విషయ సూచిక.....108 కవితలు
1. బడిగంటలు మ్రోగిన వేళ...
2. సుఖమయ జీవితానికి...
(18 అయ్యప్ప మెట్లు)
3. గురువులకు వందనం !
పాదాభివందనం !!
4. జై పాతాళభైరవి ! (హాస్య కవిత)
5. అన్న పోలన్న సుమధుర సుభాషితం !
విన్న చాలు జీవితం సువర్ణ శోభితం !!
6. సూర్యసందేశం
7. మీరు వీరులే ! రాజ్యాన్ని ఏలే రాజులే !
8. మూడు కేకలు... మూడు లేఖలు
9. ఉడుతలు కాదు...ఊసరవెళ్ళులు...
10. నడిరోడ్డులో నరమేధం ?
11. తాలిబాన్లా ? త్రాచుపాములా?
12. రాక్షసులే రాజులైతే....
13. ఏది నిజమైన సంక్రాంతి ?
14. చెప్పలేము... మినీ కవిత
15. నిన్నటి తేనె...నేడు విషం ?
16. ఓర్పు నశించిన ఓటరు ...
17. కరోనా సుభాషితాలు- కాంతి కిరణాలు-
18. ఇంట్లోకూర్చుంటే... ఏంటి లాభం?
19. కోపం కొరివిదెయ్యమైతే ?
20. ఓ అందమా నీవెక్కడ ?
21. ఓ సౌందర్యమా నీవెక్కడ ?
22. దైవమా ! దారిచూపుమా !!
23. ప్రతిభకే పట్టాభిషేకం...
24. బ్రతుకు జట్కాబండి...
25. కార్గిల్ వీరులకు కన్నీటి వీడ్కోలు....
26. మన మాటలే మనకు ఉరి సిరి ఊపిరి
27. అఖండ విజయం
28. అణుబాంబు కన్న
ఆత్మవిశ్వాసమే మిన్న
29. పోలన్న కవి సుభాషితాలు...
30. అఖండ విజయం
31. అణుబాంబు కన్న
ఆత్మవిశ్వాసమే మిన్న
32. స్నేహబంధం
33. మననోటి మాటలు
34. ఓ కవీ ఏమిటి నీకర్తవ్యం ?
35. సమస్య ఏదైనాఎదురీదు
36. సహనమే సంపద...
37. జై బోలో జై బోలో!
గిడుగు తాతకు జైబోలో!!
38. ఓ తెలుగు భారతీ!
మీకు ప్రణామం ..ప్రణామం...
39. విలువ ఎరిగినవారే విజ్ఞులు
40.ఎవరితరం కాదు
41. వద్దువద్దు...ముద్దుముద్దు
42. పోలన్న కవి సూక్తి సుధలు
43. నిద్రలో సైతం నీలక్ష్యాన్ని మరువకు!
44. గతం...ఒక పెనుభూతం ?
45. సాహసమే ఊపిరైతే
సమస్తం సాధ్యమే !
46. స్పందించు స్నేహహస్త మందించు
47. కాలంచేసే ఇంద్రజాలం...
48. పెళ్లినాటి ప్రమాణం....
49. ప్రతిమనిషి పరమాత్మ స్వరూపమే
50. పోరాడితేపోయేదేముంది చెప్పండి?
51. పోలన్న కవి సూక్తి సుధలు
52. నిండునూరేళ్ళు...(ని అక్షరంతో కవిత)
53. ఆశతో అర్థించా.!..భక్తితో ప్రార్థించా !
54. ముందుజన్మలో ముక్తి
55. వచ్చేసింది టీకా - పిసికేస్తాం నీ పీక...
56. నా భారతనారి...అంటే ?
57. కాదు కాదు ఆ కొంగ...
నీవే నిజమైన దొంగ
58. ఆర్జిస్తే ఆస్తి - నిద్ర నాస్తి
59. నీకు నాకేం తెలుసు...
నిమ్మకాయ పులుసు !!
60. కరోనా ముప్పు తప్ప...
ఈ పదిసూత్రాలు పాటీస్తే..
61. ఇది కలకాదు పచ్చినిజం...???
62. ఏలనోయ్ నీ కింత ఆశ
63. సంస్కారం! సాస్టాంగ నమస్కారం!!
64. అక్కకాదు తులసిమొక్క
65. పోలన్న కవి సూక్తి సుధ!
66. విజయానికి దారులెన్నో ...
67. మూర్ఖులు - ముసలి లక్షణాలు!
68. చక్కని సంసార సందేశం !
69. పోలన్నకవి సూక్తి సుధామృతం
70. విజయం - అపజయం
71. నడిసంద్రంలో నావ
72. ప్రేమిస్తే పచ్చదనమే !!
73. నేడే తెలిసింది ఓనిండునిజం ...
74. అడుగు... వెతుకు...తట్టు...
75. రక్షా బంధన్ ...రక్త సంబంధం
76. చింతకాయ...ఎంతమాయ...
77. కామాంధులుంటారు కాస్త జాగ్రత్త!
78. ఎవరితరం కాదు
79. నీళ్ళు నిద్రపోతాయి...
80. మృత్యువు ముందే మూడుముళ్ళు
(మ అక్షరంతో భావకవిత)
82. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు...
83. ఆఫ్గనిస్తానా? ...అగ్నిగుండమా?
84. మై ఫ్రెండ్లీ ఎనిమీస్
85. ఉంటే - ఉంటే - ఉంటే?
86. పురోభివృద్ధికి పునాదిరాళ్ళు
87. గుణపాఠాలే మన గురువులు
88. మూగజీవులను ప్రేమిద్దాం...
89. మందులా ? కాదు...
మానవత్వమే కొరత
90. నిన్న లేని కొత్తదారి
91. ముందు పోల్చుకో !
తరువాత తేల్చుకో!!
92. రోగాలు లేని రాని రోజు ?
93. మంచితరుణం మించిపోతే???
94. పరమాత్మమెచ్చిన"పచ్చని కాపురం"
95. వన్ సైడ్ లవ్" అంటే???
96. రెండు సార్లు ......
97. సలహాలు వారివి నిర్ణయాలు మనవి
98. చూడకు ఎవరినీ చులకనగా....
99. విధిఆడే వింతనాటకం
100. ఒద్దురా వొద్దురా !
వెలిగితేనెే ముద్దురా!!
101. నమ్మకు నమ్మకు నమ్మితే నరకమే!
102. ఒక చిన్న కండీషన్ ఏమిటది?
103. ప్రేమిస్తే పచ్చదనమే
104. ఎవరు వారు ?
వారే మన వీరజవాన్లు
105. "నవసమాజ నిర్మాణం"
106. ఓ నవదంపతులారా !
107. ఏమీటో ఈ సృష్టిరహస్యం?
108. రెండు వైపులా...
రెండువందల గ్రాములే ?
1. బడిగంటలు మ్రోగిన వేళ...
అందరి హృదయాలలో ఆనంద హేల...
అందుకే గురువులారా ! గుర్తుంచుకోండి!
మీ చేతుల్లో...
బుక్సున్నాయి బోధించేందుకు...
బెత్తాలున్నాయి శిక్షించేందుకు...
మీ చేతిలో...
మట్టి ముద్దలు సిద్దంగా ఉన్నాయి...
కావడిలో కుండలుగా మారేందుకు...
మీ చేతిలో...
చిరుదివ్వెలున్నాయి చిమ్మ చీకటిని...
చీల్చి వెలుగులను విరజిమ్మేందుకు...
మీ చేతుల్లో...
ఉలులున్నాయి ఎన్నో శిలలున్నాయి...
సుందరమైన శిల్పాలను చెక్కేందుకు...
