101.New(9) కవితలు(19th oct/23 to March/2023 with Index

 101.New(9)కవితల Index 


1. అమ్మానాన్న లేకుంటే 

2. వచనం వర్సెస్ కవిత్వం 

3. నవ్వే దేవతలు నడిచే దైవాలు 

4. టక్కరి నక్క కాపలా కుక్క 

5. ఆగస్టు 15 అర్ధరాత్రి స్వతంత్రం 

6. అయ్యో డ్రైవర్ తాతయ్య 

ఎంత పని చేసావయ్యా 

7. ఒక ఓర్పు ఒక తీర్పు ఒక మార్పు 

8. ఎందరో ఆత్మీయులు 

అందరికీ వందనాలు 

9. ఆలోచనలతో ఆటలు వద్దు 

10. వారిద్దరూ 

11. దీపావళిచ్చే దివ్యమైన సందేశం 

12. దీపావళి పర్వదినాన 

13. మేరా భారత్ మహాన్ 

14. మహాకవి శ్రీశ్రీకి మరణం లేదు. 

15. తీరని అప్పులు ఆరని నిప్పులు 

16. మీ ఆలోచనలే అక్షరాలైతే 

17. నిత్య సత్యాలు ఆణిముత్యాలు 

18. ఏంటి మన కర్తవ్యం 

19. సంఘంలో సమానత్వం

విద్య ద్వారానే సాధ్యం 

20. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

21. నీ దారికి దీపం నీకు దిక్సూచి 

22. పుట్టినరోజు శుభాకాంక్షలు 

23. ఈ కవితలలో ఏముంది 

24. దర్శక దిగ్గజం కళాతపస్విశ్వనాథ్

25. కళాతపసి విశ్వనాథ్ 

సప్తపది చిత్ర సందేశం 

26. అన్న పోలన్న సుభాషితం 

విన్న మీకు శుభోదయం. 

27. మేరా భారత్ మహాన్ 

28. మేరా భారత్ మహాన్ 

29. మనశ్శాంతికి మందిరాలు

30. పునర్జన్మ 

31. మాయమవుతున్నాడు మనిషన్నవాడు 

32. ఈ జీవితం చిత్ర విచిత్రం 

33. ఊబకాయం ఊబిలో 

34. నయవంచకులుంటారు జాగ్రత్త 

35. ఆత్మ జ్ఞాని 

36. పిచ్చి ప్రేమంటే

37. ఉగ్రవాదం ఉక్కుపాదం 

38. ఆరు అక్షరాల సిలువ శిక్ష

39. సంస్కారానికి సంతకం 

49. ఇక నీవే తేల్చుకో 

41. ఎంతటి యాదృచ్ఛికం 

42. అమృతం కన్నా అమ్మ ప్రేమే మిన్న 

43. నరుడే నారాయణుడు 

44. అఆలు అక్రమ సంబంధాలు 

45.:ఆత్మహత్యలు 

46. కాలమే కరుణిస్తే

47. హెల్మెట్ ఎందుకు 

48. పాదాభివందనమయ్యా 

ఓ పట్టాభిరామయ్య 

49. సంస్కారమా నీవెక్కడ 

50. నాడే ఉగాది ఆనాడే 

శోభకృతు ఉగాది 

51. పాపం రైలు కింద కుక్కపిల్ల 

52. నిరాశ ఒక నిప్పుల కుంపటి 

53. నిప్పుల ఖడ్గం 

54. ఓ వయసా నీకు వందనం

55. మార్గం కన్నా గమ్యం మిన్న 

56. పొదుపు మంత్రం 

57. నేనెవరో మీకు తెలుసు 

58. రైతే రాజైతే 

59.మానసిక రోగులుంటారు జాగ్రత్త 

60. ఓ ఆధునిక మహిళా జాగ్రత్త

61. దృష్టిలోపం అదే మనిషికి శాపం 

62. మొన్న ప్రేమిస్తే నిన్న నిరాకరిస్తే 

63. నా భారత నారి అంటే 

64. మళ్ళీ పుడతా 

మీ భరతం పడతాం. 

65. ఒకే ఒక్కటి చాలు 

66. ఓ కన్నీటి కవిత 

67. సమిష్టి కృషితో సర్వం సాధ్యమే 

68. నచ్చని పచ్చి నిజాలు 

69. జీవనదిలా జీవించాలంటే 

70. చిరకాల స్నేహం 

71. ఆస్కార్ పురస్కారం 

ఒక బంగారు ఆభరణం 

72. విశ్వవిజేతలు 

ఆస్కార్ అవార్డు గ్రహీతలు 

73. హ్యాట్రిక్ కొట్టిన రాజమౌళి 

74. జయహో జయహో 

75. తెలుగు పాటకు జయహో 

76. నాటు నాటు పాట 

77. ఎవరు ఎందుకు 

78. అంబరాన్ని అంటే 

సంబరాలు ఎందుకు 

79. ఓ అందాల బాపు బొమ్మ 

80. అక్షరానికి ఆస్కార్ అవార్డు 

81. అందాలు ఆరబోసే 

ఓ బంగారు బొమ్మ 

82. మానసిక రోగులు 

ఉంటారు జాగ్రత్త 

83. జయహో నిఖిత్ జరీన జయహో 

84. మూడు కాలాలు అంచున మృత్యువే 

85. ఉగాది పర్వదినం అంటే 

86. ఆవేశం వద్దు ఆలోచన వద్దు 

87. ఆత్మహత్యలకు పాల్పడవద్దు 

88. శతమానం భవతి 

సర్వేజనా సుఖినోభవంతు 

89. పారిపోయే దీపాలకు ఆశ ఎక్కువ

90. ప్రశంసే ఒక ప్రేరణ 

91. ఓ గురుదేవుల్లారా 

మీకు పాదాభివందనాలు 

92. వీడ్కోలు కవిత 

93. అభినవ బుద్ధుడు అంబేద్కర్ 

94. భగవంతుడే మన బంధువైతే 

95. కాసింత జాగ్రత్త చెల్లి 

నా బంగారు తల్లి 

96. కత్తితో కాదు కంటి చూపుతో 

97. రెక్కలు విరిగిన విహంగం 

98. అస్తమించని జ్ఞాన సూర్యుడు 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 

99. శ్రీ హనుమాన్ చిత్రకథ 

100.అమృత బిందువులు 

101. నేటి కన్నెపిల్లలే రేపటి కన్నతల్లులు


1. అమ్మానాన్నలే లేకుంటే...?


ఆ సూర్యచంద్రులు 

ఆ చుక్కలే లేకుంటే 

...ప్రపంచాన వెలుగెక్కడిది?


ఆ దైవమే లేకుంటే 

...సుందరమైన ఈ సృష్టి ఎక్కడిది?


ఆ ప్రకృతిలో 

ఆ పచ్చని వృక్షాలే లేకుంటే 

... మనకు ఈ ప్రాణవాయువెక్కడిది?


ఆ జ్ఞానమేలేకుంటే 

...మనకీ సుఖజీవన‌ వేదమెక్కడిది?


అమ్మా నాన్నే లేకుంటే 

...అసలు మనకీ మానవజన్మ ఎక్కడిది ?


ఆ బడిలో గురువులే లేకుంటే 

వారు విద్యను బోధించకపోతే

...మనకు విజ్ఞానమెక్కడిది ? 

...అసలు బ్రతుకులో వెలుగు ఎక్కడిది ?


2. వచనం Vs కవిత్వం...?


వచనమంటే.....

అమ్మా

కవిత్వమంటే....

నాన్న


వచనమంటే.....

చెక్కెర

కవిత్వమంటే....

తేనెపట్టు


వచనమంటే.....

చంద్రుడు

కవిత్వమంటే....

సూర్యుడు


వచనమంటే.....

పెంకుటిల్లు

కవిత్వమంటే....

విలాసవంతమైన విల్లా


వచనమంటే.....

పాతచిత్రం పాతాళభైరవి 

కవిత్వమంటే....

కొత్త చిత్రం బాహుబలి


వచనమంటే.....

పల్చటి మజ్జిగ

కవిత్వమంటే....

చిక్కటి పాలు చిక్కటిమజ్జిగ


వచనమంటే.....

ఆవకాయనెయ్యితో 

అరిటాకు భోజనం

కవిత్వమంటే....

హైదరాబాద్ దమ్ము బిర్యాని


వచనమంటే.....

పాత ఇల్లు పాత 

ఇంటికి రంగులద్దడం

కవిత్వమంటే....

ఖరీదైన ఒక కొత్త 

ఇంటి నిర్మాణం


వచనం...కవిత్వం...

రెండు...కవి కలానికి ‌రెండు కళ్ళు


3. నవ్వే ‌దేవతలు...నడిచే దైవాలు


ఆ వ్యక్తికి"

కళ్ళల్లో "కరుణ ఉంది"

మంచులా 

కరిగిపోయే "మంచి మనసుంది" 


ఎవరు కన్నీళ్ళు కార్చినా 

ఎవరికీ ఏ కష్టమొచ్చినా 

కరిగిపోయే 

"సుతిమెత్తని హృదయముంది"

ఆ హృదయం నిండా 

"ప్రేమామృతం" ఉంది అది 

పదిమందికి పంచే "దానగుణముంది" 


ఎవరికి 

ఏ ఇబ్బంది వచ్చినా 

తక్షణమే "స్పందించే" 

సహాయం "అందించే" 

"అభయ హస్తముంది" 


"ఆహస్తాలకు"...

"ఆలింగనం" 

చేసుకోవడమే తెలుసు 

"ఆ పాదాలకు" 

ఆపదలో ఉన్నవారిని 

"ఆదుకోవడమే" తెలుసు 

"అడుగులు వేయడమే" తెలుసు 

గజేంద్రున్ని మొసలి నుండి రక్షించిన 

ఆ శ్రీహరిలా..."పరిగెత్తడమే" తెలుసు 

గుండెలకు..."హత్తుకోవడమే" తెలుసు 


ఔను శభాష్ 

పదండి ముందుకు 

భయమెందుకు? మీ

వెనుక మేమున్నామనే

"భరోసానిచ్చే"... 

భుజం తట్టే...ముందుకు నెట్టే...

కొండంత అండగా ఉండే 

వ్యక్తులే..."అదృశ్య శక్తులు"

వారే "నవ్వే ‌దేవతలు...నడిచే దైవాలు"


4. టక్కరి నక్క...కాపలా కుక్క..?


అరుణోదయ వేళ 

"కాకి" కావు కావుమని... 

అరుచుచుండు కర్ణకఠోరంగా...

కొమ్మల్లో "కోయిలమ్మ"

కుహు కుహుఅని ...

కూయుచుండు కమ్మగా...

పసందుగా...వీనుల విందుగా...


"కంచు" మ్రోగునట్టు 

కనకంబు మ్రోగకకున్ననేమి...

కంచు మెరుపు కన్న

"బంగారునగ" మెరుపే మిన్న... 


జలజలమని

"జలపాతంలా"దూకకున్ననేమి...

గలగలమని

"సెలయేరులా" పారకున్ననేమి... 

"జీవనది" ప్రవహించు...

నిర్మలంగా...నిశ్చలంగా 

పంటలకు ప్రాణం పోస్తు...

దారిలో దాహార్తి తీరుస్తు...


నిదానంగా...నిశ్శబ్దంగా  

ప్రయాణించు..."నిజం"...

సప్తసముద్రాలు

అరనిముషంలో

దాటిపోవు..."అబద్ధం"...


తిన్నింటివాసాలు లెక్కెట్టు 

జిత్తులమారి "టక్కరి నక్క"...

తిండిపెట్టిన యజమాని కోసం 

ప్రాణత్యాగానికైనా సిద్దమౌ

విశ్వాసం గల "కాపలా కుక్క"...


5. ఆగస్టు 15 - అర్థరాత్రి స్వాతంత్ర్యం?


ఆనాడు‌ 

అల్లూరి సీతారామరాజు

భగత్ సింగ్ ఝాన్సీలక్ష్మీబాయిలాంటి 

విప్లవ వీరులెందరో...

తెల్లదొరల మరఫిరంగులకు నేలకొరిగితేనే...


గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్

సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి

జాతినేతలెందరో....

లాఠీదెబ్బలు తింటేనే...జైళ్ళల్లో మ్రగ్గితేనే...


స్వాతంత్ర్య కాంక్షతో రగిలిపోయే

స్వాతంత్ర్య సమరయోధులెందరో...

జాతిపిత పిలుపుతో జనసంద్రమై

పిడికిళ్లు బిగించి "క్విట్ ఇండియా"

అంటూ "సమర శంఖాన్ని" పూరిస్తేనే...


"వందేమాతరం" అంటూ 

దిక్కులు పిక్కటిల్లేల నినదిస్తేనే...


దేశభక్తులెందరో

ఉద్యమకెరటాలై 

అహింసామార్గంలోె 

ఉవ్వెత్తున ఎగసిపడితేనే...


విప్లవ సింహాలై 

అలుపెరుగక పోరాటం చేస్తేనే...

తమ ప్రాణాలను ఫణంగా పెడితేనే...

జులియన్ వాలాబాగ్ లో రక్తతర్పణచేస్తేనే...

వచ్చింది...ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం ...


ఈ భారతజాతికి

అంబేద్కర్ అందించిన 

-  రక్షణ కవచమే రాజ్యాంగం

పంచిన అమృత ఫలాలే...

- పౌర హక్కులు

- స్వేచ్ఛా - స్వాతంత్ర్యం 

- సమానత్వం - సౌభ్రాతృత్వం

ప్రసాదించిన అద్భుత వరాలే...

- భిన్నత్వంలో ఏకత్వం

- రామరాజ్యం - ప్రజాస్వామ్యం


6. అయ్యో డ్రైవర్ తాతయ్య

    ఎంతపని చేశావయ్యా...? 


రోజు ఇంటికి రమ్మని

కమ్మని కథలు...కబుర్లు చెప్పే

పక్కింటి తాతయ్యంటే పాపకు ప్రాణం 


ఒక రోజు ఎత్తుకొని 

"బుగ్గగిల్లితే" త్రుళ్ళి పడింది

"ముద్దాడితే" మురిసిపోయింది

సంతోషంతో గంతులు వేసింది 

ఒక రోజు ఇంటికి పిలిచి

"ఒళ్ళో"కూర్చోబెట్టుకొని

"సెల్లో గేమ్స్" ఆడుకోమన్నాడు


ఒక రోజు ఇంటికి రమ్మని 

"ప్రక్కలో" పడుకోబెట్టుకొని

సెల్లో "బూతుబొమ్మలు" చూపి

"ఛీఛీ"అంటూ కళ్ళుమూసుకుంటే

ట్యూబ్ లైట్ ఆర్పేసి 

చిరునవ్వులు చిందిస్తూ 

చీకటిలో ఏవేవో 

"చిలిపి పనులు" చేశాడు 


ఒక రోజు రాత్రి తాతయ్య 

ఫుల్లుగా తాగొచ్చాడు 

టీవీ "వాల్యూం" పెంచాడు 

"తలుపులు" మూశాడు

"తప్పుడు పని" చేశాడు...


అప్పుడు పాపం పాప 

చెరువు గట్టున పడ్డ చేపలా

గిలగిలా గిలగిలా కొట్టుకుంది

టీవీలో "బ్రేకింగ్ న్యూస్"‌...

నమ్మించి మోసం చేసి

కామవాంఛ తీర్చుకున్న

ఓ పక్కింటి ముసలి నక్క...

బలైపోయిన ఓ బాలిక... 

అవమానంతో ఆత్మహత్య 

చేసుకున్న అమ్మానాన్న....


ఔరా పసిప్రాయం వీడని

ఓ "చిరునవ్వుల చిన్నారి"

ఒక "చిరుదివ్వెలా"ఆరిపోయింది

ఒక "మల్లెపువ్వులా" నలిగిపోయింది

ఓ "ఆడిపాడే అపరంజి బొమ్మ" 

బంగారు "భవిష్యత్" బలైపోయింది

ఓ "చిలకపలుకుల రామచిలుక" 

"కామాంధుడి కౌగిట్లో బంధీఐపోయింది

నిన్న నిశ్చింతగా "గుట్టుగా" బ్రతికిన 

ఓ కుటుంబం"నేడు చెట్టుకు"వ్రేలాడుతోంది

చిన్నారుల్ని చిదిమేసే కళ్ళుపొరలు 

కమ్మిన కామాంధులకు బహిరంగ 

ఉరిశిక్షే ఉత్తమశిక్ష

అదే కుప్పకూలిన కుటుంబాలకు శ్రీరామరక్ష 


7. ఒక ఓర్పు...ఒక తీర్పు...ఒక మార్పు


ఓ మనిషీ !

నీకు నీవే జడ్జివై 

నిష్పక్షపాతంగా 

తెలిసీతెలియక నీవు

చేసిన నేరాలకు నీకు నీవే 

వేసుకుకొంటే...కఠినశిక్షలు 

చెప్పుకుంటే...న్యాయమైన తీర్పు...

ఎందుకు రాదు ?...నీలో... 

విశ్వాన్నే విస్మయపరిచే..."వింతమార్పు"...


ఓ మనిషీ !

గతాన్ని మరువక 

దుష్టతలంపులతో నీవు

చేసిన దుష్కృత్యాలను  

సమర్ధించుకోక సరిదిద్దుకుంటే 

నీ "ఓటమే నీకు గురువై" 

తప్పక నేర్పుతుంది 

గుర్తుంచుకునే గుణపాఠాలను 

అందుకు ఉండాలి...నీలో...

కొంచెం సహనం + "కొండంత ఓర్పు" ...


8. ఎందరో ఆత్మీయులు...

     అందరికీ వందనాలు...

 

ఓనా ప్రియ సాహితీమిత్రులారా !

నా కవితలు 

మీ హృదయాలను కదిలిస్తే...

మీ మనసులను పరవశింపచేస్తే...

తప్పుచేసిన వారికి కనువిప్పు కలిగిస్తే...

కారు చీకటిలో కాంతి రేఖలైతే...

వెలుగులను పంచే వెన్నెల కాగడాలైతే...

చదవండి!స్పందించండి! అభినందించండి!


ఓనా ప్రియ సాహితీమిత్రులారా !

నా కవితలు 

చింతల చీకట్లను 

చీల్చే వెలుగు కిరణాలైతే...

రామబాణాలైతే...రక్షణ కవచాలైతే...

తరతరాలుగా అణిచివేతకుగురైన...

బానిసత్వానికి బలైపోయిన...

సాంఘిక రుగ్మతలతో చితికిపోయిన... 

అమాయకులకు అభాగ్యులకు 

కరదీపికలైతే...చైతన్య జ్వాలలైతే...

చదవండి!స్పందించండి!అభినందించండి!

 

ఓనా ప్రియ సాహితీమిత్రులారా !

నా ఈ కవితలు  

కావు కావుమని అరిచే 

కాకమ్మ కబుర్లు కావనిపిస్తే...

కొంచం సందేశాన్ని పంచే

కొంత ఆహ్లాదాన్ని అందించే 

కొమ్మల్లో కోయిలమ్మల

కుహు కుహు రాగాలనిపిస్తే... 

చదవండి!స్పందించండి!అభినందించండి!


ఓనా ప్రియ సాహితీమిత్రులారా !

నా కలలనుండి నా కలంనుండి 

జాలువారిన నా కవితలు 

విజ్ఞానదాయకం..వినోద భరితం

సందేశాత్మకం...స్పూర్తి మంత్రం 

నవసమాజ నిర్మాణానికి... 

పటిష్టమైన పునాదులనిపిస్తే...

చదవండి!స్పందించండి!అభినందించండి!


ఓనా ప్రియ సాహితీమిత్రులారా !

నిజానికి నా ప్రతికవిత  

ఆరని నా ఆశాదీపం...

నా ఆలోచనామృతం...

నా ఆత్మ దర్శనం...

నా ఆత్మ సాక్షాత్కారం... 

నా కవిత్వం తాడిత పీడిత 

బడుగు బలహీవర్గాలకొక భరోసా...

ఒక పూలబాట...

ఒక కంచుకోట‌...వారి చేతిలో ఒక తూటా... 


9. ఆలోచనలతో ఆటలొద్ధు...


ఔనుఅన్నిఆలోచనలు మనవే

మన చిత్తంలో చిగురించినవే

కానీ వొద్దువొద్దు అదృశ్యమైన 

ఆ ఆలోచనలతో ఆటలొద్ధు

ఆలోచనలు లేదు

కొన్ని ఆలోచనలు

పొట్టనింపుతాయి...

కొన్ని ఆలోచనలు

పొట్టగొడతాయి...


కొన్ని 

ఆరని అగ్గి రవ్వలు...

కొన్ని ఆలోచనలు

అమృత బిందువులు...


కొన్ని ఆలోచనలు

అమృతాన్ని కురిపిస్తాయి...

కొన్ని ఆలోచనలు

హాలాహలాన్ని చిమ్ముతాయి...


కొన్ని ఆలోచనలు

ఊయలలో ఊరేగిస్తాయి...

కొన్ని ఆలోచనలు

ఊబిలోకి తోసేస్తాయి...


కొన్ని ఆలోచనలు 

ప్రశాంతతను ప్రసాదిస్తాయి...

కొన్ని ఆలోచనలు ‌

నరకానికి నడిపిస్తాయి...


కొన్ని ఆలోచనలు

దేవతలై దీవిస్తాయి...

కొన్ని ఆలోచనలు

భూతాలై భయపెడతాయి...


అదృశ్యమైన 

కొన్ని ఆలోచనలు

భగ్గుమనిమండే అగ్నిపర్వతాలు...

కొన్ని ఆలోచనలు 

కుంభవృష్టిని కురిపించే కారుమేఘాలు...


కొన్ని ఆలోచనలు 

కృంగదీస్తాయి కుమిలిపోయేలా చేస్తాయి...

కొన్ని ఆలోచనలు

లేని గుండెధైర్యాన్ని మొండి ధైర్యాన్నిస్తాయి...


కొన్ని ఆలోచనలు

ఎవరెస్ట్ శిఖరాన్ని 

అధిరోహించేలా చేస్తాయి...

కొన్ని ఆలోచనలు 

నిర్ధాక్షిణ్యంగా 

అథఃపాతాళానికి నెట్టేస్తాయి...


అందుకే వొద్దువొద్దు 

మన ఆలోచనలతో ఆటలొద్ధు

మన ఆలోచనలను 

మనమే నియంత్రించుకోవాలి

మన ఆలోచనలను 

మనమే ఆరాధించాలి ఆస్వాదించాలి 

మన ఆలోచనల్ని మనమే ప్రేమించాలి


10. వారిద్దరు.....!!!


ఎక్కడా కలవనినాడు

ఏపరిచయంలేనినాడు

ఎవరికి ఎవరు తెలియనినాడు 

వారిద్దరు..."అపరిచితులు"


ఏదో సందర్భంలో అనుకోకుండా 

కాకతాళీయంగా కలిసినప్పుడు

మాట మాట కలిసినప్పుడు

ఒకరి భావాలను ఒకరు

ఒకరి బాధలను ఒకరు

ప్రేమతో పంచుకున్నప్పుడు

వారిద్దరు..."స్నేహితులు"


అప్పుడప్పుడు కలిసినప్పుడు 

మాట మాట కలిసినప్పుడు

చూపు చూపు కలిసినప్పుడు

మనసు మనసు కలిసినప్పుడు

ఒకరిని ఒకరు కోరుకున్నప్పుడు

వారిద్దరు... "ప్రేమికులు"


ఇద్దరు ఒకరితో ఒకరు

జీవితాన్ని పంచుకోవాలని కలిసి 

బ్రతకాలని భావించినప్పుడు

నిశ్చితార్థం జరిగినప్పుడు

పెళ్ళి పీటలెక్కినప్పుడు

వివాహబంధం ఏర్పడినప్పుడు

వారిద్దరు..."నూతన వధూవరులు"


ఆపై శోభనం జరిగినప్పుడు

పడకగదిలో పట్టెమంచంలో

ఇద్దరు ఒక్కటై పోయినప్పుడు

కలిసి కాపురం చేసినప్పుడు

సంతానం కోసం తపించినప్పుడు

వారిద్దరు..."భార్యాభర్తలు"


ఆ ఇద్దరు ముగ్గురు కావాలని

కమ్మని కలలు కన్నప్పుడు

ఆకలలు నిజమైనప్పుడు

కడుపు పండినప్పుడు

పాపో బాబో పుట్టినప్పుడు

వారిద్దరు..."తల్లీదండ్రులు"


వారి పిల్లలకు 

పెళ్ళిళ్ళు చేసినప్పుడు

వారిద్దరు..."అత్తామామలు"

ఆ పిల్లలకు 

పిల్లలు పుట్టినప్పుడు

వారిద్దరు..."అవ్వాతాతలు"


వారికి కంటిచూపు కరువైనప్పుడు

కాళ్ళల్లో నడిచే సత్తువలేనప్పుడు

అందరిపై ఆధారపడుతున్నప్పుడు

వారిని భారంగా భావించినప్పుడు

వృద్ధాశ్రమంలో వదిలి పెట్టినప్పుడు

వారిద్దరు..."అందరుఉన్నా అనాధలు"

ఆకలికి అలమటించే..."అస్థిపంజరాలు"

ఎవరినీ నిందించలేని..."నిస్సహాయులు"


వారే కన్న కమ్మని కలలన్నీ కల్లలై 

మరలిరాని లోకాలకు తరలిపోతున్న 

నిన్న దైవం దీవించిన ఆదర్శ"దంపతులు" 

నేడు ఆ దైవమే శపించిన "భార్యాభర్తలు


11. దీపావళిచ్చే దివ్యమైన సందేశం...?


వీరమరణం 

పొందిన ఒక సైనికుడు 

ఉన్మాదులను...ఉగ్రవాదులను 

దుష్టులను...దురాక్రమణదారులను

సరిహద్దుల్లోనే మట్టు పెట్టినట్లు...

ఏర్పాటువాదులను ఏరివేసినట్లు... 


చిత్రహింసలకు

శిలువమరణానికి గురియైప

మరియ సుతుడు

కలువరి గిరిపైన కార్చిన 

తన పరిశుద్ధరక్తంతో 

ఎందరినో పాపవిముక్తుల్ని చేసినట్లు...


ఒక్క "చిరుదీపం"

"చిమ్మచీకట్లను" చీల్చివేస్తుంది

"వెన్నెలవెలుగుల్ని" విరజిమ్ముతుంది

ఇదే "దీపావళిచ్చే దివ్యమైన సందేశం"... 


12. దీపావళి పర్వదినాన...


ఈ దివ్యమైన...

దీపావళి పర్వదినాన...


మీ "భయాలు"... 

"లక్ష్మీ బాంబులా" పేలిపోవాలని...


మీ "కష్టాలు"... 

"కాకరవత్తుల్లా" కాలిపోవాలని...


మీ "సుఖసంతోషాలు"...

"భూచక్రాల్లా" మీచుట్టే గిరగిరా తిరగాలని...


మీ "విజయాలు"... 

"చిచ్చుబుడ్లలా వెలుగులు విరజిమ్మాలని...


మీ "కీర్తి ప్రతిష్టలు"....

"తారాజువ్వలా"

ఆకాశపు అంచులు తాకాలని...

మీరు "ఎవరెస్ట్ శిఖరంలా" ఎదగాలని...


దేదిప్యమానమైన 

కోటిదీపకాంతులతో

మీ "జీవితాలు" నిండిపోవాలని...


మీ "కలలు" పండాలని...

మీ "కోర్కెలు" ‌తీరాలని...

మీకు "సకలశుభాలు"

"శాంతి సౌఖ్యాలు" కలగాలని.... 

