కళారత్న బిక్కికృష్ణ చేతుల మీదుగా... పోలయ్య కవి కూకట్లపల్లికి...ఉగాది జాతీయ పురస్కారం...వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన సన్మానం వార్తల దృశ్యమాలిక ...పూర్తి కవిత చివర...మీకోసం... చదవండి... .
నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!
పచ్చని పంటలు పండిననాడు !
ఆకలి మంటలు ఆరిననాడు !!
అక్షర దీపాన్ని వెలిగించిననాడు !
అజ్ఞానాంధకారాన్ని తొలిగించిననాడు !!
నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!
నిరుద్యోగాన్ని నిర్మూలించిననాడు !
నిరాశతో యువత నిట్టూర్చనినాడు !!
వరకట్న పిశాచి కోరల్ని విరిచిననాడు !
ముత్తైదువలై కన్నెలు మురిసిననాడు !!
నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!
కులాలనే అడ్డుగోడల్ని కూల్చినవాడు !
మతరక్కసిని మంటల్లో కాల్చిననాడు !!
కొమ్మల్లో కోయిలమ్మ కలసి కాకమ్మతో !
పరవశించి యుగళగీతం పాడిననాడు !!
నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!
యుద్ధవిమానాలతో ధరణి దద్దరిల్లనినాడు !
ప్రపంచమంతా శాంతి ప్రజ్వరిల్లిననాడు !!
మంచితనం మాతవత్వం ప్రతిమనిషి
గుండెల్లొ తేనెజల్లులా కురిసిననాడు !!
సమానత్వం సౌబ్రాతృత్వం ప్రతివ్యక్తి
ఊహల్లో హరివిల్లులా విరిసిననాడు !!
నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!
తినగ తినగ వేప తియ్యనన్న...
కలసివుంటే కలదు సుఖమన్న...
ఓ నగ్నసత్యాన్ని మనిషి ఎరిగిననాడు !!
నలుగురు కలసి నవ్వుతూ బ్రతికిననాడు!!
నాడే ! ఉగాది ఆనాడే శోభకృత్ ఉగాది !!
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

















Comments
Post a Comment