మీ చేతుల్లో...
ఎదిగే అమాయకపు పిల్లల బంగారు...
భవిష్యత్తులున్నాయి తీర్చిదిద్దేందుకు...
మీ చేతుల్లో...
విరిసీవిరవని మొగ్గలున్నాయి గుబాళించే...
పూలున్నాయి పూజకు సమర్పించేందుకు...
గురువులారా!గుర్తుంచుకోండి !
మీరే వారికి మార్గ నిర్దేశకులు...
మీరే వారికి కనిపించే దైవాలు...
మీరే వారికి కనని అమ్మానాన్నలు...
గురువులారా! గుర్తుంచుకోండి!!
మీ విద్యార్థుల్ని,
వీరులుగా శూరులుగా
రాళ్ళలో రత్నాలుగా,
మట్టిలో మాణిక్యాలుగా
భావిభారత పౌరులుగా,
భరతమాత ముద్దుబిడ్డలుగా
తీర్చిదిద్దే బాధ్యత మీదే,
తీరని మీ గురువుల ఋణం
తల్లిదండ్రులఋణం తీర్చుకునే
బాధ్యత విద్యార్ధులదే
2.సుఖమయ జీవితానికి...
(18 అయ్యప్ప మెట్లు)
1) రాత్రి 10 గంటలకు "పడక" తెల్లవారుజామున
4 గంటలకు "నడక" సూత్రాన్ని తు.చ.తప్పక పాటించడం
2) నిద్ర మేల్కొన్న తర్వాత,
లేచి మంచం పైనే
కూర్చుని చిన్న ప్రార్థన చేసుకోవడం
3) క్రమం తప్పకుండా ప్రతిరోజూ
వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం
4) ఉదయం 5 గంటలలోపు కాలకృత్యాలన్నీ
తీర్చుకోవడం స్నానం చేయడం
5) సూర్యోదయానికి ముందే ప్రతిరోజు
పూజా కార్యక్రమాలను పూర్తి చేయడం
6) టీవీ చూడకుండా & ప్రశాంతంగా
అల్పాహారం భోజనం తీసుకోవడం
7) 24 గంటలు మంచి ప్రవర్తనను కొనసాగించడం
అందరినీ పలకరించడం మర్యాదగా మాట్లాడం
8) whatsapp, face book లకు
వీలైనంత తక్కువ సమయం కేటాయించడం
9) సొంత భార్యను పిల్లలను ప్రేమించడం వారితో కలిసి తినడం తిరగడం మాట్లాడడం ఆనందంగా గడపడం
10) తల్లిదండ్రులను గౌరవించడం &
వారిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రేమగా పలకరించడం
11) అతిథులను ఆదరించడం గౌరవించడం
12) పేదవారికి చేయగలిగినంత సహాయం చేయడం
13) ఇతరులను బాధపెట్టకుండా ఉండడం
14) ఇతరులను మోసం చేయకుండా ఉండడం
15) మన కష్టాలు ఎన్నైనా ఏమైనా సరే
దేవునిపై గట్టి విశ్వాసం కలిగిఉండడం
16) ఇతరులకు బోధించే ముందు, మనం అనుసరించడం
17) ఎవరిమీద కోపం కసి కక్ష పగా ప్రతీకారం.అసూయ ద్వేషాలు ఆందోళన లేకుండా ప్రశాంతచిత్తంతో నవ్వుతూ నవ్విస్తూ బ్రతకడం
18) బైబిల్ భగవద్గీత ఖురాన్ భారత భాగవత
రామాయణ తదితర ఆధ్యాత్మిక గ్రంధాలను ప్రతినిత్యం పఠించడం, నేర్చుకున్న జ్ఞానాన్ని ,ఆర్జించిన ధనాన్ని పదిమందికి పంచడం,అనుభవించడం ఆత్మతృప్తితో
ఆ పరమాత్మను చేరడం....ఇదే ఈ జీవితానికి అర్థం పరమార్థమని తెలుసుకోవడం...
3. గురువులకు వందనం ! పాదాభివందనం !!
అజ్ఞానపు శిధిలావస్థలో నున్న శిలలను
అందమైన సుందర శిల్పాలుగా చెక్కే
అక్షర శిల్పులే "అమరశిల్పి జక్కన్నలే"...గురువులంటే !
సమాజంలో సమస్యల సుడిగుండంలో
చిక్కుకున్ననాడు సకాలంలో స్పందించే
అభయహస్తాలనందించే "ఆప్తమిత్రులే"...గురువులంటే !
అజ్ఞానాంధకారంలో బంధీలైననాడు
ఆపదలో ఆదుకునే "ఆపద్బాంధవులే"...గురువులంటే !
జన్మనిచ్చిన అమ్మ పాలిస్తే నాన్న లాలిస్తే
బ్రహ్మ వ్రాసిన తలరాతల్ని మార్చి అందమైన
బ్రతుకు పుస్తకాన్ని అందించే
అపర బ్రహ్మలే..."ఆకాశ దీపాలే"...గురువులంటే !
అక్షరాల తోటల్లో తిప్పే అభివృద్ధి బాటల్లో నడిపే
ఆశాజ్యోతులే... "ఆదర్శమూర్తులే"...గురువులంటే !
ఉజ్వల భవిష్యత్తును ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని
ఉత్కృష్టమైన జీవితాన్ని ప్రసాదించే
ప్రత్యక్షదైవాలే "కననిఅమ్మానాన్నలే"...గురువులంటే !
అట్టి గురుదేవుళ్ళకు కవితా కుసుమాలనర్పించి
గుండెల్లో గుడికట్టి గురుదేవుళ్ళను పూజిద్దాం!
పవిత్రమైన వారి పాదాలకు పాలాభిషేకం చేద్దాం !
అందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలందజేద్దాం !
4.జై పాతాళభైరవి ! (హాస్య కవిత)
జై పాతాళభైరవి !
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! నేను అప్పుల్లో మునిగిపోయా...
"మోకాళ్ళోతుకు" కూరుకుపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా! ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! నేను త్రాగుడుకు బానిసనైపోయా...
"నడుముల్లోతుకు" మునిగిపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! మళ్ళీ ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! నేను డ్రగ్స్ కు బానిసనైపోయా...
"భుజాలవరకు" మునిగిపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లీ ! ప్రేమపిచ్చి పట్టి నేను
"పీకల్లోతుకు" మునిగిపోయా...
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! ఏమిరా నీ కోరిక ?
తల్లి నేను నెట్టులో
"జుట్ఠు"దాకా కూరుకుపోయా
భయపడకురా !
ఢింభకా ! బయట పడవచ్చునురా !
జై పాతాళభైరవి !
బాలకా ! మళ్ళీ ఏమిరా నీ కోరిక ?
తల్లి నేను నిద్రాహారాలుమాని
వాట్సాప్ ఫేస్ బుక్కుల్లో
ఎరక్కపోయి ఇరుక్కుపోయా !
లైకులంటూ కామెంట్లంటూ కలవరిస్తున్నా
ఔరా బాలకా ! బానిసలైతే సెల్లుకు...
బ్రతుకు భారమేరా ! ఘోరమేరా !
దుర్భరమేరా ! దుఃఖభరితమేరా !
అందుకే ఓ బాలకా !
తెలుసుకోరా ! ఓ నిండునిజం !
"వాట్సాప్
అంటే ఒక ఊబిరా !
జారిపోతే అందులోకి
జాతకాలే మారిపోవురా !
తలరాతలే తారుమారౌనురా !
ఫేస్ బుక్ కాలాన్ని హరించే ఓ కార్చిచ్చురా !
అందుకే ఓ బాలకా !