ఆ దీపలక్ష్మీ మిమ్మల్ని దీవించాలని... 


"అష్టైశ్వర్యాలను"

"ఆయురారోగ్యసౌభాగ్యాలను"

మీకు ప్రసాదించాలని... 

మనసారా కోరుకుంటుటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు 

దివ్యమైన దీపావళి శుభాకాంక్షలతో...


13. మేరా భారత్ మహాన్... 


మేరా భారత్ మహాన్...వందేమాతరం...

జనగణమన...జైజవాన్ జైకిసాన్...

సారే జహాసె అచ్చా ...

ఇంక్విలాబ్ జిందాబాద్....

అన్న నిప్పులాంటి నినాదాలే...

నిత్యం మీ గుండెచప్పుళ్ళైతే...


ఈ దేశం నాకేమిచ్చిందని చీకటిలో కూర్చొని 

చింతించక ఈ సమాజానికి ఈ దేశానికి

నేనేమిచ్చానని క్షణం ఆలోచించమన్న 

నిస్వార్థపరులైనస్వాతంత్ర్య సమరయోధుల 

సంఘసంస్కర్తల శుభసందేశాల్ని 

కలనైనా మీరు మరువకపోతే...


మట్టిని నమ్మి మట్టి నుండే మెతుకులు 

పుట్టించే మట్టిమనిషి రైతన్న నోట్లో 

కొత్త సాగుచట్టాలతో మట్టికొట్టకపోతే...


కులం కుళ్ళని...మతం ముళ్ళని గ్రహించి

కులంరొచ్చులో కూరుకుపోక మతంమత్తులో 

ఉన్మాదులై...మతంచిచ్చు రగిలించకపోతే...

మారణహోమాలు సృష్టించకపోతే...


మీలో జాతీయత...నిజమైన దేశభక్తి...

సద్భావన స్ఫూర్తి...నిండుగా ప్రవహిస్తున్నట్లే

జైహింద్...జై భారత్....


14. మహాకవి శ్రీశ్రీ కి మరణం" లేదు 


మహా కవి 

శ్రీ శ్రీ కి మరణం లేదు... 

శ్రీ శ్రీ అన్న రెండు అక్షరాలలో

ఒకటి "సూర్యుడు" 

మరొకటి "చంద్రుడు"...


అవి రెండూ 

అనంతమైన ఆకాశంలో

ప్రకాశిస్తూ ఉన్నంతకాలం 

మహాకవి శ్రీ శ్రీ జీవించే ఉంటాడు...


సూర్యునిలా... 

"స్పూర్తి వెలుగును" 

వృద్ధులైన యువకులకు 

పంచుతునే ఉంటాడు 

చంద్రునిలా...

తన మధురమైన

సినీగీతాలతో

ప్రతి హృదయాన్ని

ఉల్లాసపరుస్తూనే వుంటాడు 


కవులు వ్రాసే ప్రతిఅక్షరంలో 

శ్రీ శ్రీ "నవ్వే నక్షత్రమై" 

వెలుగుతూనే వుంటాడు... 

అందుకే

"మహాకవి శ్రీశ్రీ కి మరణం" లేదు 


నిజానికి కలం పట్టి 

కష్టజీవుల కన్నీటిగాథల్ని 

వెలుగులోనికి తెచ్చే...

నిజాన్ని నిర్భయంగా 

నిష్పక్షపాతంగా వ్రాసే...

నీతినిజాయితీతో ఉండే...

నిత్యం నిప్పులా మండే...

ప్రతి "కవిశేఖరుడు" కూడా 

చిరంజీవియే...చిరస్మరణీయుడే...


ఔను కవులను ఆదరించేవారు 

కవిత్వాన్ని ప్రోత్సాహించేవారు

"కలకాలం బ్రతుకుతారన్నది"

నా కలం చెక్కిన శిలాశాసనమే....


15. తీరని అప్పులు..!ఆరని నిప్పులు..! 


ఓ అన్నలారా..! 

రైతన్నలారా..!

ఓ కార్మికులారా..! 

ఓ కష్టజీవులారా..!

ఓ సోదరులారా..! 

చిరువ్యాపారులారా..!

మధ్యతరగతి ఉద్యోగులారా..!


చేయకండి..!చేయకండి..!

"తలకు మించిన అప్పులు"...

కావొచ్చునవి ముళ్ళబాటలో 

"మీ కాళ్ళకు బాటా చెప్పులు"...


కానీ తీర్చగలిగి...తీర్చకున్న...

తీసుకున్న అప్పులు...అవి మీ... 

"కాళ్ళకింద ఖణఖణమండే నిప్పులు"


అవసరానికి చేసిన అప్పులు 

కావొచచ్చునవి "వర్షంలో గొడుగులు"...

కానీ తీర్చగలిగి తీర్చుకున్న

తీసుకున్న అప్పులు...అవి మీ...

తలలపై "విరుచుకుపడే పిడుగులు"...


అవసరానికి...ఆకలి తీరడాని...

అప్పులు చేయడం...తప్పుకాదు

ఆపదలో...అవసరానికి...మనల్ని 

ఆదుకున్న ఎవరైనా దైవసమానులే...

 

అట్లని నమ్మకండి..!నమ్మకండి..! 

గుడ్డిగా ఈ వడ్డీవ్యాపారుల్ని వీరు

వడ్డీమీద వడ్డీ బారువడ్డీ చక్రవడ్డీలు

వడ్డించి మీ నడ్డీ విరుచుట ఖాయమే...

  

అత్యాశాపరులు నరరూపరాక్షసులు

దయాదాక్షిణ్యం ఆవగింజంతైనా లేని 

రక్తంపీల్చే జలగలు ఈ వడ్డీవ్యాపారులు

జాగ్రత్త మిత్రులారా..! తస్మాత్ జాగ్రత్త..!


16. మీ ఆలోచనలే అక్షరాలైతే...? 


ఓ కవిశేఖరులారా...!

మీ ఆలోచనలే అక్షరాలైతే...? 

అవి ఎక్కడున్నాయి ?

పల్లెల్లో పచ్చదనంతో 

నిండి ఉన్నాయా ?

నగరాల్లో నగ్నంగా 

నాట్యమాడుతున్నాయా? 

దీనులకు దౌర్భాగ్యులకు 

అనాధలకు అమాయకులకు 

విధివంచితులకు 

వెన్నెల వెలుగులు పంచుతున్నాయా?

ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు..? 


ఓ కవిశేఖరులారా...!

మీ ఆలోచనలే అక్షరాలైతే...? 

అవి ఏం చేస్తున్నాయి...?

తరతరాలుగా 

అజ్ఞానంతో ...

అమాయకత్వంతో... 

అణిచివేతకుగురియై 

దుర్భర జీవితాలను జీవించే 

బడుగు బలహీన వర్గాలకు...

సుశిక్షితులైన సైనికులుగా మారమని 

హింసించే ఈ సమాజాన్ని ప్రశ్నించమని 

ప్రతిఘటించమని నిత్యం పోరాడమని  

మీ అక్షరాలు వారికి 

శిక్షణ నిస్తున్నాయా? రక్షణ నిస్తున్నాయా?

ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు..? 


ఓ కవిశేఖరులారా...!

మీ ఆలోచనలే అక్షరాలైతే...? 

అవి ఏం చేస్తున్నాయి...?

మధ్యపానానికి...మత్తుమందులకు 

బానిసలై దారి తప్పుతున్న 

యువతకు దారి దీపాలౌతున్నాయా? 

నీతి నియమాలు మృగ్యమైన 

మానవమృగాలలో మార్పుతెస్తున్నాయా?

ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు..? 


ఓ కవిశేఖరులారా...!

మీ ఆలోచనలే అక్షరాలైతే...?

అవి ఏం చేస్తున్నాయి... ?

కులం కుంపట్లను రాజేసే...

కులరక్కసులకు...

మతంపేర మారణహోమాలు 

సృష్టించే మతోన్మాదులకు... 

సమాధులు కడుతున్నాయా ?

సంతాపం తెలియజేస్తున్నాయా ?

ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు...?


ఓ కవిశేఖరులారా...!

మీ ఆలోచనలే అక్షరాలైతే...? 

అవి ఏం చేస్తున్నాయి... ?

దోషులను శిక్షిస్తున్నాయా ?

నిర్దోషులను రక్షిస్తున్నాయా ?

ప్రార్థిస్తున్నాయా? అర్దిస్తున్నాయా? 

వేడుకుంటున్నాయా? వేటకొడవల్లై 

తలలు నరుకుతున్నాయా?

గడ్డిపరకల్లా... 

గాలికి కొట్టుకుపోతున్నాయా?

గర్జించే పులులై...గండ్రగొడ్డల్లై... 

కులంపేర కుమ్ములాటలతో

మతంపేర మారణహోమాలతో

కుళ్ళిపోయిన ఈ సమాజంపై 

తిరుగుబాటు చేస్తున్నాయా?

ఏం చేస్తున్నాయి...మీ అక్షరాలు..?


17. ఓర్పు ఓడనెక్కి ఒడ్డుకు చేరు...!


అసహనం వద్దు 

సహనం శాంతియే ముద్దు

ఓర్పు ఉన్న నీకు ఓటమెక్కడిది? 

 

"ఓర్పు" ఓడలా మిమ్మల్ని

ఒడ్డుకు చేరుస్తుంది 

"అసహనం" రాక్షసి అలలా

మిమ్మల్ని అర్ధాంతరంగా 

ముంచివేస్తుంది 


అవాంతరాలు అనివార్యం 

అసహనముతో 

ఆరంభించిన కృత్యాలు

అర్ధాంతరంగా ఆగిపోవచ్చు 

అసంతృప్తికి...అవమానాలకు

తీవ్రమైన ఒత్తిడికి...

మానసిక క్షోభకు...అంతులేని 

వ్యధకు...ఆవేదనకు గురికావచ్చు


సద్బుద్ధితో సత్సంకల్పంతో

సత్కార్యక్రమాన్ని ప్రారంభించి 

సత్ఫలితం దక్కదన్న

సందేహంతో...మధ్యలో

పనిని ఆపేవాడు....అధముడే...

ముగించనివాడు...మూర్ఖుడే...

విజయానికి వాడు బద్దశత్రువే... 

అపజయానికి వాడు...ఆత్మబంధువే...


18. నిత్యసత్యాలు...ఆణిముత్యాలు...


నవ్వేవాడి చుట్టే 

నలుగురుంటారు 

ఏడ్చేవాడి చుట్టు 

ఎవరుంటారు ?

వాడు ఎడారిలో 

ఒంటరి ఒంటేగా... 


ఓటమికి...ఉంటాయి 

ముందు...అనుమానం 

వెనుక......అవమానం 

విజయానికి...ఉంటాయి

ముందు..ఆరాటం పోరాటం

వెనుక.....సన్మానం సత్కారం


ఎక్కడ "తగ్గాలో " 

ఎక్కడ "నెగ్గాలో " తెలిసిన వారికే... 

"విజయలక్ష్మి" అందిస్తుంది  

వీరస్వర్గాన్ని...కీర్తి కిరీటాన్ని...  


ఆడే ప్రతిఆటలో 

"శిక్షణ...క్రమశిక్షణే" 

"వినయవిధేయతలే"

గెలుపు గుర్రాలౌతాయి 

"సోమరితనం బద్ధకంతో"

నిరాశతో నిండినవాడు

ప్రతి నిత్యం నిద్రాదేవి

ఒడిలో కునికేవాడు

"కాళ్ళులేని కుందేలే "... 

"గాడాంధకారంలో గబ్బిలమే"... 


"ప్రశ్నించే వాడికి" 

"ప్రతిఘటించే వాడికి"

అందే ప్రతిఫలం 

తియ్యని"తిరుపతి లడ్డు"

బద్ధకస్తుడు "భయానికి 

బంధువైన పిరికిపంద"  

ఎంత ఈదినా "చేరలేడు ఏ ఒడ్డు"

ఇవే ఇవే నిజజీవిత......నిత్యసత్యాలు...

ఇవే ఇవే అనుభవాల...ఆణిముత్యాలు...


19. ఏంటి మన కర్తవ్యం ...?


నిత్యం 

"దైవాన్ని" స్తుతించాలి... 

"పెద్దలను" పూజించాలి... 

"ప్రతిమనిషిలో"

దైవాన్ని దర్శించాలి... 

"ఇరుగుపొరుగు" వారిని 

ప్రేమించాలి...గౌరవించాలి... 

"మరణించిన వారిని" 

"గతించిన వారిని" స్మరించుకోవాలి...

 

"అనాధలను"... 

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి... 

"ప్రతిభ ఉన్న వారిని"... 

ప్రోత్సహించాలి...

సన్మానించాలి... సత్కరించాలి... 

"దాతలకు"... 

శిరసు వంచి నమస్కరించాలి... 

"దీర్ఘాయుష్షు ప్రాప్తిరస్తని" దీవించాలి...

"అనాధలను" 

"అభాగ్యులను" అక్కున చేర్చుకోవాలి...

"నిస్సహాయులకు" ధైర్యాన్ని నూరిపోయాలి


"శ్రమజీవులకు"... 

శిరస్సు వంచి నమస్కరించాలి... 

"నిరుపేదలకు"... 

"నీడలేని వారికి" నీడనివ్వాలి... 

"కూడులేని వారికి"... 

"గూడులేని వారికి"...

"వస్త్రములులేని వారికి...

"తక్షణమే ఆర్థిక సహాయం" చేయాలి... 


"చిన్నారులను"

ప్రేమించాలి...ప్రోత్సహించాలి...

అల్లరి చేసినా  

"అసాధారణ ప్రతిభగల" 

పిడుగుల్లాంటి పిల్లలను ఆశీర్వదించాలి...


మన "చిరునవ్వులే" 

మనకు "చిరుదివ్వెలు" కావాలి... 

"ప్రశాంతతే" మనకు "ఊపిరి" కావాలి...

"సుఖం శాంతి" 

"పరోపకారమే"మన జీవనవిధానం కావాలి


20. "సంఘంలో సమానత్వం" 

        విద్యద్వారానే" సాధ్యం"...!


"సూర్యుడు" లేక 

ఆకాశంలో వెలుగెక్కడిది...?

"గురువులు" లేక 

బడిలో పాఠాలెక్కడివి..?

"దైవం" లేక గుడిలో 

అర్చనలెక్కడివి?ఆరాధన లెక్కడివి?

"విద్యలేక" మనిషికి వికాసమెక్కడిది?


"విద్య" నేర్చినవాడే 

విశ్వవిజేతై విశ్వాన్ని ఏలగలడు ... 

కళ్ళెం చేతిలో ఉన్నవాడే అశ్వాన్ని 

అదుపులో ఉంచగలడు...


విద్యలేనినాడు వాడు సంతలో 

అమ్ముడుపోయే ఓ వింత పశువే... 


నాలుగు వేదాలు వెలిగిన 

నా భరతావనిలో

ఏ కుసంస్కారుల కుట్రలో 

భాగమో ఏమొ కానీ 

"నాలుగు కులసర్పాలు"బుసలు

కొడుతూ విషం చిమ్ముతున్నాయి 


ఎందరినో అమాయకపు 

జనాన్ని కర్కశంగా కాటువేస్తున్నాయి 

ఎందరో అభాగ్యులు కూడుకు 

గుడ్డకే కాదు విద్యకు విజ్ఞానానికి 

సైతం దూరమైపోతున్నారు 

తరతరాలుగా అజ్ఞానంలో... 

అంధకారంలో...మ్రగ్గిపోతున్నారు...


ఔను ఏ వసతులులేని రోజుల్లో 

విదేశాలకేగి "ఉన్నతవిద్య"నార్జించి...

ఆ విజ్ఞానంతోనే రాజ్యాంగ చేసి 

కోట్లమంది బడుగు బలహీన వర్గాల 

ప్రజల జీవితాలను వెలుగుమయం చేసి...


ఏవరూ చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగి

ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన

"మేధావి"

"జ్ఞానశిఖరం"... 

"విద్యా జ్యోతి"...

రాజ్యాంగ నిర్మాత" 

"బహుముఖ ప్రజ్ఞాశాలి...

"దళితజాతి ఆశాకిరణం"...

"అమరజీవి అంబేద్కర్"... 

అందించిన "శుభసందేశం" ఒక్కటే.... 


"అంటరానితనం" మంటల్లో 

పడి మలమలమాడిపోతున్న...

కులసర్పాలకాటుకు బలైపోతున్న... 

తాడితపీడిత బడుగుబలహీవర్గాలకు

ఈ సంఘంలో "సమానత్వం" 

"ఒక్క"విద్యద్వారానే" సాధ్యమని...


21. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..! 


సమైక్యతకు

సమగ్రతకు నాదేశం 

"సోపానమన్న"

భిన్నత్వంలో ఏకత్వమే

మన "నినాదమన్న"...


సర్వమతాలకు... 

కులాలకు...జాతులకు...

సంస్కృతీ సంప్రదాయాలకు...

నా భరతజాతి "నిలయమన్న"...


ప్రజాస్వామ్యమే దానికి 

"ఆరవప్రాణమన్న"....

అదే నా భరతమాతకు 

"స్వర్ణాభరణమన్న"...


తాను తన రక్తాన్ని సిరాగా

మార్చి వ్రాసిన రాజ్యాంగమే‌ 

మనకు "రక్షణకవచమన్న"...

అంబేద్కర్ అమృతవాక్కుల్ని 

కలనైనా మరువరాదు...


అందరివాడైన... 

రాజ్యాంగ నిర్మాతైన... 

అంబేద్కర్ మహనీయుని "స్మరణే" 

ప్రతిభారతీయునికి "ఓ ప్రేరణ"...అదే

ఆ మహా మేధావికి ఘనమైన నివాళి


అందుకే...

నీలాల నింగిలో రెపరెపలాడే...

ఆ త్రివర్ణ పతాకానికి వందనం...

రాజ్యాంగ నిర్మాత...

దళిత జాతి జ్యోతి...

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు...

జైలుజీవితం గడిపిన జాతినేతలకు...

స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం

తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన

స్వాతంత్ర్య సమరయోధులకు... 

వందనం ! అభివందనం !

తల్లి భరతమాతకు...పాదాభివందనం!


కోట్లాదిమంది జీవితాలలోని

చిమ్మచీకట్లను తొలగించి... 

వెన్నెలవెలుగులను పంచి...

కొండంత తన జీవితాన్ని 

కొవ్వొత్తిలా కరిగించి...

అందరి సంక్షేమాన్ని ఆకాంక్షించి...


అమరజీవి అంబేద్కర్ 

అందించిన...

1949 నవంబర్ 26 న 

ఆమోదించబడిన

1950 జనవరి 26 న

అమలు చేయబడిన...

365 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్ 

18 భాగాలుగల మన

"భారత రాజ్యాంగం" 

ఒక అమృతభాండం


అందుకే ...

నేడు‌ మన భారతదేశం

సర్వసత్తాక... సామ్యవాద... 

ప్రజాస్వామ్య...లౌకిక...

గణతంత్ర రాజ్యంగా

అవతరించిన సందర్భంగా... 


భారత రాజ్యాంగ నిర్మాత

అమరజీవి డాక్టర్ బిఆర్అంబేద్కర్ కి 


తల్లి భరతమాత... 

దాస్యశృంఖలాలను త్రెంచిన

స్వాతంత్ర్య సమర యోధులకు... 


జైలు జీవితాలను గడిపిన 

జాతినేతలకు త్యాగమూర్తులకు... 


స్వరాజ్యం కోసం ప్రాణాలను 

ఫణంగా పెట్టిన వీరజవాన్లకు...


కన్న తల్లి భర్తమాతకు...వందనం...

అభివందనం...పాదాభివందనం....


రాబోవు వెయ్యితరాలకు...

ప్రభుత్వాలకు... చక్కని

సుపరిపాలన సూత్రాలను...

భరతజాతికి సురక్షితమైన... 

జీవనానికి మహత్తరమైన...

మంగళకర మార్గాల్ని...సూచించిన


బైబిల్ భాగవత రామాయణాది

ఆథ్యాత్మిక బృహత్ గ్రంథాలను

పఠించిన రీతిగా...

ప్రతిదినం ప్రతి భారతీయుడు

మన భారత రాజ్యాంగాన్ని....

నిత్యం పారాయణం చేయాలి...

కారణం పౌరుల ప్రాథమిక 

హక్కులకు ప్రాణంపోసిన 

ప్రపంచంలో అతిపొడవైన 

రాజ్యాంగం మన "భారత రాజ్యాంగం"

దేవతలకే తప్ప దెయ్యాలకు ప్రవేశంలేదని 

గొప్పఆశయంతో అమరజీవి అంబేద్కర్

 నిర్మించిన"సువర్ణశోభిత దేవాలయం" 


అందుకే...

నీలాల నింగిలో రెపరెపలాడే...

ఆ త్రివర్ణ పతాకానికి వందనం...

రాజ్యాంగ నిర్మాత...దళిత జాతి జ్యోతి...

అమరజీవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు...

జైలుజీవితం గడిపిన జాతినేతలకు...

స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం

తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన

స్వాతంత్ర్య సమరయోధులకు...  

భరతమాత దాస్యశృంఖలాలను త్రెంచి 

నుదుట రక్తతిలకం దిద్దిన వీరజవాన్లకు...

వందనం...! అభివందనం...!

తల్లి భరతమాతకు...పాదాభివందనం...!


తన రక్తాన్ని 

చెమట చుక్కల్ని

సిరాచుక్కలుగా మార్చి...

తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి...

తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసి..

అతిక్లిష్టమైన అమెరికా...ఇంగ్లాండ్...

 ఐర్లాండ్..రష్యా...కెనడా... జర్మనీ 

దేశాల రాజ్యాంగాలను... 

రాత్రింబవళ్ళు అధ్యయనం చేసి... 

అమరజీవి అంబేద్కర్  

అందించిన...విలువైన...

విశిష్టమైన...వినూత్నమైన...

ప్రపంచమేధావులచే ప్రశంసింపబడిన...

ప్రజాస్వామ్య దేశాలలో...

మణిమకుటం మన "భారత రాజ్యాంగం‌"

అది భరతజాతికే "ఒక రక్షణ కవచం"


అందుకే...

జయహో...! జయహో...! 

ఓ జాతినేత అంబేద్కరా...జయహో..! 

జయహో...!జయహో..! 

ఓ భారత రాజ్యాంగ నిర్మాతా... జయహో..!


మన అఖండ భారతదేశం

సర్వసత్తాక సామ్యవాద

ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర 

రాజ్యంగా అవతరించేందుకు...

అసువులు బాసిన 

ఓ విప్లవ వీరులారా..!

ఓ స్వాతంత్ర్య సమరయోధులారా...

జోహార్..!జోహార్..!

భరతమాత దాస్య శృంఖలాలను

త్రెంచేందుకు...నిస్వార్థంగా పోరాడిన...

ఓ దేశభక్తులారా..!ఓ వీరజవానులారా..!

ఓ త్యాగమూర్తులారా! జోహార్ జోహార్..!


22. నీ దారికి దీపం...నీకు దిక్సూచి..?


ఓమిత్రమా ! నీప్రాణస్నేహితుడు 

నీకు ముందు నీతులు చెబుతూ 

వెనుక గోతులు త్రవ్వుతువుంటే 

వాడు నీచుడే...పరమనిక్రుష్టుడే

వాడి నీడ కూడ నీపై పడరాదు 

కానీ నీవు త్యాగానికి...

అనురాగానికి...ప్రతిరూపమైతే

నీవు నీతిమంతుడవే...

స్వచ్ఛమైన క్షీరసాగరానివే...

పవిత్రమైన గంగాజలానివే... 


ఔను మిత్రమా...!

నీవు వెలుగైతే......వాడు చీకటి 

నీవు సృష్టిఐతే.....వాడు లయ 

నీవు శిఖరమైతే...వాడు లోయ

నీవు నిండు గోదారైతే...

వాడు ఎండిన ఎడారే...


వాడు నిన్ను .....వేధిస్తుంటే...

బాధిస్తుంటే......వాదిస్తుంటే...

నీతో నిత్యం.....విభేదిస్తుంటే... 

నిందిస్తుంటే......నిట్టూర్చకు...

నీవు తలవైతే...వాడు తోక... 

నీవు పెరటిలో తులసి మొక్కవైతే... 

వాడు గంజాయివనంలో కలుపుమొక్క.. 


కానీ మిత్రమా...!

వాడు నీకు కనిపించే శత్రువే... 

నిజానికి వాడే నీకు మార్గదర్శి...

నీ దారికి దీపం...నీకు దిక్సూచి...


23. పుట్టిన రోజు శుభాకాంక్షలు...!


ఓ ప్రియ నేస్తామా !

నా ప్రాణమిత్రమా ! 

మీకు 

పుట్టిన రోజు శుభాకాంక్షలు

మీకు జన్మనిచ్చిన మీ...

అమ్మానాన్నలకు వేలవేల వందనాలు...

ఈ శుభదినాన నాడు మీకు ప్రాణం 

పోసిన ఆ బ్రహ్మకు శతకోటి ప్రణామాలు... 


మీకు... 

ఆకాశమంత...ఆనందాన్ని...

సముద్రమంత...సంతోషాన్ని...

ఆ పరమాత్మ ప్రసాదించాలని...

నే మనసారా...కోరుకుంటున్నాను...


మీ...

ముచ్చటైన ముఖంలో 

"వేయి చిరునవ్వుల 

చంద్రికలు" వెల్లివిరియాలని...

మీ "మంచిమనసు "ఉత్సాహపు

ఉల్లాసపు ఊయలనెక్కి ఊరేగాలని...

మీ "ఉదారహృదయంలో" "శతకోటి 

సూర్యోదయాలు" ఉదయించాలని...

నే మనసారా...కోరుకుంటున్నాను...


మీ... 

ఆశలు...ఆశయాలు ఆకాంక్షలు...

మీ"కమ్మని కలలన్నీ" పండాలని...

మీరు కోరిన "కోటి కోరికల వరాలు"

"కుంభవర్షమై"... మీపై కురియాలని...  

నే మనసారా...కోరుకుంటున్నాను...


మీరు... 

సద్బుద్ధితో...

సత్సంకల్పంతో... 

తలపెట్టిన

ప్రతి "శుభకార్యం" 

సఫలం కావాలని...

కలనైనా ఊహించని... 

సత్ఫలితాలనివ్వాలని...

"అదృష్టలక్ష్మి" మీకు

"ఆత్మ బంధువు" కావాలని...

"ఓ ఆత్మీయ అతిథిగా"...

నిత్యం మీ ఇంట తిష్ట వేయాలని...

మీరు సుఖశాంతులతో...

ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో... 

"నిండూనూరేళ్లు" వర్ధిల్లాలని...


మున్ముందు మీరు మరిన్ని పుట్టిన 

రోజు పండుగలు జరుపుకోవాలని...

నేమనసారా...కోరుకుంటున్నాను...


"పుట్టిన రోజు శుభాకాంక్షలతో "...


24. ఈ కవి(తలలో) ఏముంది?


నా కలం కన్న 

నా కమ్మని కవితలు 

అభ్యుదయ భావాల... 

ఆణిముత్యాల... 

నిత్యసత్యాల...

నీతి కవితలు...


సుఖసంతోషాలను

సకల శుభాలనొసగే 

సూక్తి సుధలు...

 

కలం బట్టి నేకవిత 

వ్రాయబూనగా...

వెన్నుతట్టె...ఆ వేమన్న 

పొంగిపోయె...ఈ పోలన్న...


నా కలం కన్న 

నా కమ్మని కవితలు 

పొంగిపోయే పాలకుండలు...

