95...కుటుంబ కవితలు....

 95... కొత్త కవితల బుట్ట ఇండెక్స్


1. శాంతమూర్తి కాదు శాడిస్ట్ 

2. కవితలఎంతవరకు 

    ఈ బంధాలు అనుబంధాలు 

3. ఈ తప్పు నీది కాదు 

4. ఆలోచనలతో ఆటలు వద్దు 

5. వారిద్దరూ 

6. కవిని నేను కాస్త జాగ్రత్త 

7. భిన్నత్వంలో ఏకత్వం 

8. శిలలు కమ్మని కలలు 

9. ఓ అమాయకపు 

   అమ్మాయిలు కాస్త జాగ్రత్త 

10. ఆట ఆడిన ఓడిన కోట్లే 

11. ఓ మగువా నీ ముందు జీవితం 

     ఓ విందు భోజనం కావాలంటే 

12. మధుపానం ఒక దుర్వేసనం 

13. కొన్ని కుటుంబాల కన్నీటి పన్నీటి గాధ

14. జంతువులపై జాలితో ప్రేమతో 

15. ఒక భగ్న ప్రేమికురాలి విషాద గాధ 

16. వనిత ఓ వనిత 

17. ప్రార్థనలు 

18. నిన్న తేనె చుక్క నేడు విషపు 

19. వద్దు నన్ను తాగొద్దు 

20. ఇది నిజం ఇది మానవ నైజం 

21. నందమూరి చందమామ 

22. ఓ తరుణీ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త 

23. ఏమన్నది ఏమన్నదినా

      మువ్వన్నెల జెండా 

24. ఎవరు ఎవరు ?

25. యుద్ధానికి సిద్ధమా ?

26. పిట్టల దొరనునమ్మిన 

      వారంతా పిచ్చివారే 

27. సంకేతమే

28. దివిలోని దైవం నిన్ను 

      దీవించును గాక ! 

29. కన్నబిడ్డలా కాదు కాదు 

30. ఎందుకో ఏమో ఎవరికిఎరుక 

31. వారెవరు ఏం చేస్తారు ?

32. అక్కడ శాంతి ఎక్కడ ?

33. ఆపై జరిగే ఘోరమేమిటి ?

34. నేను ఆరిపోని ఒక అగ్ని కణాన్ని 

35. సుఖ జీవన సూత్రాలు 

36. ఆశయాలు ఆరని దీపాలు 

37. సమాధి నుండి ఉత్తరం 

      రాస్తున్నాను సమాధానం ఇవ్వండి !

38. విప్లవ శంఖం పూరించాలి 

39. చేతులు కాలాక ఆకులు పట్టుకోకండి !

40. ఆ మత్తులో మగత నిద్రలో 

41.  ఓ మనిషి 

42. ఓ వృద్ధ దంపతులారా జాగ్రత్త !

43. ఎక్కడ మీ పెద్దరికం ?

44. నాకు దాహం వేస్తుంది 

45. నేరం ఒకరిది శిక్ష మరొకరికి 

46. పోరాటమే నీ సిద్ధాంతమైతే 

47. ఈ సమాజం మారేది ఎప్పుడు ?

48. మూడో వ్యక్తితోనే ముప్పు 

49. మదర్ తెరిసా చిత్రకథ 

50. నేనొక త్రినేత్రుడు 

51.  నేను త్రినేత్రుడును ఒక కవిని 

52. బృహత్ గ్రంధం 

53. విజయం ఎవరికి బంధువు కాదు 

54. ఓ యువతీ ఈ ఒక్క తప్పు చేయకు 

55. ఇదేమి కాపురం కల్తీ కాపురం ?

56. పిచ్చిఆలోచనలతో రెచ్చిపోకు

57. ముందస్తు హెచ్చరిక లేకుంటే ముప్పై 

58. మౌనం ఒక మహా సముద్రం 

59. ప్రేమ ఒక పరిమళమే 

60. పిచ్చి కవికి పుట్టిన పిచ్చి కోరిక 

61. మానసిక ఆనందం 

62. కాలానికి కళ్లెం వేద్దాం 

63. విశ్వ విజేతలు ఎవరు 

64. కార్గిల్ వీరులకు అశ్రునివాళి 

65. నిరాశచెందకు నిష్క్రమించకు 

66. మునులా? మూర్ఖులా?

67. వేయి సునామీలు 

68. కవులు కళాపోషకులు 

69. వరాల వర్షం 

70. నేనొక త్రినేత్రుడను

71. ఓ వృద్ధ దంపతులారా కాస్త జాగ్రత్త 

72. కన్నుమూసిన నా కన్నతల్లి 

73. అంబేద్కర్ అమృత సందేశం

74. ఎవడు వెర్రివాడు 

75. సుందర నందనవనాలు 

76. ఏది ప్రధానం ఏది ప్రమోదం 

77. స్వచ్ఛమైన నది 

78. సూర్యుని కంటే 

   ‌   ముందు లెయ్ సుఖపడతావు 

79. 15వ తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి 

80. సమాజంలో మార్పు రావాలంటే 

81. పిచ్చి పిచ్చి పిచ్చి 

82. కొంటే కోరిక 

83. కార్యసిద్ధికి మూడు మెట్లు 

84. జీవించాలి ఇలా చిరంజీవిగా 

85. ఈ నూతన జీవితం ఆయనకే అంకితం

86. ఆ మత్తులో ఆ మైకంలో 

      ఆ భ్రమలో ఆ భ్రాంతిలో 

87. చిరునవ్వులు చిరుతపులులు 

88. వీధిలో నా విగ్రహం విలపిస్తుంది

89. నిజజీవిత నిత్య సత్యాలు 

90. సుఖ జీవన సూత్రం 

91. ఏడుకొండలు ఎక్కుదాం 

92. మరువకు నీలక్ష్యం నిద్రలో సైతం !...

93. అతిచనువుకు అర్థమేంటి?

94. నీ ఆత్మను ! ఆ పరమాత్మను నేనే!!

95. మూడుముళ్ల బంధానికి 30 సూత్రాలు 


1. శాంతమూర్తి కాదు శాడిస్టు..!!

మొన్నవాడొక 

గౌతమబుద్ధుడు...శాంతమూర్తి

కానీ నేడు వాడొక నయవంచకుడు


మొన్న‌వాడొక...అమాయకుడు

కానీ నేడు వాడు...అఖండుడు


మొన్నా వాడొక...బలహీనుడు

కానీ నేడు వాడొక...బాహుబలి


మొన్న వాడొక 

...మజ్ను...ఒక దేవదాస్

ప్రియా నీ ప్రాణానికి 

నా ప్రాణమన్న

...ఒక భగ్నప్రేమికుడు


కానీ నేడువాడొక...శాడిస్టు

తనను కాదని...మరొకన్ని

ప్రేమిస్తుందని...

ఇష్టపడుతుందని...

వొద్దువొద్దన్నా వినక 

వాడి బైక్ ఎక్కిందని...

వాడి వైపు చూసిందని...

వాడితో మాట్లాడిందని...

వాడి వెంట తిరిగిందని...

అదితన కంట పడిందని...


ఇద్దరు ముసిముసి 

నవ్వులు నవ్వుకున్నారని ...

ముద్దులిచ్చుకున్నారని...

వాడి ప్రక్కనే కూర్చుందని...

వాడితో పక్కపంచుకుందని...


కసితో పగతో ప్రతీకారంతో 

ప్రియురాలి పీకనే కోసిన... 

మూడు ముక్కలు చేసిన...

మూటగట్టి మూసీనదిలో 

విసిరేసిన పరమ...కసాయివాడు


వాడొకడు 

అపరిచితుడు...ఆగంతకుడు

ఔను ఎప్పుడు...ఎందుకు 

ఎలా ఎటువైపు నుండి...

పులిలా....... దాడి చేస్తాడో 

పాములా.....కాటువేస్తాడో

ఉరుములా...ఉరుముతాడో 

పిడుగులా....విరుచుకుపడతాడో

తెలియదు....అందుకే తస్మాత్ జాగ్రత్త


2. ఎంతవరకీ 

    బంధాలు అనుబంధాలు ?

మీరంతా ‌మా పిల్లలు మేము 

మూడుముళ్లు పడిన రోజునుండి

శోభనం గదిలో ఒకటైన రోజునుండి

మేము కన్న ఎన్నో తియ్యని కలలకు 


చేసిన పూజలకు

నోచిన నోములకు 

ఎందరో దేవుళ్ళకు 

మొక్కిన మొక్కులకు

పెట్టిన పొర్లు దండాలకు


ఏదో‌ మత్తులో ఏదో మాయలో

ఏదో మైకంలో...సంతోషంగా

సరదాగా సరస శృంగారం పేర

చీకటిలో చేసిన చిన్న తప్పుకు

మీరంతా మాకు ప్రతిరూపాలు


నిజానికి జన్మనిచ్చింది మేమే 

కానీ మీకు ఓ సుందరమైన 

అందమైన ఆకారాన్నిచ్చింది  

గర్భంలో పిండమై ఉన్న మీకు

ప్రాణదానం చేసింది మాత్రం 

పరమందున్న ఆ పరమాత్మయే


అందుకే మీరు ఆ దేవుని బిడ్డలు

మన మధ్య బంధాలను 

అనుబంధాలను

పెంచేది తుంచేది 

ఖచ్చితంగా ఆ భగవంతుడే


"ఈ అనుబంధం ఆప్యాయత 

అంతా ఒక బూటకం...

ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే

నాటకం వింత నాటకం"...

అన్నది ఓ కవి మహర్షి సందేశం...  


ఔను...అన్నీ ఇక్కడే...

ఊపిరి ఉన్నంతవరకే

మనం కలిసి వుండేది 

కన్ను మూసేంతవరకే

మృత్యువు ముద్దాడిన నాడు 

ఈ భవబంధాలన్నీ ముక్కలుచెక్కలే

ఈ భూమి మీద మనం వేసేవన్నీ కాకిలెక్కలే


నిండు నిజమొకటి తెలుసుకోండి

ప్రేమతో పెనవేసుకుపోయి...

విడిపోతే విషాదమని

ఏ అటాచ్ మెంట్ వొద్దని......

డిటాచ్ మెంటే ముద్దని


3. ఈ తప్పు నీది కాదు ? 

నీకు తెలియదు...

నీవు ఇప్పుడు నీవు కావని...

నీ ఆలోచనలు నీవి కావని...

ఎప్పుడో దారితప్పాయని...

నీ కళ్ళకు గంతలు కట్టారని...

నీవు ఒకరి వశమైపోయావని...

తెలియదు నీకు తెలియదు

అడగకుండానే అన్నీ 

ఇష్టపడి ఇస్తావని...

వొద్దు ‌వొద్దు అంటూనే

ఒడిలో వొరిగి పోతావని...

కౌగిట్లో కరిగి పోతావని...

దుప్పట్లో దూరిపోతావని...


నీకు తెలియదు...

నీవు ఇప్పుడు ఒకరిచేతిలో 

కీలుబొమ్మవని, వారు 

ఆడమంటే ఆడతావని...

పాడమంటే పాడతావని...

ఊగమంటే ఊగుతావని...

ఎగరమంటే ఎగురుతావని...

ఎక్కడో గాలిలో తేలిపోతావని...

వొద్దన్నా ఒడిలో వాలిపోతావని...

తెలియదు నీకు తెలియదు

అడగకుండానే అన్నీ...ఇష్టపడి ఇస్తావని...


నీకు తెలియదు...

అడగకముందే అందరిముందు 

అందాలు ఆరబోస్తావని...

కనువిందు చేస్తావని...కైపెక్కిస్తావని...

మత్తెక్కిస్తావని...మాయచేస్తావని...

కిస్సు కిస్సు అంటున్నా 

కస్సు బుస్సుమనవని...

తెలియదు నీకు తెలియదు

అడగకుండానే అన్నీ...ఇష్టపడి ఇస్తావని...

వొద్దన్నా ఒడిలో వాలిపోతావని...

నవ్వుతూ కౌగిలిలో నలిగిపోతావని...


నీకు తెలియదు...ఈ తప్పు నీది కాదని...

నీ చిలిపివయసుదని...నీ అల్లరి మనసుదని...


4. ఆలోచనలతో ఆటలొద్ధు...

ఔనుఅన్నిఆలోచనలు మనవే

మన చిత్తంలో చిగురించినవే

కానీ వొద్దువొద్దు అదృశ్యమైన 

ఆ ఆలోచనలతో ఆటలొద్ధు

ఆలోచనలు లేదు

కొన్ని ఆలోచనలు

పొట్టనింపుతాయి...

కొన్ని ఆలోచనలు

పొట్టగొడతాయి...


కొన్ని 

ఆరని అగ్గి రవ్వలు...

కొన్ని ఆలోచనలు

అమృత బిందువులు...


కొన్ని ఆలోచనలు

అమృతాన్ని కురిపిస్తాయి...

కొన్ని ఆలోచనలు

హాలాహలాన్ని చిమ్ముతాయి...


కొన్ని ఆలోచనలు

ఊయలలో ఊరేగిస్తాయి...

కొన్ని ఆలోచనలు

ఊబిలోకి తోసేస్తాయి...


కొన్ని ఆలోచనలు 

ప్రశాంతతను ప్రసాదిస్తాయి...

కొన్ని ఆలోచనలు ‌

నరకానికి నడిపిస్తాయి...


కొన్ని ఆలోచనలు

దేవతలై దీవిస్తాయి...

కొన్ని ఆలోచనలు

భూతాలై భయపెడతాయి...


అదృశ్యమైన 

కొన్ని ఆలోచనలు

భగ్గుమనిమండే అగ్నిపర్వతాలు...

కొన్ని ఆలోచనలు 

కుంభవృష్టిని కురిపించే కారుమేఘాలు...


కొన్ని ఆలోచనలు 

కృంగదీస్తాయి కుమిలిపోయేలా చేస్తాయి...

కొన్ని ఆలోచనలు

లేని గుండెధైర్యాన్ని మొండి ధైర్యాన్నిస్తాయి...


కొన్ని ఆలోచనలు

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేలా చేస్తాయి...

కొన్ని ఆలోచనలు 

నిర్ధాక్షిణ్యంగా అథఃపాతాళానికి నెట్టేస్తాయి...


అందుకే వొద్దువొద్దు 

మన ఆలోచనలతో ఆటలొద్ధు

మన ఆలోచనలను మనమే ప్రేమించాలి

మన ఆలోచనలను మనమే నియంత్రించుకోవాలి

మన ఆలోచనలను మనమే ఆరాధించాలి ఆస్వాదించాలి 


5. వారిద్దరు.....!!!

ఎక్కడా కలవనినాడు

ఏపరిచయంలేనినాడు

ఎవరికి ఎవరు తెలియనినాడు 

వారిద్దరు..."అపరిచితులు"


ఏదో సందర్భంలో అనుకోకుండా 

కాకతాళీయంగా కలిసినప్పుడు

మాట మాట కలిసినప్పుడు

ఒకరి భావాలను ఒకరు

ఒకరి బాధలను ఒకరు

ప్రేమతో పంచుకున్నప్పుడు

వారిద్దరు..."స్నేహితులు"


అప్పుడప్పుడు కలిసినప్పుడు 

మాట మాట కలిసినప్పుడు

చూపు చూపు కలిసినప్పుడు

మనసు మనసు కలిసినప్పుడు

ఒకరిని ఒకరు కోరుకున్నప్పుడు

వారిద్దరు... "ప్రేమికులు"


ఇద్దరు ఒకరితో ఒకరు

జీవితాన్ని పంచుకోవాలని కలిసి 

బ్రతకాలని భావించినప్పుడు

నిశ్చితార్థం జరిగినప్పుడు

పెళ్ళి పీటలెక్కినప్పుడు

వివాహబంధం ఏర్పడినప్పుడు

వారిద్దరు..."నూతన వధూవరులు"


ఆపై శోభనం జరిగినప్పుడు

పడకగదిలో పట్టెమంచంలో

ఇద్దరు ఒక్కటై పోయినప్పుడు

కలిసి కాపురం చేసినప్పుడు

సంతానం కోసం తపించినప్పుడు

వారిద్దరు..."భార్యాభర్తలు"


ఆ ఇద్దరు ముగ్గురు కావాలని

కమ్మని కలలు కన్నప్పుడు

ఆకలలు నిజమైనప్పుడు

కడుపు పండినప్పుడు

పాపో బాబో పుట్టినప్పుడు

వారిద్దరు..."తల్లీదండ్రులు"


వారి పిల్లలకు 

పెళ్ళిళ్ళు చేసినప్పుడు

వారిద్దరు..."అత్తామామలు"

ఆ పిల్లలకు 

పిల్లలు పుట్టినప్పుడు

వారిద్దరు..."అవ్వాతాతలు"


వారికి కంటిచూపు కరువైనప్పుడు

కాళ్ళల్లో నడిచే సత్తువలేనప్పుడు

అందరిపై ఆధారపడుతున్నప్పుడు

వారిని భారంగా భావించినప్పుడు

వృద్ధాశ్రమంలో వదిలి పెట్టినప్పుడు

వారిద్దరు..."అందరుఉన్నా అనాధలు"

ఆకలికి అలమటించే..."అస్థిపంజరాలు"

ఎవరినీ నిందించలేని..."నిస్సహాయులు"

వారే కన్న కమ్మని కలలన్నీ కల్లలైపోయిన

భగవంతుడు దీవించి శపించిన"భార్యాభర్తలు"


6. కవిని నేను... కాస్త జాగ్రత్త..!

కవిని నేను...

కలం పట్టానంటే...

గుట్టంతా రట్టు చేస్తాను..!


కవిని నేను...

కలం పట్టానంటే...

కడుపులో పేగుల్ని లెక్కపెడతాను..!


కవిని నేను...

కలం పట్టానంటే... 

కలంతోనే శతృవుల్ని ఖతం చేస్తాను..!


కవిని నేను...

కలం పట్టానంటే...

మానవత్వాన్ని మరచినవారికి...

మౌనంగా మరణశాసనం లిఖిస్తాను..!


కవిని నేను...

కలం పట్టానంటే...

సమాజంలో రుగ్మతలను సమాధి చేస్తాను..! 


కవిని నేను...

కలం పట్టానంటే...

కమ్మనికలలు కంటాను...

పచ్చదనాన్ని ప్రేమిస్తాను...

మోడువారిన బ్రతుకుల్ని చిగురింప జేస్తాను..!


కవిని నేను...

కలం పట్టానంటే...

కస్సుబుస్సు మనను...

కాటువేయను కడుపుమీద కొట్టను కానీ

పంతానికి వస్తే మాత్రం అక్షరాలతో అంతంచేస్తాను..!


7. భిన్నత్వంలో ఏకత్వం...

దూరమైనకొలది 

పెరుగును... 

అనురాగం...

అనుబంధం

దగ్గరైన కొలది 

తరుగును...

అపరాధ భావం...

సర్దుబాటుగుణంతో

ఆరిపోయేను...

అపార్థాల అగ్నిజ్వాల...


దిక్కులు నాలుగుంటేనే

సృష్టి...ప్రకృతి...ప్రపంచం

సూర్య చంద్రుల ఆగమనం

చీకటి వెలుగుల చక్రభ్రమణం


చేతులు చప్పట్లుగా మారేది

రెండు చేతులు కలిస్తేనే...

మాటలు ముచ్చట్లు మారేది

రెండు మనసులు కలిస్తేనే..‌.

ధృడమైన బంధం ఏర్పడేది

ఇరువురి భావాలు ఏకమైతేనే...


నాలుగు స్తంభాలుంటేనే

ఇంటికి పునాది పటిష్టం ఇది సుస్పష్టం


ఏకమైతేనే...ఏడు రంగులు  

నింగిలో పుట్టు అందమైన ఇంద్రధనస్సు


రెండుపట్టాలు దూరదూరంగా ఉంటేనే

రైలు ప్రయాణం...శుభప్రదం...సురక్షితం


భిన్నత్వంలో ఏకత్వమే ప్రతిమనిషి జీవితం

దూరమైనా భారమైనా నదిపరుగు కడలివైపే


8. శిలలు... కమ్మని కలలు

కాకమ్మ కబుర్లు చెప్పి చెప్పి

మాయమాటలతో మత్తెక్కించి 

ఏదో తెలియని మత్తులో దించి

ఏదో అర్థంకాని మైకంలో ముంచి

నమ్మకంగా నక్కల్లా నటించి 

మంచివాళ్ళుగా ముసుగుకప్పుకొని

తిరిగే పరమ దుర్మార్గులు

మోసగాళ్ళు కసాయివాళ్ళు

విసిరే వలపు వలల్లో

చిక్కుకొని గిలగిలాడే 

ఓ అమాయకపు అమ్మాయిల్లారా!


ఎవరైనా చనువు 

ఇస్తేనే తీసుకుంటారు...ఇవ్వకండి 

కుళ్ళుజోకులకు విరగబడి...నవ్వకండి

వారు మత్తుమందు చల్లుతారు... 

మాయచేస్తారు...

మనసు మార్చేస్తారు...

ఆపై ఊబిలోకి తోసేస్తారు...

తమ చుట్టూ తిప్పుకుంటారు...

తామంటే పడి చచ్చేలా చేస్తారు...

నో... చెప్పలేని దీనస్థితిలోకి నెట్టేస్తారు...

బంధీని చేస్తారు...బానిసగా మార్చుకుంటారు...

అడగకముందే అన్నీ...ఇష్టపడి ఇచ్చేలా చేస్తారు...


అందుకే ఓ అమ్మాయిలూ !

జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త...!!

అడుగు...

ముందుకు వేసే ముందు 

వారు నవ్వుతూ నవ్వుతూ

వెనుక లోతుగా 

గోతులు తీసే కోతులా...

తడిగుడ్డతో గొంతులు

కోసే కసాయి వాళ్ళా...

కడుపులో కత్తులుంచుకొని

కౌగలించుకొనే మోసగాళ్ళా...

పూర్తిగా నమ్మించి నట్టేట 

ముంచే నయవంచకులా...

ఒక్కసారి ఆలోచించండి...


తొందరపడకండి...

నమ్మి మోసపోకండి...

ఏ తప్పు చేయకండి... 

పగటి కలలు కనకండి...

తప్పటడుగులు వేయకండి...

చేతులు కాలాక ఆకులు పట్టుకోకండి...

శీలాన్ని ఫణంగా పెట్టి మీరు శిలలుగా మారకండి...


9. ఓ అమాయకపు అమ్మాయిలూ...

    కాస్త జాగ్రత్త..! 

మూడడుగుల దూరంలో 

ఉండి మాట్లాడుకోవడం

..."చనువు"

ముఖంలో ముఖంపెట్టి 

ముచ్చటలాడుకోవడం

..."అతిచనువు"


అప్పుడప్పుడు మాట్లాడుకోవడం

..."చనువు"

గంటలతరబడి మాట్లాడుకోవడం

..."అతిచనువు"


కుళ్ళు జోకులు వేసుకోవడం

..."చనువు"

ఆ కుళ్ళుజోకులకు విరగబడి నవ్వడం

..."అతిచనువు"


ఎదురెదురుగా ‌నిల్చొని మాట్లాడడం

..."చనువు" 

ప్రక్కప్రక్కన కూర్చొని మాట్లాడుకోవడం

..."అతిచనువు"


సొల్లు కబుర్లు కాకమ్మ కబుర్లు చెప్పుకోవడం

..."చనువు" ఏదో

మాయలో మత్తులో మైకంలో మునిగిపోవడం

..."అతిచనువు"


చొరవ తీసుకుంటే...నవ్వుతూ హెచ్చరించడం

..."చనువు"

తప్పుచేసినా సమర్ధించి వెనకేసుకు రావడం

..."అతిచనువు"


లక్మణ రేఖ...దాటవద్దని ముఖాన చెప్పడం

..."చనువు"

ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకోవడం

..."అతిచనువు"


దూకుడెక్కువైతే తక్షణమే నో... చెప్పడం

..."చనువు"

నో...అని చెప్పలేని దీనస్థితికి దిగజారడం

..."అతిచనువు"


ఎవరైనా ఏదైనా ఆశిస్తే సారి...చెప్పడం

..."చనువు"

అడగకున్నా అన్నీ...ఇష్టపడి ఇచ్చివేయడం

..."అతిచనువు"


అలా బజారు కెళ్ళి కలిసి...కాఫీ త్రాగడం

..."చనువు"

అడగగానే బైకెక్కడం ఎక్కి కూర్చోవడం

..."అతిచనువు"


సెల్ ఫోన్లలో సొల్లు కబుర్లు చెప్పుకోవడం

..."చనువు" 

గుడ్ నైటంటూ ముద్దులు పంచుకోవడం

..."అతిచనువు"


పగటిపూట పార్కుకు...హోటల్ కు వెళ్ళడం

..."చనువు"

అర్థరాత్రి వేళ సినిమాలకు లాడ్జీలకు వెళ్ళడం

..."అతిచనువు"


అమ్మాయిలూ ఒక్కటి మాత్రం పచ్చినిజం

తొండ ముదిరితే ఊసరవెల్లి కావడం ఖాయం

ఉరుములు ఉరిమి మెరుపులు మెరిస్తే వర్షం ఖాయం

అతిచనువే క్రమేపీ అక్రమసంబంధంగా మారడం ఖాయం


అందుకే ఓ అమ్మాయిలూ

నమ్మితే...ఇది పచ్చినిజమని...నడిస్తే...సక్రమైన దారిలో...

మార్చుకొని...మీ వక్రబుద్దిని...మీ‌ జీవితం స్వర్గతుల్యమే...

నమ్మకున్నా బుద్ది మారకున్నా మీ బ్రతుకు నరకకూపమే...


10. ఆ ఆట ఆడినా ఓడినా కోట్లే...

కొందరికి ఆటంటే ఆరాటం

కొందరికి జీవితం ఒక పోరాటం

కొందరికి ఆదర్శం ఎగిసిపడే కెరటం

కొందరికే దక్కుతుంది ధగధగ మెరిసే కీర్తికిరీటం


ప్రపంచ నెంబర్ వన్‌...

2020 లో మొదటి ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ 

టైటిల్ ‌గెలిచిన పోలెండ్ బ్యూటీ (21) 

స్వియటెక్ కే రెండో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కప్


తొలి గ్రాండ్ స్లామ్ పై 

గంపెడు ఆశలు పెట్టుకున్న 

అమెరికా భామ కోకో గాఫ్ (18)ను 

మొదటి గేమ్ లోనే ఒత్తిడికి గురిచేసింది


తన శక్తివంతమైన 

బ్యాక్ హ్యాండ్ షాట్లతో 

ప్రత్యర్థిని కోలుకోని దెబ్బతీసింది

ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది

6-1 6-3 స్కోరుతో వరుస సెట్లలో కేవలం 

68 నిముషాల్లోనే ఏకపక్షంగా ఆట ముగించింది


ఆడిన ప్రతి ఆటలో ఓటమన్నది ఎరుగక

ఈ 21 వ శతాబ్దంలో 35 వరుస విజయాలతో 

దూసుకుపోయి ప్రపంచ మాజీ చాంపియన్ 

వీనస్ విలియమ్స్ రికార్డును సమం చేసింది

రోలాండ్ గారోస్ చాంపియన్ గా నిలిచింది


ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ లో లేడీస్ సింగిల్స్ టైటిల్ విజేత

ఇగా స్వియటెక్ ఖాతాలో ప్రైజ్ మనీజమ.....18.30 కోట్లు 

రన్నరప్ కోకో గాఫ్ ఖాతాలో ప్రైజ్ మనీజమ...9.15 కోట్లు 

ప్రపంచంలో టెన్నిస్ ఆటగాళ్లు ఆడినా...ఓడినా కోట్లే కోట్లు

కసి కృషి ఉన్న ఆటగాళ్ళే అదృష్టవంతులు అపరకుబేరులు


11. ఓ మగువా ! నీ ముందు జీవితం 

     ఓ విందు భోజనం.....కావాలంటే ? 

ఎదుటివారి చూపు... 

ఎంత చెడుగా ఉన్నా

అదిమంచిగానే అనిపించడానికి

ఎదుటివారి మాట... ‌

ఎంత చేదుగా ఉన్నా

అది

 తేనెలా తియ్యగా వినిపించడానికి

ఎదుటివారు చేసే పని...

ఎంతటి నీచకార్యమైనా 

అది పరమపవిత్రంగా 

ఉందనిపించడానికి కారణం ఒక్కటే...


"వీరికి  తెలియకుండానే"

"వారిమీద వీరికి" ఏదో ఒక "నమ్మకం" 

ఏదో ఒక "పిచ్చి అభిమానం" ఏర్పడడమే


మరి అప్పుడేమౌతుంది...?

