కన్నుమూసి దివికేగిన కైకాల సత్యనారాయణ...కన్నీటి కవిత 24/12/2022


 కన్నుమూసి దివిగకేగిన కైకాల...


మొన్న ...రెబల్ స్టార్ కృష్ణంరాజు 

నిన్న...నటశేఖర కృష్ణ 

నేడు...కైకాల సత్యనారాయణ...

వరుసగా ముగ్గురు సీనియర్ 

"నటదిగ్గజాలను" కోల్పోయింది 

తెలుగు చలనచిత్ర సీమ



తన అద్భుత నటనా చాతుర్యంతో

వెండితెర మీద తమకెంతో గుర్తింపును 

తెచ్చిన "నవరస నటనా సార్వభౌముడు" 

కన్ను మూశాడని తెలిసి "నవరసాలు" 

కన్నీటి సాగరంలో మునిగిపోయాయి 



1935 జూలై 25న కృష్ణజిల్లా... 

గుడ్లవల్లేరు మండలం...

కౌతవరం గ్రామంలో జననం... 

భార్య ...నాగేశ్వరమ్మ

నలుగురు...ససంతానం

పద్మావతి రమాప్రభాదేవి

రామారావు వెంకట రమణ...

గుడివాడ ఎఎన్నార్ కాలేజీలో

ఈనాడు రామోజీ రావుతో 

కలిసి డిగ్రీ చదివిన కైకాల 

"సిపాయి కూతురు" చిత్రంతో 

సినీ రంగ ప్రవేశం చేశారు 



కరుడుగట్టిన విలన్ పాత్రలకేకాక... 

"కృష్ణుడి పాత్రకు' ఎన్టీఆర్ లా

ధర్మ రక్షణా దక్షుండ...

పాప శిక్షణా దక్షుండ...నంటూ

"యమధర్మరాజు" పాత్రకు కైకాల 

ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు 

వైవిధ్య భరిత సాంఘీక పౌరాణిక జానపద 

పాత్రలకు యస్వీఆర్ కి వారసుడయ్యాడు

అటు నిప్పులవర్షం కురిపించే పాత్రల్లోకి...

ఇటు హాస్యం పండించే పాత్రల్లోకి...

పరాకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను 

ఆకట్టుకునే "విలక్షణమైన నటుడు" కైకాల...



సాంఘిక ... చారిత్రక...

పౌరాణిక...జానపద...చిత్రమేదైనా... 

యముడు...భీముడు...రావణుడు...

కర్ణుడు...ఘటోత్కచుడు...

దుర్దుర్యోధనుడు...దుశ్శాసనుడు... 

హీరో...విలన్ ...కమెడియన్ ...

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ...పాత్రఏదైనా...

అద్భుతమైన హావభావాలు పలికించి...

అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలలో 

చెరగని ముద్ర వేశారు కైకాల...



1994లో నిర్మాతగా నంది పురస్కారం... 

2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం..

1996లో మచిలీపట్నం నుండి 

టిడిపి ఎంపీగా రాజకీయరంగప్రవేశం  

777 సినిమాలలో అద్భుతమైన నటన...

60ఏళ్ళ కైకాల "సినీ ప్రస్థానం" 

నేడు జూబ్లీహిల్స్ 

"మహాప్రస్థానంలో" ముగిసింది






తెలుగు ప్రేక్షకులు మరువలేని...

"మరణంలేని మహానటుడు" 

కైకాల సత్యనారాయణ 

"ఆత్మకు శాంతి" కలగాలని...

వారి కుటుంబసభ్యులకు

ప్రగాఢమైన 

సంతాపాన్ని తెలియజేస్తూ...

అశృనయనాలతో...

బాధాతప్త హృదయాలతో...

అందిస్తున్న అక్షర నీరాజనం...





రచన.

"కవి రత్న"

"సహస్ర కవి" 

పోలయ్య కూకట్లపల్లి

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9119784502

Comments