చంద్రునిపై దక్షిణ ధృవం పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)చంద్రయాన్ - 3 జైత్ర యాత్ర... వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కవితలు... అరుదైన చిత్రాలు... కవితలు... మీకోసం... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్...






















































1. దక్షిణ ధృవం పై... 
    భారత్ విజయ కేతనం... 

ఏ దేశమేగినా...
ఎందు కాలిడినా...
పొగడరా ఈ ఇస్రో 
చంద్రయాన్ - 3 
విజయ గాథను...
అని ఓ కవి పలికినట్టు

తెలుగునేల 
నెల్లూరు జిల్లా
శ్రీహరి కోటనుండి...

1000 మంది 
భారతీయ శాస్త్రవేత్తలు
తిండి నిద్ర జీవనమే
చంద్రయాన్ - 3 కాగా 
అకుంఠిత దీక్షతో...
అంకితభావంతో...
4 ఏళ్ళ నిరంతరం కృషికి 
నిదర్శనంగా రూపకల్పన చేసిన...

615 కోట్ల ఖరీదైన...
3915 కిలోల బరువైన...
చంద్రయాన్ - 3 అంతరిక్ష నౌక

14 జూలై 2023... 
మధ్యాహ్నం 2.35 
నిముషాల సు ముహూర్తానికి...

140 కోట్ల మంది 
భారతీయులు గర్వపడేలా...
నిప్పులు చెరుగుతూ నింగి కెగిసి...

భూమికి దూరంగా
3,84,800 కిలోమీటర్లు
41 రోజుల సుధీర్ఘ ప్రయాణం చేసి 
ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళని దారిలో...

అగ్రరాజ్యాలు
సైతం అసాధ్యమని 
ఆశలు వదులుకున్న ఏ దేశం 
సాహసించని చంద్రుని దక్షిణధృవానికి...

23 ఆగస్టు 2023...
సాయంత్రం 6.04 నిముషాలకు 
సూర్యోదయం వేళ...
అనేక క్లిష్టమైన దశలను దాటి... 
సాప్ట్ ల్యాండింగ్ చేసి...
చంద్రునిపై ఒక పగటి పూట... 
(భూమిపై 14 రోజుల) పరిశోధనలకు...
విక్రమ్ ల్యాండర్...ప్రగ్యాన్ రోవర్ లు 
విశ్వమే విస్తు పోయేలా విజయవంతంగా
"చల్లని చంద్రుని ఒడిని " చేరిన వేళ...

ప్రజలు టీవీలకు అతుక్కుని
ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ... 
గడిపిన ఆ క్షణాలు అత్యంత 
ఉత్కంఠ పూరితం...ఉద్వేగ భరితం...
ఉత్కృష్టమైన చంద్రయాన్ - 3 తో ఇస్రో 
చేపట్టిన ఈ"సాహసయాత్ర"విజయవంతం

జయహో...జయహో ఇస్రో జయహో
జయహో...జయహో సోమనాథ్ జయహో
జయహో...జయహో ఇస్రో శాస్త్రవేత్తలారా 
జయహో...జయహో జయహో...
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి...
చంద్రుని దక్షిణ ధృవం పై...కాలు మోపి 
చరిత్ర సృష్టించిన...ఏకైక దేశం...
అఖండ భారత్ జయహో...జయహో...

2. అఖండ భారతం...అంతరిక్ష విజయం 

చంద్రయాన్ -3 
చందమామపై 
సాప్ట్ ల్యాండింగ్ తో 
అంతరిక్ష ప్రయోగాలకు
అగ్రరాజ్యాలైన ...
అమెరికా రష్యా చైనాల 
తరువాత నాలుగో దేశంగా...

రష్యా లూనా - 25 సైతం తాక లేని
చంద్రుని దక్షిణధృవాన్ని తాకిన
ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా...
అవనిపై "భారత్ " ఒక 
"అంతరిక్ష శక్తిగా" అవతరించింది..

ప్రపంచమంతా... 
ప్రశంసల కుంభ వర్షం కురిపించింది
అంతరిక్షంలో భారత్ 
త్రివర్ణ కీర్తి పతాకం...రెపరెపలాడింది

చంద్రుని గర్భంలో ఉపరితలంలో 
దాగిన నిధి నిక్షేపాల అన్వేషణకై
సాంకేతిక సాహస యాత్రను చేసి 
యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా...
 
అపురూపమైన
ఒక మహోజ్వల ఘట్టాన్ని...
అంతరిక్షంలో ఒక 
మహా అద్భుతాన్ని...ఆవిష్కరించింది...
అంతరిక్ష చరిత్రలో 
ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది...
రోదసిలో "భారత్" రారాజుగా నిలిచింది...

ఈ అనిర్వచనీయమైన అపూర్వమైన 
అఖండ భారత అంతరిక్ష విజయానికి 
నిద్రాహారాలు మాని నిర్విరామంగా 
రాత్రింబవళ్ళు శ్రమించిన  
శాస్త్రవేత్తలందరికి చేద్దాం పాదాభివందనం

జయహో...జయహో...
ఇస్రో జయహో...
జయహో...జయహో...
చంద్రయాన్ - 3...జయహో
జయహో... జయహో...
చైర్మన్ సోమనాథ్ జయహో...
జయహో...భారత్ జయహో...జైహింద్. 