ఆ నమ్మకమే ఆ పిచ్చి అభిమానమే

ముదిరి ముదిరి "చనువుగా" మారుతుంది

తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు

"ఆ చనువే" ముదిరి ముదిరి చివరికి

"అతి.....చనువుగా"....మారుతుంది


మరి అప్పుడేమౌతుంది...?

ఆ అతి...చనువుతోనె మతిపోతుంది

ఎదుటివారు...ముఖాన ఉమ్మివేసినా

వీరు చిరునవ్వుతో తుడుచుకుంటారు

కారణం"అతి చనువు" 

ఒక‌ "అయస్కాంతమని"

"అది అతి ప్రమాదకరమని" 

వీరికి తెలియదు

"అదే మాయంటే"...

"అదే తెలియని మత్తంటే"...

"అదే వీరికి తెలియకుండానే"...

"వయసుతో సంబంధం" లేకుండానే

"వారిమీద వీరికి" ఏర్పడే ఒక రకమైన 

"ఇష్టమంటే"..."తేనెలాంటి విషమంటే"

"అర్థంకాని....."ఒక అనుబంధమంటే"


మరి అప్పుడేమౌతుంది....?

మతిస్థిరంగా లేక...

ఒకరికొకరు దూరంగా...

ఒకరినొకరు చూడకుండా...

ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా 

ఒక్కరోజైనా... ఉండలేమంటారు

మాటలు లేకున్నా మౌనంగా ‌ఉన్నా 

దొంగగా చూసుకున్నా చాలనుకుంటారు

ఏదో మైకం కమ్మి...

ఏదో మత్తులో మునిగి...

మరేదో వింతలోకంలో...

విహరిస్తూ ఉంటారు

వీరికి తెలియదు తమకేదో..."పిచ్చి"పట్టిందని...

"ఒకమత్తుభూతం" ఆవహించి మాయచేస్తుందని...


ఎంత వివరించి చెప్పినా 

ఎంత ఘాటుగా హెచ్చరించినా...

చనువును...చెడుగా‌...భావిస్తారు...

కాదన్నా వినరు...విరుచుకుపడతారు...

ఎంతో వింతగా...విచిత్రంగా ప్రవర్తిస్తారు...


ఆ చర్చే తమకు నచ్చదంటారు

పిచ్చివారౌపోతారు రెచ్చిపోతారు 

కల్లు త్రాగిన కోతుల్లా చిందులేస్తారు

చనువు...చెడు విచక్షణ కోల్పోతారు

నిందలు వేస్తున్నారని......నిందిస్తారు 

తప్పుచేసిన వారినే వెనకేసుకు వస్తారు

వారికే మద్దతిస్తారు వారినే సమర్ధిస్తారు

వారి మీదే సానుభూతి వర్షం కురిపిస్తారు

తప్పును ఒప్పుకోరు పైగాదాడికి దిగుతారు

కన్నతల్లినైనా... 

కన్నతండ్రినైనా... 

కట్టుకున్న భర్తనైనా...

కడకు ఆ భగవంతుడినైనా....ఎదిరిస్తారు

ఆపై...నిప్పుల కుంపటిపై......నిదురిస్తారు

క్రమేపి...మనశ్శాంతి కరువై...మరణిస్తారు


మరి అప్పుడేమౌతుంది...?

తొండ ముదిరి

.....ఊసరవెల్లి అయినట్లు...

గుడ్డు పొదిగి

.....పిల్ల బయటకు వచ్చినట్లు...

ఆ "అతిచనువే"

.....అక్రమసంబంధమైపోతుంది...

ఆ అక్రమసంబంధంతో 

.....సత్సంబంధాలన్నీ...సమాధి ఔతాయి

పచ్చని కాపురంలో 

....."ఆరనిచిచ్చు"...రగులుతుంది

ఒకే ఒక్కరి ఆవేశానికి...అజ్ఞానానికి...

అహంకారానికి...అర్థంకాని ఆ మత్తుకు...

కుటుంబమంతా ఓ"ఆరని కుంపటి"...ఔతుంది...

ఆపై అందరి బ్రతుకులు...అగ్నిగుండాలౌతాయి...


ఔను ఇది ఒక పచ్చినిజమని...

కాలం‌ గుచ్చిగుచ్చి చెబుతుంది...

ఇది ఖచ్చితమని...కరాఖండిగా...

కామశాస్త్రం ‌కడలిఅలలా ఘోషిస్తుంది...

వెయ్యేళ్ళక్రితమే మేధావులు...

మానసిక శాస్త్రవేత్తలెందరో

శోధించి శోధించి...పరిశోధించి 

వెలికితీసిన పరమ సత్యమిది...


ఔను దాంపత్య జీవితం 

దగ్ధం కారాదు అనుకుంటే...

నమ్మితే...నడత మార్చుకుంటే...

ముందు జీవితం విందు భోజనమే...

నమ్మకపోతే...నడత మార్చుకోకపోతే...

నలుగురిలో నవ్వులపాలె...

ఈ సమస్య ఆరని ఓ అగ్నికణమే ...

పరిష్కరించకపోతే...తక్షణమే

పరువు‌ గంగపాలె...

బ్రతుకు ముళ్ళమీద వేసినబట్టే...

బంధువులందరూ...బద్దశత్రువులే...

అంతా అంధకారమే.....గాఢాంధకారమే... 

అది ఒక నరకమే...అది ఒక మాయనిమచ్చే...

అందుకే  ఏదో మాయలో "మత్తని తెలియని"...

ఏదో "మైకంలో " మునిగితేలే... 

ఓ మగువా ! మరువకు ఓ సత్యం


ఇతరులంటే 

ఇష్టపడుతూ... 

భర్తను బాధపెడుతూ... 

బద్ధశతృవుగా ‌భావిస్తూ...

మానసిక క్షోభకు గురిచేస్తూ...

పైకి కలిసివుంటూ... 

నవ్వుతూ నటిస్తూ...

మానసికంగా భర్తకు దూరంగా… 

బ్రతికే భార్య ఎప్పటికి ఒంటరిదే...

అందరికి అలుసే...అంగడిసరుకే...

చిల్లులు పడ్డ నీటికుండే...

వీధిలోకి విసిరిన ఎంగిలి విస్తరాకే..

భర్తను విస్మరించిన ఆడదాని 

చుట్టూ గుంటనక్కలే...గజ్జికుక్కలే...

చుట్టూ కామాంధులే...కాటువేసే సర్పాలే...

చుట్టూ అన్నీ అవమానాలే‌...అగ్నిగుండాలే...

అందుకే ఏదో మాయలో "మత్తని తెలియని"...

ఏదో  "మైకంలో " మునిగితేలే... 

ఓ మగువా ! జాగ్రత్త ! తస్మాత్ జాగ్రత్త !

నీ కళ్ళు జాగ్రత్త ? నీ ఒళ్ళు జాగ్రత్త ! 

నీ‌ ఇల్లు జాగ్రత్త ! 

నీ పచ్చని కాపురం జాగ్రత్త !


12. ధూమపానం ఒక దుర్వెసనం...!

యువతా ! ఓ యువతా ! 

కాలుస్తున్నానని 

ఖరీదైన ‌సిగరెట్లు

కాలర్ ఎగరేయకు

నీవు కాల్చి బూడిద చేసేది

నీ బంగారు భవిష్యత్తునని గుర్తుచేసుకో


యువతా ! ఓ యువతా ! 

గుండెనిండా పొగపీల్చి 

గాలిలోకి రింగు రింగులు 

పొగ వదులుతున్నానని 

నింగిలోని నీలిమేఘాలలో తేలిపోకు

నేడో రేపో నీ ప్రాణం కూడా

ఆ గాలిలోనే కలిసిపోతుందని తెలుసుకో


యువతా ! ఓ యువతా ! 

చుట్టుకొన్న చుట్టలు

కట్టలు కట్టలు బీడీలు

పెట్టెలు పెట్టెలు సిగరెట్లు

తగలేస్తున్నానని తెగసంబరపడిపోకు

నీ దేహం లోపల నీ ఊపిరితిత్తులు 

నీవు పీల్చిన ఆ నల్లని పొగాకు పొగకు

ఉక్కిరిబిక్కిరైపోతున్నాయని తెలుసుకో


యువతా ! ఓ యువతా! 

పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం

అంటూ హెచ్చరికలు చదువుకుంటూ 

చుట్ట... బీడీ...సిగరెట్లు కొనడమంటే 

కొంచెం కొంచెం క్యాన్సర్ ని కొనుక్కోవడమే

సరదా కోసం పొగ త్రాగడమంటే 

రేపటి నీ సమాధిని నేడు నీవు త్రవ్వుకోవడమే 


ధూమపానం ఒక దుర్వెసనం...మానుకోకపోతే

ఖాయం మృత్యువు నిన్ను ముద్దు పెట్టుకోవడం

యువతా ! ఓ యువతా ! 

జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త !


13. కొన్ని కుటుంబకన్నీటి పన్నీటి గాథ...!

కొన్ని కుటుంబాలు

ఓడిపోయిన 

ఒంటరి కుటుంబాలే...

కొన్ని కుటుంబాలు 

పచ్చని ప్రేమ పందిర్లే...


కొన్ని కుటుంబాల్లో 

ఉరుములు మెరుపులే...

కొన్ని కుటుంబాల్లో 

ఊహించని వరాలవర్షాలే...


కొన్ని కుటుంబాలు

ఆరక రగిలే అగ్నిపర్వతాలే...

కొన్ని కుటుంబాలు ‌నిత్యవసంతాలే...


కొన్ని కుటుంబాలు 

రోడ్డున పడి‌ విలవిల రోదిస్తున్నాయి...

కొన్ని కుటుంబాలు

నింగిలో నక్షత్రాల్లా మిళమిళ మెరుస్తున్నాయి...


కొన్ని కుటుంబాల్లో 

కుమిలిపోవడాలే... 

కలతలే...కష్టాలే...కన్నీళ్లే...

ఒకరిపై ఒకరు కసితో

నిందల నిప్పులు విసురుకోవడాలే...

పగా ప్రతీకారాలతో రగిలి పోవడాలే...

విభేదాలతో విద్వేషాలతో విషం చిమ్ముకోవడాలే...

కొన్ని కుటుంబాల్లో

అంతులేని సంతోషాలే...అంబరాన్నంటే సంబరాలే..


కొన్ని కుటుంబాల్లో

హాలాహలం‌ నింపుకోవడాలే...

కొన్ని కుటుంబాల్లో

అమృతజల ప్రవాహాలే...


కొన్ని కుటుంబాల్లో

అన్నీ ముళ్ళబాటలే...

కొన్ని కుటుంబాలు విరబూసిన విరితోటలే...


కొన్ని కుటుంబాలు 

వింతవింత ‌మనస్తత్వాలతో 

భయంకరమైన వ్యతిరేక భావనలతో 

నిత్య సంఘర్షణలతో ఆరని కుంపట్లే...

కొన్ని కుటుంబాలు ఫలభరిత పచ్చనిచెట్లే...


కొన్ని కుటుంబాలు ఆ భగవంతుడు 

శపించి నిర్మించిన శ్మశానం వాటికలే....

కొన్ని కుటుంబాలు

ఆ భగవంతుడు సృష్టించిన

సుందర శిల్పాలే గీచిన అందమైన చిత్రాలే...

కొన్ని కుటుంబాలు ఆ భగవంతుడు

దీవించి కొలువైఉన్న దివ్యమైన పుణ్యక్షేత్రాలే...


మనం ఏ కుటుంబంలో సభ్యులుగా జన్మస్తామో ఏమో

అది ఆ పరమాత్మ అనుగ్రహమే...పూర్వజన్మ సుకృతమే...


14. జంతువులపై జాలితో... ప్రేమతో...

నీవు కుక్కతో స్నేహం చేస్తే..?

నీకు కుక్కబుద్దులే వస్తాయి

కుండలో కూడుతినుడు 

కుండను పగులకొట్టుడు

ఎప్పుడైనా విశ్వాసంగా ఉండుడు


నీవు నక్కతో స్నేహం చేస్తే..?

నక్క బుద్దులే వస్తాయి

నలుగురిని నమ్మించుడు

నెట్టేట ముంచుడు...ముంచి

నలుగురితో మళ్ళి మంచిగా ఉండుడు


నీవు పాముతో స్నేహం చేస్తే..?

నీకు పాము బుద్దులే వస్తాయి

చిక్కని పాలు త్రాగుడు

పచ్చివిషాన్ని వెళ్ళగ్రక్కుడు

పగబట్టి శతృవు ప్రాణాలు తీసుడు


నీవు కామాంధుడితో స్నేహం చేస్తే..?

నీకు కామాంధుడి బుద్దులే వస్తాయి

కన్నెపిల్లలకు వలలు విసురుడు

చాటు మాటుగా కాటు వేసుడు

తిరిగి నంగనాచిలా నవ్వుతూ తిరుగుడు


నీవు లంచగొండితో స్నేహం చేస్తే..?

నీకు లంచగొండి బుద్దులే వస్తా

యి

జలగలా జనాన్ని పీడించుడు

పిండుకొనుడు పీల్చిపిప్పి చేసుడు

మంది సొమ్ము దోచుకొనుడు దాచుకొనుడు


నీవు సన్యాసితో స్నేహం చేస్తే..?

నీకు సన్యాసి బుద్దులే వస్తాయి

సంసారం సాగరమనుడు

భవబంధాలను త్రెంచుకొనుడు

భార్యాబిడ్డల బ్రతుకుల్ని బలిచేసుడు


కానీ నీవు సద్గురువుతో‌

సత్సాంగత్యం చేస్తే..?‌సత్సంకల్పం‌

సద్బుద్ధి...సమదృష్టి....సమభావం

సత్యవాక్కు...సత్కర్మ....సక్రమార్జన 

వంటి సకల సద్గుణాలే అబ్బుతాయి

ఎక్కడ జన్మించాలో మన చేతుల్లో లేదు

ఎవరితో స్నేహం చేయాలో మన చేతల్లో ఉంది

భగవంతునితో స్నేహం చేస్తే బ్రతుకు బంగారమే

అహంకారులతో స్నేహం చేస్తే బ్రతుకు అంధకారమే


15. ఒక భగ్నప్రేమికురాలి విషాదగాథ...!

అడవిలో

పులులు సింహాలు  

వేటాడుతూఉంటే

పరుగెత్తి పరుగెత్తి 

అలసిపోయిన‌ లేడికూనలా

లేని శక్తిని కూడగట్టుకుని

ఎంతటి మానసిక 

ఒత్తిడినైనా క్షోభనైనా 

ఎంతటి వేదననైనా

ఎన్ని బాధలనైనా భరిస్తుంది


ఎన్ని బెదిరింపులనైనా...

ఎన్ని చీధరింపులనైనా...

ఎన్ని అవమానాలనైనా...

ఎంతటి ఘాటైన హెచ్చరికలనైనా...

ఎన్ని వెలికి నవ్వులనైనా...తట్టుకుంటుంది


చెవులతో వినలేని

అనరాని సూటిపోటి 

మాటల ఈటెలతో

గుండెల్లో గునపాల్లా గుచ్చినా

బందువులందరు రాబందుల్లా

కావు కావుమంటూ కాకుల్లా పొడిచినా

కన్నీటి తెరల మాటున దాచుకుంటుంది


తిట్టరాని ఎన్నితిట్లు తిట్టినా 

రక్తం చిందేలా

రాళ్ళతో కొరడాలతో కొట్టినా

ఒంటినిండా వాతలు పెట్టినా

జుట్టు పట్టుకొని

తలను గోడకేసి కొట్టినా

కాలితో కడుపులో తన్నినా

ముఖాన ఉమ్మివేసినా

ఎన్ని విధాలుగా

ఎంత క్రూరంగా ఎంత ఘోరంగా

ఎంత దారుణంగా దాడులు చేసినా

పదిమందిలో పంచాయతీ పెట్టినా

పరువు తీసినా...

గొంతు కోసినా...

కత్తితో పొడిచినా...

గొడ్డలితో నరికినా...

ముఖాన యాసిడ్ చల్లినా...

చలించక...

ఎంతటి శారీరక హింసనైనా సహిస్తుంది


పిచ్చి ప్రేమ ముదిరి పీక్స్ చేరి...

తన ప్రియుడు...

గుంటనక్కైనా గజ్జికుక్కైనా...

కుంటివాడైనా కురూపియైనా...

నీచుడైనా పరమనికృష్టుడైనా...

కసాయివాడైనా పచ్చిమోసగాడైనా...

వాడే నావాడు నన్నేలువాడు 

నా పిచ్చి‌ మొగుడంటుందిరా

...ఒక భగ్నప్రేమికురాలు...


వాడే నావాడు... 

వాడే నా ఊపిరి...

వాడితోనే నా బ్రతుకు...

వాడిపక్కనే నేపంచుకుంటా...

వాడి బిగికౌగిళ్ళలోనే నేబంధీనై పోతా...


వాడు లేకుండా నేనులేను

వాన్ని చూడకుండా

వాడితో మాట్లాడకుండా

నేను క్షణముండలేను...

చచ్చినా బ్రతికినా వాడితోనే

అంటూ రోజంతా రోదిస్తుంది వాదిస్తుంది

చావుకైనా సిద్దమంటుందిరా

...ఒక భగ్నప్రేమికురాలు...


అదిరా ప్రేమంటే...

స్వేచ్ఛమైన ప్రేమంటే...

వారేరా లైలా మజ్ను దేవదాసు పార్వతీలకు

ప్రతిరూపాలంటే...వారేరా భగ్న ప్రేమికులంటే...


16. వనితా ! ఓ వనితా !

నీ కళ్ళు..... 

బాగున్నాయి 

నీటిలో విచ్చుకున్న కలువల్లా

...విన్న ఆ వనిత కిలకిలమని నవ్వింది


వనితా ! ఓ వనితా !

నీ పళ్ళు..... 

తళతళా మెరుస్తున్నాయి 

నీలాల నింగిలో తారల్లో

...విన్న ఆ వనిత పకపకమని నవ్వింది


వనితా ! ఓ వనితా !

అందమైన 

మీ కాళ్ళు... 

నేలను తాకితే

కందిపోయేలా వున్నాయి

...విన్న ఆ వనిత విరగబడి ‌నవ్వింది


వనితా ! ఓ వనితా !

నిగ నిగ మెరిసే 

నీ ఒళ్ళు.....

చూస్తుంటే నా కళ్ళు 

బైర్లు కమ్ముతున్నాయి

...విన్న ఆ వనిత పక్షిలా 

పతంగంలా గాలిలో తేలిపోయింది


వనితా ! ఓ వనితా !

నీ బుగ్గలు...

బంగినపల్లి 

మామిడిపళ్ళలా

గుండ్రంగా ఉన్నాయి 

గుబులు రేపుతున్నాయి

...విన్న ఆ వనిత ఏదో మత్తులో

ఏదో మైకంలో మునిగిపోయింది


వనితా ! ఓ వనితా !

ఔను చనువంటేఅదే

అతి చనువంటే‌ అదే

ఆపై జరిగేదేమిటంటే...

ఆ అతిచనువే అక్రమ సంబంధానికి దారి తీస్తుంది

ఇక వంకరబుద్దులు విషపుచూపులు వెకిలినవ్వులు

దురాలోచనలు చీకటిలో యుద్ధానికి సిద్దమంటాయి


అందుకే వనితా ! ఓ వనితా ! 

నిన్ను పొగిడేదెందుకు ఏదో పొందడానికే

వారి కుట్రలకు కుయుక్తులకు లొంగిపోకు

వారి మాయమాటలకు పొగడ్తలకు పొంగిపోకు

వనితా ! ఓ వనితా ! జాగ్రత్త !! తస్మాత్ జాగ్రత్త !!!


17. ప్రార్థనలు...

విద్యార్థుల ప్రార్థన : (1)

దయగల ఓ దైవమా ! 

24/7  ఉదయం 

నిద్రలేచింది మొదలు

అర్థరాత్రి వరకు ఆన్లైన్ లో 

పబ్జీగేమ్ ఆడిఆడి

వాట్స్ యాప్ ఫేస్ బుక్ లో

ఎరక్కపోయి ఇరుక్కుపోయాం...


పీకలదాకా మునిగిపోయాం...

ఊబిలోకి జారిపోయాం...

ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతున్నాం...

చదువులకు దూరమయ్యాం...

అమ్మానాన్నలకు భారమయ్యాం...

ఈ సోషియల్ మీడియా 

కోరలనుండి కబంధహస్తాల నుండి 

మా యువతను రక్షించండి తండ్రీ !


వయసాచ్చిన 

ఆడపిల్లల ప్రార్థన  : (2)


దయగల ఓ దైవమా !

మేము

అడ్డమైన ఆకర్షణలకు 

గుడ్డిగా లోనుకాకుండా 

బలహీనతలకు బలైపోకుండా 

మమ్మల్ని కాపాడండి తండ్రీ !

కళ్ళుపొరలు కమ్మిన 

ఈ కామాంధులనుండి

క్రూరమైన ఈ మగమృగాల నుండి 

మాకు రక్షణ కల్పించండి తండ్రీ !


భార్యాభర్తల ప్రార్ధన: (3)


దయగల ఓ దైవమా !

మా పచ్చని కాపురంలో 

చిచ్చు రగలకుండా 

మా ఇరువురి మధ్యకు

మూడో వ్యక్తి రాకుండా 

వచ్చినా అపార్ధాల 

అగ్ని రగలకుండా

మనస్పర్థల 

మంటలు రేగకుండా

ఏ ముప్పు లేకుండా 

మేమెప్పుడూ విడిపోకుండా 

కలకాలం చిలకా గోరింకల్లా

కలిసి ఉండేలా 

మమ్మల్ని దీవించండి తండ్రీ ! 


మూడుకాళ్ళ 

ముసలివాళ్ళ ప్రార్థన :(4)


దయగల ఓ దైవమా !

మాలో ఊపిరి ఉన్నంతవరకు 

మాకే మొండి జబ్బులు రాకుండా 

మా జేబులో డబ్బులు ఖర్చై పోకుండా 

కన్నీటి చుక్కలు నేలపై రాలకుండా 

కన్న బిడ్డలకు పెనుభారం కాకుండా 

నవ్వుతూ...నడుస్తూ...మాట్లాడుతూ

క్షణంలో మాయమై మీలో లీనమైపోయే

ఓ మంచిదారిని మాకు ప్రసాదించండి తండ్రీ ! 


18. నిన్న తేనె‌చుక్క...నేడు విషపుచుక్క? 

అందమైనదని...

ఆస్తిపాస్తులున్నాయని...

ఇష్టపడి మూడుముళ్ళువేసి 

ఎన్నో ఏళ్లు‌గా హాయిగా...

కలిసి‌ కాపురం చేయగా... 

భార్యపై కాసింత మోజు తగ్గిపోవచ్చు 


నిన్నటి తియ్యటి బెల్లం 

నేడు అల్లం కావచ్చు...

నిన్నటి ప్రాణదేవత

నేడు దెయ్యం కావచ్చు...

నిన్నటి తేనెచుక్క

నేడు విషపుచుక్కకావచ్చు...

రోజు రోజుకు ప్రేమజ్వాల 

కాసింత కాసింత చల్లారిపోవచ్చు...ఆపై


"పరస్త్రీ వ్యామోహం"లో పడిపోవచ్చు...

పరువు పోవొచ్చు ప్రమాదకరం కావొచ్చు...

మనిషి వ్యక్తిత్వానికి

మాయని మచ్చతేవొచ్చు...

నిన్నటి ఆ మూడుముళ్ళబంధం

మూన్నాళ్ళ ముచ్చటే కావొచ్చు...

విధి విషం చిమ్మవచ్చు

విడాకులతో‌ వారిని విడదీయవచ్చు...

ఆ దంపతులు అనుభవించే

స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు 

అదృశ్యంగా ఇనుపసంకెళ్లు పడవచ్చు... 

అందుకే

ఓ నవదంపతులారా ! 

తరగని నమ్మకం... కరగనిప్రేమ 

మీకు రెండు కళ్ళు కావాలి...

ఒక హృదయమై పోవాలి 

కమ్మని నా ఈ మాట కలనైనా మరువకండి..!


19. వొద్ధు..! నను ‌తాకొద్ధు..!

నేలతో నీడ అన్నది నను తాకరాదనీ

పగటితో రేయి అన్నది నను తాకరాదనీ

నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది

నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది 


వేలికొసలు తాకనిదే వీణ పాట పాడేనా

చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా

తల్లితండ్రి ఒకరి నొకరు తాకనిదే

నీవు లేవూ నేను లేనూ నీవు లేవు 

నేను లేను లోకమే లేదులే అంటూ... 


ఒక గొప్ప దాంపత్యసందేశాన్ని...

ప్రకృతి ధర్మాన్ని...సృష్టి మర్మాన్ని...

నమ్మలేని ఒక నగ్నసత్యాన్ని వెలికితీసి...

విశ్వానికందించాడు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి


అందుకే

కళ్ళల్లోకి‌ చూడు ఆశగా 

ఆకలిగా చూసి సుఖించు

నిలువెల్లా పులకించేలా 

తనువంతా తాకి తరించు

శృంగారం శృతిమించనంత వరకు 

బ్రతుకు బంగారమే

కడలిలో అలల్లాఎగిసిపడే ఆశలతో

అగ్నిజ్వాలలై రగిలే కోరికలతో

దేహం దాహం ‌తీరాలంటే  

ముందు మనసు మత్తెక్కాలి...

పడకగదిలో... 

పట్టెమంచం ...

పట్టుపరుపు....

పకపకా నవ్వాలి

బెడ్ లైట్ నిద్రపోవాలి

తరుణితనువు గుభాళించే 

గులాబి పువ్వై 

నవ్వుతూ నలిగి పోవాలి

ఆశలు ఆరాలి 

ఆకలి తీరాలి కోరికలు నెరవేరాలి

అప్పుడే ఆ శ్రీమతి ఆ భగవంతుడు

అందించిన ఓ బంగారు బహుమతి...

అప్పుడే ఆ సంసారం ‌పచ్చని‌ సంసారం...

అప్పుడే ఆ దాంపత్యం ‌ఆదర్శదాంపత్యం...


20. ఇది నిజం ఇది మానవ నైజం

నమ్మించి మోసంచేయడం నక్కనైజం

ఆ నక్కలా నటించి 

నమ్మిన వారిని నట్టేట ముంచడం మానవనైజం

కూడుతిన్న కుండను సైతం పగలగొట్టడం కుక్కనైజం

విశ్వాసంగల కుక్కల్లా నటిస్తూ 

విషంచిమ్మడం మానవనైజం


నీతులు చెప్పడం కోతుల నైజం

ఆ కోతుల్లా నటిస్తూ లోతుగగోతులు 

తీయడం మానవనైజం


ప్రేమించిన వాన్ని నమ్మి 

మానం ప్రాణం సర్వం సమర్పించుకోవడం 

అమాయకపు ఆడపిల్లల నైజం

నిన్న పిచ్చిగా వెంటతిరిగి వెర్రివాన్నిచేసి

నేడు తన ప్రేమను తిరస్కరించిందని 

పగబట్టి కసితో కక్షకట్టి కసాయిలా మారడం 

కత్తులతో పొడవడం గొంతులు కోయడం 

యాసిడ్ దాడిచేయడం మానవమృగాలనైజం

 

బ్రతకాలని ప్రార్థిస్తూనే చచ్చేందుకు మందులివ్వడం

కడుపులో కత్తులుంచుకొని కౌగలించుకోవడం మానవనైజం


తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం

ఏరు దాటగానే తెప్ప తగలెయ్యడం

అవసరాలకు వాడుకోవడం

అవసరం తీరగానే వీధిలోకి విసిరేయడం

నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం

ఇదే మానవనైజం ఇది మూటికి ముమ్మాటికీ పచ్చినిజం

మానవనైజం మారినప్పుడే ఈ మానవజాతికి నవవసంతం


21. నందమూరి చందమామ...!

ఆడవారే అసూయచెందే ఆరుకోట్ల ఆంద్రులఅందగాడు

అసాధారణ నటనకు...

ఆత్మ గౌరవానికి ప్రతిరూపం

క్రమశిక్షణకు...సమయ పాలనకు...