ఆరక రగిలే అగ్నిజ్వాలలు...


నా కలం కన్న 

నా కమ్మని కవితలు

నీతికి నిజాయితీకి నిధులు...

చల్లనినీడనిచ్చే పచ్చని వృక్షాలు...

 

నా కలం కన్న 

నా కమ్మని కవితలు

నిజానికి నిలువుటద్దాలు‌‌...

నిర్మలమైన జీవితానికై 

చేస్తాయి నిశ్శబ్దపు యుద్ధాలు...


నా కలం కన్న

నా కమ్మని కవితల్లో

కష్టేఫలి శ్రమయేవ జయతేన్న

నిప్పులాంటి నినాదాలుంటాయి 

కష్టజీవుల కన్నీటి వరదలకు

ఆనకట్టలుంటాయి

కడుపునింపే కరెన్సీ కట్టలుంటాయి


25. దివికేగిన "దర్శకదిగ్గజం"

       కళాతపస్వి విశ్వనాథ్...


భారతీయ సాంస్కృతిక 

సంప్రదాయాలను

సంగీత సాహిత్య శాస్త్రీయ

నృత్యకళలను

కులనిర్మూలనవంటి 

సామాజిక సమస్యలనే  

ఇతివృత్తాలుగా తీసుకుని...


అగ్రహీరోలచే చెప్పులు 

కుట్టేపాత్రలకు ఒప్పించి 

"స్వయం కృషితో"

సాధించలేనిదంటూ...ఏదీలేదని...


ఆ...శ...స...అక్షరాల సెంటిమెంట్ తో 

తీసిన సినిమాలన్ని బాక్సాఫీస్ రికార్డుల్ని

బ్రద్దలుకొట్టిన బ్లాక్ బస్టర్ చిత్రాలు 


ఆత్మగౌరవం...

ఆత్మభాంధవుడు

శంకరాభరణం...

శృతిలయలు...

శుభలేఖ...

శుభప్రదం...

సిరిసిరిమువ్వలు...

సిరివెన్నెల...

స్వర్ణ కమలం...

సందేశాత్మకమైనవే...

స్పూర్తిదాయకమైనవే...


అవి పగటిపూట వెలుగులు పంచే

సూర్య కిరణాలు...

రాత్రిపూట నింగిలో తొంగి చూసి నవ్వేనక్షత్రాలు...


ప్రతి చిత్రం ఒక ఆణిముత్యం

ప్రతి పాట ఒక గంగా ప్రవాహం

ప్రతి పాట ఒక తీయని తేనెల ఊట

తెలుగు సినిమా పాటల విరితోటలో 

ఒక కురిసిన "సిరివెన్నెల"


ప్రతిపాట వీనులవిందు

ప్రతి పాట ఒక అమృతపు గుళికైల,

ప్రతి దృశ్యం ఒక కళాఖండం

అది ఒక కనువిందు 

వారు తీసిన చిత్రాలు

వెండితెర మీద చేసిన 

చెరగని సంతకాలు 

తనకత్యంత ఆప్తులైన

బాలు సిరివెన్నెల సీతారామశాస్త్రిని

దర్శించేందుకు దివికేగిన "దర్శకదిగ్గజం"

ఖాకీ దుస్తుల కళాతపస్వి విశ్వనాథ్ కు

అశృనయనాలతో అందించే అక్షరనివాళి


26. కళాతపస్వి విశ్వనాథ్

       సప్తపది చిత్ర సందేశం...?


ఆహా ఏమి చిత్రం..?

అదొక ఆణిముత్యం..! 

ఆహా !ఏమీ సంగీతం..?

అది ఒక గంగాప్రవాహం..!

ఆహా ఏమీ ఆ దివ్యసందేశం...?

అది కుల మతాలకు సమాధి..

అది నవసమాజానికి పునాది...

ఆహా ఏమి సాహసం..?

అంధవిశ్వాసుల కళ్ళు తెరిపించేలా...  

మతచాంధస్సులకు కనువిప్పుకలిగించేలా..

విమర్శకులతో సైతం ప్రశంసలు పొందేలా...


ఆహా ఏమి ముందుచూపు..?

ప్రశంసలవర్షం కురిసేలా...

ప్రపంచమంతా పరవశించేలా... 

తెలుగువారంతా తలెత్తుకు తిరిగేలా... 

వెండితెర సాక్షిగా...సాక్షాత్తు 

ఆ ఈశ్వరుడే.....ఆ పరమేశ్వరుడే... 

ఆ శ్రీనివాసుడే...ఆ శ్రీకృష్ణ భగవానుడే...


కళాతపస్వి...

వెండితెర వేల్పు...

బహుముఖ ప్రజ్ఞాశాలి...

మన తెలుగుజాతి జ్యోతియైన...

ఈ కాశీవిశ్వనాధుడి రూపంలో...

ఆ దివినుండి...భువికి దిగివచ్చి...


సామాజిక సమస్యలే ఇతివృత్తంగా...

వెండితెర నటులచే...కళాకారులచే ...

తరతరాలుగా ఈ మానవసమాజంలోని... 

వైషమ్యాలకు తారతమ్యాలకు వ్యతిరేకంగా


మనుషులంతా ఒక్కటేనని... 

మనందరి"కులం మానవకులమని"...

మనమంతా ఆ పరమాత్మ బిడ్డలమని...

కులమతాల అడ్డుగోడల్ని కూల్చివేయాలని

కులమనే విషవృక్షాన్ని కూకటివేళ్ళతో సహా 

పెకలించివేయాలని...కూల్చికాల్చివేయాలని


అందరి ఆశ...శ్వాస...ఒకటేనని... 

అదే మంచితనం...మానవత్వమని...

అదే సమానత్వం...సౌభ్రాతృత్వమని... 

అందరూ సోదరభావంతో కలిసిమెలిసి 

హాయిగా...ప్రశాంతంగా...జీవించాలని... 

 

సామాజిక రుగ్మతలను 

తక్షణమే సమాధి చేయాలని... 

ప్రజాస్వామ్య పునాధులపై 

నవసమాజాన్ని నిర్మించాలని

కులరక్కసిపై విసిరిన ఓ రామబాణం 

కళాతపస్వి విశ్వనాథ్"సప్తపది" చిత్రం...

అద్వితీయంగా...చెక్కిన ఓ అమరశిల్పం...  

అపురూపంగా తీర్చిదిద్దిన ఓ కళాఖండం...

అజరామరమైన అభ్యుదయ సందేశాన్ని

విశ్వానికి అందించిన ఓ అమృతభాండం...


అందుకే...92వ

ఏట కన్నుమూసిన 

ఈ విశ్వంభరునికి...‌

ఈ విశ్వనాథుడికి...

ఈ అభినవ ఆదిశంకరునికి...

ఈ కళామతల్లి ముద్దుబిడ్డకి...

ఈ ఖాకీదుస్తుల కళాతపస్వికి...

ఈ విశ్వనరుని విశ్వరూపానికి...

తెలుగుజాతి మొత్తం...

చేతులు జోడించి...శిరస్సులు వంచి

పాదారవిందాలకు ప్రణమిల్లాలి...అదే

ఆ"దర్శక దిగ్గజానికి"అశృనయనాలతో 

మనం అర్పించే...ఘనమైన...నిజనివాళి


27. అన్న పోలన్న సుభాషితం..!

      విన్న మీకు శుభోదయం...!!


ధనమున్నచో నీవు 

ఘనమైన దైవంరా..!

శూన్యమైనచో నీవు

శునకం కన్నా హీనంరా..! 


"డబ్బు డబ్బు డబ్బు  

ఇదేరా ఈ మనిషికున్న జబ్బు"..!

అన్న పోలన్న సుభాషితం..!

విన్న మీకు శుభోదయం...!!


పైసా పైసా కూడబెట్టి  

పొదుపు చేయుమురా..! 

అర్థంలేని ఖర్చులుంటే 

అదుపు చేయుమురా..!


"ఈ ఆర్థిక సూత్రమెరిగినవాడేరా 

అందరికి దేవుడు ఆపద్భాంధవుడు"..!

అన్న పోలన్న సుభాషితం..!

విన్న మీకు శుభోదయం...!!


కాసింతైనా ముందుచూపులేక మీ

తాతముత్తాతలు మీ అమ్మానాన్నలు 

కూడబెట్టిన ధనమంతా  

కూర్చుని తింటూ...ఉంటే...


మీ కళ్ళముందరే

కోట్లైనా తరిగిపోయేనురా..!

కొండలైనా కరిగిపోయేనురా..!

అన్న పోలన్న సుభాషితం..!

విన్న మీకు శుభోదయం...!!


28. మేరా భారత్ మహాన్..?


ఓ నా ప్రియ మిత్రులారా...! 

మీ అందరికిదే నా "సద్భావన సందేశం" 


కులం ఒక గజ్జి కుక్కైతే...తిరగనివ్వకు

మతం ఒక పిచ్చిమొక్కైతే...పెరగనివ్వకు

నిన్న మతం ఒక మత్తుమందు

నేడు ఆ పేరు ఎత్తితేనే రక్తం చిందు


ఎవరు ముస్లిం...?ఎవరు హిందువు...? 

ఎవరు క్రిష్టియన్...?ఎవరు సిక్కు...?

ఈ నేలపై స్వేచ్ఛగా జీవించడం

కాదా ప్రతి ఒక్కరి జన్మ హక్కు... 


రాముడు కోరునా..? రక్తాభిషేకం...లేదే

అల్లా కోరునా..? అల్లకల్లోలం...లేదే

క్రీస్తు కోరునా..? కిరాతకం...లేదే 

మీరెందుకు...? 

కులంపేర  ఈ కుమ్ములాటలు...

మతంపేర ఈ మారణహోమాలు...

మనమంతా కన్నతల్లి 

భారతమాత...ముద్దుబిడ్డలం

మనందరిలో ప్రవహించాలి

భిన్నత్వంలో ఏకత్వం...


నేడు మనందరి నినాదం ఒక్కటే...

సమైక్యతే...సర్వమతాల ఐక్యతే...

మానవత్వమే...మతసామరస్యమే...

హిందూ ముస్లిం భాయి భాయి...

కలుపుదాం అందరం చేయి చేయి....

ఆ మధుర భావనే ఎంత హాయి... 

ఎంత హాయి...

సద్భావన...సమానత్వం...

సౌభ్రాతృత్వమే

మన ఊపిరైతే...అవనిపై 

నా భరతభూమి స్వర్గసీమేనోయ్...


మేరా భారత్ మహాన్...

మేరా భారత్ మహాన్... 

జైహింద్...జై భారత్...


29. మేరా భారత్ మహాన్... 


జనగణమన...

వందేమాతరం...

జైజవాన్ జైకిసాన్...

సారే జహాసె అచ్చా ...

మేరా భారత్ మహాన్...

ఇంక్విలాబ్ జిందాబాద్....

అన్న నిప్పులాంటి నినాదాలే 

నిత్యం మన గుండెచప్పుళ్ళైతే...

మనలో జాతీయత...హహ

ఆత్మీయత...నిజమైన దేశభక్తి...

సద్భావన స్ఫూర్తి...

నిండుగా ప్రవహిస్తున్నట్లే..!


ఆరని జ్యోతులైన...

అమరవీరులైన 

స్వాతంత్ర్య 

సమరయోధులను...

దేశభక్తులను....

జాతినేతలు..

స్పూర్తిప్రదాతలైన

రాజ్యాంగ నిర్మాత 

బాబా సాహెబ్ అంబేద్కర్ 

జాతిపిత గాంధీ...నెహ్రూ... 

సుభాష్ చంద్రబోస్ లను...

నిత్యం స్మరించుకుంటూవుంటే...

వారి ఆశయాలకంకితమైతే...

మన రక్తంలో సమతా...మమతలు...

నిజమైన దేశభక్తి...

సద్భావన స్ఫూర్తి...

నిండుగా ప్రవహిస్తున్నట్లే..!


ఈ దేశం నాకేమిచ్చిందని 

చీకటిలో కూర్చొని చింతించక 

ఈ దేశాభ్యుదయానికి నేనేమి చేశానని

 క్షణమాలోచించమన్న నిస్వార్థపరులైన 

స్వాతంత్ర్య సమరయోధుల 

సంఘసంస్కర్తల శుభసందేశాలను 

కలనైనా మరవకపోతే...

మన రక్తంలో నీతి..

నిజాయితీ...

నిజమైన దేశభక్తి...

సద్భావన స్ఫూర్తి...

నిండుగా ప్రవహిస్తున్నట్లే..!


మట్టి నుండే మెతుకులు పుట్టించే 

మట్టిమనిషి రైతన్న నోట్లో 

నూతన సాగుచట్టాలతో 

మట్టికొట్టకపోతే...

మన పాలకుల్లో మంచితనం...

మానవత్వం

నిజమైన దేశభక్తి...

సద్భావన స్ఫూర్తి...

నిండుగా ప్రవహిస్తున్నట్లే..!


కులం కుళ్ళని...

మతం ముళ్ళని గ్రహించి

కులం రొచ్చులో కూరుకుపోక 

మతంమత్తులో ఉన్మత్తులై 

మతం చిచ్చు రగిలించకపోతే...

మారణహోమాలు సృష్టించకపోతే...

మన రక్తంలో సహనం... 

సమానత్వం సౌభ్రాతృత్వం 

నిజమైన దేశభక్తి.....

సద్భావన స్ఫూర్తి...షషష

నిండుగా ప్రవహిస్తున్నట్లే..!


30. మనశ్శాంతికి మందిరాలు..!


స్వర్ణ భాండాగారాలు... 

స్వర్గానికి సింహద్వారాలు... 

సిరులకు నిలయాలు...

"మనశ్శాంతికి మందిరాలు"...

ప్రగతికి కళ్ళురా లోగిళ్ళురా... 

ఒకనాటి పచ్చని మన పల్లెటూళ్ళు 


కానీ నేడు

పట్టపగలే 

బాంబు దాడులు...

కళ్ళముందే కత్తిపోట్లు...

పోలీసుల పైరింగులు...

"ఎటుచూసినా ఎన్కౌంటర్లు"...

నిత్యం నరకంరా...

పచ్చినెత్తురుపారే నేటి మన పల్లెటూర్లు 


31. పునర్జన్మ...?


ఓ నేస్తమా..!

నా అభయహస్తమా..!

మళ్ళీ నీకు పునర్జన్మంటూ ఉంటే 

నీవు పూలమొక్కగానో

ముళ్లచెట్టుగానో కాక 

పళ్ళచెట్టుగా పుట్టాలనుకో..!


ఓ నేస్తమా..!

నా అభయహస్తమా..!

మళ్ళీ నీకు మరుజన్మంటూ ఉంటే 

నీవు కాటిలో కాకిగానో 

బావిలో కప్పగానో కాక

కొమ్మల్లో కోయిలవై పుట్టాలనుకో..!


ఓ నేస్తమా..!

నా అభయహస్తమా..!

మళ్ళీ నీకు మరుజన్మంటూ ఉంటే 

నీవు అగ్గిపుల్లగా పుట్టి 

అడవిని దహించాలనుకోకు...

అరుణోదయ కిరణమై వెలిగి 

అంధకారాన్ని తొలిగించాలనుకో..!

ఆడపిల్లగా పుట్టి

ఆదిపరాశక్తివై అవనిని ఏలాలనుకో..!


32. మాయమౌతున్నాడు మనిషన్నవాడు.


నిన్న మనిషి...

సమానత్వానికి...సద్బుద్ధికి...

సద్దర్మానికి...సద్భావనకు...సహనానికి...

"సంస్కారానికి ఓ సంతకం"

కానీ...నేడు కుసంస్కారకుబుసం

తొడుక్కున్న "క్రూరమైన కులసర్పం"

ఔను"మనిషన్నవాడు మాయమౌతున్నాడు"

"మానవ మృగంగా" మారిపోతున్నాడు


నిన్న మనిషి...

నీతికి నిజాయితీకి...

నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనం...కానీ 

నేడు స్వార్థమే...జీవితపరమార్థమంటూ

"అవినీతి ఊబిలో" కూరుకుపోయి 

"బావిలో కప్పలా" బ్రతుకుతున్నాడు

ఔను"మనిషన్నవాడు మాయమౌతున్నాడు"

ఎందుకో "మరుగుజ్జుగా" మారిపోతున్నాడు


నిన్నమనిషి... సర్వమతాలొక్కటన్న"సంస్కారి"... 

నేడు"కులం కుంపట్లను"రాజేస్తున్నాడు

మతం పేర"మారణహోమం"సృష్టిస్తున్నాడు

ఔను"మనిషన్నవాడు మాయమౌతున్నాడు"

"ఉన్మాదిగా ఉగ్రవాదిగా"మారిపోతున్నాడు


నిన్న మనిషి...

మంచితనానికి...మానవత్వానికి

"పచ్చనిప్రేమకు ప్రతిరూపం" 

నేడు అసూయాద్వేషాలకు

నిలయమైన "ఆత్మబంధువు"

పగప్రతీకారాలతో రగిలిపోతున్న"రాబందువు" ఔను 

"మనిషన్నవాడు మాయమౌతున్నాడు "

"మచ్చలపులిగా"మారిపోతున్నాడు"

"మానవత్వం"పరిమళిస్తే మనిషే కదా దైవం


33. ఈ జీవితం...చిత్రవిచిత్రం...!


ఈ మానవ 

మనుగడలో 

...3 ప్రధాన 

ఘట్టాలు...

జననం... 

"జీవనం"... 

మరణం...


ఈ జీవితంలో 

ముఖ్యమైనవి 

3 దశలు...

బాల్యం...

"యవ్వనం"...

వృద్ధాప్యం... 


ఈ జీవనంలో 

మరిచిపోలేనివి 

...3 మజిలీలు...

వివాహం...

సంసారం...

విడాకులు...


ఈ నవయవ్వనంలో 

...3 ప్రధాన ఘట్టాలు... 

నిశ్చితార్థం...

పెళ్ళి...

శోభనం...


మామిడితోరణాలు ...

మంగళవాద్యాలు...

మూడుముళ్లు...

ఏడడుగులు...


ఆపై 

ఎన్నో ఏళ్ళుగా 

కలలు గన్న 

ఆ శోభనం 

గది నదిలో 

శృంగారయాత్ర...

సంతానం...

సంసారం...

సహజీవనం...


అంబరాన్నంటే 

సంతోషాలు... 

సంబరాలు...

ఆపై 

అనుమానాలు... 

అపార్థాలు... 

పగా ప్రతీకారాలు... 

ఒకరిపై ఒకరు విషం 

చిమ్ముకోవడాలు... 

విడిపోవడాలు...


ఇదే జీవితమంటే..అది 

ఎంతటి చిత్రవిచిత్రమో...

అనుభవిస్తేనే కదా తెలిసేది... 

ఏ నదైనా దిగితేనేగా లోతు తెలిసేది...


34. ఊబకాయం ఊబిలో...


ఊబకాయమంటే ఒక ఊబి...

ఊహిస్తే గుండెల్లో గుబులు రేగు...

ఊపిరి ఉరికంభం మీద ఊరేగు...


అదిఅందరికీ 

తెలిసిన సత్యమే...

ఆలస్యం విషమని...

ఆరోగ్యం అమృతమని...

అనారోగ్యం విషతుల్యమని...


ఏకాగ్రతతో... 

క్రమశిక్షణతో... 

క్రమపద్ధతిలో...

నవ్వుతూ నడవాలి...

పట్టుదలతో ప్రణాళికతో

యోగ...వ్యాయామము... 

ధ్యానం...నిత్యం చేయాలి...

ప్రతిమనిషి జీవితం ఓ

సుందర నందనవనం కావాలి...

లేకున్నా ఈ మానవ దేహం 

అంతులేని మొండివ్యాధుల 

నరకకూపమే ఇది నగ్నసత్యమే...

 

ఆరోగ్యం మహా భాగ్యమే...

ఆరోగ్యమంటే సౌభాగ్యమే... 

అంతులేని సంతోషసాగరమే...

ఉంటే అంబరాన్నంటే సంబరమే...


ఎన్ని కోట్లు ఆర్జించిననేమి ?

ఎంత ఆస్తి ఉన్ననేమి ? లేకున్న 

మనిషికి సంపూర్ణఆరోగ్యమే... 

"ప్రశాంతత"జీవితంలో శూన్యమే...

అంతా"అగమ్యగోచరమే"...అంధకారమే...


35. నయవంచకులుంటారు 

       జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త...?


కుట్రలతో ...

కుతంత్రాలతో...

కుయుక్తులతో...


మత్తు కళ్ళతో...

మాయమాటలతో...

కుళ్ళు జోకులతో...

వెకిలి నవ్వులతో...


నక్కవినయాలతో... 

కక్కినదానికాశపడే

కుక్క బుద్దులతో...

తప్పుడు తలంపులతో...

అమాయకపు చేష్టలతో...


బలహీనుల్ని...

అమాయకుల్ని...

వెంటపడి వేధిస్తారు...

వేటగాల్ళై వేటాడుతారు...


ఆటబొమ్మల్లా

ఆడుకుంటారు...

వాడుకుంటారు...

అదను చూస్తారు...

వలలు విసురుతారు...


ముసుగులో మురిపిస్తారు... 

మంచితనాన్ని కురిపిస్తారు...

అరచేతిలో స్వర్గం చూపిస్తారు... 

నమ్మితే...నట్టేట ముంచేస్తారు....


ఆపద్బాంధవుల్లా 

అవతారమెత్తి 

తామే దైవాలమన్న 

భ్రమను కల్పిస్తారు... 


అందుకే... 

జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త...

ఈ మేకవన్య పులులతో...

ఈ తేనె పూసిన కత్తులతో...ఢ

నవ్వుతూ నవ్వుతూ 

లోతుగా గోతులు తీసే

ఈ గోముఖవ్యాఘ్రాలతో...

నట్టేటముంచే ఈ నయవంచకులతో...


36. ఆత్మ జ్ఞాని...?


ఇరుగుపొరుగుతో 

కుటుంబ సభ్యులతో 

"ఉండే" అనుబంధాలే...

"శాంతి సామరస్యమే"... 

"చూపే సానుభూతే... 

సద్భుద్ధితో...

సహనంతో...

సమభావంతో... 

"ఇచ్చిపుచ్చుకునే

"సహకారమేగా"

"సత్సంబంధాల"... 

"చిదంబర రహస్యం"


బాధ్యతాయుతమైన 

ప్రవర్తన కలిగిన వాడే... 

వసుదైక కుటుంబాన్ని 

"కోరుకున్న మనిషేగా"...

"సంఘసంస్కర్త"

ఈ సమాజంలో

"సంస్కారానికి సంతకం " 


శాంతి...

సామరస్యం 

ధర్మాచరణ...

సత్యాన్వేషణ...

 

ఆత్మవిద్య...

ఆత్మజ్ఞానం...

ఆత్మ సాక్షాత్కారం 


అవే మనిషికి 

"ప్రాణవాయువులు"...

"అవి సాధించిన మనిషే"గా...

అవని యందు "

"ఆత్మజ్ఞాని...

"ఆదర్శప్రాయుడు"...

"అందరికి ఆత్మ బంధువు"...

"ఆ పరమాత్మకు ప్రతిరూపం"...


37. పిచ్చి ప్రేమంటే...? 


బెదురు జింకలా

...బిత్తర చూపులు

కాలుగాలిన పిల్లిలా 

...తత్తరపాటు నడక

పలికే మాటల్లో

...పొరబాటు తడబాటు 

చెప్పే సమాధానాల్లో

...చీరాకు...పరాకు 

ఈ వింత విచిత్ర వికృత 

కృత్యాలకు బీజమెక్కడ ?

ఏదోతప్పు చేయాలన్న...

తప్పటడుగు వేయాలన్న... 

ఒక దుష్టచింతన 

చిత్తంలో కొత్తగా జనియించడమే...


ఎన్ని "పిచ్చిపిచ్చి" ప్రశ్నల్ని 

ఎంత "గుచ్చిగుచ్చి" అడిగినా 

ఖచ్చితమైన సమాధానం 

రానిదే...లేనిదే..."పిచ్చి ప్రేమంటే"...? 


"పిచ్చి ప్రేమంటే"... 

రెచ్చిపోవడం చచ్చిపోవడం...

కాదు...చచ్చిసాధించేది

ఏమీలేదని తెలుసుకోవడమే...


రేయింబవళ్లు

పిచ్చికోరికలతో రెచ్చిపోతూ... 

సిగ్గులజ్జా లేకుండగ 

లేదుఎవరి కంట పడకుండగ

పార్కుపొదల్లో పంటకాలువల్లో... 

రాతృల్లో...రహదారుల్లో....

త్రీస్టార్ హోటల్లో తిరుగుతూ

మత్తులై ఉన్మత్తులై...

పబ్బుల్లో క్లబ్బులో చిందులువేస్తూ

విచ్చలవిడిగా విలాసవంతంగా  

బరితెగించి తిరిగే భగ్నప్రేమికుల

ఊహల్లో పుట్టి ఆకర్షణఆజ్యంతో 

భగ్గున"మండే...ఆరక రగిలే"... 

"ఒక అగ్నిగుండమే"పిచ్చి ప్రేమంటే"...


పిచ్చి ప్రేమంటే... 

ఒకరిలో ఒకరు సగభాగమే...

మనసు మనసు 

ఏకమైతే ఒక లోకమైతే...

మమతల సరాగమే..

తనువుల తాండవమే...

వివాహమైతే...వైభోగమే....

విఫలమైతే...విషాదమే...

ప్రేమకోసం ప్రాణాలనర్పిస్తే

త్యజిస్తే అది ఒక త్యాగమే....

అమరప్రేమకు ప్రతిరూపమే...


38. ఉగ్రవాదం ...ఉక్కుపాదం


నిన్న...

జీహాద్ పేర జీవహింసలు

మొన్న... 

రధయాత్ర పేర రక్తపాతాలు

నేడు... 

మతబోధ పేర‌ మతమార్పిడులు


శాంతి శాంతి అంటూనే

సమరానికి సై అంటారా ?

"నిన్నువలె నీ పొరుగువారిని 

ప్రేమించాలంటూనే"...

అన్యం పుణ్యం ఎరుగని

అమాయకుల ప్రాణాలు తీస్తారా  ?

పవిత్రయుద్దం పేర ప్రజలతలల్ని

నరరూపరాక్షసుల్లా 

నడిరోడ్డులో నరికేస్తారా?


ఇది అత్యాధునిక అణ్వాయుధాలున్న

అగ్రరాజ్యాల అహంకారమే కదా!

చిన్ని చిన్ని దేశాల దురాక్రమణతో

చిత్రహింసలకు గురై కూడుగూడులేక

ప్రజలు పక్షుల్లా చెల్లాచెదురైపోతుంటే...


పాలునీళ్ళు ప్రవహించే చోట

రాక్షసత్వం రాజ్యమేలుతోందా !

రక్తదాహం తీరకుందా !

నరుల రక్తం ఏరులైపారేది

ఏకఛత్రాధిపత్యం కోసమేనా ?

ఇదెక్కడి నీతి ? ఇదెక్కడి ధర్మం ?

ఇక శాంతి ఎక్కడ? 

ప్రజల కళ్ళల్లో కాంతి ఎక్కడ?

ప్రేమ భ్రమయేనా? శాంతి భ్రాంతియేనా?


ఔను మతోన్మాదమైతే మరో "ఉగ్రవాదం" 

ఉపేక్షించక మోపాలి దానిపై"ఉక్కుపాదం"


39. ఆరుఅక్షరాల శిలువశిక్ష? 


తరతరాలుగా... 

దగాపడ్డ ఓ దళితులారా !