తెలుసుకోరా ! ఓ నిండునిజం !
సెల్లుమాయలో పడిపౌవద్దురా!
బానిసలై సెల్లుకు బలైపోవద్దురా!
మీ గొయ్యిని మీరే తవ్వుకోవద్దురా!
మీ కంటిని మీరే పొడుచుకోవద్దురా!
మీ ఇంటికి మీరే నిప్పు పెట్టుకోవద్దురా!
మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కోవద్ధురా!
అందుకేరా ఓ బాలకా !
జాగ్రత్త ...తస్మాత్ జాగ్రత్త!
మీ సెల్లు జాగ్రత్త ! మీ కళ్ళు జాగ్రత్త !
మీ ఒళ్ళు జాగ్రత్త!
5.అన్న పోలన్న సుమధుర సుభాషితం !
విన్న చాలు జీవితం సువర్ణ శోభితం !!
ఎప్పుడూ ఆనందంగానే వుండండి !
అనవసరంగా ఆందోళన చెందకండి!
నిదానమే ప్రధానం అన్నది నిన్నటి మాట!
ఈకంప్యూటర్ యుగంలో వేగమే ప్రధానం!
ఒకింట పేదవాడిగా పుట్టడం తప్పు కాదు!
కానీపేదవాడిగా మరణించడమే పెద్దనేరం!
చిరునవ్వులే చీకటిలో వెలిగే చిరుదీపాలు!
కోపతాపాలే తీరనిశాపాలు నరకకూపాలు!
ప్రతినిత్యం మరువకు సత్యమునే బోధించు!
నటించకు నిన్నునమ్మినవారిని నట్టేటముంచకు!
పురోభివృద్ధికే నీ ఆలోచనలు పునాది కావాలి!
సమయాన్ని సత్సంకల్పాలను సమాధిచేయకు!
ఏనాడైనా ఎవరిని కూడా భయపెట్టకు బాధించకు!
ఎవరైనా ఎప్పుడైనా ఆపదలోవుంటే తక్షణమే ఆదుకో!
బిందువులే సింధువైనట్లు నేటిపొదుపే రేపటిమదుపు!
దేనినీ నేడు వృధా చేయకు రేపు లేదని వ్యధ చెందకు!
కదలని మెదలని ఉలుకు పలుకులేని శిలలా వుండకు!
నిరంతరం ఉవ్వెత్తున ఎగిసిపడే కడలి కెరటంలా వుండు!
నేడు నిరుపేదలకు అనాధలకు ఇష్టంతో ఇచ్చువారు!
రేపు ఆ పరమాత్మ నుండి పుష్కలంగా పుచ్చుకుంటారు!
ఎప్పుడైనా ఏనాడైనా పడినా సరే పైకి లేవడానికి!
పక్షిలాఎగరడానికి మొక్కలాఎదగడానికే ప్రయత్నించు!
ఏనాడు విడిపోవడానికి చెడిపోవడానికి పాతాళంలో పడిపోవడానికి పతనమైపోవడానికి ప్రయత్నించకు!
ప్రతివారిని ప్రేమించు అందరిలో ఆ దైవాన్ని దర్శించు!
ఎవరినీ అకారణంగా ద్వేషించకు కోపంతో దూషించకు!
6.సూర్యసందేశం
అది
చేయి తిరిగిన
ఎంతో నైపుణ్యమున్న
ఓ ఫోటోగ్రాఫర్ ట్రిక్కే ఐనా
దానికి ఒక లెక్క ఉంది
అందులో అనంతమైన
"సూర్యసందేశం" దాగి ఉంది
ఈ జీవితమే ఒక పయనమని...
అది తూర్పు వైపుకేనని...
చేరలేని సుదూర తీరాలకేనని...
ఎంత దూరమైనా
ఎంతో భారమైనా
ఎంతటి అంధకారమైనా
వెలుగు వేట
వెలుగు వెతుకులాట
వెర్రతనమేమీ కాదని...
వెలుగునే మోసుకుపోయేవారికి
ఇక చీకటంటూ ఎక్కడిదని...
ఎంత దూరప్రయాణమైనా
ఒక అడుగుతోనే ప్రారంభమని...
సూర్యునికంటే ముందులేచిన వాళ్ళు
సుఖపడతారని...
పుష్టికరమైన ఆహారం తీసుకున్నవారు
షష్టిపూర్తి చేసుకుంటారని...
ఆలస్యంగా నిద్రలేచిన బద్దకస్తులు
సూర్యోదయాన్ని చూడలేరని...
విజయాన్ని చూసి ఓటమి
వెలుగును చూసి చీకటి భయపడుతుందని...
సూర్యుడు ప్రతిమనిషికి
ఒక స్ఫూర్తి ప్రదాతయని...
ఆ సూర్యుని శక్తి అపారమైన
ఆ భగవంతునిపై భక్తి
ఉన్న ప్రతివ్యక్తి పొందునని...ముందుజన్మలో ముక్తి
7.మీరు వీరులే ! రాజ్యాన్ని ఏలే రాజులే !
తరతరాలుగా...
అంటరానితనానికి...
అగ్రవర్ణాల ఆధిపత్యానికి...
అహంకారానికి అంధవిశ్వాసాలకు...
బలైపోయిన ఓ బహుజనులారా !
ఇకనైనా నిద్ర మేల్కొని
నిజాలు తెలుసుకోవాలి నిప్పైరగలాలి !
మీలో ఆవేశం తగ్గి ఆలోచన పెరగాలి !
మీలో అఖండమైన ఓ శక్తినిక్షిప్తమై ఉందన్న
ఓ పచ్చినిజాన్ని మీరు తెలుసుకోవాలి !
మీరు వేరువేరుగా ఉంటే
వేరులేని చెట్టులా కుప్పకూలిపోతారు !
ఎన్నేళ్ళు గడిచినా తిరిగి చిగురించలేరు !
మీరొకరికొకరు
అండగా ఉంటే
మండే సూర్యులౌతారు !
మనువాదుల్ని మసి చేస్తారు !
కళ్ళుతెరిచి ఒక్కసారి చూడండి !
కలిసివున్న మిమ్మల్ని విభజించాలనే
తెరవెనుక కుట్రల్ని తెలుసుకోండి !
ఒకరినొకరు ప్రేమించుకోండి ద్వేషించుకోకండి !
దూషించుకోవడం మానుకోండి !
గౌరవించుకోవడం నేర్చుకోండి !
శూలాలవంటి సూటిపోటిమాటలతో
గాయపరుచుకోవడం మానుకోండి !
సహాయం చేసుకోండి ! సహకరించుకోండి !
తప్పుచేసినా ముందు ఒప్పుకోండి !
ఒకరినొకరు క్షమించుకోండి ! మీరంతా
ఏకమైతే మీరె రాజ్యాలనేలే రాజులౌతారు !
అమరజీవి అంబేడ్కర్ ఆఖరి ఆశయమదే
అది సాధించాలంటే వారి కల నెరవేరాలంటే
ఆ మహనీయుని తీరని కోరిక తీరాలంటే
మీలో విజ్ఞానం పెరగాలి ! విప్లవం రావాలి !
ఐక్యత సఖ్యతే మీ ఆయుధం కావాలి
మీరు విజయశంఖారావం పూరించాలి !
ఔనిది నిజం ప్రశ్నిస్తేనే...
పులులై పోరాడితేనే...
సమిష్టిగా ప్రతిఘటిస్తేనే...
పోయిన హక్కులు పొందేది...
జీవితాలను త్యాగం చేస్తేనే...
రక్తాన్ని చిందిస్తేనే...రాజ్యాధికారం దక్కేది...
8.మూడు కేకలు... మూడు లేఖలు
పోస్ట్.....
