుకు
రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చినందుకు
రెక్కలుముక్కలు చేసి సేద్యము చేసినందుకు

అవిగో అవిగో...
మండుతున్నాయి ఆకలిమంటలు
రైతుల పంటలకు గిట్టుబాటు ధరల్లేనందుకు
వలసకూలీలకు కనీసవేతనాలు కరువైనందుకు
కార్మికులు,శ్రామికులు ఉపాధికోల్పోయినందుకు

అదిగో అవిగో...
రాత్రికిరాత్రే విలేకరులందరి స్వేదబిందువులే
రంగురంగుల వార్తలై, వేయి ఇంద్రధనుస్సులై
వెచ్చని విజ్ఞానపు వెలుగుల్ని విరజిమ్ముతున్నాయి 
ఊపిరులూదే ఉషోదయపు మరో (కాంతి)కిరణాలై

26. తెలివిగా బ్రతకడం తెలియదు పాపం ? 

ఏమిలాభం ? ఏమిలాభం ?
ముందుచూపు లేనివారి నెత్తిన
ఎన్ని ముత్యాలు పోసి ఏమిలాభం?
వారికి వాటి విలువ తెలియదుగా ...

ఏమిలాభం ? ఏమిలాభం ?
ఆస్తి మీద ఆశలేని నిరాశావాదులకి
ఎన్ని మంచి ఆదాయమార్గాలు చూపి
ఎన్ని చక్కని సలహాలిచ్చి ? ఏమిలాభం?
వారు అవి స్వీకరించరుగా ...

ఏమిలాభం ? ఏమిలాభం ?
చక్కిలిగింత లేనివారిని 
ఎంతగా గిల్లినా గిచ్చినా ఏమిలాభం ?
వారసలు నవ్వనే నవ్వరుగా...

ఏమిలాభం ? ఏమిలాభం ?
భయమూ భక్తీ, వినయమూ విధేయత 
తల్లిదండ్రులపై ప్రేమ,గురువులంటే గౌరవంలేని,
విద్యార్థులకు ఎన్ని పాఠాలు చెప్పి
ఎంత శిక్షణ ఇచ్చి ఏమిలాభం?
బుర్రకెక్కితేగా, బుద్ది వికసిస్తేగా...

ఏమిలాభం ? ఏమిలాభం ?
బద్దకమూ,సోమరితనం తప్ప
చేసేపనిపై ఏకాగ్రతలేని ఉద్యోగికి ఎంత 
జీతమిచ్చి,ఎన్ని ప్రమోషన్లిచ్చి ఏమిలాభం?
సంస్థ అంటే గౌరవముంటేగా...

వారుఎవరినీ నమ్మరు,ఎంత చెప్పినా వినరు
వారు ఒట్టి మట్టి ఏనుగులు బావిలో కప్పలు
రెక్కలున్నా ఎగరలేని పక్షులు కారణం,వారికి 
పైకి ఎదగడం,తెలివిగా బ్రతకడం 
తెలియదు పాపం

27. అక్షర నీరాజనం....

కన్నతండ్రి కోరిక నెరవేర్చి 
భారత సైన్యంలో చేరి 
కల్నల్ స్థాయికి ఎదిగి
ప్రాణాలకు తెగించి 
చిట్టచివరి శ్వాసవరకు 
సరిహద్దుల్లో శత్రుసైనికులతో
వీరోచితంగా పోరాడిన
ఓ సూర్యాపేట సూర్యుడా!
మంచుకొండల్లో నేలకొరిగిన
ఓ కొదమ సింహమా!
కన్నవాళ్ళ ఋణం తీర్చుకున్న 
ఓ భారతమాత ముద్దు బిడ్డా!
130 కోట్లు భారతీయులగుండెల్లో 
ఆరక వెలిగే ఓ అమరదీపమా!
ఆకాశంలో ఒక ధృవతారగా
నిత్యం నీవే మాకు స్పూర్తి 
సూర్యచంద్ర నక్షత్రాలున్నంతవరకు
అజరామరం నీ అఖండ కీర్తి
ఓ అమరవీరా !అశ్రునయనాలతో
మీ కిదే మా అక్షర నీరాజనం
కల్నల్ సంతోష్ బాబు 
అమర్ హై... అమర్ హై... 

28. అమరవీరజవానుకు అశ్రునివాళి...

నిన్న సరిహద్దుల్లో 
కొదమ సింహమల్లే తిరిగి
నేడు నేలకొరిగిన ఓ అమరవీరుడా!
ఓ తెలంగాణా తెలుగు బిడ్డా !
జోహార్ జోహార్ ! జోహార్ జోహార్ !!

నిన్న శతృమూకలతో పోరాడి పోరాడి
నేడు నేలకొరిగిన ఓ అమరవీరుడా!
మంచుకొండల్లో భగ్గున మండిన ఓ భాస్కరుడా:!
జోహార్ జోహార్ ! జోహార్ జోహార్ !!

ఆకాశంలో వెలిగే ఓ నక్షత్రమా ! 
ఎక్కడిదీ ఎక్కడిదీ నీకు మరణమెక్కడిది?
నీవు ప్రతి భారతీయుడి గుండెల్లో 
అమరుడివై, ఆరనిదీపమై వెలుగుతువుంటే
ఎక్కడిదీ ఎక్కడిదీ నీకు మరణమెక్కడిది?

నీ ప్రాణత్యాగం,నీ దేశసేవ,
ఇలనైనా కలనైనా మరువలేనిది 
దుష్టులు దుర్మార్గులైన మూర్ఖులు, 
ముష్కరులైన ఆ చైనా శతృమూకల్ని 
మట్టుపెట్టకపోతే ప్రతీకారం తీర్చుకోకపోతే
సరిహద్దుల్లోనే వారికి సమాధులు కట్టకపోతే

ఎక్కడిదీ ఎక్కడిదీ నీ ఆత్మకు శాంతి ఎక్కడిది?
ఎక్కడిదీ ఎక్కడిదీ నీ కుటుంబానికి ఓదార్పు ఎక్కడిది?
ఎక్కడిదీ ఎక్కడిదీ ఈ భరతజాతి కళ్ళల్లో కాంతి ఎక్కడిది?
ఎక్కడిదీ ఎక్కడిదీ ఆ భరతమాతకు మనశ్శాంతి ఎక్కడిది?

అశ్రునివాళి...
కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ
సానుభూతిని,సంతాపాన్ని తెలియజేస్తూ
అమరవీరుడైన కల్నల్ సంతోష్ బాబుకు
అశ్రునయనాలతో, నివాళులర్పిస్తూ, 
వారి ఆత్మకుశాంతి చేకూరాలని ఆపరమాత్మను ప్రార్థిస్తూ....

29. ఓ యువతా ! విను నా కవిత !! 

ఉత్తముడిలా వుండు
ఉత్తర కుమారుడిలా వుండకు
ఉడుతలా వుండు, మిడతలా
మిణుగురు పురుగులా వుండకు

గదిలో గబ్బిలంలా
గుడిలో గుడ్లగూబలా
పంజరంలో పక్షిలా 
దారం తెగిన గాలిపటంలా
పదునులేని కత్తిలా వుండకు

ఎదురు లేని ఏనుగులా
ఎత్తైన ఎవరెస్టు శిఖరంలా
అడవిలో మృగరాజులా
చీకట్లో సైతం వేటాడే 
చిరుతపులిలా వుండు

బుసలు కొట్టే కోడెనాగులా
నింగికెగిరే తారాజువ్వలా
నిశిరాత్రిలో నవ్వే నక్షత్రంలా
దూసుకు పోయే రామబాణం
చొచ్చుకుపోయే 
అరుణోదయ కిరణంలా వుండు

పండిన చేనులా 
నిండిన చెరువులా వుండు
నీతిగా నిజాయితీగా ఉండు
నిస్వార్థంగా వుండు నిప్పులా మండు
ఉత్కృష్టమైన ఈ మానవ జన్మ
మళ్లీ మళ్లీ రాదని మాత్రం గుర్తుంచుకో

30. విజయానికి పది సూత్రాలు ..

1. ఆత్మవిశ్వాసమే ఉంటే 
ఎంతటి ఘనవిజయాన్నైనా సాధించవచ్చు 
2. 100 ఆలోచనలకన్నా ఒక్కఆచరణమిన్న 
3. ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా 
దానిపట్ల దృఢమైన నమ్మకముండాలి 
గట్టిపట్టుదల వుండాలి సాధించి 
తీరాలన్న తపన ఉండాలి 
4. మంచిపని చేయడానికి ప్రతిరోజూ‌ మంచిరోజే ప్రతిఘడియ ఒకమంచి ముహూర్తమే 
5. ప్రతిదానికి సందేహించేవాళ్ళు 
మొహమాట పడేవాళ్ళు జీవితంలో
ఎప్పటికీ ఎదగలేరు 
పేదవాళ్లగానే మిగిలిపోతారు 
6. ఫలితం రాకున్నా కష్టపడి పనిచెయ్యాలి 
ఒకనాటికి ఆ శ్రమే ఊహించని ఫలితాలనిస్తుంది గొప్పగుర్తింపును తెస్తుంది 
7. నేడు అద్భుతాలు సృష్టించినవారంతా 
నిన్న ఆర్థికంగా చితికినవారే 
8. మనం కాలాన్ని కాదంటే అది 
మనజీవితాన్ని జీరో చేస్తుంది 
9. ప్రతిమనిషి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి 
దాన్నే నిత్యం స్మరించుకోవాలి 
దానినే దర్శించుకోవాలి దానికోసమే జీవించాలి 
10. బద్దకం మనిషికి బద్దశత్రువే కాదు 
అది ఒక ఊబిలాంటిది 
అది ఒక సజీవ సమాధిలాంటిది దాన్ని ఆశ్రయిస్తే 
అది నిన్ను మొక్కలా ఎదగనివ్వకపోగా 
అధఃపాతాళానికి అణగద్రొక్కుతుంది జాగ్రత్త !

31. స్వేఛ్ఛ ఎక్కడో ప్రాణభయమక్కడ...

పంజరంలోని పక్షికి స్వేచ్ఛలేదు 
కాని వేళకింత తిండి దొరుకుతుంది  
ఎటువంటి ప్రాణభయం శత్రుభయం లేకుండా 
కంటి నిండ నిద్రపోతుంది  

ఆకాశంలో ఎగిరే పక్షికి ఎంతో స్వేఛ్ఛ ఉంటింది
కాని తిండి కోసం ఎక్కడెక్కడో
గూడు వదలి తిరగాలి ఎంతో దూరం వెళ్లాలి  
తిరిగి గూడు చేరేవరకు 
అడుగడుగునా గండాలే ప్రాణభయమే 
ఎవరు వల విసురుతారోనని 
ఎక్కడ ప్రాణం తీస్తారోనని 

చిన్న ఆక్వేరియంలో
ఉన్న చేపకు స్వేచ్ఛలేదు 
కాని వేళకింత మేతదొరుకుతుంది అది
ఏ భయము లేకుండా సుఖంగా ఉంటుంది

చెరువులోనో సముద్రంలోనోవున్న  
చేపకు చాలా స్వేఛ్ఛ ఉంటుంది  కాని
క్షణక్షణం ప్రాణభయమే 
ఏ తిమింగళం మింగివేస్తుందోనని 
ఏ వలలో చిక్కుకొని
గిలగిలా కొట్టుకోవలసి వస్తుందోనని
ఏ గాలానికో తగులుకొని
విలవిల లాడాల్చి వస్తుందోనని 
 
స్వేఛ్ఛ ఎక్కడో ప్రాణభయమక్కడ
జననమెక్కడ మరణమక్కడో  
వెలుగు ఎక్కడో చీకటి అక్కడ
సుఖం ఎక్కడో దుఃఖం అక్కడ
ప్రక్కప్రక్కనే వుంటాయి 
అన్నీ కలిసే వుంటాయి కాని
కంటికి కనపడకుండా వుంటాయి

32. శుభోదయం శుభసందేశం..... 

పోరాడితే పొయేదేముందండి
మీ బానిసత్వపు సంకెళ్లు తప్ప

నవ్వితే పొయేదేముందండి 
మీ ఆందోళన అనారోగ్యం తప్ప

ప్లాట్లు కొనమని శతాబ్దిలో 
పొరుగువారికి సలహాఇస్తే పొయేదేముందండి

జన్మంతా మిమ్మల్ని గుర్తు పెట్టుకోవడం తప్ప
చేసిన మేలుకు గుండెల్లో మీకు గుడికట్టడం తప్ప

అన్న పోలన్న సుభాషితం - 
విన్న మీకు శుభోదయం

33. కప్పా ? చిప్పా ? 
ఏది కావాలో తేల్చుకో

అభివృద్ధి చెందరా శిష్యా అంటే 
లేదు అడుక్కు తింటానన్నాడట
వెనుకటి ఒక  శిష్యుడు

తక్షణమే తధాస్తు అంటూ
గురువు గారు ఒక చిన్నచిప్ప
శిష్యుని చేతిలో పెట్టి 

అందులో నాలుగు చిల్లర 
డబ్బులు వేసి వెళ్ళి ఆనందంగా 
అడుక్కుతినమని ఆశీర్వదించాడట 

ఔనిది నిజం విధిలిఖితం  
చెప్పిన మాట వినకపోవడం తప్పే
ఎవరికైనా చివరికి చేతికి వచ్చేది చిప్పే

ముందు పొంచివుండేది ముప్పే
ఐతే చెప్పిన మాట విన్నవారికి 
భగవంతుడందించేది  బంగారు కప్పే

34. ఆశకు హద్దుండాలి  
      మనిషికి బుద్ధుండాలి....

నన్ను ఎవరు 
ఏమనుకుంటే నేమి ?
నలుగురు నవ్వితే నేమి?

చాటున ఛీఛీ అన్ననేమీ ?
మూఖాన ఉమ్మివేసిన నేమి?

నేను మాత్రం 
ఎవరెస్టు శిఖరంపైన వుండాలి 
పరులు మాత్రం పాతాళానికి పోవాలి 

అన్న మనస్తత్వం మంచిది కాదు 
అట్టి కేటుగాడితో సమాజానికి చేటు

వాడు సమానత్వానికి అర్థం 
తెలియని సన్యాసి వాడు మంచితనం 
మానవత్వం లేని ఒక మృగం

ఆశబోతుతనానికి సైతం కాస్త హద్దు వుండాలి
పెద్దమనిషి అన్న తర్వాత కాస్త బుద్ధి వుండాలి

అబద్ధాలు ఆడేవాడెన్నడూ అభివృద్ధి చెందలేడు
పరులను వంచించువాడు పరలోకానికి పోతాడు

35. వేగం" ప్రధానం 

బైక్ లమీద బయటికి వెళ్ళి 
ర్యాష్ డ్రైవింగు చేసి

డివైడర్ లను ఢీకొట్టే
విద్యార్థులకు విజ్ఞప్తి 

వేగం" ప్రధానమే కాని
అతి "వేగం" అతిప్రమాదం 

నిన్న ఆలస్యం అమృతం విషం
నేడు వేగం ప్రధానం ప్రమాదం

36. మాట మీద నిలబడటం వేరు 

నిలబడే మాట పలకడం వేరు
మొదటిది నిజాయితీ - రెండవది దార్శనికత

చెప్పింది చేయడం వేరు
చేసేది చెప్పడం వేరు
మొదటిది నిబద్దత - రెండవది పారదర్శకత

ఇతరుల మీద గెలవడం వేరు
ఇతరుల మదిలో నిలవడం వేరు
మొదటిది తంత్రం - రెండవది తత్వం

ఎంత దూరమైనా వెళ్ళడం వేరు
ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు
మొదటిది సాహసం - రెండవది వివేకం

ఎలాగైనా చేయడం వేరు
ఎలా చేయాలో తెలిసుండటం వేరు
మొదటిది చొరవ - రెండవది నేర్పు

ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు
ఇతరుల కోసం పిడికిలి బిగించడం వేరు
మొదటిది నింద నీడన అస్తిత్వం 
రెండవది నీడ వీడిన చైతన్యం

గెలవడం వేరు - గెలిపించడం వేరు
మొదటిది నేను - రెండవది మేము

సంఘం కట్టడం వేరు - సంఘటితం అవ్వడం వేరు
మొదటిది వ్యూహం - రెండవది చైతన్యం

మొదటిది కావాలో...రెండవది కావాలో 
ఆలోచన మనదే ...ఆచరణా మనదే ...

37. ఆత్మవిశ్వాసమే నీఆయుధం కావాలి.... 
 
గెలుపు ఓటములు దైవాధీనములే
ఐనా ఓటమి అంచుకు చేరినా సరే 
నీ ఆత్మవిశ్వాసాన్ని వదులు కోవద్దు 
విజయమో అపజయమో కరాఖంఢిగా 
ఖచ్చితంగా తేలేది చిట్టచివరి నిముషంలోనే 
పోటీ కొనసాగు తున్నంతసేపు 
నీవు విజయం వైపే చూడాలి 
ఓటమిని మనసులో తలంచరాదు  
దాని వైపు చూడరాదు 
ఆత్మవిశ్వాసం కొద్దిగా కూడా కోల్పోరాదు 
నిరాశను దరిచేర నియ్యరాదు 
రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకాలి 
దూకుడును పెంచాలి 
పట్టుదలతో, కనపడని కసితో  
చిట్టచివరి నిముషం వరకు శ్రమించాలి 
స్వేదాన్ని చిందించాలి 
ఆరు నూరైనా సరే ఓటమిని ఒప్పుకోరాదు 
అర్జునుడికి చెట్టు కొమ్మల్లోని
పక్షి మాత్రమే కనిపించినట్లు
కప్పుమాత్రమే నీ కళ్లకు కనిపించాలి 
దాన్ని దక్కించుకోవడానికి నీవు కష్టపడాలి  
అన్ని రకాలుగా ప్రణాళికాబద్దంగా 
ఒకరి ప్రేరణతో నీపై గట్టినమ్మకంతో
శతవిధాలా ప్రయత్నించాలి కృషి చెయ్యాలి 
ఆఖరు క్షణంవరకు 
ఆత్మవిశ్వాసమే నీఆయుధం కావాలి 
ఆపై విజయలక్ష్మి పరుగులు 
పెట్టేది నీ వెంటే
ప్రశంసల కుంభవర్షంలో 
తడిసిముద్దైపోయేది నీవే
సభలు సమావేశాలు 
సన్మాలు సత్కారాలు 
అంబరాన్ని తాకే సంబరాలు నీకే

38. జాబు వచ్చినందుకా? 
      జన్మ నిచ్చినందుకా? 

చీమంత లక్ష్యాన్ని నిర్దేశించుకొని 

ఏనుగంత ఉద్యోగం రావాలని ఆశించడం  

ఎంతటి అవివేకం? ఎంతటి వెర్రితనం? 

కొడితే ఏనుగు కుంభస్థలాన్నేకొట్టాలి 

పెడితే కాలు కలెక్టర్ బంగ్లాలోనే పెట్టాలి

ఎక్కితే ఎవరెస్ట్ శిఖరమే ఎక్కాలి 

మొక్కితే అమ్మానాన్న కాళ్లే మొక్కాలి 

ఎందుకు? జాబు వచ్చినందుకా?
కాదు కాదు జన్మ నిచ్చినందుకు  

39. ఒక చిన్న కండీషన్ ఏమిటది? 

తల్లీ!  ఓ సాగర మాతా! 
నీలో దూకి ఈ తనువు 
చాలించాలనుకుంటున్నాను

ఓకే బిడ్డా! అలాగే కాని 
ఒక చిన్న కండీషన్! 
నాలో అలలు ఆగిన తర్వాత 
మాత్రమే నీవు దూకాలి

ఎంత కాలమైనా 
ఎన్ని ఏళ్ళు గడిచినా 
ఆ అలలు ఆగలేదు 
ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు

మహోన్నత మైనది
మహా ఉత్కృష్టమైనదీ 
ఈ మానవ జన్మ
అట్టి జన్మను మట్టిలో కలపడం
ఎంతటి దారుణం! 

అజ్ఞానంలో అంధకారంలో 
దుర్వసనాలకు బానిసలై
ఆకర్షణతో అమాయకత్వంతో
క్షణికావేశాలకు గురై
బంగారు భవిష్యత్తును 
బలి తీసుకోవడం 
ఎంతటి ఘోరం! 

కష్టపడి కని పెంచి పెద్ద చేసి
ఆశలెన్నో పెట్టుకున్న 
కలలెన్నో కంటున్న
కన్న తల్లిదండ్రులను 
మానసిక క్షోభకు గురిచేయడం 
ఎంతటి నేరం! 

అందుకే ఓ బిడ్డలారా! 
ఆ దారుణానికి పాల్పడే ముందు
ఒక్కసారి ఆలోచించండి
మీకు జన్మనిచ్చి మీ అమ్మానాన్నల్ని
మీకు ప్రాణం పోసిన ఆ భగవంతున్ని
నిండునూరేళ్లు బ్రతికిన
మీ తాతా ముత్తాతలను 
కోట్లు ఖర్చు పెట్టినా బ్రతుకని
కోటీశ్వరులను 
ఒక్కసారి ఒకే ఒక్కసారి
గుర్తుచేసుకోండి చాలు, ఇక నుండి
"ఆశే నా ఆస్తి" అంటారు 
"ఆత్మహత్యకు స్వస్తి" అంటారు

40. విజయం - అపజయం 

అపజయం పడుకున్న వాడి 
చుట్టే తిరుగుతూ ఉంటుంది 
లేస్తే  
ముఖాన ఉమ్మి ఉయ్యడానికి 
అవకాశాల తలుపులు ముయ్యడానికి 
"బద్దకస్తుడన్న" ముద్ర వెయ్యడానికి 

విజయంపరిగెత్తే వాడి 
వెంటే పరుగుపెడుతుంది  
ఆగితే
మెళ్ళో పూలమాల వెయ్యడానికి 
అవకాశాల నిధిని అందివ్వడానికి 
"బాహుబలన్న" బిరుదునివ్వడానికి 

41. నడిసంద్రంలో నావ

కనులున్నాక కలలు తప్పవు
సముద్రమన్నాక అలలు తప్పవు

కాని ఆ అలల తాకిడికి 
నీ కలలు విలవిలలాడినా
విధికి వినిపించేలా విలపించకు 

కడలి ఎంత పొంగినా ఉప్పొంగినా 
ఒక్క నీ కన్నీటిచుక్కను కూడా 
కడలిలో కలవనియ్యకు  

ఎన్ని తుఫాన్లు వచ్చినా 
ఎంతటి అల్లకల్లోలం సృష్టించినా 
అదరకు బెదరకు అలసిపోకు 

ధైర్యసాహసాలతో దరిచేరు 
ఆ దైవమే నీకు దారి చూపు 

నావను నడిపేది నీవే
కాని నడిపించేది కనిపించని ఆ దైవం 

నావ తీరం చేరడం ఒక తీపి వరమే
సాహస చేస్తే చేరవచ్చు ఆ సాగర తీరమే

42. ఒద్దురా వొద్దురా !
      వెలిగితేనెే ముద్దురా!!