కులరక్కసికి బలైపోయిన 

ఓ బహుజన బిడ్డలారా.!..

నిద్రమేల్కొని ఇకనైనా

నిజం తెలుసుకోండి ! ఈ

కంప్యూటర్ యుగంలోనైనా 

కళ్ళు తెరుచుకోండి !


నాడు...నాగదేవతలంటూ పుట్టలోని 

పాములకు పూజలు చేశారు...కానీ 

నడివీధిలో నీవారిని నడువనివ్వలేదన్న

ఓ నగ్నసత్యాన్ని తెలుసుకోండి !


నాడు...కాలభైరవుడంటూ 

కనిపించిన శునకాలకు మొక్కారు

కానీ...చెరువుగట్టుకు 

నీవారిని చేరనియ్యలేదన్న

ఓ పచ్చినిజాన్ని తెలుసుకోండి !


నాడు...గోమాతలు దేవతలన్నారు

వాటి మలమూత్రాలు 

పరమ పవిత్రమన్నారు...కానీ 

కులగోత్రాల పేర నీవారిని 

కుక్కలకన్నా హీనంగా చూశారన్న

ఓ పచ్చినిజాన్ని తెలుసుకోండి !


నాడు...కోతుల్ని కొండముచ్చుల్ని

గుడ్లగూబల్ని గబ్బిలాలను

గుళ్ళలోనికి రానిచ్చారు...కానీ 

ఆలయాల్లోకి నీవారిని 

అడుగుపెట్టనివ్వలేదన్న

ఓ పచ్చినిజం తెలుసుకోండి !


ఈ అసమానతలకు ఈ అణచివేతలకు

అసలు కారణం అజ్ఞానమా ? కాదు

ఆర్థికంగా చితికి పోవడమా ? కాదు

అందుకు,కారణం" అంటరానితనం"!


ఔను ఆరుఅక్షరాల ఈ శిలువశిక్షకు గురై

అగ్రవర్ణాల ఆగ్రహానికి...అజ్ఞానానికి 

అంధవిశ్వాసాలకు బలై...

కులరక్కసి కోరల్లో చిక్కిన...నీ 

"తాతముత్తాతలతరం"ముగిసింది ! 

ఊరికి దూరంగా ఉత్తరాన !


అందుకే...తరతరాలుగా 

దగాపడ్డ ఓ దళితులారా!

కులం రక్కసికి బలైపోయిన 

ఓ బహుజన బిడ్డలారా.!..

నిద్రమేల్కొని ఇకనైనా 

నిజం తెలుసుకోండి ! ఈ

కంప్యూటర్ యుగంలోనైనా 

కళ్ళు తెరుచుకోండి ! 

"పూరిగుడిసెలో పుట్టిన 

పులులు" మీరని తెలుసుకోండి ! 

ప్రతిదీ ప్రశ్నించండి...ప్రతిఘటించండి ! 

సింహాలై...గర్జించండి సమిష్టిగా పోరాడండి!

రక్తార్పణచేసైనా రాజ్యాధికారం సాధించండి  


40. సంస్కారానికి సంతకం...


నిన్న మనిషి...సమానత్వానికి

సద్బుద్ధికి...సద్దర్మానికి...సద్భావనకు...

సహనానికి..."సంస్కారానికి ఓ సంతకం"

కానీ...నేడు కుసంస్కారకుబుసం

తొడుక్కున్న "కౄరమైన కులసర్పం"

ఔను మనిషన్నవాడు మాయమౌతున్నాడు

"మానవ మృగంగా" మారిపోతున్నాడు


నిన్న మనిషి...నీతికి నిజాయితీకి 

నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనం...కానీ 

నేడు స్వార్థమే...జీవితపరమార్థమంటూ

"అవినీతి ఊబిలో" కూరుకుపోయి 

"బావిలో కప్పలా" బ్రతుకుతున్నాడు

ఔను మనిషన్నవాడు మాయమౌతున్నాడు

ఎందుకో "మరుగుజ్జుగా" మారిపోతున్నాడు


నిన్న మనిషి...సర్వేశ్వరుడొక్కన్న

 సర్వమతాలొక్కటన్న"సంస్కారి"...కానీ 

నేడు"కులం కుంపట్లను"రాజేస్తున్నాడు

మతం పేర"మారణహోమం"సృష్టిస్తున్నాడు

ఔను మనిషన్నవాడు మాయమౌతున్నాడు

"ఉన్మాదిగా ఉగ్రవాదిగా"మారిపోతున్నాడు


నిన్న మనిషి...మంచితనానికి...

మానవత్వానికి"పచ్చనిప్రేమకు ప్రతిరూపం" 

నేడు అసూయాద్వేషాలకు"ఆత్మబంధువు"

పగాప్రతీకారాలతో రగిలిపోతున్న"రాబందు" 

ఔను మనన్నవాడు మాయమౌతున్నాడు

 "మచ్చలపులిగా"మారిపోతున్నాడు"

మానవత్వం"పరిమళిస్తే మనిషే కదా దైవం


41. ఇక నీవే తేల్చుకో...!


మిత్రమా..!

ఓ నా ప్రియ నేస్తమా..!

నీవే జననేతవై... 

ఆశలు రేపుతావో...

అభాగ్యుల 

ఆకలి తీరుస్తావో...

...నీవే తేల్చుకో...

 

నీవే సేవకుడవై...

కూడు గూడు 

యాసిస్తావో... 

యజమానివై... 

శాసిస్తావో...

...నీవే తేల్చుకో...


నీవే విద్యలేక

అజ్ఞానాంధకారంలో

అలమటిస్తావో...

విజ్ఞానజ్యోతివై

వెలుగులు

విరజిమ్ముతావో... 

విశ్వవిజేతవై

విశ్వాన్ని ఏలుతావో...

...నీవే తేల్చుకో... 


నీవు సోమరివై... 

నలుగురిలో 

నవ్వుల పాలౌతావో...

నిరాశలో


నీవు కొడవలివైతే...?


నీవు కొడవలివైతే... 

పంటను కోస్తావో... 

గొంతులు కోస్తావో...

...నీవే తేల్చుకో...


నీవు కత్తిపీటవైతే...

కూరగాయలు 

తరుగుతావో...

పీకలే కత్తిరిస్తావో...

...నీవే తేల్చుకో...

 

నీవు గొడ్డలివైతే... 

చెట్లను నరుకుతావో...  

గుండెల్ని చీలుస్తావో...

...నీవే తేల్చుకో...


42. ఎంతటి యాదృచ్ఛికం..!!!


భారతీయ 

చలనచిత్ర చరిత్రలో

అజరామరమైన 

అపురూప చిత్రాలకు జీవంపోసి... 

తెలుగు సినిమాకు 

ఖండాంతర ఖ్యాతి నార్జించి... 


ప్రతిష్టాత్మకమైన...పద్మశ్రీ...

దాదా సాహెబ్ ఫాల్కే...

రఘుపతి వెంకయ్య నాయుడు ...

అవార్డుల గ్రహీత...

 

ఖాకీదుస్తుల కళాతపస్వి 

విశ్వనాథ్...దర్శకత్వంలో


43 సంవత్సరాల క్రితం

బాక్సాఫీస్ రికార్డులను

బ్రద్దలుకొట్టిన

బ్లాక్ బస్టర్ చిత్రం

"శంకరాభరణం" విడుదలైన శుభదినం..........

1980 ఫిబ్రవరి 2

ఈ విశ్వవిఖ్యాత "దర్శకదిగ్గజం"

దివికేగిన దినం...

2023 ఫిబ్రవరి 2 

ఔరా! ఎంతటి యాదృచ్ఛికం..!!!


43. అమృతం కన్న అమ్మ ప్రేమే మిన్న..!


నాకు దాహం వేస్తుంది...!

అది నన్ను దావాలనంలా

నిత్యం దహించి వేస్తుంది


నాడు నేను అమ్మగర్భాన్ని 

చీల్చుకున్ననాడు అమ్మ ఒడిలో 

వొరిగిననాడు పెరిగిననాడు

ఉగ్గుపాల కోసం ఊయల్లో ఊగేవేళ 

"కమ్మనైన అమ్మపాలు"త్రాగాను...కానీ


అమ్మపాలకోసం...నే ఆశపడిననాడు

నాకు "చిక్కని ఆవుపాలు" దొరికాయి

నేను ఆవుపాలకోసం ఆశపడితే...

నాకు వేడివేడి "తాజ్ మహల్ టీ" దొరికింది


నేను వేడివేడి తాజ్ మహల్ టీ కోసం

పరుగులు పెట్టిననాడు....

నాకు"తాజా యాపిల్ జ్యూస్" దొరికింది

నేను తాజా యాపిల్ జ్యూస్ కి ఆశపడితే...

నాకు "ఖరీదైన బ్రాండెడ్ విస్కీ"దొరికింది


అలా అలా ఫారిన్ బ్రాండ్ కు బానిసనై

బార్ లో మందు కొట్టి కొట్టి బోర్ కొట్టి 

అడవిలో ఆకలిగొన్న చిరుతపులిలా

రౌడీనై రాక్షసుడనై మనుషుల

"రక్తపు చుక్కలకు రుచి"మరిగాను

ఆ ఎర్రనిబ్రాందీ త్రాగిన నాకు

"అమృతపు చుక్కల మీద ఆశ" కలిగింది


ఆ అమృతపుధారల కోసం

సప్తసముద్రాలను దాటాను

కొండాకోనల్లో ఎండావానల్లో

తిరిగాను ఎడారుల్లో వెతికాను

ఎక్కడా దొరకలేదు కానీ

ఒక ఆచూకి మాత్రం దొరికింది


అదే "అమ్మే ఒక దేవతని"...

ఆ "అమ్మ ప్రేమే అమృతమని"...

ప్రేమించే అమ్మను పూజించమని...

ఆ ప్రేమామయి పంచే 

"ప్రేమామృతాన్ని" త్రాగి తరించమని....


44. నరుడే...నారాయణుడు..! 


ఎరుపెక్కిన "సూర్యుడు" 

ఎవరెస్ట్ శిఖరం... 

"ఎక్కుతున్నాడు"...ఎందుకు..?

కొండగుహలే గృహాలుగా 

బ్రతికే అడవిబిడ్డల బ్రతుకుల్లో 

అంధకారాన్ని తొలగించేందుకు...


చల్లని తెల్లని...  

"చందమామ" నల్లని మబ్బుల్లో

"నక్కుతున్నాడు"...ఎందుకు..?

చీకటిలో...చిలిపి చేష్టలతో 

కొంటెకోరికలతో తరగనితాపంతో 

రగిలిపోయే భగ్న ప్రేమికులు 

రతిరాగాలు ఆలపించేందుకు...


శిథిలమైన 

శిలలను శిల్పి ఉలితో  

సుందర దేవతాశిల్పాలుగా

"చెక్కుతున్నాడు"...ఎందుకు..?

తన ఆలుబిడ్డల ఆకలి తీరేందుకు...

గర్భగుడిలోని దైవానికి... 

అర్చనలు అభిషేకాలు జరిగేందుకు... 


భక్తాగ్రేసరుడొకడు

కనిపించే ప్రతిమనిషికి 

"మ్రొక్కుతున్నాడు"...ఎందుకు..?

నరుడే నారాయణుడన్న 

నగ్నసత్యం తెలిసినందుకు...  

తనకు ముందు జన్మలోనైనా  

ముక్తిని ప్రసాదించేందుకు...


45. (‍అ...ఆలు)

అక్రమసంబంధాలు...ఆత్మహత్యలు...


సక్రమమైన ప్రవర్తనలేని

అక్రమ సంబంధాలన్నీ 

ఎంతటి వికృతమైనవో

ఊహాతీతం...

అత్యంత అమానుషం...


కొందరు విచిత్రంగా

పెళ్ళైన తర్వాత 

పిల్లల్ని కనిన తర్వాత

భర్తలే ప్రత్యక్ష దైవాలంటారు

నిత్యంపూజలు చేస్తుంటారు


కాని,మాయమాటలతో

మత్తెక్కించే మాయగాళ్ళను

కమ్మని కబుర్లు చెప్పి

కవ్వించే కసాయివాళ్ళను


కాల్చిన సిగరెట్టును 

కాలిక్రిందేసి నలిపేసే 

నయవంచకులను

ఏరుదాటి తెప్పతగలేసే

వాడుకొని వదిలేసే 

కళ్ళు పొరలు కమ్మిన

కామాంధులనే నమ్ముతారు

చచ్చేంతగా...ప్రాణాలిచ్చేంతగా...


ఆపై కన్నవారి 

కట్టుకున్నవారి

కళ్ళుగప్పి ప్రేమికుల చుట్టే

బరితెగించి తిరుగుతారు...

వారి మాయలో...మత్తులోపడి

వారి చేతుల్లో కీలుబొమ్మలై...

వారు ఆడించినట్లు ఆడతారు...

వారు అడగకుండానే అన్నీ ఇచ్చేస్తారు...


ఆకలి తీరిన తర్వాత

ఎంగిలి ఇస్తరాకల్లే వీధిలో

విసిరేస్తే... చేసేదిలేక...

ఎవరికీ చెప్పుకోలేక...

అవమానాలను భరించలేక...


పుట్టిన పిల్లల 

బంగారు భవిష్యత్తు

బుగ్గిపాలవుతుందని...కానీ

ఆధారపడిన వారందరూ

అనాధలౌతారని...కానీ

రెండు కుటుంబాల

పరువువంతా గంగలో

కలిసిందిపోతుందని...కానీ


ఒక క్షణమైనా, ఆలోచించక...

దిక్కుతోచక...క్షణికావేశంలో

ఏ నిద్రమాత్రలో మింగి.... 

ఏ ఫ్యానుకో ఉరేసుకొని...

ఏ బిల్డింగ్ పైనుండో దూకి... 


ఆత్మహత్య చేసుకుంటారు

ప్రాణాలు తీసుకుంటారు

అభం శుభం ఎరుగని

అన్యం పుణ్యం తెలియని

అమాయకపు "అమ్మలు" కొందరు.


ఔను...

చచ్చిసాధించే దేముంది ?

కన్నవారికి గుండెకోత తప్ప

విచిత్రమైన ఓ విధివ్రాత తప్ప 

చావు ఏసమస్యకు పరిష్కారం కాదన్న

ఓ నిండు నిజం తెలియకపోవడం తప్ప

బంగారమంటి బ్రతుకు బలైపోవడం తప్ప.


46. కాలమే కరుణిస్తే...?


నేడు... 

రేయింబవళ్లు

శ్రమించే స్వేదం

చిందించే సేవకులే..!

రేపటి...యజమానులు

కోట్లకు పడగలెత్తే కోటీశ్వరులు..!


నేటి.....చురుకైన బాలలే..!

రేపటి...భావిభారత నిర్మాతలు..! 


నేడు....కమ్మని కలలుకనే కన్యపిల్లలే..! 

రేపు....తన్మయత్వంలో మునిగే కన్నతల్లులు..! 

మాతృత్వాన్ని రుచిచూసే మాతృమూర్తులు!


నేటి....కొంటె కోడళ్లే..! 

రేపు...పెత్తనాన్ని 

చెలాయించే గడుసు అత్తలు..!

 

నేటి.....అమ్మనాన్నలే..! 

రేపటి...అవ్వతాతలు..! 

నేటి.....అవ్వతాతలే..! 

రేపటి...అనాధలు..‍.అస్థిపంజరాలు..! 


నేడు...సిగ్గుపడే పూలమొగ్గలే..! 

రేపు....నవ్వులు రువ్వే పువ్వులు..! 


నేడు...మట్టిలో రాలిన విత్తనాలే..! 

రేపు....ఆకాశాన్నంటే మర్రివృక్షాలు..!


నేడు...ముసిరే చీకటి రాత్రులే..!

రేపు....కురిసే పండువెన్నెలలు..!


నేడు....ఓర్పుతో సహించిన ఓటమే..! 

రేపటి...ఘనవిజయానికి సోపానం..! 


నేటి.....చింతలు చీకాకులే..!

రేపటి...చిరునవ్వుల చిరుగాలులు..!


నేటి.....ప్రయత్నాలే..! 

రేపటి...ప్రతిఫలాలు..! 

నేటి.....ప్రామాణికమైన ప్రణాళికలే..! 

రేపటి...అఖండవిజయానికి పునాదిరాళ్ళు! 


47. హెల్ మెట్ ఎందుకు..?


హెల్ మెట్

ఎందుకు ధరించాలి...?

..."తలకు ఎండ తగలకుండా"...

లేదు లేదు...అది గొడుగు కాదు...


గాలిలో తేలిపోతూ

వేగంగా అతివేగంగా 

మీరు నడిపే వాహనం

ఏ డివైడర్ నో ...

ఏ స్పీడ్ బ్రేకర్ నో...

వేగంగా వెళ్ళే మరో వెహికల్ నో...

ఢీకొట్టి..."తల పగిలిపోకుండా"...  

పెనుప్రమాదానికి మీరు గురికాకుండా...


కనులున్నాక........."కలలు" తప్పవు

కడలి అన్నాక........"అలలు" తప్పవు

కాపురమన్నాక......"కలతలు" తప్పవు 

సంసారమన్నాక...."సమస్యలు" తప్పవు

ప్రయాణమన్నాక..."ప్రమాదాలు" తప్పవు


అందుకే ఓ యువతా! 

బండి ఎక్కేముందు...

కిక్ రాడ్ తొక్కేముందు...

మీ బంగారు భవిష్యత్ ను 

బలితీసుకోకండి...తెలుసుకోండి...

హెల్ మెట్ మీ తలకు "రక్షణ కవచమని"...

అతివేగం..."మృత్యువుకు ఆహ్వానమని"...


యువతా ! ఓ యువతా ! 

జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త..!

హెల్ మెట్ ను తప్పక ధరించండి..!

మీరు"సురక్షితంగా ఇంటికి చేరుకోండి..! 


మీరు"ఇంటికి దీపమని"... 

"కంటికి వెలుగని"...మరువకండి..! 

"ఎదురు చూసేవారిని ఏడిపించకండి"..!

విలువైన మీ ప్రాణాలను కాపాడుకోండి..!


48. పాదాభివందనమయ్యా !

ఓ పట్టాభిరామయ్య !

జేజేలు ! మీకు ఓ జాతినేత !!


మీ ప్రతి పలుకు...తేనె లొలుకు

మీ ప్రతి ఆలోచనలో...అమృతం చిలుకు

అర్థశాస్త్రం...మీ అంగవస్త్రం 

ఆర్దికపరమైన...మీ తలపులు అపురూపం

సాహిత్యం...మీ సహధర్మచారిణి 

సాహిత్యరంగాన మీసేవలు చిరస్మరణీయం


దేశస్వాతంత్య్రమే...

మీ "సుందర స్వప్నమట"

అహింసావాది గాంధీజీకీ 

మీరే..."అంతరాత్మట"

ఆర్దిక స్వాతంత్య్రమే

మీ "అంతిమలక్ష్యమట"...

స్వాతంత్య్ర పోరాటంలో...మీ 

నిస్వార్ధ సేవలు..."నిరుపమానమట"


అందుకే...

పాదాభివందనమయ్యా !

ఓ పట్టాభిరామయ్య !

జేజేలు ! మీకు ఓ జాతినేత !!


నాడు విూరు మచిలీపట్నం

మట్టి నుండి పుట్టిన...ఓ మాణిక్యం

నేడు ఆంధ్రావనికే...ఓ ఆణిముత్యం


మొన్న మీరు కన్న మీ"కలల ప్రతిరూపాలు" 

నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా 

విస్తరించిన..."ఆర్థిక కల్పవృక్షాలు"...

నిన్నటి మీ..."ఆశయాల ప్రతిబింబాలు" 

రేపు ఆసియాఖండానికే"అమృతభాండాలు"


అందుకే...

పాదాభివందనమయ్యా !

ఓ పట్టాభిరామయ్య !

జేజేలు ! మీకు ఓ జాతినేత !!

 

ప్రజాసేవన్నది అరుదుగా 

చిక్కే బంగారు అవకాశమట...

ఆ భాగ్యం కల్పించిన వ్యక్తే 

సాక్షాత్తు భగవత్స్వరూపమట...

ఓ "మరోమహాత్మా" ! మీ జన్మ 

ఈ మానవ కళ్యాణం కోసమేనట...


ఓ ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకా!

మీ ఆశయాలు మీ ఆలోచనలు

కావాలి మా అందరికి ఆదర్శం...

ఓ అమరజీవి ! ఓ ఆదర్శమూర్తీ..!

దక్కాలి దక్కాలి మీకు అఖండకీర్తి..!

అప్పుడే...కదా ఆ చిత్రపటంలో 

చిరునగవులొలికే మీరు చిరంజీవులు.....

ఓ త్యాగశీలీ ! ఓ మా "ఆర్థిక దైవమా !"

మీ"స్మరణే"ప్రతిభారతీయుడికి "ఓ ప్రేరణ" 


అందుకే...

పాదాభివందనమయ్యా !

ఓ పట్టాభిరామయ్య ! 

జేజేలు ! మీకు ఓ జాతినేత !!

(ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంకులో 

మెర్జైపోయిన కారణంగా దాని వ్యవస్థాపకులైన 

శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని 

గుర్తు చేసుకుంటూ ఆంధ్రా బ్యాంక్ (రిటైర్డ్ )

ఉద్యోగిగా అర్పిస్తున్న నా అక్షరనీరాజనం...)


49. సంస్కారమా...నీవెక్కడ?


గుర్తుకు వస్తుంది...

చిన్న పాపను చూస్తే

'కన్నకూతురు"....


గుర్తుకు వస్తుంది....

మధ్యవయసు స్త్రీని చూస్తె 

"మాతృమూర్తి"...కాని 


గుర్తుకు రానిదిద్దరే

సొగసులొలికె పిల్లను చూస్తే

"సొంత చెల్లి అక్కా" 


అందుకు కారణం 

వయసు పెరిగినా

మనసు పెరగక పోవడం...

చదువెంతగా చదివినా

సంస్కారం లేకవడం... 

మనిషిలో మానవత్వం 

మంట కలిసిపోవడం... 


50. నాడే ! ఉగాది 

ఆనాడే శోభకృత్ ఉగాది !!


పచ్చని పంటలు పండిననాడు ! 

ఆకలి మంటలు ఆరిననాడు !!


అక్షర దీపాన్ని వెలిగించిననాడు !

అజ్ఞానాంధకారాన్ని తొలిగించిననాడు !!


నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!


నిరుద్యోగాన్ని నిర్మూలించిననాడు !

నిరాశతో యువత నిట్టూర్చనినాడు !!


వరకట్న పిశాచి కోరల్ని విరిచిననాడు ! 

ముత్తైదువలై కన్నెలు మురిసిననాడు !!


నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!


కులాలనే అడ్డుగోడల్ని కూల్చినవాడు ! 

మతరక్కసిని మంటల్లో కాల్చిననాడు !!


కొమ్మల్లో కోయిలమ్మ కలసి కాకమ్మతో ! 

పరవశించి యుగళగీతం పాడిననాడు !!


నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!


యుద్ధవిమానాలతో ధరణి దద్దరిల్లనినాడు ! 

ప్రపంచమంతా శాంతి ప్రజ్వరిల్లిననాడు !!


మంచితనం మాతవత్వం ప్రతిమనిషి 

గుండెల్లొ తేనెజల్లులా కురిసిననాడు !!


సమానత్వం సౌబ్రాతృత్వం ప్రతివ్యక్తి 

ఊహల్లో హరివిల్లులా విరిసిననాడు !!


నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!


తినగ తినగ వేప తియ్యనన్న...

కలసివుంటే కలదు సుఖమన్న... 

ఓ నగ్నసత్యాన్ని మనిషి ఎరిగిననాడు !!

నలుగురు కలసి నవ్వుతూ బ్రతికిననాడు!!


నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !! 


51. పాపం రైలుక్రింద కుక్కపిల్ల...!

(చిత్ర కవిత...)


ఔరా ! ఔరా ! ఇది 

ఎంత వింత విచిత్రం..!

వచ్చింది ఘోరమైన విపత్తు..!

వచ్చిపడింది తలపై 

పిడుగులాంటి పెనుప్రమాదం..!

అయ్యో ! అయ్యో ! 

రక్షించే నాధుడే లేడే..?

తప్పించుకునే దారేలేదే..?

చావే శరణ్యమా? లేదు లేదు...!


కళ్ళముందరే కొన్ని క్షణాల్లో 

ఏదో మాయ? ఏదో ఇంద్రజాలం? 


భయపడకు...ధైర్యంగా ఉండు..! 

నేనున్నా చూస్తున్నా వస్తున్నా అన్నట్టు... 

ఏదో అతీంద్రియ శక్తి ఆదుకున్నట్టు...

లోతైన లోయలో పడి పైకిలేచినట్టు...

పులి నోటికి చిక్కి తప్పించుకున్నట్టు...


మృత్యువు కౌగిట్లో చిక్కుకొని

ముక్కలు ముక్కలై పోవలసిన

కన్నుమూసి కైలాసానికెళ్ళవలసిన

"పాపం ఆ కుక్కపిల్ల" రైలు పట్టాల 

మధ్య చిక్కుకొని కొన్ని క్షణాలు

ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి...

ఎలా...బ్రతికి బట్టకట్టిందో...

పునర్జన్మ నిచ్చిన ఆ పరమాత్మకే ఎరుక...


ఓ విధాతా ! ఓ పరమాత్మా ! 

ఔను అగ్నిపరీక్షలు పెట్టేది మీరే...

సమస్యల సమాధిలోకి నెట్టేది మీరే...

ఆ సమాధి నుండి పైకి లేపేది మీరే...

గండాలనుండి సుడిగుండాలనుండి

రక్షించేది మీరే తప్పుచేస్తే శిక్షించేది మీరే...

ఆపదల నుండి ఆదుకునేది 

మీ "అమృత అదృశ్య అభయహస్తమే"...

ఔను శివునిఆజ్ఞలేక చీమకైనాలేదంటారు

ఈ నేలపై పుట్టేహక్కు...కుట్టే హక్కు... 

అందుకే ఓ పరమాత్మా మీరే మాకు దిక్కు...


52. నిరాశ ఒక నిప్పుల కుంపటి" 


నిరాశ వద్దు...

నిస్పృహ వద్దు... 

నిట్టూర్పు వద్దు...  

"నిరాశ ఒక నిచ్చెన" కాదు 

"నిరాశ ఒక నిప్పుల కుంపటి" 


అది నీ శక్తిసామర్థ్యాలను 

దహించివేసే దగ్ధంచేసే 

నీపై దండయాత్ర చేసే 

నిన్ను దారిద్య్రంలోకి నెట్టివేసే

నీ"కళ్లకు కనిపించని ఓ ముళ్ళదారి"


అది అనకొండలా చుట్టేస్తే

ఇక నీవు ముందుకెళ్లలేవు 

వెనక్కీ వెళ్లలేవు నీవొక బంధీవి 

అది నీఉన్నచోటునే  

"ఊబిగా" మారుస్తుంది 

అందులోకి నిన్ను చేరుస్తుంది 


అందుకే... 

నిరాశనెప్పుడూ 

బాధలభూతంలా భావించు..! 

దాన్ని సుదూరంగా ఉంచు..!

చాటుమాటుగా కాటువేసే

సర్పంలా భావించు...దాన్ని 

సప్తసముద్రాల్లో ముంచెయ్..!

నీకు సుఖశాంతులు ప్రాప్తిరస్తు...!

నీకు ఘనవిజయాలు సిద్ధిరస్తు...! 


53. నిప్పుల ఖడ్గం...?


