జయహో...! జయహో...! నిఖత్ జరీన్...! జయహో...!జయహో.... ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలలో రెండవసారి ఛాంపియన్షిప్ గెలిచి బంగారు పతకాన్ని సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్రాసిన నా కమ్మని కవిత...ఎక్స్ప్రెస్...తెలుగు లోకం...మెట్రో ఉదయం...నవతరం...మెట్రో వాయిస్...పీపుల్స్ గార్డియన్...జనం సాక్షి...దినపత్రికలలో...ప్రచురితమైనది...చదవండి...ఆనందించండి...నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి...

 


















































జయహో...! జయహో...!

నిఖత్ జరీన్...జయహో..! జయహో..!


నిజామాబాద్ లో 

నిరుపేద కుటుంబంలో పుట్టిన

ఓ నిప్పురవ్వా ..!

ఓ నా తెలంగాణ తెలుగు బిడ్డా..!


మొన్న టర్కీలో ...

ఓ బంగారు పతకం... 

సాధించిన 

ఓ రాళ్ళలో రత్నమా..!

ఓ మట్టిలో మాణిక్యమా..!


నిన్న న్యూఢిల్లీ...

జావేద్ ఇండోర్ స్టేడియంలో 

కసితో కృషితో కఠోర సాధనతో 

కదన రంగంలో సివంగిలా దూకి 

ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలో పాల్గొని 

5 - 0 తో బలమైన వియత్నాం ప్రత్యర్ధి

గుయెన్ తి తామ్ పై విరుచుకుపడి పిడుగుల 

వర్షం కురిపించి మట్టి కరిపించి 50 కేజీల 

విభాగంలో రెండోసారి ప్రపంచ మహిళా 

బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 గెలిచి...

 

"బంగారు పతకాన్ని" సాధించి...

"లక్ష డాలర్ల ప్రైజ్ మనిని" 

"మహీంద్రా కారును" సొంతం చేసుకుని

మేటి భారతీయ బాక్సర్...

మేరీ కోమ్ స్థాయికెదిగిన...

ఓ ఎవరెస్టు శిఖరమా..!

ఓ కోహినూర్ వజ్రమా..!


మొన్న నీవు"విశ్వవిజేతగా" నిలిచిన వేళ

బహుమతి ప్రదానోత్సవంలో  

టర్కీ క్రీడా మైదానంలో

నా "జాతీయగీతం"మారుమ్రోగిపోయింది


నిన్వి విశ్వంలో...వినీలాకాశంలో...  

నా భారతీయ "త్రివర్ణ పతాకం"

విజయగర్వంతో రెపరెలాడింది 

విందులు చేసింది గంతులు వేసింది 

విహంగమై స్వేచ్ఛగా విహరించింది

ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంది


అందుకే... 

ఓ మా తెలుగు తేజమా..!

ఓ మా వెలుగు కిరణమా..!

ఓ మా పసిడి పావురమా..!

ఓ మా నిజామాబాద్ నిప్పురవ్వా ..!

ఓ మా తెలంగాణ తెలుగు బిడ్డా..!

భరత మాత మెడలో 

మెరిసే ఓ బంగారు పచ్చల హారమా..!

నా భారత జాతికి ఖండాంతర ఖ్యాతిని

ఆర్జించిన ఓ నిఖత్ జరీనా నీ జన్మధన్యం

నిన్ను కన్నవారెంతటి అదృష్టవంతులోకదా


జయహో ...! జయహో...! 

నిఖత్ జరీనా...జయహో..! జయహో..!

పసిడి పతకమందుకున్న వేళ ఆనందహేల

అందుకో...మా అభినందన మందార మాల


రచన:

"కవి రత్న" 

"సహస్ర కవి" 

పోలయ్య కూకట్లపల్లి

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9110784502







Comments