ఒద్దురా వొద్దురా 
ఒడ్డు చేరని నావ బ్రతుకు
గడ్డితినే గాడిద బ్రతుకు 

ఒద్దురా వొద్దురా 
బావిలో కప్ప బ్రతుకు 
యెడారిలో ఒంటె బ్రతుకు 

ఒద్దురా వొద్దురా 
పంజరంలో పక్షి బ్రతుకు 
కలుగులో కప్ప బ్రతుకు 

ఒద్దురా వొద్దురా 
పరిగెత్తలేని గుడ్డి గుర్రం బ్రతుకు
నట్టేట ముంచే మట్టేనుగు బ్రతుకు

ఒద్దురా వొద్దురా 
వీధిలో కుక్క బ్రతుకు 
ఆకలి తీరని అనాధ బ్రతుకు 

ఒద్దురా వద్దు ఆ చెత్త బ్రతుకు 
బ్రతికితే బ్రతకరా ఓ కొత్త బ్రతుకు 

బ్రతికితే నిప్పులా బ్రతకాలిరా
నలుగురికి నీడ నివ్వాలిరా

బ్రతికితే అడవిలో 
పులిలా బ్రతకాలిరా 
రారాజులా అస్తమించాలిరా

బ్రతికితే మంచిగా బ్రతకాలిరా 
మహాత్ముడిలా మరణించాలిరా

జన్మకు సార్ధకతలేని 
ఈ బ్రతుకులెందుకురా ?
వెలిగించినా వెలుగునివ్వని 
ఆ నూనెలేని దీపాలెందుకురా?

మరి మీ పుట్టుకకు 
అర్థం పరమార్థ మేముందో 
ఒక్కసారి అందరు ఆలోచించాలి
అసలు లోపమెక్కడుందో 

43. పంచాంగ శ్రవణం 

ఒక వ్యాపారి ఉన్నతస్థితికి

Business అంటేనే 
కనిపించని కష్టాలు 
నలువైపులా నష్టాలు
Business లో
మొకాళ్ళలోతు మునిగిన వ్యాపారికి
25% లాభం 75% నష్టం
నడుములలోతు మునిగిన వ్యాపారికి
50% లాభం 50% నష్టం
పీకలదాక మునిగిన వ్యాపారికి
75% లాభం 25% నష్టం 

నడిజుట్టు వరకు మునిగిన  వ్యాపారికి
100% లాభాలే 
ఈ విళంబి నామ సంవత్సరమంతా 
అన్నీశుభాలే
పట్టిందంతా బంగారమే
ముట్టిందంతా ముత్యమే

ఒక విద్యార్ధి ఉజ్వలభవిష్యత్తుకు

TVచూస్తూ ,సెల్లోమాట్లాడుతూ ,
గేమ్సు ఆడుతూ పాడుతూ ఆరామ్ గా 
చదివే విద్యార్ధికి
విజయలక్మి 1000 మైళ్ళదూరంలో వుంటుంది 
అర్ధరాత్రిలోఅపరాత్రిలో మాత్రమే లేచి 
చదివే విద్యార్ధికి
25% విజయం 75% నిరాశ
పగలంతా కష్టపడి చదివే విద్యార్ధికి
50% విజయం 50% నిట్టూర్పు
కాని పగలురాత్రి గట్టిప్రణాళికతో
చదివే విద్యార్ధికి
75% విజయం 25% దుఖం

కాని బ్రాహ్మీముహూర్తంలో 
చదివేవిద్యార్ధికి మాత్రం
100%విజయం 
అడుగుదూరంలోనే ఉంటుంది 
ఆపై ఈ విళంబి నామ సంవత్సరమంతా
ఇక బ్రతుకు బంగారమే
ఇది కాదనలేని ఒక నగ్నసత్యమే

44 .ప్రయత్నమెక్కడో !ప్రతిఫలమక్కడ!!

విశేషమైన - ప్రఙ్ఞతో
అఖండమైన - ప్రతిభతో
ముందస్తు బృహత్తర - ప్రణాళికతో
చేస్తే భగీరద - ప్రయత్నమే
ఎదురైనా సరే ఎంతటి- ప్రతిబందకం 
సాఫీగా సుఖంగా సాగిపోతుంది 
- ప్రయాణం
పరుగులు పెడుతుంది - ప్రగతిరధం
దక్కుతుంది చక్కని - ప్రతిఫలం 
ఆ పై పెరిగేను కరగని తరగని కీర్తి 
- ప్రతిష్టలు 

45. నిద్రలో సైతం నీ లక్ష్యాన్ని మరువకు

లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం 
పెద్దకష్టమేమీ కాదు,కాని
అక్కడికి చేరుకోవడమే బహుకష్టం 
కాస్త సాధన చేస్తే 
కాస్త సాహసం చేస్తే 
కాస్త ప్రయత్నం చేస్తే 
కొన్ని ప్రతిబందకాలని దాటేస్తే 
చేరుకోవడం పెద్దదూరమేమి కాదు 
అంత భారమేమి కాదు 

కాని గట్టిపట్టుదల వుంటే 
చేరాలన్న తపన వుంటే 
లక్ష్యాన్ని చేరుకోవచ్చు 
ఆ గమ్యాన్ని చేరుకునే 
కొత్తమార్గాన్ని కనిపెట్టాలి 
కొంత త్యాగం చెయ్యాలి 
లక్ష్యసిధ్ధికి తప్పక ఆత్మశుద్ధి కావాలి 

నేను పర్వతాలను కదిలిస్తాని 
నేను అగ్నిని మింగేస్తానని 
నేను సముద్రాన్ని త్రాగేస్తానని 
అకుంఠదీక్షతో అడ్డంకులకు వెరవక 
లక్ష్యాన్ని మరువక 
నిరంతరం గమ్యాన్ని 
గుర్తుచేసుకొంటూ  ముందుకే సాగితే

చివరి అడుగు ఆవలితీరం వరకే 
చిమ్మచీకటిని చీల్చుకు వచ్చేది వేకువవెలుగే 
కొండంతవెలుగు నిచ్చేది గోరంతదీపమే
వీధి చివరనున్నా సరే నీ చూపు 
విజయశిఖరం వైపే వుంటే

గురి తప్పని లక్ష్యమెంతటి
కష్టమైనా సంక్లిష్టమైనా
కసితో కృషితో
నిరంతర సాధనతో
ఛేదించడం సాధ్యమే
లక్షమైళ్ళదూరమైనా 
ప్రారంభం ఒక్కఅడుగుతోనే 
అసలు లక్ష్యసాధనంటేనే
ప్రఙ్ఞను నిరూపించే
ఒక మహాయజ్ఞమే

46 .సహాయమందించే
      వారే సహృదయులు

సహాయమందించే సహృదయులు
మూడు రకాలు
మొదటి రకం 
ఆపద అవసరం వచ్చీరాగానే
ఆర్ధికంగా వెంటనే ఆదుకునేవారు 

రెండవ రకం
ధనసహాయం చెయ్యలేకపోయినా
ఒక మాట సహాయమైనా చేస్తారు లేదా
ఒక మంచి సలహానైనా 
యిస్తారు లేదా సహాయం అందే 
ఒక చక్కని దారినైనా చూపెడతారు

మూడవరకం 
"మని"లేదు "మాట"లేదు 
మన్నుతిన్నపాములా "మౌనంగా"
పిరికితనంగా పరధ్యానంగా
కదలని కరగని కఠినమైన "ఒక శిలలా"
ఉలుకూపలుకూ లేకుండా ఉంటారు 

చేసే సహాయాలు రెండు రకాలు  
ఒకటి మాట సహాయం 
రెండు మని సహాయం 

మాట సహాయంచేయాలంటే 
మంచి మనసుండాలి 

ధన సహాయం చేయాలంటే మాత్రం
దయార్ద్రహృదయముండాలి 
దైవభీతి ఉండాలి 
గుండెళ్ళోజాలి ఉండాలి 
కరుణామయుడై ఉండాలి 
కరిగే హృదయ ముండాలి 

ధైర్యముండాలి దాతైవుండాలి
పేదలంటే ప్రేమ వుండాలి 
ఉన్నది పరులకు పంచే 
ఉత్కృష్టమైన మంచి గుణముండాలి 

ఎదురు చెప్పని భార్య వుండాలి
ఎముకలేని చెయ్యి వుండాలి

అప్పుడేగా దాతలుగా మారేది
దాతలేగా దారిచూపే దీపాలు
దాగివున్న ఆ దైవానికి ప్రతిరూపాలు

47. బరి గురి ఉరి సిరి

"బరి"(యుద్దం)లోనికి 
దిగిన తర్వాత 
గురి ఉరి సిరి మాత్రమే గుర్తుండాలి 

"గురి"(లక్యం)చూసి 
ఏకాగ్రతతో బాణాన్ని 
సంధించాలి 

గురి తప్పితే 
"ఉరి"(ప్రాణత్యాగం)కైనా  
సిద్దంగా వుండాలి 

గురి చూసి లక్ష్యాన్ని చేధిస్తే 
"సిరి"(విజయం)సంతోషం, స్వర్గం 
సర్వం నీ సొంతమౌతాయి 
సందేహం లేదు లేదు లేదు

48. నీకు నాకేం తెలుసు
      నిమ్మకాయ పులుసు !!!

పచ్చగా పెరుగుతున్న ఆ పండ్లచెట్టును 
నవ్వుతూ గొడ్డలితో నరికెయ్యకు 
మున్ముందు ఆ చెట్టు 
ఇంకెన్ని తియ్యని ఫలాలను 
ఇంకెంత మందికి అందించాలో 
ఎవరికి తెలుసు ?
విత్తనం నాటిన ఆ వ్యక్తికి
పెంచిన ఆ ప్రకృతికి తప్ప

చక్కగా పెరుగుతున్న ఆ పూలమొక్కను
మొగ్గలోనే త్రుంచివెయ్యకు 
మున్ముందు, ఆ మొక్క 
ఇంకెన్ని అందమైన అతి సుందరమైన
గుభాళించే పూలను పుయ్యాలో 
ఎవరికి తెలుసు ? 
నారుపోసి నీరుపోసి 
ప్రేమతో పెంచిన ఆ తోటమాలికి తప్ప

బిస్కట్లు ఆశ చూపి 
ఆ పసిబిడ్డను
కసిగా కామాంధుడివై కాటెయ్యకు 
చిన్ననాడే ఆమె బంగారు భవిష్యత్తును
చిదిమెయ్యకు ఛిద్రం చెయ్యకు
మున్ముందు, ఆ చిట్టితల్లి పెరిగి పెద్దదై 
ఎవరికి భార్యకావాలో
ఎంతమంది ప్రయోజకులయ్యే
భారతమాత బిడ్డల్ని కనాలో 
ఎవరికితెలుసు ?
నిన్నకని,నేడు కమ్మని కలలుకనే
ఆ అమాయకపు అమ్మనాన్నలకు 
ప్రాణం పోసిన ఆ పరమాత్మకు తప్ప

ఆదిలోనే ‌ఆ చిరుదీపాన్ని 
ఆర్పివేయకు మున్ముందు, 
వెలిగే ఆ దీపం చీకటిలో ఉన్న
ఇంకెన్ని దీపాలను వెలిగించాలో 
ఇంకెంతమందికి వెలుగులు పంచాలో  
ఎవరికి తెలుసు ?
వేయి ఆశలతో ఆ దీపాన్ని
వెలిగించిన ఆ వ్యక్తికి తప్ప

మార్కులపేర ర్యాంకులపేర
మధ్యలోనే ఆ విద్యార్థిని
ఆవేశంతో ఆత్మహత్యకు పురికొల్పకు 
మరణానికి చేరువయ్యేలా మంత్రించకు
మున్ముందు,ఆ విద్యార్థి విజేయుడై జీవితంలో
ఇంకెంతమందికి మార్గదర్శకుడు కావాలో
మర్రిమ్రానులా మారి
ఇంకెంతమందికి నీడ నివ్వాలో  
ఎవరికి తెలుసు ?
భవిష్యత్తును నిర్ణయించే
ఆ భగవంతునికి తప్ప

49. మూర్ఖులు - ముసలి లక్షణాలు

అబ్బాయిలకు 
అమ్మాయిల లక్షణాలు 
అమ్మాయిలకు 
అబ్బాయిల లక్షణాలు 
వస్తే నష్టంలేదు 

కాని కోడెవయసులో ఉన్న 
వేడిరక్తం మరుగుతున్న
యువతీయువకులకు 
ముసలివాళ్ళ లక్షణాలు
వస్తేనే పెనుప్రమాదం 

ఈ నవయవ్వనాన్ని తిరిగి
వారనుభవించలేరు

ఈ పొంగే కొత్తకొత్త కోర్కెలను 
సరదాలను తిరిగి వారుతీర్చుకోలేరు

ఈ యవ్వనాన్ని తిరిగి మళ్లీమళ్లీ
ఆదైవం నుండి వారుపొందలేరు

ఈ ముసలి లక్షణాల ముసుగును  
వేసుకున్నవారు మూర్ఖులు 

ఈ ముసలి లక్షణాల సంకెళ్లు
తెంచుకున్నవారు విజ్ఞులు విశ్వవిజేతలు 

50. సంస్కారం- సాస్టాంగ నమస్కారం

నీ మంచితనాన్ని
నీ అమాయకత్వాన్ని
ఆసరా చేసుకొని ఒకడు
నీ యింటికే నిప్పు పెడుతూవుంటే 

అది తప్పుఅని చెప్పకపోతే 
వద్దు అని వారించకపోతే ఎలా?
నీ ఇల్లు కాలి బూడిదైతే 
నీకా నష్టం వాడికా ?

మన కన్నబిడ్డలు తప్పుచేస్తే 
మంచిమాటలు చెప్పకపోతే
మందలించక పోతే ఎలా?
శపించవద్దు కాని గద్దించాలిగా 

మన క్రింది ఉద్యోగులు తప్పుచేస్తే
కఠినంగా వుండాలి కళ్ళెర్ర చెయ్యాలి
కస్సుబుస్సు మనాలి కాని
కడుపు మీద కొట్టకూడదుగా 

విద్యార్ధి ఒకరు విఫలమై ప్రేమలో
విరక్తి చెంది బ్రతుకులో 
నీ కళ్ళ ముందే నదిలోదూకి 
ఆత్మ హత్య చేసుకుంటే
ఈత వచ్చిన నీవు రక్షించకపోతే ఎలాగ?

కత్తులు కటారులు పట్టుకొని 
త్రాగుబోతు ఒకడు 
వీధిలో వీరంగం చేస్తుంటే 
ఖాకీ డ్రస్సులో వున్న నీవు
కంట్రోల్ చెయ్యకపోతే ఎలాగ?

సహనం మంచిదే కాని
సమయానికి స్పందించక పోతే 
ఆపదలోవున్నవారని ఆదుకోకపోతే 
ఆయుధముండి చేతిలో ఏః లాభం

సమయముండి స్పందిస్తే
సకాలంలో సహాయం అందిస్తే 
అదే కదా సంస్కారం
అట్టి వారికి అందరు చేస్తారు
సాస్టాంగ నమస్కారం

51. నేడే తెలిసింది ఒక నిండునిజం 

పాముతో కలిసి 
వేడివేడి పాలు త్రాగాలని 
పాము పడగ నీడన 
ప్రశాంతంగా పవళించాలని 
కమ్మని కలలు గనే 
ఆ అమాయకపు కప్పలకు
తెలియదు పాపం ఒక పచ్చినిజం 

తమకు ప్రాణగండమున్నదని
తమకు పాముకు బద్దవైరమని
తాము పాములకు ఆహారమని
ఆ అమాయకపు కప్పలకు
తెలియదు పాపం ఒక పచ్చినిజం 

కప్పలు పదివేలు ఏకమైనా 
ఒక్కపామునైనా సంహరించలేవని
చీమలు కూడా పాములకు శతృవులను
ముల్లును ముల్లుతోనే తియ్యాలను
ఆ అమాయకపు కప్పలకు 
తెలియదు పాపం ఒక పచ్చినిజం 

కసిపట్టి బుసలు కొట్టే కోడెనాగుల 
విషపు కోరల నుండి 
విముక్తి లభించాలంటే 
కప్పలన్నీ చలిచీమల సహకారం 
తప్పక తీసుకోవలసిందేనని
ఆ అమాయకపు కప్పలకు 
నేడే తెలిసింది ఒక నిండునిజం 

52. వెంగళప్ప వేదాంతం 

గడ్డిమేసే ఓ గుడ్డిగాడిదా !
మురికి బట్టలుమోసే 
ఓ ముసలి గాడిద!
ఊరంతా ఉలిక్కి పడేలా
ఓండ్ర పెట్టింది చాలిక  
ఒంగోలు గిత్తలా పోజు పెట్టక                                                                                                                            
వెళ్ళపోవే ఓ వెర్రిగాడిద అంటూ 
పొట్టచెక్కలయ్యేట్టు నవ్వుకుంటూ

వెర్రివెంగళప్ప ఒకడు 
గాడిద వెనకాలె నిలబడి 
వెళ్ళేగాడిదను వెక్కిరిస్తుంటే 
తోకను గట్టిగా మెలి పెడుతుంటే
కాళ్ళమీద కర్రతో కొడుతూవుంటే

ఒళ్ళుమండి గాడిద ఒక్కసారి  
కాళ్ళురెండు జాడించింది 
గట్టిగా ముఖాన ఒక్క తన్ను తన్నింది
అంతే పాపం ఎగిరి వెంగళప్ప
ముళ్లకంపలో పడ్డాడు 
ముక్కు పచ్చడైంది 
కళ్ళు బైర్లు కమ్మాయి
పళ్ళు పదారు రాలాయి 

గాయాలపాలైన వెంగళప్పను
గాడిదమీదనే హాస్పటల్ కి తీసికెళ్ళారు
అప్పుడు కట్లు కడుతున్నప్పుడు 
ఙ్నానోదయమైంది వెర్రివెంగళప్పకు
గాడిదలన కూడా మనం గౌరవించాలని

53. బంగారంలాంటి అవకాశం 
      రానే రాదు వస్తే?

అవకాశమే ఆహారమైతే అది 
నీదాక వస్తే ఆలోచించకు ఆరగించు 

అవకాశమే అదృష్టమైతే అది
నీదాక వస్తే సంకోచించక
సద్వినియోగం చేసుకో

అవకాశమే ఆయుధమైతే అది
నీదాక వస్తే దాన్ని ప్రణాలికాబద్దంగా
ప్రయోగించు
 
అవకాశమే అమ్మాయైతే అది
నీదాక వస్తే పారిపోనివ్వకు 
ప్రేమించి పెళ్ళాడు
  
అవకాశమే అమృతమైతే అది
నీదాక వస్తే త్రాగెయ్ జారిపోనివ్వకు
నీ జాతకమే మారిపోతుంది

బంగారంలాంటి అవకాశం రానే రాదు
ఒక్కసారి వచ్చి మిస్సైతే మాత్రం
ఇక ఈ జన్మలో తిరిగిరాదు 

54. ముందుచూపు లేనివారు.... 

చుట్టేమి
జరుగుతుందో 
పట్టించుకోనివారికి
ముందుచూపు లేనివారికి 

మంచిమాట చెబితే విననివారికి 
మూఢుల మాటల్ని శ్రద్ధగా వినేవారికీ

ముందన్నీ కష్టాలే...నష్టాలే...కన్నీళ్ళే 
చింతలే...చిక్కులే...చీకాకులే...

కారణం చుట్టూవున్న 
వారంతా మేక వన్యపులులని...

బాగా నమ్మించి 
నవ్వుతూ నట్టేటముంచే 
నయవంచకులని.. నమ్మకద్రోహులని...

కడుపులో 
కత్తులుంచుకొని కౌగలించుకొనే 
కసాయివాళ్ళని... తేనెపూసినకత్తులని...

ఘోరంగా నష్టపోయేంతవరకు...
దారుణంగా మోసపోయేంతవరకు...
చిట్టచివరి నిముషం వరకు..
తెలుసుకోకపోతే ఎలా?
అజ్ఞానంలో అంధకారంలో మునిగివుంటే ఎలా?

అందుకే, మిత్రులారా!
ఇకనైనా నిండు నిజం తెలుసుకోండి !
గాఢనిద్ర నుండి మేల్కొనండి !
దగాకోరులమీద నిఘా పెట్టండి !
లేదంటే చెల్లించుకోక తప్పదే
కలలో సైతం ఊహించలేని
భరించలేని భారీ మూల్యం....

55. ముందు పోల్చుకో! 
     తరువాత తేల్చుకో!! 