మొదటి కేక...మొదటిలేఖ
మిలిటరిలోవున్న భర్త నుండి
భార్యకు...."అందిన ప్రేమలేఖ"....
అదిచూడగానే ఆమె ముఖమంతా
ఏడు రంగుల ఇంద్రధనుస్సయింది
హృదయం ఆనందంతో ఉప్పొంగింది
ఒళ్ళంతా త్రుళ్ళింతా మనసంతా పులకింత
భర్త.... దూరాన...ఎక్కడో మంచుకొండల్లో
గుర్తుకురాని రోజంటూ లేదు
ఎన్నో రోజులు కళ్ళు కాయలు కాసేలా
ఎదురుచూసింది, నిదురకాసింది
కలిసి కాపురం చేసిన కొద్ది రోజుల్ని
ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసే
ఆ ఉత్తరం, భర్తనుండి రాగానే, చదవగానే
ఆమె కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి
అవి కన్నీళ్ళు కావు...."ఆనందబాష్పాలు"
పోస్ట్... పోస్ట్...
రెండవ కేక... రెండవ లేఖ
మిలిటరిలోవున్న కొడుకు నుండి
తల్లిదండ్రులకు "అందిన మనియార్డర్"....
ఆ డబ్బు అందగానే వారి ఆనందం
వర్ణణాతీతం అది అనుభవైకవేద్యం
తాము కష్టపడి చదివించినందుకు
తాము కన్న కలలు సాకారమైనందుకు
తమ బిడ్డ గొప్ప ప్రయోజకుడైనందుకు
ఒక మంచి ఉద్యోగం చేస్తున్నందుకు
తమను మరిచిపోకుండా నెలనెలా
మనియార్డర్ ను పంపుతున్నందుకు, మంచి
బిడ్డనే "కన్నారని" పదిమంది "అన్నారని"
ఆ తల్లిదండ్రుల కళ్ళళ్ళో నీళ్ళు గిర్రున తిరిగాయి
అవి కన్నీళ్ళు కావు...."ఆనందబాష్పాలు"
పోస్ట్... పోస్ట్... పోస్ట్...
మూడవ కేక... మూడవ లేఖ
మిలిటరి నుండి "అందిన టెలిగ్రామ్"...
కుటుంబానికి అది ఒక "విషాదకర వార్త"
అది అందుకునే ముందు
భార్య చేతులు భయంతో వణికాయి,
అదిమంచుకొండలనుడి
వచ్చిన "మరణవార్త"
తమ ఇంటి దీపమైన
ఒక్కగానొక్క కొడుకు
దేశసరిహద్దుల్లో శత్రువులతో
పోరాడి పోరాడి
వీరమరణం పొందాడన్న
"విషాదకర వార్త"
కడుపుతో వున్న భార్య
కాలి క్రింద భూమి కదిలింది
ముసలి తల్లిదండ్రుల గుండెలు ముక్కలైపోయాయి
ఊరు ఊరంతా ఉలిక్కి పడింది
ఇళ్ళంతా శోకసంద్రమైంది,
అందరి కళ్ళళ్ళో కన్నీరే"
ఏ చేతితో నైతే... "ప్రేమలేఖ" ను అందించానో
ఏ చేతితో నైతే..."మనియార్డర్ "ను అందించానో
అదే చేతితో..."మరణవార్త" నందించానంటూ
వెక్కి వెక్కి ఏడ్చిన...."ఆ ఊరి పోస్టమాన్" కళ్ళల్లో
నీళ్ళు గిర్రున తిరిగాయి ...అవి ఆనందబాష్పాలు కాదు
ఉప్పొంగిన పాతాళగంగ ఆవీరజవాన్ పాదాలు కడగంగ
(అక్టోబర్ 9 వ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవం
సందర్భంగా,తపాల సిబ్బందికి శుభాకాంక్షలతో...)
9.ఉడుతలు కాదు...ఊసరవెళ్ళులు...
ఆరంగం ఓరంగస్థలం
అందరూ మహానటులే
అక్కడున్నది
ఉడుతలుకాదు ఊసరవెళ్ళులని
అది మొసళ్ళ మోసగాళ్ళమయమని
అది రక్తంత్రాగే రాక్షసమూకల రంగమని
తెలుసుకో నేస్తమా ! నిజం తెలుసుకో!
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో !
అక్కడ పరిచయమయ్యేవారు
పైకి ప్రాణమిత్రులని లోనవారు బద్దశత్రులని
కనిపిస్తే వాళ్ళు కాళ్లకు నమస్కారం చేస్తారని
కాని, రేపువారే కడుపులో కత్తులుంచుకొని
కౌగలించుకుంటారని
తెలుసుకో నేస్తమా ! నిజం తెలుసుకో!
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో !
అక్కడందరూ మాయమాటల మాంత్రికులేనని
అరచేతిలో స్వర్గం చూపించే అఖండులేనని
నమ్మించి నట్టేటముంచే నయవంచకులేనని
తెలుసుకో నేస్తమా ! నిజం తెలుసుకో!
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో !
అక్కడందరూ ఆశబోతులు అబద్ధికులేనని
సిగ్గూ లజ్జలేనివాళ్ళు నీముందే వుంటారని
మానవత్వమన్న పదానికి అర్థం తెలియని
మూర్ఖులు ముసుగులు వేసుకొని నీ ప్రక్కనే
గుంట నక్కల్లా గజ్జి కుక్కల్లా నక్కివుంటారని
తెలుసుకో నేస్తమా ! నిజం తెలుసుకో!
అణుక్షణం అతిజాగ్రత్తగా మసలుకో !
10.నడిరోడ్డులో నరమేధం ?
ఆప్ఘాన్
అధ్యక్ష భవనాన్ని ఆక్రమించేసి
అమాయకపు ప్రజలను
భయభ్రాంతులకు గురిచేస్తున్న
కఠిన శిక్షలు వేస్తున్న
తప్పులు చేస్తే తలలు నరికేస్తున్న
తలపాగాలతో తిరుగుతున్న
తలపొగరు ఆ తాలిబాన్లు
పగబట్టిన త్రాచుపాములే
పాపం ప్రజలు
పులులు వేటాడే జింకల్లా
తోడేళ్ళు వెంటాడే మేకల్లా
చెల్లాచెదురైపోతున్నారు
పిల్లాపాపలతో ప్రాణభయంతో
పరుగులు పెడుతున్నారు
విమానరెక్కలకు వ్రేలాడుతున్నారు
పిట్టల్లా నేల రాలిపోతున్నారు
ప్రాణాలు కోల్పోతున్నారు
సమాధుల్లో దాక్కోవడాని
సైతం సిద్ధపడుతున్నారు
ఎందుకు ? ఎందుకు ? ఎందుకు ?
కారణమొక్కటే
అదిగో నడిరోడ్డుపై ఆ నరమేధమే?
దయా దాక్షిణ్యం వారిలో శూన్యం
మంచితనం
మానవత్వం మటుమాయం
కళ్ళు మాత్రమే కనిపించే వాళ్ళు
మనుషులు ? కాదు మానవమృగాలు
ఇందరిని చంపి
ఇందరిని హింసించి
ఇందరి రక్తాన్ని రుచిచూసి
ఇందరిని కన్నీళ్లకు గురిచేసి
ఇందరిని అష్టకష్టాల పాల్జేసి
ఇందరిని కన్నీళ్లకు గురిచేసి
ఇందరిని కన్నీళ్లకు గురిచేసి
ఆప్ఘాన్ పిల్లలబంగారు
భవిష్యత్తును భగ్నంచేసి
మానవతా విలువల్ని
మహిళా హక్కుల్ని కాలరాచి
వ్యతిరేకులందరిని బందీలనుచేసి
చిక్కినవారిని చిత్రహింసలకు గురిచేసి
ప్రజలరక్తాన్ని రుచిచూసి ప్రాణాలుతీసి
వారు పొందేది మోక్షమా ? కాదు కాదే
రాజ్యకాంక్షకు రాక్షసానందానికిది ప్రత్యక్షసాక్ష్యమే
11.తాలిబాన్లా ? త్రాచుపాములా?