చెరగని సంతకం

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ 

శ్రీ నందమూరి చందమామ


చిత్రసీమ చరిత్రలో బాక్సాఫీస్ రికార్డులను

బద్దలు కొట్టిన మైలురాళ్ళ వంటి 290 పౌరాణిక సాంఘిక జానపద చారిత్రక చిత్రాల్లో అద్భుతంగా

నటించిన ఆంధ్రుల అభిమాన...కథానాయకుడు

శ్రీ కృష్ణునిగా శ్రీరామునిగా 

పూరాణ పాత్రల్లో జీవించిన

వెండితెర మీద వెలిగిన అభినవ...

అవతార పురుషుడు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ 

శ్రీ నందమూరి చందమామ


సమాజమే దేవాలయం ప్రజలే 

నా దేవుళ్ళను నినాదంతో

పేదలపార్టీ పెట్టి ఆరుకోట్ల 

ఆంద్రుల ఆత్మగౌరవం పేరిట

ఎన్నికల శంఖారావం...పూరించిన

కాంగ్రెస్ కంచుకోటను...ఆక్రమించిన

9 నెలల‌కాలంలో...

అఖండ మెజారిటీతో

ముఖ్యమంత్రి పీఠాన్ని...అధిరోహించిన...అఖండుడు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ 

శ్రీ నందమూరి చందమామ


పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన

రెండురూపాయల బియ్యం 

మద్యపాన నిషేధం

మహిళలకు ఆస్తిలో హక్కు 

పథకాలతో జనరంజకంగా పరిపాలన...అందించిన...

ఘనుడు...త్యాగధనుడు

ప్రజల గుండెల్లో నిలిచిన ఆరాధ్యదైవం...అమరజీవి

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ 

శ్రీ నందమూరి చందమామ


ట్యాంక్ బండ్ మీద కవుల నిలువెత్తు విగ్రహాలతో

తెలుగుభాషకు...తెలుగుజాతికి ఎనలేని ఖ్యాతిని

కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ను ఏర్పరచి దేశవ్యాప్తంగా

అఖండకీర్తిని ఆర్జించిన...చరిత్ర సృష్టించిన...జననేత

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ 

శ్రీ నందమూరి చందమామ


(శ్రీ నందమూరి తారక రామారావు 

జయంతి సందర్భంగా)


22. ఓ తరుణీ జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !!

నీలాల నింగిలో 

తారలా తళతళ మెరిసే 

ఓ తరుణీ జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త ! 

ఎన్నడూ ఎప్పుడూ

తప్పటడుగులు వేయకు

తప్పుడు పనులు చేయకు

కొందరు 

నీవెంట పడతారు...

నీవంటే ఆశ పడతారు... 

నీకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు...

కాస్త చనువిస్తే చాలు 

కాలసర్పాలై కాటు వేస్తారు..

వద్దు ఎవరినీ నమ్మొద్దు...అందుకే

ఓ తరుణీ జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !


నీ వెనుకనే

కొందరు అంధులుంటారు 

కళ్ళు పొరలు కమ్మిన 

కామాంధులుంటారు... అందుకే

ఓ తరుణీ జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !


నీ ప్రక్కనే నక్కినక్కి 

తిరిగే నక్కలు ఉంటాయి

గులాబీలు పట్టుకొని

గుంట నక్కలుంటాయి... అందుకే

ఓ తరుణీ జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !


నీ ప్రక్కనే

కోరికలు రగిలించే

కోతులుంటాయి లోతుగా 

గోతులు త్రవ్వుతుంటాయి... 

కొండముచ్చులుంటాయి...

పిచ్చిప్రేమను ఒలకబోస్తుంటాయి...

అందుకే ఓ తరుణీ జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !


నీ చుట్టూరే

కుక్కలుంటాయి...

గజ్జ కుక్కలుంటాయి...

తిక్కరేగి తిరుగుతుంటాయి...

కుండలోని కూడుపెట్టమంటాయి...

అందుకే ఓ తరుణీ జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !


నవ్వు... కానీ 

నలుగురిలో నవ్వులపాలైకాకు

నమ్ము... కానీ 

ఒకరి వశమైపోకు...

నాశనమైపోకు సర్వనాశనమైపోకు...

కారణం నీ వెంటే 

వంచకులుంటారు

నయవంచకులుంటారు

నమ్మితే నట్టేట ముంచుతారు... 

అందుకే ఓ తరుణీ జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !


గుంటలో పడు...

కానీ...ఊపిరాడని ఊబిలో పడిపోకు

మాట్లాడు...

కానీ... అతిగా మాట్లాడకు కొందరు

మాయమాటలతో మత్తెక్కిస్తారు

మరుక్షణంలోనే

మానవమృగాలుగా మారిపోతుంటారు

అందుకే ఓ తరుణీజాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !


మనసివ్వు...

కానీ...మానాన్నివ్వకు 

కానుకగా సర్వాన్ని సమర్పించుకోకు

చనువియ్యి...

కానీ...తనువియ్యకు 

అతిచనువియ్యకు

కారణం

అతిచనువిస్తే చంకనెక్కుతారు

మురిసిపోతూ ముద్దులడుగుతారు

ఆపై తలపై కెక్కి తైతకక్కలాడుతారు 

చీకటిలో శివతాండవం చేద్దామంటారు

అందుకే ఓ తరుణీజాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !


నీ వెంటే వేటగాళ్ళుంటారు

చాటుమాటుగా 

వలపు వలలు విసురుతుంటారు

అందాలు ఆరబోయమంటారు

విందు చేయమంటారు ఆపై

ఆకలితీరగానే నీపై విషం చిమ్ముతారు

ఎంగిలి విస్తరాకల్లే నిన్ను వీధిలోకి విసురుతారు

అందుకే ఓ తరుణీ జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త !


23. ఏమన్నది? ఏమన్నది? 

      నా మువ్వన్నెలజెండా ?


ఎందరో నిస్వార్థపరుల...మహానుభావుల 

మహాత్ముల...స్వాతంత్ర్య సమరయోధుల

జాతినేతల...జైలు జీవితాల...రక్తతర్పణాలకు

ప్రతిఫలమే...మన అర్థరాత్రి స్వాతంత్ర్యమన్నది


సర్వమతాలకు...కులాలకు...జాతులకు

వర్ణాలకు వర్గాలకు...సంస్కృతీసంప్రదాయాలకు

నా భారతజాతి...నిలయమన్నది 

భిన్నత్వంలో ఏకత్వమే...మన నినాదమన్నది


ప్రజాస్వామ్యమే...మనకు ఆరవప్రాణమన్నది

అదే మన భరతమాతకు...

స్వర్ణాభరణమన్నది

అంబేద్కర్ రాజ్యాంగమే...

మనకు రక్షణ కవచమన్నది


గాంధీజీ నెహ్రూ పటేల్ 

చంద్రబోస్ భగత్ సింగ్ త్యాగాలే

మనకు పునాదన్నది...

ఇందిరా రాజీవ్ అటల్ బిహారీ 

అబ్దుల్ కలాం జాతినేతల 

ఆశయాలే మనకు ఊపిరన్నది


ఇంకా ‌ఏమన్నది ఏమన్నది ? 

నా మువ్వన్నెల జెండా

నీతిగా...నిజాయితీగా...

నిప్పులా బ్రతకమన్నది

నిర్భయంగా...తలఎత్తుకు తిరగమన్నది.......జైహింద్


24. ఎవరు...? ఎవరు...?

ఎవరు...? ఎవరు...?

అతి భయంకరుడెవరు...?

పదునులేని గొడ్డలినిచ్చి

పది మామిడి చెట్లను

పది నిముషాల్లో నరకమనేవాడు


ఎవరు...? ఎవరు...?

నరహంతకుడెవరు...?

చీకటిగదిలో చిరుతపులిని దాచి

చిరునవ్వులు చిందిస్తూ 

ముప్పేమిలేదంటూ ముందుకు నెట్టేవాడు


ఎవరు...? ఎవరు...?

అతి పిరికివాడెవరు...?

ఫోన్ లో ఫ్రెండ్ ఖంగుమని

దగ్గుతూ మాట్లాడుతుంటే తనకెక్కడ 

కరోనా సోకుతుందోనని కాల్ కట్ చేసేవాడు


ఎవరు...? ఎవరు...?

పరమ నీచుడెవరు...? 

ఆకలి ఆకలి అంటూ వుంటే

అరిటాకేసి అన్నం బదులు సున్నం పెట్టేవాడు


ఎవరు...? ఎవరు...?

నయవంచకుడెవరు...?

దాహం దాహం అంటూ ఉంటే 

నీళ్ళకు బదులు చేతిలో నిప్పులు పోసేవాడు


ఎవరు...? ఎవరు...?

పచ్చిమోసగాడెవరు...?

బ్రతకాలని ప్రార్దిస్తూనే

మరణించేందుకు మౌనంగా మందులిచ్చేవాడు

కడుపులో కత్తులుంచుకొని కౌగలించుకొనేవాడు


25. యుద్దానికి సిద్దమా?

నీ చూపు...

ఎల్లప్పుడూ 

వెలుగు వైపు లేనిచో

నీ వీపు....

ఎల్లప్పుడూ 

ఒంగిపోయి ఉన్నచో

నేలను తాకి ఉన్నచో

నిబడలేని...

కూర్చోలేని... 

నడవలేని.... 

తృప్తిగా నవ్వలేని...

దుప్పిలా దూకలేని... 

గుర్రంలా‌ పరుగెత్తలేని...

ప్రశాంతంగా పడుకోలేని... 

దుస్థితి నీకు దాపురించును


ఔను

ఆ భగవంతుడు కొందరికి

వినలేని చెవులను...

చూడలేని కన్నులను...

గ్రహించలేని హృదయాన్ని...

నిద్రమత్తుగల మనస్సును...

ప్రసాదిస్తాడు

వారే శాపగ్రస్తులు...

వారే ఆ సైతానుకు స్నేహితులు...

వారే ఆ భగవంతునికి బద్దశత్రువులు....

అందుకే ఓ మనిషి !

ఇక నిజం తెలుసుకో నీవే తేల్చుకో...

సైతానుతో యుద్దానికి సై అంటావో...

భగవంతున్ని భక్తితో పూజిస్తాతావో...


26. పిట్టలదొరను 

      నమ్మేవారంతా పిచ్చివారే! 

ఒకనాడు ఓ డేరాబాబా

సముద్రంలోని ఉప్పునీళ్ళను

మంచి నీళ్ళుగా మారుస్తా...!

నా తఢాఖా చూపిస్తా‌...! అన్నాడట

ఆ డేరా బాబాను రోజూ ఏనుగు మీద

ఊరంతా ఊరేగించేవారట

గుడికట్టి దైవమంటూ పూజించేవారట

రోజూ సముద్రతీరాన బారులు తీరేవారట

కాలచక్రం గిర్రున తిరిగింది

ఒక ఏడాది పక్షిలా ఎగిరిపోయింది


ఆశతో ఊరి ప్రజల ప్రశ్న:

బాబా ! ఓ బాబా! ...

సముద్రంలోని ఉప్పునీళ్ళను

మీరు మంచినీళ్లుగా మార్చేదెప్పుడు ?

సముద్రంలో అలలు ఆగినప్పుడు !

బాబా వింత సమాధానం... 

అందరిలో ఎంతో అనుమానం...

ఆ అలలు ఆగేదెప్పుడు?

ఈ ప్రజల దాహం తీరేదెప్పుడు?

ఔరా ! ఈ డేరా బాబా...

ఎంతటి మోసగాడు ? ఎంతటి మాయగాడు? 

ఈ డేరా బాబాను నమ్మిన ఆ 

భక్తులెంతటి అజ్ఞానులు ఎంతటి అమాయకులు?


ఒకరోజు ఓ వెర్రి వెంగళప్ప

పిల్లిమెళ్ళో గంటలు కడతానన్నాడట

ఆ వెంగళప్పను రోజూ గుర్రం మీద

ఊరంతా ఊరేగించేవారట 

కాలచక్రం గిర్రున తిరిగింది

ఒక ఏడాది పక్షిలా ఎగిరిపోయింది


ఆశతో ఊరి పెద్దల ప్రశ్న?

వెంగళప్పా ! ఓ వెంగళప్పా !

మీరు పిల్లిమెళ్ళో 

గంటలు కట్టేదెప్పుడు ?

మీరు పిల్లికళ్ళకు 

గంతలు కట్టినప్పుడు?

వెంగళప్ప వెర్రి సమాధానం... 

అందరిలో ఎంతో అనుమానం...

ఔరా ! ఈ వెంగళప్ప 

ఎంతటి మాయగాడు?

ఆ వెర్రి వెంగళప్పను నమ్మిన 

ఈ ప్రజలెంత వెర్రివాళ్ళు?


ఒక రోజు ఓ పిట్టలదొర

ఊరికి ఉత్తరాన ఉన్న కొండను మోస్తా ! 

సముద్రంలో విసరేస్తా ! అన్నాడట

అందరూ ఔరా మా పిట్టలదొర బాహుబలి 

అభినవ ఆంజనేయుడంటూ పొగిడి‌ పొగిడి

ఆ పిట్టలదొరను రోజూ పూలరథం మీద

ఊరంతా ఊరేగించేవారట 

కాలచక్రం గిర్రున తిరిగింది

ఒక ఏడాది పక్షిలా ఎగిరిపోయింది


ఆశతో ఊరి పెద్దల ప్రశ్న...

దొరా ! ఓ దొరా! 

మీరాకొండను మోసేదెప్పుడు ?

మీరా కొండను ఎత్తి నా తలపై పెట్టినప్పుడు?

పిట్టలదొర పిచ్చి సమాధానం....

అందరిలో ఎంతో అనుమానం...

ఔరా ! ఈ పిట్టలదొర ఎంతటి మోసగాడు?

ఆ పిట్టలదొరను నమ్మిన ఈ ప్రజలెంత పిచ్చివాళ్ళు?


ఔను

ఇదే ప్రజల గుడ్డి నమ్మకమంటే...

ఇదే మేకపోతు గాంభీర్యమంటే...

ఇదే అరచేతిలో స్వర్గం చూపించడమంటే...


అందుకే

ఈ పిట్టల దొరల్ని...

ఈ డేరా బాబాల్ని...

ఈ వెర్రి వెంగళప్పల్ని...

వాగ్దానాల వర్షం కురిపించి ఎన్నికల్లో

గెలిచి కుర్చీలో కూర్చోగానె కుబేరులయ్యే

ఓట్లు సీట్లు సంపాదించి కోట్లు కోట్లు ఆర్జించే

నయవంచకులైన మన రాజకీయరాబందుల్ని...

నమ్మరాదు...నమ్మరాదు... నమ్మనేరాదు.......


27.సంకేతమే....

మెరుపులు మెరిస్తే 

ఉరుములు ఉరిమితే

మేఘాలు కరుగుతాయని

చినుకులు రాలుతాయని సంకేతమే


హోరుగాలులు వీస్తే

బోరు బోరున కుంభవర్షాలు కురిస్తే

వచ్చే వరదభీభత్సానికది సంకేతమే


కడలిలో అల్పపీడన ద్రోణి ఏర్పడి

అలలు ఎగిసిపడితే ఆపై బలహీనపడితే

విరుచుకుపడనున్న పెనుతుఫానుకది సంకేతమే


వేగంగా పెనుగాలులు వీచి

విద్యుత్ స్తంభాలు విరిగితే 

వేలాదిగాచెట్లు నేలకొరిగితే

పొంచిఉన్న తీవ్రతుఫానుకది సంకేతమే


తీవ్రతుఫానే తీరందాటితే‌ 

సముద్రం ఉగ్రరూపం దాలిస్తే

సర్వంధ్వంసం చేసే సునామీకది సంకేతమే


ఔను ప్రతిసంకేతం ప్రమాదానికి హెచ్చరికే

ఈ కరోనా కాలాన సమయస్ఫూర్తితో

సత్వర చర్యలు చేపట్టి

భౌతిక దూరం పాటిస్తే

తరచు  చేతులు శుభ్రం చేసుకొంటే

ముఖానికి డబుల్ మాస్కులు ధరిస్తే

ముందుజాగ్రత్తలు తీసుకుంటే

కరోనా పెనుముప్పు తిప్పిపోయి 

ఇంటిల్లిపాదికి...సంతోషమే...సంక్రాంతిసంబరమే


28. దివిలోని దైవం 

      నిన్ను దీవించును గాక ! 

నిన్న నీవు ఎందరినుండో

"స్పూర్తిని" పొందావు

నేడు "ఉన్నత శిఖరాలకు" 

చేరుకున్నావు...ఊహించనిరీతిలో 

అందుకే...

రేపు నీవు ఒక్కరికైనా 

ఒక "మెట్టుగా" నిలవాలి

అదే కదా కృతజ్ఞత...

అదే కదా పుణ్యం...

అప్పుడే కదా నీ జన్మధన్యం...


నిన్న ‌నీవు ఎందరినుండో

"వెలుగును" ‌పొందావు

నేడు "పున్నమి చంద్రుడిలా" 

వెలిగిపోతున్నావు 

అందుకే...

రేపు నీవు ఒక్కరికైనా 

"జీవన జ్యోతివై" నిలవాలి

అదే కదా కృతజ్ఞత...

అదే కదా అనురాగం ఆప్యాయత...

అప్పుడే కదా నీవు అందరికీ స్పూర్తి ప్రదాత...


నిన్న నీవు ఎందరో

"ఉత్తములైన గురువుల"నుండి

ఉచిత శిక్షణ పొంది ఉన్నావు 

నేడు "మేధావిగా మెప్పు" పొందావు 

అందుకే...

రేపు నీవు ఒక్కరికైనా 

నీ "విజ్ఞానపు వెలుగుల్ని" పంచాలి

అజ్ఞానాంధకారాన్ని....తొలిగించాలి

అదే కదా కృతజ్ఞత...

అదే కదా సంస్కారం...

అప్పుడే కదా నీ ఈ మానవ జన్మసార్థకం...


నిన్న నీవు ఎందరినుండో

"ఆపదలో ఆదుకోమని"

అర్థించి...ప్రార్థించి ఉంటావు

నేడు సుఖంగా...సురక్షితంగా...

నిశ్చింతగా "ప్రశాంతంగా జీవిస్తున్నావు"

అందుకే...

రేపు నీవు ఏ అండలేని నిరుపేదలకు 

నిస్సహాయకులకు "రక్షణ కవచంగా"నిలవాలి

అదే కదా కృతజ్ఞత...

అదే కదా పరమాత్మకు ప్రతిరూపం...

అప్పుడే కదా నీ జీవితానికి అర్థం పరమార్థం...


నిన్న నీవు ఎందరినుండో

"ఆర్థిక సహాయం"పొంది ఉన్నావు

నేడు "కోట్లకు పడగలెత్తే కోటీశ్వరుడివైనావు"

అందుకే...

రేపు నీవు అనాధలకు...అభాగ్యులకు

కొండంత అండగా "ఆపద్భాందవునిగా" నిలవాలి

అదే కదా దాతృత్వం...

అదే కదా మానవత్వం...

అప్పుడే కదా "దివిలోని ఆ దైవం" 

నిన్ను దీవించేది...


నిన్న నీవు ఎందరినుండో

"ఉచిత సేవలెన్నో"పొందావు

నేడు ఆరోగ్యంగా...ఆనందంగా

ఏ చీకు చింతాలేకుండా 

"చిరునవ్వులు చిందిస్తున్నావు"

అందుకే...

రేపు నీవు "విధివక్రించి" అనుకోని ఆపదలోపడి

ఆసుపత్రిలో పాలైతే "అభయహస్తమందించాలి"

అదే కదా మంచితనం...

అదే కదా మానవత్వం...

అప్పుడే కదా నీవు "ధరణిలో నడిచే దైవమయ్యేది"...


29. కన్నబిడ్డలా ? కాదు కాదు...

నాడు ఎన్నో

ముద్దులు పెట్టిన

గోరుముద్దలు తినిపించిన

గోము చేసిన 

అనురాగమయివే...ఓ అమ్మా !


ఉగ్గుపాలు పట్టి

జోలపాటలతో జోకొట్టి

ఊయలలో వేసి ఊపి 

ప్రేమామృతాన్ని పంచి

పెంచి పెద్ద చేసిన 

అమృతమయివే...ఓ అమ్మా !


నాడు.... 

ఒంటరిగా ఉంటే జంటలుగా మార్చి

ఖరీదైన పెద్ద చదువులు చదివించి

ఉన్నతమైన ఉద్యోగాలను ఇప్పించి

జబ్బుచేస్తే మాకు లక్షలు ఖర్చుచేసిన

కరుణామయివే...ఓ అమ్మా !


నేడు నీవు దీనంగా...

జబ్బుచేసి మంచానపడి 

ఇన్ని మందులిప్పించమని

ఆకలేసి ఇంతకూడు పెట్టమని

ఎంతగా వేడుకున్నా

కడకు కాళ్ళుపట్టుకున్నా

దయజాలిలేక

అతికఠినాత్ములైన

రాతిగుండెల రాక్షసులైన

కన్నబిడ్డలు కరుణించరాయే

ఔరా నిజంగా వారు కన్నబిడ్డలేనా?

కాదు కాదు విశ్వాసం లేని కుక్కలు..?

ఆస్తికోసం కాచుకున్న గుంటనక్కలు..?


30. ఎందుకో ఏమో...ఎవరికెరుక?

కళ్ళకు

కనిపించక

వీనులకు వినిపించే 

నా కవితకు నేచేరువైతే

కనిపించే నా ప్రేమదేవత

నాకు దూరమైపోతోందేమో..!


ఆమె తనువు 

స్పర్శకై నా తనువులోని 

అణువణువు తపిస్తుంది 

వీణాగానమై విలపిస్తుంది

...ఎందుకో ఏమో...ఎవరికెరుక?


ఆమె ఓరచూపు చూస్తుంటే  

ఆమె కులుకునడక చూస్తుంటే 

ఆకలేస్తుంది దాహమేస్తుంది కానీ 

ఆ దాహం ఆ ఆకలి ఎంతకూ తీరకుంది 

...ఎందుకో ఏమో...ఎవరికెరుక?


ఆమెతో కలిసి తినాలని

ఆమెతో కలిసి తిరగాలని 

ఆమె చిలకపలుకులు వినాలని

ఆమెతో కలిసి పయణించాలని

ఆమెతో కలిసి శయనించాలని ఉంది

...ఎందుకో ఏమో...ఎవరికెరుక?


ఆమే నిన్నటి నా ప్రాణదేవత...

ఆమే నా కలలరాణి...

నా ఊహలఊర్వశి...

ఆమెలేని ప్రతిదినం ప్రతిక్షణం 

నాకు శూన్యమే

ఆమె లేకున్నా ఆమె ఊసులేకున్నా నిముషమైనా

నాకు ఊపిరాడదే ఈ భువిపై ఉండాలనిపించదే 

ఎందుకో ఏమో...ఎవరికెరుక? కానీ 


అందుక్కారణం చంద్రునిమించిన ఆమెఅందమే 

లతలా అల్లుకున్న అంతులేని అనురాగబంధమే

మా ఇరువురి మధ్య పెనవేసుకున్న ప్రేమబంధమే

విధిసైతం విడదీయలేని విచిత్రమైన వివాహబం


31. వారెవరు ? ఏం చేస్తారు ?

వారెవరు...?

వారే నమ్మించి 

నట్టేట ముంచే 

"నయవంచకులు"

వారే నక్కినక్కి

తిరిగె "గుంటనక్కలు"

వారే కుండలో కూటికోసం 

కుట్రలు పన్నే "పిచ్చికుక్కలు"


వారే మనుషులముసుగులో 

తిరిగే "మానవ మృగాలు"

వారే "మాయమాటల మాంత్రికులు"


వారే ఆత్మబంధువుల్లా 

ఆపద్భాందవుల్లా

నటించే "రాబందులు"  

"రక్షకుల్లా కనిపించే రాక్షసులు" 


వారు విరిబూసిన పువ్వులు కాదు

వారు "గుండెల్ని చీల్చెగులాబీముళ్ళు"


వారి చిరునవ్వుల్లో 

"కాలకూట విషం" దాగివుంటుంది 

వారే సమయం చూసి 

చాటుమాటుగా "కాటువేసె కాలనాగులు"


వారేమిచేస్తారు...?

వారు కంటికి దొరల్లా కనిపిస్తారు

దొంగల్లా వస్తారు సర్వం దోచేస్తారు

మంచిగా సాదుస్వభావులుగా సన్యాసుల్లా

కళ్ళకు కనిపిస్తారు కళ్ళకు గంతలు కట్టేస్తారు


తామంటే ఇష్టపడేలా తమవెంటే తిరిగేలా 

తమ మాటంటే పడిచచ్ఛేలా చేస్తారు తాము

కళ్ళకు కనపడకపోతే కలవరపడిపోయేలా  

తాము అడగకుండానే అన్నీ ఇష్టపడి 

ఇచ్చేలా మెల్లగా మత్తుమందేదో చల్లుతారు


కడుపులో కత్తులుంచుకొని కౌగలించుకొంటారు

ఏదో మైకంలో మాయలో

మగతనిద్రలో ముంచి 

ముఖంమీద ఉమ్మేసినా 

తుడుచుకొనిపోయేలా చేస్తారు


అప్పుడు వీరేమి చేస్తారు...?

కట్టుకున్నవారి కంట్లో కారం కొడతారు

నచ్చినవారి చుట్టే పిచ్చిపట్టి తిరుగుతారు

ఆడిస్తే కీలుబొమ్మలై ఆడతారు పాడతారు

కోరుకున్నవారి కోరికలు తీర్చేందుకు సిద్ధమై

సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతారు


32. అక్కడ ? శాంతి ఎక్కడ?

శాంతి...

అక్కడ ముక్కలైంది 

శాంతి...అక్కడ 

పాతాళంలో పాతివేయబడింది

శాంతి...అక్కడ 

సజీవంగా సమాధి చేయబడింది

శాంతి...అక్కడ 

గడ్డివాములా దగ్దం చేయబడింది

శాంతి...శిఖరం 

అక్కడ నేలకు ఒరిగి పోయింది

శాంతి...పావురం 

ఎప్పుడో నింగిలోకి ఎగిరి పోయింది


నిన్నటి ఆ శాంతి నిలయం 

నేడు నిప్పుల కుంపటి ఐంది

అందుకు కారణం ఒక్కరే  

"మత్తు మందుకు 

పరాయి స్త్రీల పొందుకు" 

బానిసైన ఆ ఇంటి యజమాని... 

అక్కడ నిజానికి "నిత్యం కురిసేది నిప్పులవానే"...


తిట్టుకోవడం కొట్టుకోవడం 

కోర్టులో కేసులు పెట్టుకోవడం

ఒకరినొకరు దూషించుకోవడం

పగ ప్రతీకారాలతో రగిలిపోవడం

ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకోవడం

నిజానికి ఆ ఇంట్లో "మనశ్శాంతి మరణించింది"


ఒకరిని ఒకరు అసహ్యించుకోవడం

ఒకరి ముఖమొకరు చూసుకోకపోవడం

ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకోవడం

ఒకరిని ఒకరు బద్దశతృవులుగా భావించడం 

నిజానికి ఎవరినెవరు చూసినా 

అది విషపు చూపే 

ఎవరునవ్వినా అది విషపునవ్వే అదినిత్యసత్యమే


ఆ జంట విడాకుల కత్తుల వంతెన మీద నడుస్తున్నది

వేకువజామున వెలుగు కిరణాలకోసం వేచిచూస్తున్నది

ఏడు రంగులు ఇంద్రధనుస్సు కోసం ఎదురుచూస్తున్నది

నిన్నటి తియ్యని కలలు తీరం చేరాలని కోరుకుంటున్నది

నిజానికి నిన్న చితికిన బ్రతుకులు నేడు చిగురించాలన్నది


33. ఆపై జరిగే ఘోరమేమిటి ?

మెరిసేదంతా 

బంగారం కాదని తెలియక... 

మంచితనాన్ని బలహీనతగా

భావిస్తారని ఎరుగక...


ఇచ్చిన చనువు ముదిరితే 

అది అతిచనువుగా మారితే 

ఆపై జరిగే ఘోరమేమిటి? ఇంకేమిటి?


సత్సంకల్పాలు

దుష్టతలంపులౌతాయి...

సద్బుద్ధి

దుర్భుద్దిగా మారుతుంది...


సత్సంబంధాలు

అక్రమసంబంధాలౌతాయి...

కొత్త కోరికలు పుడతాయి...

కోతులై చిందులేస్తాయి...

కోడెనాగులై బుసలు కొడతాయి...


ఆపై కుక్కలు కొన్ని కుండలో 

కూడు తినాలని కుట్రలు పన్నుతాయి...