ఓ నా ప్రియ మిత్రమా ! 
ముందు నిన్ను నీవు
నీటిలోని కప్పతోనో
లేదా
నింగిలోని పక్షితోనో 
పోల్చుకో

ఆ తర్వాత 
ఎగిరే పక్షిలా ఎదగడమా
లేక
బావిలోని కప్పలా బ్రతకడమా 
తేల్చుకో 

56. నమ్మకు నమ్మకు
     నమ్మితే నరకమే

ఒక తిండిబోతు 
వాడిఇంటికి వాడిఒంటికి
వాడేశత్రువు 

ఒక సోమరిపోతు
ఇతరులకంటికి అన్నింటికి
వాడేశత్రువు 

ప్రతిదానికి
వంగి వుండే తిండిబోతు
తప్పక లొంగిపోతాడు 

ప్రతిదానికి
పొంగిపోయే సోమరిపోతు
తప్పక కృంగిపోతాడు 

అందుకే
సోమరిపోతు నక్కల్ని 
తిండిబోతు కుక్కల్ని
కాకి లెక్కల్ని
కలుపు మొక్కల్ని
నమ్మకు నమ్మితే చిక్కులే
బ్రతుకు ముక్కలు చెక్కలే

57. మంచి ఆలోచనలకు 
     జన్మస్థానమేది? 

మంచి ఆలోచనలు
పార్కులో తిరుగుతుంటే 
పుట్టవచ్చు 

బస్సులోనో రైళ్లను 
ప్రయాణంచేస్తున్నప్పుడు
పుట్టవచ్చు 

గాఢంగా నిద్రపోయి
తెల్లవాఱు జామున
మూడు లేదా నాలుగు గంటలకు
మెలుకువ రాగానే
పుట్టవచ్చు 

కుమార్ తో  సరదాగా 
ఫోన్లో మాట్లాడుతూ వున్నప్పుడు
పుట్టవచ్చు 

58. అడగుతూ, వెదుకుతూ
     తడుతూనే వుండాలి.... 

అడగండి అడగండి
అడుగుతూ వుంటేనే
మీ అవసరం తీరుతుంది 

వెదకండి వెదకండి  
వెదుకుతూ వుంటేనే
మీరు కోరుకున్నది దొరుకుతుంది 

తట్టండి తట్టండి  
తడుతూ వుంటేనే తప్పక 
ఒక తలుపు తెరుచుకుంటుంది 

59. విలువ ఎరిగినవారే విజ్ఞులు 

గాడిదకేం తెలుసు 
గంధం విలువ

గాఢాంధకారంలో తిరిగే
గబ్బిలానికేం తెలుసు 
వెలుగు విలువ

ఆటలో ఓడినవాడికేం తెలుసు 
విజయం విలువ

గుడ్డివాడికేం తెలుసు 
గులాబీ విలువ

మందబుద్దికేం తెలుసు 
మహాభారతం విలువ

ఇంటిని పట్టించుకోని 
వాడికేం తెలుసు
ఇన్సూరెన్స్ విలువ

60. స్పందించు స్నేహహస్త మందించు 

నేమనిషినే మానును కాను
ఐతే నా మాట తప్పక విను

ఏదైనా ఎప్పుడైనా 
వీడియో చూసినప్పుడు 
మంచి సందేశం చదివినప్పుడు
మంచి దనిపిస్తే, మనసుకు నచ్చితే 
వెంటనే స్పందించు 
చిరునవ్వు చిందించు 
స్నేహహస్త మందించు 

ప్రతివారిని ప్రేమించు 
ఆప్యాయంగా పలకరించు 
ఆపదలో ఉన్నవారిని ఆదుకో 
నేనున్నానన్న భరోసా నివ్వు 

నేను మనిషివేనని మంచితనానికి
మానవత్వానికి మారుపేరని 
నేను నిప్పులాంటి వాడవని
నీతికి నిజాయితీకి
నిలువుటద్దమని నిరూపించుకో

చేతకానివాడే చేతులు ముడుచుకుంటాడు
మాటరానివాడే మౌనంగా వుంటాడు
ఆడలేనివాడే మద్దెల ఓడంటాడు

అరిచే కాకిని కరిచే కుక్కను
కసురుకుంటారు, కాని 
ఆడే నెమలికి పాడే కోకిలకి
ఫ్యాన్స్ వుంటారు

అందుకే సకాలంలో స్పందించనివాడు
కదలని కట్టెతో సమానమంటారు
అవునంటారా? కాదంటారా? 
మరి మీరేమంటారు? 

61. నమ్మరాదు నమ్మరాదు నమ్మనేరాదు

అమ్మానాన్నలుఆశపడ్డారు కాబట్టే 
ఆ యిద్దరు ప్రేమతో కలిశారు కాబట్టే 
కనిపించని ఆదైవం కరుణించాడుకాబట్టే
వారి కడుపున మనం పుట్టాము కాబట్టే

ఈ లోకంలోకి అడుగు పెట్టాము కాబట్టే 
బ్రతికి ఈ నేలమీద బట్టకట్టాము కాబట్టే 
పైనుండి పిలుపు వచ్చింది కాబట్టే 
కన్నుమూసి కట్టేగా మారాము కాబట్టే 

ఆర్జించినవన్నీ వదిలి పెట్టాము కాబట్టే 
కట్టెల మీద పెట్టి కాలుస్తున్నారు
గోతిలో పెట్టి పూడుస్తున్నారు
లేకుంటే ఏ కాకులకో గద్దలకో 
విసిరివేసేవారు నిన్ను నన్ను
మానవత్వంలేని ఈ మనుషులు 

నమ్మరాదు నమ్మరాదు నమ్మనేరాదు
కన్నబిడ్డలనైనా కట్టుకున్న భార్యనైనా
కడకు బంధువులనైనా
నా అన్నవారినెవరినైనా

బందాలేవైనా బ్రతికున్నంత వరకే
ఈ నేల మనకు అద్దె కొంప 
కన్ను మూయక తప్పదు 
కొంప ఖాళీ చేయక తప్పదు 

ఎవరూ నీవారు కారు
ఏదీ నీ వెంట రాదు
అంతా భ్రమ పిచ్చి భ్రమ
అంతా మాయమచ్చీంద్ర

62. విజ్ఞులకే నా విజ్ఞప్తి

ముందు చూపులేని వారే
మూర్కులు 
వినేవారే విజ్ఞులు 
అట్టి విజ్ఞులకే నా విజ్ఞప్తి 

మీకు లడ్లు కావాలా ?
లక్షలు కావాలా ?
లడ్లుకావాలంటే తిరుపతి పొండి
లక్షలుకావాలంటే 
మా సంపూర్ణ రక్ష పాలసీ చేసుకోండి 

ఇంత గొప్ప సందేశం చదివి కూడ  
సైలెంటుగా ఉండేవాడు సన్యాసి 
అవునో కాదో నాకు తెలియదు కాని 
సంపాదనా పరుడు మాత్రం కాలేడు 

ముందు చూపుగల వాడి ముందరే 
వుంటాయి ముత్యాల రత్నాలు 
అందుకోలేరు పరమ బద్దకస్తులు  
ఎంతో ఎత్తునుండు ఆస్తులుపాస్తులు 

63. గట్టి దెబ్బ ఒక్కటి తగిలితే చాలు 

ఎవరికి ఎప్పుడూ
ఏమి జరుగుతుందో
ఎవరికి ఎరుక ? 

మన తలరాత బాగోలేక 
మన నవగ్రహాలు అనుకూలించక 
విధి పగబట్టి విషపునవ్వు నవ్వితే 

అకస్మాత్తుగా జరగరాని 
ఘోరమేదైనా జరిగితే చాలు
  
ఒక్కటంటే ఒక్కగట్టి 
దెబ్బ తగిలితే చాలు 

దిమ్మ తిరిగిపోవడానికి 
మైండ్ బ్లాక్ కావడానికి 
కష్టపడి దాచుకున్న డబ్బంతా 
హారతి కర్పూరమైపోవడానికి 

అందుకే ఉండాలి 
ముందుజాగ్రత్త పొదుపు కై
అందుకే ఉండాలి 
ముందుచూపు ఫ్యామిలీ పై

అనవసర ఖర్చుల్ని అదుపు 
చేయలేకున్నా పొదుపు చేస్తాననడం

సముద్రంలో అలలు ఆగిన తర్వాత  
స్నానం చేస్తాననడం 

ఇబ్బందులన్నీ తీరిన తర్వాత 
ఇన్సూరెన్స్ చేస్తాననడం

అవివేకం అజ్ఞానం అమాయకత్వం 

64. నా నమస్కారం వాడి సంస్కారం

రాజు నేను రోజు పార్కులో కలుస్తాం 
పాత మిత్రులం. వాడు నా కంటే కాస్త పెద్ద అందుకే పార్కులో వాడు కనబడగానే  ప్రతి రోజు వాడికి నేనే ముందు నమస్కారం చేస్తాను కాని వాడు 
ప్రతి నమస్కారం చేయకుండా 
ఒక చిరునవ్వు నవ్వుతాడు అంతే. 
అదే నాకు నచ్చదు కోపం వస్తుంది కూడా 

ఐతే "నమస్కారం చేస్తే తిరిగి ప్రతి నమస్కారం చేయకపోవడం సంస్కారం కాదు" 
అని తెలియని వాడేమీ కాదు వాడు

అదే విషయమై ఒకరోజు వాన్ని నిలదీశాను 
మళ్లీ అదే నవ్వు నవ్వి 
"నాకు నమస్కారం పెట్టిన వారికి 
తిరిగి నేను నమస్కారం పెట్టనురా" అన్నాడు

అది వినేసరికి నా తల తిరిగింది. 
ఖంగుతిన్న నేను ఇకవీడికి జీవితంలో నమస్కారం చెయ్యకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను

ఎందుకురా ?అంటూ గట్టిగా ప్రశ్నించాను 
మళ్ళీ అదే చిరునవ్వు నవ్వి 
నాకు నమస్కారం చేసిన వారికి తిరిగి నేను నమస్కారం చెయ్యను కాని వెంటనే "ఓ గాడ్  బ్లస్ దెమ్ & గివ్ దెమ్ లాంగ్ లైఫ్" అని మనసులో భగవంతున్ని వారి కోసం ప్రార్ధిస్తాను వారిని మనసారా దీవిస్తాను అన్నాడు అంతే. 

నానోట మరోమాట రాలేదు అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక సంస్కారికి ఒకటి కాదు వంద నమస్కారాలు చేస్తే మాత్రం నష్టమేముంది? అని అయితే నాశ్రేయస్సును కోరే నా మిత్రుణ్ణి నేను పూర్తిగా అర్థం చేసుకోలేక పోయినందుకు అపార్థం చేసుకున్నందుకు 
మనసులో కాస్త మదనపడ్డాను

ఆనాటి నుండి వాడు కనిపించిన ప్రతిసారి 
మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూనే 
వున్నాను వాడి ఆశిస్సులకోసం 
ఆ దేవుని దీవెనల కోసం. 

65. విశ్వవిజేతవై
      విజయఢంకా మ్రోగించు  

ఈ సృష్టిలో 
అన్ని జన్మలకన్నా 
ఉన్నతమైనది 
ఉత్కృష్టమైనది 
ఈ మానవజన్మే

అందుకే ఓ మనిషి! 
నిన్ను నీవు తెలుసుకో  
నీలోకి నీవు తొంగి చూడు 
నీలో ఉన్నవి శక్తులు మూడు  
నీ శరీరం నీ మనసు నీ ఆత్మ 

ఇది పచ్చినిజం నీలోవుంది 
ఆత్మ అనే ఒక అఖండజ్యోతి 
ఆ సత్యమే తెలుసుకుంటే  
ఆర్జిస్తావు నీవు ఖండాంతర ఖ్యాతి 

నిజానికి 
నీవు ఓటి కుండవు కాదు పాలకుండవు 
నీవు చీమవు కాదు సింహానివి 
నీవు జింకవు కాదు చిరుతపులివి 
నీవు ఎలుకవు కాదు ఏనుగువు 
నీవు శిలవు కాదు శిఖరానివి 
నీవు వ్యక్తివి కాదు ఒక దివ్యమైనశక్తివి 

పదిసార్లు పడినా సరే పైకి లేస్తావు
నేడు ఓడినా రేపు నీవు గెలుస్తావు
ఓడిపోవడానికి కాదు నీవు
జయించడానికే జన్మించావు 

అందుకే ఓ మనిషీ! 
భయమెందుకు? సందేహమెందుకు? 
ఆశే శ్వాసగా సాగిపో ముందుకు 
విశ్వవిజేత వయ్యేందుకు 
విజయఢంకా మ్రోగించేందుకు

కృతజ్ఞతంటూ లేనివారు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించనివారు
చేసిన మేలును మరిచేవారు
నేడు దాచుకున్నదానికి పదిరెట్లు 
రేపు ఖర్చుపెట్టాల్సివస్తుంది 

అప్పుడు 
కన్నీళ్ళు కడివెడు
కష్టాలు పుట్టెడు జాగ్రత్త మరి

66. రాజ్యాధికారమే లక్ష్యంగా...!

నిన్న... 
కాలినడకన సైకిళ్ళ మీద తిరిగిన
గల్లీలోని చోటానాయకులు ఢిల్లీకెళ్ళి

రేపు
కాలం కలిసి వచ్చి కార్పోరేటర్లౌతారు
ఖద్దరు దుస్తుల్లో...ఖరీదైన కార్లలో 
కాలరెగ రేసుకుంటూ తిరుగుతారు

నిన్న 
ఆశపెట్టి అరచేతిలో స్వర్గం చూపి
మీ జేబులో ఒక వంద కొట్టి 
మీ చేతిలో ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టి
మీ నోట్లో ఇంత మత్తుమందు పోస్తే

రేపు
మీకు తెలియదు 
మీనోట్లో మట్టికొట్టారని...
కోట్లు పోసి మీ ఓట్లు కొన్నారని...
మీ ఆశలకు తూట్లు పొడిచినారని...
మిమ్మల్ని మత్తులో ముంచి మాయలో దించి
మీ ఓటువిలువ మీకు తెలియకుండా చేశారని...

ఓ పీడిత తాడిత బడుగు 
బలహీనులారా ! బహుజనులారా !
ఇంకెంతకాలం మీరిలా బానిసలై బ్రతుకుతారు ? 

ఓట్లు మీవి...సీట్లు వారివా ?
అజ్ఞానం మీది...అధికారం వారిదా ?
పాలితులు మీరు...పాలకులు వారా ?
85 శాతం మీద...15 శాతం పెత్తనమా?

అందుకే ఇకనైనా కళ్లు తెరవాలి
ఒక బలమైన సంఘటిత శక్తిగా అవతరించాలి !
ప్రతిదీ ప్రశ్నించాలి... ప్రతిఘటించాలి...పోరాడాలి !
రాజ్యాంగ బద్దంగా...రక్తతర్పణకైనా సిద్దపడాలి !

మీ "సఖ్యతను"...నిరూపించుకోవాలి ! నిప్పైరగలాలి !
మీ "ఐక్యతే" మీ ఉద్యమాలకు "ఊపిరి" కావాలి !

ఓ బహుజనులారా ! ఒక పచ్చినిజం తెలుసుకోండి !
సంఘంలో సమానత్వం... ఒక్కవిద్య ద్వారానే సాధ్యమని...
రాజ్యాధికారం మీకు...ఒక్క ఓటు ద్వారానే ఖాయమని

67. ఎవరితరం కాదు 

"కళ్లు" చెమర్చకుండా 
సంసారాన్నిఈదడం 

"కాళ్ళు" తడవకుండా
సముద్రాన్ని దాటడం 

"పళ్ళు" కనిపించకుండా 
విరగబడి నవ్వడం
వికటాట్టహాసం చెయ్యడం 

"ఒళ్ళు" గుల్లకాకుండా
ఒలింపిక్స్ లో పసిడిపతకం 
సాధించడం 

"విల్లు" వంచకుండా  
బాణాలు సంధించడం 

"ముల్లు" గుచ్చుకోకుండా 
గులాబీ పువ్వును త్రుంచడం 
ఎవరితరం కాదు 

68. కలిసి వుంటే కలదు సుఖం 

నిన్న 
నాలుగు ఎద్దులుఏకమై 
నడుస్తున్నప్పుడు 
పులి చెట్ల చాటున
గుట్టల మాటున 
నక్కినక్కి తిరిగింది 

ధైర్యం చేసి దగ్గరకొస్తే
కొమ్ములతో ఎద్దులు కుమ్మేశాయి
పాపం పులి పరుగులు తీసింది

నేడు నాలుగు ఎద్దులు  
నాలుగుదారుల్లో నడుస్తుంటే 

గమనించిన పులి
గట్టిగా గర్జించింది 
గంతులు వేసింది
గొంతులు కొరికింది 

కలిసి వుంటే కలదు సుఖం
విడిపోతే బ్రతుకు విషాదం 

కలిసివుంటే చలిచీమలు సైతం 
సర్పాలను సంహరిస్తాయి

విడిపోతే ఎద్దులైనా ఏనుగులైనా
అడవిలో పులులకు ఆహారమౌతాయి

69 .అదీ టైం దొరికినప్పుడు మాత్రమే 

ప్రతి మనిషికి
ఆలోచించే జ్ఞానముంది
చదివిందేదైనా నచ్చిందో లేదో
తేల్చేందుకు స్వేచ్ఛ వుంది
చెప్పేందుకు చేతిలో సెల్ వుంది
స్పందించేందుకు మంచి మనసుంది 
వ్రాసేందుకు అమృత హస్తముంది 
(అదీ టైం దొరికినప్పుడు మాత్రమే) 

మరి ఎంత మొరపెట్టుకున్నా దీవించకుంటే 
శివుడికి శిలకు తేడా ఏముంది? 
మనసుకు నచ్చిన 
ఒక మంచి సందేశం 
చూసినా చదవినా 
ఉలుకు పలుకులేకుంటే 
కాసింతైనా స్పందించకుంటే 
మనిషికి మానుకు తేడా ఏముంది? 
(అదీ టైం దొరికినప్పుడు మాత్రమే) 

అందుకే నచ్చితే
ఆనందంతో అరవండి 
నచ్చకున్న కామెంట్లతో గుచ్చండి
సరదాగా ఉరమండి మెల్లగా మెరవండి 
సలహాలు కురవనివ్వండి
విమర్శల వెల్లువలోనో
ప్రశంసల చిరు జల్లుల్లోనో తడవనివ్వండి
(అదీ టైం దొరికిన  లాప్పుడు మాత్రమే)

అందుకే మిత్రులారా మరవకండి
కామెంట్లతో చెత్త సందేశాలను 
కత్తెరించండి
లైకులతో కొత్త ఊహలకు 
ఊపిరి పొయ్యండి
మౌనంగా మాత్రం వుండకండి 
(అదీ టైం దొరికినప్పుడు మాత్రమే)

70 .ప్రశ్నలు నావి - సమాధానాలు మీవి 

*మన ఇంట్లో ప్లాస్టిక్ పూలు*
*మన పెరటిలో బంతిపూలు*  
ఉంటె జుమ్మంటూ తుమ్మెదలు  
వేటిమీద వాలుతాయి? 

ఆకలేసి నప్పుడు
ఎదురుగా 
*కప్ప* 
*కొబ్బరిచిప్ప* 
ఉంటె పాము దేన్ని మింగుతుంది? 

అర్జెంటుగా ఆఫీసుకు 
వెళ్లాల్సివస్తే ఎదురుగా
*ఆటోవుంది*
*అంబాసిడర్ కార్ వుంది* 
ఛార్జ్ ఒక్కటే ఐనప్పుడు 
మనం ఎందులో వెళ్తాము? 

కిటకిటలాడే బస్సులో
*ఒక బామ్మ* 
*ఒక బాపు బొమ్మ*
ఎక్కిమన ఒక్కరినే సీట్ రిక్వెస్ట్ చేస్తే   
ముందు లేచి మనం ఎవరికి సీటిస్తాము? 

మన ఆఫీసులో మన ప్రక్కనే 
*మురికి బట్టలతో ఒకవ్యక్తి*
*మంచి సూటుబూటుతో ఒకవ్యక్తి* 
ఉంటె మనం ఎవరికి గౌరవం ఇస్తాము? 
ముందు ఎవరికి నమస్కారం చేస్తాము? 

మనం శాకాహారులం 
ఆకలేసినప్పుడు,మన ఎదురుగా 
*ఒక అరిటాకులో ఆవకాయ 
నెయ్యి వేసిన భోజనం  
మరో అరిటాకులో 
ఘుమఘుమలాడే బిర్యాని*  
ఉంటె ఆతృతగా దేన్నీ తింటాము?

సరిగాఆలోచించంచండి
సమాధానాలు చెప్పండి

71. సృష్టి మీదనే కొందరి దృష్టి 

కొందరు చరిత్రను సృష్టిస్తారు 
కొందరు చరిత్రను తిరగ వ్రాస్తారు
కొందరు చరిత్రను చదువుతారు 

కొందరు అవకాశాలను సృష్టిస్తారు
కొందరు అందిన అవకాశాలను 
సద్వినియోగం చేసుకుంటారు 
కొందరు వచ్చిన బంగారు అవకాశాలను 
దుర్వినియోగం చేసుకొని 
ఇక ఎన్నటికీ తిరిగిరాని అవకాశాలకోసం 
కన్నులు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు

మానవ జీవితాలతో 
ముడిపడివి మూడు
సంపద
పెట్టుబడి 
పొదుపు
కొందరు సిరిసంపదల్ని సృష్టిస్తారు 
కొందరు ఆదాయాన్ని ఆర్జిస్తారు  
కొందరు జీతం పుచ్చుకుంటారు  

మన మధ్యనే ఉంటారు
ఎప్పుడూ ఈ ముగ్గురు, వీరిలో 
కొందరు ఉత్తములు 
కొందరు మధ్యములు  
మరికొందరు అధములు, కానీ 

తమ శక్తి యుక్తుల్ని ఉపయోగించే 
వ్యక్తులకు మాత్రమే సృష్టి మీద దృష్టి 

72 .ఈ పిచ్చి" ముదరక ముందే.... 

