జాతినేతలకు... జేజేలు...!
దేశభక్తుల దేహాలలో
మానని గాయాలెన్నో ఎన్నెన్నో...
బిక్షగాళ్లుగా వచ్చిన బ్రిటిష్ దొరలు
రక్తం త్రాగే రాక్షసులైనారని
భరతమాత కుమిలిపోయిన
క్రుంగిపోయిన రాత్రులెన్నో...
నాటి భారత మాత దాస్య
శృంఖలాలను త్రెంచేందుకు...
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో
మ్రోగించిన యుద్ద భేరీలెన్నో...
పూరించిన విప్లవ శంఖారావాలెన్నో ...
చేసిన ఉద్యమాలెన్నో భీకరపోరాటాలెన్నో...
త్రివర్ణ పతాకాన్ని...చేబూని
ఉద్యమకారులు...ఉరుములై
ఉరిమి మెరుపులై మెరిసి పులులై
ఉరికిన రక్తసిక్తపు రహదారులెన్నో...
వందేమాతరం...వందేమాతరమంటూ
నిజమైనదేశభక్తులు నిరసనలనిప్పులు
కురిపించిన సభలు...సమావేశాలెన్నో....
విప్లవ వీరుల...
ఆవేదనలు ఆక్రందనలు...
కౌగిలించుకున్న కష్టాలెన్నో...
కూలిపోయిన కుటుంబాలెన్నో...
అనుభవించిన చిత్రహింసలెన్నో...
రగిలి పగిలిపోయిన గుండెలెన్నో...
రాలిపోయిన...లేతకుసుమాలెన్నో...
కారుచీకటిలో కార్చిన కన్నీటిధారలెన్నో...
ఆ త్యాగమూర్తులు...
చేసిన నిస్వార్ధమైన త్యాగాలెన్నో...
ఒరిగిపోయిన పర్వత శిఖరాలెన్నో...
జైళ్ళలో మ్రగ్గిన...జాతినేతలెందరో...
క్విట్ ఇండియా...క్విట్ ఇండియా అంటూ
దిక్కులు పిక్కటిల్లేలా నినదించి నినదించి
ఆగిపోయిన మూగపోయిన గొంతులెన్నో...
ఆ చీకటిరోజుల్లో తెల్లారగానే తెల్లదొరల
క్రూరకరవాలాలకు తెగిపడిన శిరస్సులెన్నో..
తిరిగి రాని లోకాలకు
తరలివెళ్లిన త్యాగధనులెందరో...
నింగినిచేరి ధృవతారలై వెలిగిపోతున్న
స్వాతంత్ర్య సమరయోధులెందరో ఎందరో
అందరికీ వందనాలు...పాదాభివందనాలు
నేడే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం!
త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేద్దాం!
జయహో...జయహో...
జేజేలు మీకు ఓ జాతినేతలారా !
"మీ స్మరణే మాకు ప్రేరణ" అంటూ
వారి అడుగుల్లో అడుగులు వేద్దాం!వారి
ఆశయాలకు జీవితాలను అంకితం చేద్దాం!
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502
నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..?
ఏమన్నది..? ఏమన్నది..?
నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..?
ఎందరో
మహాత్ముల...
నిస్వార్థపరుల...
మహానుభావుల...
స్వాతంత్ర్య సమరయోధుల...
జాతినేతల జైలు జీవితాల...
రక్తతర్పణాలకు ప్రతిఫలమే...
ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యమన్నది...
ఏమన్నది ఏమన్నది?
నా అర్థరాత్రి స్వాతంత్ర్యం ?
మన మహనీయులు
మహర్షులందించిన
నాలుగు వేదాలే ధర్మాన్ని
నాలుగు పాదాలపై నడిపిస్తాయన్నది...
ఎండిన పంటపొలాలను
సస్యశ్యామలం చేసే
గంగా...కావేరీ...యమున
బ్రహ్మపుత్రలే మనకు ప్రాణదాతలన్నది...
