రెండేళ్ల వయసులోనే...కంటి చూపును కోల్పోయినా...22 భాషలు నేర్చిన...80 బృహత్ గ్రంథాలు సంకలనం చేసిన...జగద్గురు శ్రీ రామభద్రాచార్యా..."సంక్షిప్త జీవిత చరిత్ర"...రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

జగద్గురు శ్రీ రామభద్రాచార్యా సంక్షిప్త జీవిత చరిత్ర 

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రామభద్రాచార్యా జయహో !


ఓ జ్ఞాననేత్రుడా !‌ 

ఓ సరస్వతీ పుత్రుడా !

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రామభద్రాచార్యా జయహో !

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో...

జౌనాపూర్ జిల్లాలో...

షాండిఖుర్డ్ గ్రామంలో... 

పండిట్ రాజ్ దేవ్ మిశ్రా 

శచీదేవి మిశ్రాల గర్భఫలంగా... 

గిరిధర్ మిశ్రాగా 1950 జనవరి 14 న

మకర సంక్రాంతినాడు జన్మించారట...

మీ అపారమైన జ్ఞానం...

మీ అమోఘమైన మేధస్సు...

ఊహలకందకున్నదే...

నమ్మశక్యం కాకున్నదే...

మీరు అంధులైతేనేమి? 

అనంతమైన ఆకాశంకన్న...

సప్తసముద్రాల లోతుకన్న...

ఎత్తైన ఆ ఎవరెస్ట్ శిఖరం కన్న...

మీ"జ్ఞానసంపదే"మిన్నగా ఉన్నదే...అది

తరతరాలకు"తరగని గని"లాగున్నదే...

ఇది ఏదో "దైవికశక్తి మహిమ" 

ఆ "సరస్వతీదేవి కృప" కాక మరేమిటి?

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రామభద్రాచార్యా జయహో !



రెండు నెలల వయసులోనే 

మీరు కంటిచూపును కోల్పోతేనేమి..! 

నిరాశా చెందక నిప్పుకణికలా మారి

యుక్తవయసులో జౌనాపూర్ లోని 

ఆదర్శ సంస్కృత మహావిద్యాలయంలో 

వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత

 విశ్వవిద్యాలయంలో చేరి కసితో కృషితో 

గట్టి పట్టుదలతో అన్ని సంవత్సరాలు 

అన్ని సబ్జెక్టుల్లోనూ "ప్రథమశ్రేణి విద్యార్థిగా" 

గురువులచే ప్రశంసలందుకున్నారట...

ఢిల్లీలో జరిగిన అఖిల భారత సంస్కృత 

పోటీలలో పాల్గొని ప్రధాని ఇందిరాగాంధీ 

చేతులమీదుగా ఐదు బంగారుపతకాలను

 అందుకున్నారట...అమెరికాలో "కంటి 

ఆపరేషన్ అవకాశాన్ని" తిరస్కరించారట...

సంపూర్ణానంద సంస్కృత

విశ్వవిద్యాలయంలో బాచిలర్స్...మాష్టార్స్ 

 పి.హెచ్.డి..డి.లిట్ డిగ్రీలను కొల్లగొట్టారట

సంస్కృతభాషలో పట్టుసాధించిన దిట్టలట

సంస్కృతంలోని బృహత్ గ్రంథాలను 

పిండి చేసిన పండితోత్తములట...

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రామభద్రాచార్యా జయహో !

మీరు కలం పట్టి వ్రాయకపోతేనేమి..!

పుస్తకం పట్టి చదవకపోతేనేమి..!

అంధుల బ్రైలీ లిపిని వాడకున్ననేమి..!

సకలశాస్త్రాలను సంస్కృత వ్యాకరణాన్ని... 

నాలుగు వేదాలను...18 పురాణాలను...

భారత...భాగవత...రామాయణాది... 

సమస్త సనాతన హిందూమత గ్రంథాలను...


ఐదోఏటనే 700 భగవద్గీతశ్లోకాలను... 

ఏడోఏట తులసీదాస్ రామచరితమానస్

10900 శ్లోకాలను వింటూ వింటూనే 

కంఠస్థంచేసి అందరినీ అబ్బురపరిచారట!

కంప్యూటర్ లకే కళ్ళు బైర్లు కమ్మెనట..!


ఔరా ! వెయ్యి కాగడాలు పట్టి వెతికినా 

ఈ భువిలో మీవంటి "ఏకసంధాగ్రాహి"...

మీకంటే "ప్రపంచమేధావి" కానరాడట...

అఖండమైన "జ్ఞాననేత్రం" కలిగినారట...

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రామభద్రాచార్యా జయహో !


ఓ భారతమాత పుత్రరత్నమా..!

మీరు అంధులైతేనేమి..!

అంధకారం మీ బంధువైతేనేమి‌..!

చిత్రకూటలోని "తులసీపీఠం" అధిపతిగా

"తులసీ అంధుల పాఠశాలను" ప్రారంభించి 

"100 పడకల ఆసుపత్రిని" నిర్మించారట...

