సంకల్పబలం లేని...
సత్సాంగత్యమెరుగని...
సన్నిహితుల ఉచిత
సలహాలు స్వీకరించని...
సహాయాన్ని అర్థించని...
సమస్యలకు పరిష్కారం
చావు కాదు కాదు కాదన్న
నగ్నసత్యాన్ని గ్రహించని...
సత్సాంగత్యమెరుగని...
సన్నిహితుల ఉచిత
సలహాలు స్వీకరించని...
సహాయాన్ని అర్థించని...
సమస్యలకు పరిష్కారం
చావు కాదు కాదు కాదన్న
నగ్నసత్యాన్ని గ్రహించని...
జన్మనిచ్చిన అమ్మానాన్నలను
ఒక్కక్షణమైనా గుర్తుచేసుకోని...
ప్రాణంపోసిన ఆ పరమాత్మను
ఒక్క క్షణమైనా స్మరించుకోని...
సమయస్ఫూర్తితో వ్యవహరించని...
సమస్యలను ధైర్యంతోఎదుర్కోలేని...
ఆవేశం తప్ప ఆలోచనలేని
అమాయకత్వం తప్ప
ఆత్మహత్యలపై అకాలమృత్యువుపై
ఆవగింజంతైనా అవగాహనలేని
ఓ బలహీనమైన క్షణాల్లో
బలవన్మరణానికి పాల్పడే
బంగారుభవిష్యత్తును బలితీసుకొనే
సకాలంలో సరైన మార్గాల్లో
పరిష్కారాలకై పట్టుదలతో అన్వేషించని
ఈ జీవితం వ్యర్థం వ్యర్థమనే తప్ప దానికో
అర్థం పరమార్ధముందని సత్యాన్ని తెలుసుకోని
కుటుంబ పరువును కుప్పకూల్చే
పచ్చని కాపురాల్లో చిచ్చు రగిలించే
చింతలు చీకాకులు లేని చిరునవ్వుల
కుటుంబాన్ని చిమ్మచీకటిలో ముంచేసే
ఆ మూర్ఖులు...
ఆ మొండివారు...
ఆ ఆవేశపరులు...
గతజన్మలో పిరికిపందలో...గొర్రెలమందలో
ఎవరికెరుక ? జన్మనిచ్చిన ఆ పరమాత్మకు తప్ప...
రచన.
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్

Comments
Post a Comment