భార్య భర్తల బంధాలు
భగ్గుమంటున్నాయి ఎందుకని ?
మీ భార్యలు ఇరుగు పొరుగు
వారితో సన్నిహితంగా ఉంటే
వారి...చేష్టల్లో...
వారి...మాటల్లో...
వారి...ప్రవర్తనలో...
ఆకస్మికంగా కొట్టవచ్చినట్లు
కనిపించే మార్పులను
ఇలా సులభంగా "కనిపెట్టవచ్చని"
మానసిక నిపుణులు
ఘంటాపధంగా చెబుతున్నారు.
మొదట మరో వ్యక్తితో క్లోజ్ గా
ఉంటున్న భార్య తన భర్త
ఏ పనిచేసినా ఏమి చెప్పినా
దాన్ని తప్పుపడుతుందట
అంతే కాకుండా ప్రతిసారి
భర్తపై కోప్పడుతూ కరెక్ట్ గా
చేసే ప్రతి పనిలో...
చెప్పే ప్రతి మాటలో...
తప్పులు వెతుకుతుందట
ఇచ్చిన చక్కని సలహాలను
ప్రక్కన పెట్టి
పాటిస్తున్నట్టే నటిస్తుందట
కానీ తనకిష్టమైనట్టే
తన మనసుకు తోచినట్టే చేస్తుందట
ముఖాముఖి చర్చలకు మాత్రం
సుదూరంగా ఉంటుందట
ప్రతిరోజూ భౌతికంగా
భర్త ప్రక్కలో పడుకుంటున్నా
మానసికంగా మాత్రం భర్తకు
బహుదూరంగా ఉంటుందట
రేయింబవళ్ళు ఇతరుల
ఆలోచనల్లో మునిగి తేలుతుందట
ఏవో ఊహల్లో ఊరేగుతుందట
ఏమీ ఎరగనట్లు నటిస్తుందట
అబద్దాలు కూడా ఆడుతుందట
చిన్నవిషయానికి రెచ్చిపోతుందట
అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తుందట
కొంతకాలం సంబంధం అలాగే
కొనసాగితే కొంపమునిగి పోతుందట
పచ్చని కాపురంలో
ఆరనిచిచ్చు రగులుతుందట
పిల్లల్ని భర్తను సైతం
పట్టించుకోవడం మానేస్తుంట
అలాంటి సమయంలో
విషయం భర్తకు తెలిసినా ఏమాత్రం
భయపడక తన మనసులో ఉన్నదే
తాను అనుకున్నదే చేస్తుందట
తనకిష్టమైన వారితోనే
వద్దన్నా మాట్లాడుతుందట
సిగ్గూలజ్జా లేకుండా
బజార్లో తిరుగుతుందట
ఫోన్లో మాట్లాడడం వీలుకాకపోతే
చాటుమాటుగా
దొంగచూపులు చూసుకొని
మానసికానందం పొందుతుందట
ఇదేమిటి అన్నా అవాయిడ్ చేయమన్నా
తప్పేమి ఉందని గట్టిగా వాదిస్తుందట
భర్తమనసు కష్టపడినా సరే
ఇష్టమున్న వారివైపే మాట్లాడుతుందట
వారికే వత్తాసు పలుకుతుందట
వారినే వెనకేసుకు వస్తుందట
ఎందుకు తనపై నిందలు
వేస్తున్నారని అందరినీ నిలదీస్తుందట
అసలు ఈ పెనుమార్పుకు
కారణం "ప్రక్కవారి ప్రభావమేనట"
"వారికిచ్చిన అతిచనువేనట"
వేరొకటి కాదట
ఒక పచ్చినిజం చెప్పాలంటే 90%
"వీరు వారి వశమైపోయిట్లేనట
ఆ విషయం వీరికి తెలియదట"
దీనికీ అసలు కారణం వీరు ఏదో మత్తులో
ఏదో మైకంలో మునిగిపోయిఉండడమేనట
ఒకవేళ వారు మోసం చేస్తే భర్తలను
పిల్లలను కూడా పట్టించుకోకుండా
డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారట
అలాంటి స్టేజ్ లో చనిపోయేందుకు కూడా
వెనకాడరని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఇతరులతో సంబంధాలు
పెట్టుకున్న భార్యలు ఇంట్లోనే ఉన్నా
వారి మనసు మాత్రం ఎక్కడో
ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు
అయితే ఇలాంటి
ఆమోదయోగ్యం కాని...
అనాలోచితంగా...
ఏర్పడే అక్రమసంబంధాలను...
ముందుగానే గుర్తించి...
అదుపులో పెట్టుకుంటే...
మనసులో దాచుకోకుండా...
ఓపెన్ గా ముందు జాగ్రత్తతో
ముఖాముఖి చర్చలు చేస్తే...
చక్కని పరిష్కారాలు దొరుకుతాయని...
మున్ముందు ఎలాంటి సమస్యలు ఉండవని
ముక్కలైపోయే కాపురాలను
ముందుగానే చక్కదిద్దుకోవచ్చని...
మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆలోచించండి...
తెలియక మీ ప్రమేయం లేకుండా
తప్పులు జరిగితే సరిదిద్దుకోండి...
మూడోవ్యక్తితో తప్పదు ముప్పని...
అది కాపురానికి ఆరని నిప్పని...
తెలుసుకోండి నలుగురిలో
మీరు నవ్వులపాలు కాకండి...
పిల్లీ ఎలుకల్లా కాకుండా
చిలకాగోరింకల్లా జీవించండి...
నలుగురికి ఆదర్శంగా నిలవండి...
"మొగున్ని మోసం చేసే భార్యకు"
"భార్యను నమ్మని భర్తకు"
మనశ్శాంతి మాత్రం కరువేనట
ఎవరు ఎవరిని మోసం చేసినా
ఆ పరమాత్మ విధించే
ఘోరమైన శిక్షకు ఇద్దరూ అర్హులేనట
తమ అంతరాత్మ విధించే
మానసిక క్షోభకు ఇద్దరూ
బలికాక తప్పదట
విడిపోక తప్పదట
అర్థం చేసుకుని సర్ధుకోకపోతే
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లేనట...
రచన.
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్...హైదరాబాద్
Comments
Post a Comment