ధార్మిక జనమోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన బహుభాషా కవి సమ్మేళనంలో...మేరా భారత్ మహాన్ అను కవితా గానం.... కవి పోలయ్య కూకట్లపల్లికి ఘన సన్మానం...(29.01.2023) సమన్వయ కర్త... సాదిక్ అహ్మద్ భాయ్ కి...అబ్దుల్ రషీద్ భాయ్ కి...నా సన్మానం వార్తను ప్రచురించిన...దళపతి...ఎ.కె.తెలుగు మీడియా ముంబై...జన నిర్ణయం...స్నేహిత ఎక్స్ ప్రెస్... మెట్రో ఉదయం... మెట్రో వాయిస్... శ్రీ రామ రక్ష న్యూస్...వెలుగు జ్యోతి... పీపుల్స్ గార్డియన్...అన్నపూర్ణ తెలుగునాడు... జనం సాక్షి... దినపత్రికల సంపాదకశిఖామణులకు...ప్రత్యేకమైన అభినందనలతో...






























మేరా భారత్ మహాన్..?


ఓ నా ప్రియ మిత్రులారా...! 

మీ అందరికిదే నా "సద్భావన సందేశం" 


కులం ఒక గజ్జి కుక్కైతే...తిరగనివ్వకు

మతం ఒక పిచ్చిమొక్కైతే...పెరగనివ్వకు

నిన్న మతం ఒక...మత్తుమందు

నేడు ఆ పేరు ఎత్తితేనే...రక్తం చిందు


ఎవరు ముస్లిం...?ఎవరు హిందువు...? 

ఎవరు క్రిష్టియన్...?ఎవరు సిక్కు...?

ఈ నేలపై స్వేచ్ఛగా జీవించడం

కాదా ప్రతి ఒక్కరి జన్మ హక్కు... 


రాముడు కోరునా..? రక్తాభిషేకం...లేదే

అల్లా కోరునా..? అల్లకల్లోలం...లేదే

క్రీస్తు కోరునా..? కిరాతకం...లేదే 

మీరెందుకు...? 

కులంపేర ఈ కుమ్ములాటలు...

మతంపేర ఈ మారణహోమాలు...

మనమంతా కన్నతల్లి 

భారతమాత...ముద్దుబిడ్డలం

మనందరిలో ప్రవహించాలి

భిన్నత్వంలో ఏకత్వం...


నేడు మనందరి నినాదం ఒక్కటే...

సమైక్యతే...సర్వమతాల ఐక్యతే...

మానవత్వమే...మతసామరస్యమే...

హిందూ ముస్లిం భాయి భాయి...

కలుపుదాం అందరం చేయి చేయి....

ఆ మధుర భావనే ఎంత హాయి... 

ఎంత హాయి...

సద్భావన...సమానత్వం...

సౌభ్రాతృత్వమే

మన ఊపిరైతే...అవనిపై 

నా భరతభూమి స్వర్గసీమేనోయ్...


మేరా భారత్ మహాన్...

మేరా భారత్ మహాన్... 

జైహింద్...జై భారత్...


రచన...

"కవి రత్న"

"సహస్ర కవి" 

పోలయ్య కూకట్లపల్లి

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9119784502




 

Comments