నక్కినక్కి తిరిగే గుంటనక్కలు కొన్ని 

గుడిని గుడిలో లోలింగాన్ని మింగేస్తాయి...


ఆపై జరిగిందేమిటో 

మనకు తెలుసే లోగా

పడమట ప్రొద్దు వాలిపోతుంది 

చిమ్మచీకటి కమ్మి

జరగాల్సిన ఘోరం 

మహాదారుణం జరిగిపోతుంది


ఆపై ఎంత కుమిలికుమిలి 

ఏడ్చిమాత్రం ఏమి లాభం ?

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఫలితం శూన్యం?

అందుకే ముందే ఉండాలోయ్ 

కాసింత ముందుజాగ్రత్త...


34. నేను ఆరిపోని ఒక అగ్నికణాన్ని...

ఆ మతోన్మాదులు

ఆ మనువాదులు

నన్ను మట్టిలో వేసి

గట్టిగా తమకాళ్ళతో

తొక్కాలనుకున్నారు


కానీ పాపం 

ఆ అమాయకులకు

తెలియని నిజమొక్కటె

నేను మట్టిని చీల్చుకొని

మొలకెత్తే మర్రివిత్తనాన్నని...


నేడు మొక్కనై...

రేపు పచ్చని వృక్షాన్నై...

విశ్వమంతా విస్తరిస్తానని...


నన్ను కాల్చే వారికి

కూల్చే వారికి సైతం

చల్లని నీడ నిస్తానని...

కమ్మని ఫలాలతో వారి

కడుపులు నింపుతానని...


వారి ఆశలను...ఆకలిని

ఆవేదనలను తీరుస్తానని...

వారి అతుకుల...

గతుకుల...బ్రతుకుల్ని

ఉన్నతంగా మారుస్తానని...


నిన్న వెర్రివాడనంటూ

నన్ను కొండల వెనుక విసిరేశారు 


పాపం...

ఆ అహంకారులకు తెలియదు 

నేను... 

రేపు "భగ్గునమండే సూర్యున్నై"

తూర్పు దిక్కున ఉదయిస్తానని... 

నన్ను దూరంగా విసిరేసిన వారికి 

నా చుట్టున్న అభాగ్యులకు అనాధలకు

"పండువెన్నెల్ని" పంచుతానని...


పాపం...

ఆ అజ్ఞానులకు తెలియదు 

నేను... 

నేడు "నివురుగప్పి‌న నిప్పునని"...

ఆరిపోని ఒక "అగ్నికణాన్నని"...

దయాదాక్షిణ్యం లేకుండా రేపు

దళారులను...దగాకోరులను...

మానవమృగాలను...

దగ్ధం చేసే...ఒక"మరఫిరంగినని"....


పాపం... 

ఆ అమాయకులకు తెలియదు 

నేను...

నేడు పొదలచాటున 

పొంచివున్న "చిరుతపులినని"...

రేపు ఏక్షణాన్నైనా 

మెరుపుదాడి చేస్తానని...

మెడలు కొరికేస్తానని...

"అవినీతి జలగల్ని" అంతంచేస్తానని... 


35. సుఖజీవన సూత్రాలు 

త్రవ్వకు త్రవ్వకు 

గతాన్ని త్రవ్వకు...

నవ్వకు నవ్వకు 

విషపునవ్వు నవ్వకు...

ఇవ్వకు ఇవ్వకు

అతిచనువును ఇవ్వకు...


పెట్టకు పెట్టకు

ఎలుకలు దూరాయని

ఇంటికి నిప్పు పెట్టకు...

తిట్టకు తిట్టకు

నీ కష్టాలకు 

నీ కన్నీళ్ళకు కారణం

ఆ భగవంతుడేనని తిట్టకు...


మోయకు మోయకు

తలకు మించిన 

బరువులను మోయకు...

మూయకు మూయకు

ఎన్నడూ అవకాశాల 

తలుపులను మూయకు...

వ్రాయకు వ్రాయకు

రాతి మీద తప్ప

నీటిమీద వ్రాతలు వ్రాయకు...


ఈదకు ఈదకు

సంసారసాగరాన్ని

బాధ్యతారహితంగా ఈదకు...

ఊదకు ఊదకు

పరులకంటిలో నలుసును 

నీ కంటిలో 

దూలముంచుకొని ఊదకు...


ఆడకు ఆడకు

పచ్చి అబద్దాలు ఆడకు...

వేడకు వేడకు

రాతిబొమ్మలను 

రక్షించమని వేడకు...


మ్రొక్కకు మ్రొక్కకు

కళ్ళకు కనిపించినా 

ఎంత ప్రార్థించినా

ఉలకని పలకని

కదలని మెదలని

కరుణించని కాపాడని 

రాత్రింబవళ్ళు

ఆ రాతిబొమ్మలకు మ్రొక్కకు...


దూరకు దూరకు

దుర్వెసనాల 

గుహలోకి దూరకు...

కోరకు కోరకు

కొండమీది కోతిని

ఆకాశంలో చందమామను

ఆగమని కడలిలోని అలలను


ఎక్కకు ఎక్కకు

ఆక్సిజన్ లేకుండా

ఎవరెస్ట్ శిఖరం ఎక్కకు...

చెక్కకు చెక్కకు

సుందర దేవతాశిల్పాలను

భగవంతునిపై అపారమైన 

భక్తి శ్రద్ధ దీక్ష లేకుండ చెక్కకు... 


36. ఆశయాలు ఆరనిదీపాలు...

ఎక్కడైతే ప్రజలు నిర్భీతితో 

ప్రశాంతంగా నిద్రిస్తున్నారో...

ఎక్కడైతే సుపరిపాలన 

సవ్యంగా సాగుతుందో...

ఎక్కడైతే యుద్దభీతన్నదిలేదో...

ఎక్కడైతే అల్లర్లు అణచివేతలు

అరాచకాలు అక్రమాలు అకృత్యాలు

హింస ప్రతిహింసలు విషపుకోరలు చాసే

విద్వేషాల విషసర్పాల విధ్వంసాలుండవో... 


అక్కడ అంబేద్కర్

ఆశయాలు ఆరనిదీపాలే...

అక్కడ అంబేద్కర్ కార్చిన 

చెమట చుక్కలింకా ఆరనట్లే...

అవి అమరజీవి అంబేద్కర్ కన్న 

కమ్మని కలలకు ప్రతిరూపాలే...అవి

వారు నిదురపోనిరాత్రులకు నిదర్శనాలే...


తన రక్తాన్ని సిరగా మార్చి

తన ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి

తన కుటుంబాన్ని పూర్తిగా విస్మరించి

భారతీయులకు అపూర్వనిధిగా...

తరతరాలకు తరగని సంపదగా...

ప్రపంచమేధావులచే ప్రశంసింపబడిన

రక్షణకవచమైన రాజ్యాంగాన్ని...

మనకు అందించిన 

ఆ దళితనేత...

ఆ అపరమేధావి....

ఆ స్పూర్తి ప్రదాత....

ఆ రాజ్యాంగ నిర్మాత...

అమరజీవి అంబేద్కర్...

"స్మరణే" ప్రతిఒక్కరికి "ఒక ప్రేరణే".....


37. "సమాధిలో నుండి ఉత్తరం 

       వ్రాస్తున్న నాకు సమాధానమివ్వండి"

పెళ్లయిన ప్రతిఆడపిల్లకు

బద్దశతృవులు "నలుగురు"


"అదనపుకట్నం" తెమ్మని 

కొట్టి తిట్టి బయటికి నెట్టే "భర్త"


పెట్రోల్ పోసి తగలబెట్టమంటూ

అగ్గిపుల్లనందించే "ఆడపడుచు"


అంటించి అగ్గిపుల్ల అయ్యో అమ్మో 

అంటూ అల్లరి చేసే "ఆశబోతు అత్త" 


అంతటి దారుణాన్ని ఆత్మహత్యగా 

చిత్రించి...అందరినీ...నమ్మించి 

మౌనంగా రోదించే "మాయదారి మామ"


జరిగింది అర్థంకాక జుట్టు పీక్కుంటూ

పాదాలకు పారాణి ఆరక మునుపే 

కన్న కూతురు కట్నపిశాచుల

విషపుకోరలకు బలైపోయిందంటూ గుండెలు 

పగిలేలా రోదించే "అమాయకపు అమ్మానాన్నలు"


ఔను నిన్న అందరూ ఏకమై 

రాక్షసులై రాబంధులై 

నా పాలిట యమభటులై 

పక్కా ప్రణాళికతో 

నా ప్రాణాలు తీశారు నిర్దాక్షిణ్యంగా...


నిన్న కోటి ఆశలతో కొత్తకాపురానికి 

వెళ్ళిన నేను

నేడు స్మశానంలో "సమాధిలో 

నుండి ఉత్తరం

వ్రాస్తున్నా నాకు సమాధానమివ్వండి"..


కట్నం పేరుతో నన్ను కాల్చిచంపి 

ఇంతటి నేరంచేసిన

కట్నదాహం తీరని ఈ ఆశబోతు "అత్తామామలకు"

పచ్చని కాపురంలో ఆరని చిచ్చురేపే ఈ "ఆడపడులకు"

అంగడిలో సరుకులా అమ్ముడుబోయే ఈ "అబ్బాయిలకు"

ఏ శిక్ష విధించాలి?... ఎవరు విధించాలి ? ఇంకెవరు ?


దోషులను శిక్షిస్తామని నిర్దోషులను రక్షిస్తామని 

చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని 

నాడు భగవద్గీత మీద ప్రమాణం చేసిన 

ఆ ప్రభుత్వాలను...

ఆ న్యాయమూర్తులను... 

ఆ నేతలను అధికారులను అర్థిస్తున్నా...

"సమాధిలో నుండి ఉత్తరం వ్రాస్తున్నా...

నాకు సమాధానమివ్వమని"...తక్షణమే 

ఆడపిల్లలకు రక్షణ కల్పించమని...ప్రాణబిక్ష పెట్టమని...


38. విప్లవశంఖం పూరించాలి

భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం 

కాలరాచిన శ్రామిక కార్మిక కర్షక హక్కులకోసం 

ఉద్యోగులు ఉద్యమకారులు ప్రశ్నించాలి‌ ప్రతిఘటించాలి 


సమిష్టి కృషితో సమసమాజం కోసం 

రాక్షసుల పాలనను అంతమొందించేందుకు

రాజ్యాధికార సాధనకోసం విప్లవ శంఖాన్ని పూరించాలి


మనిషి మనిషి మధ్య మంటలు రేపే‌ మతోన్మాదానికి 

వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలి 

కులం పునాదులను కూల్చి వేయాలి 

భూస్వామ్య వ్యవస్థను భూస్థాపితం చేయాలి


ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడక

సంఘంలో సమానత్వం కోసం స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం

అల్లూరి...భగత్ సింగ్ ...నెల్సన్ మండేలాల స్పూర్తితో 

ఓపికున్నంత వరకు కాదు ఊపిరున్నంత వరకు పోరాడాలి


పూజకు ఆకులను మేసే అమాయకపు మేకలనే తప్ప

గర్జించే సింహాలను గాండ్రించే పులులను ఎవరూ బలివ్వరు


పోయిన హక్కులకోసం 

ప్రార్థనలుచేయక ప్రాధేయపడక

సమిష్టిగా సమరం సాగించాలి...

విజయాన్ని సాధించాలి

పోరాడితే పోయేదేముంది 

మీ బానిసత్వపు సంకెళ్ళు తప్ప

రక్తతర్పణచేస్తే పోయేదేముంది 

రాజ్యాధికారం రావడం తప్ప


39. చేతులు కాలాక ఆకులు పట్టుకోకండి

ముందు 

వారేమిచేస్తారు

ముసిముసి నవ్వులు 

నవ్వుతారు

ముచ్చట్లు పెడతారు

కల్లబొల్లి మాటలతో

కాకమ్మ కబుర్లు చెబుతారు 

కుళ్ళు జోకులు వేస్తారు


ఒళ్ళు మరిచి పోయేలా

పళ్ళికలించి పకపకమని

విరగబడి నవ్వేలా చేస్తారు

ఆపై ఇక అడక్కుండానే అన్నీ

ఇష్టపడి...ఇచ్చేలా చేస్తారు 


పాపం మీకు తెలియదు...

మిమ్మల్ని హిప్నటైజ్ చేశారని...

చిరునవ్వుతో చేతబడి చేశారని...

కీలు బొమ్మనుచేసి ఆడిస్తున్నారని...

మిమ్మల్ని ఏదో మత్తులో దించారని...

ఏదో మాయలో మైకంలో ముంచారని...


పాపం మీకు తెలియదు... 

తొండముదిరి ఊసరవెల్లి ఔతుందని...

గొంగళిపురుగు సీతాకోకచిలుక ఔతుందని...

మూడోవ్యక్తితోనే పెనుముప్పువాటిల్లుతుందని...

అతిచనువు అక్రమసంబంధానికి దారితీస్తుందని...

పచ్చని మీ కాపురంలో ఆరనిచిచ్చు రగులుతుందని...

పాపం మీకు తెలియదు...

కుండలోని కూడుతినాలని 

కుక్కలు కుట్రలు పన్నుతున్నాయని...


పాపం మీకు తెలియదు...

మీరెప్పుడో వారికి వశమైపోయారని...

ముఖంపై ఉమ్మేసినా తుడుచుకుంటున్నారని...

కళ్ళకు వారు కనపడకపోతే కలవరపడిపోతున్నారని...

ఫోన్లో మాట్లాడుకోవడం వీలుకోకపోతే చాటుమాటుగా... ఒకరినొకరుచూసుకొని మానసికానందం పొందుతున్నారని...


అందుకే మగతనిద్రనుండి...బయటకురండి..!

ముందుజాగ్రత్త...ముఖ్యమని తెలుసుకోండి..!

అతి చనువన్నది తాడుకాదు త్రాచుపామని..!

అది తప్పక కాటు వేస్తుందని గుర్తుంచుకోండి..!

చేతులు కాలాక మాత్రం...ఆకులు పట్టుకోండి..!


40. ఆ మత్తులో...మగతనద్రలో...

నేరం 

నాది కాదు 

ఆకలిదన్నట్లు

తప్పు నీది కాదు 

దొంగ నవ్వులు నవ్వే

మాయమాటలు చెప్పే

గుంటనక్కల్ని చేరదీసిన

నీ మంచితనానిది...


నేరం 

నాది కాదు 

ఆకలిదన్నట్లు

తప్పు నీది కాదు 

మూడోవ్యక్తితో ముప్పులేదని

ముఖం మీద ఉమ్మేసినా తప్పులేదని

సర్దుకుపోయే నీ అమాయకత్వానిది...


కొందరు 

నవ్వుతారు నటిస్తారు

నక్కజిత్తులమారి 

టక్కరిదొంగలు నీప్రక్కనే ఉంటారు 

కుళ్ళు జోకులు వేస్తారు

కల్లబోల్లి మాటలతో కాకమ్మ కబుర్లతో

మాయమాటలతో మత్తెక్కిస్తారు 

పీకలదాకా పిచ్చెక్కిస్తారు


ఏదో మైకంలో దించేస్తారు

ఏదో మత్తులో ముంచేస్తారు

చిరునవ్వుతో చేతబడి చేస్తారు 

తమనే కలలో సైతం కలవరించేలా 

అడక్కుండానే అన్ని 

ఇష్టపడి ఇచ్చేలా చేసుకుంటారు

అందుకే 

వారు ఏ "చెడుమాట" చెప్పినా 

అది వీరికి తియ్యగానే వినిపిస్తుంది....

ఆ మత్తులో...ఆ మైకంలో ఉన్నంతకాలం


వారు ఏ "చెడుపని" చేసినా 

అది వీరికి మంచిగానే కనిపిస్తుంది...

ఆ భ్రమలో...ఆ భ్రాంతిలో ఉన్నంతకాలం 


వారు "చెప్పినట్టే" వీరు ఆడతారు

ఆ ట్రాన్స్ లో...ఆ కోమాలో ఉన్నంతకాలం

కారణం వారు వీరి కళ్ళకు కట్టినగంతలే వారి చేతిలో వీరు కీలుబొమ్మలే 

గాలికి ఊగే కొమ్మలే

ఎందుకో ఏమో ఏమి అర్థం కావడంలేదు 

వీరికి ఏదోగాలి సోకింది 

ఏదో భూతమావరించింది

వీరు నిన్న ఉన్నట్టుగా నేడు లేరు 

చాలా వింతగా 

విచిత్రంగా ఎంతో ఆశ్చర్యంగా వుంది 

వీరి ప్రవర్తన 


41. ఓ మనిషీ ! 


నీ కడుపులో 

కుళ్ళు కుతంత్రాలు 

కుట్రలు పన్నుతుంటే

మాయలు 

మంత్రాలు చదువుతుంటే


నీ గుండెల్లో 

అసూయద్వేషాల

అగ్నిపర్వతాలు బ్రద్దలౌతుంటే

లావాను వెదజల్లుతువుంటే


నీ కళ్ళల్లో 

కసి పగ ప్రతీకార జ్వాలలు

కోడేనాగులై బుసలు కొడుతూవుంటే

విషాన్ని విరజిమ్ముతువుంటే


నీ మనసులో 

అరిషడ్వర్గాలు 

సముద్రంలో అలలై  

పొంగుతుంటే ఉప్పొంగుతుంటే

ఉప్పెనలా ఎగిసి ఎగిసి పడుతుంటే 


ఎక్కడిది ?ఎక్కడిది ? ఇంకెక్కడిది ?

నీ కళ్ళల్లో కాంతి ? కరగని కారుచీకటి తప్ప 


ఎక్కడిది ?ఎక్కడిది ? ఇంకెక్కడిది ? 

నీ జీవితాన శాంతి ? తరగని ఆవేదన తప్ప


42. ఓ వృద్ధదంపతులారా ! జాగ్రత్త !!

రక్తసంబంధీకులెందరున్నా

బంధుమిత్రాదులెందరున్నా

మిగిలేది చివరికి ఇద్దరే భార్యా భర్తలే

మీరే ఒకరికొకరు తోడూనీడ...కడదాకా 

కన్ను మూసేదాక...కా...టి..కి చేరే దాకా 


ఔనాచివరి చీకటిదినాల్లో

వెలుగులు విరజిమ్మాలంటే

ప్రశాంతంగా జీవించాలంటే నేడు 

మీరు ముద్దూముచ్చట్లో మునిగితేలాలి 

అవి రేపటి తీపిజ్ఞాపకాలై మిగిలిపోవాలి


ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకోవాలి

ఎత్తుకోవాలి మెత్తగా ఎదకు హత్తుకోవాలి 

కౌగిలిలో బంధీలై కరిగిపోవాలి ఋతువేదైనా

పెల్లుబికే మీ ప్రేమాభిమానాలు ప్రతినిత్యం 

పచ్చని పూలమొక్కల్లా చిగురిస్తూ ఉండాలి


పడకగదినే పూజాగదిగా మార్చుకోవాలి

భర్త భార్యను...ఒకదేవతగా ఆరాధించాలి

భార్య భర్తను ప్రత్యక్ష దైవంగా పూజించాలి 

ఇంటిని...వినోద భరిత....వివాద రహిత 

విశ్రాంతి మందిరంగా....తీర్చిదిద్దుకోవాలి


కొందరికి వృద్ధాప్యం....ఒక ఉరి ఒక ఊబి

కొందరికి...పాపం ఒంటరితనం ఒక శాపం

కొడుకైనా కోడలైనా ప్రేమగా పలకరించరు 

మంచాన పడితే మందులిచ్చేవారు కరువే 

ఇద్దరిలో ఒక్కరున్నా కుటుంబానికి బరువే


ఆర్జించిన ఆస్తిపై పిల్లలకు మక్కువ ఎక్కువే 

అమ్మానాన్నల మీద కురిపించేది ప్రేమ కాదు 

అది నాలుగురోజుల నాటకం 

అంతా బూటకం 

ఆస్తుల కోసం ఆరాటం 

అనుబంధాల పోరాటం 


కాటికెన్నడో పయణమన్న తలంపే తప్ప 

తమకోసం జీవితాలను త్యాగం చేశారని

హారతి కర్పూరంలా ఆవిరైపోయారని

తమ రక్తాన్ని స్వేదంలా చిందించారని

కొవ్వొత్తిల్లా కరిగిపోయారని తలంచరు


వృద్ధాప్యంలో ఇన్ని గంజినీళ్ళు పోయరు 

కంచంలో ఇన్ని మెతుకులు వేయరు...కానీ


కన్నుమూయగానే పూలరథంలో ఊరేగింపు

ఖరీదైన గ్రానైట్ రాళ్ళతో ఘనంగా సమాధి

ప్లాస్టిక్ పూలమాలతో 

గోడకువ్రేలాడే ఓ ఫోటో

ఏడాదికోసారి ఊరందరికీ 

ఉచిత అన్నదానం 

ఏమిటీ లాభం ? ఎన్ని జన్మలెత్తినా 

ఎంత సేవ చేసినా 

తీరదుగా జన్మనిచ్చిన 

అమ్మానాన్నల ఋణానుబంధం 


43. ఎక్కడ మీ పెద్దరికం ?

నిన్న మీరే కదా

ఎందరికో ఎన్నో

శ్రీరంగ నీతులు చెప్పింది..!


నిన్న మీరే కదా

ఎందరికో ఎన్నో

తిరుగులేని తీర్పులనిచ్చింది..!


నిన్న మీరే కదా

ఎన్నో జటిలమైన సమస్యలకు

చక్కని పరిష్కార మార్గాలను‌ చూపింది..!


నిన్న మీరే కదా

ఎన్నో విరిగిన మనసులకు ఊరట 

నలిగిన హృదయాలకు నమ్మకం కలిగించింది..!


నిన్న మీరే కదా

ఎన్నో చిక్కుముడులను విప్పి

నిలువునా కూలిపోయే కాపురాలను నిలబెట్టింది..!


నిన్న మీరే కదా

ఒకరిపై ఒకరు విషాన్ని చిమ్ముకుంటూ

కసితో పగతో కంటిచూపుతో కత్తులు దూసుకుంటూ

విడాకులకని వెళ్ళినవారిని తిరిగి ఒకటిగా జతచేసింది.!


మరి నేడెందుకు పెద్దలైన మీరే

అసహనంలో కూరుకుపోయారు ?

అపార్థాల అగ్నిలో దగ్ధమైపోతున్నారు?

ఎవరో వస్తారని ఏదోచేస్తారని ఎదురు చూస్తున్నారు ?


ఏమిటీ పేదరికం...ఏమైపోయింది మీ పెద్దరికం ?

ఎదుటి వారికి చెప్పేటందుకేనా శ్రీరంగనీతులు?

మీకు మీరే ఎందుకు తవ్వుకుంటున్నారు లోతైన గోతులు ?

మీ గొడవ చూసి నవ్వుకుంటున్నాయి కొండమీది కోతులు..!


44. నాకు దాహం వేస్తుంది...!

అది దావాలనంలా

నన్ను దహించి వేస్తుంది


ఆనాడు నేను

అమ్మగర్భాన్ని చీల్చిననాడు

అమ్మ ఒడిలో వొరిగిననాడు

ఉగ్గుపాల కోసం ఊయల్లో పడి

ఊగుతుంటే అమ్మపాలు పట్టింది

కమ్మగా అమ్మపాలు త్రాగాను కానీ


నేను అమ్మపాలకోసం ఆశపడితే

నాకు చిక్కని ఆవుపాలు దొరికాయి


నేను ఆవుపాలకోసం ఆశపడితే

నాకు వేడివేడి తాజ్ మహల్ టీ దొరికింది


నేను వేడివేడి తాజ్ మహల్ టీ కోసం

పరుగులు పెడితే నాకు

తియ్యని యాపిల్ జ్యూస్ దొరికింది


నేను తాజా యాపిల్ జ్యూస్ కి ఆశపడితే

నాకు బ్రాండెడ్ విస్కీ బాటిల్స్ దొరికాయి


అలా ఖరీదైన ఫారిన్ మందుకు బానిసనై

బార్ లో మందు కొట్టి కొట్టి బోర్ కొట్టి కొట్టి

అడవిలో ఆకలిగొన్న చిరుతపులిలా

మనుషుల రక్తపుచుక్కల రుచిమరిగాను


ఆ ఎర్రని బ్రాందిని త్రాగిన నాకు

అమృతపుచుక్కల మీద ఆశ కలిగింది


ఆ అమృతపుధారల కోసం

సప్తసముద్రాలను దాటాను

కొండల్లోకోనల్లో ఎండల్లోవానల్లో

తిరిగాను ఎడారుల్లో వెతికాను

ఎక్కడా దొరకలేదు కానీ

ఒక ఆచూకి మాత్రం దొరికింది

అదే అమ్మే ఒక దేవతని...

అమ్మ ప్రేమే అమృతమని...


45. నేరం ఒకరిది..! శిక్ష మరొకరికి..!

అయ్యో..!

ఓ దైవమా..!

ఏమిటీ ఘోరము? 

ఏమిటీ దారుణం ?

పచ్చని నా కాపురంలో 

ఆరని చిచ్చురగిలిందే..!

నా కళ్ళ ముందే 

నా ఇళ్ళు తగలబడిపోతుందే..!


నేను ఏ తప్పు చేయలేదే..! 

ఎవరో అపరిచితులొచ్చి 

మా కాపురంలో నిప్పులు పోశారే..!

నిజానికి నేను నీతిమంతురాలిని

మరేల నామీద ఈ నీలాపనిందలు ?


ఔను నేరం నాది 

కాదు ఆకలిదన్నట్లు...

తప్పు నీది కాదు తల్లీ..!


నిన్ను నిట్టనిలువునా 

ముంచే నయవంచకులను...

నీతులను చెప్పే కోతులను...

మాయమాటలతో

మత్తెక్కించే మోసగాళ్ళను...

కాకమ్మ కబుర్లతో 

కాటు వేసే కేటుగాళ్లను...

చెంతకు చేరదీసిన నీ మంచితనానిది..!


ఔను నేరం నాది 

కాదు ఆకలిదన్నట్లు...

తప్పు నీది కాదు తల్లీ..!


నిప్పును పట్టుకుంటే కాలదని... 

తెల్లవన్నీ పాలని నల్లవన్నీ నీళ్ళని...

తొండ ముదిరినా ఊసరవెల్లికాదని... 

మూడో వ్యక్తితో ముప్పులేదని...

ముఖాన ఉమ్మివేసినా తప్పులేదని...

అతిచనువన్నది అక్రమసంబంధానికి... 

దారితియ్యదని నమ్మిన నీ అమాయకత్వానిది..!


అందుకే ఓ తల్లీ ఇప్పటికైనా ఓ నిండునిజం తెలుసుకో...

నీచుట్టూ గజ్జికుక్కలు గుంటనక్కలుంటాయని తెలుసుకో..


46. పోరాటమే నీ సిద్దాంతమైతే ?

ఓ మనిషీ !

ఎంత దూరమైనా

ఎంత భారమైనా

విధిని ఎదిరించడం

విజయాన్ని సాధించడమే

నీ జీవిత లక్ష్యమైతే...!


ఓపిక ఉన్నంతవరకు 

కాదు కాదు 

ఊపిరి ఉన్నంతవరకు

పోరాడడమే నీ సిద్దాంతమైతే...!


వెన్నుతట్టుకోవడమే తప్ప

వెరవక వెన్నుచూపక

రవికిరణంలా

రామబాణంలా ముందుకు 

దూసుకుపోవడమే నీ నైజమైతే...!


ఓటమిని తలంచక

ఓటమికి తలదించక

ముందుకు దూకడమే

సహనం సాహసమే నీ ఊపిరియైతే..!


ఓ మనిషీ !

ఆపకు ఆపకు 

నీ పరుగును !!

నీ ఆశలు తీరేదాక...

నీ కలలు పండేదాక...

నీ కోరికలు నెరవేరేదాక...


నీ గమ్యం చేరే దాకా...

నీ లక్ష్యం నెరవేరేదాక...

నీ నావ తీరం చేరేదాక...


నీలోని అగ్నిజ్వాల ఆరేదాక...

నీవు విశ్వవిజేతవయ్యేదాక...

విజయలక్ష్మి నిన్ను వరించేదాక....


నీ కీర్తిపతాకం ఆకాశపు

అంచుల్లో రెపరెపలాడే దాక...

ఆ దైవమే దిగివచ్చి

నీకు కోటివరాలను  ప్రసాదించేదాక...

ఓ మనిషీ ! ఆపకు ఆపకు ! నీ పరుగును !


47. ఈ సమాజం‌ మారేదెప్పుడు ?

నేటి సమాజాన ఎటు చూసినా...