ఏమన్నది ఏమన్నది ?
నా అర్థరాత్రి స్వాతంత్ర్యం ?
నీతిగా...
నిజాయితీగా...
నిప్పులా బ్రతకమన్నది
నిర్భయంగా తలఎత్తుకు తిరగమన్నది...
ఏమన్నది..? ఏమన్నది..?
నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..?
సర్వమతాలకు కులాలకు
జాతులకు వర్ణాలకు వర్గాలకు
సంస్కృతీ సంప్రదాయాలకు
నా భారతజాతి...నిలయమన్నది...
భిన్నత్వంలో...
ఏకత్వమే మన నిత్య నినాదమన్నది...
ఏమన్నది..? ఏమన్నది..?
నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..?
ప్రజాస్వామ్యమే...
మనకు ఆరవప్రాణమన్నది...
అదే మన భరతమాతకు...
స్వర్ణాభరణమన్నది...
అమరజీవి అంబేద్కర్ లిఖించిన
రాజ్యాంగమే మనకు రక్షణ కవచమన్నది...
ఏమన్నది..? ఏమన్నది..?
నా అర్థరాత్రి స్వాతంత్ర్యం..?
అహింసావాది గాంధీజీ
ప్రథమ ప్రధాని చాచా నెహ్రూ
సర్దార్ వల్లభాయ్ పటేల్
సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్
అల్లూరి త్యాగాలే మనకు పునాదులన్నది...
ఇందిరా రాజీవ్...అటల్ బిహారీ
వాజపేయి అబ్దుల్ కలాం జాతినేతల
ఆశలు ఆశయాలే మనకు ఆయుధాలన్నది.
జైహింద్...జైహింద్...జై భారత్...
వందేమాతర గీతం...
ఏ పాట వింటే...
భారతీయులందరి
ఒళ్ళు పులకరిస్తుందో...
ఏ పాట వింటే...
తెల్లదొరల గుండెల్లో
మరఫిరంగులు పేల్తాయో...
ఏ పాట వింటే...
ప్రజలు ఒక ప్రభంజనమై
ఒక ఉప్పెనై విరుచుకుపడతారో...
ఏ పాట వింటే...
పశువులు శిశువులు
సైతం ఉలిక్కిపడి లేస్తాయో...
ఏ పాట వింటే...
అణువణువునా
తరతరాలుగా నరనరాలలో
స్వాతంత్ర్య కాంక్ష
దేశభక్తి రగులుతుందో...
ఏ పాట వింటే...
మన స్వాతంత్ర్య
సమరయోధులంతా
పిడికిళ్లు బిగించి సింహాలై
స్వరాజ్య సమరానికి సిద్దమౌతారో...
ఏ మంత్రదండంతోనైతే...
మన విప్లవవీరులు...
భగత్ సింగ్
ఝాన్సీలక్ష్మీబాయి
అల్లూరి సీతారామరాజు
పరమక్రూరులైన
ఆ తెల్లదొరలను ఎదిరించారో...
వారి గుండెల్లో నిదురించారో...
అదేఅదే మన జాతి పదేపదే
పాడుకునే "వందేమాతర గీతం"
వందేమాతరమంటే...?
వందేమాతరమంటే...?
ఒక పాట కాదు
ఒక తూటా...
వందేమాతరమంటే...?
ఒక గేయం కాదు
ఒక ఆయుధం...
వందేమాతరమంటే...?
ఒక శంఖారావం
ఒక సింహనినాదం...
వందేమాతరమంటే...?
జాతిపిత మనకిచ్చిన
ఒక "జైలుపిలుపు"...
వందేమాతరమంటే...?
చారిత్రాత్మకమైన
ఒక "గొప్ప మలుపు"
వందేమాతరమంటే...?
అది మన "భరతమాత గెలుపు"
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502















Comments
Post a Comment