3. విక్రమ్ ల్యాండర్ విజయ గాథ!

నిన్న రాత్రి నేను
నింగిలోకి తొంగి చూశా
నా శిరస్సు పైన 
నిండు పున్నమి
చంద్రుడున్నాడు 
చుక్కల్లో నక్కి ఉన్నాడు
నిండుగా నవ్వుతున్నాడు ...

నేటి రాత్రి నేను
టీవీలోకి తొంగి చూశా
టీవీ చానెల్స్ ఘోషిస్తున్నవి... 
అంతరిక్ష నౌక చంద్రయాన్ - 3  
చంద్రుని తలపై అడుగు పెట్టిందని...
చంద్రమా ఇదెంత వింత.,.?
నిన్ను నా తలపై నీవు...
నేడు నీ తలపై మేము... 

బాల్యంలో నేను తిండి తినకున్న
అమ్మ పాడేది ఓ కమ్మని పాట
చందమామ రావే జాబిల్లి రావే 
కొండెక్కి రావే గోగు పూలు తేవే అని...

అద్దంలో ఆ చంద్రున్ని చూపిస్తూ 
కొసరి కొసరి పెట్టేది గోరుముద్దలు 
నాడు అద్దంలో కంటికి కనిపించే
ఆ చంద్రుడు చేత చిక్కడాయె
బాల్యంలో ఒకే ఒక తీరని కోరిక
చంద్రున్ని చేరాలని...చుక్కల్తో ఆడాలని

ఋగ్వేదంలో ఒక శ్లోకం...
చందమామ ఓ చందమామ
నేలకు నీవు దిగి రాలేవు...మేమే 
నీ దగ్గరకు వస్తాం దారి చూపమని...

మా శాస్త్రవేత్తల ప్రార్థన ఫలించింది 
సంక్లిష్టమైన అతి ప్రమాదకరమైన
ఉత్కంఠ భరిత దశలెన్నో దాటుకొని 
ఎన్నో ఏళ్లుగా సూర్యకిరణాలు తాకని
ఎవరూ చేరని‌...అడుగు పెట్టని
చంద్రుని దక్షిణ ధృవం పై 
దిగ్విజయంగా సురక్షితంగా దిగాయి 
"విక్రమ్ ల్యాండర్"..."ప్రగ్యాన్ రోవర్ లు"...
విశ్వమంతా...విస్తుపోయేలా...

ఆ వాయు రహిత చల్లని వాతావరణంలో 
ముందుకు నడుస్తూ రోవర్ ముద్రించింది 
అందమైన ఆ చందమామ గుండెలమీద 
ఇశ్రో లోగోను...జాతీయ సింహం చిత్రాన్ని... 
ఎన్నేళ్ళైనా చెక్కుచెదరని ఓ గుర్తుగా...
చంద్రునిపై భారత్ నడిచిందని...
ఆనందంతో అడుగులు వేసిందని... 
రోదసి సామ్రాజ్యానికి రారాజు భారత్ అని...

4. జయహో..! జయహో..!!
     చంద్రయాన్ 3... జయహో..!!!

భారతదేశ అందరిక్ష నౌక
చంద్రయాన్ 3... చంద్రునిపై
సేఫ్ గా ల్యాండ్ కావడం... 
అంతరిక్ష చరిత్రలో
ఒక మహోజ్వల ఘట్టం...
ఆ ఘనత సాధించిన 
మొట్టమొదటి దేశం 
ప్రపంచాన భారతదేశమేనని
అది "విశ్వ విజేతగా" అవతరించింది
అనేక దేశాలకు "దిక్సూచిగా"మారింది 

అకుంఠిత దీక్షతో అంకితభావంతో
అహోరాత్రులు నిద్రాహారాలు మాని
శ్రమించిన శాస్త్రవేత్తలు సంతోషంతో 
పట్టరాని ఆనందంతో పొంగిపోయేరు
ప్రపంచమంతా ప్రశంశల వర్షం కురిపించేను

నేడిది 140 కోట్లమంది 
భారతీయులకు దీపావళి పండుగే...
ఎటు విన్నా జయ జయ ధ్వానాలే...  
ఎటు చూసినా అంబరాన్నంటే సంబరాలే‍...
వినువీధిలో రెపరెపలాడేది త్రివర్ణ పతాకమే
ఓ నా ప్రియ భారతీయుడా...!  
దేశమేగినా ఎందు కాలిడినా...
పొగడవోయ్ ఇస్రో చంద్రయాన్ - 3 
వీర విజయగాథను..

జయహో..!జయహో..! 
ఇస్రో జయహో..!
జయహో...!జయహో..!
ఇస్రో శాస్త్రవేత్తలారా..! జయహో..!
జయహో..!జయహో..! 
చంద్రయాన్ - 3 జయహో..!


రచన:
"కవిరత్న"
"సహస్రకవి" 
పోలయ్య కూకట్లపల్లి...
అత్తాపూర్ హైదరాబాద్...
చరవాణి...9110784502

Comments