కులాల పేరిట ‌కుమ్ములాటలు

మతాల పేరిట మారణహోమాలు

"అడుగడుగునా జాలిలేని అవినీతి జలగలే"


నేటి సమాజాన ఎటు చూసినా...

విచ్చలవిడిగా పోర్న్ వీడియోలు వీక్షిస్తూ 

బానిసలై సోషియల్ మీడియా‌కు బంగారు

భవిష్యత్తును"బలితీసుకుంటున్న యువతే"


నేటి సమాజాన ఎటు చూసినా...

వావివరుసలు మరిచిపోయి 

చిన్నారుల జీవితాలను చిదిమేసి

చట్టాలను ‌చుట్టాలుగా మార్చుకొని

స్వేచ్ఛగా తిరుగే మానవ మృగాలే  

"కళ్ళు పొరలు కమ్మిన‌ కామాంధులే"


నేటి సమాజాన ఎటు చూసినా... 

అమాయకపు ఓటర్లకు వలవేసి

అరచేతిలో స్వర్గాన్ని చూపించి

పట్టపగలే దోచుకునే ‌స్విస్ బ్యాంకుల్లో

దాచుకునే భారీకుంభకోణాల్లో 

కూరుకుపోయే"రాక్షస రాజకీయ రాబందులే"


నేటి సమాజాన ఎటు చూసినా... 

ఆరుగాలాలు శ్రమించి పండించిన

పంటలకు గిట్టుబాటు ధరలు లేక 

గిలగిలా కొట్టుకునే ఆదుకునే దిక్కులేక

"ఆత్మహత్యలకు‌ సిద్దమౌతున్న అన్నదాతలే"


మరి కుళ్ళిన ఈ సమాజం‌ మారేదెన్నడు ? 

ప్రజలు కళ్ళుతెరిచి‌ కుళ్ళును‌ కడిగిననాడు

సమానత్వపు పరిమళాలు ‌వెదజల్లిననాడు

ఓటే ఆయుధంగా నేతల తలరాతలు మార్చిననాడు

ప్రజారాజ్యం ఏర్పడిననాడు సుపరిపాలన సాగిననాడు


48. మూడో వ్యక్తితోనే ముప్పు...???

ఇస్తేనే తీసుకుంటారు చనువు

.....ఇవ్వొద్దు...ఇవ్వొద్దు...ఇవ్వొద్దు

కుళ్ళు జోకులు వేస్తే పడీపడీ 

.....నవ్వొద్దు...నవ్వొద్దు...నవ్వొద్దు 


కల్లబొల్లి మాటల్ని కాకమ్మ కబుర్లను

.....వినొద్దు‌...వినొద్దు...వినొద్దు

కబుర్లు చెప్పిచెప్పి కాటువేస్తారు ఎవ్వరినీ 

.....నమ్మొద్దు...నమ్మొద్దు...నమ్మొద్దు 


ముఖాముఖిచర్చలు మనస్పర్థలకు

.....మందులే...మందులే...మందులే

ఆ లౌకికం ఎరుగని ఆలూమగలు

.....అంధులే...అంధులే...అంధులే


నచ్చిన వారి చుట్టూ పిచ్చికుక్కల్లా

.....తిరగొద్దు...తిరగొద్దు...తిరగొద్దు

వారి మాయలోపడి మత్తులోమునిగి 

.....తేలొద్దు...తేలొద్దు...తేలొద్దు 


మూడో వ్యక్తితో ముప్పు వాటిల్లుతుంది 

.....జాగ్రత్త...జాగ్రత్త...జాగ్రత్త

పచ్చని కాపురంలో చిచ్చు రగులుతుంది 

.....జాగ్రత్త...జాగ్రత్త...జాగ్రత్త


దైవసమానులైన భర్తలను మానసికంగా 

.....బాధపెట్టొద్దు...బాధపెట్టొద్దు...

బాధపెట్టొద్దు 

ఇతరులపై హద్దుమీరి అభిమానాన్ని  

.....కురిపించొద్దు...కురిపించొద్దు...

కురిపించొద్దు


తొండ ముదిరితే ఊసరవెల్లిఔతుంది

.....ఖచ్చితంగా...ఖచ్చితంగా...

ఖచ్చితంగా అతిచనువు ముదిరితే అక్రమసంబంధమౌతుంది

.....నిస్సందేహంగా...నిస్సందేహంగా...

నిస్సందేహంగా


49. మదర్ థెరిస్సా చిత్ర కవిత...!!!

ఏముంది ఏముంది ఆ చిత్రంలో?

కనురెప్పలు మూయని కనువిందుచేసే 

"ఒక సజీవ" దృశ్యముంది...


ఏముంది ఏముంది ఆ చిత్రంలో ?

అది కోటానుకోట్ల ఇసుకరేణువులకు 

జీవంపోసే ఒక చిత్రాకారుని 

"హస్తనైపుణ్యానికి" ప్రత్యక్ష సాక్ష్యం...


ఏముంది ఏముంది ఆ చిత్రంలో ?

ఈ ప్రపంచానికి గాడ్ ఈజ్ లవ్...

"ప్రేమే ఒక దైవమన్న" ప్రేమసందేశముంది... 


ఆమె ఒక పేదప్రజల 

ఆపద్భాంధవురాలు...

ఆమె ఒక శాంతి శిఖరం...

ఆమె ఒక కాంతి కిరణం... 

ఆమె ఒక ప్రేమ పావురం...

ఆమె కులమతాలకతీతంగా

అనాథల అభాగ్యుల

ఆకలిని తీర్చే ఒక అపురూపమైన అమ్మ 

కుష్టురోగుల్ని సైతం అక్కున చేర్చుకుని

అంతులేని ఆప్యాయతను...

అనురాగాన్ని కురిపించే 

జాలిగుండెల జగజ్జనని ప్రాణదేవత 


ఆమె చల్లని ఒడిలో 

ముద్దొచ్చే ఒక పసిపాప...

ముఖంమీద ముడుతలు... 

చేతినరాలు సైతం సుస్పష్టం... 

తెల్లని ఖద్దరు నూలుచీర...

చేతి వేళ్ళు...గోళ్ళు... 

ఆర్ద్రత నిండిన...ఆ కళ్ళు...

అంత అందమైన అతిసుందరమైన

ఆ సైకత శిల్పాన్ని 

ఆ చిత్రాకారుడు తీర్చిదిద్దిన 

తీరు నభూతో నభవిష్యతే...


ఆమె ఒక ధృవతార... 

ఆమె ఒక దైవదూత... 

ఆమె ఒక ప్రేమామయి...

ఆమె ఒక దయామయి...

ఆమె‌ ఒక కరుణామయి...

ఆమె ఒక అమృతమయి... 

ఆమే మానవత్వం పరిమళించే

తనువంతా దైవత్వం ఉట్టిపడే 

మదర్ థెరిస్సా ఆ

చిత్రాకారుని సృజనాత్మకతకు 

శతకోటి ప్రణామాలు 


50. నేనొక త్రినేత్రుడను...

నేనొక "త్రినేత్రుడను"... 

నా ఆయుధం...త్రిశూలం  

గురిచూసి నేవిసిరానంటే...

గుండెల్లో గ్రుచ్చుకొని 

కనిపించని కాలం సైతం 

కన్నీరు పెడుతుంది...


నేనొక "ఇంద్రజాలికుడను"...

ఓం హ్రీం ఛూ...అన్నానంటే...

మట్టినుండి భగభగమని...

మంటలు పుట్టి

భూమండలమంతా బుగ్గౌతుంది...


నేనొక "మన్మధుడను"...

నేను ప్రేమబాణాలు 

సంధించానంటే...

మత్తులై...

ఉన్మత్తులై...

చపలచిత్తులై...

భగ్నప్రేమికులంతా

నగ్నంగా నాట్యం చేస్తారు...

డ్జ్డడడ

నేనొక "మాయల మరాఠీని"...

నా మంత్రదండాన్ని చేపట్టి

పూలపొదరిల్లను పుట్టిస్తా...

చిమ్మ చీకట్లను చీల్చివేస్తా...

రంగుల హరివిల్లును రప్పిస్తా...

చిరునవ్వుల చిరుజల్లులు కురిపిస్తా...


నేనొక "కవిసార్వభౌముడను"..

కలం నా కరవాలం....

కవిత్వం నా త్రినేత్రం...

సంఘసంస్కర్తలకు 

సలాం కొడతా...

సంఘ విద్రోహశక్తులకు 

సమాధి కడతా...

సరస్వతీ పుత్రుడిగా‌ 

నేను మళ్ళీమళ్ళీ పుడతా...


51. నేను ‌త్రినేత్రుడను...నేను కవిని..!

నేను నీ ఆత్మను‌ నీ అంతరంగం తెలిసినవాన్ని

నేను నీ నీడను నీ బాహ్య సౌందర్యం ఎరిగినవాన్ని

నేను కవిని కవితలో నీ కన్నీటి పన్నీటి గాథలు వినిపిస్తా


నేను మనస్తత్వ శాస్త్రం చదివిన ఓ మానసికనిపుణ్ని

పుస్తకాన్ని చదివినట్టు నీ మనస్తత్వాన్ని చదవగలను

అనుమానపడే వాడికి ఆధారాలు ఉండవు ఊహాలుతప్ప

మానసిక శాస్త్రవేత్తలకు ఉంటాయి సాక్ష్యాలు ఖచ్చితంగా


ఒక చిత్రాకారుడు ముందే ఊహించి 

ఒక రంగుల దృశ్యాన్ని గీచినట్టుగా...

ఒక దర్శకుడు ముందే ఊహించి 

ఒక సూపర్ హిట్ సినిమా తీసినట్టుగా...

ఒక శిల్పి ముందే ఊహించి 

ఒక సుందర శిల్పాన్ని చెక్కినట్టుగా...

ఒక అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ ఆకాశంలో

అందమైన ఆ చందమామను 

అద్దంలో చూపినట్టుగా...


నీ ప్రతి ‌పని వెనుక...

నీ ప్రతి‌ నవ్వు వెనక...

నీ ప్రతి నడక వెనుక...

నీ ప్రతి మాట వెనుక...

నీ ప్రతి చూపు వెనుక...

నీ ప్రతి నిర్ణయం వెనుక...


ఏ దురాలోచన దాగుందో

గతంలో ఏ ఘోరం జరిగిందో 

భవిష్యత్తులో ఏం జరగబోతుందో 

ముందే ఊహించి ఖచ్చితంగా

చెప్పగలను ఋజువులతో సహా...


కారణం నేను నిన్ను

నీ చుట్టూ పరిసరాలను...

నీవున్న ఈ సమాజాన్ని.... 

నీవు నిర్మించుకున్న నీ ప్రపంచాన్ని...

నీవు సృష్టించుకున్న ఈ బంగారు లోకాన్ని...

నా "కలంకంటితో" 

చూస్తున్న త్రినేత్రుడను...నేను కవిని !


52. బృహత్ గ్రంధపఠనం...

"మేధస్సుకు మేత" ఔతుంది 

"కళ్ళల్లో కరుణను" మనసులో 

"ప్రేమామృతాన్ని" నింపుతుంది 


మనిషికి "క్షమాగుణాన్ని"నేర్పుతుంది 

గాయపడిన మనసులకు "సూపర్ టానిక్"


"హృదయం" ఎల్లప్పుడూ ఉత్సాహంగా 

ఉల్లాసంగా "జింకపిల్లలా" గంతులు వేస్తుంది 


"గొప్పసత్యాలెన్నో" బోధపడతాయి 

"నవజీవన సూత్రాలెన్నో" 

నేర్చుకున్నామన్న 

"మెరుగైన జీవనమార్గం" తెలుసుకున్నామన్న 

గర్వం మాటల్లో చూపుల్లో తొణికిసలాడుతుంది 


సాటి మనిషిని మనిషిలా 

చూడాలన్న "తపన" 

ఆపదలో ఆదుకోవాలన్న"

తాపత్రయం" పెరుగుతుంది 


ఎన్ని సమస్యలనైనా

పరిష్కరించుకోగలమన్న...

ఎట్టి దుష్ట క్లిష్టపరిస్థితులనైనా 

సమర్థవంతంగాఎదర్కోగలమన్న...

గండాలనుండి సుడిగుండాలునుండి గట్టెక్కగలమన్న... 

"మొండిధైర్యం" గుండెల్లో మెండుగా నిండుగా ఉంటుంది 


ఎంత ఆర్జించాము ఎంతకాలం జీవించామన్నది కాక 

ఉన్నంతకాలం "ఉత్తములుగా" 

మచ్చలేని వ్యక్తిత్వంతో

ప్రశాంతంగా...ఉన్నతంగా...

అందరికి ఆదర్శంగా... 

జీవించాలన్న "దృఢ సంకల్పం" ఏర్పడుతుంది 


మంచితనంతో...

మానవత్వంతో బ్రతకాలనిపిస్తుంది 

నిరుపేదలకు...అనాధలకు...అభాగ్యులకు 

జీవితాలను "అంకితం" చేయాలనిపిస్తుంది 


అనునిత్యం ఆ భగవంతుని సన్నిధిలో 

ఆ పరమాత్మ దివ్య నామస్మరణతో

నిత్యం  జీవించాలనిపిస్తుంది...

జీవించి జపించాలనిపిస్తుంది...

జపించి తపించాలనిపిస్తుంది...

తపించి తరించాలనిపిస్తుంది...ఔను 


బృహత్ గ్రంధపఠనంతో...

మనసంతా నిర్మలత్వం

మనిషిలో పరిమళించు 

మంచితనం మానవత్వం 


53. విజయం ఎవరికీ బంధువు కాదు 


వినే వాళ్ళకే 

ఎక్కువ వినిపించాలి...


తినే వాళ్ళతోనే 

ఎక్కువ తినిపించాలి... 


దయాగుణం ఉన్న

వాళ్ళనే దానం అడగాలి... 


పనిని శ్రద్ధతో చేసే వారితోనే 

ఎక్కువ పని చేయించుకోవాలి...


పండిన చెట్టు నుండే 

ఎక్కువ పండ్లను ఆశించాలి ...


మృత్యువుకు

ఎప్పుడు భయపడరాదు

ఓటమినెప్పుడు ఒప్పుకోరాదు...


విజయం ఎవరికీ బంధువు కాదు... 

మూర్ఖులకెప్పటికీ ముక్తి లభించదు...


54. ఓ నవయువతీ !

       ఆ "ఒక్కతప్పు" చేయకు !!

తెలియక 

తప్పులు చేసినవాడు 

అమాయకుడు...అజ్ఞాని

తెలిసి తప్పుచేసినవాడు 

అంధుడు...అహంకారి

చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేవాడు 

మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేసేవాడు 

నేరస్తుడు...నయవంచకుడు 

తప్పులెన్ని చేసినా...క్షమాబిక్ష పెట్టేవాడు 

దయాసముద్రుడు...దైవాంశ సంభూతుడు 


ఔను కళ్యాణం కోసం

కలలుకనే ఓ నవయువతీ !

చేయకు రహస్యంగా దాయకు 

"నిన్న చేసిన ఆ చిన్న తప్పు"

అది నిన్ను...నీ ఆత్మను

నీ బంగారు భవిష్యత్తుని...

నీ పచ్చని కాపురాన్ని... 

నందనవనం లాంటి 

నీ సుందర సుఖమయ జీవితాన్ని

కాల్చి బూడిద చేసే "నివురుగప్పిన నిప్పు"


అందరూ 

ఎప్పుడో ఒకప్పుడు 

ఎవరి ఆకర్షణ వల్లనో...

ఏ బలహీనత వల్లనో....

ఏ విధి వశాత్తు వల్లనో...

ఎవరి బలవంతం వల్లనో....

ఏదో ఒక క్షణికావేశంలోనో...

ఏ దుష్టగ్రహ ప్రభావం వల్లనో...

ఏ అమాయకత్వం అజ్ఞానం వల్లనో...

తెలిసో తెలియక ఒక తప్పుచేస్తారు కానీ...


నిన్న చేసిన ఆ తప్పుకు ముసుగు కప్పితే

నిత్యం మనస్సాక్షి ఆ తప్పును 

గుర్తుచేస్తూనే ఉంటుంది 

ఓ ముళ్ళులా...

ఓ గునపంలా...

గుండెల్లో గుచ్చుతూనె ఉంటుంది...

రావణకాష్టంలా అది రగులుతూనే ఉంటుంది... 

ఆ బాధ...ఆ వ్యధ...ఆ వేదన...ఆవేదన...ఆ క్షోభ

మనసున్నవారికే...

మనిషన్నవాడికే తెలుస్తుంది... 

తప్పును దాచిపెట్టిన వారిని 

అది తేలై కుడుతుంది...


అప్పుడు వారి జీవితం...

చిల్లిపడ్డ ఓ మట్టికుండే

అప్పుడు వారి బ్రతుకు...

ఆరని ఓ అగ్నిగుండమే


అందుకే అర్థం చేసుకొని సర్దుకుపోగల

సద్గుణం సహృదయం గల భర్తలుంటే

వివాహానికి ముందే మనసు విప్పిచెప్పాలి

మగని మనసు నొప్పించక....

లేకున్న మొగున్ని మోసం చేసిన 

ఓ టక్కరిభార్యగా...

భార్యను మోసం చేసిన 

ఒక శాడిస్టుభర్తగా...

చెరగని ఓ మాయనిమచ్చే 

మిగులిపోతుంది 


నిజానికి కొన్ని తప్పులు ‍‌

కాకతాళీయం

కొన్ని మనమే తెలిసి చేస్తాం 

రహస్యంగా దాస్తాం

చేసిన తప్పును ముందే చెప్పుకుంటే...

జరిగిన నేరాన్ని ముందే ఒప్పుకుంటే...

క్షమాపణ కోరుకుంటే... క్షమాభిక్ష దొరకొచ్చు

లేకుంటే ముందుజీవితం ముళ్ళ బాటే...


నిత్యం అనర్థాలే...అపార్థాలే...

అవమానాలే....అనుమానాలే...

ఆందోళనలే...అనవసర రాద్దాంతాలే...

ఏ పాపమో ఏ శాపమో ఇల్లు ఒక నరకకూపమే...

అందుకే ఓ నవయువతీ !

చేయకు రహస్యంగా దాయకు 

" నిన్నచేసిన ఆ చిన్నతప్పు"...

అది ఎప్పటికైనా "నివురుగప్పిన నిప్పు"....


55. ఇదేమి కాపురం "కల్తీ కాపురం" !!! 

ఎదిరించే 

భార్య ప్రక్కలో

ఏ భర్తా ప్రశాంతంగా 

నిదురించలేడు అతడు 

"అర్థనారీశ్వరుడైతే తప్ప"


బెదిరించే 

భర్త‌ ప్రక్కలో

ఏ భార్యా నిశ్చింతగా 

నిదురించలేదు ఆమె 

"అపర కాళికామాతైతే తప్ప"


పెళ్ళికి ముందు 

వారిద్దరు "ప్రేమపక్షులు"

పెళ్ళి తర్వాత 

చిరునవ్వుల"చిలకా గోరింకలు"


నేడు 

"ప్రేమలు"

తరిగిపోయి...

కన్న కమ్మని

"కలలు" కరిగిపోయి...

అనుమానాలు

"అపార్థాలు" పెరిగిపోయి...

ఆ ఇద్దరు బద్ధశత్రువులై

"పిల్లీ ఎలుకలై...పాము కప్పలై"

నిత్యం కాపురం ఒక "నిప్పులకుంపటై...


ఇద్దరికీ "మనశ్శాంతి" కరువై

మానసికంగా ఒకరికొకరు దూరమై

నిన్నటి ఆ బిగికౌగిలి నేడు"విషకౌగిలియై"

నిన్నటి "పండువెన్నెలలు కురిసిన 

ఆ పడకగది" 

నేడు పగాప్రతీకారాలు తీర్చుకునే "రచ్చబండయై"

రాత్రింబవళ్లు  ....

రాస క్రీడ‌యై

రాక్షస యుద్ధమై...

రంపపు కోతయై....

బ్రతుకు రావణకాష్టమై రగిలి పోతోంది...


ఉండే ఇళ్ళు ఒక్కటైనా...

పడుకుండే పాన్పు ఒక్కటైనా...

మాటలు లేక మౌనంగా

కసితో కక్షతో పగతో రగిలిపోతూ...

ఒకరిపై ఒకరు విషం గ్రక్కుకుంటూ... 

కనిపిస్తే కత్తులు విసురుకుంటూ...

కుత్తుకలు తెంచుకుంటూ...

ఒకరి వినాశనాన్ని మరొకరు

ఒకరి మరణాన్ని 

మరొకరు కోరుకుంటూ...

కడుపులో కత్తులుంచుకొని కౌగలించుకొంటూ...

కాలం గడుపుతున్నారు 

"కల్తీ కాపురం" చేస్తున్నారు


మరి వీరు మారేదెప్పుడు...?

నాటి ఆ కమనీయమైన"ఆ కళ్యాణ వేదికను"...

నాడు "దీర్ఘాయుష్మాన్ భవ" అంటూ 

"ఈ కొత్త జంట మా కనుల పంట" 

అంటూ "చిరకాలం చిలకాగోరింకల్లా" జీవించమంటూ

అక్షింతలు జల్లి ఆశీర్వదించిన"

ఆ అతిథిదేవుళ్ళను"

కన్న "అమ్మానాన్నలను" 

కొన్న "అత్తామామలను"...


నాడు శోభనం గదిలో గడిపిన 

ఆ సరస సంగీత శృంగార "

రసభరిత‌ రాత్రులను"...

విహారయాత్రలకెళ్ళి పిండారబోసినట్టి 

పండువెన్నెలలో ఏకాంతంగా మత్తులై 

ఉన్మత్తులైన గడిపిన 

ఆ తియ్యనితేనియల 

మరణంవరకు చెరగని "

ఆ మధురమైన రాత్రులను"...

"ఆ తీపిజ్ఞాపకాలను" 

నెమరు వేసుకుంటూ...


సహనంతో...సర్దుబాటుగుణంతో...

సంయమనంతో...సమయస్పూర్తితో...

సలసలకాగే సమస్యల్ని 

చల్లార్చుకుంటే చాలు

ఇక ఆ ఇద్దరిలో...

"కొత్త ఆశలు" చిగురిస్తాయ్ !

ఆ కల్తీకాపురంలో...

"కారుచీకట్లు" తొలిగిపోతాయ్ !

"ప్రేమలు" పరిమళిస్తాయ్...

"పండువెన్నెలలు" కురుస్తాయ్ !

నిన్న 

"సునామీలు పుట్టిన...

"సుడిగాలులు రేగిన"... 

ఆ సున్నితహృదయాల్లో నేడు

"సుఖశాంతులు" వెల్లివిరుస్తాయ్ !


56. పిచ్చిఆలోచనలతో రెచ్చిపోకు... 

పిచ్చి పిచ్చి ఆలోచనలతో 

"రెచ్చిపోకు...చచ్చి పోతావ్"

పిచ్చి పిచ్చి ఆలోచనలు

వచ్చి వచ్చి నిన్ను "పిరికివాన్ని" చేస్తాయి 


వద్దు వద్దు నిద్దురమాని 

అర్థరాత్రి వరకు పిచ్చి ఆలోచనలొద్దు

పిచ్చి ఆలోచనలే..."పిశాచుల పిల్లలు"

కడకవి నీ పీకనే పిసికి నీ ప్రాణం తీస్తాయి


కొన్ని...పిచ్చి ఆలోచనలు 

పుట్టలో "బుసలు కొట్టే త్రాచులు"

ఆ త్రాచులతో ఆడుకోకు

అవి చాటుమాటుగా

కస్సుబుస్సుమంటాయి నిన్ను కాటేస్తాయి


కొన్ని...పిచ్చి ఆలోచనలు 

మెడమీద "వ్రేలాడే గండ్రగొడ్డళ్ళు"

ఆ గొడ్డళ్ళను గంటలతరబడి నూరకు

అవి ఎన్నో ఏళ్ల బంధాలను 

అనుబంధాలను మొదలంటూ నరికేస్తాయి


కొన్ని...పిచ్చి ఆలోచనలు  

వీధిలో "మొరిగే పిచ్చికుక్కలు" 

వాటిని రెచ్చగొట్టకు మీదపడి 

రక్కుతాయి నీ రక్తాన్ని రుచిచూస్తాయి


కొన్ని...పిచ్చి ఆలోచనలు

కంట్లో పడిన "కొరివికారమే".....భరించలేం

కొన్ని...పిచ్చి ఆలోచనలు

కాలిలో "గుచ్చుకున్న ముళ్ళే"...కాస్తజాగ్రత్త


కొన్ని...పిచ్చి ఆలోచనలు

గుండెల్ని పిండిచేస్తాయి పిప్పిచేస్తాయి

ఆ పిచ్చిఆలోచనలే రగిలే అగ్నిపర్వతాలై

బ్రద్ధలై "విషాదపులావాను" విరజిమ్ముతాయి


అందుకే 

చేయకు చేయకు 

పిచ్చి ఆలోచనలతో 

నీ విలువైన 

కాలాన్ని వృధాచేయకు...అవి 

నీ ఆరోగ్యాన్ని...

నీ ఆదాయాన్ని... 

నీ ఆయుష్షును....

నీకు దూరం చేస్తాయి...

నీ బ్రతుకును అంధకారం చేస్తాయి.


ఆపై.....నీకు బంధాలు...భారమౌతాయి 

దూరమౌతాయి మటుమాయమౌతాయి 

ఇక మిగిలేది...

ఒంటరితనమే...

తరగని మానసిక క్షోభే... 

భరించలేని ఒత్తిడే...అది వర్ణనాతీతమే...


ఆపై...ఏవేవో మానసివ్యాధులు 

కనపడవు కానీ వేధిస్తాయి బాధిస్తాయి 

"బలహీనతలకు నిన్ను బానిసను" చేస్తాయి 


ఔను ఆ పిచ్చి ఆలోచనలకు 

"ఆనకట్టలు" కట్టాలి

పిచ్చిఆలోచనల "కలుపుమొక్కలను" తొలిగించాలి

మదినిండా "మంచితనం మానవత్వం" 

పరిమళించే "ప్రేమమొక్కల్ని" పెంచాలి


అందుకే మిత్రులారా మరువకండి ! 

విరుద్దమైన..."ఆలోచనలే విషమని"...

అనురాగపూరిత..."ఆలోచనలే అమృతమని"...

ఆగని పాపిష్టి..."ఆలోచనలే ఆరని నిప్పని"...

దుష్టతలంపులే..."ముందున్న ముప్పుకు మూలమని"...


57. ముందుస్తు హెచ్చరిక లేకుంటే ముప్పే..!

వాడుబోయవాడని... 

బహుమాయగాడని...

వలలు విసురుతాడని...

మత్తుమందు చెల్లుతాడని... 

మంత్రగాడని మాయచేస్తాడని...

ముందే హెచ్చరించకుండా ........


వల్లో చిక్కుకున్న తర్వాత 

చెరువులో చేపల్లా వారు

గిలగిలా కొట్టుకుంటుంటే మీరు 

ఎంతగా విలవిలలాడి మాత్రం 

ఏమి లాభం ? ఏమి ప్రయోజనం?చెప్పండి?


వాడు వేషగాడని... 

క్రూరమైన వేటగాడని.. 

జింకలను వేటాడే జిత్తులమారని...

చెట్లచాటున మాటువేసి ఉంటాడని... 

గురిపెట్టి బాణాలు విసురుతాడని... 

గుండెల్లో గుచ్చుతాడని...

క్షణాల్లో ప్రాణాలు తీస్తాడని... 

ముందే గుర్తు చేయకుండా...........


బాణాలకు బలైపోయిన తర్వాత 

మీరు ఎంతగా కుమిలిపోతే మాత్రం 

ఏమి లాభం ? ఏమి ప్రయోజనం?చెప్పండి?


వాడు కసాయివాడని...

పరమ కఠినాత్ముడని...

వాడిచేతిలో కత్తులుంటాయని... 

అమ్మాయిలంటే బుర్రలేని గొర్రెలని... 

ఆకులుమేసే అమాయకపు మేకలని...

భావించి కవ్వించి బాగా నమ్మించి 

నవ్వుతూ వారి కలల్ని నరికేస్తాడని... 

ముందుగానే హెచ్చరించక.............

 

వాడు వారి అందాలను ఆరబోయించి

అంగడిలో సరుకులా అమ్ముకుంటుంటే 

అమ్ముకొని, సొమ్ము చేసుకుంటుంటే 

అప్పుడు, అయ్యో ,అమ్మో అంటూ మీరు 

ఎంతగా గుండెలు బాదుకుంటే మాత్రం 

ఏమి లాభం? ఏమి ప్రయోజనం? చెప్పండి?