ఫేస్ బుక్ , వాట్సాప్ ల 
పిచ్చిపట్టి 
ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి 
ముఖ్యమైన పనులన్నీ 
మూలకునెట్టి 

సత్సందేశాలివ్వాలనే 
దృఢసంకల్పంతో
అర్ధరాత్రివరకు 
కంటిమీద కునుకు లేకుండా 
తిండి తిప్పలు మాని పూర్తిగా
ఇంట్లో శ్రీమతితో "చీవాట్లు తింటూ" 
తెల్లవార్లూ మెసేజ్ లు టైపుచేసుకుంటూ
ప్రొద్దుటే శుభోదయమంటూ పెట్టేవ్ పోస్ట్

ఆపై ఎంతో ఆశతో ఒక చకోరపక్షిలా 
కామెంట్ల కోసం, లైకుల కోసం 
కళ్ళు రెండు కాయలు కాసేలా
ఎదురు చూస్తావ్, ఎంత టైమ్ వేస్ట్  

ఓ అమాయకపు మిత్రమా! 
ఇకనైనా ఈ పిచ్చి మానుకో
ఓ పచ్చి నిజం తెలుసుకో
వెయ్యి మాటలేల ఇది వెఱ్ఱితనమే
మూటికి ముమ్మాటికి ఇది మూర్ఖత్వమే
అవివేకమే అజ్ఞానమే, నిజానికి 
ఇదంతా నాటకమే ఫేకుల బూటకమే
తగిలేది ఎదురు దెబ్బలే
చివరికి మిగిలేది పెడబొబ్బలే
 
ఇదందరూ పరుల మెప్పుకోసం 
తెలిసీ తెలియక చేసే పెద్ద తప్పు 
నేడు నిప్పు కాని రేపు సునామీలా
ముంచుకొస్తుంది పెద్ద ముప్పు 

అందుకే రేపటి "శుభోదయం" 
కలిగించాలి నీకు గొప్ప జ్ఞానోదయం
వ్యర్థం చెయ్యక విలువైన కాలం 
అర్ధం చేసుకుంటే చాలు నీకెంతో మేలు 
గరిటెడైనచాలు గంగిగోవు పాలు  
కడివడేలరా మనకు ఖర్మపాలు 
అన్న యోగి వేమన్న వేదాంతం 
గుర్తుంచుకో మిత్రమా జీవితాంతం 

73. పిల్లలు తిరుగుబోతులైతే? 
      పచ్చి త్రాగుబోతులైతే? 

బారు వెలుపల అందరు
బంగారు బాతులే, కానీ 
త్రాగితే మాత్రం కోతులే 
కొండముచ్చులే
చెప్పేవి శ్రీరంగ నీతులే
నోట వచ్చేవి పచ్చి బూతులే
తల్లీదండ్రుల కష్టార్జితంతో
పీకలదాక త్రాగుతారు
త్రాగి తైతక్కలాడుతారు 
కైపెక్కి తాము చాలా 
మంచి వారమంటారు 
తాము ఏ తప్పు చేయడం లేదంటారు
తామే అందరి కంటే తెలివైనవారమంటారు
తప్పుడుమాటలు మాట్లాడుతుంటారు
తప్ప త్రాగొచ్చి
పాలిచ్చిపెంచిన తల్లినే పచ్చి బూతులు తిడతారు
కన్నతల్లీదండ్రులనే కాళ్ళతో తంతారు
కర్రలతో కొడతారు 
కళ్లు రెండు బైర్లుకమ్మి 
ఒళ్ళు మరిచి 
తరతమ భేదం లేకుండా
తప్పుడుపనులుచేస్తారు
తోటి మిత్రులతో కలిసి
తిరుగుతారు తింటారు జోకులేసుకుంటారు
తిట్టుకుంటారు కొట్టుకుంటారు 
జుట్టు పట్టుకుంటారు 
మనసులో ఏదో పెట్టుకుంటారు
తగవులాడుకుంటారు తన్నుకుంటారు 
పాతకక్షలుంటే  
కసాకసా కత్తులతో పొడుచుకుంటారు 
కసితీర్చుకుంటారు 
కటకటాల పాలౌతారు 
కన్నోళ్ళ పరువును గంగలో కలిపేస్తారు
గుండెల్లో గునపాలు గుచ్చేస్తారు
అందుకే  అంటారు విజ్ఞులు
వాడని కిటికీలు పెట్టీ ప్రయోజనం లేదు 
ఉపయోగపడని కొడుకులు పుట్టీ 
ప్రయోజనం లేదు, అని
అందుకే  అంటారు ఇంటిపెద్దలు
పోలియో పిల్లలనైనా భరించవచ్చు కానీ 
పోకిరి పిల్లలను భరించలేము అని
అయ్యో ఓ దైవమా! 
మాకే ఎందుకు ఈ అగ్ని పరీక్ష 
మాకే ఎందుకీ కరగని కన్నీటి శిక్ష 

74. హంస" లా హాయిగా జీవించు

ఓ నా ప్రియ నేస్తమా!
నీవు లేచింది మొదలు 
నిద్ర పోయేంత వరకు
భారతీయతనే జపించు
విశ్వశాంతికై తపించు
   - స్వామి వివేకానందలా

నీ లోని పగను ప్రతీకారాన్ని
ద్వేషాన్ని కోపాన్ని తక్షణమే త్యజించు 
   - గౌతమ బుధ్ధునిలా

అందరికి ప్రేమను పంచు 
మంచిని మానవత్వాన్ని ప్రబోధించు 
  - ప్రభువైన యేసు క్రీస్తులా 

అట్టడుగు వర్గాల హక్కులకై 
నిప్పులా జ్వలించు నిరంతరం పోరాడు 
  - డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ లా

అహింసే ఆయుధంగా రక్తపాత 
రహితంగా అనుకున్నవన్నీ సాధించు 
   - మహాత్మాగాంధీలా

హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా 
అందరికీ ఆదర్శంగా ప్రశాంతంగా జీవించు 
   - శ్రీ రామకృష్ణ పరమ 'హంస'లా

ఇలాచేస్తే నీ జన్మ ధన్యం 
నీ జీవితం సార్థకం 
ఇందులో లేనేలేదు సందేహం
ఇదే నీ శ్రేయోభిలాషిగా నీకు నేను 
అందించే "అద్భుత అక్షర సందేశం" 

75. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు 

కలగన్నవాడు కసిఉన్నవాడు 
కత్తిలా పదునైనవాడు 
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు

పట్టుదల ఉన్నవాడు పడినా లేచి  పరిగెత్తేవాడు  
పదే పదే ప్రయత్నించేవాడు 
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు

ప్లాన్ ప్రకారం ముందుకు దూకేవాడు  
పగలు రాత్రి శ్రమించేవాడు 
పడుకున్న సరే పనీపనంటూ 
నిద్రలో కలవరించేవాడు 
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు

తన తప్పులు తాను  తెలుసుకున్నవాడు 
తన శక్తిని తాను నమ్ముకున్న వాడు 
తల్లిదండ్రుల మాటలు విన్నవాడు 
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు

భయమన్నది ఎరుగనివాడు
భక్తిలో మునిగినవాడు 
భగవంతునిపై భారం వేసినవాడు
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు

76. అన్నకు వందనం అభివందనం 

నిన్నటి మన శతృవులే 
నేటి మన స్నేహితులు 
నేటి మన  స్నేహితులే 
రేపటి మన ప్రాణ మిత్రులు 
అంటూ కమ్మగా పలికిన 
స్నేహానికి చిరునామా ఐన
ఓ అన్నా మీకు వందనం
మీ శుభ సందేశానికి అభివందనం

మంచితనమే మన ఆయుధం 
సమానత్వమే మన ఆశయం 
సంతోషమే మన సంపద
స్నేహమే మన శక్తి 
కలుపుగోలుతనమే మన బలం 
అంటూ వివేకానందలా పలికిన 
మంచితనానికి మారుపేరైన
ఓ అన్నా మీకు వందనం
మీ శుభ సందేశానికి అభివందనం

పరులనుండి పైసా ఆశించక
మనస్ఫూర్తిగా సేవ చెయ్యాలి 
కష్టాలలోవున్న వారిని 
తక్షణమే ఆదుకోవాలి
హృదయపూర్వకంగా
చేయగలిగినంత 
సహాయం చేయాలి
నేనున్నానన్న భరోసా నివ్వాలి 
అంటూ క్రీస్తులా పలికిన 
ప్రేమకు ప్రతిరూమైన
ఓ అన్నా మీకు వందనం
మీ శుభ సందేశానికి అభివందనం

పేదల్ని ప్రేమించాలి
పెద్దల్ని గౌరవించాలి 
చిన్నవారిని ఆత్మీయంగా 
పలకరించాలి
అజ్ఞానులకు బోధించాలి
అమాయకులకు 
కనువిప్పు కలిగించాలి
ఓడిపోయిన వారిని ఓదార్చాలి
పడిపోయిన వారిని పైకి లేపాలి
శక్తి హీనులను చైతన్య పరచాలి 
అంటూ జ్ఞానబోధ చేసిన
అంబేద్కర్ వీరాభిమానిఐన
ఓ అన్నా మీకు వందనం
మీ శుభ సందేశానికి అభివందనం

77. ఒద్దురా వొద్దురా !(R) 
     వెలిగితేనెే ముద్దురా!

ఒద్దురా వొద్దురా 
ఒడ్డు చేరని నావ బ్రతుకు
గడ్డితినే గాడిద బ్రతుకు 

ఒద్దురా వొద్దురా 
బావిలో కప్ప బ్రతుకు 
యెడారిలో ఒంటె బ్రతుకు 

ఒద్దురా వొద్దురా 
పంజరంలో పక్షి బ్రతుకు 
కలుగులో కప్ప బ్రతుకు 

ఒద్దురా వొద్దురా 
పరిగెత్తలేని గుడ్డి గుర్రం బ్రతుకు
నట్టేటముంచే మట్టేనుగు బ్రతుకు

ఒద్దురా వొద్దురా 
వీధిలో కుక్క బ్రతుకు 
ఆకలి తీరని అనాధ బ్రతుకు 

ఒద్దురా వద్దు ఆ చెత్త బ్రతుకు 
బ్రతికితే బ్రతకరా ఓ కొత్త బ్రతుకు 

బ్రతికితే నిప్పులా బ్రతకాలిరా
నలుగురికి నీడ నివ్వాలిరా

బ్రతికితే అడవిలో 
పులిలా బ్రతకాలిరా 
స్వేచ్చగా జీవించాలిరా

బ్రతికితే మహాత్ముడిలా బ్రతకాలిరా  
పదిమందికి మంచిని పంచి మరణించాలిరా

జన్మకు సార్ధకతలేని 
ఈ బ్రతుకులెందుకురా ?
వెలిగించినా వెలుగునివ్వని 
ఆ నూనెలేని దీపాలెందుకురా?

మరి మీ పుట్టుకకు 
అర్థం పరమార్థ మేముందో 
ఒక్కసారి అందరు ఆలోచించండి 
అసలు లోపమెక్కడుందో 

78. మాటే మంత్రం 
      మనసే బంధము 

ఒక కఠినమైన మాట 
మనసును గాయపరుస్తుంది 
గాయపడిన మనసుకు 
ప్రశాంతత కరువౌవుతుంది 

ప్రశాంతతే కరువైతే 
బ్రతుకు శూన్యమౌతుంది
బ్రతుకు శూన్యమైతే
జీవితం ప్రశ్నార్థకమౌతుంది

కఠినమైన మాటలే 
కంటిలో కారాలు
ప్రక్కలో బాణాలు  
గుండెల్లో గునపాలు 

మధురమైన మంచిమాటలే 
ఊరించే ఊటలు 
పరిమళించే పూదోటలు 
మురిపించే ముత్యాలమూటలు

ఔను ఒక మంచి మాట
తేనెకన్న తియ్యన 
వెన్నెలకన్న చల్లన 

అందుకే ఇక 
మీ నోటిమాట వెన్ననా? తేనెనా? 
అది తప్పా ఒప్పా? నిప్పా? ఉప్పా? 
అమృతమా? విషమా? 
ఆలోచించండి ఆపై మాట్లాడండి

79. విశ్వవిజేతవై
      విజయఢంకా మ్రోగించు 

ఈ సృష్టిలో అన్ని జన్మలకన్నా 
ఉన్నతమైనది ఉత్కృష్టమైనది 
ఈ మానవజన్మే

అందుకే ఓ మనిషి! 
నిన్ను నీవు తెలుసుకో  
నీలోకి నీవు తొంగి చూడు 
నీలో ఉన్నవి శక్తులు మూడు  
నీ శరీరం నీ మనసు నీ ఆత్మ 

ఇది పచ్చినిజం నీలోవుంది 
ఆత్మ అనే ఒక అఖండజ్యోతి 
ఆ సత్యమే తెలుసుకుంటే  
ఆర్జిస్తావు నీవు ఖండాంతర ఖ్యాతి 

నిజానికి 
నీవు ఓటి కుండవు కాదు పాలకుండవు 
నీవు చీమవు కాదు సింహానివి 
నీవు జింకవు కాదు చిరుతపులివి 
నీవు ఎలుకవు కాదు ఏనుగువు 
నీవు శిలవు కాదు శిఖరానివి 
నీవు వ్యక్తివి కాదు ఒక దివ్యమైనశక్తివి 

పదిసార్లు పడినా సరే పైకి లేస్తావు
నేడు ఓడినా రేపు నీవు గెలుస్తావు
ఓడిపోవడానికి కాదు నీవు
జయించడానికే జన్మించావు 

అందుకే ఓ మనిషీ! 
భయమెందుకు? సందేహమెందుకు? 
ఆశే శ్వాసగా సాగిపో ముందుకు 
విశ్వవిజేత వయ్యేందుకు 
విజయఢంకా మ్రోగించేందుకు

80. ఒకేపనిని అదేపనిగా 
       పదేపదే చేస్తే? 

ఒకే పనిని  
పదేపదే చెయ్యడం వలన 
పదేపదే చూడడం  వలన  
పదేపదే వినడం  వలన 
పదేపదే వ్రాయడం వలన 

పదేపదే నిద్రలోకూడా నిరంతరం   


81. కన్నీళ్ళు కడివెడు కష్టాలు పుట్టెడు 
      
కంటి నొప్పివచ్చినా 
పంటి నొప్పివచ్చినా
కాలినొప్పి వచ్చినా 
కడుపునొప్పి వచ్చినా 
గుట్టుగా గుండెనొప్పి వచ్చినా 
ఖర్మకాలి ఆపరేషన్ చేయాల్సి వస్తే
ఒక్కరోజులో -  ఖర్చు లక్షలు

కాని సంవత్సరమంతా 
ఏ జబ్బులు రాకుండా 
మీ జేబులోడబ్బులు ఖర్చుకాకుండా 
మీ ఇంటిళ్లిపాదిని కాపాడి  
చక్కని ఆరోగ్యాన్నియిచ్చిన 
మీరు నచ్చిన మీ దైవానికి 

సంవత్సరానికి 
ఒక్కసారి ఒకే ఒక్కసారి 
ఒక్కవెయ్యిరూపాయలు 
ఖర్చుపెట్టడానికి వెనుకాడుతున్నారా
ఆడబ్బును కూడా వెనకేసుకుంటున్నారా 
అది తప్పు పెద్ద తప్పు 

కృతజ్ఞతంటూ లేనివారు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించనివారు
చేసిన మేలును మరిచేవారు
నేడు దాచుకున్నదానికి పదిరెట్లు 
రేపు ఖర్చుపెట్టాల్సివస్తుంది 

అప్పుడు 
కన్నీళ్ళు కడివెడు
కష్టాలు పుట్టెడు జాగ్రత్త మరి

82. బంగారంలాంటి అవకాశం 
      రానే రాదు వస్తే? 

అవకాశమే ఆహారమైతే అది 
నీదాక వస్తే ఆలోచించకు ఆరగించు 

పరఅవకాశమే అదృష్టమైతే అది
నీదాక వస్తే సంకోచించక
సద్వినియోగం చేసుకో

అవకాశమే ఆయుధమైతే అది
నీదాక వస్తే దాన్ని ప్రణాలికాబద్దంగా
ప్రయోగించు

అవకాశమే అమ్మాయైతే అది
నీదాక వస్తే పారిపోనివ్వకు 
ప్రేమించు పెళ్ళాడు
  
అవకాశమే అమృతమైతే అది
నీదాక వస్తే త్రాగెయ్ జారిపోనివ్వకు
నీ జాతకమే మారిపోతుంది

బంగారంలాంటి అవకాశం రానే రాదు
ఒక్కసారి వచ్చి మిస్సైతే మాత్రం
ఇక ఈ జన్మలో తిరిగిరాదు 

83. నడక నీది పడక 
      ఆ పరమాత్మది 
    
How to come out of
the clutches of fb and whatsapp​

Spend only one hour on both 
Put a deadline Don't cross it

Be with descipline
Be strict Be stick to deadline 

దాటకు దాటకు లక్ష్మణరేఖ
ఈ జీవితానికి అర్ధం పరమార్ధం 
గీసుకున్న గీతే వ్రాసుకున్న వ్రాతే

మాట తప్పకు సాకులు చెప్పకు  ఊగిసలాడకు ఉక్కిరిబిక్కిరికాకు దిక్కులు చూడకు దిగులు చెందకు

ఆరునూరైనా సరే 
నెత్తిన పిడుగులు పడినా సరే 
అడుగులు ముందుకే 
ఆరోగ్యం అంచుల దాకా 
అనారోగ్యం అంతుచూసే దాకా 

రాత్రి అన్నీ రద్దు రద్దు
ఉదయం పూట కునుకు వద్దు 
ముసుగు వద్దు పది దాకపడక వద్దు
నడకే నడక పరుగే పరుగు 

తినే తిండితో 
చేసే యోగ వ్యాయామాలతో 
కండబలం గుండెబలం 
ఆత్మబలం వుండాలి ఆత్మతృప్తి చెందాలి 
పడిన ప్రతి శ్రమకు ప్రతిఫలం పొందాలి 

జీవితంలో ఆనందం ఆరోగ్యం 
ప్రశాంతత పొంగి పొర్లాలి 
అవి పదిమందికి ప్రేమతో పంచాలి 
మనజీవితం ఎందరికో ఆదర్శం కావాలి 
ఈ బ్రతుకు ధన్యమై పోవాలి 

84. ఎవరు నీవు? 
      మనిషివా? మూగమృగానివా? (R) 

ఇస్తానని ఆశచూపి ఇవ్వక పోవడం 
చేస్తానని సహాయం చెయ్యక పోవడం 
అన్నమాట మీద నిలబడక పోవడం 
అబద్దాలాడడం వాయిదాలు వెయ్యడం 
నమ్మినవారిని నట్టేట ముంచడం
నటించడం అంటే నాకు నచ్చదు

అట్టి వారిని విమర్శించడానికి
గట్టిగా హెచ్చరించడానికి 
ఎంత చెప్పినా వినకపోతే
ఏకిపారెయ్యడానికి
కోరల్ని పీకెయ్యడానికి 
కొమ్ముల్ని విరిచెయ్యడానికి 
బుద్ధికి బూజుపడితే దులపడానికి 
అది వంకరగా వుంటే సరిదిద్దడానికి 
సదా నేను సిద్దం

మనిషిలోని మంచికోసం
మానవత్వంకోసం
మహత్తరమైన మార్పుకోసం  
సంఘంలో సమానత్వం కోసం 
నాకలమెప్పుడూ చేస్తూనే 
ఉంటుంది ధర్మయుద్ధం 

మనిషికి మృగానికి 
మధ్య ఆరు తెరలు ఉంటాయి
వినయం - విధేయత 
విజ్ఞానం -  వికాసం 
విచక్షణ -   విలువ 

ఇవి లేనినాడు మనిషి మృతప్రాయుడే 
అవిఉన్నవాడు అందరికి ఆదర్శవంతుడే

85. పాపం అది సభాశాపం 

ఓ మిత్రమా !
ఎవరో వచ్చి నీకు బొట్టుపెట్టి  
పేరు పెట్టి నిన్ను స్టేజిమీదికి పిలవరు 
నీకు నీవే Move Move అంటూ 
Self Start చేసుకోవాలి
నిన్ను నీవే ముందుకు నెట్టుకోవాలి 
గిల్లుకోవాలి గిచ్చుకోవాలి 
గుండు సూదితో గుచ్చుకోవాలి 

మాట్లాడాలన్న తపనతో రగలిపోవాలి
నీ టాలెంట్ కి నీవే పరీక్ష పెట్టుకోవాలి
అవకాశం కోసం అర్రులు చాచి
అందివస్తే దాన్ని జున్నులా జుర్రుకోవాలి

ఏ సభకు నీవు వెళ్ళినా 
డార్క్ ఫేస్ తో డల్ గా వుండకు 
ముభావంగా మూలన కూర్చోకు  
కాసింత హుషారుగా ఉత్సాహంగా
నలుగురితో కలిసి నవ్వుతూవుండు

నీవు కలంపట్టి కమ్మని కవితలు వ్రాసి 
హృదయాలను కదిలించడమే కాదు 
మధురమైన నీ మాటలతో అందరి 
మనసులను కూడా దోచుకోవాలి 

మీటింగ్ కు ఒకరోజు ముందుగానే 
Speech Ready చేసుకొని వెళ్ళాలి 
Important Points వ్ర్రాసిపెట్టుకోవాలి 
ఇంట్లో అద్దంముందు ప్రాక్టీస్ చెయ్యాలి

మీటింగ్ ఆర్గనైజర్ కి పేరు ఇవ్వాలి 
ప్రక్కన వున్న మిత్రుడితో చెప్పాలి  
నేనూ కూడా మాట్లాడుతానని
మీటింగ్స్ లో మాట్లాడటం చాలా ఈజి 

స్టేజి Fear పోవాలంటే లేచి తిరగాలి
ఒక గ్లాసు మంచినీళ్ళు త్రాగాలి
గుండెనిండా గాలి పీల్చి వదలాలి
అందరు మాట్లాడిన తరువాత కాదు  
First or Second Person నీవే కావాలి 

మీలో ఇంకెవరైనా మాట్లాడతారా
అనీ అనగానే రేసుగుర్రంలా 
స్టేజి మీదకు పరుగు తియ్యాలి
స్టేజీకి దూరంగ మధ్యసీట్లో కూర్చోకు
కుర్చీకి లక్కలా అతుక్కు పోకు

86. కాదు కాదు ఆకొంగ 
      నీవే నిజమైన దొంగ 

ఓ కొంగ ఆకలేసి 
చెరువుగట్టున చేపపిల్లలకోసం 
ఒంగి ఒంగి తిరుగుతుంటే నీటిలో 
తొంగి తొంగి చూస్తుంటే 
మనందరం ఆ కొంగను దొంగా అంటాం

కాని ఆ కొంగను 
చెరువులో చేపల్ను 
పుట్టించింది ఆదైవమేఐతే  
ఆ చేపలే ఆ కొంగకు ఆహారమైతే
అదే దేవుడి నిర్ణయమైతే 
మరి చేపల్ని తిని ఆకలి తీర్చుకునే 
ఆ కొంగ పాపం దొంగ ఎలా ఔతుంది?