అల్లాకోరునా
అల్లకల్లోలం...లేదే
మరి తాలిబాన్లెందుకు
త్రాచుపాముల్లా
బులుసు కొడుతున్నారు ?
పగబట్టి
ఇంటింటి
తలుపుతట్టి
కనిపించిన శత్రువునల్లా
కసిగా కాటు వేస్తున్నారు
పులుల్లా వెంటాడి వేటాడి
నిర్ధాక్షిణ్యంగా పిట్టల్లా
కాల్చి చంపేస్తున్నారు
అందరిదీ...ఒకే రక్తం
అందరిదీ...ఒకే జాతి
అందరి...దైవం ఒక్కరే
అందరి ప్రార్థన...ఒక్కటే
ప్రపంచాన ప్రతిమనిషి
జీవితాన శాంతి శాంతి శాంతి
ఎందుకో ?మరెందుకో ?
ఈ కక్షలు...కార్పణ్యాలు ?
ఈ రగిలే పగలు...ప్రతీకారాలు?
ఈ దారుణ...మారణహోమాలు?
ఎందుకు ? ఎందుకు ? ఎందుకు?
జీహాద్ పేర నడిరోడ్డుపై ఆ నరమేధం
ఎందుకు? ఎందుకు? ఎందుకు ?
ఈ అరాచకత్వానికి...ఈ అల్లకల్లోలానికి
అసలు కారణం ఎవరికెరుక ఆ అల్లాకు తప్ప
12. రాక్షసులే రాజులైతే....
ఆఫ్ఘనిస్తాన్
అగ్నిగుండంలా
మండినంతకాలం
రావణకాష్టంలా రగిలినంతకాలం
ఏ దేశనేతలకూ కంటిమీద కునుకుండదు
ఎవరి బ్రతుకులోను శాంతి సమాధానముండదు
శాంతి కపోతాలు నింగికెగరాలంటే
ప్రజాస్వామ్య పాలన ప్రభవించాలంటే
ప్రజలు స్వేచ్చా వాయువుల్ని పీల్చాలంటే
మానవత్వపు పరిమళాలు వెల్లివిరియాలంటే
రాజ్యకాంక్షతో రెచ్చిపోయే తాలిబాన్ల
దాష్టీకాలను దౌర్జన్యాలను
అన్యాయాలను అక్రమాలను
కర్కషత్వాన్ని కట్టడి చేయాలే
ముస్కర మూకల్ని ముట్టడి చేయాలె
కాబూల్ లోనే వారిని ఖననం చేయాలే
అరచేతిలో అత్యంత శక్తివంతమైన
అణు బాంబులున్న అగ్రరాజ్యాలన్నీ
గుడ్లగూబల్లా గుడ్లప్పగించి చోద్యంచూస్తే ఎలా?
ఆ ఉన్మాదుల
ఆ ఉగ్రవాదుల
ఆ మూర్ఖుల
ఆ ముస్కరుల ముప్పు
అమాయకులైన ఆఫ్ఘాన్లకే పరిమితమా? కాదే !
ఇరుగుపొరుగు దేశాలకు అగ్రరాజ్యాలకు కూడా
కారణం వారు నరరూపరాక్షసులకు ప్రతిరూపాలు !
మనుష్యుల ముసుగులో తిరిగే మానవమృగాలు !
విభజించే విధ్వంసం సృష్టించే
అమెరికా సైనికులు అత్యాధునిక
ఆయుధాలందించిన యమకింకరులు భయంకరులు
ఔను రాక్షసులకే రాజ్యాధికారం దక్కితే
ఏపాపమెరుగని అమాయకపు ప్రజలరక్తం
ఏరులై పారడం తధ్యమే రేపటి రక్తచరిత్రకు శ్రీకారమే
13.ఏది నిజమైన సంక్రాంతి ?
ఇంటినిండా గాదెలనిండా
ధనరాశులుంటే సరిపోదు
ఆ గుండెలనిండా
సుఖశాంతుల ధనరాశులుండాలి
ఇంటి కుటుంబసభ్యుల
మధ్య సత్సంబంధాలుంటే సరిపోదు
అందరి గుండెల్లో అనురాగం
ప్రేమ ఆత్మీయతలు వెల్లివిరియాలి
పగలు ప్రతీకారాలు లేని స్వచ్ఛమైన
మానవ సంబంధాలుంటే సరిపోదు
ఆ మనుషులందరు మానవీయ
విలువల్ని మరువకుండా ఉండాలి
పదిమందికి ప్రేమను పంచితే సరిపోదు
పేదలకు అనాధలకు విధవలకు
వికలాంగులకు దానధర్మాలు చేయాలి
కలతలు కన్నీళ్లు లేకుండాఉంటే సరిపోదు
అందరు కలిసి మెలిసి ఉండాలి
మంచితనంతో మానవత్వంతో బ్రతకాలి
అప్పుడే అందరి బ్రతుకులు ధన్యమౌతాయి
అదే నిజమైన సంక్రాంతి అప్పుడే జీవితాన నవ్య క్రాంతి
14. చెప్పలేము... మినీ కవిత
ఏ చెట్టు చెప్పలేదు
తనకెన్ని కొమ్మలు రెమ్మలు
వేర్లు ఆకులున్నాయోనని
ఎన్నికాయలు కాశాయోనని
ఏ పూలమొక్క చెప్పలేదు
తనకెన్నిపూలు పూశాయోనని
ప్రకృతి ధర్మాన్ని పాటించడం తప్ప
ఏ మనిషి చెప్పలేడు తన తలపై
ఎన్ని వెంట్రుకలున్నాయోనని
ఖచ్చితంగా చెప్పలేడు
కాకిలేక్కలు వేయడం తప్ప
ఏ తల్లి చెప్పలేదు
తనకడుపెప్పుడు
పండుతుందోనని
తానకెంతమంది
పిల్లల్ని పుడతారోనని
ఖచ్చితంగా చెప్పలేదు ముక్కోటి
దేవుళ్ళకు మొక్కడం తప్ప
ఆట ముగిసేవరకు,
ఏ ఆటగాడు చెప్పలేడు
తనకే కప్పని తనదే గెలుపని
ఖచ్చితంగా చెప్పలేడు
ఆ పరమాత్మను ప్రార్థించడం తప్ప
రిజల్ట్స్ వచ్చేవరకు,
ఏ విద్యార్ది చెప్పలేడు
తనకే ర్యాంకు వస్తుందోనని
ఖచ్చితంగా చెప్పలేడు
గాలిలో మేడలు కట్టడం తప్ప
ఓట్లలెక్కింపు పూర్తి అయ్యేంతవరకు
ఏ నాయకుడు చెప్పలేడు
తనకెన్నిఓట్లు వస్తాయోనని
ఖచ్చితంగా చెప్పలేడు
ఊహల్లో ఊరేగడం తప్ప
15.నిన్నటి తేనె...నేడు విషం ?
