ప్రజా యుద్ధనౌక "గద్దరన్న" కన్నీటి కవితలు...06.08.2023...వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కన్నీటికవితలు... మీకోసం... చదవండి... స్పందించండి... నచ్చితే షేర్ చేయండి... ఆ మహా ప్రజా గాయకునికి అశృనయనాలతో నివాళులు ఘనంగా అర్పించండి...మీ పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్....
1. గగనానికి కేగిన యుద్ధనౌక గద్దర్...
1949లో మెదక్ జిల్లా
తుఫ్రాన్ ...గ్రామంలో...
ఓ దళిత కుటుంబంలో...
లచ్చమ్మ...శేషయ్యలను
పుణ్యదంపతులకు...
ఎన్నో జన్మల పుణ్యఫలంగా
గుమ్మడి విఠల్ రావు జననం
విమలతో వివాహం...
ముద్దులొలికే ముగ్గురు బిడ్డలు
సూర్యుడు...చంద్రుడు...వెన్నెల
బ్రిటిష్ దొరల నెదిరించిన
"గదర్ పార్టీ" అభిమానిగా
"గద్దర్ గా" మారిన విఠల్ రావు
పీపుల్స్ వార్ "మావోయిస్టుగా"...
సాంస్కృతిక ఉద్యమాలకు
ఊపిరిలూదిన..."విప్లవ వీరుడు"...
తెలంగాణ ముద్దుబిడ్డ...మన గద్దరన్న
1997 ఏప్రిల్ 6 న...
చంద్రబాబు ఫాసిస్టు పాలనలో
గద్దరన్నపై బులెట్ల వర్షం కురిసి
భార్య విమల కళ్ళముందే
రక్తపు మడుగులో గిలగిలా
కొట్టుకున్న ఆ "ప్రజాయుద్దనౌక "
గుండెలో "6 బుల్లెట్లు"దిగినా...
తన రక్తం ఏరులై పారినా...
అభిమానుల ఆశీస్సులతో
తిరిగి మృత్యుంజయుడై లేచి...
"విప్లవ శంఖాన్ని" పూరించిన
"గాయపడిన పులి" మన గద్దరన్న
"పాతికేళ్ళుగా ఆ గుండెచప్పుడు
"నిత్యం నిప్పులు" కురిపిస్తూనే ఉంది
పేద విద్యార్థుల మహాబోధి పాఠశాల
వ్యవస్థాపకుడు "ఉదార హృదయుడు"
"విద్యావేత్త జ్ఞానప్రదాత"...మన గద్దరన్న
40 ఏళ్ళు నక్సల్ బరి
ఉద్యమానికి ఊపిరివై...
నిజాం నిరంకుశ పాలనకు...
తెలంగాణ రాష్ట్ర సాధనకు...
కారంచేడు...చుండూరు...
దళితుల దారుణ హత్యలపై...
అణగారిన వర్గాల హక్కులకై....
అవిశ్రాంతంగా పోరాడి...పోరాడి...
వేలవేల విప్లవ వేదికలపై...
"పాటల మందుపాత్రలు" పేల్చి...పేల్చి
ఫాసిస్టు పాలకులకు సింహస్వప్నమై...
గజ్జకట్టి..గర్జించి గర్జించి..కడకు వేటగాళ్ల
వేదింపులకు...మదపడి...మదనపడి
2023 జూలై 6 న...
మరణించిన...మహాయోధుడు...
నాయకుడు...ప్రజాగాయకుడు...
మా గద్దరన్నానీకివే మా...విప్లవ జోహార్లు...
గద్దరన్న భౌతికంగా...
దూరమైనందుకు...కన్నీరు మున్నీరయ్యే
ఓ కళాకారులారా..! ఓ అభిమానులారా...
ఆ "సూర్యుడు చంద్రుడు వెన్నెల" నక్షత్రాలు
నింగిలో వెలుగులు విరజిమ్మునంతకాలం
గోచి కర్ర గొంగళితో గద్దరన్న చిరంజీవియే...
అన్నపాట నిత్యం ప్రవహించే ఒక జీవనది..
అన్నకు అన్న పాటకు లేదు మరణం లేదు..
అన్న ఆత్మకు శాంతి కలుగును గాక..!
అశృనయనాలతో...
అన్నకిదే నా అక్షర నీరాజనం...
2. పాటే తూటాగా..!మాటే మంత్రంగా..!!
"బండెనక బండి కట్టి"...