ఐతే ఓ మనిషీ!  
నీ ముఖ్య ఆహారం చేపలుకాదు 
కాని నీవు చెరువులో
ఏ గాలం వేసో ఏ వలవిసిరో
స్వేచ్చగా తిరిగే చేపల్ని పట్టుకుంటావ్
కమ్మగా కూరవండుకు తింటావ్
నిజానికి నీవే దొంగవి ఆ కొంగకాదు 

87. 12 పాఠాలు  
      నీవు నిత్యం నేర్పించు ఇలా  

1. నీ శిరస్సుకు 
సమస్యల ముళ్ళకిరీటాన్ని
ధరించడం బాధలు భరించడం నేర్పించు 
2. నీ ముఖానికి
తృప్తిగా నవ్వడం నేర్పించు 
3. నీ పెదవులకు 
సత్యాన్ని పలకడం నేర్పించు
4. నీ చెవులకు
మంచిని మాత్రమే వినడం నేర్పించు 
5. నీ చేతులకు 
దానం చెయ్యడం నేర్పించు 
6. నీ కళ్ళకు 
కరుణను కురిపించడం నేర్పించు 
7. నీ కాళ్లకు 
దైన సన్నిధికి పరిగెత్తడం నేర్పించు 
8. నీ మోకాళ్లకు 
దైవం ముందు మోకరిల్లడం నేర్పించు 
9. నీ స్వరానికి 
దైవాన్ని కీర్తించడం నేర్పించు 
10. నీ హృదయానికి 
పేదలను అనాధలను ప్రేమించడం నేర్పించు 
11. నీ మనసుకు 
రహాస్యముగా ప్రార్ధించడం నేర్పించు 
12. నీ శరీరానికి 
పాపానికి పదిమైళ్ళ దూరంలో ఉండడం నేర్పించు 
13. నీ జీవితానికి 
సుఖంగా ప్రశాంతంగా బ్రతకడం నేర్పించు 

88. క్రమబద్దమైన జీవితమంటే
      ఏమిటి? (for Retiree)

- ఉదయం 5 లేదా 6 గంటలకే

- నిద్ర లేవాలి నీళ్లు త్రాగాలి 

- బ్రెష్ చేసుకోవాలి టీ త్రాగాలి

- మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి 

- యోగ లేదా వ్యాయామం చెయ్యాలి

- షేవింగ్ చేసుకోవాలి 

- కాలకృత్యాలు తీర్చుకోవాలి 

- స్నానం చెయ్యాలి

- పూజ చెయాలి

- టిఫిన్ చెయ్యాలి

- ఫోన్ చెయ్యాలి

- పేపర్ చదవాలి 

- టీవీ చూడాలి 

- మంచి పుస్తకాలు చదవాలి 

- కాస్త కునుకు తియ్యాలి 

- స్నాక్స్ తినాలి 

- ఈవినింగ్ వాక్ కి వెళ్ళాలి 

- ఫోన్ చెయ్యాలి 

- టీవి చూడాలి 

- తిని 10 లేదా 11 గంటలకు  
  పడుకోవాలి 

- ఏమంటారు ఇది సాధ్యమేనా? 

89. వద్దురా  వద్దురా నమ్మొద్దురా

కల్లబొల్లి కబుర్లు తియ్యగా
కాకమ్మకథలు కమ్మగా చెప్పి  
నమ్మించి నవ్వుతూ నట్టేటముంచే 
నయవంచకులను కంత్రీగాళ్ళను
 
వద్దురా  వద్దురా నమ్మొద్దురా
కంటబడగానే పెంటమీద పైసాసైతం 
పరుగెత్తికెళ్ళి తీసి దాచుకునే నీచులను
పిల్లికిగాని దానిపిల్లకుగాని 
పిడికెడు బిక్షంపెట్టని పిసనారులను
  
వద్దురా  వద్దురా నమ్మొద్దురా
అన్నాతమ్ముళ్లను అమ్మానాన్నలను 
అక్కాచెల్లెళ్లను దూరపుబంధువులను  
ఇంటికి పిలిచి ప్రేమతో ఇంత తిండిపెట్టి 
గుట్టుగా లెక్కలు వ్రాసుకునే 
గుంటనక్కలను ఆశబోతులను

వద్దురా  వద్దురా నమ్మొద్దురా
మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు 
మా ఇంటికివస్తే ఏమితెస్తావు 
అన్నసూత్రాన్ని తూ.చ.తప్పక 
పాటించే పరమదరిద్రులను దౌర్భాగ్యులను
వద్దురా  వద్దురా నమ్మొద్దురా...

90. కోడిగుడ్లు - ఆమ్లేట్లు

కోడిపుంజుల కాళ్ళకు 
కత్తులుకట్టేప్పుడు కాస్త ఆలోచించాలి
పాపం పుంజులు కత్తులు 
గుచ్చుకుంటున్నాసరే
రక్తం చిందుతున్నాసరే 
చివరంటా పౌరుషంతో పోరాడుతాయి 
ప్రాణాలు కోల్పోతాయి
మూగజీవుల ప్రాణాలతో ఆడే 
ఆ రాక్షస కీడకు ముగింపు పలకాలి

ఆనందంగా ఆమ్లెట్లు 
వేసుకుతినేప్పుడు కాస్త ఆలోచించాలి
కోడి గుడ్లు పెడుతుందే కాని 
ఆమ్లెట్లు వేసివ్వదు 
ఆమ్లెట్లు మనమే వేసుకోవాలి 

అలాగే భగవంతుడు
ఇచ్చిన చక్కని సమయాన్ని 
అందించిన బంగారు అవకాశాల్ని
చేజార్చుకోకుండా తెలివిగా సమయస్పూర్తితో
సద్వినియోగం చేసుకొని
విజయంకోసం మనమే 
విశ్వ ప్రయత్నం చెయ్యాలి

91. నడిసంద్రంలో నావ

కనులున్నాక కలలు తప్పవు
సముద్రమన్నాక అలలు తప్పవు

కాని ఆ అలల తాకిడికి 
నీ కలలు విలవిలలాడినా
విధికి వినిపించేలా విలపించకు 

కడలి ఎంత పొంగినా ఉప్పొంగినా 
ఒక్క నీ కన్నీటిచుక్కను కూడా 
కడలిలో కలవనియ్యకు  

ఎన్ని తుఫాన్లు వచ్చినా 
ఎంతటి అల్లకల్లోలం సృష్టించినా 
అదరకు బెదరకు అలసిపోకు 

ధైర్యసాహసాలతో దరిచేరు 
ఆ దైవమే నీకు దారి చూపు 

నావను నడిపేది నీవే
కాని నడిపించేది కనిపించని ఆ దైవం 

నావ తీరం చేరడం ఒక తీపి వరమే
సాహస చేస్తే చేరవచ్చు ఆ సాగర తీరమే

అడగుతూ, వెదుకుతూ
తడుతూనే వుండాలి.... 

అడగండి అడగండి
అడుగుతూ వుంటేనే
మీ అవసరం తీరుతుంది 

వెదకండి వెదకండి  
వెదుకుతూ వుంటేనే
మీరు కోరుకున్నది దొరుకుతుంది 

తట్టండి తట్టండి  
తడుతూ వుంటేనే తప్పక 
ఒక తలుపు తెరుచుకుంటుంది 

92. మీరు పరమ పిసనారులా? 
      పరమాత్మస్వరూపులా? 

పుచ్చుకోవడం తప్ప 
ఇచ్చే గుణం లేని వాణ్ణి 
ఈశ్వరుడు కూడా మెచ్చడు 

ఇతరులకు ఇవ్వడం తప్ప 
పరులనుండి పుచ్చుకోవడం ఎరుగనివాడే పరమాత్మస్వరూపుడు 

పిల్లికి భిక్షం పెట్టని పిసనారులారా! 
పిడికెడు గింజలు చల్లినచాలునే 
ఎన్నో పిట్టల పొట్టలు నిండును గదా 

నేడు పేదలకు ఇష్టంతో ఇచ్చువారు రేపు 
పుష్కలంగా పరమాత్మ నుండి పుచ్చుకుంటారు 

పిసనారులు పిరికిపందలు 
కలకాలం బ్రతికి లాభమేమి కాకుల్లాగ
దాతలుగా ధన్యజీవులుగా ఒక్కరోజు  
బ్రతికిన చాలు హాయిగా హంసల్లాగ 

ఊరినుండి చాలా మీరు తీసుకున్నారు తిరిగి 
ఇవ్వకపోతే లావెక్కిపోతారు శ్రీమంతుడి ఆలోచన 

అలాగే ఈ సమాజంనుండి  
మీరు చాలా తీసుకున్నారు 
తిరిగి ఇవ్వకపోతే 
తీవ్రంగా నష్టపోతారు 
కష్టజీవి ఆవేదన 

అందుకే 
అనాధల ఆకలి అక్కర్లు తీర్చండి 
ఆపదలో వున్నవారిని ఆదుకోండి 
చిరునవ్వుతో ఇవ్వండి 
చిరకాలం జీవించండి

ఇక ఇప్పుడు తేల్చుకోండి మీరు 
పరమ పిసనారులా? పరమాత్మస్వరూపులా? 

93. అవివేకం - అపచారం

అర్హతలేని వాన్ని
అనవసరంగా ప్రశంసించడం 
ఇంద్రుడంటూ శ్రీరామచంద్రుడంటూ
అదేపనిగా పొగిడడం ఒక అపచారం
అట్టి అపచారానికి శిక్ష
మనం అడుక్కుపోవడం

వాడు రాజై év⁹c88*,:సింహంలా
సింహాసనంపై కూర్చొని
రాజభోగాలనుభవిస్తుంటే
మనం మాత్రం భటులుగా బ్రతకడం
ఎంతటి అవివేకం

94. ఆప్రయాణం శుభప్రదం

కలిసి కబుర్లాడుకుంటూ
బజారులోనో పార్కులోనో 
తండ్రీకొడుకులు
నవ్వుతూ త్రుళ్ళుతూ నడవడం 
కాదు ముఖ్యం 

తండ్రిచెేతిని
కొడుకు పట్టుకున్నాడా
కొడుకుచేతిని
తండ్రి పట్టుకున్నాడా
అన్నదే ఇక్కడ ముఖ్యం 

కారణం
తండ్రిచెేతిని కొడుకుపట్టుకొనివుంటే
ముందు పెనుప్రమాదం 
దొంగలా పొంచివున్నట్లే
పిల్లాడు చేజారి
ఏక్షణాన్నైనా క్రింద పడిపోవచ్చు

కానిఅదే
కొడుకుచేతినే తండ్రిపట్టుకొనివుంటే
ఇక కొడుకు చేజారే ప్రసక్తేలేదు
ఆప్రయాణం 
శుభప్రదం సుఖమయం 
ఇద్దరు సురక్షితంగా
నవ్వుతూ ఇల్లు చేరుకుంటారు 

95. వద్దురా వద్దురా 
      ఘర్షణలు వద్దురా

అడగవద్దు అలగవద్దు 
ఆశించవద్దు దూషించవద్దు
శోధించవద్దు సోకించవద్దు 
సాధింపులువద్దు వేధింపులువద్దు 

అదిరింపులు వద్దు బెదిరింపులు వద్దు 
అర్ధంలేని ఆంక్షలు అసలేవద్దు 
నేడేమీది రేవు మీదికాదు 
వారిది ఎదిగే మొక్కల జీవితం
మీది అరటి తొక్కల జీవితం

అరుపులువద్దు విరుపులువద్దు
ఉరుములు మెరుపులువద్దు
వారి ముందు బ్రతుకంతా నిండు పౌర్ణమి
మీ ముందు బ్రతుకంతా చిమ్మచీకటి

గర్జనలువద్దు ఘర్షణలువద్దు 
గాండ్రింపులువద్దు గద్దింపులువద్దు
వారికి ఇంటినిండా డబ్బులు
మీకు ఒంటినిండా జబ్బులు

వారికెరుకే మీరు
కోరలులేని పులులని
మూలిగే ముసలి నక్కలని 
కరవలేని గజ్జికుక్కలని

మరి ఓటమి ఖాయమని తెలిసీ
యుద్దానికెెందుకు సిద్ధమౌతారు ?
దేనికి క్రుంగిపోవద్దు పొంగిపోవద్దు 
స్థిరచిత్తం మౌనవ్రతం రాజీమార్గమే ఉత్తమం......ఉత్తమం......ఉత్తమం

96. నీకు నాకేం తెలుసు
      నిమ్మకాయ పులుసు

పచ్చగా పెరుగుతున్న 
ఆ పండ్లచెట్టును 
నవ్వుతూ గొడ్డలితో నరికెయ్యకు 
మున్ముందు ఆ చెట్టు 
ఇంకెన్ని తియ్యని ఫలాలను 
ఇంకెంత మందికి అందించాలో 
ఎవరికి తెలుసు ?
విత్తనం నాటిన ఆ వ్యక్తికి 
పెంచిన ఆ ప్రకృతికి తప్ప

చక్కగా పెరుగుతున్న 
ఆ పూలమొక్కను
మొగ్గలోనే త్రుంచివెయ్యకు 
మున్ముందు, ఆ మొక్క 
ఇంకెన్ని అందమైన అతి సుందరమైన
గుభాళించే పూలను పుయ్యాలో 
ఎవరికి తెలుసు ? 
నారుపోసి నీరుపోసి
ప్రేమతో పెంచిన ఆ తోటమాలికి తప్ప

బిస్కట్లు ఆశ చూపి 
ఆ పసిబిడ్డను
కసిగా కామాంధుడివై కాటెయ్యకు 
చిన్ననాడే ఆమె బంగారు భవిష్యత్తును
చిదిమెయ్యకు ఛిద్రం చెయ్యకు
మున్ముందు, ఆ చిట్టితల్లి పెరిగి పెద్దదై 
ఎవరికి భార్యకావాలో
ఎంతమంది ప్రయోజకులయ్యే
పిల్లల్ని కనాలో 
ఎవరికితెలుసు ?
నిన్న కని,నేడు కమ్మని కలలుకనే
ఆ అమాయకపు అమ్మనాన్నలకు 
ప్రాణం పోసిన ఆ పరమాత్మకు తప్ప

ఆదిలోనే 
ఆ చిరుదీపాన్ని 
ఆర్పివేయకు  మున్ముందు, 
వెలిగే ఆ దీపం 
చీకటిలో ఉన్న
ఇంకెన్ని దీపాలను వెలిగించాలో 
ఇంకెంతమందికి వెలుగులు పంచాలో  
ఎవరికి తెలుసు ?
వేయి ఆశలతో ఆ దీపాన్ని
వెలిగించిన ఆ వ్యక్తికి తప్ప

మార్కులపేర 
ర్యాంకులపేర మధ్యలోనే 
ఆ విద్యార్థిని
ఆవేశంతో ఆత్మహత్యకు పురికొల్పకు 
మరణానికి చేరువయ్యేలా మంత్రించకు
మున్ముందు, ఆ విద్యార్థి విజేయుడై జీవితంలో ఇంకెంతమందికి 
మార్గదర్శకుడు కావాలో
మర్రిమ్రానులా మారి
ఇంకెంతమందికి నీడ నివ్వాలో  
ఎవరికి తెలుసు ?
భవిష్యత్తును నిర్ణయించే
ఆ భగవంతునికి తప్ప

97. నిర్దిష్టమైన లక్ష్యం + 
      పటిష్ఠమైన ప్రణాళిక = విజయం

ఓ మిత్రమా !
నీకు ఒక నిర్దిష్టమైన 
లక్ష్యం ఉన్నట్లైతే
అది చేరుకోవడానికి 
పటిష్ఠమైన ప్రణాళిక ఉన్నట్లైతే

నీకు నిజంగా ఎత్తైన శిఖరాలను 
అధిరోహించాలని ఉన్నట్లైతే
నీకు గొప్ప కార్యాలను నిర్వహించి
ఘనవిజయాలను సాధించాలని ఉన్నట్లైతే

నీవు కనే కలలు కమ్మగానే వుంటాయి
కాని ముందుదారిలోనే ముళ్ళుంటాయి
రాళ్ళు రప్పలుంటాయి
పాములు కప్పలుంటాయి

వెళ్ళకపోతే నీ దారి 
ఎండిన ఎడారే అవుతుంది
వెళ్తే నీ దారి గలగలా పారే గోదారౌతుంది
నీ ముందు జీవితం 
పూర్తిగా విరబూసిన ఒక పూలవనమౌతుంది

నీ లక్ష్యసాధనకు సాక్ష్యం నిరంతర శ్రమయే 
లక్ష్యంలేని బ్రతుకు మాత్రం చంద్రుడులేని రాత్రే

98. ఎలా బ్రతకాలంటే...???

ఈ సమాజంలో బ్రతకాలంటే..?
ఎదురు లేని ఏనుగులా
బెదురు లేని జింకలా
పరుగులు తీసే గుర్రంలా
బుసలు కొట్టే త్రాచులా
వేటాడే సింహంలా
పైకి ఎగిరే పక్షిలా వుండాలి

అంతే...కాని 
బట్టలు మోసే గాడిదలా
లోకం ఎరుగని గొర్రెలా
ఆకులు మేసే మేకలా
బావిలో కప్పలా
నలుగురిని మోసం చేసే నక్కలా
పంజరంలో పక్షిలా బ్రతుక రాదు

99. సాధించాలంటే 
     సంపాదించాలంటే
 
అనేక అనుమానాలతో
అపోహలతో అర్థంలేని సందేహాలతో
దగ్ధమైపోయే దద్దమ్మలు

ఎన్ని మంచి సందేశాలు పంపినా
చదివి స్పందించని
ఎన్ని చక్కని సలహాలు ఇచ్చినా
స్వీకరించని సన్యాసులు

జీవితంలో ఏమీ సాధించలేరు
ఏమీ సంపాదించలేరు
పేదవాళ్ళుగానే వెళ్ళిపోతారు

కుటుంబ యజమానిగా
కొంత కూడబెట్టాలంటే
ఆస్తులు అంతస్తులు ఆర్జించాలంటే
ఆర్జించింది కాసింతైనా అనుభవించాలంటే

ఎవరినో ఒకరినైనా నమ్మాలి
ముందు దమ్ము ధైర్యం వుండాలి
తెలివితో తెగింపుతో పెట్టుబడి పెట్టాలి

కోట్లు ఆర్జించి కోటీశ్వరులు కాకపోయినా
దాచుకొని డబ్బు ధనవంతులు కాకపోయినా
దాతలుగా మిగిలినా చాలు బ్రతుకు ధన్యమే

100. ఎప్పుడేమి చెయ్యాలి? 
        ఇప్పుడేమి చెయ్యాలి?? 

ఊరికిఊరికే వులిక్కిపడరాదు 
ఉక్కిరిబిక్కిరైపోరాదు 
ఉక్రోషము ఉద్రేకం ఉండరాదు 
పిచ్చికోపంతో రెచ్చిపోరాదు
అనవసరమైన అర్ధంలేని పిచ్చిపిచ్చి 
ఆలోచనలు చేయరాదు 
పగ ప్రతీకారాలు వద్దు 
అవి ప్రమాదాలు కొని తెస్తాయి 
అసూయా ద్వేషంతో రగిలిపోరాదు 
నరాలు తెగేలా బిగ్గరగా అరవరాదు 
చిన్నవాటికే ఆవేశపడరాదు 
చీటిమాటికి ఆందోళన చెందరాదు 
అందనిదానిని నీకు చెందనిదానిని ఆశించరాదు 
ఎవరితోను విరోధము పెంచుకోరాదు 
ముఖంలో చిరునవ్వు ముఖ్యం 
చిరచిత్తం స్థితప్రజ్ఞత చాలా ముఖ్యం 
హృదయం శాంతము దయ జాలి 
కరుణ ప్రేమతో పొంగిపొర్లాలి 
దుఖమునకు దూరంగా వుండాలి 
కన్నీటిని కార్చరాదు కలత చెందరు
ఆరోగ్యమే మహాభాగ్యమనే ఆశ ద్యాస  కలిగివుండాలి 
నిత్యం నడక  నిత్యం భగవన్నామ స్మరణ
కాసింత పడకా 
కాసింత విశ్రాంతితో కాలం గడపాలి
నాలుగురితో ఉండాలి నవ్వుతూ ఉండాలి 
ప్రశాంతంగా జీవించాలి 
పరమాత్మలో లీనమైపోవాలి 

101. చూడకు ఎవరినీ చులకనగా....