అందమైనదని
ఆస్తిపాస్తులున్నాయని
ఇష్టపడి మూడుముళ్ళువేసి
ఎన్నో ఏళ్లు హాయిగా
కలిసి కాపురం చేయగా
భార్యంటే మోజు కాస్త తగ్గిపోవచ్చు
నిన్నటి తియ్యటి బెల్లం
నేడు అల్లం కావచ్చు
నిన్నటి ప్రాణదేవత
నేడు దెయ్యం కావచ్చు
నిన్నటి తేనెచుక్క
నేడు విషపుచుక్కకావచ్చు
రోజు రోజుకు ప్రేమజ్వాల
కాసింత కాసింత చల్లారిపోవచ్చు ఆపై
"పరస్త్రీ వ్యామోహం"లో పడిపోవచ్చు
అది అత్యంత ప్రమాదకరం కావొచ్చు
మనిషి వ్యక్తిత్వానికి
చెరగని మాయని మచ్చకావచ్చు
నిన్నటి ఆ మూడుముళ్లు
మూన్నాళ్ళ ముచ్చట కావచ్చు
విధి విడదీయవచ్చు విడాకులతో
ఆ ఇరువురనుభవించే
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు
ఇనుపసంకెళ్లు పడవచ్చు అందుకే
ఓ దంపతులారా ! జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త !
16.ఓర్పు నశించిన ఓటరు ...
నిన్న స్వాతంత్య సమరాన
సాహిత్య సాగరాన శ్రీశ్రీ కలాన
...పొంగిన అల !
కాదేదీ కవితకనర్హం...
నేడు రాబోయేకాలానికి
కాబోయే రాజకీయనాయకులుకన్న
...రంగుల కల !
కాదేదీ కమీషన్లకనర్హం...
నిన్న పట్టపగలే ప్రజల్ని దోచుకున్న
...గజదొంగలు !
నేడు చట్టసభలకు ఎన్నికై వున్న
...కొల్లేటి కొంగలు !
నిన్న కూటికేలేక కుమిలిపోయిన
...కుచేలులు !
నేడు కుంభకోణాల్లో ఆరితేరిన
...కుబేరులు !
నిన్న ఓట్లకోసం బిక్షమెత్తిన
...శనీశ్వరులు !
నేడు కోట్లకు పడగలెత్తిన
...కోటీశ్వరులు !
నిన్న ప్రగతికాముకులు
...ప్రజాబంధువులు !
నేడు ప్రజల రక్తాన్నిత్రాగే
...రాజకీయరాబందులు !
జానెడు పొట్ట కోసం
జాతికి ద్రోహంచేసే
...ఓ జలగలారా !
కన్నతల్లి కన్నీటిని త్రాగే
...ఓ కసాయివాళ్లారా !
నీడనిచ్చే కొమ్మలను నరికే
...ఓ నీచులారా !
ఒక్కనిజం తెలుసుకోండి !
ఓటరంటే..."త్రినేత్రుడని"
కళ్ళు తెరిచి కరుణిస్తే మీరు
రివ్వున ఎగిరే తారాజువ్వలౌతారని...
కానీ..."ఓర్పు నశించిన ఆ ఓటరే"
ఆగ్రహించి ఉగ్రరూపం దాలిస్తే
రెప్పపాటు మీరంతా కుప్పకూలిపోతారని...
17.కరోనా సుభాషితాలు- కాంతి కిరణాలు-
మనది కానిది మనకు
దక్కాలనుకోవడం ధర్మమా ?
మనకు దూరమైనది మనకు
చిక్కాలనుకోవడం న్యాయమా?
అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం
అర్హత లేకుండా సింహాసనం
ఎక్కాలనుకోవడం భావ్యమా ?
కనిపించిన ప్రతి రాయిని దైవమని
మ్రొక్కాలను కోవడం విశ్వాసమా?
అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం
చీకటిలో కరోనా వేస్తుంది చిందులే
ముందు జాగ్రత్తలు మనకు మందులే
బయట తిరుగు వారంతా అంధులే
కరోనా ఖతమైతే వినోదాల విందులే
అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం
స్థితప్రజ్ఞతే మనకు శ్రీరామరక్ష
భయమే భూతం దైర్యమే దీపం
ఆత్మస్థైర్యమే మనకు ఆయుధం ఔషధం
కలిసి అందరం కరోనాను కట్టడిచేద్దాం ఖతంచేద్దాం
అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం
మూడు కోతుల నీతిని విందాం
చెడు వినకు చెడు కనకు చెడు మాట్లాడకు
ముందు జాగ్రత్తలు మూడు తీసుకుందాం
చేతులు కడుక్కో మాస్కుకట్టుకో మందికి దూరంగావుండు
అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం
శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదంటారే,ఆ
సృష్టికర్త ప్రమేయం లేక ఈ భూమిపై ఏజీవి పుట్టదంటారే
మరి ఈ కాలరక్కసి కరోనా జన్మకు కారకులెవరు ?
నా ఈ ధర్మసందేహాం తీర్చేదెవరు? ఎవరు? ఎవరు?
అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం
18. ఇంట్లోకూర్చుంటే... ఏంటి లాభం?
ఏ పులైనా "గుహలోపడుకొని గురకలు పెడుతుంటే" ఆపై లేచి ఆకలంటూ కేకలు వేస్తుంటే ,అడవిలో జంతువులు వస్తాయా? నోట్లో పడతాయా ?లేదే
ఏ రైతైనా ఎద్దులున్నా పొలమున్నా అదనుచుసి పదును పెట్టకుండా పొలం దున్నకుండా సాగు చేయకుండా విత్తనం వేయకుండా "ఇంట్లోకూర్చుంటే" ఇంటికిపంట వస్తుందా? గాదెలు నిండుతాయా? లేదే
ఏ విద్యార్థైనా పరీక్షలు వ్రాయకుండా, పాసవకుండా ఇంటర్యూలకు వెళ్ళకుండా కంప్యూటర్ లో గేమ్స్ ఆడుకుంటూ "ఇంట్లోకూర్చుంటే" ఇంటికి ఉద్యోగం నెలకు జీతం వస్తుందా ? లేదే
ఏ వ్యక్తి అయినా చేతిలో అగ్గిపెట్టె వున్నా ఇంట్లో దీపమున్నా వెలిగించకుండా చిమ్మచీకటి కమ్ముకున్నదని "చింతిస్తూ కూర్చుంటే"ఏంటిలాభం
చీకటి తొలుగుతుందా ? వెలుగు వస్తుందా ? లేదే
ఏ తండ్రైనా తన కూతురు అందమైనదని అమెరికా లో చదివిందని ఊరంతా చెప్పినా సంబంధాలు చూడకూండా "ఇంట్లో కూర్చుంటే" ఇంటికి అల్లుడు వస్తాడా ? కూతురుకు పెళ్ళవుతుందా ? లేదే
ఏ మార్కెటింగ్ మేనేజరైనా "ఇంట్లో ఏ ఏసీ గదిలోనో " ఏ ఫ్యాను కిందనో హాయిగా కాలిమీద కాలు వేసుకొని "కాల్స్ చేస్తూ కూర్చుంటే" కస్టమర్లు యింటికి వస్తారా ? తలుపు తడతారా ? లేదే
19. కోపం కొరివిదెయ్యమైతే ?
కోపం కొరివిదెయ్యమైతే కొంపకొల్లేరౌతుంది
కళ్ళు నిప్పులు చెరుగుతాయి
మనిషిలోనీ మానవత్వం మంటకలిసిపోతుంది
రక్షకుడు సైతం రాక్షసుడౌతాడు రకాన్ని రుచిచూస్తాడు
కోపం వస్తే కాస్త జాప్యం చేస్తే అదే దానికి ఔషధం
ఒకటి నుండి వందవరకు అంకెలలెక్కింపే దానికి సంకెళ్లు
లేదా బ్రతుకు బుగ్గిపాలే... పరువు గంగపాలే....