అందరికి ఆత్మబంధువులయ్యారట..!

ఓ సానబట్టిన కోహినూరు వజ్రమా !

మీరు కళ్ళులేని కబోధులైతేనేమి...!

కారుచీకటి మీ కన్నతల్లి ఐతేనేమి..!

ప్రపంచంలోనే మొట్టమొదటి

"వికలాంగులవిశ్వవిద్యాలయం" స్థాపించి

కోట్లమంది అంధవిధ్యార్ధుల జీవితాల్లో

వెన్నెల వెలుగులు నింపారట...

అంధులకు ఆరాధ్యదైవమయ్యారట..!

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రామభద్రాచార్యా జయహో !



ఓ భారతజాతి మేలిమి ముత్యమా..!

మీకు కంటిచూపు కరువైతేనేమి?

ఆ సీతారాములపై భక్తితో...

అఖండమైన దైవిక శక్తితో ...

22 భాషలు నేర్చారట...

14 భాషల్లో మీరు పండితులట...

80 బృహత్ గ్రంథాలు లిఖించారట...


అటల్ బిహారీ వాజపేయిచే

ఆవిష్కరింపబడిన మీ సంస్కృత 

గ్రంధం "శ్రీ భార్గవరాఘవీయానికి"

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు... 

భారత ప్రభుత్వం చే 

పద్మ విభూషణ్ పురస్కారం...


ధర్మ చక్రవర్తి...మహాకవి...సంస్కృత 

మహా మహోపాధ్యాయ...కవికుల రత్న... 

అవాద్ రత్న...పూర్వాంచల్ రత్న... 

విశ్వభారతి వంటి బిరుదులు... 

విశిష్టమైన సాహితీ పురస్కారాలెన్నో

మిమ్మల్ని వరించాయట...తరించాయట...


ఈ జగతికి మీరే "జగద్గురులట..!

తల్లి భరతమాత నుదుటి తిలకమట..!

ఈ భరతజాతికి మీరే జ్ఞానజ్యోతులట..!

ధరణిలో ఏ నరునికి సాధ్యం కానిదట..! 

సాటిలేరు మీకెవ్వరు మీరే ఘనపాటియట!

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రాంభద్రాచార్యా జయహో !


అబ్దుల్ కలాం రామ్ నాద్ కోవింద్ 

యుపి ముఖ్యమంత్రుల వంటి  

మహానుభావులు మహనీయులు 

మహానేతలెందరో మిమ్మల్ని దర్శించారట...

దివ్యమైన మీ దీవెనలు పొందారట...

ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి 

"ఆత్మీయ అతిథిగా" వచ్చి ఆశీర్వదించారట...

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రాంభద్రాచార్యా జయహో !


వేదాలన్ని వెతికి వెతికి సనాతన పురాతన 

పురాణ గ్రంధాల పుటలెన్నో ఉటంకించి 

వివాదాస్పద రామజన్మభూమిని 

కళ్ళులేని న్యాయదేవత కళ్ళకు చూపించి

కోర్టులోని న్యాయవాదుల కళ్ళు తెరిపించి

మీరిచ్చిన నిప్పులాంటి సాక్ష్యమే 

నాటి అయోధ్య తీర్పుకు...నేటి 

రామమందిర నిర్మాణానికి నాందియట...

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రామభద్రాచార్యా జయహో !



భారతీయ హిందూ 

ఆధ్యాత్మికవేత్తలుగా...

విద్యావేత్తలుగా...

సంస్కృత పండితులుగా...

బహుభాషా కోవిధులుగా...

కవులుగా...

రచయితలుగా... 

వచన వ్యాఖ్యాతలుగా...

తత్వవేత్తలుగా... 

స్వరకర్తలుగా...

గాయకులుగా...

నాటక రచయితలుగా...

కథా కళాకారులుగా...

బహుముఖ ప్రజ్ఞాశాలురుగా... 



ఈ కలియుగాన వెలసిన 

"అంధుల ఆరాధ్య దైవంగా"...

విద్యయే మన "జ్ఞాననేత్రమని" విశ్వానికే

సందేశం మిచ్చి "విశ్వమత గురువులుగా"...

ఖండాంతర ఖ్యాతి నార్జించారట..!

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రామభద్రాచార్యా జయహో !



"అంధుల శ్రేయస్సే" ధ్యేయంగా...

"అంధుల సంక్షేమమే" లక్ష్యంగా...మీ

జీవితాన్ని అంధులకోసమే అంకితంచేసి 

అంధుల ఆరాధ్యదైవమైన...

ఓ జ్ఞాన నేత్రా...!

ఓ దివ్య చరితా ...!

ఓ పుణ్య పురుషా...!

ఓ దైవాంశ సంభూతుడా...!

మీకు వందనం...! పాదాభివందనం...!!

జయహో ! జయహో ! ఓ

జగద్గురు రామభద్రాచార్యా జయహో !

రచన...

"కవి రత్న"

"సహస్ర కవి" 

పోలయ్య కూకట్లపల్లి

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9119784502

Comments