ఎదుటి వారిని చులకనగా చూడడం
వారు బాధ పడుతూవుంటే సంతోషించడం
వారు ఆర్థిక ఇబ్బందుల్లో వుంటే ఆదుకోకపోగా
ఆనందంతో చిందులు వెయ్యడం

ఇతరులముందు తక్కువ చేసి మాట్లాడడం
అవమానంగా అసహ్యంగా అతినీచంగా అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడడం
ఎగతాళిగా హేళనగా నవ్వడం

ఏవగించుకోవడం ఏహ్యభావం కలిగివుండడం
అట్టివారెవరైనా అదేవారి పతనానికి పరాకాష్ట
వీరి సత్సంబందాలన్నీ సమాధి అవుతాయి
వారు నలుగురిలో నవ్వులపాలైపోతారు

అట్టివారికి అంతటా ఓటమే తప్ప విజయాలుండవు
అంతటా అవమానాలే తప్ప గౌరవాలుండవు
ఒంటరితనం వారిని వెక్కిరిస్తుంది వెంటాడుతుంది,
ప్రతినిత్యం మృత్యువు వారిని తప్పక వేటాడుతుంది

వారి జీవితం మోడువారుతుంది
చివరికి వారి బ్రతుకు చితికిపోతుంది

అందుకే 
ప్రతి జీవిని ప్రేమించు కోపాన్ని అధిగమించు 
ధర్మాన్ని అనుసరించు అహింసను ఆచరించు
ఆర్జించింది అనుభవించు ఆనందంగా జీవించు

102. రెండు సార్లు ......

రెండు సార్లు ఇంటర్వ్యూ కెళ్తే
ఆఫీస్ లో ఒక్క ఉద్యోగమైనా దొరకకపోదు

రెండు సార్లు రాళ్ళు విసిరితే 
చెట్టునుండి ఒక్క పండైనా రాలకపోదు 

రెండు సార్లు గాలం విసిరితే 
చెరువులో ఒక్క చేపైనా 4aaొరకకపోదు 

రెండు సార్లు వలలు విసిరితే
వలలో ఒక్క పక్షి ఐనా చిక్కకపోదు

రెండు సార్లు గట్టిగా ప్రయత్నిస్తే
పోటీలో ఒక్కవిజయమైనా దక్కకపోదు

103. కృషి చేస్తే సమస్తం సాధ్యమే!!!

అవి అన్నీ గొప్ప ఆలోచనలే
ఎవరూ ఆచరణలో పెట్టనంత వరకే

అవి అన్నీ మహా సాహనకార్యాలే
ఎవరూ ప్రయత్నించనంత వరకే

అవి అన్నీ గొప్ప గొప్పపనులే
ఎవరూ ప్రారంభించనంత వరకే

అవి అన్నీ అందరికీ అసాధ్యాలే
ఎవరూ సాధించినంత వరకే

అవి అన్నీ వింతలు విశేషాలే
ఎవరూ కనిపెట్టనంత వరకే

అవి అన్నీ మహాఅద్భుతాలే
ఎవరూ చేయనంత వరకే

అవి అన్నీ మహా ఘనవిజయాలే
ఎవరూ అందుకోనంత వరకే

ఒక్కసారి ఎదురులేని ఏకాగ్రతతో
గట్టి నమ్మకంతో గట్టి పట్టుదలతో 
సరైన గురు శిక్షణలో దృఢమైన దీక్షతో
కసితో తపనతో కష్టపడితే
నిరంతరం కృషి చేస్తే సమస్తం సాధ్యమే

ఎన్నో రికార్డులు బద్దలు కొట్టవచ్చు
ఎన్నో రివార్డులు అందుకోవచ్చు 

104. అర్థం కారు వారు 
        కారణం అపరిచితులు

కొందరు అందరికీ అర్థం కారు
కారణం వారు అపరిచితులు

అట్టి వారితో వ్యాపారమైనా వ్యవహారమైనా
కాస్త జాగ్రత్త వారితో కలిసి చేసేది ఏదైనా

మట్టిఏనుగును నమ్మి నట్టేట్లో దిగినట్లే
చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే

గుడ్డివాడికి అద్దం చూపినట్లే
కుంటివాడికి నాట్యం నేర్పినట్లే

నవ్వే పులినోట్లో తల దూర్చినట్లే
పట్టపగలు నింగిలో చుక్కలు చూసినట్లే

ఎండమావిలో నీళ్ళకోసం వెదికినట్లే
అలలు ఆగిన తర్వాత స్నానం చేసినట్లే

ఒట్టిపోయిన గేదె దగ్గర పాలు పితికినట్లే
ఒంటికాలు గుర్రమెక్కి రేస్ లో పాల్గొన్నట్లే

శతృవుతో  పోట్లాడితే సమస్య
శతృవుతో మాట్లాడితే పరిష్కారం

ఈ జీవితం సంద్రమైతే
సుఖసంతోషాలు జలచరాలైతే
వాటిని పట్టుకోవాలంటే
కాలమనే గాలాన్ని విసరాలి

ఈ జీవితం విషాదభరితమైతే
కష్టనష్టాలు బాధలు భయాలు భూతాలైతే
వాటిని తట్టుకోవాలంటే
కాలమనే శూలాన్ని విసరాలి

కాలం తల్లక్రిందులైతే భూగోళమంతా గందరగోళం 
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం

కొందరు ప్రాణమిత్రులే బద్దశతృవులౌతారు
కొందరు బద్దశతృవులే ప్రాణమిత్రులౌతారు
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం

కొందరిని కాలం క్షణంలో చిత్రంగా కలుపుతుంది
కొందరిని కాలం క్షణంలో కౄరంగా విడదీస్తుంది
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఇద్దరు ఒక్కటౌతారు
నేడు ఇద్దరు ఒక్కటైనా 
రేపు విడిపోయి దూరమైతారు దుఖ్ఖితులౌతారు
కారణం ఒక్కటే కలికాలం అదివిధిఆడే వింతనాటకం
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం

కలిసి వుంటేనే కలదు సుఖం ముందు ముందు
స్వపరాధంతో కలిగే గాయాలకు కాలమే ఒక మందు

105. మంచి తరుణం మించిపోతే???

అనుభవం పండిన నిపుణులు
చెప్పింది విని మనం అర్థం చేసుకున్న తర్వాత
మన కళ్ళతో మనం చూసి తృప్తి చెందిన తర్వాత
మన మనసుకు సంపూర్ణంగా నచ్చిన తర్వాత

ఇంకా ఆలస్యం చేస్తే 
ఆలోచనలు పరిపరి విధాలుగా పోతాయి
నిముషాల్లో నిర్ణయాలు మారిపోతాయి
పనులు వాయిదా పడిపోతాయి

లేదా అతిగా ఆలోచిస్తే
లేని అనుమానాలు పుడతాయి
సందేహాలు ఎక్కువై ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

కాని ముందుచూపు లేని మూర్ఖుల దగ్గర
సగం మాత్రమే తెలిసిన సన్యాసులు దగ్గర
సలహాలు తీసుకోరాదు భారీగా నష్టపోతాము

ఏదిఏమైనా ఎవరినుండైనా 
సలహాలు స్వీకరించవచ్చు కాని
నిర్ణయాలు మాత్రం మనమే తీసుకోవాలి

పది పుస్తకాలలో చదివినదాని కన్నా
రెండు చెవులతో విన్నదాని కన్నా
రెండు కళ్ళతో ప్రత్యక్షంగా చూసిందే మిన్న

మంచితరుణం మించిపోయినా
ఆపై ఎంత తపించినా తిరిగి లభించునా చెప్పండి 

అందుకే అమృతం విషం కాకముందే
అదృష్టం దురదృష్టంగా మారకముందే, మేల్కొని
అడుగు ముందుకు వేసినవారే అదృష్టవంతులండి
బంగారమంటి అవకాశం చేజిక్కించుకున్న వారే భాగ్యవంతులండి.

106. ఆరోగ్యం వుండాలంటే....,?
        ఆయుస్సు పెరగాలంటే....?

ఆస్తులు ఆర్జించాలంటే
ఆనందంగా జీవించాలంటే

ఆరోగ్యం వుండాలంటే
ఆయుస్సు పెరగాలంటే

ఆందోళన తొలగాలంటే
అందరి మెప్పు పొందాలంటే

ప్రాణమిత్రులతో వివాదం వద్దు
బద్దశతృవులతో విరోధం వద్దు

ఒక మెట్టు దిగి రాజీకి సిద్దం కావాలి
వీలైతే విహార యాత్రలకు వెళ్ళిపోవాలి

నిత్యం నాలుకను నియంత్రించుకోవాలి
ప్రతినిత్యం వ్యాయామం యోగ చెయ్యాలి

నవ్వుతూ ఎప్పుడూ వుండాలి
నలుగురితో కలిసిమెలిసి తిరగాలి

ఆథ్యాత్మిక గ్రంథాలైన
బైబిల్ భగవద్గీత భారత భాగవత 
రామాయణాది మహాగ్రంధాలు పఠించాలి
భక్తితో నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ వుండాలి

ఎప్పుడైనా ఏ ఒక్కరోజైనా ఏ ఒక్కపూటైనా
పై ఈ నియమాలు పాటించక పోతే
మీ జీవితకాలం పదిరోజులు తరిగినట్లే
పాటిస్తే మాత్రం పదిదినాలు  పెరిగినట్లే

107. గుహలోవున్న పులి - 
     ‌   గూటిలోవున్న పక్షి

గుహలోవున్న ఏ పులినోట్లోకి ఏ జింకపిల్ల వచ్చిపడదు, దాని ఆకలి తీరాలంటే
గుహనుండి పులి బయటికి రాక తప్పదు
ఆహారంకోసం అడవిలో వేట ఆరంభించక తప్పదు

గూట్లో ఉన్న ఏ పక్షి నోట్లోకి ఏ ఆహారం 
వచ్చిపడదు, దాని ఆకలి తీరాలంటే
ప్రతిపక్షి నిద్రలేచింది మొదలు   
ఆకాశంలో ఆహారంకోసం విహరించక తప్పదు 
వేలమైళ్ళు వెళ్ళక తప్పదు తిండికై వెదకక తప్పదు

కలలు కంటే సరిపోదు ఏ విద్యార్థి ఐనా
కలెక్టర్ కావాలని,ఆ ఉద్యోగం రావాలంటే
పరీక్షలు వ్రాయక తప్పదు పాస్ కాక తప్పదు ఇంటర్వ్యూలకని ఆఫీసుల చుట్టూ తిరగక తప్పదు

కోరుకుంటే సరిపోదు ఏ ఆటగాడైనా 
కప్పుకొట్టాలని ఆటలో ఘనవిజయం సాధించాలంటే
ఏ ట్రైనర్ దగ్గరైనా గట్టి శిక్షణ తీసుకోక తప్పదు
రాత్రియంబవళ్లు పట్టుదలతో ప్రాక్టీస్ చేయక తప్పదు

ఆశపడితే సరిపోదు ఏ తండ్రిఐనా 
అమెరికా సంబంధం రావాలని కావాలని
కన్నకూతురి పెళ్లి అంగరంగవైభవంగా చేయాలంటే
కాళ్ళు విరిగేలా చెప్పులు అరిగేలా
సంబంధాల కోసం ఊర్లన్నీ తిరగక తప్పదు
అడ్డమైన వారిని అడగక తప్పదు

108. అలుపెరుగక పోరాడితే 
      గెలుపు తథ్యం...

ఏ టైలరైనా 
ఎంత ఖరీదైన కొత్తబట్టనైనా కత్తెరతో
ముందు ముక్కలు ముక్కలుగా కట్ చేసి
తిరిగి అన్నింటిని ఒక్కటి చేసి కుట్టినప్పుడే
చక్కని చొక్కా ఒకటి తయారౌతుంది
తొడుక్కోవడానికి వీలౌతుంది

ఏ కార్పెంటరైనా 
కొన్న వుడ్ ను రంపముతో రంద్రాలు వేస్తేనే
ఎన్నో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 
తిరిగి అన్నింటిని ఒక్కటి చేస్తేనే చివరికి
ఒక చక్కని టేబుల్ కాని కాట్ కాని తయారవ్వదు
ఇంటికి అందాన్ని కంటికి ఆనందాన్ని ఇవ్వదు

ఏ విద్యార్థి ఐనా
ఒక్కొక్క పరీక్ష వ్రాసి పాసైతేనే, ఇంటర్యూలంటూ
ఆశతో ఎన్నో ఆఫీసుల మెట్లు ఎక్కిదిగితేనే
విక్రమార్కుడిలా తిరిగితేనే విజయం దక్కదు
కోరుకున్న ఒక చక్కని ఉద్యోగం చిక్కదు 

ఏ శిల్పి ఐనా
శిధిలమైన శిలను ఉలితో లెక్కలేనన్ని సార్లు
చెక్కితేనే సుత్తితో దెబ్బమీద దెబ్బ కొడితేనే
చివరికి ఒక చక్కని సుందరశిల్పం తయారవ్వదు
గుడిలో దైవమై వచ్చిన భక్తులకు వరాలనివ్వదు

ఏ మనిషైనా
తన జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా
ఎన్ని ఆటంకాలు అవాంతరాలు వచ్చినా
ఎన్ని శిక్షలు అనుభవించినా లక్ష్య సాధనలో
అలుపెరుగక పోరాడితే గెలుపు తథ్యం
ఇది ఎవరూ కాదనలేని ఒక నగ్నసత్యం
                                 
109. ముందుకెళ్ళు 
        బాణంలా దూసుకెళ్ళు...

నేను ఒలింపిక్స్ లో పాల్గొంటా
కష్టపడి పోరాడి కప్పు గెలుస్తా

నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేస్తా 
అక్కడ మన మువ్వన్నెలజెండాను ఎగరేస్తా

నేను బాహుబలిలా యుద్ధం చేస్తా 
ఉగ్రవాదమూకల్ని వధిస్తా విజయాన్ని సాధిస్తా

నేను గజఈతగాళ్లలా సప్తసముద్రాలను ఈదేస్తా
గిన్నీస్ బుక్ రికార్డులను తిరగరాస్తా చరిత్రనుసృష్టిస్తా

విజయీభవ ! దిగ్విజయీభవ !! ఐతే వెళ్ళువెళ్ళు
ముందుకెళ్ళు బాణంలా దూసుకెళ్ళు భయపడకు
"ప్రేమతో గురువుగారి దీవెన"

నేను బలహీనున్ని బద్దకస్తున్ని ఇలాగే బ్రతికేస్తా
లేదాఎత్తైన బిల్డింగ్ ను ఎక్కి క్రిందికి దూకి ఛస్తా

ఓరి వెధవా ఓరి శుంఠా వెళ్ళు వెళ్ళు వెనక్కివెళ్ళు
చచ్చి సాధించేదేముందిరా ఓ పిరికిపందా 

చచ్చే ముందు ఏదైనా ఒక్క మంచిపనైనా చేసిచావు
"కోపంతో గురువుగారి శాపం"
 
దొరకడం దురదృష్టం
గడప దాటి గుట్టును రట్టుచేసి
ఊరంతా తిరిగే ఊరేగే భార్య 
దొరకడం ఇంకా దురదృష్టం
అది గతజన్మలో చేసిన పాపాలకు ఫలితం

దానితో పరువు గంగలో కలిసిపోతుంది,
బ్రతుకు భారమౌతుంది గాఢాంధకారమౌతుంది
ఆ బాధ ఆ క్షోభ ఆ వేదన ఆ నరక యాతన 
తన ఆత్మకు ఆ పరమాత్మకే తప్ప ఎవరికెరుక?

110. వెయ్యేళ్ళు వర్ధిల్లడం ఖాయం....

చిరునవ్వు 
మీ ముఖాన చిగురిస్తే

శతృవులను సైతం
మీరు ప్రేమతో పలకరిస్తే

శాంతము సమాధానాలు
గులాబీలై మీ ఎదలో గుభాళిస్తే

సహనం సర్దుబాటుగుణాలను
కలలో సైతం మీరు కలవరిస్తే

మంచితనం మానవత్వం 
కుంగిపోయిన వారి మీద కుమ్మరిస్తే

వినయం విధేయతలు
విరజాజిపువ్వుల్లా మీలో విరబూస్తే 

భయము భక్తి
మీ మనసులో పాలు తేనెలై ప్రవహిస్తే

జాలి కరుణ దయా దాక్షిణ్యాలు
మీ గుండెల్లో పొంగి పొర్లితే

మీరు చరిత్రలో వెయ్యేళ్ళు వర్ధిల్లడం ఖాయం
పొల్లుపోదు కల్లకాదు పోలన్న పలికిన మాట

111. అఖండ విజయమే నీ ఆశయమైతే???

విధి అంటే ఒక విపత్తు
అనుకోని ఒక ఆపద

ఆకస్మికంగ హఠాత్తుగా 
మన ప్రమేయం లేకుండా
జరిగే ఒక ప్రమాదం

అందరిని ఆశ్చర్యానికి 
భయబ్రాంతులకు గురిచేసే
ఒక దుస్సంఘటన

కాని చిరుచిరు ఉపాయాలతో 
ఎదురయ్యే అనేక అపాయాలను 
తెలివిగా తప్పించుకోవచ్చు

ఎన్ని ఆటంకాలు అడ్డంకులు  
ఎన్ని అవరోధాలు అవాంతరాలు వచ్చినా

ఎన్ని ఇబ్బందులు కష్టనష్టాలు వచ్చినా
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా

కృంగిపోక, కుమిలిపోక, నిరాశ చెందక
చలించక, వెరవక, వెనుదిరిగక

ముందుకే మున్ముందుకే
గురిపెట్టిన లక్ష్యసాధన వైపే 

భయమన్నదే మదిలోపుట్టక 
బాణంలా దూసుకుపోవచ్చు

విధిని ఎదిరించవచ్చు 
విజయాన్ని సాధించవచ్చు

వీరుడిగా శూరుడిగా
విజేతగా విశ్వవిజేతగా 

వెయ్యేళ్ల వరకు ప్రజలు నిన్నే
గుర్తుంచుకోవచ్చు నీకు గుడి కట్టవచ్చు

ఒక దైవంలా నిన్ను పూజించవచ్చు
చరిత్రలో నీవు చిరంజీవి కావచ్చు

ఔను ఇదినిజం ఆశే నీ శ్వాస ఐతే
సాహసమే నీ ఊపిరి ఐతే

విశ్వాసమే నీ ఆయుధమైతే
అఖండ విజయమే నీ ఆశయమైతే

112. కంట్రోల్ తప్పితే కష్టాలే 
       కన్నీళ్లే కలవరింతలే...

నీ వాహనం 
నీ కంట్రోల్లో వున్నంత సేపు నీవు
రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేసినంత సేపు
వాహనంలో వున్నవారంతా అదృష్టవంతులే
వారి ప్రయాణం సుఖవంతమే గమ్యం సురక్షితమే 

కాని నీ వాహనం 
నీ కంట్రోల్లో వుండనప్పుడే
అతి వేగంగతో అదుపు తప్పేది డివైడర్ నిఢీకొనేది
మృత్యువు ముందుకు దూసుకు వచ్చేది
ఘోర ప్రమాదాలు జరిగేది ప్రాణాలు గాల్లో కలిసేది

నీ శరీరం
నీ కంట్రోల్లో వున్నంత కాలం 
నీవు రోజూ వ్యాయామం యోగ 
జాగింగ్ వాకింగ్ చేస్తున్నంతకాలం
నీవు ఖచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా వుంటావు

కాని నీ శరీరం 
నీ కంట్రోల్లో వుండకపోతే నీవు
ధనకనకవస్తు వాహనాలంటూ పరుగులు పెడితే
విందు పొందు అంటూ పార్టీలలో చిందులు వేస్తే
నీకన్నీ అవస్థలే, అనారోగ్యమే, అప్పులే, ఆవేదనలే

నీ మనసు 
నీ కంట్రోల్లో వున్నంత కాలం 
మంచితనం మానవత్వంతో నీ హృదయం వికసిస్తే
నీలో ప్రేమ దయ జాలి కరుణ పొంగిపొర్లితే
నీకిక సుఖ సౌఖ్యాలు, శాంతి సౌభాగ్యాలు వరాలే

కాని నీ మనసు
నీ కంట్రోల్లో వుండనినాడు 
నీలో అసూయ ద్వేషం అహంకారం
పగా ప్రతీకారం హద్దు మీరిపోయిననాడు
కామ క్రోధ లోభ మోహ, మద మాత్సర్యాలతో
నీ మనసు కలుషితమై పోయిననాడు
నీకన్నీ అవమానాలే, అపనిందలే, అపజయాలే

అందుకే ఏదైనా, ఎప్పుడైనా, ఎందుకైనా
కంట్రోల్ తప్పితేఎవరికైనా కష్టాలే,కన్నీళ్లే,కలవరింతలే

113. కష్టేఫలి కాదంటారా?

దిగితేనే మీకు లోతు తెలిసేది
మాట్లాడితేనే ఎవరిమనసులో ఏముందో తెలిసేది

వెతికితేనే మీకు నిధులు దొరికేది
అడిగితేనే మీకు వివరాలు అందేది

ప్రయత్నిస్తేనే మీకు ఫలితం దక్కేది
పోరాడితేనే మీకు విజయం చిక్కేది

తడితేనే ఇంటి  తలుపులు మీకు తెరుచుకునేది  
రాయి విసిరితేనే చెట్టునుండి మీకు పండురాలేది

తేనెటీగల్ని తరిమితేనే మీకు తేనె దొరికేది
నేలలో విత్తనాలు నాటితేనే మొక్కలు పెరిగేది

కమ్మని పెద్దపెద్ద కలలు కంటేనే, నిరంతరం శ్రమిస్తేనే, 
సాధన చేస్తేనే గొప్పగొప్ప విజయాలు మీరు సాధించేది

114. ఆడవాళ్ళతో 
       అడవిమృగాలతో కాపురం?...