చేతులు కాలాక ఆకులు పట్టుకుని

వివాహం ముగిశాక విందుభోజనానికెళ్ళి 

ఏమి లాభం? ఏమి ప్రయోజనం? చెప్పండి?

తలలుపట్టుకు కూర్చొన్న ఓ తల్లీతండ్రులారా !

ముందే వుండాలిగా...

కాస్త ముందు జాగ్రత్త...!!!


58. మౌనం...ఒక మహాసముద్రం

బుద్ధి నేర్పాలి...

బురదలో‌ పడిన

బుద్ధిహీనుడికైనా...

బలహీనుడికైనా....

అది గడ్డి మేస్తుంటే...


గుడ్డివాళ్ళు 

గుంటలో పడతారు ...

మతిలేనోళ్ళు 

మంటలోపడి మాడిపోతారు... 


దారి తప్పుతూ రెచ్చిపోయే 

పిచ్చివారిని హెచ్చరించాలి...


వినీ విననట్లు...

చూసి చూడనట్లు... 

తెలిసి తెలియనట్లు...

"మౌనంగా" ఉండరాదు... 


"మౌనవ్రతం"  మంచిదే  

అది శక్తివంతమైన "ఆయుధమే"...


"మౌనం"...

నిజానికి

మానసిక రుగ్మతలను 

రూపుమాపు "ఒక మంత్రదండమే"...


"మౌనం"...

ఉప్పొంగే "మహాసముద్రమే"...

మహాప్రమాదమే" కూడా కారణం 

దాని ఘోష అంతరాత్మకు అంకితమే...


"మౌనం"... 

"ఖణ ఖణ మండే "ఓ అగ్నికణమే...

అందుకే "నిఘా పెట్టాలి...నిద్ర పోరాదు" 

"నిప్పు"ఎప్పుడు దహిస్తుందో ఎవరికెరుక ?


59. ప్రేమ ఒక పరిమళమే..!


ప్రేమ...

విఫలమైతే...విషాదమే 

సఫలమైతే...

సంతోషమే...సంబరమే


ప్రేమ... 

ఒక కసుమమే...

గుభాళించే...ఒక పరిమళమే...

గట్టెక్కకున్న బ్రతుకు గందరగోళమే...


ప్రేమ...

ఒక బాణమే...రామబాణమే...రక్షణకవచమే...

నిజమైనది...నిష్కల్మషమైనది...స్వచ్చమైనదైతే.


60. పిచ్చికవికి పుట్టిన పిచ్చికోరిక ?

అనగనగా "ఓ పిచ్చికవి"...

తాను దాహమేస్తే త్రాగేది....కవిత్వం

తాను ఆకలేస్తే తినేది........కవిత్వం

తాను మాట్లాడేది ..............కవిత్వం


తాను వినేది .......కవిత్వం 

తాను రాసేది ......కవిత్వం

తాను చదివేది ...కవిత్వం

తాను చెప్పేది.....కవిత్వం


తాను ఊహించేది.......కవిత్వం 

తాను ఆలోచించేది.....కవిత్వం

అతని ఆశ........కవిత్వం

అతని శ్వాస.....కవిత్వం


తాను పీల్చేది............కవిత్వం 

కలలోసైతం 

తాను కలవరించేది.....కవిత్వం


ఆ దైవమే భువినుండి

దివికి దిగివచ్చి 

ఏదైనా ఒక గొప్పవరాన్ని

కోరుకోమ్మంటే

తాను కోరుకునేది.....కవిత్వం


తాను కొనేది.......కవిత్వం

తాను అమ్మేది.....కవిత్వం

తాను అడిగేది.....కవిత్వం


తన నవ్వులో....కవిత్వం

తన నడకలో.....కవిత్వం

తన రాతలో......కవిత్వం

తన రక్తంలో......కవిత్వం


తాను విత్తేది....................కవిత్వం

తాను సాగుచేసేది.............సాహిత్యం

తాను కోసే పచ్చని పంట....కవిత్వం


ఐతే అది ఒక "తియ్యనికలని" 

తెలుసు అది "తీరదని" తెలుసు


కానీ "ఈ పిచ్చికవికి" 

"తీరనికోరిక" ఒక్కటే

తన శత్రువుకైనా కనిపిస్తే కడకు 

ఆ మృత్యువుకైనా 

తన "కవితను" వినిపించాలని...

కన్ను మూయాలని...


61. మాససికానందం...

ఆనందం ఎక్కడ

దొరుకుతుంది ?

అడవిలోనా...

అంగడిలోనా...

అందాలు ఆరబోసే

అపరంజి బొమ్మలోనా...


సరసం

శృంగారం

జారత్వం

వ్యభిచారం 

కాముకత్వం

కనిపించే వ్యసనాలు


కానీ కనిపించకుండా 

రోజంతా

ఉత్సాహాన్ని నింపేది

మనసును

ఉల్లాస పరిచేది

మానసిక వ్యభిచారం 


ఇద్దరు మాజీ

మానసిక రోగులు 

గతంలో లాగ

ఒకరినొకరు 

కలుసుకొని 

ముఖాముఖిగా

మాట్లాడుకోవడానికి...

కుళ్ళు జోకులు 

వేసుకొని విరగబడి

నవ్వుకోవడానికి...

ఇష్టమైనవి ఏవైనా

ఇచ్చి పుచ్చుకోవడానికి

వీలు కాకపోతే...


సెల్లులో సొల్లు కబుర్లు 

చెప్పుకొని మనసారా 

మాట్లాడుకోవడానికి

వీలు కాకపోతే...


చాలా రోజులుగా 

ఎక్కడో ఒక చోట 

ముఖాముఖిగా

ఎదురుపడి

ముఖాలు చూసుకోను

వీలు కాకపోతే...


ఊహించని అనుకోని

ఏదో ఒక సందర్భంలో

ఏదో ఒక సమయంలో

ఏదో ఒక విధంగా 

లేనిది కల్పించుకొని 

ఎలాగైనా సరే

కొంచెం సేపైనా 

ఇష్టమున్నవారి

కంట పడాలని

అక్కడ ఇక్కడ ఎక్కడో

దూరంగా తచ్చాడుతూ


చాటు మాటుగానైనా

దొంగచూపులు

ఓరచూపులు 

చూసుకుంటూ

ముసిముసి 

నవ్వులు నవ్వుకుంటూ

మురిసిపోతూ

పొందే మానసికానందమే

ఆడవారంటే ఆశపడే

మనుషులు చేసే మానసిక వ్యభిచారం


62. కాలానికి కళ్ళెం వేద్దాం ! 

ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


రిక్షావాడికైనా... 

రియల్ ఎస్టేట్ వ్యాపారికైనా...

ముష్టి వాడికైనా... 

ముఖేష్ అంబానీకైనా... 

ఆ భగవంతుడిచ్చిన 

సమయం 24 గంటలే...


కనిపించే మనిషి...

కనిపించని కాలం

కప్ప...పాము లైతే 

సమయం సమర్పయామి...

చిలకా గోరింక లైతే

సమయం సద్వినియోగం....


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


కళ్ళు పొరలు కమ్మిన 

కామాంధుడవై.....

దుష్ట తలంపులతోనా... 

కామపు చూపులతోనా...

పరస్త్రీ వ్యామోహంతోనా...

పర పురుషుల భార్యలవేటలోనా...

చాటుమాటుగా వలపువలలు 

విసరడంలోనా...ఎలా ?ఎలా ?

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ?


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


అక్రమంగా 

అర్జించు... 

అనుభవించు...

ఆపై అస్తమించు...

అన్న త్రిసూత్రాలతో 

లంచాలకు మరిగి 

లంచగొండివై.....

పరుల జేబులకు 

చిల్లులు పెట్టడంలోనా... 

పైకి దొరలా లోపల దొంగలా...

పరుల ఇళ్లకు కన్నం వేయడంలోనా... 

దొరికినంత దోచుకోవడంలోనా...

స్విస్ బ్యాంకుల్లో 

దాచుకోవడంలోనా...ఎలా ?ఎలా ?

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ? 


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


తిండిబోతువై...

కుంభకర్ణుడివై... 

పరమ సోమరిపోతువై... 

బద్ధకస్తుడివై... భ్రష్టుడివై...  

దుర్వేసనాలతో బ్రతుకును 

ఈడ్చడంలోనా...ఎలా ? ఎలా ?

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ? 


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


విలాస పురుషుడివై... 

విదేశాలలో విమానాలలో 

విహరించడంలోనా... 

పబ్బుల్లో క్లబ్బుల్లో 

విందుల్లో వినోదాల్లో 

మునిగి తేలడంలోనా...ఎలా ?ఎలా ?

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ? 


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


శృంగార పురుషుడవై...

అందాలు ఆరబోసే 

సుందరాంగుల పొందులకై 

పరితపించడంలోనా...

డ్రగ్స్ కు బానిసవై

బంగారు భవిష్యత్తును 

బలితీసుకోవడంలోనా...

సోషియల్ మీడియాలో

సొల్లు కబుర్లతోనా...ఎలా ? ఎలా? 

నీ కాలానికి కళ్ళెం వేస్తున్నావ్ ? 


ప్రియమైన మిత్రమా !

ఓ నా ఆత్మీయ నేస్తమా !


కోహినూర్ వజ్రంకన్నా 

అతిఖరీదైన అతివిలువైన 

తిరిగిరాని ఈ కాలానికి

నీవిలా కళ్ళెం వేసెయ్ ?

నీ సద్భుద్దితో...

నీ సత్సంకల్పంతో...

నీ సత్క్రియలతో... 

నీ మంచితనంతో... 

నీ మానవత్వంతో... 

నీ దయా గుణంతో... 

నీ దాతృత్వంతో... 

నీ దైవత్వంతో... 

కరుణ ప్రేమ జాలి వంటి

నీ ేఏసద్గుణాలతో... వేసెయ్

నీ కాలానికి కళ్ళెం వేసెయ్ ? కానీ 


ఒక్క‌నిజం‌ తెలుసుకో నేస్తం!

కాలమే నీచేతిలో 

త్రిశూలమైతే నీవు త్రినేత్రుడవని...

కాలం గాలానికి నీవు చిక్కితే 

నీవు మహిమలులేని మాంత్రికుడవని...


కాలం ఒక శక్తివంతమైన ఆయుధమని

అది ఏ పునాదికైనా...

ఏ సమాధికైనా

ఏ అంతరిక్షానికైనా....

ఏ అదఃపాతాళానైనా...


63. విశ్వవిజేతలెవరు...?

జీవితం ఒక ఆట 

జీవితం ఒక‌ చదరంగం

జీవితం ఒక పరుగు పందెం

జీవితం ఒక భీకరమైన పోరు

మహాసముద్రంలో అలల ఆటుపోట్లే

జీవితంలో వచ్చే గెలుపు ఓటములు


ప్రతి మనిషి 

చేసేది ఒక ప్రయత్నమే

దాని ప్రతిఫలాలు సత్ఫలితాలు 

దుష్ఫలితాలు సర్వము దైవాధీనమే


"ఘన విజయాలనుండి‌"... 

గొప్పగౌరవం...మంచిగుర్తింపు... 

ఊహకందని పేరు ప్రతిష్టలు...

కీర్తి కిరీటాలు పొందినట్లే...


సన్మానాలు సత్కారాలను...

అంతులేని ఆత్మతృప్తిని..

ఆనందంగా అందుకున్నట్లే...


వినయం విధేయత నేర్చుకున్నట్లే...

అతుకుల బ్రతుకును మార్చుకున్నట్లే...

జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నట్లే...


"ఘోర పరాజయాలనుండి"...

గతంలో పొందిన...

అవమానాలనుండి...

తగిలిన...

ఎదురు దెబ్బలు నుండి...


జరిగిన...

చేదు సంఘటనలనుండి...

చేదు అనుభవాలనుండి...

చేసిన... 

సరిదిద్దుకోలేని తప్పులనుండి...

తెలిసీ తెలియని 

లోపాలనుండి...

ఎన్నో పాఠాలను...

గుణపాఠాలను... 

నేర్చుకున్న వారే...

రేపు "చరిత్రను" సృష్టిస్తారు 

విశ్వవిజేతలై..."

ఖాండాంతరఖ్యాతిని" ఆర్జిస్తారు


64. కార్గిల్ అమరవీరులకు అశ్రునివాళి...

నాడు దేశ సరిహద్దుల్లో 

కొదమ సింహమల్లా

పాక్ శతృమూకలతో 

పోరాడి పోరాడి

నేలకొరిగిన ఓ అమరవీరులారా!

మంచుకొండల్లో 

భగ్గున మండే ఓ భాస్కరులారా:!

జోహార్ జోహార్ ! 

ఓ కార్గిల్ వీరులారా ! జోహార్ జోహార్ !!


ఆకాశంలో వెలిగే ఓ నక్షత్రాల్లారా ! 

ఎక్కడిదీ ఎక్కడిదీ మీకు మరణమెక్కడిది?

ప్రతి భారతీయుడి గుండెల్లో మీరు 

అమరులై, ఆరనిదీపాలై వెలుగుతువుంటే

ఎక్కడిదీ ఎక్కడిదీ మీకు మరణమెక్కడిది?


మీ ప్రాణత్యాగం,నీ దేశసేవ,

ఇలనైనా కలనైనా మరువలేనిది 

దుష్టులు దుర్మార్గులైన మూర్ఖులు

ముష్కరులైన ఆ పాక్ శతృమూకల్ని 

మట్టుపెట్టకపోతే ప్రతీకారం తీర్చుకోకపోతే

సరిహద్దుల్లోనే వారికి సమాధులు కట్టకపోతే


ఎక్కడిదీ ఎక్కడిదీ? 

మీ ఆత్మలకు శాంతి ఎక్కడిది?

ఎక్కడిదీ ఎక్కడిదీ ?

మీకుటుంబాలకి ఓదార్పు ఎక్కడిది?

ఎక్కడిదీ ఎక్కడిదీ ?

ఈ భరతజాతి కళ్ళల్లో కాంతి ఎక్కడిది?

ఎక్కడిదీ ఎక్కడిదీ ?

ఆ భరతమాతకు మనశ్శాంతి ఎక్కడిది?


ఓ కార్గిల్ వీరులారా !‌ మీది వీరమరణం !

మీతో తలపడిన ఆ పాక్ 

తన తలను తానే  నరుక్కుంది

తన గొయ్యిని తానే తవ్వుకుంది

తన మరణశాసనం తానే వ్రాసుకుంది


శిక్షితులైన మన రక్షకభటులు  

పాక్ దురాక్రమణదారులకు

పాక్ ప్రేరేపిత తీవ్రవాదులకు

సరిహద్దుల్లోనే ,సమాధులుకట్టి

మీ ఋణం తీర్చుకున్నరోజే 

మీ ఆత్మలకు శాంతి!

ఆ భరతమాత కళ్ళల్లో తరగని కాంతి!

జోహార్ జోహార్ ! 

ఓ కార్గిల్ వీరులారా ! జోహార్ జోహార్ !!


జై జవాన్ ...జై హింద్...జై భారత్.


65. నిరాశ చెందకు...నిష్క్రమించకు...

ఓ ప్రియ మిత్రమా!

నా ఆత్మీయ నేస్తమా !

ఏ ఆటలోనైనా

ఏ పోటీలోనైనా

నిష్క్రమించాలన్న 

నిప్పులాంటి నిర్ణయం 

తీసుకునే ముందు 

ఒక్కసారి వెనక్కి తిరిగి

నీ గతంలోకి తొంగి చూడు 


రేయింబవళ్ళు 

నిద్రాహారాలు మాని 

నీ వెంతగా శ్రమించావో...

ఎన్ని చీకటి రాత్రులు 

ఎన్ని చిత్రవధలు అనుభవించావో... 

ఎన్ని స్వేదబిందువుల్ని నేలరాల్చావో... 


ఎన్ని వేల పాదముద్రలు 

నీ వెనుక "పద ముందుకంటూ" 

నిన్ను వెన్ను తడుతున్నాయో... 

ధైర్యంగా ఉండు...భయమెందుకు...

"సాహసమే ఊపిరిగా" సాగిపో ముందుకు... 


ఆరునూరైనా... 

కడలిలో అలలు కాసేపు ఆగినా... 

పచ్చిమాన సూర్యుడదయించినా...

వెయ్యి పిడుగులు నీ తలపైపడినా... 

ఎన్ని సునామీలు నిన్ను చుట్టుముట్టినా... 


"చలించకు"...

"నిరాశచెందకు"... 

"నిష్క్రమించకు"... 

తలపెట్టిన నీ శుభకార్యం 

దిగ్విజయంగా ముగిసేంతవరకు... 


ఆత్మసాక్షిగా అనుకున్న 

"నీ లక్ష్యం" నెరవేరేంతవరకు ...

"ఆవలి తీరం" చేరేంతవరకు... 

"ఘనవిజయం" సాధించేంతవరకు...

"విజయఢంకా" మ్రోగించేంతవరకు...

"విశ్వవిజేతవై"...వినువీధుల్లో 

"విజయకేతనం" ఎగుర వేసేంతవరకు...


66. మునులా ? మూర్ఖులా ? 

పెళ్ళిచూపుల తర్వాత

అమ్మాయి కళ్ళల్లో కమ్మనికలలు  

కుటుంబమంతా

ఎంతో ఆశతో ఎదురుచూపులు 

మాకు"మీ అమ్మాయి  నచ్చింది" 

అన్న ఓ చల్లని కబురు కోసం...


ఆ కమ్మని కబురును వింటే చాలు 

అమ్మాయి ఎగిరి గంతేస్తుంది జింకలా..

పొంగిపోతుంది పొయ్యి మీది పాలలా...

తేలిపోతుంది ఆకాశంలో గాలిపటంలా..


అక్కడ

వారు కాకితోనైనా

కబురైనా అంపక

కాలయాపన చేస్తుంటే...

ఉలుకూ పలుకు లేకుంటే...

మునులై మౌనంగా కూర్చొనివుంటే...


ఇక్కడ

కుటుంబమంతా క్రుంగిపోదా?

ఆశలపల్లకిలో ఊరేగే ఆ పిచ్చిపిల్ల 

లోలోన కుమిలి కుమిలిపోదా?


తాను అందంగా లేనేమో...

తాను వారికి నచ్చలేదేమో...

తనకిక జీవితంలో కల్యాణం కాదేమో 

అన్న బాధతో... వ్యధతో... వేదనతో

ఒంటరిగా చీకటిలో కంటతడి పెట్టదా?


ఔను ఆ సమయంలో 

ఆ అమ్మాయిపడే ఆ మానసికక్షోభ

మౌనంగావున్న ఆ మూర్ఖులకేం తెలుసు 

కన్నవారికి పైనున్న ఆ పరమాత్మకు తప్ప


నిజానికి, వారి మౌనానికి 

అసలు కారణం అమ్మాయి అందం కాదు 

అమ్మాయి నచ్చకకాదు కట్నాలేవో కుదరక


ఆ విషయం వారు ఊరెళ్ళిన వెంటనే కలిసి 

చర్చలు చేసి తెలియజేస్తే ఎంత బాగుండేది

ఆ అమ్మాయి మనసు ఎంత కుదుటపడేది

ఇంతగా కుమిలి కుమిలి ఏడ్చేది....కాదుగా


నిజమే‌ 

"మౌనం కొందరికి మరణ శిక్షతో సమానం"

అది ఎరుగని వారంతా

కళ్ళున్నా అంధులే...మూర్ఖులే...మునులే...


67. వెయ్యి సునామీలు ?

దేశం మొత్తం 

టెర్రరిస్టులతో...


సమాజం మొత్తం 

రేపిస్టులతో ...


ఏ ప్రముఖ సంస్థైనా    

ఎస్కేపిస్టులతో...


నిండిననాడు

నిఘా పెట్టకపోతే

నిప్పుల వర్షమే...


దగాకోరులను

దండించకపోతే

దగ్దం చేయకపోతే...


మానవాళికి

పెనుప్రమాదం 

పొంచిఉన్నట్లే...


వెయ్యి 

సునామీలు మన

వెనుక వేచివున్నట్లే...

విధ్వంసం సృష్టించనున్నట్లే...


కోటి తుఫాన్లు

కోరలు చాచినట్లే...

కొంపలు ముంచినట్లే...

జాగ్రత్త...తస్మాత్ జాగ్రత్త...


అప్పుడు మన‌కళ్ళ ముందు 

అంతా నాశనమే...సర్వనాశనమే...

వినాశనమే...విధ్వంసమే...విషాదమే...


ఔను అమలుచేయక తప్పదు కఠినశిక్షలు

ఉక్కుపాదం మోపి "ఉగ్రవాదుల" ఉరితీత

కామంతో రెచ్చిపోయే"రేపిస్టుల" కాల్చివేత

బాధ్యత మరిచే "ఎస్కపిస్టుల" జీతాల కోత


68. కవులు....కళాపోషకులు....

కారుమబ్బులు తొలిగేదెప్పుడు ? 

కవితా కిరణాలు వెలిగేదెప్పుడు ?

కాంతి రేఖలు కనిపించేదెప్పుడు ?

కవితా గానం వినిపించేదెప్పుడు ?


కవితలు పొంగి పొరలేదెప్పుడు ?

కవుల హృదయాలు ఆనందం‌

పట్టలేక గంతులు వేసేదెప్పుడు ?

చిరునవ్వుల పూలుపూసేదెప్పుడు?


తొలకరి జల్లులు కురిసేదెప్పుడు? 

కవులందరు హాలికులుగా మారి

ఏరువాక సాగారో అంటూ గానంచేస్తూ

కలాలను హలాలుగా పట్టేదెప్పుడు?

సాహితిక్షేత్రాలను సాగు చేసెదెప్పుడు?


అందరి ఆశలు చిగురించేదెప్పుడు? 

కమ్మని కవితలపాటల్ పాడేదెప్పుడు?

ఆనందంతో పరమానందంతో 

కవులు పరవళ్ళు త్రొక్కేదెప్పుడు? 


శ్రీకృష్ణ దేవరాయలవంటి 

కళాపోషకులు సహృదయులు...

కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు

స్పందించి సాహితీమూర్తులను 

భుజంతట్టి ప్రోత్సాహించినప్పుడు...


సాహితీ సభలేర్పాటుచేసి 

కవులకు కళాకారులకు 

ఆత్మీయ సన్మానాలు చేసినప్పుడు...

చేసిన సాహితీసేవలకు గుర్తింపుగా 

అవార్డులు రివార్డులిచ్చినప్పుడు....


కవిరత్న...కళారత్న...కవిశేఖర 

సాహితీ సామ్రాట్ వంటి

బిరుదులను ప్రధానం చేసినప్పుడు...

ప్రముఖుల చేతులమీదుగా 

సాహితీ పురస్కారాలనందజేసినప్పుడు...


69. వరాల వర్షం...

విశ్వాసమే... 

గొప్ప రక్షణ కవచం... 


వివేకమే...

వెలగట్టలేని సంపద...


సహనమే... 

శక్తివంతమైన ఆయుధం... 


ముఖంలో...  

చెరగని చిరునవ్వే...

మన శారీరక మానసిక...

రుగ్మతలకు మంచి మందు...


భగవంతునిపై భక్తిశ్రద్ధలు గల వారిపై...

తప్పక కురుస్తుంది...ఈ వరాల వర్షం...


70. నేనొక త్రినేత్రుడను...

నేనొక "త్రినేత్రుడను"... 

నా ఆయుధం...త్రిశూలం  

గురిచూసి విసిరానంటే...

గుండెల్లో గ్రుచ్చుకొని 

కనిపించని కాలం సైతం 

కన్నీరు పెడుతుంది...


నేనొక "ఇంద్రజాలికుడను"...

ఓం హ్రీం ఛూ...అన్నానంటే...

మట్టినుండి భగభగమని...

మంటలు పుట్టి

భూమండలమంతా బుగ్గౌతుంది...


నేనొక "మన్మధుడను"...

నేను ప్రేమబాణాలు 

సంధించానంటే...

మత్తులై...

ఉన్మత్తులై...

చపలచిత్తులై...

భగ్నప్రేమికులంతా

నగ్నంగా నాట్యం చేస్తారు...

డ్జ్డడడ

నేనొక "మాయల మరాఠీని"...

నా మంత్రదండాన్ని చేపట్టి

పూలపొదరిల్లను పుట్టిస్తా...

చిమ్మ చీకట్లను చీల్చివేస్తా...

రంగుల హరివిల్లును రప్పిస్తా...

చిరునవ్వుల చిరుజల్లులు కురిపిస్తా...


నేనొక "కవిసార్వభౌముడను"..

కలం నా కరవాలం....

కవిత్వం నా త్రినేత్రం...

సంఘసంస్కర్తలకు 

సలాం కొడతా...

సంఘ విద్రోహశక్తులకు 

సమాధి కడతా...

సరస్వతీ పుత్రుడిగా‌ 

నేను మళ్ళీమళ్ళీ పుడతా...


71. ఓ వృద్ధదంపతులారా...! 

     తస్మాత్ జాగ్రత్త 

ఓ నవదంపతులారా...!

కాదు కాదు 

ఓ వృద్ధదంపతులారా...!

ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి..!

మీ వక్రబుద్దిని మార్చుకోండి..!

సక్రమంగా సమాధానంతో

సంతోషంగా బ్రతకడం నేర్చుకోండి..!


ఆడవారంటే ఆశపడేవారిని

ఆరుమైళ్ళ దూరంలో ఉంచండి..!

మీరు గొర్రెలై గొడవపడుతుంటే  

మీ పిల్లలు జడ్జీలై

మీకు తీర్పు చెప్పడం 

మీకు కఠిన శిక్షలు వేయడం 

ఛీ ఛీ అనడం ఎంతటి సిగ్గుచేటు ..!

మూడోవంతు జీవితం గడిపిన మీరు

మిగిలిన "పావుజీవితం" ప్రశాంతంగా గడపండి..!


ఓ వృద్ధదంపతులారా...!

ఇకనైనా‌ ఒకరినొకరు కలుసుకొని...

ఒకరి మనసొకరు తెలుసుకొని...

కంటికి రెప్పలా...

నిను వీడని నీడలా...

తనువులు వేరైనా ఊపిరి ‌ఒక్కటైన

నీ భాగస్వామి తనువునే కాదు 

మనసును మనిషిని ప్రేమిస్తూ

కడదాక...

కన్నుమూసేదాక...

కాటికెళ్ళేదాక...

కాలిబూడిదయ్యేదాక...

గూటిలో గువ్వలై... 

కౌగిట్లో బంధీలై

ఒకరినొకరు చెట్టుకు లతలా

పెనవేసుకొనిపొండి నవ్వుతూ బ్రతకండి..!


ఓ వృద్ధ దంపతులారా...!

ఒక నిండు నిజం తెలుసుకోండి..!.

దయ జాలి కనికరం లేని 

ఆ విధి‌ సైతం విడదీయలేని 

విచిత్ర పవిత్ర వివాహబంధం మీదేనని..!


72. కన్నుమూసిన నా కన్నతల్లి...?

ఎనబది ఏళ్ళనాడు

పుత్రుడు పుట్టగానే...

పురుడు పోయగానే...


ఆకలై కేకలేస్తే పాలిచ్చి ఆకలి తీర్చి

అనారోగ్యం పాలైతే ఆందోళన చెంది 

నా మల మూత్రాలను నిత్యం ఎత్తివేసి

నన్ను "ఒడిలో" ఉంచి ఊయలలూగించి

నన్ను "బడిలో" చేర్పించి అక్షరాలు దిద్దించి

నా బంగారు భవిష్యత్తుకు బాటలు వేయించి

కట్టుకున్న భర్త కన్ను మూసినా

కూలి నాలి చేసి నా క్షుద్బాధను తీర్చి


కొండలమీద బండలుమోసి

ఎండకు ఎండి వానకు తడిసి

కడుపునిండా తిండి లేకున్నా

కంటినిండా నిద్ర లేకున్నా

ఒంటరిగానే పోరాడి పోరాడి

అష్టకష్టాలు పడి నాకు

పెద్ధ చదువులు చెప్పించి

ఉన్నతమైన ఉద్యోగం ఇప్పించి

అప్పుచేసి ఘనంగా పెళ్ళి చేసి

అవితీర్చలేక ముప్పుతిప్పలు పడి


అహర్నిశలు నా సంక్షేమాన్నేకాంక్షించి 

కమ్మని కలలెన్నోకని సమాజంలో 

నాకో ఉన్నత స్థానాన్ని కల్పించి

నన్ను ఒక ప్రయోజకున్ని చేసి 

నిస్వార్థంగా నీ రక్తాన్ని 

స్వేదంలా చిందించిన వెట్టిచాకిరి చేసిన...