అణిచివేతల నుండి 

పుడుతుంది అగ్నిశిఖరం... 

విషాదగాథల నుండి 

పుడుతుంది విప్లవశంఖం...

  

చీకటిలో వేసి 

చిత్రహింసలకు గురిచేస్తే 

పిల్లి పిల్లైనా పులియై

పీకలు నులిమేస్తుంది 

రక్కుతుంది రక్తాన్ని త్రాగుతుంది 

భయం గుప్పెట్లో బ్రతుకుట

బానిసత్వమే కదా...! 


ఎదురు తిరగడం... 

తిరుగుబాటు చేయడం...

బెదిరించే వారి గుండెల్లో 

నిదురించడం... 

నిప్పులు కురిపించడం...

నిత్యకృత్యమైతేనే కదా...

నిర్భయంగా నీవు జీవిస్తేనే కదా.. 

నీ జన్మకు ఓ అర్థం పరమార్థం... 

 

కాకి పుడుతుంది 

కావు కావు మంటుంది... 

కోకిల పుడుతుంది 

కుహూ కుహూ అంటుంది...

అడవిలో పులి పుడుతుంది 

దొరికిన జంతువుల 

రక్తాన్ని రోజూ రుచిచూస్తుంది... 


పాము 

పుడుతుంది...

పగపడుతుంది...

బుసలు కొడుతుంది... 

చాటుమాటుగా కాటు వేస్తుంది... 

నక్క పుడుతుంది... 

నమ్మిన వారిని నట్టేట ముంచుతుంది... 

కుక్క పుడుతుంది ఇంత కూడెడితే 

కొండంత విశ్వాసాన్ని చూపుతుంది... 

ప్రాణాలను సైతం త్యాగం చేస్తుంది. 


ఇది బలహీనులను వేధించే 

గూండాలకు గట్టి "గుణపాఠం"...  

ఇది నిస్సహాయులను హింసించే 

నికృష్టుల పాలిట "నిప్పుల ఖడ్గం"...


54. ఓ వయసా ! నీకు వందనం !


నేడు యువత భవిత 

ప్రశ్నార్ధకమౌతుంది 

నేటి యువత "ప్రేమపాఠాలే"...

రేపటిరోజు తల్లిదండ్రులకు 

గుండెలు రగిలే పగిలే

"గుణపాఠాలౌతున్నాయి"... 

అందుకే ఓ వయసా ! నీకు వందనం !


మాతృత్వానికి మానవత్వానికి

మచ్చతెచ్చే "వికృత చేష్టలు 

వింత వింత మనస్తత్వాలు"

తల్లీ దండ్రుల "పెంపకానికి 

పెనుసవాళ్లు" విసురుతున్నాయి

అందుకే ఓ వయసా ! నీకు వందనం !


మొన్న పెళ్లిళ్లు 

పెటాకులైతే...

కానీ నేడు ప్రేమలే 

విడాకులౌతున్నాయి...

పీటల వరకు రాకుండానే 

పీకలు తెగిపోతున్నాయి... 

నూకలు చెల్లిపోతున్నాయి...

నూరేళ్లు నిండిపోతున్నాయి...

అందుకే ఓ వయసా ! నీకు వందనం !


నేడు చిగురించిన ప్రేమలే

మూడుముళ్లు పడకముందే 

ఏడడుగులు నడవక ముందే 

పగాప్రతీకారాలతో రక్తసిక్తమౌతున్నాయి

అందుకే ఓ వయసా ! నీకు వందనం !


మంగళతోరణాలతో

మంగళవాయిద్యాలతో

పచ్చని పెళ్లిపందిరిలో 

కళకళలాడే కళ్యాణశోభకు ముందే 

మృత్యువు మృదంగనాదం వినిపిస్తూంది

కామంతో నిండిన కల్తీప్రేమ కసితో పండిన

పిచ్చి ప్రేమ పాడెమీద ఊరేగుతుంది

అందుకే ఓ వయసా ! నీకు వందనం !


55. కవితంటే...?


ఔను...

నిజానికి కవితంటే...

ఒక ఆర్థముండాలి... 

అంత్యపాసలుండాలి...

కొండంత విషయాన్ని 

గోరంతలు చేసి చెప్పాలి...


నిజానికి కవితంటే...

అది చదువుతుంటే...

పాఠకదేవుళ్ళందరూ 

పరవశించి పోవాలి...

పరమానందం పొందాలి...


నిజానికి కవితంటే...

"కమ్మగా"...ఉండాలి...

"పాఠకుల్ని"...కదిలించాలి...

"కనువిప్పు"...కలిగించాలి... 

"చక్కని సందేశం"...ఉండాలి"...

"ముగింపు ముచ్చటగా"...ఉండాలి


నిజానికి కవితంటే...

గుండెలోలోతుల్ని తాకాలి...

గాఢనిద్రలో ఉన్న పాఠకుల్ని

గన్నుపెట్టి కాల్చినట్టు వెన్నుతట్టి లేపాలి

చీకటిజీవితాల్లో వెన్నెలవెలుగులు నింపాలి


నిజానికి కవితంటే...

"తప్పుచేస్తే 

కనువిప్పు"...కలిగించాలి

"మంచిని 

మానవత్వాన్ని"...నేర్పాలి 

మనిషి మనిషికి

"జీవిత పరమార్థాన్ని" 

"సామాజిక బాధ్యతను"

"జన్మసార్థకతను"...నిత్యం గుర్తుచేయాలి


56. మార్గం కన్న గమ్యం మిన్న...


మన 

ముందున్న 

"మార్గం"...

అందమైనదైతే...

సుగమమైనదైతే...

సురక్షితమైనదైతే...

సుందరమైనదైతే...

ఇక "గమ్యస్థానం"... 

గురించి గందరగోళమేల..?


కానీ గమ్యస్థానం...

ఎంత దూరమైనా... 

భారమైనా అంధకారమైనా... 

అడుగులో అడుగులు వేస్తూ 

రాముడే రక్షగా...

రామబాణమే ఆయుధంగా... 

సాహసమే ఊపిరిగా...

సాగిపోవాలి ముందుకే...


ఎన్ని అడ్డంకులెదురైనా ...

ఎన్ని అవాంతరాలొచ్చినా... 

వేయాలి ప్రతి అడుగు ముందుకే... 

సుందరమైన "సూర్యోదయం" వైపే... 


మన "గమ్యస్థానం"..! 

ఏడురంగుల ఇంద్రధనస్సైతే... 

కసితో...కృషితో సాధన చేస్తే...

మన ముందున్న "ముళ్ళలబాట"...

రేపు "పూలతోటగా" మారిపోతుంది 

మన "ఆశ " తప్పక తీరుతుంది 

మన"ఆశయం" గమ్యస్థానం చేరుతుంది


57. పొదుపు మంత్రం ...!!


పఠించాలి... 

పఠించాలి...

ప్రతినిత్యం ఆపై 

అందుతుంది మీకు

ఒక "గొప్ప గుప్తనిధి"ఇది 

నమ్మశక్యం కాని ఓ నగ్నసత్యం 


అదే బడి... 

అదే గుడి...

అదే మడి...

అదే పెట్టుబడి...

క్రమశిక్షణతో కట్టుబడి... 

పెట్టండి ధైర్యంగా పెట్టుబడి..! 


మీ పెట్టుబడే మీకు 

ఒక "అక్షయ పాత్ర"..!

ఒక 'అమృత భాండం"..! 

ఒక "అల్లావుద్దీన్ అద్భుతదీపం"..! 


మీ "పొదుపే మదుపైతే..! 

అది మీ పిల్లలకు విదేశాలలో

ఉన్నత విద్యకొక "పునాది"ఔతుంది 

కన్నకూతుర్ల కళ్యాణ శోభకు 

కట్నకానుకలకు ఓ"సోపానమౌతుంది"

మీరు హాయిగా ప్రశాంతంగా  

నిశ్చింతగా శేషజీవితం గడిపేందుకు 

ఒక "పదవీ విరమణ నిధి" ఔతుంది 


మీరు నిద్రపోతున్నా 

ముందుచూపుతో మీరుపెట్టిన ఆ

పెట్టుబడి నిత్యం మేల్కొనే ఉంటుంది 

ఒక "మరయంత్రంలా" పనిచేస్తుంది 


మీరు కలలో కూడా ఊహించని 

ఒక "భారీ బంగారు నిధిని" 

కాలం మీకోసం భద్రంగా దాస్తుంది 


మీ కష్టార్జితాన్ని 

మీరే అనుభవించవచ్చు 

మీరు అదృష్టవంతులైతే...

మీ పిల్లల పిల్లలనుభవించవచ్చు 

మీకు వారసులంటే... 


నేడు నాటిన విత్తనమే 

రేపు మొక్కై మొలుస్తుంది..! 

నేటి మొక్కలే రేపటి భారీవృక్షాలు..! 

నేడు మీరు చేసిన పొదుపే

ముందుచూపుతో పెట్టిన పెట్టుబడే 

రేపు సిరిసంపదలకు నిలయమౌతుంది 

మీ హృదయం ఆనందసాగరమౌతుంది 

మీ జీవితం సుందర నందనవనమౌతుంది 

అది ఒక ఆనందాల బృందావనమౌతుంది 


బిందువు బిందువులేకమై 

ఒక సింధువైయినట్లు 

భవిష్యత్తు మీ బంధువౌవుతుంది

వర్తమానం మీకు ఒక వరమౌతుంది 

అది భగవంతుడు అందించే 

ఒక "బంగారుబహుమతి" ఔతుంది


నేడు క్రమశిక్షణతో

"దాచిన మీ ధనమే" 

రేపటి రోజున

మీకు దిమ్మదిరిగేలా... 

మీరు అవాక్కయ్యేలా...

మీ కళ్ళు బైర్లు కమ్మేలా...మీరు

లెక్కించలేని ఒక "గొప్పనిధి" ఔతుంది


అందుకే...నేడే

హద్దులేని "ఖర్చుల్ని"రద్దు చేయండి..!

నిద్రలో సైతం గాయత్రీమంత్రంలా నిత్యం...

నిష్టగా "పొదుపు మంత్రాన్ని" జపించండి..!


58. నేనెవరో మీకు తెలుసు...?


నేనెవరో 

మీకు తెలుసు

నా అభిమానులు

నన్ను గజమాలలతో

గౌరవిస్తారు సత్కరిస్తారు

నాపై పూలవర్షం కురిపిస్తారు

కానీ నా శత్రువులు

నేనంటే గిట్టనివారు 

నామీద అనేక 

నిందలు వేస్తారు... 

నిప్పులు పోస్తారు...

చెప్పులు విసురుతారు...


కారణం....

నేను అరచేతుల్లో 

స్వర్గం చూపిస్తానని... 

వాగ్దానాల వర్షం 

కురిపిస్తానని‌‌... 

ఏరుదాటిన తర్వాత 

తెప్ప తగలేస్తానని... 

ఓట్లు రాగానే 

సీట్లు గెలవగానే ఇంటి 

గేట్లు మూసేస్తానని... 

కోట్లుకోట్లు ఆర్జించి 

కోటీశ్వరునౌతానని... 

కుర్చీల

కుబేరుడనౌతానని...

ఇక నా దర్శనం 

ఐదేళ్లకొక్కసారేనని... 


అందుకే వెంటనే 

నన్ను కలవాలనిపిస్తే...

నా అడ్రస్...

కనుక్కోవడానికి

మార్గాలు రెండు...

ఒకటి...

మర్డర్లు మాఫీ చేసే

ఏ పోలీస్ స్టేషన్ కైనా 

ఫోన్ చేయండి...

రెండు...

గుర్తు తెలియని హత్యలు 

చేసే ఏ గూండానైనా అడగండి...


59. రైతే రాజైతే...?


నిన్న... 

నెర్రెలిచ్చిన బంజరు భూములే...

నేడు...

సిరులోలికే పచ్చని పంటపొలాలు...


నిన్న...

చుక్క నీరులేక ఎండిన బీళ్ళే...

నేడు... 

పట్టుచీరలు కట్టిన పచ్చని పైర్లు... 


నిన్న... 

ఆకలికేకలు... 

అప్పులు ఆత్మహత్యలే...

నేడు... 

ఊహించని దిగుబడులు...

గుండెల్లో మ్రోగే గుడిగంటలు... 


నిన్న...

నిరసన సెగలే... 

ధర్నాలే రోడ్డురోకోలే... 

నిత్యం భారత్ బందులే...

నేడు... 

ముఖాన చిరునవ్వుల చిరుదివ్వెలే...

జల్సాలు జాతర్లు చిందులు విందులే... 


అవును మన "రైతే రాజైతే...

అస్తిపంజరాల ఆకలి కేకలు...

ఇక నిత్యం కళ్ళకు కనిపించేవి..

చీకటి బ్రతుకుల్లో కాంతిరేఖలే... 

అందరి ముందరి జీవితాలు 

అందమైన సుందర నందనవనాలే...


అందుకే ఓ అన్నదాతలారా..! 

మీకు వందనం...! పాదాభివందనం...!

 

60. మానసిక రోగులుంటారు 

       జాగ్రత్త ...తస్మాత్ జాగ్రత్త...


భగవంతుడు కళ్ళిచ్చింది 

మంచిని దర్శించడానికే 

చెడును కాదు 

అందరూ చూస్తారు కానీ 

కొందరు చూసేచూపులకర్థం 

ఎవరికీ అర్థం కాదు 

మెట్లెక్కుతూ దిగుతూ 

దిగ్గున ఎవరో పిలిచారని

వెనక్కి తిరిగి దొంగచూపులు

చూసే వారికి తప్ప...


అంధులు చూడలేరు 

కానీ కామాంధులు చూస్తారు 

ఆశతో ఆకలితో...

ధనమదాంధులు చూస్తారు 

అహంకారంతో...

మెట్లెక్కుతూ దిగుతూ 

నిక్కినిక్కి చూసే నక్కల్ని 

తొంగి తొంగి వొంగి వొంగి చూసే 

మాట్లాడకపోయినా కనిపిస్తే చాలు 

కడుపు నిండిపోతుందని భావించే... 

కక్కినదానికిఆశపడే కుక్కల్ని 

తెలిసి కూడా తప్పు చేసే 

మతిచెడి అతిచేసే మానసిక రోగులు 


పళ్ళ దుకాణాల దగ్గర... 

ఎదురు షాపుల ముందర 

రోడ్లమీద అక్కడక్కడ...

అప్పుడప్పుడు తిరుగుతుంటారు 

అటూ ఇటూ షాపుల

ముందే తచ్చట్లాడుతుంటారు 


కన్న అమ్మానాన్నలు 

పక్కనే ఉన్నా 

కట్టుకున్న భర్త వెంటనే ఉన్నా 

పక్క చూపులు చూసే 

దిక్కుమాలిన నీచ ప్రవృత్తి కలిగిన 

మతి చెడి అతి చేసే మానసిక రోగులు 

చాటు మాటుగా దొంగచాటుగా 

వొంగి వొంగి తొంగి తొంగి 

నిక్కి నిక్కి నక్కినక్కి చూసే నక్కలను 

కక్కిన దానికి ఆశపడే కుక్కలను 

ముక్కలు ముక్కలు చేసి మూటకట్టి 

మూసీ నదిలో విసిరినా తప్పులేదు 

అమ్మ నాన్నలు పక్కనే ఉన్నా 

కట్టుకున్న మొగుడు పక్కనే ఉన్నా 

ప్రక్కచూపులు చూసే 

ఏవేవో ఊహల్లో ఊరేగే ఉన్మాదులను 

ఉరివేసినా ఊపిరితీసినా తప్పులేదు


బజారుకు 

వెళ్లి నప్పుడు 

మన నడకలో

మన చూపులో

మన నవ్వులో 

మన‌ ప్రవర్తనలో

కాస్త శ్రద్ధ తీసుకోవాలి

అతి విజాగ్రత్తగా ఉండాలి 

మీరు ఒక్క ప్రక్కచూపు చూస్తే చాలు 

ఆ మానసిక రోగులు ఖుషీ ఐపోతారు

ఎంతో మానసికానందాన్ని పొందుతారు

నిజానికి అలా చూస్తే బయటపడేది

మీ వక్రబుద్ధే...మీ వంకరచూపులే...

అసలు "లోపం అంతా" మీలోనే...

మీకు ఇతరులంటే ఇష్టమనే ...

ఆ "దొంగచూపులకర్థం"...


పక్కచూపులు చూస్తే 

చాటు మాటుగా

దొంగచూపులు చూస్తే 

అది మీ "నీచబుద్ధికి" నిదర్శనం

అప్పుడు మీ స్థాయి దిగజారిపోయి

నలుగురిలో మీరు నవ్వులపాలౌతారు

అదే జరిగితే మీరు ఖచ్చితంగా

మొగుళ్ళను మోసంచేస్తున్నట్లే లెక్క... 

మనసొకచోట మనిషొకచోట ఉన్నట్లే...

మొగుడి ప్రక్కలో పడుకుని ఉన్నా

ఏవేవో ఊహల్లో ఊరేగుతున్నట్లే లెక్క...


61. ఓ ఆధునిక మహిళా !  

జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త ! 


ఓ ఆధునిక మహిళా !  

అంతర్జాతీయ మహిళా 

దినోత్సవం సందర్భంగా నీకు

నా అక్షర సందేశం ఒక్కటే... 

గడ్డిపరకలా బ్రతక్కు... 

గండ్రగొడ్డలిలా బ్రతుకు... 


కుత్తుకలు త్రెంచే కత్తిలా... 

కంకులు కోసే కొడవలిలా...

నిత్యం నిఘాపెట్టి... 

నీతిగా నిజాయితీగా ఉండు..

నిప్పు కణికల్లే భగ్గున మండు...


ఓ ఆధునిక మహిళా!  

మత్తుమందుచల్లే మాయమాటల చెప్పె

మహామోసగాళ్ళ వలలో చిక్కుకోకు...

వారి ఊహల ఊబిలోకి జారిపోకు...

ఉక్కులా ఉండు...ఉక్కుసంకల్పంతో

"ఆ ఉన్మాదులకు" ఉరితాడును బిగించు...


ఓ ఆధునిక మహిళా !  

నీ కాపురంలో 

"కారు చిచ్చు"రేగకుండా...

నీ కుటుంబంలో 

"పిడుగులవర్షం" కురవకుండా

చాటుమాటుగా కాటువేసే

కారుచీకటిలో సంచరించే...

"కాలనాగులను" సంహరించు...

ఉండు! జరా జాగ్రత్తగా ఉండు..!

విధి విషాద గీతం ఆలపించిన నాడు 

భద్రకాళిలా కలకత్తా కాళికలా విజృంభించు


అందుకే... 

ఓ ఆధునిక మహిళా !  

జాగ్రత్త జరా జాగ్రత్త ! 

నీ ఇల్లు జాగ్రత్త !

నీ కళ్ళు జాగ్రత్త !

నీ ఒళ్ళు జాగ్రత్త ! 

నీ పరువు ప్రతిష్టలు జాగ్రత్త !

నీ పచ్చని సంసారం జాగ్రత్త !!


62. దృష్టిలోపం...అదే మనిషికి శాపం


చూస్తారు చూస్తారు... 

అందరూ చూస్తారు... 

చుట్టూ చూస్తారు

దిక్కులు చూస్తారు

 

కానీ కొందరే...

ఆశతో చూస్తారు...

అదోలా చూస్తారు...

ఆకలితో చూస్తారు... 

వారే "అంధులు" కామాంధులు... 


చూస్తారు చూస్తారు...

అందరూ చూస్తారు... 

పెరటిలోని 

గులాబీ మొక్కలను...

కానీ కొందరే...

చూస్తారు గుభాళించే 

గులాబీల "అందాలను"  

కానీ మూర్ఖులు కొందరు చూస్తారు

గులాబీల మాటున దాగిన"ముళ్ళను" 


చూస్తారు చూస్తారు...

అందరూ చూస్తారు... 

కొలనులోని కలువ పూలను... 

కానీ కొందరే...

చూస్తారు కనువిందు చేసే 

కలువ రేకుల "అందచందాలను"... 

కానీ బుద్దిహీనులు కొందరు చూస్తారు

కమలంకింద దాగిన "బురదను"  

ఇది చూపులో లోపం...ఇది మనిషికి శాపం


63. మొన్న ప్రేమిస్తే..? నిన్న నిరాకరిస్తే..?...


మొన్న ప్రేమిస్తే..?

నీవే "నా దేవత"

నీవే" నా కలలరాణివి"అన్నోడే

నిన్న ప్రేమను నిరాకరిస్తే..!

నేడు...

"మహాశాడిస్టుగా"

మారిపోయాడు

"మాస్టర్ ప్లాన్" వేశాడు

తన "దేవతను" తానే

"దారుణంగా హత్య" చేశాడు


మొన్న ప్రేమిస్తే..!

నీవే "నా ఊపిరి"

నీవే" నా ఊహల

ఊర్వశివి" అన్నోడే

నిన్న ప్రేమను నిరాకరిస్తే..!

నేడు...

"మహా రాక్షసుడిగా"

మారిపోయాడు

మాస్టర్ ప్లాన్ వేశాడు

తన "ఊపిరిపై" తానే

"యాసిడ్ దాడి" చేశాడు


మొన్న ప్రేమిస్తే..!

ఓ ప్రియా "నీవేనా

బంగారం" నీవే నాకు

ఆ భగవంతుడు

ప్రసాదించిన "బంగారు

బహుమతి" అన్నోడే

నిన్న ప్రేమను నిరాకరిస్తే..!

నేడు...

"మహా క్రూరిడిగా"

మారిపోయాడు

మాస్టర్ ప్లాన్ వేశాడు

తన "బంగారాన్ని" తానే

16 సార్లు కత్తితో పొడిచి పొడిచి

చంపి...కాల్చి...బూడిద చేశాడు


మొన్న ప్రేమిస్తే..!

నీవే "నా అర్ధాంగివి"

నీవే "నా సర్వస్వం" అన్నోడే

నిన్న ప్రేమను నిరాకరిస్తే..!

నేడు...

"మహా కాలరుద్రుడిగా"

మారిపోయాడు

మాస్టర్ ప్లాన్ వేశాడు

రేపటి తన "అర్ధాంగిని"

తానే పదునైన కత్తితో కసితీరా

చికెన్ షాప్ లో కోన్ని కోసినట్లు ...

తాజాగా కూరగాయలు తరిగినట్టు...

శరీరభాగాలను 36 ముక్కలు చేసి 

మూటకట్టి కొంతకాలం ఫ్రిజ్లో దాచి

ఆపై ఒక్కో భాగాన్ని...

అడవిలో...అర్ధరాత్రిలో...అక్కడక్కడా

కుక్కలకు నక్కలకు ఆహారంగా విసిరేశాడు


అయ్యో...

ఓ దైవమా..!

ప్రేమ ఒక పాపమా..?

ప్రేమ ఒక శాపమా..?

ప్రేమ ఒక నేరమా..?

ప్రేమ ఒక  భారమా..?

ప్రేమిస్తే జీవితం ఇంత ఘోరమా..?

అంతేలేని అంధకారమా..?

భగ్న ప్రేమికులకు

సుఖశాంతులింత దూరమా..?

సుఖాలతీరం చేరడం అసాధ్యమా..?


అందుకే...

ఓ భగ్న ప్రేమికులారా..!

మీ ప్రేమపుట్టుక గిట్టుక

మీ హృదయంలోనే...

మరి అది నేడు...

పగా ప్రతీకారాలతో రగిలే 

అగ్నిగుండమా..?

ప్రేమా త్యాగాలతో నిండిన 

అమృతభాండమా..? మీరే తేల్చుకోండి..!


64. నా భారతనారి...అంటే...?


అలంకరణ పేర... 

అంగడిబొమ్మలా...అర్థనగ్నంగా... 

అందంపేర గుడిపైన బూతుబొమ్మలా  

గుట్టురట్టయ్యేలా...అసహ్యంగా...


నాగరికతపేర...వాత్సాయనుడి

 కామశాస్త్రంలో...శృంగారభంగిమలా...

అసభ్యంగా....బరితెగించి నవ్వుతూ 

నడిబజార్లో తిరిగేది నా భారతనారి కాదు...


హొయలు పడుతూ... 

వంకర్లు తిరుగుతూ పబ్లిక్ గా రోడ్లమీద

పగలబడి నవ్వేది నా భారత నారి కాదు...


ప్రపంచ‌ సుందరిలా ప్రబంధ నాయకిలా 

అందని తన అందాలను 

ఆరబోసేది...నా భారతనారి కాదు... 


దూరదర్శన్ లో ప్రవహించే ఫారిన్ కల్చర్ కి 

ప్రతిరూపం...నా భారతనారి కాదు... 

 

ఎముకల గూడుగా మార్చే ఎయిడ్స్ ను 

దిగుమతిచేసే..."దిష్టిబొమ్మ" 

నా భారతనారి.. కాదు...


నా భారతనారి...అంటే..? 

తలనిండా పూలుపెట్టి 

"తల్లిలా" కనిపించు... 

చేతినిండా గాజులు 

తొడిగి "చెల్లిలా" అనిపించు... 


నా భారతనారి...అంటే..?

సీతమ్మ తల్లిలా మండే 

అగ్నిగుండంలో దూకే..."ఆదిపరాశక్తి" !


నా భారతనారి...అంటే..? 

సతీసావిత్రిలా 

సంప్రదాయాలకు... 

సంస్కృతీ సహనానికి... 

సంస్కారానికి..."సజీవసంకేతం" ! 


నా భారతనారి...అంటే..? 

నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనమై 

మదర్ థెరిసాలా ప్రపంచానికి 

ప్రేమనుపంచే..."శాంతిపావురం" !


65. పుడతాం ! పుడతాం !

మళ్ళీ పుడతాం ! మీ భరతం పడతాం !


కీచకులారా ! ఓ కిరాతకులారా !

దుష్టులారా ! ఓ దుర్మార్గులారా !

రక్తందాహం తీరని 

ఓ రాక్షసులారా ! రాబందులారా !

చాటుమాటుగా కాలసర్పాలై కాటువేసే 

ఓ కామాంధులారా ! కామ పిశాచులారా !

చెల్లెల్లంటూనే...

అక్కలంటూనే...  

అమ్మలంటూనే...  

స్త్రీ జాతిని దేవతలంటూనే...

కామంతో కళ్ళుపొరలు కమ్మి 

చిత్రహింసలకు గురిచేసి...కౄరంగా... 

ఘోరాతి ఘోరంగా...అతినీచంగా

ప్రేమ పేరుతో కామదాహం తీర్చుకునే

ఓ అంధుల్లారా ! కామాంధుల్లారా ! 

వస్తున్నాం వస్తున్నా ! త్వరలో వస్తున్నాం !

మీ కళ్ళళ్ళో...త్రిశూలాలు 

మీ గుండెల్లో గునపాలు గుచ్చి...గుచ్చి... 

మీ గుండెల్ని నిలువునా చీల్చి...చీల్చి...

తీరని మా రక్తదాహం‌ తీర్చుకుంటాం !

అందుకే పుడతాం ! పుడతాం !

మళ్ళీ పుడతాం ! మీ భరతం పడతాం !


వస్తున్నాం వస్తున్నా ! 

త్వరలో వస్తున్నాం !

చూస్తాం చూస్తాం ! 

సహనంతో వేచి చూస్తాం !

మా శీలానికి....మా సహనానికి 

అగ్నిపరీక్ష పెడితే.... 

కోస్తాం కోస్తాం ! మీ పీకలు కోస్తాం !

మీ నాలుకలు కోస్తాం ! మీ ఊపిరి తీస్తాం !