కొన్నిసార్లు
ఎన్ని సుముహూర్తాలు చూసి 
వేదమంత్రాలమధ్య వేదపండితుల మధ్య
మేళతాళాల మధ్య మంగళవాయిద్యాల మధ్య  
మాంగళ్య ధారణ చేయించినా
అందరూ అక్షింతలు చల్లి ఆశీర్వదించినా
అంగరంగవైభవంగా వివాహాలు జరిపించినా 
పదికాలాల పాటుండే పచ్చని కాపురాలు కొన్నే దైవం దీవించిన దంపతులు కొందరే

ఆపై ప్రేమ తరిగి అపార్థాలు పెరిగి
చిచ్చురేగిన పచ్చని కాపురాలు
మూడునాళ్ళముచ్చట కావచ్చు
విడాకుల వరకు వెళ్ళవచ్చు విచ్చిన్నమైపోవచ్చు 
ఇంట్లోనేవుంటూ ఇష్టంలేని కాపురాలు చేయవచ్చు 

మనం మనజీవితంలో  
శాడిస్ట్ భార్యలతో, మొండిఘటాలతో 
అమాయకపు భర్తలను మోసంచేసి 
బజారులో బలాదూరుగా తిరిగే 
తిరుగుబోతు భార్యలతో  
గయ్యాలిగంపలతో కాపురం చేయడం
గతజన్మలో చేసిన పాపాలకు ప్రతిఫలితం

కానీ వీరితో పాటుగా
గాడిదలతో, గబ్బిలాలతో 
గజ్జికుక్కలతో, గుంటనక్కలతో  
విషసర్పాలతో,తోడేళ్లతో 
చిరుతపులులతో, చీడపురుగులతో 
బురదలో పొర్లే పందులతో
మనుష్యుల రూపంలోవుంటూ
మనచుట్టూర తిరిగే అనేక 
అడవిమృగాలతో కూడ 
కాపురం చేయక తప్పదు 

అట్టి వారితో కాపురం చేయాలవధ్దా అనే
గట్టినిర్ణయం తీసుకోవలసింది నీవే  
కాదంటే కాలమే నిర్ణయిస్తుంది 

ఔను ఆడవాళ్ళతో కాపురం చేసినవాళ్లు
అభివృద్ధి చెందవచ్చు అడుక్కుపోవచ్చు,
లేదా అడుక్కుతినవచ్చు, 
కాని
అడవిమృగాలతో కాపురం చేసినవారు
నేడు ఎవరెస్టుశిఖరం ఎక్కికూర్చున్నా 
రేపు వారు పరుండేది మాత్రం పాతాళంలోనే

115. పాలు పెరుగు మజ్జిగ వెన్న 

పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది.
పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది.
వెన్నని కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది.

పాల కంటే పెరుగు విలువ ఎక్కువ,
పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, 
వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ.

పాలు ఉపయోగ పడేవే, 
కానీ ఒక రోజు కోసమే..
తరువాత అవి  పాడైపోతాయి.

పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేస్తే 
అది పెరుగు అవుతుంది.
కానీ రెండు రోజులే ఉంటుంది.

పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది. 
ఇది కూడా 3 రోజులు ఉంటుంది...

వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది. 
కాని నెయ్యి ఎప్పుడూ పాడవ్వదు...

ఒక్కరోజులో పాడయ్యే పాలలో 
ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది...
పాలు పెరుగు మజ్జిగ వెన్న 
ఈ నాలిగింటి రంగు తెలుపే.

దీని అర్థం ఏమిటంటే,మాటిమాటికి దుఃఖం, 
ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా 
ఏ వ్యక్తి రంగు మారదో, సమాజంలో 
ఆ వ్యక్తికే విలువ ఉంటుంది.

అదేవిధంగా మీ మనసు కూడా 
లెక్కలేన్నని శక్తులతో నిండి ఉంది, 
దానిలో మంచి ఆలోచనలని నింపి
మీకు మీరే చింతన చెయ్యండి.

ఏ సమస్య వచ్చినా ఇలానే విశ్లేషించి చూడండి
మీరు ఎప్పుడూ ఓడిపోరు ధైర్యశాలి అవుతారు...

116. ఎవడు భాగ్యవంతుడు ???

సహనం సర్దుబాటుగుణం లేని
మంచితనం మానవత్వం లేని
పట్టుదల ఓర్పులేని ఏ మనిషీ

అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేడు
ఆ విధిని ఎదిరించలేడు
ఘనవిజయాన్ని సాధించలేడు 

కాస్త ధమ్ము ధైర్యము కాస్త నమ్మకము పట్టుదల
వున్నవాడే పదికాలాలపాటు పచ్చగా వుంటాడు

అవిలేనివాడు ఏమీలేని వాడుగా
ఏదీరానివాడుగా చేతగానివాడుగా
అన్నీవున్నా అవిటివాడుగానే మిగిలిపోతాడు

ఉత్కృష్టమైన ఈ మానవ జన్మ
అర్థం పరమార్థం ఎరిగిన వాడు
ఉన్నతమైన భావాలు ఉన్నవాడు
ఉన్నత శిఖరాలను అవలీలగా అధిరోహిస్తాడు

మన జన్మకు కారకుడు 
మన జాతకాలు తారుమారు చేసే ఆ భగవంతున్ని
అనునిత్యం ఆరాధించేవాడే అదృష్టవంతుడు
భగవన్నామ స్మరణ చేసేవాడే భాగ్యవంతుడు

117. కష్టేఫలి కాదంటారా? ఔనంటారా ?

దిగితేనే మీకు లోతు తెలిసేది
మాట్లాడితేనే ఎవరిమనసులో ఏముందో తెలిసేది

వెతికితేనే మీకు నిధులు దొరికేది
అడిగితేనే మీకు వివరాలు అందేది

ప్రయత్నిస్తేనే మీకు ఫలితం దక్కేది
పోరాడితేనే మీకు విజయం చిక్కేది

తడితేనే ఇంటి  తలుపులు మీకు తెరుచుకునేది  
రాయి విసిరితేనే చెట్టునుండి మీకు పండురాలేది

తేనెటీగల్ని తరిమితేనే మీకు తేనె దొరికేది
నేలలో విత్తనాలు నాటితేనే మొక్కలు పెరిగేది

కమ్మని పెద్దపెద్ద కలలు కంటేనే, 
నిరంతరం శ్రమిస్తేనే, సాధన చేస్తేనే 
గొప్పగొప్ప విజయాలు మీరు సాధించేది.     

మీ మనసులో ఆనందం కోసమే
మీ హృదయంలో తృప్తి కోసమే
మీ ముఖాలలో చిరునవ్వు కోసమే

మీ శ్రేయస్సు కోసమే మీ సుఖశాంతుల కోసమే
మీ జీవితంలో ప్రశాంతత కోసమే
కవి పోలయ్య ఇలాంటి కమ్మని కవితలు వ్రాసేది

118. ప్రాప్తం"అంటే 

ఇష్టంలేని గాడిదచేత 
బట్టలమూట మోయించడం 

జుట్టుపట్టుకొని నడివీధిలో
కొట్టుకున్న భార్యాభర్తలచేత 
గుట్టుగా కాపురం చేయించడం 

దాహం వెయ్యని గుఱ్ఱముచేత 
తొట్టిలో నీళ్లు త్రాగించడం 

వంద పిచ్చిప్రశ్నలు వేసే మందబుద్ధి చేత
ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం
సందేహాలతో సతమతమయ్యే సన్యాసి చేత
ప్లాట్లు కొనిపించడం అతికష్టం అసాధ్యం 

ఆ బ్రహ్మ తరం కూడా కాదేమో, ఏదేమైనా
దేనికైనా ఎవరికైనా సరే "ప్రాప్తం" వుండాలి 

"ప్రాప్తం"అంటే 
దక్కడం, దైవప్రసాధితం

"ప్రాప్తం" అంటే 
విజ్ఞులకు వరం, బద్దకస్తులకు భారం

"ప్రాప్తం" అంటే ఒక్కరూపాయికే 
లక్షరూపాయల "లాటరి" తగలడం

"ప్రాప్తం" అంటే ప్లాట్లలో నేడు లక్షలు పెట్టి 
రేపు కోట్లు ఆర్జించడం కోటీశ్వరులై పోవడం

119. ఆరోగ్యం వుండాలంటే....,?
       ఆయుస్సు పెరగాలంటే....?

ఆస్తులు ఆర్జించాలంటే
ఆనందంగా జీవించాలంటే

ఆరోగ్యం వుండాలంటే
ఆయుస్సు పెరగాలంటే

ఆందోళన తొలగాలంటే
అందరి మెప్పు పొందాలంటే

ప్రాణమిత్రులతో వివాదం వద్దు
బద్దశతృవులతో విరోధం వద్దు

ఒక మెట్టు దిగి రాజీకి సిద్దం కావాలి
వీలైతే విహార యాత్రలకు వెళ్ళిపోవాలి

నిత్యం నాలుకను నియంత్రించుకోవాలి
ప్రతినిత్యం వ్యాయామం యోగ చెయ్యాలి

నవ్వుతూ ఎప్పుడూ వుండాలి
నలుగురితో కలిసిమెలిసి తిరగాలి

ఆథ్యాత్మిక గ్రంథాలైన
బైబిల్ భగవద్గీత భారత భాగవత 
రామాయణాది మహాగ్రంధాలు పఠించాలి
భక్తితో నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ వుండాలి

ఎప్పుడైనా ఏ ఒక్కరోజైనా ఏ ఒక్కపూటైనా
పై ఈ నియమాలు పాటించక పోతే
మీ జీవితకాలం పదిరోజులు తరిగినట్లే
పాటిస్తే మాత్రం పదిదినాలు  పెరిగినట్లే

120. వీరుడుకాదు,విజ్ఞతకాదు...

తిట్టలేనివారిమీదికి తిరిగి కొట్టలేనివారిమీదికి
అమాయకపు ఒక అడవిజింక మీదికి 
ఆకలితో చిరుతపులి లంఘించినట్లు

ఎదిరించే శక్తిలేని వారిని బెదిరించడం
తెలిసీ తెలియక చేసిన చిన్న తప్పుకు
ఆవేశంతో అరవడం పిచ్చికోపంతో రెచ్చిపోవడం

కక్షగట్టడం కఠినశిక్ష వేయడం 
పగ ప్రతీకారం తీర్చుకోవడం
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లే

దరిద్రులను దోచుకున్నవాడు ధనవంతుడు కాడు
నిర్దోషుల, నిస్సహాయుల, నిరాయుధుల మీద 
విరుచుకుపడ్డవాడు వీరుడుకాదు,అది విజ్ఞతకాదు 

ఆపదలో వుంటే ఆదుకున్నవాడే ఆపద్భాందవుడు
నిరుపేదలకష్టాలు తీర్చినవాడే నిజమైననాయకుడు
చరిత్రను చదవక సృష్టించినవాడే చిరస్మరణీయుడు

121. చచ్చి సాధించేదేమిటి ? 
       ఇచ్చే సందేశమేమిటి?

గతంలో
లక్ష సార్లు సుత్తి దెబ్బల్ని
కోటి టన్నుల ఒత్తిడిని
ఒక్కడే ఒంటరిగా భరించి
వేలమంది బెదిరించే శతృవుల్ని
ఎదిరించి పోరాడి గెలిచి
కొత్త కాఫీ సామ్రాజ్యాన్ని స్థాపించి
కోట్లకు పడగలెత్తిన 
ఆ కార్పోరేట్ కేఫ్ కాఫీ కింగ్
నేత్రావతీ నదిలో దూకి 
ఆత్మహత్య చేసుకునే ముందు 
ఒక్కసారి ఒక్కక్షణం ఆలోచిస్తే ఎంత బావుండేది ?

జరిగిన తప్పులకు అప్పులకు
తననొక్కడినే బాధ్యున్ని చేసుకుని
గుండెల్లోఅగ్ని పర్వతాలను దాచుకొన్న
ఆ అమృతామూర్తి ఆ మానవతావాది
ఆ కార్పోరేట్ కేఫ్ కాఫీ కింగ్
నేత్రావతీ నదిలో దూకి
ఆత్మహత్య చేసుకునే ముందు 
ఒక్కసారి ఒక్కక్షణం ఆలోచిస్తే ఎంత బావుండేది?

ఊరించే విధంగా 
మతిపోయేలా మత్తెక్కించేలా
వేలకొద్దీ కొత్త కేఫ్ కాఫీ డేలను స్థాపించి
ఎందరో అభాగ్యులకు జీవనోపాధి కల్పించి
ఊహలకందని రీతిలో 
ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగిన
ప్రపంచ ప్రసిద్ధి చెందిన
ఆ కార్పోరేట్ కేఫ్ కాఫీ కింగ్
నేత్రావతీ నదిలో దూకి
ఆత్మహత్య చేసుకునే ముందు 
ఒక్కసారి ఒక్కక్షణం ఆలోచిస్తే ఎంత బావుండేది?

వేల కేఫ్ కాఫీ డేలను‌ 
చూడగానే ఆకట్టుకునేలా
తిలకించగానే పులకించిపోయేలా, 
అడుగు పెట్టగానె ఆశ్చర్యచకితులయ్యేలా
కాఫీ త్రాగగానే తన్మయత్వం చెందేలా
అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో
ఒత్తిడికి గురయ్యే ప్రతిఒక్కరిలో
కొండంత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపి పంపే
ఆ కార్పోరేట్ కేఫ్ కాఫీ కింగ్
నేత్రావతీ నదిలో దూకేముందు 
ఒక్కసారి ఒక్కక్షణం ఆలోచిస్తే ఎంత బావుండేది?

చచ్చి తాను సాధించేదేమిటి? 
ఆవేశంతో ఆత్మహత్య చేసుకునే
యువతకు తానిచ్చే సందేశమేమిటీ? అని
సమస్యల ఇనుపసంకెళ్ళలో బందింపబడినా
ఎన్ని అవాంతరాలు వచ్చినా అడ్డంకులు ఎదురైనా భయపడక జీవితంలో పోరాడి గెలిచినవారే వీరులు
పారిపోయిన వారంతా పిరికిపందలే చరిత్రహీనులే

122. వద్దు వద్దు 
        ఆత్మహత్యలకు పాల్పడవద్దు...

(కర్నాటకలో నేత్రావతి నదిలో
దూకి ఆత్మహత్య చేసుకున్న
కేఫ్ కాఫీ డే కింగ్ వి జి సిద్దార్థ 
ఆత్మకుశాంతి కలగాలని ఆశిస్తూ
ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ 
ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడే 
యువత కోసం వ్రాసిన కవిత)

తీవ్రమైన ఒత్తిడికి
తట్టుకోలేని మనో వేదనకు
చెప్పుకోలేని మానసిక క్షోభకు
గురైనవారే ఆత్మహత్య చేసుకోవాలనే
ఒక దారుణమైన తప్పుడు నిర్ణయానికి వస్తారు

ఓడిపోయాను ఓడిపోయాను 
అని, పదేపదే తలచుకొని, లోలోపల
కుమిలిపోయే, కృంగిపోయేకంటే
ఒక ప్రయత్నం చేశాను ఓడిపోయాను 
మరొక్కసారి ప్రయత్నిస్తే పోయేదేముంది?
చచ్చిసాధించే దేముంది,? అని అనుకునేవారు 
ఆత్మహత్య చేసుకోవాలన్న 
ఆలోచనకు రారు

తట్టుకోలేని ఒత్తిడికి గురౌతున్నప్పుడు
ఇంటిలో భార్యపిల్లలతోనైనా 
దగ్గరి బంధువులతోనైనా
ప్రాణమిత్రులకైనా చెప్పుకుంటే
మదిలో ఉక్కిరి బిక్కిరిచేసే ఆరక రగిలే 
అగ్నిజ్వాలల్లాంటి ఆవేదనను,ఆ బాధను
ఒక్కసారైనా ప్రక్కవారితో పంచుకుంటే
ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది
ఒంటరిగా వుండకుండా నలుగురిమధ్య
నవ్వుతూ తిరుగుతూ వుంటే ఇక
ఆత్మహత్యకు పాల్పడే 
అవకాశమేది ? చెప్పండి

ఒత్తిడి అన్నది ఒక్కరోజులో 
ఒక పిడుగులా 
హఠాత్తుగా నెత్తిన పడేది కాదు
ఒత్తిడి అన్నది ఒక్కరోజులో ఒక గుండెనొప్పిలా 
గుట్టుచప్పుడు కాకుండా వచ్చేది కాదు

వందడుగుల దూరంలో ఉప్పొంగి  
ఒక వరద వస్తూవుంటే చూసి ఒక్కడుగు
ముందుకు దూకి తప్పించు కుంటాము
పదడుగుల దూరంలో ఒక పాము కనిపిస్తే
చంపడానికి కర్రతో సిద్దంగా వుంటాము 

అలాగే తీవ్రమైన ఒత్తిడికి 
అనవసరమైన ఆందోళనకు గురికాకుండా
ఆత్మహత్యలకు బలికాకుండా వుండాలంటే
చక్కని మార్గమొక్కటే మనశ్శాంతి 
కాసింత ప్రశాంతత అవి రెండూ దొరకాలంటే

విహారయాత్రలకైనా వెళ్ళాలి
కడుపుబ్బ నవ్వించే 
కామెడీ సినిమాలైనా చూడాలి
ఇష్టమైన ఆటలైనా ఆడాలి
ఆథ్యాత్మికమైన సందేశాలైనా వినాలి
బైబిల్ భగవద్గీత భాగవత 
రామాయణ గ్రంథాలైనా చదవాలి

లేదా చిరునవ్వులు చిందిస్తూ
అల్లరిచేసే చిన్నపిల్లలతోనైనా ఆడుకోవాలి
నచ్చిన పాటలైనా పాడుకోవాలి
శ్రావ్యమైన సంగీతమైనా 
వింటూ కాలాన్ని గడపాలి
ఇక ఆత్మహత్యలకు 
పాల్పడే అవకాశమేది? చెప్పండి.

123. మరణం వెనుక మర్మమేమిటి?

శూలాలు గుచ్చుకున్నా
సునామీలు ముంచెత్తినా
సుత్తి దెబ్బలెన్ని తగిలినా

అగ్నిపర్వతాలు బద్దలైనా
అగ్ని జ్వాలలు రేగినా
పిడుగులు నెత్తిన పడినా 

చెక్కు చెదరని చలించని
స్థిరచిత్తమున్న మనుషులు
చింతను ఒత్తిడిని మానసిక క్షోభను
మాత్రం తట్టుకోలేరు భరించలేరు

కృంగి పోతారు కుమిలి పోతారు
మనోవేదనతో మంచాన పడతారు

చచ్చి సాధించేది ఏమీ లేదనితెలిసినా
ఆత్మహత్యల అంచులు దాకా వెళ్తారు

అట్టి బలహీనులెందరో 
తన కేఫ్ కాఫీ డేలకు వచ్చి
ఒత్తిడిని జయించే శక్తినిచ్చే
అమృతం లాంటి దివ్యౌషధం లాంటి 
తన కాఫీని త్రాగి ఒత్తిడికి దూరమైపోతే

తాను మాత్రం తనకాఫీ త్రాగక
ఒక పిరికివానిలా ఒక పిచ్చివానిలా
ఒక బలహీనుడిలా ఒక బాధ్యతలు లేనివాడిలా
ఒక కార్పొరేట్ కింగ్ లా కాకుండా
ప్రేమపరీక్షలో ఫెయిలైన ఒక కాలేజీ కుర్రాడిలా

ఘోరమైన దారుణమైన 
ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని ఆవేశంతో
నేత్రావతీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆ కాఫీ కింగ్ మరణం వెనుక మర్మమొక్కటే
ఒత్తిడి చేతిలో తాను చిత్తుగాచిత్తుగా ఓడిపోవడం

124. తిరిగితే ... కొవ్వు కరిగితే...

