అమరజవాన్లకు అశ్రునివాళి...
నిన్న సరిహద్దుల్లో
కొదమసింహాల్లా తిరిగి నేడు
నేలకొరిగిన ఓ అమరవీరుల్లారా!
ఓ భరతమాత ముద్దుబిడ్డలారా !
మీకు జోహార్ ! జోహార్ !! జోహార్ !!!
నిన్న శతృమూకలతో పోరాడి
పోరాడి నేడు సరిహద్దుల్లో
నేలకొరిగిన ఓ సైనికుల్లారా!
మంచుకొండల్లో భగ్గున
మండిన ఓ భాస్కరుల్లారా !
మీకు జోహార్ ! జోహార్ !! జోహార్ !!
మీరు ఆకాశంలో నక్షత్రాలై...
ప్రతిభారతీయుడి గుండెల్లో
అమరులై ఆరనిదీపాలై వెలుగుతువుంటే
ఎక్కడిది ఎక్కడిది మీకు మరణమెక్కడిది?
మీ ప్రాణత్యాగం మీ దేశసేవ
ఇలనైనా కలనైనా మరువలేనిది
దుష్టులు దుర్మార్గులైన
మూర్ఖులు ముష్కరులైన
ఆ చైనా పాక్ శతృమూకల్ని
మట్టుపెట్టకపోతే...
ప్రతీకారం తీర్చుకోకపోతే...
సరిహద్దుల్లోనే వారికి
సమాధులు కట్టకపోతే...
ఎక్కడిది ఎక్కడిది ?
మీ ఆత్మలకు శాంతి ఎక్కడిది?
ఎక్కడిది ?ఎక్కడిది ?
మీ కుటుంబాలకు ఓదార్పు ఎక్కడిది?
ఎక్కడిది ?ఎక్కడిది ?
ఈ భరతజాతి కళ్ళల్లో కాంతి ఎక్కడిది?
ఎక్కడిది ?ఎక్కడిది ?
ఆ భరతమాతకు మనశ్శాంతి ఎక్కడిది?
ప్రక్కలో బల్లాలైన పాక్ చైనా
దురాక్రమణదారులు తీవ్రవాదులు
సరిహద్దులుదాటి దాడికి తెగబడితే
వారి తలలు వారే నరుక్కున్నట్లు...
వారి గోతులు వారే త్రవ్వుకున్నట్లు...
వారి మరణశాసనం వారే వ్రాసుకున్నట్లు...
![]() |
అందుకే...
ఓ వీరజవానులారా!
ఓ దేశ భక్తులారా...!
ఓ త్యాగమూర్తులారా !
ఓ అమరవీరులారా !
మీకు జోహార్...జోహార్...జోహార్
మీ ఆత్మలకుశాంతి చేకూరాలని
ఆ పరమాత్మను...అర్థిస్తూ...ప్రార్థిస్తూ
అశృనయనాలతో అర్పిస్తున్న అక్షరనివాళి.
రచన.
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502




















Comments
Post a Comment