నా నుండి ఏమీ ఆశించక...

నీ ఆరోగ్యాన్ని ఫణంగాపెట్టి...

అన్ని ఆశలు నా మీదనే పెట్టుకొని

నీ జీవితం మొత్తం నా కోసమే

ధారబోసిన... 

ఖర్చు చేసిన... 

కన్నుమూసిన...

ఖాళీ చేతులతో కాటికెళ్ళిన...


అమ్మా ఓ అమ్మా 

నీ ఋణం ‌ఎన్ని 

జన్మలెత్తినా తీర్చలేనిది

నీవే మాకు ప్రత్యక్ష దైవం...

అపురూపమైన ‌

నీ త్యాగాన్ని...

స్వచ్ఛమైన నీ ప్రేమను...

మా కోసం అనుక్షణం 

నీవు పడిన నీ శ్రమను...

చీకటిలో నీవు కార్చిన 

ఆ కన్నీటి చుక్కలను... 

కలనైనా మరువక 

నిత్యం గుర్తు చేసుకుంటాం

గుండెలో గుడి కట్టి

సదా నిన్నే స్మరించుకొంటాం

అందుకే ! అమ్మా ఓ అమ్మా ! 

మీకు వందనం ! ...

అభివందనం ! ...పాదాభివందనం !


ఔను...

మా అమ్మ 

గుండె ఆగింది...

మా గుండె ‌చెదిరింది... 

మా కంట కన్నీరు కరువైంది...

మా ఇంటి మామిడి చెట్టు మరణించింది...

మా ఇంటి వెలుగు మాకంటికి దూరమైంది....


స్వార్థానికి అర్థం తెలియని మా అమ్మ

స్వర్గంలో "విశ్రాంతి"......తీసుకుంటున్న 

మా అమ్మ..."ఆత్మకు శాంతి"కలగాలని 

అనురాగమయియైన

ఆ అమ్మకిదే...నా నిండు నీరాజనం... 

ప్రేమామయుడైన

ఆ పరమాత్మకిదే...నా నిత్యనివేదన...


73. అంబేద్కర్ అమృత సందేశం ?

ఓ నా దగాపడ్డ దళిత బిడ్డలారా!

ఓ నా బహుజన బంధువులారా !

ఓ నా భరతమాత ముద్దు బిడ్డలారా! 


ఎవరైనా...మీ శత్రువులు 

మీ "తోక" త్రొక్కితే పర్వాలేదు 

కానీ మీ "పీక" నొక్కితేనే ప్రమాదం 


మీరు 

మృత్యుంజయులై...

తోక త్రొక్కిన త్రాచులై...

కస్సు బుస్సుమనవచ్చు...

కాటు వేయవచ్చు...ఖతం చేయవచ్చు... 


ఔను వారు ప్రేమతో నవ్వుతూ నటిస్తారు

వారే మీకు దైవాలన్న భ్రమను కలిగిస్తారు

వెయ్యి తరాలకైనా సూర్యోదయం రాకుండా

ఊపిరాడని ఊబిలోకి మిమ్మల్ని నెట్టేస్తారు 

అదఃపాతాళానికి మిమ్ము అణగద్రొక్కుతారు

 

వారు మిమ్మల్ని ...

విద్యకు...

విజ్ఞానానికి...

ఆర్థిక వనరులకు...

ఆయుధ సంపత్తికి...

ఆమడదూరంగా ఉంచి... 


మీరెక్కడ 

వీరులౌతారోనని...

విజ్ఞానవంతులౌతారోనని...

ఆచారాలను అడ్డుకుంటారోనని...

తిరుగుబాటు చేస్తారోనని...ప్రశ్నిస్తారోనని...

ప్రతిఘటిస్తారోనని... ప్రాణం తీస్తారోనని...భయంతో 

మీ తలపైకెక్కి తాండవమాడుతారు తస్మాత్ జాగ్రత


మరి మాలో మార్పు ఎప్పుడు?...

మీకు కనువిప్పు కలిగినప్పుడు...

మీలో చైతన్యజ్వాల రగిలినప్పుడు...


ఉరికంబాలనైన ముద్ధాడేందుకు సిద్దమై 

యువకిషోరాలై మీరు పోరాడినప్పుడు...


మీలో మేధోమథనం మొదలైనప్పుడు...

మీరు కార్చే కన్నీటి విలువ‌ మీకు తెలిసినప్పుడు...


మా బానిస బ్రతుకుల నుండి 

మాకు విముక్తి ఎప్పుడు?


వారి కబంధ హస్తాల నుండి 

మీరు బయట పడినప్పుడు

సంఘంలో సమానత్వం సౌభ్రాతృత్వం ఒక్కవిద్యద్వారానే 

సాధ్యమన్న ఓ నగ్నసత్యాన్ని మీరంతా గ్రహించినప్పుడు...


ఉక్కుపిడికిలి బిగించి మీరంతా ఉద్యమించినప్పుడు...

రక్తతర్పణతోనైనా రాజ్యాధికారాన్ని సాధించినప్పుడు...

ఈ అంబేద్కర్ ఆఖరి ఆశయమైన...తీరని కలయైన

ఆ బహుజనరాజ్యాన్ని మీరు స్థాపించినప్పుడు...జై భీమ్ 


74. ఎవడు వెర్రివాడు ?

ఒంటి నిండా 

.....ఆరోగ్యం

చేతి నిండా 

.....పని

జేబు నిండా 

.....డబ్బు

కంటి నిండా 

.....నిద్ర

కడుపు నిండా 

.....తిండి

ఒంటి నిండా 

.....బట్ట


ఇంటి నిండా 

.....సంపద

మనసు నిండా 

.....ఆనందం

ముఖము నిండా 

.....వెలుగు

పెదవుల నిండా 

.....చిరునవ్వు


గుండె నిండా 

.....నిబ్బరం

బ్రతుకు నిండా ‌

.....తృప్తి

జీవితం నిండా 

.....ప్రశాంతత

నడిచే దారి నిండా 

.....గౌరవం కీర్తి ప్రతిష్టలు

ఇంతకంటే... 

ఇంకేం కావాలీ మనిషికి ?


ఇన్ని దక్కినా... 

ఇంకా తృప్తన్నది లేకుంటే 

ఆ తృప్తి ఒక అందనిద్రాక్షే...


అది అందాలని...

ఆశించే వాడు అజ్ఞానియే..!


అది పొందాలని...

పరితపించే వాడు పిచ్చివాడే..!


అది తనకే చెందాలని...

వెతికే వాడు నిజంగా వెర్రివాడే..!


75. సుందర నందన వనాలు......

యువతా ! ఓ నవయువతా !

మీ చూపులు చురకత్తులు కావాలి

మీ కళ్ళెప్పుడూ నిప్పుల్ని విరజిమ్మాలి

మీరు పులులై చిరుతపులులై సింహాలై

శూరులై యుద్ధ‌వీరులై శతృవుల్ని వేటాడాలి


యువతా ! ఓ నవయువతా ! 

వొద్దు ఒంటరిపోరాటం వొద్దు మీరు 

సమిష్టిగా యుద్దానికి సిద్ధం కావాలి 

యుద్దభేరిని మ్రోగించాలి పోరాడాలి

శతృవుల గుండెల్లో ఫిరంగుల్ని పేల్చాలి

రక్తపాతరహితంగా విజయకేతనమెగరేయాలి


యువతా ! ఓ నవయువతా ! 

మీ అరుపులు ఆకాశంలో 

మెరుపులు కావాలి

మీ ఉగ్రరూపంతో నింగిలో 

ఉరుములు పుట్టాలి

మీరు పిడికిలి బిగించి 

సునామీలను సృష్టించాలి

మీరు భగభగమండే 

భాస్కరులుగా అవతరించాలి


యువతా ! ఓ నవయువతా ! 

ఎక్కడ అన్యాయం అక్రమం 

జడలు విప్పునో

అక్కడ మీ అడుగుల 

సవ్వడితో అలజడి పుట్టాలి

కన్నులున్న గుడ్డివారికి మీరు 

కంటిపాపలు కావాలి

నోరున్న మూగవారికి మీరు 

గర్జించే గళాలు కావాలి

చైతన్యరహితుల్ని మేల్కొల్పే 

అగ్నజ్వాలలవై రగలాలి


యువతా ! ఓ నవయువతా ! 

ధగధగ మెరిసే కీర్తికిరీటాలు మీరు ధరించాలి 

శాంతి కపోతాలను నింగిలోకి ఎగురవేయాలి

హిమగిరి శిఖరమంత 

ఎత్తుకు మీరు ఎదగాలి

మీ కమ్మని కలలన్నీ పండాలి....

మీ జీవితాలు

సుఖశాంతుల సుందర 

నందనవనాలు కావాలి


76. ఏది ప్రధానం ? ఏది ప్రమోదం ? 

దీపాన్ని...

మట్టితో చేశారా ? 

బంగారంతో చేశారా ? 

అన్నది కాదు  

అది చిమ్మచీకటిని చీల్చి 

వెలుగులు విరజిమ్ముతుందా ? లేదా 

అన్నదే ప్రధానమన్నారు...మన పెద్దలు


అమ్మాయికి...

ఆస్తిఅంతస్తులు అందచందాలు 

ఉన్నతమైన ఉద్యోగం ఉన్నదా ? 

లేదా అన్నది కాదు 

ఆ అమ్మాయి గుణవంతురాలా ? కాదా 

అన్నదే ప్రధానమన్నారు...

మన అమ్మానాన్నలు


అబ్బాయి... 

ప్రణాళికబద్దంగా పరీక్షలకు 

ప్రిపేర్ అయ్యాడా?

నిర్భయంగా ఏకాగ్రతతో 

పరీక్షలు వ్రాశాడా ?

లేదా అన్నది కాదు 

ఆ పరీక్షలో మంచి ర్యాంకును 

సాధించాడా? లేదా 

అన్నదే ప్రధానమన్నారు...

మన గురుతుల్యులు


ఆటగాడు...

ఎన్నిరోజులు కఠోరమైన శిక్షణ తీసుకున్నాడు

ఆటలో ఎంతటి ప్రావీణ్యతను ప్రదర్శించాడు? 

అన్నది కాదు 

ఆ పోటీల్లో బంగారు 

పతకాన్ని కొట్టాడా ? లేదా 

అన్నదే ప్రధానమన్నారు...

ఒక ప్రముఖ ట్రైనర్ 


ఒక నిరుద్యోగి...

పట్టుదలతో ఎన్ని పరీక్షలు వ్రాశాడు 

ఎన్ని ఇంటర్వ్యూలకు 

అటెండయ్యాడు? అన్నది కాదు

ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని 

సాధించాడా? లేదా 

అన్నదే ప్రధానమన్నారు...

ఓ సంస్థ హెచ్ ఆర్ 


నిజమే కానీ...

హఠాత్తుగా సమస్యల 

సుడిగుండంలో

చిక్కుకోవడమంటే...

తలపై తాటికాయ పడడమే

తక్షణమే ఒక సమస్యకు పరిష్కారం 

దొరకడమంటే

నక్కతోకను త్రొక్కడమే...

ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమే


ఏదేమైనా... 

ప్రశ్న కాదు ప్రధానం...సమాధానం...

అంటే "తగిలిన" దెబ్బలు మానడం...

సమస్య కాదు ముఖ్యం...పరిష్కారం...

అంటే "రగిలిన" పగ ప్రతీకారాలు చల్లారడం...

నా కవితను చదివిన 

మీకు సకలశుభాలు కలగడం...


77. స్వచ్ఛమైన నది....


నదిలో ‌స్వచ్చమైన 

నీరున్నంత వరకే 

నదికి మంచి పేరు


నదికి నమస్కారం 

నదిలో మునకలు

నిర్మలంగా నిశ్చలంగా 

పారుతున్న నదిలోనే 

భక్తుల సూర్య నమస్కారం‌ 


బురద.....నదిలో

నీరులేని...నదిలో

మురికి.....నదిలో

మునిగేదెవరు? 

మంచినీరున్న...నదిలోనే 

మూడుమునకలు ‌

నిష్టతో సంధ్యావందనం


ఏ నదిలోనైనా ఏ కాలువలోనైనా 

నీరుంటేనే...విగ్రహాల నిమజ్జనం

నీరుంటేనే...పడవ ప్రయాణం

నీరుంటేనే...విహార యాత్రలు 

లాహిరి...లాహిరి...లాహిరిలో... 

ఓహో జగమే ఉగెనుగా తూగెనుగా ఆ...ఆ

అంటూ ఖుషీఖుషీగా కూని రాగాలు తీస్తూ

హాయిగా హాయి హాయిగా 

అందరు ఆనందంగా 

పరమామానందగా 

విహరించేది...

విశ్రాంతిపొందేది...

మంచి దారిలేని...ఊరు 

మంచి పేరులేని...మనిషి 

మంచి నీరులేని..."నది" నిరూపయోగమే

అరిషడ్వర్గాలతో రగిలే "మది" అగ్నిగుండమే


ఔనిది ఎవరూ కాదనలేని నిండునిజం 

ఏ నదిలోనైనా స్వచ్ఛమైన నీరుంటే చాలు

ఎన్నో గొంతుకల తీరని దాహం తీరేను

ఏ మదిలోనైనా తియ్యని తలంపులుంటే చాలు 

జీవితనావ తప్పక ఆవలి తీరం చేరేను

నా కవిత చదివిన మీకు సకలశుభాలు కలిగేను


78. సూర్యునికంటే 

      ముందులెయ్ సుఖపడతావ్?

సంధ్యవేళ...

సూర్యుడు పడమటి 

కనుమలలో పని ముగించుకుని 

క్రుంగిపోతాడు కునుకు తీస్తాడు

తూర్పున మెల్లగా ఉదయిస్తాడు 


సూర్యుడే... 

ప్రపంచానికి పంచప్రాణాలు 

వెలుగు రేఖలే వేడి బాణాలు 

ఈ జీవకోటికి ప్రాణాధారాలు


ప్రభాతవేళ... 

బద్దకస్తులను మొద్దు

నిద్దురోయే కుంభకర్ణులను

తట్టిలేపి పరుగులు పెట్టిస్తాడు... 


మధ్యాహ్నంవేళ...  

భగ్గుమని మండిపోతాడు...


సాయంకాలం వేళ... 

చల్లగా ఉండిపోతాడు... 


అందుకే ఉదయాన్నే 

ఎవరైనా సూర్యుని కంటే 

ముందులేస్తే సుఖపడతారు...


ఉదయించే 

సూర్యునిలాగే

వృద్ధి చెందుతారు... 

పుష్టికరమైన ఆహారం 

పుచ్చుకున్న వారంతా 

షష్టిపూర్తి చేసుకుంటారు...


కానీ... 

పగలంతా 

కుంభకర్ణుల్లా

గురకలు పెట్టినిదురోయి

చీకటిపడు వేళ లేచి వెలుగుకోసం 

వెతికేవాళ్ళంతా వెర్రివాళ్ళే... 

వారి చుట్టూ కమ్మేది చిమ్మచీకట్లే...

వారికన్నీ చింతలే...చిక్కులే...చికాకులే...

నా కవిత చదివిన మీకు శుభం కలిగేనులే...


79. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి 

      శ్రీమతి ద్రౌపది ముర్ము 

మొన్న...అట్టడుగున 

ఊరికి చిట్టచివరన ఉన్న


నిన్న...విద్యకు... 

విజ్ఞానానికి...ఆర్థిక వనరులకు...

ఆయుధాలకు...ఆమడదూరంలో ఉన్న 


నేడు...

పూరిగుడిసెల్లో పుట్టి...

ఆకలికి అలమటించి...

స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం... 

సంఘంలో సమానత్వం కోసం...

చేజారిన పౌరహక్కుల పరిరక్షణ కోసం... 

ఆత్మగౌరవం కోసం పోరాడిన...పరితపించిన


ఈ కొండ జాతి మనుషులు... 

ఈ భరతమాత ముద్దుబిడ్డలు... 

ఈ దగాబడ్డ దళితజాతి మేధావులైన

శ్రీ కె. ఆర్ నారాయణన్ గారు 

10వ రాష్ట్రపతిగా... 

శ్రీ రామ్ నాద్ కోవింద్ గారు 

14వ రాష్ట్రపతిగా... 

శ్రీమతి ద్రౌపది ముర్ము గారు

15వ రాష్ట్రపతిగా...

నా భారతదేశ అత్యున్నత 

అధికారపీఠాన్ని అధిరోహించినందుకు...


సాహసోపేతమైన

ఈ రాజకీయ నిర్ణయాన్ని

హర్షించాలా...? విమర్శించాలా....?

హర్షించి తీరాలి

కలనైనా ఊహించని 

ఈ సువర్ణావకాశానికి... 

అభినందించాలా...?అనుమానించాలా...?

అభినందించి తీరాలి...కారణం


ఒకనాడు 

అమరజీవి అంబేద్కర్

కలగన్నది...కలవరించింది

చివరిశ్వాస వరకు పోరాడింది...

అట్టడుగున ఉన్న ఈ జాతి 

ఈ అభ్యున్నతి కోసమే... 

ఈ ఆత్మ గౌరవం కోసమే...

ఈ అధికార పీఠం కోసమే... 

ఈ అత్యున్నత హోదా కోసమే... 


అందుకే ఎంతో ముందుచూపుతో

ఓ నా భారతమాత ముద్దుబిడ్డలారా !

మీ ఆరాటం... 

మీ పోరాటం...

మీ ఆశయం...

మీ ఆలోచనలు...

అన్నీ ఆకాశం వైపే...

తూర్పున ఉదయించే 

ఆ సూర్యోదయం కోసమే...

చీకటిలో చితికిన మీ బ్రతుకులు 

వెలుగుమయం కావడం కోసమే...అన్న

ఆ స్పూర్తి ప్రదాత...భారత రాజ్యాంగ నిర్మాత 

అమరజీవి అంబేద్కర్ ని సదా స్మరించుకొంటూ...


నేడు 15 రాష్ట్రపతిగా పదవిని అలంకరించిన 

శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి...హార్దిక శుభాకాంక్షలతో....


80. సమాజంలో మార్పు రావాలంటే...

సమాజంలో మార్పు రావాలంటే...

బలహీనులకు ధైర్యం నూరిపోయాలి

అజ్ఞానులను చైతన్యవంతం చెయ్యాలి

నిరుపేదలకు,కూలీలకు, కష్టజీవులకు

శ్రమదోపిడీని గురించి అవగాహన కలిగించాలి


సమాజంలో మార్పు రావాలంటే...

ముందు మధ్యతరగతి వారిలో మార్పు రావాలి

వారెంతటి శక్తిస్వరూపులో వారికి తెలియజేయాలి

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడరాదు

నమ్మితే నరకమని,స్వశక్తియే 

స్వర్గమని తెలియాలి


సమాజంలో మార్పు రావాలంటే...

ధనవంతులందరూ ఆస్తి అంతస్తుల 

మీద ఆసక్తి ఉన్నా

నాదినాది అనుకున్నదేదీ నీదికాదన్న నిజంతెసుకోవాలి 

దయాగుణం, సేవాగుణం,మంచితనం, మానవత్వం,  దాతృత్వంమచ్చలేని స్వేచ్ఛమైన వ్యక్తిత్వం  కలిగివుండాలి


సమాజంలో మార్పు రావాలంటే...

కులాలు,మతాలంటూ కుమ్ములాటలుండరాదు

ప్రజలను,ప్రభుత్వాలు

ఓట్లకోసమే వాడుకోరాదు

ప్రజా సంక్షేమమే పునాదిగా 

సుపరిపాలన సాగాలి

ప్రజలందరు సమానత్వం 

సౌభ్రాతృత్వంతో మెలగాలి


81. పిచ్చి...పిచ్చి...పిచ్చి...

ఆన్లైన్ లో 

గేములు ఆడడం

....ఒక పిచ్చి...ఆపండి...


యూట్యూబ్ లో 

వీడియోలు చూడడం

....ఒక వ్యసనం...ఆపండి...


సెల్లులో మిత్రులతో 

24/7 మాట్లాడడం

....ఒక బలహీనత...ఆపండి...


కానీ నిత్యం కోవెలలో

ఆ పరమాత్ముని దర్శించి...


ఆపదలో ఉన్నాం

....తక్షణమే ఆదుకోమని...


కష్టాలు భరించలేకున్నాం

....కాస్త కరుణించమని...


చితికిపోయిన మా బ్రతుకుల్ని

....చిగురింపచేయమని...


సమస్యల సుడిగుండం నుండి

....మమ్ము తప్పించమని...


చీకటిలో చిక్కుకుపోయాం

....మా జీవితాలను వెలిగించమని...


రోగాలు రొస్టులులేని... 

కలతలు కన్నీళ్ళు రాని...

....రోజులను మాకు ప్రసాదించమని...


శిరసు వంచి...

చేతులు జోడించి... 

ఆశతో అర్థించడం...

కన్నీటితో ప్రార్థించడం...

...వేదనతో....వేడుకోవడం...

...ఒక పిచ్చి...అది మాత్రం ఆపకండి...


82 ."కొంటెకోర్కె"...!!!


పెళ్ళంటే... 

కలలు కనడం కాదు

తల్లెంటె... 

పిల్లలను కనడం కాదు 


ప్రకృతి పెదవులమీద

మా ప్రేమ పరిమళిస్తుంది


సముద్రపు అలలను గాంచి

మా సంసారం సంబరపడుతుంది


అనురాగ గీతాలను ఆలపించిన 

నా గాత్రాన్ని వేణుగానం వెక్కరిస్తుంది 


ముక్కోటి దేవతలకు మొక్కినా

మా "కొంటెకోర్కె" ఒక్కటి  కొండెక్కకుంది


మూడుముళ్లు పడి...

ఏడడుగులు నడిచిన...

మేము జనజన్మలకు...జతగా

ఉండాలన్నదే మా దంపతుల "కొంటె కోరిక"...


83. కార్యసిద్ధికి మూడుమెట్లు?

అడుగుడి 

మీ కియ్యబడును...

వెదకుడి మీకు దొరకును...

తట్టుడి మీకు తీయబడును...

అన్నది బైబిల్ శుభసందేశం...


ఔను నిజమే

భయపడకుండా

సిగ్గు లజ్జ లేకుండా

ఆలస్యం చేయకుండా

అనుమానపడకుండా

మెహమాటమే లేకుండా


అడిగే...

ప్రతివానికి 

అప్పు దొరుకుతుంది

ఆశ కోరిక ఆకలి

అవసరం తప్పక తీరుతుంది


కొంత ఓపికతో

ఓర్పుతో నేర్పుతో 

గట్టి నమ్మకంతో

వెదికే...

ప్రతివానికి

ఎక్కడో దాచిన

ఎవరికీ దొరకని

తరతరాలకు తరగని

కలలోనైనా ఊహించని

గుప్తనిధి ఒకటి దొరుకుతుంది

చేసే ప్రతిప్రయత్నం తప్పక ఫలిస్తుంది


పగలు రేయి 

నిద్ర మేల్కొని

పదేపదే అదేపనిగా     

తలుపును "తడుతూ" వుంటే 

సహనంతో "కొడుతూ" వుంటే"

అది తప్పక తెరుచుకుంటుంది


ఆపై మనస్పూర్తిగా ఆహ్వానం పలికితే

తడబడుతూ లోపలికి అడుగు పెడితే 

ఎంతటి అద్భుతమైన అపూర్వమైన

ఆతిథ్యం దొరుకుతుందో ఎవరికెవరు ?


ఏ పనినైనా...ఏ గుప్తనిధినైనా... 

ఏ ఆతిథ్యమైనా...మరే వరమైనా... 

ప్రయత్నమే మనిషిది...

ఫలితం మాత్రం ఆ పరమాత్మది..


84. జీవించాలి...ఇలా...చిరంజీవిగా...

క్షణక్షణం

ప్రతిక్షణం

నిద్రలో సైతం

నిఘా పెట్టి వుంచాలి...

ముంచుకు వచ్చే

మొండి రోగాల్ని...

మరీ ముఖ్యంగా

గుట్టుచప్పుడు కాకుండా

వచ్చే గుండె జబ్బుల్ని...


ఖర్చు పెడుతూ వుండాలి...

కొంచెం కొంచెం

కాస్త తెలివితో...

కాసింత ధైర్యంతో...

కష్టపడి చెమటోడ్చి

ఆర్జించిన ఆస్తిపాస్తుల్ని...


అడిగి తెలుసుకోవాలి...

అనుభగ్నుల్ని...

అన్వేషిస్తూ వుండాలి...

ఆరోగ్యాన్ని...

ఆదాయాన్ని...

ఆయుస్సును...

పెంచే మంచి మార్గాల్ని...


చేయాలి...

ప్రతినిత్యం

పారాయణం

బైబిల్ భగవద్గీత భారత

భాగవత రామాయణాది

ఆథ్యాత్మిక గ్రంథాల్ని....


తీర్చాలి...అనాధల ఆకలిని...

గడపాలి...కాలం పరులసేవలో...

ఆకాంక్షించాలి...అందరి క్షేమాన్ని...


అనునిత్యం 

ఆ పరమాత్మను 

అర్థించాలి...ఆశతో... 

ప్రార్థించాలి...భక్తితో...

బ్రతకాలి...భయంతో... 


అస్తమించాలి...మంచి ఆరోగ్యంతో...

ఆనందంతో...తృప్తితో...ఆత్మతృప్తితో...

మిగలాలి...చిరంజీవిగా...చరిత్రపుటల్లో...


85. ఈ నూతన జీవితం 

      ఆయనకే అంకితం.....

ఇది 

ఆ కరుణామయుడైన

ఆ దయామయుడైన

ఆ ప్రేమమూర్తియైన

ఆ అఖండ శక్తిస్వరూపుడైన

ఆ దేవదేవుడు 

కలలో సైతం ఎవ్వరూ ఎన్నడూ

ఊహించని రీతిగా

ఒక గొప్ప వరంగా...

ఒక అద్భుత కానుకగా...

ప్రేమతో అందించిన 

ఈ నూతన గుండెను...

ఈ నూతన జీవితాన్ని...

ఊహించని ఈ పునర్జన్మను... 

ఆయనకే ఆయన ఆలోచనలు 

అమలు పరచులాగున

ఆయన ఆజ్ఞలకులోబడి

ఆయన తలంపులకు 

అనుగుణంగా

అడుగులు వేస్తూ...

ఆయన ఆజ్ఞాపించిన కార్యాలను

నిర్విఘ్నంగా నిర్వహిస్తూ...

ఏమూలనుండో నక్కినక్కి

ఆకస్మికంగా, హఠాత్తుగా వచ్చే

ఆ మృత్యుదేవత అడుగుల సవ్వడిని

అనుక్షణం గమనిస్తూ...

అతి జాగ్రత్తగా అతి సున్నితంగా 

ఈ గుండెను కాపాడుకుంటూ

క్షణక్షణం ఒక యుగంలా

దినదినం ఒక గండంలా కాక

ప్రతిదినం ఆనందంగా...

పరమానందంగా...

ఆ పరమాత్మే ఆధారంగా...

ఘనంగా ఈ బ్రతుకును గడపాలి...

అనుక్షణం ప్రశాంతంగా బ్రతకాలి...


86. ఆ మత్తులో...ఆ మైకంలో... 

      ఆ భ్రమలో....ఆ భ్రాంతిలో... 

తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు

మంచి మనసు మలినమైపోయి

తెలియక ఇచ్చిన చనువు ముదిరి 

ముదిరి అతి చనువుగా మారినప్పుడు 

ఆ అతిచనువు అక్రమసంబంధమైనప్పుడు

అప్పుడే పుడుతుంది ఎవరికైనా 

కుండలోని కూడు తినాలన్న కుతూహలం

ఆపై ఇక మనకు తెలియదు...

మనం ఏదో మత్తులో...

ఏదో మాయలో...ఏదో మైకంలో...

ఏదో భ్రమలో...ఏదో భ్రాంతిలో ఉన్నామని...


అందుకే మనకు తెలియదు 

మన భర్త ముందస్తు హెచ్చరికలను 

మనం సైతం ఖాతరు చేయడంలేదని...

పైగా బాధపడుతున్నామని...

తప్పటడుగులు వేస్తున్నామని...

తప్పుగా అర్థం చేసుకుంటున్నామని...


ఏదో భ్రాంతిలో... 