మసాలాలకూ, మటన్ కు           
మందుపార్టీలకు - దూరంగా

పగకు, ప్రతీకారానికి, కోపానికి           
మొండి పట్టుదలలకు - దూరంగా

ఆర్జనకు, ఆవేశానికి             
ఆందోళనకు, ఒత్తిడికి          
అనవసరమైన నెగెటివ్ 
ఆలోచనలకు - సుదూరంగా 

లైట్ ఫుడ్ కు వాకింగ్
జాగింగ్ కి - దగ్గరగా

ప్రేమకు, శాంతానికి         
క్షమాగుణానికి - దగ్గరగా

ప్రశాంతతకు, దైవచింతనకు  
పాజిటివ్ ఆలోచనలకు - అతిదగ్గరగా 

వుంటే చాలు 
"ఆనందం ఆరోగ్యం ఆయుస్సు"అన్న 
మూడు వరాలు మీకు ఖచ్చితంగా దక్కుతాయి

ఉదయం, సాయంత్రం బయట తిరిగితే 
కొవ్వు కరిగితే ఆయుస్సు పెరుగుతుంది, ఐనా
తిరగనివారికి, రోజూ ఎక్సర్సైజ్ చెయ్యనివారికి
మాత్రం తిరిగి తిండి తినే హక్కేలేదు లేనేలేదు

125. నవ్వండి నవ్వండి 
        నువ్వుతూనే వుండండి

నవ్వండి నలుగురికి నవ్వులు పంచండి
నువ్వేవారి చుట్టే నలుగురుంటారండి
నవ్వేవారికి అందరూ మిత్రులేనండి
నవ్వనివారి చుట్టుఎవ్వరూ వుండరండి
నవ్వనివారికి ఊరంతా శత్రువులేనండి

నవ్వేవారు ఎదురైతే గౌరవిస్తారండి
నవ్వుతూ నమస్కారం చేస్తారండి
ఏడుపుగొట్టు మొఖాలు ఎదురైతే 
అందరూ ఏవగించుకుంటారండి

నవ్వితే నలుగురిలో నవ్వాలండి
ఏడిస్తే ఏకాంతంలో ఏడవాలండి
రాజులమంటూ ఫోజుపెట్టరాదండి
నరరూపరాక్షసుల్లా నవ్వరాదండి
 
నడిరోడ్డు మీద విరగబడి కాని
క్రిందపడినవారిని ఓడిపోయినవారిని 
కష్టాలలో వున్నవారిని చూసి కాని
వెకిలిగా ఎప్పుడూ నవ్వరాదండి

మాడిపోయిన నల్లని మొఖంతో
నడివీధిలో ఎప్పుడూ నడువరాదండి
నల్లని మొఖమైనా,మాడిన మొఖమైనా
ఏడ్చే ఏమొఖమైనా,అది అంటువ్యాధేనండి

వెలిగే దీపం మరోదీపాన్ని వెలిగించినట్లు
నువ్వే ముఖమే నాలుగు ముఖాలలో 
నువ్వును పుట్టించి కాంతివంతం చేస్తుందండి
ఎదుటివారిలోకి కనిపించని అనంతశక్తిని 
ప్రవహింప చేసి ప్రకంపనాలు పుట్టిస్తుందండి

నవ్వేవారికి ఆరోగ్యం ఆయుస్సు రెండూ వరాలేనండి
ఏడ్చేవారికెప్పుడూ వ్యాధులు బాధలు వేదనలేనండి
నువ్వేవారికి స్వర్గం స్వాగతం పలుకుతుందండి
నవ్వునివారిని నరకం నవ్వుతూ రమ్మంటుందండి

126. నిత్యం నరకమే - చేదు జ్ఞాపకమే

ఎవరు ఆత్మహత్య 
చేసుకున్నా వావరికి 

అన్ని కష్టాలు నుండి 
అన్ని నష్టాల నుండి

అన్ని అప్పుల నుండి 
అన్ని తప్పుల నుండి

అన్ని వేదనల నుండి 
అన్ని వ్యాధుల నుండి 

అన్ని భయాల నుండి 
అన్ని బాధ్యతల నుండి

అన్ని సమస్యల నుండి 
అన్ని సంక్షోభాల నుండి

ఉన్న అన్నిలోపాలనుండి శాపాలనుండి
గత జన్మలో చేసిన అన్ని పాపాలనుండి 

శాశ్వతంగా సంపూర్ణమైన 
విడుదల విముక్తి కలుగుతుంది
అది వారికి స్వర్గమే కావచ్చు

కాని ఇక్కడ బ్రతుకివున్న వారికి 
వారి మీద ఆధారపడివున్న వారికి
వారిని అతిగా ప్రేమించే వారికి
వారిని పూర్తిగా నమ్మినవారికి నిత్యం నరకమే 

ఆ బాధ గుండెలో గుచ్చుకున్న గునపమే
అది కన్నుమూసి కాటికెళ్ళేదాక
కారుచిచ్చులా నిత్యం రగులుతూ  
మనసును తొలిచే ఒక
మరుపురాని మరిచిపోలేని చేదు జ్ఞాపకమే

127. ఒక గమ్యం 
        ఒక లక్ష్యంతో ముందుకు....

తినేవాడికన్న,
తిని,కూర్చునేవాడికన్న
కూర్చొని వేళాపాల లేకుండా
సెల్ లో గేమ్స్ ఆడేవాడికన్న
లాప్ టాప్ లో ఇంగ్లీష్ సినిమాలు
టీవీలో చెత్త ప్రోగ్రామ్స్ చూసేవాడికన్న
పగటి పూట పనీపాటా లేకుండా
పడుకుని గురకలు పెట్టేవాడికన్న
జీవితంలో ఏదో ఒకటి సాధించి తీరాలన్న
కృషితో కసితో పగతో పట్టుదలతో 
దృఢమైన దీక్షతో ఒక తపనతో 
నిత్యం రగిలిపోతూ 
ఒక గమ్యం
ఆ గమ్యం చేరాలన్న ఒక లక్ష్యంతో
ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు 
ఎన్ని అవరోధాలు ఎదురైనా 
ఎన్ని సమస్యలు సవాళ్లు వచ్చినా
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా
చేయూత నివ్వకపోగా 
సహాయం చెయ్యకపోగా 
ఎందరు ఎంతగా నిరాశ పరచినా
ఎంతగా వెనక్కి లాగినా
ఎన్ని విమర్శలు చేసినా 
భయపడక బాణంలా ముందుకు
దూసుకు పోయినవాడే
అగ్ని కణంలా మండేవాడే
పులిలా ధైర్యంగా వుండేవాడే
బయట తలెత్తుకు తిరిగేవాడే భాగ్యవంతుడు

గదిలో గబ్బిలంలా కూర్చునేకన్న
బయట గాడిదలా బట్టలు మోయడం
రేసులో గుర్రంలా పరుగులు తీయడం మిన్న

కంటికి కొత్తవారు కనిపిస్తే కరవని 
ఇంటికి రాత్రి దొంగలు వేస్తే మొరగని కుక్కకన్న
యజమానిపై విశ్వాసం వున్న కుక్కమిన్న

128. వారెవరో కనిపెట్టడండి?...

వారికి ఆలోచన తక్కువ 
ఆవేశం ఎక్కువ
వారు అశుభ్రతకు 
ఆత్మబంధువులు
వారు ముందుకు రమ్మని 
ఎంత బ్రతిమాలినా రారు
వెనక్కి వెళ్ళమంటే మాత్రం 
పరుగెత్తుకొని పోతారు
వాళ్ళు వట్టి మూర్ఖులు,
భయంకరమైన బద్దకస్తులు
వెట్టిచాకిరికి 
ముందుండే మురికివాళ్ళు
వారి ప్రతిఆలోచనా 
వంకరే, వంకరటింకరే
వారితో కలిసి చేసే 
ప్రతిపని అసంపూర్ణమే
వ్యతిరేకమైన ఆలోచనలు 
చేయడంలోవారు దిట్టలు
వారు ఎవరి మాట వినని 
సీతయ్యలు
వారు ఎవరినీ చివరికి 
వారినీడనైనా నమ్మరు
అప్పు చేయడానికి 
అడుక్కు తినడానికి ముందు
ఆపదలోవున్న వారిని 
ఆదుకోవడానికి వెనుక వుంటారు
వారిలో గుణవంతులు ధనవంతులు తక్కువ
అజ్ఞానులు అహంకారులు ఆవేశపరులు ఎక్కువ

129. వాడు కాక పుట్టించే కామాంధుడు...

వాడు మన్మధుడే నవమన్మధుడే
వాడు మాయగాడే 
ముమ్మాటికీ మహామాయగాడే
వాడి ముందు కూర్చున్న
ఏ మగువకైనా మతి చెడిపోవలసిందే
వాడి, మాయలో పడి, పోవలసిందే
వాడి ఓరచూపులు వేడిని పుట్టిస్తాయి
వాడి మాయమాటలు మత్తెక్కిస్తాయి
వాడి చిరునవ్వులు చురకత్తుల్లా
ఎక్కడెక్కడో దిగిపోతాయి
క్షణంలోఎంతటి వారైనా 
వాడి వశమై పోవలసిందే,ఐతే
వాడు అందమైన చంద్రుడేమీ కాదు
కాని కలిసిన వారిలో వాడు 
కాక పుట్టించే కామాంధుడు
ఎన్ని కొమ్ములున్నా వాన్ని 
పొడిచేందుకు పులిలా వచ్చిన
ఎంతటి ఆంబోతైనా
పిల్లిపిల్లలా మారిపోవలసిందే
వాడు వేణువు ఊదితే చాలు
ఉరిమి చూసే సత్యభామలందరు
గోపికలై వాడి చుట్టు గోవుల్లా 
గిరగిరా తిరగవలసిందే
వాడు కరుడుగట్టిన కసాయివాడని
జిత్తులమారి నక్కని తెలిసినా 
అమ్మాయిలందరూ వాడినే
గుడ్డిగా నమ్ముతారు
వాడిచుట్టే గుండ్రంగా తిరుగుతారు
వాడి వెంటే పిచ్చెక్కిపరుగులు తీస్తారు
అందుకే, వాడిలో ఏదో అర్దం కాని 
ఎవరికీ అంతుచిక్కని, అతీతమైన
అతీంద్రియ శక్తి ఒకటేదోవున్నది
అది జన్మతోసహా వచ్చినట్లున్నది
వాడు రాతి గుండెల్ని కరిగించగలడు
ఆ గుండెల్లో గుబులు పుట్టించగలడు
వశపరుచుకోవడం వాడికి వరమే
కాని,వాడు విసిరిన వలలోపడి 
పాపం గిలగిలా కొట్టుకోవడం 
అమాయకులైన అమ్మాయిలకు పెద్దశాపమే

130. ఇష్టపడి కష్టపడితే....

ఎక్కడో,ఎందుకో  
నిన్న కలిశారు
కన్ను కన్ను కలిపారు
కలలెన్నో కన్నారు
సెల్లో కబుర్లాడుకున్నారు
ఇష్టమైనవి కోరుకున్నవి
ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్నారు
పిచ్చిగా ప్రేమించుకున్నారు
ప్రాణానికి ప్రాణమై పోయారు
జన్మ జన్మలకు జతగా 
వుండాలనుకున్నారు
అందుకే
నేడు పెళ్ళిచూపులు
రేపు నిశ్చితార్థం
ఎల్లుండి అందరిలో
పెళ్ళి పందిరిలో 
మూడు ముళ్లబంధం
ఆపై ఎంతో ఆశతో
ఎదురు చూసిన ఆ శోభనం
నిదురరాని వెన్నెల రాత్రి
చీకటిలో చిరునవ్వులు
చిలిపిగా చిందులు
ప్రేమతో పొందులు
పసందైన విందులు
యుద్దానికి ఇక సిద్దమంటారు
యుద్ధంలో గెలుపు ఇద్దరిదంటారు
ఇష్టపడి కష్టపడితే
ఇద్దరు ఒక్కటౌతారు
మున్ముందు వారే ముగ్గురౌతారు

131. ఏడడుగుల బంధం...
       ఎన్నెన్నో జన్మల బంధం...

మొన్న పరిచయం,
నిన్న ప్రేమ,నేడు వివాహం

మూడుముళ్లతో నూరేళ్ళకే కాదు
జన్మజన్మలకు జతచేయబడ్డారు మీరు

భార్యా భర్తలు భగవంతుడు ప్రేమతో
అందించిన బంగారు బహుమతులు

ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి
గొప్పగా గౌరవించుకోవాలి

చిన్నచిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ లు 
అప్పుడప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి

ఒకరిపై ఒకరు గట్టి నమ్మకం
సంపూర్ణ విశ్వాసం కలిగి వుండాలి

ఇద్దరి మనసులు హృదయాలు
పాన్పులు పరిశుద్ధమైనవై వుండాలి

చెప్పడుమాటలు వినరాదు
తప్పటడుగులు వేయరాదు

పుట్టింటివారిని మెట్టింటివారిని 
అభిమానంతో సమదృష్టితో చూడాలి

ఎక్కువ తక్కువ తేడాలుండరాదు
ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాలి

తిట్టుకోరాదు పోట్లాడుకోరాదు
కోపంతో కొట్లాడుకోరాదు

మనసులో ఏమీ దాచుకోరాదు
ముఖాముఖీగా చర్చించుకోవాలి

మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వరాదు
ఆ వ్యక్తి సలహాలు సహాయం కోరరాదు

కలకాలం కలిసివుందాం అనుకోవాలి
విడిపోదామని కలనైనా అనకూడదు 

132. అందిన అవకాశం ...పొందిన ఆనందం

ముచ్చటైన 
పచ్చని కాపురంలో
చిచ్చు రేపుకొనే వారంతా 
పిచ్చివాళ్ళే వెర్రివాళ్ళే

ముందరున్న
అందమైన ఆహ్లాదకరమైన
ఉన్నతమైన ఉత్కృష్టమైన
తిరిగిరాని ఈ జీవితాన్ని 
అనుభవించని వారంతా
అంధులే అజ్ఞానులే

అందిన అవకాశాన్ని
పొందిన ఆనందాన్ని
ఆర్జించిన ఆస్తిపాస్తుల్ని
అనుభవించని వారంతా
అవివేకులే అమాయకులే

నా ఈ చిరుకవితను
ఓపికతో చదివిన వారంతా
చదివి అర్థంచేసుకున్న వారంతా
అర్థం చేసుకొని ఆలోచించే వారంతా
ఆచరించే వారంతా గొప్పఅదృష్టవంతులే

133. దొరబాబులా ? దోపిడిదొంగలా ?

దొరబాబుల్లా సూటుబూటు వేసుకొని  
ఖరీదైన కార్లలో తిరగడానికి

దోపిడిదొంగల్లా దోచుకున్న డబ్బును 
స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానికి

ఫారెన్ ట్రిప్పులకెళ్లి జల్సాగా తిరగడానికి
విలాసవంతమైన విల్లాలు కొనుక్కోవడానికి
 
కోరినంత బంగారాన్ని కొని బ్యాంకులాకర్లలో 
భద్రంగా దాచి పెట్టుకోవడానికి, 

ఘోరమైన చావు ఛస్తే,
పాలరాతితో తమ ఘోరీలు కట్టుకోవడానికి

కొందరికి డబ్బులే ముఖ్యం కాని
పరులకొచ్చిన జబ్బులు కాదు

నిన్న ఓ వెలుగు వెలిగిన వీరు
రేపు ఊహించని రీతిలో

చెదలు పట్టిన చెట్టులా
కూలిపోయే మానులా

కుంగిపోయే నేలలా 
పొంగిపోయేపాలలా

మునిగిపోయే పడవలా
ఆరిపోయే దీపంలా 

అడ్రస్ లేకూండాపోతారు
అవమానాలపాలవుతారు

చితికిపోతారు చిక్కుల్లోపడిపోతారు  
కారుచీకటిలో కలిసిపోతారు కనుమరుగైపోతారు

134. మీకోసం ఓ శుభసందేశం...

ముళ్ల బాటలో నడిచి నడిచి 
అలసిపోయిన ఆకలిగొన్న వ్యక్తిని 
పూలతోటలోకి తీసుకుపోయిన లాభమేమి.?

ఆ తోటలో ఘుమఘుమలాడే
అందమైన పూలెన్ని వున్నా
ఆ వ్యక్తి ఆరని ఆకలిని తీర్చలేవుగా 

అదే ఏ మామిడి తోటలోకో తీసుకుపోతే, 
మామిడి పండు ఒక్కటి తిన్నా చాలుగా
వెంటనే వాని ఆకలిమంట ఆరునుగా 

అందుకే దాతలారా ఓ ధన్యజీవులారా!
ఆపన్నహస్తాన్ని అందించేముందు
ఒక్కసారి ఆలోచించండి  

అన్న పోలన్న అందించు ఈ శుభసందేశాలు
ఓపికతో విన్నా చదివినా చాలు ఒక్కసారి
జిలుగువెలుగులు విరజిమ్ము మీ జీవితాన
గుర్తుండి పోతుంది సదాకాలం మీ గుండెలోన

135. నిఘా పెట్టి వుంచాలి...

క్షణక్షణం
ప్రతిక్షణం
నిద్రలో సైతం 
నిఘా పెట్టి వుంచాలి
ముంచుకు వచ్చే 
మొండి రోగాల్ని, 
ముఖ్యంగా
గుట్టుచప్పుడు కాకుండా 
వచ్చే గుండెజబ్బుల్ని

ఖర్చు పెడుతూ వుండాలి
కొంచెం కొంచెం
కాస్త తెలివితో,
కాసింత ధైర్యంతో
కష్టపడి చెమటోడ్చి
ఆర్జించిన ఆస్తిపాస్తుల్ని

అనుభగ్నుల్ని
అడిగి తెలుసుకోవాలి
అన్వేషిస్తూ వుండాలి
ఆదాయాన్ని
ఆరోగ్యాన్ని
ఆయుస్సును పెంచే
మంచి మార్గాల్ని

పారాయణ చేయాలి ప్రతినిత్యం 
బైబిల్, భగవద్గీత భారత,
భాగవత రామాయణాది
ఆథ్యాత్మిక గ్రంథాల్ని

గడపాలి కాలం పరులసేవలో
తీర్చాలి అనాధల ఆకలిని 
ఆకాంక్షించాలి అందరి క్షేమాన్ని 

అనునిత్యం ఆ పరమాత్మను  
ప్రార్థించాలి అర్థించాలి ఆశతో  
బ్రతకాలి భయంతో భక్తితో 

అస్తమించాలి మంచి ఆరోగ్యంతో 
ఆనందంతో తృప్తితో ఆత్మతృప్తితో
చిరంజీవిగా మిగలాలి చరిత్రపుటల్లో

136. సత్కవిత సందేశం...

సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడే
సకాలంలో వ్యాయామం చేసినప్పుడే

సంతోషంగా వున్నప్పుడే
సవాళ్ళను ధైర్యంగాఎదుర్కొన్నప్పుడే

సంపూర్ణమైన ఆరోగ్యం దొరికేది
సక్సెస్ ఫుల్ గా జీవితం గడిచేది

సంస్కారం తెలిసినప్పుడే
సమానత్వం చూపినప్పుడే

సమయస్ఫూర్తితో మెలిగినప్పుడే
సహనం సర్దుబాటుగుణం కలిగినప్పుడే

సమాజంలో కీర్తిప్రతిష్టలు దక్కేది
సన్మానాలు సత్కారాలు పొందేది

సందేహాలతో సతమతం కానప్పుడే
సమస్యలకు భయపడి పారిపోనప్పుడే

సద్బుద్ధితో వ్యవహరించినప్పుడే
సత్సంకల్పంతో కర్మలు ఆచరించినప్పుడే

సంపాదనను అభవించే అదృష్టం కలిగేది
సమాధానం సంతృప్తి బ్రతుకున మిగిలేది 

సర్వేశ్వరుని కృపా కటాక్షాలు లభించేది
సర్వేజనా సుఖినోభవంతు అనిపించేది

137. కృషి చేస్తే సమస్తం సాధ్యమే!!!

అవి అన్నీ గొప్ప ఆలోచనలే
ఎవరూ ఆచరణలో పెట్టనంత వరకే

అవి అన్నీ మహా సాహనకార్యాలే
ఎవరూ ప్రయత్నించనంత వరకే

అవి అన్నీ గొప్ప గొప్పపనులే
ఎవరూ ప్రారంభించనంత వరకే

అవి అన్నీ అందరికీ అసాధ్యాలే
ఎవరూ సాధించినంత వరకే

అవి అన్నీ వింతలు విశేషాలే
ఎవరూ కనిపెట్టనంత వరకే

అవి అన్నీ మహాఅద్భుతాలే
ఎవరూ చేయనంత వరకే

అవి అన్నీ మహా ఘనవిజయాలే
ఎవరూ అందుకోనంత వరకే

ఒక్కసారి ఎదురులేని ఏకాగ్రతతో
గట్టి నమ్మకంతో గట్టి పట్టుదలతో 
సరైన గురు శిక్షణలో దృఢమైన దీక్షతో
కసితో తపనతో కష్టపడితే
నిరంతరం కృషి చేస్తే సమస్తం సాధ్యమే

ఎన్నో రికార్డులు బద్దలు కొట్టవచ్చు
ఎన్నో రివార్డులు అందుకోవచ్చు 

138 .రెండక్షరాల వైరస్

మాకు తెలివి -     "లేదు లేదు"
ఇది మావల్ల  -      "కాదు కాదు" 
మాకు ఏ పనీ  -    "రాదు రాదు" 
మేమేమీ చేయ్య - "లేము లేము" అనే 
రెండుపదాలు  -    "పదే పదే పలికేవారు"

ముందు చూపులేని మూర్ఖులు
పరమ బద్దకస్తులు, సోమరిపోతులు
శుంఠలు, వెదవలు,వెర్రివాళ్ళు,దద్దమ్మలు

అట్టివారి ఆలోచనలన్నీ అభివృద్ధి వైపు.. 
ఆకాశంవైపు...వెలుగువైపుకు కాదు
అథఃపాతాళంలోకే...అంధకారంలోకే...

అట్టివారితో జట్టుకట్టకు నీవు వారివల్లో చిక్కుకోకు
నీవు ముందుకు దూసుకు పోవాలనుకుంటే వారికి
ఆమడదూరంలో కాదు అరవైమైళ్ళదూరంలో ఉండు

లేకుంటే అంటుకునేను మీకా "రెండక్షరాలవైరస్" అప్పుడు 
సర్వనాశనం జీవితం సన్యాసులుగా మారడం ఖాయం

139 .పాఠాలు నేర్పే పావురాలు...(చిత్రకవిత)

కవితలు మానేసి పావురాల 
వెంటపడి అనేక అవస్థలుపడి 
అష్టకష్టాలుపడి ఈ ఫోటోతీశా... 
అవి మనలా కుదురుగా కూర్చోవుగా... 
నిక్కినిక్కి చూస్తాయి...
నీకు నాకు చిక్కనంటాయి... 
ఒంటరిగా దొరుకుతాయి... 
కానీ జంటగా దొరకడం అసాధ్యం... 
మనల్ని నమ్మవు...మనుషుల్ని చూస్తే 
చాలా భయపడిపోతాయి...
ఎక్కడికో ఎగిరిపోతాయి... 
ఫోటోకు ఫోజులివ్వవు... 
తిండికోసమే తిరుగుతూవుంటాయి...
పిడికెడు గింజలు విసిరితే చాలు...
పిలవని అతిథుల్లావస్తాయి... 
గుర్రుగా చూస్తాయి... 
చకచకా తినేసి తుర్రుమంటాయి... 
పాపం ఫోటోకి ఫోజులివ్వవు... 
తినే తిండి మీదనే ధ్యాసంతా... 
పొంచివున్న ప్రమాదాల మీదనే మనసంతా....
ఎవరిమీద ఆధారపడని 
ఆ పావురాల ఆకలి వేట... 
బద్దకస్తులకు...సోమరిపోతులకు... 
పరులమీద ఆధారపడి బ్రతికేవారికి... 
పావురాలు నేర్పుతాయి 
ఎన్నోపాఠాలు,జీవితపాఠాలు...గుణపాఠాలు...
జగడాలమారి ఏజంటకైనా
కుదురుగా కూర్చున్న ఈ పావురాలజంటే 
స్పూర్తిఅంట...ఇది పచ్చి నిజమంట....




రచన
కవిరత్న సహస్రకవి
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502








































































Comments