వస్తున్నాం ! వస్తున్నాం ! 

త్వరలో వస్తున్నాం ! వేస్తాం  వేస్తాం ! 

గండ్రగొడ్డళ్ళతో వేటు వేస్తాం !

తీస్తాం తీస్తాం ! లోతుగా గోతులు తీస్తాం !

చేస్తాం చేస్తాం  ! 

సామూహికంగా మిమ్మల్ని సమాధి చేస్తాం!

పుడతాం ! పుడతాం ! 

మళ్ళీ పుడతాం ! మీ భరతం పడతాం !


వస్తున్నాం ! వస్తున్నా ! 

త్వరలో వస్తున్నాం ! వేస్తాం వేస్తాం ! 

మీ నేరాలనుండి...

మీ ఘోరాలనుండి... 

మీ దుర్మార్గాలనుండి...

మీ దుస్కృత్యాల నుండి...

మీరు తప్పించుకు బయటపడే 

అన్ని మార్గాలను మూసివేస్తాం !


వస్తున్నాం ! వస్తున్నా ! 

త్వరలో వస్తున్నాం !

మీకలల్లో 

కలకత్తా కాళికలమై !

మీ కంటిలో కారమై ! 

మీ ప్రక్కలో బల్లేలమై ! 

మీ కాలిలో ముళ్ళులమై !

మీ గుండెల్లో గునపాలమై !

మహంకాళులమై ! 

భద్రకాళులమై ! కనకదుర్గలమై !

మీపాలిట శతృవులమై ! 

మీ ముంగిట మృత్యుదేవతలమై !

పుడతాం ! పుడతాం ! 

మళ్ళీ పుడతాం ! మీ భరతం పడతాం!


ఇంతకీ మేమెవరో తెలుసా? 

మొన్న మీ కామాగ్నిజ్వాలలకి

నిర్దాక్షిణ్యంగా బలై ...కాలి... 

బూడిదైపోయిన...నిర్భయ

దిశ...ఆయేషా...ప్రత్యూషా...

ప్రియాంకలకు...ప్రతిబింబాలం...


66. ఓకే ఒక్కటి చాలు...!


కడివెడేలనోయి ఖర్మపాలు

గరిటెడు చాలోయి గంగిగోవు పాలు

 

అనుభవం పండిన హస్తవాసి ఉన్న 

డాక్టరిచ్చే"ఒకే ఒక్క టాబ్లెట్ "చాలు 

భూతాలవంటి మొండివ్యాధులు

భూస్థాపితం కావడానికి...


బావిలో వెయ్యిఅడుగుల తర్వాత 

తవ్వే" ఒకే ఒక్క అడుగు"చాలు 

నీళ్లు పైకి చిందడానికి...

మన అదృష్టం పండడానికి...


ఆశతో ఆవేదనతో కన్నీటితో

చేసే"ఒకే ఒక్క ప్రార్థన"చాలు

వేయి వరాలు పొందడానికి...

బ్రతుకు బంగారమైపోవడానికి...


ఆర్థిక సమస్యలెన్నో 

చుట్టుముట్టి ఊపిరాడక 

ఉక్కిరిబిక్కిరయ్యే వేళ

తగిలే "ఒకే ఒక్కలాటరి" చాలు 

బికార్లు బిల్ గేట్స్ కావడానికి...

క్షణాల్లో జీవితాలు మారడానికి...


నాలుక పై "ఒకే ఒక్క విషపుచుక్క" 

పడితే చాలు మర్రిచెట్టంత

మనిషి మట్టిలో కలిసి పోవడానికి... 


మహర్షులు 

మంత్రశక్తిగల 

మహా తపోసంపన్నులు 

సహనం కోల్పోయి

ఉద్రేకంతో ఊగిపోతూ 

ఆగ్రహంతో ఆవేశంతో 

రక్తవర్ణ నేత్రాలతో చూసే

"ఒకే ఒక్కచూపు"చాలు 

పచ్చని చెట్లు సైతం

భస్మమైపోవడానికి...

కడకు బూడిదైమిగలడానికి...


కొట్లాడి కోర్టుకెక్కిన 

జగడామారి జంటలు 

సారీ నన్ను క్షమించమని... 

ప్రేమతో...పశ్చాత్తాపంతో 

పలికే "ఓకే ఒక్కమాట" చాలు 

పచ్చని కాపురాలు చిగురించడానికి...

ప్రశాంతంగా ఇద్దరూ నిదురించడానికి...


ఒక "అరక్షణం" చాలు

"ఓకే ఒక్క అగ్నికణం" చాలు 

ఆరని కార్చిచ్చు రేగడానికి...

కారడవి తగలబడి పోవడానికి...


"ఒకే ఒక్కచిన్న రంద్రం" చాలు

పెద్దతిమింగలంలాంటి ఓడ మునిగి 

కళ్ళముందే కనుమరుగైపోవడానికి...  


వేయియేల వెర్రిసంబంధాలు...?

"మంచిగంధమంటి

"ఒకే ఒక్క సత్సంబంధం" చాలు 

కళ్యాణ వేదిక కళకళలాడిపోవడానికి...

మూడుముళ్లతో జంట మురిసిపోవడానికి...

 

67. ఓ కన్నీటి కవిత ...


నిన్న"ప్రీతి చితికి" 

కాదు నీతికి నిజాయితీకి

ఈ నరజాతికి నిప్పంటుకుంది

కారణం...జరిగిన దారుణం... 

కళ్ళకు ఓ దృశ్యంలా కనిపిస్తుంది... 

చెవుల్లో ఆ విషాదగీతం ప్రతిధ్వనిస్తుంది... 

కసాయికి సైతం కన్నీరును తెప్పిస్తుంది... 


ఇది కులంపేర 

జరిగిన...ఒక కుట్ర... 

ఆత్మాభిమానానికి 

జరిగిన...ఒక అవమానం... 

ర్యాగింగ్ పేరున 

జరిగిన... ఒక రాక్షస క్రీడ... 

ఇది బక్కచిక్కిన బడుగులమీద 

బలిసిన కుక్కల...దారుణమైన దాడి... 


సీనియర్లు...

అధికారులు‌...  

కుల దురహంకారులు...

అందరూ ఏకమై

ప్రశ్నించే అన్యాయాన్ని 

ప్రతిఘటించే ప్రీతిని  

ఒంటరిదాన్ని చేసి 

అహంకారంతో... 

అధికార దాహంతో...

శారీరకంగా...వాడుకొని... 

మానసికంగా...హింసించి.... 

హత్యచేసి ఆత్మహత్యగా చిత్రించి... 

ఆధారాలన్నీ తారుమారు చేసి...

ఆ యువడాక్టర్ని...

ఆ అమాయకురాలిని...

బలిపశువును చేశారు 

ఆమె బంగారు భవిష్యత్తును

బలితీసుకున్నారు... 


ఎంతటి మోసం... 

ఎంతటి ఘోరం...

ఎంతటి దారుణం ...

ఈ దుర్మార్గాన్ని ఎదురించి 

ఈ గుంటనక్కల గుండెల్లో 

నిదురించాలంటే......

ఈ అభాగ్యులను ఆదుకొనేందుకు... 

వీరిలో చైతన్యజ్వాలను రగిలించేందుకు...

"మరో అంబేద్కర్" ఉదయించాలి  


జ్ఞానాన్ని..........బోధించు ... 

యువతను......సమీకరించు...

రాజీపడక........పోరాడు...

రక్తాన్ని............చిందించు... 

రాజ్యాధికారం...సాధించు... 

అన్న "అంబేద్కర్ సిద్దాంతమే" 

అందరికీ ఒక "అణ్వాయుధం" కావాలి....


68. సమిష్టి కృషితో సర్వం సాధ్యమే..!


ఒక్క నీటిచుక్కకు 

విలువలేక పోవొచ్చు... 

అది మన దాహాన్ని 

తీర్చలేక పోవచ్చు ...

పొలంలోని పైరుకు 

ప్రాణం పోయలేకపోవొచ్చు...


కానీ కారుమబ్బులు కమ్మి

లెక్కపెట్టలేనన్ని నీటిచుక్కలు

నేలపై ఏరులై సెలఏరులైపారితే‌...

వరదలు ముంచెత్తవచ్చు...

ఊర్లకు ఊర్లే ఊడ్చుకుపోవచ్చు...

పచ్చని పంటలు నాశనం కావచ్చు...

ప్రజల ప్రాణాలకు ముప్పురావచ్చు...


నిజానికి... 

ఒక్కఅగ్గిపుల్ల చాలు  

దేనినైనా దగ్ధం చేయడానికి...

కారడవిని సైతం కాల్చివేయడానికి...


నిజానికి...

ఒక్క చీమకు ఏశక్తీ లేకపోవచ్చు

కానీ వేలకువేలు చలిచీమలు ఏకమైతే

బుసలుకొట్టే సర్పాలను సంహరించవచ్చు


ఔను ఇది నిజం ఒంటరిగా 

ఎవరేమి సాధించలేకపోవొచ్చు...

కాని "సమిష్టిగా సర్వం సాధ్యమే"...

పోయిన హక్కులకై పోరాడవచ్చు...

ప్రశ్నించవచ్చు ప్రతిఘటించవచ్చు...

ఘన విజయాలను సాధించవచ్చు...


69. నచ్చని పచ్చినిజాలు...?


...పడిపోతామని...

భయపడుతూ

నడిచే వారికి 

"నడకే" రాదట


...ఓడిపోతామని...

భయపడుతూ 

పోరాడే వారికి 

"విజయమే"దొరకదట


...విడిపోతామని...

భయపడుతూ

మూడుముళ్ళకు

సిద్దపడేవారికి 

"వివాహమే" జరగదట


భగవంతునిపై

భక్తేలేకుండా

గుడికెళ్ళిన

భక్తులకు"ముక్తే"లేదట


వాహనాలు ఢీకొట్టి 

ప్రమాదాలు జరిగి 

ప్రాణాలెగిరి పోతాయనే

పిరికిపందలకు

"డ్రైవింగే" రాదట 


చెడిపోతామని...

ప్రేమలో పడని

ప్రేయసీ ప్రియులకు 

"ప్రేమవిలువే" తెలియదట


70. జీవనదిలా జీవించాలంటే..?


నిర్మలమైన...

నిస్వార్థమైన 

నిష్కల్మషమైన...

జీవితమంటే ఏమిటి..?


ఓ మిత్రమా !

అకారణంగా ఎవరినీ 

ఎప్పుడూ ద్వేషించకు... 

భయపడకు...బాధపడకు... 

సాదాగా సరదాగా జీవించు... 


కొద్దిగా 

ఆశించు కొండంత కాదు 

అడిగితే ఇవ్వలేనంతకాదు

ఆశకు హద్దుండాలి ...

అడిగే అర్హత నీకుండాలి ...


ఎంత ఎత్తుకు ఎదగ గలిగితే 

అంత ఎత్తుకు ఎదుగు...

ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వు

కాని...ఉన్నదంతా ఊడ్చివ్వకు... 


నీ ముఖంలో "చిరునవ్వు

ఎప్పుడూ"ఒక మొక్కలా 

చిగురిస్తూ వుండాలి...

"చిరుదివ్వెలా" నిత్యం

వెలుగుతూ వుండాలి...

హృదయమంతా 

ఒక "గులాబీ పువ్వులా" 

గుభాళిస్తూ వుండాలి...


ఓ మనిషీ !  

నీవు నిత్యం గుర్తు 

చేసుకుంటూ ఉండాలి... 

ప్రాణం పోసిన పరమాత్మను...

జన్మనిచ్చిన అమ్మానాన్నలను...

జ్ఞానం అందించిన గురువులను... 

ఇలనైనా కలనైనా మరువరాదు...

మరచిననాడు నీవు మనిషివే కాదు...


అప్పుడు కదా 

నీ ముందు జీవితం... 

జలజలా దూకే జలపాతం...

గలగలపారే గంగా ప్రవాహం... 

అంతేలేని సంతోషాల సాగరం...

సుఖాల సుందర నందనవనం...


71. చిరకాల స్నేహం...


ఓ మిత్రమా ! 

నిన్న నీవన్నావు

స్నేహాన్ని పువ్వుతో పోల్చకు

అది వాడిపోతుందని...

కాని నేడు నేనంటున్నాను

స్నేహాన్ని పువ్వుతో పోలిస్తే 

అది పరిమళిస్తుందని...


ఓ మిత్రమా ! 

నిన్న నీవన్నావు

స్నేహాన్ని మంచుతో పోల్చకు

అది కరిగిపోతుందని...

కాని నేడు నేనంటున్నాను

స్నేహాన్ని మంచుతో పోలిస్తే 

అది చల్లదనాన్నిస్తుందని...


ఓ మిత్రమా ! 

నిన్న నీవన్నావు

స్నేహాన్ని ఆకుతో పోల్చకు 

అది రాలిపోతుందని...

కాని నేడు నేనంటున్నాను

స్నేహాన్ని ఆకుతో పోలిస్తే 

అది పచ్చదనాన్నిస్తుందని...


ఓ మిత్రమా ! నిజం తెలుసుకో

స్నేహాన్ని టానిక్ ఐతే 

అది అంతులేని శక్తి నిస్తుందని...

స్నేహాన్ని అమృతమైతే  

అది మృత్యుభయము లేకుండ

మనల్ని ముందుకు నడిపిస్తుందని...

అందుకే ఇక "స్నేహాన్ని" దేనితో 

పోల్చుకోవాలో ఇక నీవే తేల్చుకో...


కానీ ఓ మిత్రమా !

ఉండాలి మన ఈస్నేహం చిరకాలం  

వెలుగుతూ వుండాలి మన స్నేహజ్యోతి

సూర్యచంద్రులు ఉన్నంత కాలం, ఆ

నింగిలోతారలు వెలుగుతున్నంతకాలం


72. ఆస్కార్ పురస్కారం 

     ఒక బంగారు ఆభరణం..!


విశ్వకళా వేదిక మీద

విదేశీయుల కరతాళ 

ధ్వనుల మధ్య 

"నాటు నాటు" పాటకు 

కీరవాణి చంద్రబోస్ లు 

సగర్వంగా అందుకున్న... 

ఆ "ఆస్కార్ అవార్డు" 

తెలుగు కళామతల్లికి... 

ఒక "బంగారు ఆభరణం"..!

తెలుగు చలనచిత్ర

సీమకు ఒక "కీర్తి కిరీటం"..! 

ఇది తెలుగు జాతికే 

చిక్కిన ఒక "కోహినూర్ వజ్రం"..!


త్రిబుల్ ఆర్ దర్శక దిగ్గజం 

చిత్ర శిల్పి శ్రీ రాజమౌళికి...

సంగీత దర్శకుడు శ్రీ కీరవాణికి...

మహర్షి వాల్మీకి...

సాంస్కృతిక సేవా సంస్థచే

సినీ గేయ కౌముది "పురస్కార గ్రహీత"

"నాటు నాటు" పాటను 

ఘాటుగా గ్రేటుగా పుల్లారెడ్డి స్వీటుగా

వ్రాసిన గేయ రచయిత శ్రీ చంద్రబోస్ కి...


గళంలో గంగమ్మ గంతులు వేసేలా...

చిరుతలు రెండు చిందులు వేసేలా... 

అద్భుతంగా ఆలపించిన 

ప్రముఖగాయకులు 

కాలభైరవ రాహుల్ సిప్లీగంజ్ లకు...


త్రిబుల్ ఆర్ ను

తిలకించిన ప్రేక్షకుల

మది పులకించిపోయేలా...

పాటను విన్న ప్రతిశ్రోత 

పరవశించిపోయి కాళ్ళు కదిపేలా... 

స్టైలిష్ స్టెప్పులతో కొత్తగా 

కొరియోగ్రఫీ చేసిన...ప్రేమ్ రక్షిత్ కి...

 

మరయంత్రాల్లా మారి

పోలేరమ్మ జాతరలో ఒంగోలు

పోట్లగిత్తల్లా పోటీపడి

మైకేల్ జాక్సన్ లా

మెరుపు వేగంగా కదులుతూ

ఉక్రెయిన్ రాజభవనం దద్దరిల్లేలా

స్టైలిష్ గా సూపర్ స్టెప్పులు వేసిన 

యువ హీరోలు రామ్ చరణ్ 

జూనియర్ ఎన్టీఆర్ గార్లకు...

మన తెలుగుజాతికి...

భారతీయులందరికి...

తెలుగు చలనచిత్ర సీమకు... 

అందిన...ఒక అదృష్టం... 

దక్కిన....ఒక అరుదైన గౌరవం...

చిక్కిన....ఒక అమృత భాండం... 

ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్కార్ పురస్కారం

నా తెలుగుతల్లికి దక్కిన బంగారు ఆభరణం


73. విశ్వవిజేతలు..!

      ఆస్కార్ అవార్డు గ్రహీతలు..!


మొన్న "నాటు నాటు" పాట

వెండితెర మీద 

వెన్నెల వెలుగులు విరజిమ్మింది

నేడు "ప్రపంచంలో ప్రభంజనం" సృష్టిస్తోంది

"ఆస్కార్ కిరీటం" దక్కించుకుంది 

నా "తెలుగు జాతి" ఖ్యాతి 

ఖండాంతరాలు దాటింది 

నా "తెలుగునేల" పులకించిపోయింది..

నా "తెలుగు పౌరుషం" మీసం మెలివేసింది


నా "తెలుగు భాష" 

"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్"  కాదు

"వండర్ ఆఫ్ ది వరల్డ్ గా"

ప్రపంచ మేధావులచే ప్రశంసలందుకుంది

నా "తెలుగు ఆరని ఒక వెలుగు"...

అందుకు కారణం ...

త్రిబుల్ ఆర్ చిత్రం"లో 

రాజమౌళి దర్శకత్వంలో ...

కీరవాణి సంగీతంలో...

చంద్రబోస్ సాహిత్యంలో...

ప్రపంచ ప్రేక్షకులకు 

పిచ్చి పిచ్చిగా నచ్చేసి...

"ఆస్కార్ కిరీటం" ధరించిన

నా పచ్చిపల్లెటూరి

అచ్చతెలుగు పాట "నాటు నాటు"


అందుకే ఆస్కార్ అవార్డు అందుకున్న

ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ కి

శిరసు వంచి నమస్కరిస్తూ....


జయహో జయహో...రాజమౌళి...

జయహో జయహో...

కీరవాణి... చంద్రబోస్

జయహో జయహో...

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్

జయహో జయహో...

రాహుల్ సిప్లీగంజ్ కాలభైరవ

జయహో జయహో...

కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్...

జయహో జయహో... 

తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలకు...

ఆస్కార్ అవార్డు గ్రహీతలకు...

విశ్వవిజేతలకు...


74. హ్యాట్రిక్ " కొట్టిన రాజమౌళి...?


నిన్నటి మన

"నాటు నాటు" పచ్చి

పల్లెటూరి తెలుగు పాట 

బాషా బేధం లేకుండా

నేడు ప్రపంచం పాటగా మారింది 


ప్రపంచమంతా "నాటు నాటు" 

అంటూ ఒకటే...కలవరింత...

ఆ పాట వెండితెర మీద 

కుర్రకారును వెర్రెక్కిస్తుంది

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్

స్పెషల్ స్టైలిష్ స్టెప్పులతో 

సినీ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి


మన‌ తెలుగు జాతి గొప్పదనం ...

మన తెలుగు భాష తియ్యదనం... 

మన తెలుగు నేల మట్టివాసన...

"నాటు నాటు" పాటలో నిండి

నిక్షిప్తమైఉన్నాయి అందుకే...


"బాహుబలి" చిత్రంతో తెలుగుజాతికి 

ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టిన 

పాన్ ఇండియా దర్శక దిగ్గజం 

రాజమౌళి తన చిత్రం త్రిబుల్ ఆర్ కి

దక్కిన 

మొన్న‌టి...

గోల్డెన్ గ్లోబ్ ...అవార్డుతో...

నిన్నటి...

సినీ క్రిటిక్స్ ....అవార్డుతో... 

నేటి...

మన పచ్చి పల్లెటూరి 

పాట "నాటు నాటుకు"

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 

"ఆస్కార్ అవార్డుతో "దర్శకశిల్పి 

రాజమౌళి "హ్యాట్రిక్" కొట్టేశాడు 


ఇది ప్రతి తెలుగువాడికి నవోదయం...

ఇది ప్రతి భారతీయుడికి శుభోదయం...

ఇది ఒక అపూర్వం... అనిర్వచనీయం...

ఆనందదాయకం...సదా చిరస్మరణీయం... 


74. జయహో..! జయహో..! 

తెలుగు పాటకు...జయహో..!


జయహో..! జయహో..! 

తెలుగు పాటకు...జయహో..!

తెలుగు తల్లికి...జయహో..!

తెలుగు భాషకు...జయహో..!


తెలుగు అక్షరానికి...జయహో..!

తెలుగు సాహిత్యానికి...జయహో..!

తెలుగు నేలకు... జయహో..!

తెలుగు పౌరుషానికి... జయహో..!


ఖండాంతర ఖ్యాతి... 

నార్జించిన తెలుగు జాతికి...జయహో..!

ఆర్ ఆర్ ఆర్ చిత్రశిల్పి శ్రీ రాజమౌళి 

మిత్ర బృందానికి...జయహో..!  


భారతీయ చలనచిత్ర సీమకు 

భారతమాతకు...

జయహో..! జయహో..!

ఎందుకు..? ఎందుకు..?


మన పచ్చి పల్లెటూరి 

అచ్చతెలుగు జానపద గీతం 

"నాటు నాటు" పాటను 

ప్రపంచమంతా మొచ్చుకున్నందుకు..!


చుక్కల్లో చంద్రుడిలా

తేనెలూరే మన తెలుగు భాష  

విశ్వమంతా వెన్నెల

వెలుగులు విరజిమ్ముతున్నందుకు..!


అంతర్జాతీయంగా ప్రతిభావంతులకు

అరుదుగా దక్కే అత్యంత 

ప్రతిష్టాత్మకమైన "ఆస్కార్ అవార్డు" 

తెలుగువారికి దక్కినందుకు..!


76. నాటు నాటు పాట...?


నాటు నాటు పాట 

...ఒక సునామీ

నాటు నాటు పాట 

...ఒక ప్రభంజనం


నాటు నాటు పాట 

...ఒక సంచలనం

నాటు నాటు పాటకు

ఆస్కార్ అవార్డు దక్కడం 

...ఒక అదృష్టం...


...తెలుగు భాషకు జేజేలు 

...తెలుగు తల్లికి కీర్తి కిరీటం 

...భరతమాతకు 

...బంగరు ఆభరణం 


...దర్శక దిగ్గజం రాజమౌళి

...ప్రతిభకు పట్టాభిషేకం

...తెలుగు జాతికి గర్వకారణం

...ప్రతి తెలుగువాడికి పర్వదినం 

...భారతీయులందరికి ఒక హోలీ పండుగ 


77. ఎవరూ...? ఎందుకు...?


అంతర్జాతీయంగా

అత్యంత ప్రతిష్టాత్మకమైన

"ఆస్కార్ అవార్డు"

పచ్చిపల్లెటూరి పాట

"నాటు నాటుకు" దక్కడం...

తెలుగు జాతికి గర్వకారణం పర్వదినం 


ఔనిది ఆర్ ఆర్ ఆర్ మూవీకి...

దర్శక దిగ్గజం రాజమౌళికి...

సంగీత సామ్రాట్ కీరవాణి... 

కూర్చిన సుస్వర సుమధుర సంగీతానికి...


చంద్రబోస్ సాహిత్యానికి...

కాలభైరవ రాహుల్ సిప్లీగంజ్ ల

గంగా ప్రవాహంలాంటి గంధర్వ గానానికి...


స్టైలిష్  స్టెప్పులు కొత్తగా కంపోజ్ చేసిన

కొరియోగ్రాఫర్ ...ప్రేమ్ రక్షిత్ ప్రతిభకు...


ఎంతో ఎనర్జిటిక్ గా 

నభూతో న భవిష్యత్ 

అన్నరీతిలో...

విశ్వమే విస్తుపోయేలా...

పోటీపడి తెలుగు తెర మీద 

యువ హీరోలు రామ్ చరణ్ 

జూనియర్ ఎన్టీఆర్ లు 

ప్రదర్శించిన అపూర్వమైన 

అద్వితీయ నటనకు...

"కనకాభిషేకం"

పల్లెటూరి పాటకు"పట్టాభిషేకం".

భారతీయ తెలుగు 

చలనచిత్ర సీమకు "క్షీరాభిషేకం" 


78. అంబరాన్నంటే ఈ సంబరాలెందుకు..? 


ఒకసారి విన్నా తెరపై చూసినా

కాళ్ళు కదిలేలా కళ్ళుచెదిరేలా

పాటల మాంత్రికుడు

సాహితీ చంద్రుడు చంద్రబోస్

"నాటు నాటు" పాటకు 

ప్రాణం పోసినందుకు... 

సంగీత సామ్రాట్ కీరవాణి సుస్వర

సుమధుర సంగీతాన్ని అందించినందుకు...

ఆస్కార్ అవార్డును అందుకున్నందుకు..!


అంబరాన్నంటే ఈ సంబరాలెందుకు..? 

నయాగరా...

జలపాతం

జలజల...దూకినట్లు

గంగా గోదారి

గలగల..పారినట్లు

పరవళ్ళు తొక్కినట్లు... 

"నాటు నాటు" పాటను 

కాలభైరవ...రాహుల్ సిప్లీగంజ్ 

అత్యద్భుతంగా గానం చేసినందుకు...


అంబరాన్నంటే ఈ సంబరాలెందుకు..?

నాటు నాటు పాటను 

విన్న ఏటికాడి ఏనుగులు 

సైతం ఎగిరి గంతులేసేట్టు  

కొరియోగ్రాఫర్... ప్రేమ్ రక్షిత్ 

అత్యద్భుతంగా కంపోజ్ చేయగా 

యంగ్ & ఎనర్జిటిక్ హీరోలు

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ 

పోటీపడి అదిరేటి స్టైలిష్ స్టెప్పులేసి

ప్రపంచప్రేక్షకుల్ని ఉర్రూతలూగించినందుకు.


సోషియల్ మీడియా కోడైకూసేదెందుకు..?

భారతీయ తెలుగు సినిమాలు 

ఆస్కార్ అవార్డులందుకునేందుకు...

రాజమౌళి చక్కని రాచబాట వేసినందుకు.


అంబరాన్నంటే ఈ సంబరాలెందుకు..? 

ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకులు

ప్రశంసలవర్షం కురిపించిన 

ఆర్ ఆర్ ఆర్ చిత్రశిల్పిరాజమౌళి 

గోల్డెన్ గ్లోబ్ అవార్డు...

సినీ క్రిటిక్స్ అవార్డు....

ఆస్కార్ అవార్డులతో...

" హ్యాట్రిక్ " కొట్టినందుకు.

అందుకే అంబరాన్నంటే ఈ సంబరాలు...!


79. ఓ అందాల బాపు బొమ్మా ! 


అందాలు ఆరబోసే

ఓ బంగారు బాపు బొమ్మా 

ఒక్కసారి ఒకే ఒక్కసారి 

తొంగి తొంగి దొంగచాటుగా

కొంగుచాటు అందాలన్ని

కొరుక్కు తినేలా

నక్కలా నక్కినక్కి చూసే 

ఓ పిచ్చికుక్కా ఛీ...పో...

అని...అన్నావంటే... 

కసురుకున్నావంటే చాలు 


ఒక్కసారి కోపంతో 

కొరడాతో కొట్టినట్టు... 

చెప్పు విసిరినట్టు... 

