పోలయ్య కవి కూకట్లపల్లికి ఘన సన్మానం...మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ సంబరాలు - కవి సమ్మేళనంలో... ఓ మనిషీ వొద్దు అక్రమార్జన వొద్దు... అన్న కవితా గానం చేసి సభను అలరించినందుకు...యస్ వి యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్... కళారత్న బిక్కి కృష్ణ డా.వి.డి. రాజగోపాల్ గార్ల చేతులమీదుగా శాలువా మెమెంటోలతో ఘన సన్మానం...(తేదీ.01.01.2023)...హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో...
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారిచే
పోలయ్య కవి కూకట్లపల్లికి "ఘన సన్మానం"
వాల్మీకి మహర్షి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో
ఆదివారం హైదరాబాదులోని సోమాజిగూడ
ప్రెస్ క్లబ్లో జరిగిన "సాహితీ సంబరాలు -
కవి సమ్మేళనం" సమావేశానికి సంస్థ గౌరవ
అధ్యక్షులు డా.వి.డి రాజగోపాల్ అధ్యక్షతన ప్రసిద్ధ
సినీ గేయ రచయిత చంద్రబోస్ ను "సినీగేయ కౌముది"
బిరుదుతో ఘనంగా సత్కరించారు...
ఈ సభకు ఎస్వీ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి
పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరి ఇనాక్ ముఖ్యఅతిథిగా
హాజరై శ్రీ వి.డి రాజగోపాల్ రచించిన...
కవితా లహరి...లయన్ శ్రీమతి అరుణ కుమారి
రచించిన కవితా కదంబం...కొప్పుల ప్రసాద్ రచించిన
చిరుగాలి పలకరిస్తే...మూడు పుస్తకాలను ఆవిష్కరించారు
ఈ సభలో జరిగిన కవి సమ్మేళనంలో... ప్రముఖ కవి
రచయిత పోలయ్య కూకట్లపల్లి "ఓ మనిషీ వొద్దు
అక్రమార్జన వొద్దు" అను శీర్షికతో "అవినీతిపై"
రామబాణం లాంటి సందేశాత్మకమైన కవితను
గానం చేసి సభను అలరించారు.
ఈసందర్భంగా పోలయ్యకవి మాట్లాడుతూ తాను వ్రాసిన
ఈ కవితను "కవితా కుసుమాలు" అను ఈ బుక్ లో
ప్రచురించినందుకు ...అనేక సామాజిక అంశాలను...
మానవ సంబంధాలను... వస్తువులుగా స్వీకరించి తాను
దాదాపుగా 2000 పైచిలుకు కవితలు వ్రాయడం
జరిగిందని అందులో రమారమి 1800 కవితలు
వివిధ దినపత్రికల్లో ప్రచురిత మయ్యాయని చెప్పారు...
తాను సమ సమాజం కోసం...
యువతలో చైతన్యం కోసం...ప్రజల్లో మార్పు
కోసం...చేస్తున్న ఈ సాహితీ సేవకు గుర్తింపుగా...
శ్రీ కొలకలూరి ఇనాక్...కళారత్న బిక్కికృష్ణ...
డా.వి.డి రాజగోపాల్ తనను శాలువా...మెమొంటోలతో
ఘనంగా సన్మానించినందుకు...తనను వెన్నుతట్టి
ప్రోత్సాహిస్తున్నందుకు... ప్రతిఒక్కరికి ప్రత్యేకంగా "
వాల్మీకి సంస్థకు"...తనను అభినందించిన తోటి
కవులకు కవయిత్రులకు పోలయ్య కవి కృతజ్ఞతలు
తెలియజేశారు
ఇది తనకు " కొత్తసంవత్సర కానుకని "
"మరిచిపోలేని ఒక తీపిజ్ఞాపకమని "
తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి సాహితీమూర్తులు
కవులు కవయిత్రులెందరో హాజరయ్యారు
చంద్రబోస్ తాను వ్రాసిన అనేక పాటలను ఎంతో
శ్రావ్యంగా ఆలపించి అందరి హృదయాలలో
అమృతపు జల్లులు కురిపించారు...సభను
ఉర్రూతలూగించారు...ఉత్సాహపరిచారు
సభ ఆద్యంతం ఆసక్తికరంగా అద్భుతంగా జరిగింది.






















































































Comments
Post a Comment