ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలలో కవితా గానం...శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డా.కత్తిమండ ప్రతాప్ చే పోలయ్య కవి కూకట్లపల్లికి సాహితీ సత్కారం...

















ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలలో కవితా గానం...శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డా.కత్తిమండ ప్రతాప్ చే పోలయ్య కవి కూకట్లపల్లికి సాహితీ సత్కారం...

తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 48 గంటలపాటు నిర్విరామంగా 

నిర్వహించబడిన...ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలలో...భాగంగా జరిగిన కవిసమ్మేళనంలో...పాల్గొన్న ప్రముఖ కవి రచయిత పోలయ్య కూకట్లపల్లి "అస్తమించని జ్ఞాన సూర్యుడు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్"..! అన్న శీర్షికతో చేసిన కవితాగానం సభను అలరించింది

తన కవితలో...132 వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ చేసిన త్యాగాలను      సాహస కృత్యాలను ఆయన జీవిత దృశ్యాన్ని క్లుప్తసౌందర్యంగా వివరిస్తూ...ఆ మహనీయుడు...

మహర్ కులంలో

వెలిసిన వేగుచుక్క..!

గంజాయి వనంలో

మొలిచిన తులసి మొక్క..!

దళితుల పాలిటిదైవం..!

దారిచూపే దీపం..!

అణగారిన పేదప్రజల ఆశాకిరణం..!

ఓ అమరజీవి అంబేద్కర్ ! 

దండాలయ్య మీకు దండాలు!!

మీకు జన్మనిచ్చిన " 

ఆ అమ్మనాన్నలకు" కోటిదండాలు !

వీధి బడికెళ్తుంటే 

మిమ్ము వింతగా చూస్తుంటే 

విదేశాలకేగి ఉన్నత విద్యనార్జించి

బుక్కులెన్నో పఠించి హక్కులన్నీ గ్రహించి 

గాఢనిద్రలో ఉన్న 

గబ్బిలాలకు "జ్ఞానబోధ" చేసిన...

బావిలోని కప్పలకు 

"బ్రతుకుదారి" చూపిన... 

కావు కావుమని అరిచే కాకులకు 

"కోకిలరాగాలు" నేర్పిన... 

పూరిగుడిసెలో పుట్టిన 

బహుజనులను "పులులుగా" మార్చిన... 

ఓ అమరజీవి అంబేద్కర్ !

దండాలయ్య మీకు దండాలు!!

మీ "ఆదర్శ భావాలకు" వేయి" దండాలు !

అణగారిన 

వర్గాల అభ్యున్నతికి 

జీవితాన్ని అంకితం చేసి 

ఊరూరా తిరిగి 

ఉద్యమాలు రేపి 

ఉపన్యాసాలతో 

ప్రజలను ఉర్రూతలూగించి 

మనిషి మనిషి 

మధ్య మంటలు రేపే

మనుశాస్త్రాన్ని మట్టుపెట్టి 

అడుగునున్న బడుగువర్గాల 

అభివృద్ధికి గొడుగు బట్టి 

పిచ్చిమతాచార్యుల

నెత్తిన పిడుగులాపడి  

అస్పృశ్యతను అంటరానితనాన్ని

నిరసించిన నిప్పులు కురిపించిన 

ఓ అమరజీవి అంబేద్కర్ ! 

దండాలయ్యా మీకు దండాలు !!

మీ "కండబలానికి 

గుండెబలానికి" కోటి" దండాలు !

కరెంట్ షాక్ కన్నా 

కాలకూటవిషం కన్నా 

అతిభయంకరమైన 

అంటరానితనానికి 

ఆహుతైపోకుండా అగ్రవర్ణాల 

వారి అడుగులకు మడుగులొత్తే 

బానిస బ్రతుక్కి బలైపోకుండా 

రాజ్యాంగ రక్షణలెన్నో కల్పించి 

కులంపేర ఈ సమాజం క్రుళ్ళి పోకముందే 

కులమనే విషవృక్షాన్ని కూకటివేళ్లతో సహా 

పెకలించి వేయాలని...ప్రబోధించిన... 

సాంఘిక దురాచారాలను "సమాధి" చేసిన

సమసమాజానికి "పునాది" వేసిన... 

ఓ అమరజీవి అంబేద్కర్ !

దండాలయ్యా మీకు దండాలు!! 

మీ "సాంఘిక సంస్కరణలకు" 

"శతకోటి" దండాలు !

ఓ అమరజీవి అంబేద్కర్ !

మీ రక్తాన్ని సిరాగా మార్చి 

భారతదేశానికి

రక్షణకవచం లాంటి

రాజ్యాంగాన్ని రచించిన

ఓ మహామేధావీ..!

ఓ ఉద్యమకారుడా..!

ఓ జ్ఞానసూర్యుడా..!

ఓ బహుముఖ ప్రజ్ఞాశాలీ..!

ఓ భారతదేశ రాజ్యాంగ నిర్మాతా..!

ఓ భావిభారత స్పూర్తిప్రధాతా..! 

ఓ మహాత్మా !

మీరే మాకు దైవం..!

మీ మాటే మాకు వేదం..!

మీ బాటే మాకు శరణం..!

మీ స్మరణే ఓ ప్రేరణ..!

మీ అడుగుల్లో అడుగులు వేస్తాం..!

మీ ఆశయాలకు 

మా జీవితాలను అంకితం చేస్తాం..!!

అంటూ కవితను ముగించారు...

తదనంతరం పోలయ్య కవి కూకట్లపల్లిని తాను చేస్తున్న సాహితీకృషికి గుర్తింపుగా...

శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు  డా.కత్తిమండ ప్రతాప్ ఘనంగా సత్కరించారు పోలయ్య కవి తనకు జరిగిన ఈ సత్కారానికి పులకించిపోతూ...ఈ ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం...అమరజీవి అంబేద్కర్ మీద కవితను చదవడం...అభినవ రాయలు కళాపోషకులు డా.కత్తిమండ ప్రతాప్ గారి  చేతుల మీదుగా ఘన సన్మానం పొందడం...తన పూర్వజన్మ సుకృతమని...

ఈ సందర్భంగా ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ వారికి...శ్రీ శ్రీ కళావేదిక అధ్యక్షులు డా. కత్తిమండ ప్రతాప్ గారికి...వారి కార్యవర్గానికి తనను అభినందించిన తోటి కవులు 





ముత్యం వెంకటేశ్వరరావు...బనారే..జియో... డాక్టర్ సాయి...శ్రీను...నోరి...వీరయ్య...రహీం...కవయిత్రులు... శ్రీమతి రత్నలక్మీ...యామిని...అద్దంకి లక్ష్మీ...భారతలక్ష్మీ లకు కూకట్లపల్లి పోలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు... 















Comments