కాలి భస్మమైపోయేలా

కళ్ళెర్రజేసి కట్టడి చేయవచ్చు 

లేదా కొరకొర చురచుర చూసినా...

కఠినంగా మాట్లాడినా...చాలు 


ఏ పోకిరి కుక్క 

నీ వెంట పడదు

నీ చుట్టూర తిరగదు

నీవున్న చోటకు రాదు 

నిన్ను కన్నెత్తి చూడదు 


నిజానికి ఎవరైనా 

పెడితేనే తింటారు... 

చెబితేనే వింటారు...

అమ్మితేనే కొంటారు...

ఇస్తేనే తీసుకుంటారు...

నమ్మితేనే మోసం చేస్తారు...


ఔను ఇది పచ్చినిజం...

ఉన్మాదంతో నీవు ఊహల్లో

ఊరేగుతున్నంతకాలం

నీ పయణం మాత్రం ఊబిలోకే...

ఇది నిజం ఎవరూ కాదనలేని పచ్చినిజం...


80. అక్షరానికి ఆస్కార్ అవార్డు...?


ప్రతిష్టాత్మకమైన 

ఆస్కార్ ను గెలుచుకున్న 

"ఆర్ ఆర్ ఆర్ తెలుగు చిత్రం"

నా "తెలుగు తల్లి" నుదుట

దర్శక దిగ్గజం రాజమౌళి

దిద్దిన‌ "సింధూర తిలకం" 

ఆస్కార్ అవార్డుతో

తేనెలూరే నా తెలుగు 

"పాటకు జరిగింది పట్టాభిషేకం"

ప్రపంచ వ్యాప్తంగా 

వెలిగే నా "తెలుగు జాతికి"

ఇది ఓ గర్వకారణం..! ఓ పర్వదినం..! 


అసలు అదృష్టవంతులెవరు ?

ఇది ఎవరి కృషికి కసికి నిదర్శనం ? 

ఎందరి శ్రమకు కళానైపుణ్యానికి

విశ్వవేదిక సాక్షిగా దక్కినదీ ప్రతిఫలితం ?


నిజానికి... 

నేడు "ఆస్కార్ అవార్డు గ్రహీత"

ఎవరో కాదు నా "తెలుగు అక్షరమే"

తెలుగుభాషలో పొదిగిన

ఆణిముత్యాలవంటి 

యాభైయారు అక్షరాల్లో 

మొదటి రెండు అక్షరాలే 

మహత్తరమైన మాంత్రికశక్తి

దాగిన "బీజాక్షరాలు" 

అ...తరువాత...ఆ... ఉంది

అ...మ్మ ఉంది 

ఆ...కలి ఉంది 

అ...మృతముంది

ఆ...కర్షణ ఉంది

అ...ద్భుతం ఉంది

ఆ...స్కార్ అవార్డు ఉంది... 


నా "తెలుగు అక్షరం"

మొన్న "నింగిలో మెరిసే నక్షత్రం"

నిన్న "నిశిరాత్రిలో నిండు పున్నమి"

నేడు విశ్వానికే విస్మయం కలిగించి

"నాటు నాటు" అంటూ 

ప్రపంచానికే తెలుగు వెలుగులు 

పంచిన "సుప్రభాత సూర్యకిరణం"


నిన్న... 

గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో

నా "తెలుగు అక్షరం"

గంగా గోదావరిలా గంతులేసింది

నేడు... 

ఈ ఆస్కార్ అవార్డుతో

నా "తెలుగు భాష" 

ఒక పసిఫిక్ 

మహాసముద్రమై ఉప్పొంగిపోయింది

నా "పాటకు జరిగింది పట్టాభిషేకం"

నా "అక్షరానికి దక్కింది ఆస్కార్ అవార్డు" 


81. అందాలు ఆరబోసే 

      ఓ బంగారు బొమ్మా !


అందాలారబోసి విందులుజేసే 

ఓ బంగారు బాపు బొమ్మా !

గంగిరెద్దులా ఊరంతా ఊరేగే వాడు 

నేడు గాలిలో ముద్దులు పంపాడని

గజ్జెల గుర్రంలా...గంతులు వేయకు... 


రేపు నీవు "నో" అన్న

మరుక్షణం నీకు మరణమే శరణ్యం..!

వాడు గోముఖ వ్యాఘ్రమై

నీ "గొంతు" కోయవచ్చు... 

నీపై "యాసిడ్ దాడి" చేయవచ్చు...

నిన్ను కాల్చి "బూడిద" చేయవచ్చు... 

గోటితో పోయేది గొడ్డలిదాకా రావొచ్చు...


చూపులు కలిసిన శుభవేళ 

ఆమాయగాడి మాటలు నమ్మి

నీవు "మన్మధబాణాలు" విసిరితే

ఇక నీ చుట్టూర "ముళ్ళ కంచెలే"...


ఒకరు పిచ్చికుక్కలా రెచ్చిపోతుంటే... 

నీచుట్టే బొంగరమల్లే తిరుగుతువుంటే... 

అందుకు కారణం...

నీవే కావొచ్చు...నీ మౌనమే కావొచ్చు...

బహిర్గతం కాని నీ బలహీనతే కావొచ్చు... 

చూసీచూడనట్టు...పట్టీపట్టనట్టు వున్న 

నీ పిరికి తనమే కావొచ్చు ...

నీ మంచితనమే కావొచ్చు...

నీ అమాయకత్వమే కావొచ్చు... 


కానీ ఒక్కసారి కోపంతో...

చెప్పుతోనో...కొరడాతోనో కొట్టినట్టు 

కళ్ళెర్రజేసి...కాలి భస్మమైపోయేలా

కొరకొర...చురచుర...చూసినా...

కఠినంగా మాట్లాడినా... 

ఒక్కసారి ఛీ...పోరా...కుక్కా... 

అన్నా...చాలు నీ చుట్టెవరూ తిరగరు

నీకెదురు పడేందుకెవరూ సాహసించరు

నిన్ను కన్నెత్తి చూడరు నీ వెంట పడరు


నిజానికి ఎవరైనా 

చెబితేనే వింటారు...పెడితేనే తింటారు

అమ్మితేనే కొంటారు...ఇస్తేనే తీసుకుంటారు

నమ్మితేనే నట్టేట ముంచుతారు....


ఇది నిజం పచ్చినిజం...

ఓ బంగారు బాపు బొమ్మా!

ఒక్క మాట గుర్తుంచుకో

"ఉన్మాదంతో " నీవు ఊహల్లో

ఊరేగుతున్నంతకాలం

నీ ప్రయాణం మాత్రం "ఊబిలోకే"...

ఇది నిజం ఇది పచ్చినిజమే...


82. మానసిక రోగులుంటారు 

జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త !!


గుడి మెట్లు 

ఎక్కేవారిని దిగేవారిని 

నిక్కి నిక్కి నక్కినక్కి 

వొంగి వొంగి తొంగి తొంగి 

దొంగచూపులు చూస్తూ 

మాట్లాడక పోతేనేమి?

కనిపిస్తే చాలు కడుపు

నిండినట్లుగా...

మానసికానందం పొందే... 

"తప్పుడు తలంపులు"...

"వంకర చూపులు...వక్రబుద్ధి"గల

"పిచ్చికుక్కల"..... ప్రతి రూపాలే"...

"మతి చెడిన మానసిక రోగులు"... 


గుడి ముందే 

గబ్బిలంలా 

వ్రేలాడుతూ... 

కాలు గాలిన 

పిల్లిలా తిరుగుతూ...

అటూ ఇటూ తచ్చట్లాడుతూ...

దిగుతూ మెట్లు ఎవరో పిలిచినట్లు

దిగ్గున వెనక్కి తిరిగి చూసి 

మనిషి కనిపిస్తే చాలు 

మానసికానందం పొందే... 

"టక్కరి నక్కల"... 

"పోకిరి కుక్కల"ప్రతిరూపాలే"...

"మతి చెడిన మానసిక రోగులు"...


ఔను 

మన చుట్టే ఉంటారు... 

మన ప్రక్కనే ఉంటారు... 

ప్రక్కలో బల్లెంలా ఉంటారు... 

పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతుంటారు

"కొందరు మతిచెడిన మానసిక రోగులు"... 

"చిరునవ్వులు నవ్వే...చీడపురుగులు...  

అందుకే జాగ్రత్త ! జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త !!

మానసిక రోగులుంటారు 

జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త !!


83. జయహో ...! జయహో...!

నిఖత్ జరీన్...జయహో..! జయహో..!


నిజామాబాద్ లో 

నిరుపేద కుటుంబంలో పుట్టిన

ఓ నిప్పురవ్వా ..!

ఓ నా తెలంగాణ తెలుగు బిడ్డా..!


మొన్న టర్కీలో ...

ఓ బంగారు పతకం... 

సాధించిన 

ఓ రాళ్ళలో రత్నమా..!

ఓ మట్టిలో మాణిక్యమా..!


నిన్న న్యూఢిల్లీలో...

జావేద్ ఇండోర్ స్టేడియంలో 

కసితో కృషితో కఠోర సాధనతో 

కదనరంగంలోకి సివంగిలా దూకి 

64 దేశాల క్రీడాకారులతో జరిగే ప్రపంచ 

మహిళా బాక్సింగ్ పోటీలో పాల్గొని 

5-0 తో బలమైన వియత్నాం ప్రత్యర్ధి

గుయెన్ తి తామ్ పై పిడుగుల వర్షం

కురిపించి మట్టి కరిపించి 50 కేజీల 

విభాగంలో రెండోసారి ప్రపంచ మహిళా 

బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 గెలిచి...

 

"బంగారు పతకాన్ని" సాధించి...

"లక్ష డాలర్ల ప్రైజ్ మనిని" 

"మహీంద్రా కారును" సొంతం చేసుకుని

మేటి భారతీయ బాక్సర్...

మేరీ కోమ్ స్థాయికెదిగిన...

ఓ ఎవరెస్టు శిఖరమా..!

ఓ కోహినూర్ వజ్రమా..!


మొన్న నీవు బాక్సింగ్ లో

"విశ్వవిజేతగా" నిలిచిన వేళ

బహుమతి ప్రదానోత్సవంలో 

టర్కీలో క్రీడా మైదానంలో నా 

"జాతీయగీతం"మారుమ్రోగిపోయింది


విశ్వంలో...వినీలాకాశంలో...  

నా భారతీయ "త్రివర్ణ పతాకం"

విజయగర్వంతో రెపరెలాడింది 

విందులు చేసింది 

విహంగమై స్వేచ్ఛగా విహరించింది

ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంది


అందుకే... 

ఓ మా తెలుగు తేజమా..!

ఓ మా వెలుగు కిరణమా..!

ఓ మా పసిడి పావురమా..!

ఓ మా నిజామాబాద్ నిప్పురవ్వా ..!

ఓ మా తెలంగాణ తెలుగు బిడ్డా..!

నా తల్లి భరత మాత మెడలో 

మెరిసే ఓ బంగారు పచ్చల హారమా..!

నా భారత జాతికి ఖండాంతర ఖ్యాతిని

ఆర్జించిన ఓ నిఖత్ జరీనా నీ జన్మధన్యం

నిన్ను కన్నవారెంతటి అదృష్టవంతులోకదా


జయహో ...! జయహో...! 

నిఖత్ జరీనా...జయహో..! జయహో..!

పసిడి పతకమందుకున్న వేళ ఆనందహేల

అందుకో...మా అభినందన మందార మాల


84. మూడుకాలాల అంచున మృత్యువే..?


గతాన్ని... 

నెమరు వేసుకుంటే మిగిలేది...

తీరని...వ్యధే...బాధే...వేదనే...రోదనే...

"గతం" ఒక భయంకరమైన భూతం"


వర్తమానంలో... 

మునిగితే...

అంతులేని 

ఆనందం... 

బ్రహ్మానందం... 

పరమానందం... 

మానసికానందం...మీ సొంతం... 

"వర్తమానం" పరమాత్మ ప్రసాదించే వరం" 


బంగారు భవిష్యత్ ను... 

ఊహించుకుంటూ... 

ఉల్లాసంతో...

ఉత్సాహంతో...

సహనంతో... 

సాహసంతో...

సాగిపోతే ముందుకు ఇక

ముందు జీవితం విందు భోజనమే...

"భవిష్యత్తు"భగవంతుడిచ్చు బంగారు నిధి" 


కానీ మూడుకాలాల అంచున 

మృత్యువు దాగి ఉంటుంది 

ముళ్ళకంచెలా కళ్ళకు కనిపించక...


ఈ మూడుకాలాల్లో 

"వర్తమానమే నవవసంతం"... 

నీవనుభవించినా అనుభవించకున్నా‌ 

మృత్యువు వినిపిస్తూంది మృదంగనాదం...

కన్నుమూసి తెరిచేలోగా...

నిన్ను కాలగర్భంలోకి లాక్కెళ్తుంది...

నిస్సందేహంగా...నిర్దాక్షిణ్యంగా...నిశ్శబ్దంగా

అందుకే దాన్ని...

అనుభవించు...ఆనందించు...అస్తమించు


85. ఉగాది పర్వదినమంటే...


కంటికి కనిపించక రాత్రికిరాత్రే 

కాలసర్పమై కాటువేసిన

రక్తసంబంధాలను రద్దుచేసిన

మాయదారి మహమ్మారినికన్న

శార్వరినామ సంవత్సరాదికి 

విషాదంతో... వీడ్కోలు... 


కరోనాను ఖతంచేసే విరుగుడు 

మందైన వ్యాక్సిన్ ను ప్రసాదించిన 

ప్లవనామ సంవత్సర ఉగాదికి స్వాగతం 

సుస్వాగతం...ఘనస్వాగతం...


ఉగాది పర్వదినమంటే...

తెలుగులోగిళ్ళకు తొలిపర్వదినమే...

నక్రత్ర కాలగమనమే 

"వసంతఋతువు" ఆగమనమే...

"బ్రహ్మదేవుడిచే"

సకలచరార సృష్టి జరిగినదినమే...

"శాలివాహన చక్రవర్తి"

పట్టాభిషక్తుడైన‌ శుభదినమే...


ఉగాది పర్వదినమంటే...

మన "తెలుగు నెల" 

చైత్ర మాసం ప్రారంభమే...

మన "తెలుగు నేల" పులకించేవేళ... 

"తెలుగుజాతి" 

నిండుపున్నమిలా వెలిగేదినమే...

అంతర్జాలంలో పంచాంగం శ్రవణమే...

కవిసమ్మేళనాల్లో

మన "తెలుగుభాషకు"

కమ్మని కవితలతో కనకాభిషేకమే...

మన "తెలుగు తల్లికి"

పసందైన పద్యాలతో పట్టాభిషేకమే...


ఉగాది పర్వదినమంటే... 

ఒక ఉషోదయమే...

ఉగాది పర్వదినమంటే...

శుభకార్యాలకు ఒక శుభముహూర్తమే....


86. ఆవేశం వద్దు - ఆలోచనే ముద్దు


క్షణికావేశంతోనో

మొండితనంతోనో

ఆత్మహత్యలకు సిద్దపడే 

ఓ అవివేకులారా ! 

ఓ ఆవేశపరులారా

ఓ అమాయకులారా ! 

ఓ నవయువకులారా !


ఈ జీవితమే 

ఒక యుద్ధరంగం

శత్రువులతో పోరాడాలి 

పోరాడి గెలవాలి

వెర్రివారిలా వెనుతిరగరాదు

పిరికి పందల్లా పారిపోరాదు

చిట్టచివరి రక్తపు బొట్టువరకు 

చివరి శ్వాస వరకు పోరాడాలి


బద్దవిరోధులకు బుద్ది చెప్పాలి

గుడ్డిగా విమర్శించేవారికి 

గుర్తుండేలా గుణపాఠం నేర్పాలి

అప్పుడే మీ చావుకు ఒక అర్థం

అప్పుడే మీ జన్మకు ఒక సార్థకత


పరీక్షలో ఫెయిలైనందుకో...

ప్రేమ విఫలమైనందుకో...

వ్యాపారంలోనో... 

వ్యయసాయంలోనో...

భారీగా నష్టమొచ్చినందుకో...

నిర్వేదంతో...నిరుద్యోగంతో... 

ఏ పురుగుమందు త్రాగో...

ఏ ఫ్యానుకు ఉరివేసుకొనో... 

ఏ ఎత్తైన బిల్డింగ్ పైకెక్కిదూకో...

రక్తపు మడుగులో గిలగిలలాడి

చచ్చిపోయి సాధించే దేముంది?


కట్టై స్మశానంలో కాలడం తప్ప...

కన్నతల్లిదండ్రులకు గుండెకోత తప్ప...

చావు సమస్యలకు పరిష్కారమా? కాదే

సమస్యలు ఎదురైతే వీరుల్లా పోరాడాలి

వొద్దు వొద్దు ఆత్మహత్యలకు పాల్పడవద్దు

వొద్దు వొద్దు క్షణికావేశానికి గురికావద్దు

వొద్దు వొద్దు ఓ మా బంగారు బిడ్డలారా...

మీ బంగారు భవిష్యత్తును బలిచేసుకోవద్దు


87. వద్దువద్దు ! 

ఆత్మహత్యలకు పాల్పడొద్దు 


ఆత్మహత్యలకు సిద్దపడే

ఓ అజ్ఞానులారా ! అవివేకులారా !

ఓ అమాయకులారా ! నవయువకులారా !

ఆలోచనారహితులై ఆవేశంలో...

అంతులేని మొండితనంతో...

మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటారా..?

మీ కంటిని మీరే పొడుచుకుంటారా..?

మీ ఇంటికి మీరే నిప్పు పెట్టుకుంటారా..?

మీ గొయ్యిని మీరే తవ్వుకుంటారా...?

మీ సమాధిని మీరే కట్టుకుంటారా..?

ఐతే మీరు నిస్సందేహంగా... 

కళ్ళున్న అంధులే....గొర్రెల మందలే... 

ప్రేమవిలువ...ఎరుగని పిరికిపందలే...


సమస్యలే ఎదురైతే వీరకిశోరులై

చిట్టచివరి శ్వాస వరకు పోరాడాలి

ఆవేశపడి చచ్చి సాధించేదేముంది?

చావు సమస్యలకు పరిష్కారమా కానేకాదు


మిమ్మును అణగదొక్కేవారికి 

మీ అభివృద్ధిని, మీ పచ్చదనాన్ని 

చూసి ఓర్వలేనివారికి,విమర్శించేవారికి

అకారణంగా నిందలు వేసేవారికి

మానసికంగా హింసించినవారికి


మిమ్మల్ని చిన్నచూపు చూసేవారికి

నమ్మించి నట్టేటముంచేవారికి

వెనుక లోతుగా గోతులు త్రవ్వేవారికి

మీ చావుకోసం నిత్యం ఎదురు చూసేవారికి

మీరు అకస్మాత్తుగా చిమ్మచీకటిలోకెళ్ళిపోతే

మీ పతనాన్ని కోరుకునే వారికి పండగే కదా


అసలు ఈ జీవితమే ఒక యుద్ధరంగం

శత్రువులతో పోరాడాలి పోరాడి గెలవాలి

వెర్రివారిలా వెనుతిరగిపోరాదు

పిరికి పందల్లా పారిపోరాదు

చిట్టచివరి రక్తపు బొట్టువరకు 

చివరి శ్వాస వరకు పోరాడాలి

బద్దవిరోధులందరికి బుద్ది చెప్పాలి

గుడ్డిగా విమర్శించేవారికి 

గుణపాఠం నేర్పాలి

అప్పుడే మీ జన్మకు సార్థకత

అప్పుడే మీ చావుకు ఒక అర్థం


పరీక్షలో ఫెయిలైనందుకో...

ప్రేమ విఫలమైనందుకో...

వ్యయసాయంలోనో, వ్యాపారంలోనో 

భారీగా నష్టం వచ్చినందుకో...

ఏ పురుగుమందు త్రాగో...

ఏ ఫ్యానుకు ఉరివేసుకొనో... 

ఏ ఎత్తైన బిల్డింగ్ పైకెక్కిదూకో

ఛస్తే ఏముంది ?

కట్టై స్మశానంలో కాలడం తప్ప...

కన్నతల్లిదండ్రులకు 

గుండెకోతను మిగిల్చడం తప్ప...

వద్దు వద్దు ఆత్మహత్యలకు పాల్పడవద్దు

మీబంగారు భవిష్యత్తును బలిచేసుకోవద్దు


88. శతమానం భవతీ !

సర్వేజనా సుఖినోభవంతు !!


ఓ మిత్రులారా ! 

సాహితీ మూర్తులారా !

ఈ శుభకృత్ నామ సంవత్సరాన

మీకిదే నా శుభసందేశం

మీ అందరికిదే 

నా ఉగాది ఫర్వదిన పంచాంగ శ్రవణం 


ఎందరో 

మహానుభావులు

అందరికీ వందనాలు

ఓ సంపాదకులారా !

ఓ సాహితీ మిత్రులారా!

ఓ సరస్వతీ పుత్రులారా! 

ఓ నా శ్రేయోభిలాషులారా!

మీ అందరికీ శుభం కలుగును గాక !


అంతులేని 

ఆనందసాగరాన 

ఎగిసి ఎగిసిపడే

మీ ఆలోచనల అలలు 

ఆవలితీరం చేరును గాక !

శుభాలనొసగే ఆ సుందర

కిరణాల సూర్యబింబం 

మీ కొత్తకోర్కెలను తీర్చును గాక !


ఆ ఏడుకొండల వెంకన్న

మీకు వెయ్యేనుగుల 

బలాన్నిచ్చునుగాక!  

లక్ష కోట్లనక్షత్రాలకాంతిని 

మీ బంగరు బ్రతుకుబాటలో 

విరజిమ్మునుగాక !


మీరుచేసే "ప్రతిపని" 

పచ్చనిచెట్టులాఎదిగి పుష్కలంగా 

అతిమధురమైన ఫలాలను 

అందించును గాక !


మీరువేసే "ప్రతిఅడుగు"

చక్కని పూలమొక్కైఅది

అందమైన మందారాలను 

గుభాళించే గులాబీలను 

మత్తెక్కించే మరుమల్లెలను

పుష్పించి మిమ్మల్ని 

పులకింపజేయును గాక !


మీరుతీసుకునే "ప్రతినిర్ణయం" 

భగభగమండే నిప్పుకణికై

మీభవిష్యత్తును 

భోగభాగ్యాలతో నింపును గాక !


మీ‌ సకల సమస్యలు ఎండిన

అరిటాకుల్లా రాలిపోవును గాక !

మీ సత్సంకల్పాలన్నీ సిద్దించును గాక !

మీ సంతోష సంబరాల 

సందడి అంబరాన్ని తాకును గాక !


మీ మదిలో శాంతిసుధలు...

మీ ఇంటిలో సిరిసంపదలు... 

మీ కన్నీళ్ళతో కాంతిరేఖలు...

మీ ముఖంలో చిరునవ్వులు... 

మీ అలసిన గుండెలనిండా 

అంతులేని ఆత్మతృప్తి...

మీ శేషజీవితమంతా 

ఊహలకందని ప్రశాంతత... 


జలపాతాలై జలజల దూకును గాక !

సెలయేరులై గలగల ప్రవహించును గాక !

కుంభవర్షాలై కుండపోతగా 

కురియును గాక !

మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో

సుఖశాంతులతో విలసిల్లుదురు గాక !

పిల్లాపాపలతో చల్లగా నిండూనూరేళ్ళు

హాయిగా ఆనందంగా వర్థిల్లుదురు గాక !

ఇదే నా ఉగాది పర్వదిన పంచాంగ శ్రవణం


అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు...


89. ఆరిపోయే దీపాలకు...ఆశ ఎక్కువ..! 


కనులు...........కానరానినాడు 

చెవులు...........వినలేనినాడు

నీ తిండి నీవు...తినలేనినాడు 

ఇంకా బ్రతకాలనుకోవడం...అవసరమా? 


నీ ఆకలి....ఆరనినాడు

నీ ఆశలు...తీరనినాడు

ఇంకా జీవించాలను కోవడం...న్యాయమా?


చేతిలో డబ్బులు...............లేనినాడు

వచ్చిన మొండి జబ్బులు....పోనినాడు 

ఇంకా ఎందుకు? ఈ జీవితం మీద ప్రేమ !


ఆదరించే వారే..........కరువైననాడు 

అందరికీ నీ బ్రతుకు...బరువైననాడు 

ఇంకా బ్రతకాలను కోవడం...వెర్రికాదా?


కాటికాడి కాకులు...రమ్మంటుంటే 

కడుపున పుట్టిన కన్నబిడ్డలే 

కాటికి నిన్ను.........పొమ్మంటుంటే 

ఇందరికి భారమైనవేళ 

ఇంకా ఎందుకు ఈ భూమిపైన?


రెక్కలు వచ్చిన

ఏపక్షీ ఎగరకమానదు

రెక్కలు విరిగిన

ఏ పక్షికి విలువ వుండదు 

అందుకే ఈ బ్రతుకెందులకో అర్థం కాదు 

ఇంకా ఇంకా బ్రతకాలని... 

ఆశపడడమంటే

ఇంకా ఇంకా నిరాదరణకు...

నిందలకు...గురికావడమే....

బాధలకు...బలికావడమే....

ప్రత్యక్ష నరకాన్ని అనుభవించడమే...


కానీ 

మా ఈ ఆకలి కేకలు 

కావాలి వారికి కాంతిరేఖలు

మా ఈ అగని కన్నీళ్లు 

కావాలి వారికి గంగాతీర్ధం 

కారాదు మేమెవరికీ పెనుభారం

కారాదు మా బిడ్డల బ్రతుకు అంధకారం

ఓ దయగల దైవమా!

చేర్చండి మమ్ము...త్వరగా ఆవిలి తీరం


ఐనా పాపం

ఆరిపోయే ఈ దీపాలకు...

ఆశ ఎక్కువ..! ఆవేశ మెక్కువ..!


90. ప్రశంసే ఒక ప్రేరణ..!!!


ఇద్దరు పోటీ పడితే

ఒక్కరికే దక్కేను...గెలుపు

గెలిచిన వారిని...అభినందిస్తూ 

ఆలింగనం చేసుకుంటే...

ఓడిన వారిని... 

భుజం తట్టి ఓదార్చితే... 

ఇద్దరికీ దక్కేను ...ఆత్మతృప్తి 


ప్రశంసిస్తూ మీరు తెలిపే 

ఆ "స్పందన...ఆ అభినందనే"...

మీలోని 

మంచికి...

పరిమళించే 

మీ మానవత్వానికి...

నిర్మలమైన మీ వ్యక్తిత్వానికి... 

నిష్కల్మషమైన మీ మనసుకు...

నిజమైన మీ స్నేహానికి నిదర్శనం... 


అందుకే అంటారు 

అనుభవగ్నులుమీ మిత్రులను 

"పదిమందిలో ప్రశంసించాలని"

"ఏకాంతంగా మందలించాలని"


ఈ ప్రపంచాన 

మంచిని మించిన సుగుణమేముంది..?


ఒక కవిని... 

ప్రశంసిస్తే పోయేదేముంది..?

మరో కమ్మని కవితకు జననం తప్ప...


ఒక ఆటగాన్ని... 

అభినందిస్తే పోయేదేముంది..?

మరో విజయానికి పునాదివేయడం తప్ప...


ఒక విద్యార్థిని... 

భుజం తడితే పోయేదేముంది..? అది

రేపువాని ఉజ్వల భవిష్యత్తుకు ప్రేరణే తప్ప


ఔను ప్రశంసించే...

మంచిమనసున్న వారంతా...

రాళ్ళలో నుండి రత్నాలను...