ఉన్న మనకు ‌తెలియదు...

మన కాపురానికి మనమే చిచ్చు పెట్టుకుంటున్నామని... 

మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నామని...


ఏదో మాయలో... 

పడిపోయిన మనకు ‌తెలియదు...

మరోవ్యక్తి వల్ల మనకు 

తీరనిముప్పు వాటిల్లుతుందని...


ఏదో మైకంలో...

ఉన్న మనకు ‌తెలియదు...

మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకుంటున్నామని...


ఏదో మత్తులో...

ఉన్న మనకు ‌తెలియదు...

మన పరువును మనమే గంగలో కలుపుకుంటున్నామని...


ఏదో భ్రమలో... బ్రతికే మనకు ‌తెలియదు...మనం నలుగురిలో దారుణంగా నవ్వులపాలైపోతున్నామని...


87. చిరునవ్వులు...చిరుతపులులు....

చంటి పిల్లల వంటి 

చల్లని మంచి మనసున్న 

పశువుల డాక్టర్ దిశను

అక్కా అంటూ పలకరించి

నక్కల్లా నటించి,నవ్వి,నమ్మించి

చిత్రహింసలకు గురిచేసి చంపిన 

ఆ నీచ,నికృష్ట మనస్తత్వం కలిగిన 

రాక్షసులు మనచుట్టు ఇంకెంతమంది  

ముసుగుకప్పుకొని తిరుగుతున్నారోఏమో

జరా జాగ్రత్త....చెల్లీ...నా బంగారు తల్లీ...


ఇంటి నుండి బయలు దేరినప్పటినుండి

ఏదో వూహించని అఘాయిత్యానికి 

పాల్పడేఅపరిచితులు అడుగడుగున 

దాగి వుండవచ్చు


తక్కువ చార్జీతో ఆటో 

ఎక్కించుకు పోయే "ఆటోవాడిలో"

మాటిమాటికీ కేబిన్ కి రమమ్మంటూ

దొంగచూపులు చూసే "బాస్ లో"...

అడగకపోయినా లిఫ్టులిస్తూ

తాకాలని చిన్నచిన్న గిఫ్టులిస్తూ 

తాకి తన్మయత్వం చెందే "పక్కింటివాడిలో"...

ఏదో దురాలోచనతో పార్టీకో

పార్క్ కో రమ్మనే "బోయ్ ఫ్రెండులో"

ఏ అపరిచితుడు దాగివున్నాడో...ఎవరికెరుక ?


అందుకే వీరి బారిన పడకుండా

తప్పించుకోవాలంటే నీకు శక్తినిచ్చే

ఏదో ఒకరి స్మరణ...

ఏదో ఒక ఉపాయం...

ఏదో ఒక గొప్ప వాక్యం నీకు కావాలి

ఏదో ఒక దేవత నిన్ను ఆవహించాలి

అఖండ శక్తి నీలోకి ప్రవహించాలి

నీవు నిర్భయంగా వుండాలి 

నీవు నిప్పులా భగ్గునమండాలి

నిన్ను తాకిన వారు మాడి మసైపోవాలి


అందుకే ఓ అమాయకపు చెల్లీ ...

నీవు తప్పుచేయబోయే లేదా 

తప్పించుకోలేకపోయే ఆ బలహీనమైన 

క్షణాల నుండి నీవు బయటపడాలంటే

వీరిలో ఏ ఒక్కరినైనా నీవు గుర్తుచేసుకోవాలి


నీ గురువునో... 

నీ ఇష్టదైవాన్నో...

నీ అమ్మానాన్నలనో...

తప్పుచేయని ఆ సీతమ్మతల్లినో...

ఏ బైబిల్, భగవద్గీత, ఖురాన్ లోని 

ఏదైనా ఒక బంగారు వాక్యాన్నో...

ఒక్కసారి గుర్తుచేసుకుంటే చాలు 

పెద్ధగండం నుండి నీవు గట్టెక్కినట్లే, లేదంటే 


నీ శీలాన్ని చీల్చే చిరుతపులులకు నీవు చిక్కినట్లే...

నిస్సహాయురాలవై నిప్పులకొలిమిలోకి నీవు దూకినట్లే...

నీ పరువు పంచప్రాణాలు అనంతవాయువుల్లో కలిసినట్లే...

మరునాడు నీ కన్నీటిగాథ టీవీ చానల్లలో మారుమ్రోగినట్లే..


88. వీధిలో నా విగ్రహం విలపిస్తుంది

భక్తులందరికీ భగవంతుడు 

ఏదో ఒక గర్భగుడిలో విగ్రహమై 

దర్శనమిస్తాడు కోర్కెలు తీరుస్తాడు, కానీ 

బడుగు బలహీనవర్గాల బహుజనులకు

ఆరాధ్యదైవమైన అమరజీవి అంబేద్కర్ 

వీధిలో విగ్రహమై నిత్యం స్ఫూర్తిని నింపుతాడు 


మొన్న కోనసీమజిల్లాకు 

నా పేరును పెట్టినందుకు నేను ఆనందించలేదు 

కారణం నేను విశ్వ నరుడను...

ఖండాంతర ఖ్యాతినార్జించిన అపర మేధావిని...


కానీ నిన్న ఏలూరు జిల్లాలో ముదినేపల్లి మండలంలో కైకలూరు నియోజకవర్గంలో చిగురుపేట పంచాయతీలో నరసన్న పల్లె గ్రామంలో జరిగిన నా విగ్రహ విద్వంసానికి 

నా మనసు విలవిలలాడింది కారణం....


ఎన్నో ఏళ్ళు నా జాతి ఆత్మగౌరవం కోసం 

నా జాతి సంక్షేమం కోసం 

సంఘంలో వారికి సమానత్వం కోసం 

స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం 

వారి బానిసబ్రతుకుల విముక్తి కోసం 

జీవితాన్నే ధారపోసిన నన్ను....


నా ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి 

నా రక్తాన్ని సిరాచుక్కలుగా మార్చి 

రాత్రింబవళ్లు శ్రమించి శ్రమించి 

నా జాతికి రాజ్యాంగ 

రక్షణ కవచాన్ని అందించిన నన్ను....

పోయిన నా జాతిజనుల హక్కులను 

కాలరాసిన కుక్కలతో ఒంటరిగా 

పోరాటం చేసి చేసి కన్ను మూసిన  నన్ను....


విజ్ఞాన జ్యోతినంటూ...

స్పూర్తి ప్రదాతనంటూ...

రాజ్యాంగ నిర్మాతనంటూ...

బహుముఖ ప్రజ్ఞాశాలినంటూ...

అణగారిన వర్గాల ఆశాకిరణమంటూ...

వీధిలో ఓ విగ్రహంగా నిలిపి 

ఏ జయంతికో...ఏ వర్ధంతికో 

నివాళులర్పిస్తున్న నా బిడ్డలే నన్ను....

నిర్దాక్షిణ్యంగా కుట్రలు పన్ని కూల్చివేశారు 

అందుకే వీధిలో నా విగ్రహం విలపిస్తూవుంది...


ఒకనాడు మనువాదులందరూ 

నా విగ్రహాన్ని "కూల్చి" వేసినా 

నా విగ్రహం పైన ఎన్నో దాడులు చేసినా 

నేను దుఃఖించలేదు...కారణం 

వారికి అతి పవిత్రగ్రంథమైన 

మనుధర్మ శాస్త్రాన్ని నేను

మీకోసం కులనిర్మూలన కోసం 

సమ సమాజ స్థాపన కోసం...

"కాల్చి" బూడిద చేశాను కాబట్టి.... 


అందుకే...

ఓ దగాపడ్డ దళితులారా !

ఓ నా భారతమాత బిడ్డలారా !

ఓ నా బహుజన బంధువులారా !

మీకు నా విశ్వసందేశం ఒక్కటే...

 

నేడు ఒక సూర్యుడు అస్తమిస్తే 

రేపు మరో మండే సూర్యుడు ఉదయిస్తాడు 

అన్నది ఎంతటి నగ్నసత్యమో... 


నిన్న ఒక అంబేద్కర్ మరణిస్తే 

రేపు కోటి అంబేద్కర్లు జన్మిస్తారన్నది...

నేడు ఒక అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైతే 

రేపు కోటి అంబేద్కర్ విగ్రహాలు 

దేశవిదేశాల్లో వెలుస్తాయన్నది అంతే సత్యం


అందుకే...

నేను నా బహుజనబిడ్డలను కోరేది ఒక్కటే 

పార్టీలపరంగా మీరు ఎంతటి బద్ధశత్రువులైనా 

మన జాతి శ్రేయస్సుకోసం ఒక్కటి కావాలి 


మీ విభేదాలు విద్వేషాలు కక్షలు కార్పణ్యాలు 

పగలు ప్రతీకారాలు పార్టీలకే పరిమితం చేయాలి 

నా చిట్టచివరి ఒకేఒక కోరికైన

బహుజన రాజ్యాధికారం కోసం 

మీరంతా సఖ్యతగా ఐక్యతగా ఉండాలి 

సమిష్టికృషితో కసితో 

నిరంతర పోరాటాలతో 

ఊపిరాడని ఉద్యమాలతో

బహుజనసామ్రాజ్యాన్ని సాధించాలి 

అప్పుడే మీరు నిజమైన అంబేద్కరిస్టులు

అప్పుడే మీ జాతిమొత్తం మిమ్మల్ని 

"అభినవ అంబేద్కర్లుగా" కీర్తిస్తుంది 

జై భీమ్....జయహో అంబేద్కర...


ఇట్లు... 

వీధిలో విగ్రహమై విలపిస్తున్న 

మీ అమరజీవి అంబేద్కర్


89. నిజజీవిత నిత్యసత్యాలు...! 

ఒక పిరికిపంద...

ప్రతిదినం ప్రతిక్షణం

చచ్చి బ్రతికేను...

వీరుడు మగధీరుడు 

ఒకేసారి మరణించేను...

శత్రువు చేతిలోనైనా 

మృత్యువు చేతిలోనైనా...


ఒక అంధుడు... 

ఏమి ఆశించడు

కానీ కామాంధుడు 

కంటికి కనిపించిన 

ప్రతి అందమైన స్ర్తీ 

పొందు కోరుకునేను...


ఒక భయస్తుడు...

తాడును చూసి 

పామనుకొని 

గజగజ వణికేను...

తనను కాటేస్తుందేమోనని

తన ప్రాణం తీస్తుందేమోనని

రాత్రింబవళ్లు 

చింతించి చింతించి 

చివరికి చితికి చేరేను...

అది పాము కాదు తాడని

తెలిసే సరికి ప్రాణమే పోయేను...


ఒక దుష్టుడైన దొంగ...

తనను ఎవరు తరమకనే

బెదురుజింకలా పరుగులు తీసేను...


ఇవే...కదా

నిజజీవిత నిత్యసత్యాలు...

అనుభవాల ఆణిముత్యాలు...


90. సుఖజీవన సూత్రం...!

మొరిగే కుక్క కరవదట...!

పెరిగే‌ మొక్క విరుగునట...!


పెళ్లైపోయిన ప్రతికన్నెపిల్ల...!

తల్లికావాలని తపించునట...!


కష్టించిన కడుపు నిండేనట...!

నవ్విన నాపచేను పండేనట...!


మెరిసేదంతా బంగారం కాదట...!

నీతితప్పిన నీడ నిప్పయ్యేనట...!


భక్తిపరుని బ్రతుకు బంగారమట...!

యుక్తిపరుని జీవితం శక్తిపీఠమట...!


వేకువతో చీకటి తెరలు చిరిగేనట...!

అతి సోమరి అప్పుల్లో మునిగేనట...!


తెలియకున్న ఈ సుఖజీవన సూత్రం...!

ఈ మనిషి జీవితం ఓ కురుక్షేత్రమేనట...! 


91. ఏడు కొండలు ఎక్కుదాం...!

ఓ సుందరీ !

నా ప్రేమ పందిరీ !!

అలా చిలిపి చూపులు చూడకే...

నాపై చిరునవ్వులు చిలకరించకే...


ఓ పంచదార చిలకా !

నా ప్రేమ మొలకా !!

నీ అందం ఆహా మకరందం...

ఎంత త్రాగినా తనివి తీరదే...


ఓ వయారీ !

మత్తెక్కించే నాట్య మయూరీ !!

నేటి మన ఈ అనురాగ బంధం...

కావాలి జన్మజన్మల అనుబంధం... 


కానీ ప్రియా నా ఓ ప్రియ !

లేదా నామీద నీకు దయ !

నాడు పార్కుపొదల్లో పుట్టిన 

మన చిట్టి పొట్టి పిచ్చిప్రేమ

మొన్న...

కోటిదేవుళ్ళకు....మ్రొక్కింది...

నిన్న......పెళ్ళి పీటలెక్కింది...

నేడు విధిచేతిలో...చిక్కింది...

విలవిలలాడిపోతోంది...ఔను 


మొన్న...

కమ్మని కలలెన్నో కన్నాం...

ఆశలెన్నో పెంచుకున్నాం...

బాసలెన్నో చేసుకున్నాం ...

మూడుముళ్లు వేసుకున్నాం...

ఏడడుగులు నడిచాం...

ఇలా జన్మజన్మలకు జతగా

ఉండాలని ఉబలాటపడ్డాం...


కానీ విధి ఎందుకో 

విషపు నవ్వు నవ్వుతోంది...

నీవక్కడ...నేనిక్కడ

ఇక మనకు మనశ్శాంతి ఎక్కడ?


ఓసీ నా ప్రేయసి !

నా ఊహల ఊర్వశీ !!

పడిపోయినా తిరిగి లేవడానికి...

విడిపోయినా మళ్ళీ కలవడానికి...

చెడిపోయినా తిరిగి బాగుపడడానికి...

ప్రతి జంట ప్రయత్నించాలి

అదే అదే సుఖజీవన సూత్రం...

అందుకే ఈ జీవితం చిత్రవిచిత్రం...


పెనవేసుకుపోయిన బంధాలను...

అనుబంధాలను...భవబంధాలను...

పెంచేది తృటిలో త్రుంచేది ఆ భగవంతుడే...

అందుకే ఏడు కొండలు ఎక్కుదాం...

సిరులొసగే ఆ శ్రీనివాసునికి మ్రొక్కుదాం...

విడివిడిగా ఉంటూ విలపించే 

ఈ ప్రేమపక్షులను ఒక గూటికి చేర్చమని...


92. మరువకు నీలక్ష్యం నిద్రలో సైతం !...

ఎవరెస్టు శిఖరం ఎక్కడం సులభం

దూకడమే అక్కడనుండి దుర్లభం

లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం సులభం

అక్కడికి చేరుకోవడమే సాహసకృత్యం


ఔను తపనంటూ వుంటే...

సాధన చేస్తే... సాహసం చేస్తే... 

ప్రయత్నిస్తే... ప్రతిబందకాల్ని దాటేస్తే... 

గట్టి పట్టుదలతో గమ్యాన్ని చేరకోవచ్చు

ఏ లక్ష్యసిధ్ధికైనా సరే ఆత్మశుద్ధి కావాలి కొంత

త్యాగం చెయ్యాలి కొత్తమార్గాలను కనిపెట్టాలి 


నేను అగ్నిని మింగేస్తాను...

నేను సముద్రాన్ని త్రాగేస్తాను.. 

నేను పర్వతాలను కదిలిస్తానంటూ...

దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని...

అడ్డంకులకు అవాంతరాలకు వెరవక... 

అకుంఠదీక్షతో అనుకున్న

గమ్యాన్ని చేరుకోవాలి.


చివరి అడుగు ఆవలితీరం వరకే ...

కొండంత వెలుగు నిచ్చేది 

గోరంతదీపమే...

చిమ్మచీకటిని చీల్చుకు వచ్చేది వేకువవెలుగే...ఆపై

విధిని ఎదురించవచ్చు 

విజయశిఖరాలను చేరవచ్చు


గురితప్పని లక్ష్యమెంతటి కష్టమైనా సంక్లిష్టమైనా

కసితో కృషితో నిరంతర సాధనతో ఛేదించుట సాధ్యమే...

లక్షలమైళ్ళదూరమైనా ప్రారంభం ఒక్కఅడుగుతోనే... 

లక్ష్యసాధనంటేనే ప్రఙ్ఞను 

ప్రదర్శించే ఓ దివ్యమైనమార్గం...


93. అతిచనువుకు...అర్థమేంటి...?

తమకు నచ్చిన 

వారిని క్షణక్షణం 

గుర్తు చేసుకోవడం...

కళ్ళకు కనపడకపోతే 

కలవరపడి‌ పోవడమే...

అతిచనువంటే...


కళ్ళకు కనిపించి

ఒక కుళ్ళుజోకు వేస్తే 

ఒళ్ళు మరిచిపోవడం...

కోతిలా పళ్ళికలించడం...

పక పకమని నవ్వడమే...

అతిచనువంటే...


కారణం 

వారేదో మాయచేశారని...

వారేదో మత్తుమందు చల్లారని... 

తమను కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నారని... 

వీరికి తెలియకపోవడమే...

అతిచనువంటే...


తాము ఇష్టపడిన 

వారిని అతిగా సమర్ధించడం...

ప్రతిదానికి వెనకేసుకు రావడం...

వారి తరుపున గట్టిగా వాదించడం...


వారి మీద ఈగ 

వాలనివ్వకపోవడం...

వారెంత చెడు చేసినా 

అది మంచేనంటూ వారికి 

వత్తాసుపలకడమే...

అతిచనువంటే...


ఎదురెదురుగా ‌నిల్చొని

ప్రక్క ప్రక్కనే కూర్చొని

వారికళ్ళల్లో కళ్ళుపెట్టి

ముఖంలో ముఖంపెట్టి

ముసిముసి నవ్వులు‌ నవ్వుకుంటూ

గంటలతరబడి సొల్లు కబుర్లు

కాకమ్మ కబుర్లు...చెప్పుకొని చెప్పుకొని

చెవులు...కొరుక్కొని కొరుక్కొని

కుళ్ళు జోకులు...వేసుకొని వేసుకొని

వీధిలో విరగబడి...నవ్వుకొని నవ్వుకొని

ఆపై నలుగురిలో 

నవ్వులపాలై పోవడమే...

అతిచనువంటే..!


ఎదుటివారి చూపు... 

ఎంత చెడుగా ఉన్నా

అది మంచిగానే...అనిపించడం

ఎదుటివారి మాట... ‌

ఎంత చేదుగా ఉన్నా

అది తేనెలా తియ్యగా...వినిపించడం

ఎదుటివారు చేసే పనేదైనా...

ఎంతటి నీచకార్యమైనా 

అది పరమ పవిత్రమని...భావించడం

ఏదో "మత్తుభూతం" ఆవహించి

తమకు తెలియకుండానే 

మనసంతా వారితో...నిండిపోవడం

తమకు తెలియకుండానే 

వారంటే తెగ...ఇష్టపడిపోవడం

ఎందుకో వీరిలో  కలలో సైతం 

ఊహించని కళ్ళుచెదిరే...మార్పురావడం

ఎంతో...వింతగా...విచిత్రంగా...

సరికొత్తగా ప్రవర్తించడమే...అతిచనువంటే..

ఇష్టమైనవారు 

ముఖాన ఉమ్మివేసినా

చిరునవ్వుతో 

తుడుచుకొనిపోవడమే...

పిచ్చిబట్టి 

నచ్చిన వారి వెనుక 

పిచ్చికుక్కలా తిరగడమే... 

అడగకుండానే వారికి అన్నీ ...

ఇష్టపడి ఇచ్చివేయడమే...

అతిచనువంటే..!


ఒకరినొకరు కలవపోయినా

ఫోన్లో మాట్లాడుకొని 

తృప్తిచెందడమే... 

ఒకరితో ఒకరు 

ఫోన్లో‌ మాట్లాడుకోకపోయినా

చాటుమాటుగా 

దొంగచూపులు చూసుకొని 

మానసికానందం పొందడమే...

అతిచనువంటే..!


ఎప్పుడూ 

ఏదో భ్రమలో భ్రాంతిలో బ్రతకడమే... 

మత్తని తెలియని ఏదో మాయలో 

ఏదో మైకంలో మునిగితేలడమే...

అతిచనువంటే..!


అద్దంలో 

ప్రతిబింబమల్లే

కుడిని ఎడమగా... 

ఎడమను కుడిగా...

తలంచడమే

మంచిని చెడుగా...

చెడును మంచిగా‌ భావించడమే...

అతిచనువంటే..!


(పార్టు...4)


ఇతరులంటే అతిగా ఇష్టపడడమే...

భర్తంటే భయం భక్తి లేకపోవడమే...


మానసికంగా భర్తను బాధపెట్టడమే... 

పొమ్మనకుండా మెల్లగా పొగ పెట్టడమే...

ఇష్టమైనవారిని ఇంట్లోకి సిగ్గులజ్జ లేకుండా 

విందుకు ఆహ్వానించడమే...

అతిచనువంటే


మరి అతిచనువే... 

ఏర్పడితే... ఏమౌతుంది?

తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు

అతిచనువు ముదిరితే 

అది అక్రమసంబంధమౌతుంది

అప్పుడేమౌతుంది?

అతిచనువన్నది 

ఒక మత్తుమందని

అది ఒక మాయని....

అది ఒక మైకమని

తెలియక

కన్నతల్లినైనా... 

కన్నతండ్రినైనా... 

కట్టుకున్న భర్తనైనా...

కడకు ఆ భగవంతుడినైనా....

ఎదిరించడం

ఆపై...నిప్పుల కుంపటిపై......

నిదురించడం

క్రమేపి...మనశ్శాంతి కరువై...మరణించడమే

అతిచనువంటే...


ఔను ఏదో మాయలో 

"మత్తని తెలియని"...

ఏదో  "మైకంలో " మునిగితేలే... 

ఓ మగువలారా ! జాగ్రత్త ! 

తస్మాత్ జాగ్రత్త !

మీ కళ్ళు జాగ్రత్త ? 

మీ ఒళ్ళు జాగ్రత్త ! 

మీ ఇల్లు జాగ్రత్త ! 

మీ పచ్చని కాపురం జాగ్రత్త !

అతిచనువుకు...అర్థమేంటి...??


94. నీ ఆత్మను ! ఆ పరమాత్మను నేనే!!


మేఘమై...

నేను కరుగుతాను

చినుకై...

నేను నేల రాలుతాను


విత్తనమై...

నేను మరణిస్తాను

మొక్కై... 

నేను మొలకెత్తుతాను


మొగ్గై...

నేను చిగురిస్తాను

పువ్వునై...

నేను పరిమళిస్తాను


ఆకునై...

నీకు నీడనిస్తాను

పండునై...

నీ కడుపు నింపుతాను


కట్టెనై...

కాటిలో నిన్ను కాలుస్తాను

అమ్మనై...

మళ్ళీ నీకు మరో జన్మనిస్తాను


నేనే నీ నీడను...

నేనే నీ ఊపిరిని...

నేనే నీ ఆత్మను... ‌

నేనే ఆ పరమాత్మను...


95. మూడుముళ్ల బంధానికి 30 సూత్రాలు


భార్యాభర్తల 

అనురాగ బంధం...

జన్మజన్మల అనుబంధం... 

ఆ విధి సైతం విడదీయలేని 

విచిత్ర పవిత్ర వివాహబంధం...

గురించి కొన్ని అమృత వాక్యాలు...

పూర్తిగా చదవండి... ఇవినచ్చితే...మీకు...

నచ్చిన వారికి షేర్ చేయండి...మరువకండి...


1.

నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.


2.

తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య 

నిజంగా ఓ వరమే.


3.

అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు 

కూడా హాయిగా జీవిస్తాడు.


4.

అహంకారి భార్య దొరికితే

అంబానీలు సైతం 

సన్యాసుల్లో కలవాల్సిందే.


5.

ప్రతి భర్త తన భార్యను మరో 

తల్లి రూపంగా భావిస్తే, 

ప్రతి భార్య తన భర్తను 

మొదటి బిడ్డగా పరిగణిస్తే 

అంతకన్న మధురమైన 

బంధం మరొకటి ఏముంది నా ఖ్యఖ్యఏౢ


6.

భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం. 

బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.


7.

సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకూ తోడు వీడకుండా ఉండడం.


8.

ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే 

భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.


9.

భార్యాభర్తల సంబంధం శాశ్వతం. 

కొంతమంది మధ్యలో వస్తారు. 

మధ్యలోనే పోతారు.

భార్యకి భర్త శాశ్వతం...

భర్తకు భార్య శాశ్వతం.


10.

ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే 

ప్రతి గృహిణీ గొప్ప 

విద్యావంతురాలి కిందే లెక్క!


11.

అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. 

భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.


12.

మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం.

ముసలితనంలో కూడా మనసెరిగి 

ఉండేది *"మాంగల్య బంధం"*.


13.

బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే 

క్షమించమని అడగాలి.


14.

మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.


15.

కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.


16.

నీఆలోచన నేను కాకపోయినా 

నా ప్రతిఙ్ఞాపకం నువ్వే

నీసంతోషం నేను కాకపోయినా నాచిరునవ్వు మాత్రం నువ్వే


17.

ప్రేమ అనేది చాలా విలువైనది.

దాన్ని *"వివాహం"* అనే అద్దాల 

బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.


18.

సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప 

కళాఖండం *"కుటుంబం"*


19.

గొడవ పడకుండా ఉండే 

బంధం కన్నా ఎంత గొడవ పడినా 

విడిపోకుండా ఉండే బంధం 

దొరకడం ఓ గొప్పవరం.


20.

కలిమి లేములతో..

కలసిన మనసులతో...

కలివిడిగా మసులుకో..

కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!


21.

బంధం అన్నది 

అందమైన పుస్తకం లాంటిది. 

పొరపాటు అనేది అందులో 

ఒక పేజీ మాత్రమే.


22.

ఆ ఒక్క పొరపాటు 

జరిగితే సవరించాలి 

కానీ మొత్తం పుస్తకాన్ని 

చించి వేయకూడదు.


23.

భర్తకి భార్య బలం కావాలి.

బలహీనత కాకూడదు.

భార్యకి భర్త భరోసా కావాలి

భారం కాకూడదు.

భార్యా భర్తల బంధం 

అన్యోన్యం కావాలి

అయోమయం కాకూడదు.


24.

మనసులోని ప్రేమని, 

బాధని కళ్లలో చూసి 

చెప్పకుండానే గుర్తించగలిగిన 

వ్యక్తి భాగస్వామిగా 

దొరికితే అంతకుమించిన 

అదృష్టం మరొకటి ఉండదు.


25.

అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం 

అంటే ఇంటికి వేసిన రంగులు చూసి 

ఇల్లు కొనుక్కోవడమే.


26.

ప్రతి అమ్మాయికి చదువుకున్న 

భర్త రావడం సహజం. 

కానీ తన మనసు చదివిన 

భర్త రావడం అదృష్టం.


27.

పెళ్లి అంటే ఈడూ - 

జోడూ తోడ - నీడా

కష్టం - సుఖమే కాదు...

ఇద్దరూ ఏకమై ఒక లోకమై

జన్మజన్మలకు జతగా బ్రతికే 

ఒక బంగారు అవకాశం.


28.

దైవం ఎక్కడో లేడు 

నీ ప్రక్కనే నీ భర్తలో నే ఉన్నాడు

భర్తపై ప్రేమ గౌరవం ఉంటే చాలు భగవంతునిపై భక్తి ఉన్నట్టే


దేవతా మూర్తి ఎక్కడో లేదు 

నీ ప్రక్కనే వుంది 

నీ భార్యలోనే వుంది... 

ఆమెను ప్రేమిస్తేనే గౌరవిస్తూనే 

నీకు ఆదేవతామూర్తుల 

అనుగ్రహం ఆశిస్సులు అందుతాయి


29.

చుట్టూ ఎందరున్నా 

చిట్టచివర 

భార్యకు భర్తే దిక్కు...

భర్తకు భార్యే దిక్కు...


30

ముఖాముఖి చర్చలే...

మనస్పర్థలకు మందులు

అలౌకికం ఎరుగని ఆలూ 

మగలిద్దరూ అంధులు


ఈ 30సూత్రాలను కష్టపడి ఓపికతో 

చదివిన కాబోయే నవవధూవరులకు...

భారమైన సంసారాన్ని కలిసి 

మోస్తున్న భార్యాభర్తలకు

మునిగిపోయే పడవ‌లో 

పయణించే వృద్ద దంపతులకు

వందనం అభివందనం 

కావాలి మీ జీవితం నందనవనం 





















 







































Comments