"పదహారు బండ్లు కట్టి"...
"ఏ బండ్లోవస్తవ్ కొడుకో నైజాం సర్కరోడా"...
"నాజీల మించినవ్ రో నైజాం సర్కరోడా"...
"నీఘోరికడతం కొడుకో నైజాం సర్కరోడా"...
పాటతో "మాభూమి"చిత్రంలో వెండితెరపై
తళుక్కున ఒక మెరుపై మెరిసి...
గజ్జగట్టి...గర్జించిన.."ప్రజా యుద్దనౌక"
గద్దరన్నకు జోహార్లు..!విప్లవ జోహార్లు...
"పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న
"కాలమా అమ్మ తెలంగాణమా"...అంటూ...
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది...
పల్లెపల్లెలో విప్లవ శంఖాన్ని పూరించి...
కోట్లమంది ప్రజల్ని చైతన్యవంతుల్నిచేసి...
గజ్జగట్టి...గర్జించిన..."ప్రజా గాయకుడు"...
గద్దరన్నకు జోహార్లు..! విప్లవ జోహార్లు!!
"నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
"నీ తోడ బుట్టిన ఋణం తీర్చుకుంటనే చెల్లెమ్మా"
అంటూ ఆబాలగోపాలాన్ని అలరించి
కంటతడి పెట్టించిన ఆపాటకు అందిన
"నందిఅవార్డును" తిరస్కరించిన...
గజ్జగట్టి...గర్జించిన..."విప్లవ వీరుడు"
గద్దరన్నకు జోహార్లు..! విప్లవ జోహార్లు...!!
పాటే శ్వాసగా...
పాటే ప్రాణంగా...
పాటే తూటాగా...
పాటే ఆయుధంగా...
మాటే మంత్రంగా...
బ్రతికినంతకాలం...
అంబేద్కర్ ఆశయాలే ఊపిరిగా...
కులమత రహిత సమసమాజం కోసం...
తాడిత...పీడిత...బహుజన...గిరిజన...
బడుగు బలహీనవర్గాల హక్కులకోసం...
ధిక్కారస్వరంతో ఎలుగెత్తి నినదించిన...
గజ్జగట్టి...గర్జించిన"ఉద్యమ సూర్యుడు"
గద్దరన్నకు జోహార్లు..! విప్లవ జోహార్లు...!!
అన్నా మీ పాటకు మాటకు మరణం లేదు.!
అన్నా మీ ఆత్మకు శాంతి కలుగును గాక..!!
3. అన్న..! పాట ఆగి పోయె...!
అన్న..! గొంతు మూగబోయె...!!
ఒక విప్లవ తార...నేలకొరిగే...
ఒక విప్లవ గీతం...ఆగిపోయే...
ఒక విప్లవ జ్యోతి...ఆరిపోయే...
ఒక విప్లవ గళం...మూగబోయే...
ఎందుకు? ఎందుకు? స్వర్గంలో
"విప్లవ శంఖం" పూరించేందుకు...
అది గొంతా....కాదు గండ్ర గొడ్డలి
అది పాటా....కాదు పేలిన తూటా
అది మాటా...కాదు మందుపాతర
అది సభావేదికా...కాదు జన జాతర
త్రినేత్రుని గళంలో "గరళం"
గద్దరన్న గళంలో "అగ్నిగోళం"
త్రినేత్రుని చేతిలో త్రిశూలం
గద్దరన్న చేతిలో "విప్లవ దండం"
పాటల తోటలో ఎర్రజెండా
పాతిన ఎర్రసూర్యుడు గద్దరన్న...
పాటల ఏకే 47 పేల్చి
నక్సల్ బరి ఉద్యమంలో
విప్లవ బీజాలు...నాటిన...
విప్లవ శంఖం.....పూరించిన...
విప్లవ జ్వాలలు...రగిలించిన...
విప్లవ వీరుడు ప్రజాయుద్దనౌక గద్దరన్న...
అన్నా మీ అకాల మరణవార్త...
పీడిత ప్రజల గుండెల్లో ఫిరంగి మోత కానీ
అన్నా మీ పాటకు మాటకు మరణం లేదు.!
అన్నా మీ ఆత్మకు శాంతి కలుగును గాక..!!
రచన:
"కవిరత్న"
"సహస్రకవి"
పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ ...హైదరాబాద్
చరవాణి...9110784502


































Comments
Post a Comment