పొయ్యి మీద పాలు పొంగిపోతుంటే క్రింద మంటను తగ్గించకున్న పొంగిపోయిన పాలు... పొయ్యి పాలే...
మిగులేది ఖాళీపాత్రే...కారణం క్రిందపెట్టిన మంటేగా...
అదే ఆరితే... పాలు మీకు దక్కినట్లేగా...
మీరే మారితే...
మిమ్మల్ని ప్రేమించినట్టు నటించే ఆ కోపం
మిమ్మును నిలువునా దహించే అగ్నిజ్వాలని
అది వేడిపుట్టించే ఒక మాయలేడని
ఆపై మిమ్మును మీరే...హత్య చేసుకునేలా
ఆత్మహత్య చేసుకునేలా... ప్రేరేపిస్తుందన్న
మీ కంటిని మీరే... పొడుచుకునేలా
మీ ఒంటిని మీరే... కాల్చుకునేలా
మీ ఇంటిని మీరే... కూల్చుకునేలా
మీ రక్తాన్ని మీరే... పీల్చుకునేలా చేస్తుందన్న
దీపం చుట్టూ పురుగుల్లా...
అయస్కాంతానికి అతుక్కునే ఇనుపముక్కల్లా...
క్షణాల్లో మిమ్మల్ని మృగాల్లా...మార్చివేస్తుందన్న..
మాయ చేస్తుందన్న ఒక
"నిప్పులాంటి నిజం" మీకు తెలిసినట్లేగా..
అందుకే ముక్కుమీద కోపమున్నవారు మూర్ఖులే
అకారణంగా వారుకోపంతో కుతకుతలాడిపోతారు
అందమైన జీవితాన్ని అంధకారం చేసుకుంటారు
కోపం కొండ చిలువైతే జీవితం ఎండిన కలువపువ్వే
తమ కోపమే తమకు శత్రువు తమ శాంతమే తమకు రక్ష
దయ చుట్టంబని నాటి కవిశేఖరులు పలికిన
అమృతవాక్కుల్ని ఎవరైనా... మరువరాదు కలనైనా ...
20.ఓ అందమా నీవెక్కడ ?
పచ్చని పచ్చికలో నేనక్కడ !
ఎత్తైన పర్వతాల్లో
కప్పిన తెల్లనిమంచులో
పశువుల్లో పక్షుల్లో పచ్చని వృక్షాల్లో
పరవశింపజేసే ప్రకృతిలో నేనక్కడ !
నీటిలో ఈదే చేపల్లో నేనక్కడ !
నీటిమీద తేలియాడే ఓడల్లో నేనక్కడ !
ఏడు రంగుల ఇంద్రధనుస్సులో నేనక్కడ !
పొలంలో పండిన పచ్చనిపైరులో నేనక్కడ !
పురివిప్పిఆడే నెమలి పించంలో నేనక్కడ !
నీలాల నింగిలోఎగిరే పతంగంలో నేనక్కడ !
చెంగు చెంగునదూకే లేగదూడల్లో నేనెక్కడ !
అడవిలో తిరిగే జంతువుల్లో
ఎగిరే రంగురంగుల పక్షులరెక్కల్లో నేనక్కడ !
బడిలో ఆటపాటల్లో మునిగితేలే పసిపిల్లల
ముసిముసి నవ్వుల్లో అమాయకపు చూపుల్లో
అల్లరి చేష్టల్లో నేనెక్కడ !
నవజవ్వని చిలకపలుకుల్లో చూసే చిలపిచూపుల్లో
ఓరచూపుల్లో కోరచూపుల్లో నాజూకైన నడుములో
ఎగిరే ముంగురుల్లో జడలో మెడలో కాటుక కళ్ళల్లో
చేతి గాజుల్లో కాలి అందెల్లో కట్టిన చీరలో
పెట్టిన బొట్టులో నేనక్కడ !
జలజలదూకే జలపాతాల్లో గలగలపారే సెలయేరుల్లో
నిర్మలంగా నిశ్చలంగా ప్రవహించే నదుల్లో నేనక్కడ
తీరం చేరాలని ఆరాటపడే కడలి అలల్లోనేనక్కడ !
విరితోటలో విరిసి గుబాళించే ప్రతిపువ్వులో నేనక్కడ !
గుడి గోపురాల్లో గర్భగుడుల్లో
ప్రతిష్టించిన సుందరమైన దేవతా శిల్పాల్లో నేనక్కడ !
ఓ అందమా నీవెక్కడ? చల్లనైన అమృతహస్తాల్లో
మానవత్వం నిండిన ప్రతిమనిషి అంతరంగంలో నేనక్కడ !
21. ఓ సౌందర్యమా నీవెక్కడ ?
విరితోటలో
విరిబూసి గుబాళించే
ప్రతిపువ్వులోనా? లేదు లేదు
ఎత్తైన పర్వతాల్లో
కప్పిన తెల్లనిమంచులో
పశువుల్లో పక్షుల్లో పచ్చని వృక్షాల్లో
పరవశింపజేసే ప్రకృతిలోనా ? లేదు లేదు
గుడి గోపురాల్లో
గర్భగుడుల్లో ప్రతిష్టించిన
సుందరమైన దేవతాశిల్పాల్లోనా? లేదు లేదు
బడిలో ఆటపాటల్లో మునిగితేలే
పసిపిల్లల ముసిముసి నవ్వుల్లో
అమాయకపు చూపుల్లో అల్లరి చేష్టల్లోనా? లేదు లేదు
నవజవ్వని ఓరచూపుల్లో కోరచూపుల్లో
కొంటెచూపుల్లో చిలపిచూపుల్లో చిలకపలుకుల్లో
నాజూకైన నడుములో ఎగిరే ముంగురుల్లో
జడలో మెడలో చేతి గాజుల్లో కాటుక కళ్ళల్లో
కాలిఅందెల్లో కట్టినచీరలో పెట్టినబొట్టులోనా? లేదు లేదు!
జలజలదూకే జలపాతాల్లో గలగలపారే సెలయేరుల్లో
నిర్మలంగా నిశ్చలంగా ప్రవహించే నదుల్లో
తీరం చేరాలని ఆరాటపడే కడలి అలల్లోనా ? లేదు లేదు
ఓ సౌందర్యమా మరి నీవెక్కడ?
ఆపదలో ఆదుకునే అమృతహస్తాల్లో
కరుణ ప్రేమ దయ జాలి మంచితనం
మానవత్వంతో నిండి పొయ్యిమీద
పాలలా పొంగిపొర్లే ప్రతిమనిషి అంతరంగంలో నేనక్కడ
22. దైవమా ! దారిచూపుమా !!
ఆశాజీవికి ఈ ప్రపంచం
...ఒక సుందర నందనవనం
కరోనా పుట్టె
కారుచిచ్చుపెట్టే
విశ్వమంతా పూరిగుడిసెలా
మళ్ళీమళ్ళీ తగలబడిపోతూవుంటే
నిన్న
చెరువుల్లో చేపల్లా
ప్రశాంతంగా స్వేచ్ఛగా
నిశ్చింతగా బ్రతికిన ప్రజలంతా
నేడు జాలిలేని
జాలరివలలో చిక్కి
గట్టున పడిన చేపల్లా
గిలగిలకొట్టుకుంటున్నారు
కరోనా కాలసర్పం
విషపుకోరలకు చిక్కి
విలవిల్లాడుతున్నారు
ఆదుకునే నాధుడు లేక
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతున్నారు
దిక్కుతోచక దిక్కులు చూస్తూ
ముక్కోటిదేవతలకు మొక్కుకుంటున్నారు
కంటికి కనపడని కరుణించని
ఆ కరోనా మృత్యువునుండి కాపాడమని
ఏదైవం కూడా ధైర్యం చేసి
దగ్గరకు రావడం లేదాయె దయచూపడం లేదాయె
ఈ మానవాళికి దిక్కెవరో అర్థం కావడం లేదాయె
మరి ఈ కరోనా రక్కసి
అంతమెప్పుడో ? ఎప్పుడో? ఎప్పుడో?