మట్టిలో నుండి మాణిక్యాలను...

వెలికితీసే మహనీయులే మార్గదర్శకులు..

స్పూర్తిప్రదాతలు...సదా చిరస్మరణీయులు.


91. ఓ గురుదేవుళ్ళారా ! 

మీకు పాదాభివందనాలు !!


ఓ గురుదేవుళ్ళారా !

మేము పుట్టగానే

బడిలో అడుగుపెట్టగానే

పరిమళించే 

పువ్వులని పసిగట్టేది...మీరే


మమ్ము కనని 

అమ్మానాన్నలు...మీరే

మా భవిష్యత్తు 

భవననిర్మాతలు...మీరే

మా జీవిత చక్రాలను తిప్పే

విష్ణుచక్రాలు మీ చేతుల్లోనే

మా దారిలో దీపాలు...మీరే

మా జీవితమార్గ నిర్దేశకులు...మీరే


మేము చదువుల్లో దిట్టలమైతే

మొట్టమొదట 

భుజం తట్టేది...మీరే

సాన బట్టేది...మీరే 

ముందుకు నెట్టేది...మీరే

మమ్ము రాళ్ళలో రత్నాలుగా

మట్టిలో మాణిక్యాలు తీర్చిదిద్దేది...మీరే


ఓ గురుదేవుళ్ళారా !

మా ఉజ్వల భవిష్యత్తును 

నిర్మించేది...మీరే

మాలో అభ్యుదయ భావాలను 

రగిలించేది... మీరే

మా హృదయాన్ని 

వికసింపజేసేది...మీరే

ఒక "కన్నతల్లిలా "

బుజ్జగించిబుద్దిచెప్పేది...మీరే


ఒక "కన్నతండ్రిలా 

చేయిబట్టి 

నడిపించేది... మీరే

ఒక "ప్రాణస్నేహితుడిలా" 

ఎవరెస్టుశిఖరమంత

ఎత్తుకు మేము ఎదగాలని 

ఆశించేది...మీరే

ఆపదలో "భగవంతుడిలా" 

ఆదుకునేది... మీరే

మా బ్రతుకులను 

బంగారుమయం చేసేది...మీరే


ఓ‌ గురుదేవుళ్ళారా !

మీరు నేలమీదున్నా...

మేము మాత్రం

వినువీధుల్లో...విదేశాల్లో...

విమానాలలో

విహరించాలని కలలు కనేది...మీరే


ఆ కలలే నిజమై మేము...

డాక్టర్లం...సినిమా యాక్టర్లం...కలెక్టర్లం...

కంప్యూటర్ ఇంజనీర్లమైతే...

రాజకీయ నేతలమై రాజ్యాలనేలితే...

ఉప్పొంగి పోయేది...మీ గుప్పెడు మనసే


ఆ కలలే నిజమై మేము...

సైంటిస్టులం...

అంతరిక్ష పరిశోధకులం...

వ్యోమగాములం...

మీలా ఉపాధ్యాయులమైతే...

పరవశించిపోయేది...

మీ పసిహృదయాలే...

మేము గురువులను

మించిన శిష్యులమైతే...

"ధీర్ఘాయుష్మాన్ భవా"యని 

దీవించేది..మీరే


ఓ గురుదేవుళ్ళారా !

బ్యాంకులో తీసుకున్న

కోట్ల రుణాన్ని 

ఈ జన్మలో తీర్చవచ్చు...

కాని ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనిది

మాకు జన్మనిచ్చిన 

అమ్మానాన్నల ఋణం...

మాకు ప్రాణంపోసిన ఆ బ్రహ్మ ఋణం...

మాకు జ్ఞానామృతం పంచిన మీ ఋణం...


ఓ గురుదేవుళ్ళారా !

మీకు రెండు చేతులెత్తి మొక్కుతాం...

మీ పాదాలకు పాలాభిషేకం చేస్తాం..

మా గుండెల్లో గుడి గట్టి 

గురు బ్రహ్మ గురు విష్ణుః 

గురుదేవో మహేశ్వరాః

గురుసాక్షాత్ పరబ్రహ్మ 

తస్మై శ్రీ గురువేనమః అంటూ...

 

ప్రతినిత్యం మిమ్మల్ని

దైవాలుగా పూజిస్తాం...

మా బిడ్డలకు మీ పేర్లే పెట్టుకుంటాం..

ఇదే మీకు మా గురుదక్షిణ...

ఇంతకుమించి ఇంకేమిచ్చి

మీ ఋణాన్ని తీర్చుకోగలం...చెప్పండి

ఓ గురుదేవుళ్ళారా ! మీకు వందనాలు !

అభివందనాలు ! పాదాభివందనాలు !! 


92. వీడ్కోలు కవిత

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 

గుంటూరు M.Com. M.B.A 

పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ కలయిక...

(తేది.18.03.2023)

సందర్భంగా ఒక 

(నాటి నా తోటి మిత్రులందరికీ అంకితం)


ఆహా ఆహా  ఏమి సందడి..!

ఏమి సంతోషం..! ఏమి ఆనందం..! 

అంబరాన్ని తాకే ఈ సంబరం...

అంతటా అలల కలల అలజడి...

ఎదలో ఎక్కడో తీపిజ్ఞాపకాల ఆరనితడి...

ఇది ఒక అపూర్వమైన ఆత్మీయ కలయిక...

ఇది ఒక అనిర్వచనీయమైన అనుభూతి...


అదిగో అదృశ్యంగా మనందరి 

మదిలో కదిలిపోతున్నాయి 

మధుర జ్ఞాపకాల

దొంతరలు తెరలు తెరలుగా... 

పిల్ల గాలులుగా ...

మంచు బిందువులుగా... 

ఎగురుతున్నాయి

గుంపులు గుంపులుగా...

రంగురంగుల రామచిలుకలుగా...


విరబూశాయి 

యూనివర్సిటీ క్యాంపస్ విరితోటలో...

కుసుమాలుగా...

గుండెల్లో గుభాళించే గులాబీలుగా...


ఈ క్యాంపస్ లోని గదులన్నీ

తీపితీపి జ్ఞాపకాల గనులేగా...

అందరి ముఖాలలో 

వెన్నెల్లా వెలుగే స్నేహాదీపాలేగా...


ఆహా ! ఎంతటి మధురాతి 

మధురమైనది..! 

ఈ అపూర్వమైన 

ఆత్మీయ కలయిక..!

ఆహా ఎంత తియ్యనిది..! 

ఈ ఆత్మీయ ఆలింగనం..!


అరే ఒరే...అసే ఒసే...అంటూ 

అతితియ్యని ఆత్మీయ పలకరింపుతో 

అందరి మది పులకరించి పోతుంది...

ఇది కలకాదుగా పగటి కలకాదుగా

కళ్ళు తెరిస్తే కరిగిపోడానికి...

తీరం దాటిన తుఫానులా... 

తీరని బాదై మిగిలిపోవడానికి... 


నేడు మెరిసే ముత్యాలుగా 

మనమంతా మూటకట్టుకొని పట్టుకుపోతున్న...

ఈ తరగని కరగని తీపి జ్ఞాపకాలు...


ఈ సాయం సంధ్య వేళ

మురిసి ముద్దైపోయిన 

బరువెక్కిపోయిన

హృదయ శిల్పాలపై 

అభిమానం అనురాగం ఆత్మీయత

చెరగని చిరునవ్వుల ఉలులతో

చెక్కిన సుందరమైన అజంతా శిల్పాలే...

ఈ తరగని కరగని మన తీపి జ్ఞాపకాలు...


రవి వర్మ గీసిన ఆ సప్తవర్ణ చిత్రాలే...

ఈ తరగని కరగని మన తీపిజ్ఞాపకాలు...


కాలం కాగితం మీద ఆ బ్రహ్మ

లిఖించిన కమ్మని కావ్యాలే... 

ఈ తరగని కరగని మన తీపిజ్ఞాపకాలు...


ఓ నా ప్రాణమిత్రులారా !

కనిపించని కన్నీటి ధారలతో...

వినిపించని మూగవేదనతో...రోదనతో

బరువెక్కిన బాధాతప్త హృదయాలతో 

తరలిపోతున్న మనం

మళ్ళీ మళ్ళీ కలుద్దాం...

ఎక్కడా...? ఎక్కడా ...?

ఎక్కడో..! ఎక్కడో..!ఏమో...

ఎప్పుడూ..?ఎప్పుడూ..?

ఎప్పుడో...? ఎప్పుడో ..?..

ఆ పరమాత్మ ...ప్రేమతో 

పిలవకపోతే...ఈ భువిలో

ఆపరమాత్మ ప్రేమతో పిలిస్తే...ఆ దీవిలో


మళ్ళీ మన గెట్ టు గెదర్...

ఎక్కడో...ఎప్పుడో ఎవరికెరుక...

ఏరులను...సెలయేరులను...

దారులను...ఎడారులను...ఏకం చేసే

బంధాలను...భవబంధాలను...

 అనుబంధాలను...స్నేహబంధాలను...

రక్త సంబంధాలను పెంచే 

తృటిలో తృంచే ఆ భగవంతునికి తప్ప...


ఈ అపూర్వ ఆత్మీయ కలయికకు 

తమ విలువైన సమయాన్ని వెచ్చించి 

అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన వారికి 

పేరుపేరున కృతజ్ఞతా కుసుమాంజలులు అర్పిస్తున్న...

మీ శ్రేయోభిలాషి...మీ ఆత్మీయ మిత్రుడు...


93. అభినవ బుద్దుడు అంబేద్కర్..!


అంబేద్కర్ అంటే....

ఉప్పెనలా తరలివచ్చిన 

లక్షలాదిమంది అభిమానులను

బౌద్ధంలోకి మార్చిన "అభినవ బుద్దుడు"


అంబేద్కర్ అంటే....

ఎందరో మేధావులతో నిండిన‌ 

జ్ఞానసభలో...భాస్కరుడిలా 

భగ్గునమండిన "పండిత ప్రకాండుడు"


అంబేద్కర్ అంటే....

ఎవరెన్ని విమర్శలు చేసినా విషం చిమ్మినా

ఎవరెన్ని ఘోరఅవమానాలకు గురిచేసినా

ఎవరెన్ని రాళ్లు విసిరినా ఆ రాళ్లనే మెట్లుగా 

మార్ఛుకున్న "స్థితప్రజ్ఞుడు...రాజనీతిజ్ఞుడు"


అంబేద్కర్ అంటే....

ఎన్నిఎదురు దెబ్బలు తగిలినా సహనంతో 

సహిస్తూ చలించక, తలవంచక, భయపడక

వెన్నుచూపక, వెనుతిరగక, ఒక్కడే 

ఒక సైన్యంలా ముందుకు దూసుకుపోయి 

ఒంటరిగా పోరాడిపోరాడి గెలిచిన వీరుడు  

మగధీరుడు..."మహర్ పులి...బాహుబలి"


అంబేద్కర్ అంటే....

పుట్టిననాటి నుండి గిట్టేవరకు

తన అంటరానిజాతి సుఖసంతోషాలకోసం

సంక్షేమంకోసం విముక్తికోసం అన్నిరంగాల్లో 

అభివృద్ధికోసం తన రక్తాన్ని ధారబోసిన

జీవితాన్ని అంకితంచేసిన మాహనీయుడు

మహా మేధావి...అరుణోదయ భాస్కరుడు

రాజ్యాంగ శిల్పి "భావిభారతస్పూర్తి ప్రదాత" 

అంబేద్కర్ అంటే....

మన గుండె గుడిలో నిలిచిన

మన వాడవాడలో విగ్రహమై వెలసిన

మహనీయుడు...మహోన్నతుడు

విశ్వ మానవుడు...జ్ఞాన సూర్యుడు  

అందరి దేవుడు...ఆపద్భాందవుడు

అణగారిన బడుగు బలహీన వర్గాల 

ఆశాజ్యోతి "అమరజీవి అంబేద్కరుడు" 


94. భగవంతుడే మన బంధువైతే..?


ఔను...! 

"ఆ భగవంతుడు"

నీ‌ బంధువైతే చాలు...

కాసిన్ని మాయలు 

కాసిన్ని మంత్రాలు

నీ సొంతమైతే చాలు...

నీవు రహస్యంగా

సృష్టించుకునే నీ రాజ్యానికి

నీవే మకుటంలేని మహారాజువి...


వేలకోట్ల వ్యాపారం చేయవచ్చు...

అంతులేని ఆస్తులు ఆర్జించవచ్చు...

విదేశాల్లో విమానాల్లో విహరించవచ్చు...

విశిష్ట పురస్కారాలను స్వీకరించవచ్చు...


వీధుల్లో భక్తులకు వీనులవిందైన 

సందేశాలు వినిపించవచ్చు...

విచ్చలవిడిగా విలాసాలలో 

మునిగి తేలవచ్చు... 

ఏసీ గదుల్లో శయనించవచ్చు...

ఏసీ కార్లలో పయనించవచ్చు...


బాబాలెందరో 

"భక్తుల బలహీనతలను"...

వారి "ఆతురతను...ఆందోళనలను"... 

వారి "అమాయకత్వాన్ని"...

వారి "మంచితనాన్ని"...

వారి "అతిమూఢత్వాన్ని"...

బాబాలంటే భగవత్ స్వరూపులన్న 

వారి"అతినమ్మకాన్ని‌" సొమ్ముచేసుకుంటూ

అధికారంలోని పెద్దల అండదండలతో

పట్టపగలు..‌దర్జాగా....బాబాలుగా... 

రాత్రుల్లో...దొరలుగా...దోచుకుని...

దాచుకునే...దోపిడీ దొంగలుగా...

విలాసవంతమైన జీవితాలను గడపొచ్చు


కానీ వారి "నిజరూపాన్ని" 

పదిమందికి తెలిపేదెవరు?

వారి "గుట్టును రట్టు" చేసేదెవరు ? 

వారికి గట్టిగా "బుద్ది" చెప్పేదెవరు?,

వారి "భాగోతాన్ని" బయటపెట్టేదెవరు? 

గుర్తుంచుకునే "గుణపాఠాలు" నేర్పేదెవరు?

ఎవరు...? ఎవరు...? ఎవరు...?


కొందరికి బాబాలు 

"బంగారు గుడ్లు పెట్టే బాతులు"...

బాబాల బ్రతుకులు బంగారుమయమే...

కానీ భక్తుల బ్రతుకులే భ్రమలో బ్రతుకులు

"బావిలో పడిన బంతిని" పైకి తియ్యవచ్చు

ఊబిలోపడిన బంతినే పైకి తియ్యలేరెవరు

ఔను "బాబాలను నమ్మిని భక్తులంతా"

"ఊబిలో పడి ఊపిరాడని ఉడుతలే"...


95. కాసింత జాగ్రత్తే చెల్లీ...!

నా బంగారు తల్లీ...!!


పది మందికి

నీ మంచితనాన్ని 

పంచడం మంచిదే

కానీ ఆ మంచితనం

ముసుగేసుకొని మానసిక 

రోగులు కొందరుంటారు 

మాయచేస్తు ఉంటారు

మత్తు చల్లుతుంటారు

కాసింత జాగ్రత్తే చెల్లీ..!

నా బంగారు తల్లీ...!!


నీ చుట్టూ... 

చాటుమాటుగా కాటువేసే

కాలసర్పాలు ఉంటాయి..‌.

తేనె పూసిన కత్తులుంటాయి...

గుంటనక్కలుంటాయి...

గుడ్లగూబలుంటాయి...

కాసింత జాగ్రత్తే చెల్లీ...!

నా బంగారు తల్లీ...!!


కానీ పట్టీ పట్టనట్లుగా...

చూసీ చూడనట్లుగా...

తెలిసీ తెలియనట్లుగా...

ఓ బండరాయి

నెత్తిన పడి

తల పగిలేదాకా...

కొంప మునిగేదాక... 

కొడవలితో గొంతు కోసేదాకా...

గొర్రెలా...అమాయకంగా 

అయోమయంగా...నీవుండరాదు ...


అదిగో అదిగో 

ముందున్నది పెను ముప్పే...

దాన్ని అంచనా వేయకపోవడం... 

దానిపై నిత్యం నిఘా పెట్టకపోవడం... 

అది నిప్పై కాలాక నిట్టూర్చడం నీ తప్పే...


96. కత్తితో కాదు...కంటిచూపుతో...


ఓ చెల్లీ..! 

నా బంగారు తల్లీ..!! 


నీవు ఒక్కసారి‌ 

ఉరిమి ఉరిమి 

చూస్తే చాలు...

కన్నెర్రచేస్తే చాలు... 


ఛీ...అంటూ 

ముఖాన

ఉమ్మేసినట్లుగా...

ఏ చెప్పునో 

విసిరినట్లుగా...

ఏ కొరడాతోనో 

కొట్టినట్లుగా...

ఏ గొడ్డలితోనో

నరికినట్లుగా...

ఏ బాకుతోనో

ఏ కత్తితోనో

పొడిచినట్లుగా...

ఏ గన్నుతోనో

కాల్చినట్లుగా...

కాలి బూడిదయ్యేలా

కోపంతో కొరకొర 

చురచుర చూస్తే చాలు...


ఏ "గుంటనక్క"

నీ వెంట పడదు...

ఏ "గజ్జి కుక్క"

నీ చుట్టూ తిరగదు...


కత్తితోనే కాదు 

కంటిచూపుతోనైనా...

కట్టడి చేయవచ్చు

కసాయి గూండాలనైనా... 


లేకున్న

"నీకు తెలియని 

లోపమేదో " 

"నీకు తెలియని

బలహీనతేదో "

నీలోనే దాగి ఉన్నట్లు...

నీకు తెలియకనే...నీవు

ఏదో మాయలో ఏదో మత్తులో 

పీకలదాకా మునిగిపోయినట్లు

ఇది నిజం ఎవరూ కాదనలేని పచ్చినిజం...


97. రెక్కలు విరిగిన విహంగం..!


రెక్కలు విరిగిన 

ఏ విహంగం వినువీధుల్లో 

విచ్చలవిడిగా విహరించలేదు


కూలీల హక్కులను 

కాలరాచే యజమానులు 

వీధిలో కుక్కలకన్న హీనమే


నిన్న మేము 

గజరాజులమన్నారు

గంతులేశారు కానీ నేడు 

గతిలేక గడ్డితింటున్నారు


నిన్న మేము 

మదపుటేనుగులం

మాకెదురు లేదన్నారు కానీ నేడు 

మతిచెడి మట్టి తింటున్నారు


నిన్న మేము 

నిప్పురవ్వలమన్నారు

భగ్గుమని మండిపోయారు 

కానీ నేడు బూడిదగా 

మారి మాయమైపోయారు 


విర్రవీగే వారంతా విశ్వంలో వెర్రివాళ్ళే

విధిని ఎదిరించి దాని గుండెల్లో నిదురించి 

విజయం సాధించిన వారేరా విశ్వవిజేతలు


98. అస్తమించని జ్ఞానసూర్యుడు

డాక్టర్.బిఆర్ అంబేద్కర్... 


మహర్ కులంలో

వెలిసిన వేగుచుక్క

గంజాయి వనంలో

మొలిచిన తులసి మొక్క 

దళితుల పాలిటిదైవం...

దారిచూపే దీపం...

అణగారిన పేదప్రజల ఆశాకిరణం...

ఓ అమరజీవి అంబేద్కర్ ! 

దండాలయ్య మీకు దండాలు!!

మీకు జన్మనిచ్చిన " 

ఆ అమ్మనాన్నలకు" కోటిదండాలు !


వీధి బడికెళ్తుంటే 

మిమ్ము వింతగా చూస్తుంటే 

విదేశాలకేగి ఉన్నత విద్యనార్జించి

బుక్కులెన్నో పఠించి హక్కులన్నీ గ్రహించి 

గాఢనిద్రలో ఉన్న 

గబ్బిలాలకు "జ్ఞానబోధ" చేసిన... 

బావిలోని కప్పలకు 

"బ్రతుకుదారి" చూపిన... 

కావు కావుమని అరిచే కాకులకు 

"కోకిలరాగాలు" నేర్పిన... 

పూరిగుడిసెలో పుట్టిన 

బహుజనులను "పులులుగా" మార్చిన... 

ఓ అమరజీవి అంబేద్కర్ !

దండాలయ్య మీకు దండాలు!!

మీ "ఆదర్శ భావాలకు" వేయి" దండాలు !


అణగారిన 

వర్గాల అభ్యున్నతికి 

జీవితాన్ని అంకితం చేసి 

ఊరూరా తిరిగి 

ఉద్యమాలు రేపి 

ఉపన్యాసాలతో 

ప్రజలను ఉర్రూతలూగించి 

మనిషి మనిషి 

మధ్య మంటలు రేపే

మనుశాస్త్రాన్ని మట్టుపెట్టి 

అడుగునున్న బడుగువర్గాల 

అభివృద్ధికి గొడుగు బట్టి 

పిచ్చిమతాచార్యుల

నెత్తిన పిడుగులాపడి  

అస్పృశ్యతను అంటరానితనాన్ని

నిరసించిన నిప్పులు కురిపించిన 

ఓ అమరజీవి అంబేద్కర్ ! 

దండాలయ్యా మీకు దండాలు !!

మీ "కండబలానికి 

గుండెబలానికి" కోటి" దండాలు !


కరెంట్ షాక్ కన్నా 

కాలకూటవిషం కన్నా 

అతిభయంకరమైన 

అంటరానితనానికి 

ఆహుతైపోకుండా అగ్రవర్ణాల 

వారి అడుగులకు మడుగులొత్తే 

బానిస బ్రతుక్కి బలైపోకుండా 

రాజ్యాంగ రక్షణలెన్నో కల్పించి 

కులంపేర... 

ఈ సమాజం క్రుళ్ళి పోకముందే 

కులమనే 

విశ్వవృక్షాన్ని కూకటివేళ్లతో సహా 

పెకలించి వేయాలని...ప్రబోధించిన... 

సాంఘిక దురాచారాలను 

"సమాధి" చేసిన... 

సమసమాజానికి "పునాది" వేసిన... 

ఓ అమరజీవి అంబేద్కర్ !

దండాలయ్యా మీకు దండాలు!! 

మీ "సాంఘిక సంస్కరణలకు" 

"శతకోటి" దండాలు !


ఓ మహాత్మా !

మీ రక్తాన్ని సిరాగా మార్చి 

భారత దేశానికి

రక్షణ కవచం లాంటి

రాజ్యాంగాన్ని రచించిన

ఓ మహామేధావీ

ఓ ఉద్యమకారుడా

ఓ జ్ఞానసూర్యుడా

ఓ బహుముఖ ప్రజ్ఞాశాలీ

ఓ భారత దేశ రాజ్యాంగ నిర్మాతా

ఓ భావిభారత స్పూర్తి ప్రదాతా 

మీరే మాకు దైవం !

మీ మాటే మాకు వేదం !

మీ బాటే మాకు శరణం !

మీ స్మరణే ఓ ప్రేరణ !

మీ అడుగుల్లో అడుగులు వేస్తాం !

మీ ఆశయాలకు 

మా జీవితాలను అంకితం చేస్తాం!!

ఓ అమరజీవి అంబేద్కర్ 

మీకిదే మా అక్షర నీరాజనం!!!


జైభీమ్...జై తెలుగుతల్లి...జై భారత్....


99. శ్రీ హనుమాన్ చిత్రకవిత..!


ఆహా !

చిత్రం ఏమి చిత్రం..! 

ఆచిత్రం బహు విచిత్రం..! 

ఆహా ఏమా నైపుణ్యం..?

ఏమా ఆ సృజనాత్మకత..?


రామా... 

రామా...అంటూ

రామనామాన్ని 

జపించినంతనే 

ఆ శ్రీరామచంద్రుడే

కనులముందు 

ప్రత్యక్షమైనట్లు...


క్షణాలలో 

కళ్ళముందర

రమణీయమైన

రంగుల్లో

కమనీయమైన

కనువిందైన

పసందైన 

అద్భుతమైన

అపురూపమైన

అద్వితీయమైన 

అతిసుందరమైన

"శ్రీ హనుమాన్ చిత్రం" 

"పళ్ళెంలో ప్రత్యక్షమాయెనే"..!


ఆహా..!

నాటి మేటి

చిత్రకారుడు 

"శ్రీ రవివర్మ"

వర్ణచిత్రాలనే

మైమరపించేలా

ఏమా చేతివ్రేళ్ళలో

దాగిన ఆ చిత్రకళ..!


ఓ మిత్రమా ! అది మీరు

మీ చేతివ్రేళ్ళతో చెక్కిన 

చిత్రంకాదు అది సాక్షాత్తు

మీకు "హనుమాన్ దర్శనమే"...

మీ జన్మధన్యమే...మీకు దక్కును పుణ్యమే


100. అమృత బిందువులు


అమ్మ 

ఆప్యాయత

ప్రేమాను రాగాలే 

"అమృత బిందువులు"


అక్కున చేర్చుకుని 

ఆదరించి నుదుట 

ముద్దాడి మురిపించే 

ఆ "చల్లని చేతులే" అందం 


లేత "మామిడి పూత" అందం 

కొమ్మల్లో "కోయిల కూత" అందం


వీచే "చిరుగాలే" అందం

వీనులకు విందైన "వేణుగానమే"

మధురం మధురం అతిమధురం


కల్లాకపటమెరుగని 

"పిల్లల మాటలే" మనోహరం

పరువాలు పొంగే పడుచు

పిల్లలకు అణుకువే " అలంకారం 

ఇంటిచుట్టూ ఉండు "పచ్చని" 

"పర్యావరణమే" పరమానందం 


ఇంటి ముంగిట వేసినట్లు 

"ముత్యాలముగ్గే " సింగారం 

ఇంటి ఇల్లాలికి "భర్తే " బంగారం

మగాడికి "ఉద్యోగమే" మణిమకుటం


పిల్లలకు "క్రమశిక్షణే" రక్షణ

పెద్దవాళ్ళకి "పెద్దరికమే" కిరీటం 

పిల్లలకు "అల్లరి చేష్టలే" ఆరోగ్యం 

ముసలివాళ్ళకు "మౌనమే" మంత్రం 


సుప్రభాతవేళ సుందరమైన 

"సూర్యకిరణాలెంతో" శుభకరం 

సంధ్యవేళ "చిరుదీపం" ఒక దీవెన  

కలతలు "కలహాలులేని "ఆలుమగల" 

"అనుబంధం" అపురూపమైన బంధం


101. నేటి...కన్నెపిల్లలే..!

రేపటి కన్నతల్లులు..!!


కమ్మని కలలుగానే 

నేటి.....కన్నెపిల్లలే 

రేపటి...కన్నతల్లులు 


నేటి....కొంటెకోడళ్లే

రేపు....ఇంటపెత్తనం 

చెలాయించే అత్తలు


శ్రమించే 

నేటి.....సేవకులే 

రేపటి... యజమానులు 


నేటి.....మట్టిలో విత్తనాలే 

రేపటి...మర్రివృక్షాలు


నేటి.....అలిగే అల్లుళ్ళే

రేపటి...మాయదారి మామలు


చురుకైన 

నేటి.....బాలలే 

రేపటి...భావిభారత నిర్మాతలు 


నేడు...సిగ్గుపడే మొగ్గలే 

రేపు....నవ్వులు రువ్వే పువ్వులు


నేటి.....అమ్మానాన్నలే 

రేపటి...అత్తామామలు అవ్వాతాతలు 


నేడు....ఓర్పుతో సహించిన ఓటమే

రేపటి...ఉజ్వల భవిష్యత్తుకు బంగారుబాట











































 







 













 






 







 













 







































 

































































































 






































 







Comments