నిజజీవిత నిత్యసత్యాలు
అనుభవాల ఆణిముత్యాలు
కెరటం నీకు ఆదర్శం కావాలి
క్రింది పడిపోయినందుకు కాదు
పడినా తిరిగి పైకి లేచినందుకు...
పోరాడు పోరాడితే పోయేదేముంది?
నీ బానిసబ్రతుకు బాగుపడడం తప్ప
లక్ష్యంలేని జీవితానికి విలువెక్కడిది?
అలలులేని కడలికి అందమెక్కడిది ?
వెయ్యకు వెయ్యకు నిచ్చెన ఆకాశానికి
ముయ్యకు ముయ్యకు తలపుల్ని
ఆశకు...అవకాశాలకు...అదృష్టానికి
కమ్మని కలలు కను...
కంటినిండా నిద్రపో...
కాని
ఆ కలలు
సాకారమయ్యేదాక
కునుకు తియ్యకు...
విజయం వస్తుంది...
నీ "ముందు" నిలుస్తుంది...
వీరులను...విజేతలనే
"విందుకు" పిలుస్తుంది...
మన భరతమాత గర్వించేలా...
నవ సమాజాన్ని నిర్మించు...
చరిత్రను సృష్టించు
"ధృవతారగా" వెలిగిపో...
"చిరంజీవిగా" మిగిలిపో...
రచన.
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్

Comments
Post a Comment