ఇమ్యూనిటీని పెంచుకున్నప్పుడే !
అసలైన సిసలైన సంజీవిని వచ్చినప్పుడే !
రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడే !
కరోనా కలలో రానప్పుడే ! ఆ భూతభయం వీడినప్పుడే !
ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం అందరికి ఆయుధాలైనప్పుడే
23. ప్రతిభకే పట్టాభిషేకం...
ఆశాజీవికి ఈ ప్రపంచం
...ఒక సుందర నందనవనం
శ్రమజీవికి ఈ ప్రపంచం
...ఒక పోరాటం ఒక ఆరాటం
నిరాశజీవికి ఈ ప్రపంచం
..మోడువారిన ఒక వృక్షం
...పండి ఎండిన ఒక పొలం
...చుక్కలు లేని ఆకాశం
...అలల అలజడికి అల్లకల్లోలమైన ఓ సాగరం
అందుకే ఓ మనిషీ ! నీవుఆశాజీవివా ?
శ్రమజీవివా ? నిరాశజీవివా? నిర్ణయించుకో !
చేసిన నీ శ్రమ చెడని పదార్థం !
ఇది ముమ్మాటికి పచ్చియదార్థం !
ప్రతిభనెవ్వరూ ...ప్రక్కకు నెట్టలేరు
నిప్పు నెవ్వరూ ...మూట కట్టలేరు
అందుకే ఓ నిరుద్యోగి !
ఉద్యోగం రాలేదు వ్యధ చెందకు...
ఆశేశ్వాసగా సాగిపో ముందుకు...ఔను
ప్రతిభకు జరుగుతుంది తప్పక ...పట్టాభిషేకం
కష్టజీవికి జరుగుతుంది తప్పక...కనకాభిషేకం
24.బ్రతుకు జట్కాబండి...
ఆకలేసి
గుప్పెడు
గింజలకోసం
గూడు విడిచి
ఎక్కడికెక్కడికో
పక్షులగుంపులు
ఎగిరిపోయినట్లు
దాహం వేసిన
జంతువులు
ఎర్రని ఎండలో
వాగులు వంకలు
చెరువులు చెలిమలు
వెదుకుక్కుంటూ
వెళ్ళిపోయినట్లు
రెక్కలొచ్చిన పక్షులు
వినువీధిలో విహంగాలై
స్వేచ్ఛగా విహరించినట్టు
వయసొచ్చిన బిడ్డలు
ఉన్నఊరును కన్నవారిని
వదిలేసి ఉన్నతవిద్యంటూ
ఐదంకెల ఉద్యోగాలవేటలో
వేలమైళ్ళదూరాలకెళ్ళిపోయి
భార్యాబిడ్డలకు దూరంగా బ్రతుకుతారు
ఆపై విధిలేక బండలైన బంధాలతో
సహనంతో సర్దుబాటుగుణంతో
రద్దైన రక్తసంబధాలతో రాజీపడడమే
మిణుకు మిణుకుమనే ఆవగింజంత ఆశతో
ముఖాలపై నకిలీ నవ్వుల్ని ముద్రించుకోవడమే
చిమ్మచీకటిలో ఏకాంతంగా ఏడుస్తూ ఉండడమే
భారమైనా బ్రతుకు బండినీ ఈడుస్తూ పోవడమే
బాధతో బరువెక్కిన గుండెల్ని భరిస్తూ పోవడమే
భారమంతా భగవంతునిపైవేసి భయంతో బ్రతకడమే
25.కార్గిల్ వీరులకు కన్నీటి వీడ్కోలు....
మంచు కొండల్లో
మండే సూర్యులు మన సైనికులు
సరిహద్దుల్ని ముద్దాడే
విద్యుత్ తీగలు మన వీరజవాన్లు
మనకెప్పుడూ ప్రక్కలో బల్లెమే పాక్
కార్గిల్ కొండల్లో కొట్టింది కరెంట్ షాక్
మొన్న పాక్ విషనాగై
కాశ్మీరును కాటేసింది
నిన్న అనకొండై పట్టేసింది
కార్గిల్ కొండల్ని చుట్టేసింది
భవిష్యత్తులో ఈ తీవ్రవాదతిమింగలం
మన బంగారుభారత్ టైటానిక్ ను
ముక్కలు ముక్కలు చేయకముందే
ప్రజలందరిని సంక్షోభ సాగరాన
ముంచి వేయకముందే
అగ్రరాజ్యాలు అక్షింతలు చల్లాలి
ఇరుగుపొరుగుదేశాలు పాక్ ను
ఓ చీడపురుగులా చూడాలి
ప్రపంచదేశాలన్ని ఏకమై
పాక్ ను ఏకాకిని చేయాలి
సరిహద్దుల్లో పాక్ తీవ్రవాదుల్ని
సమాధి చేయాలి...అందుకే
కార్గిల్ అంటే... ఓ కదనరంగం
కార్గిల్ అంటే... ఒక కడలితరంగం
కార్గిల్ అంటే... పాక్ గుండెల్లో
పేలిన ఓ అగ్ని క్షిపణి
కార్గిల్ అంటే... కోట్లాది భారతీయుల
గుండె శిఖరాలమీద
ఎగురవేసిన విజయపతాకం
కార్గిల్ అంటే...చరిత్రపుటల్లో
రక్తాక్షరాలతో లిఖించబడిన శక్తి స్మృతి
అటు మృత్యువుతో
ఇటు శత్రువులతో నిత్యం పోరాడిన
ఆ కార్గిల్ వీరులకు
ఆ అమర వీరజవానులకు
చేతులెత్తి సెల్యూట్ చేద్దాం !
కన్నీటితో వీడ్కోలు పలుకుదాం !
శిరసువంచి చరణాలకు పాలాభిషేకం చేద్దాం !
26. మన మాటలే మనకు ఉరి సిరి ఊపిరి ...
మన సమస్యలను
మనమే పరిష్కరించుకోవాలి
మన మాటల్లో మాధుర్యం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి
మన మాటల్లో మంచితనం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి
మన మాటల్లో మమకారం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి
మన మాటల్లో మనోధైర్యం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి
మన మాటల్లో మానవత్వం
ఉండాలి ఉండాలి ఉండి తీరాలి
మన మాటల్లో మాత్సర్యం
మన చేతల్లో మూఢత్వం
ఉండరాదు ఉండరాదు ఉండనేరాదు
మన చూపుల్లో కౄరత్వం
మన తలంపుల్లో మూర్ఖత్వం
ఉండరాదు ఉండరాదు ఉండనేరాదు
కారణం మన మాటలే మనకు ఉరి
మన మాటలే మనకు సిరి ఊపిరి తస్మాత్ జాగ్రత్త!
27. అఖండ విజయం
మన సమస్యలను
మనమే పరిష్కరించుకోవాలి
అంతులేని ఆత్మవిశ్వాసం
ఉన్నవారికి అపజయమే ఉండదు
ఓర్పు ఉన్నవారికి ఓటమే ఉండదు
సత్యం... శ్రద్ధ... పవిత్రత
నిస్వార్ధం... దృఢసంకల్పం
పవిత్రమైన ఆశయం...వీరత్వం
ఆత్మజ్ఞానం... ఆత్మబలం అను
ఆయుధాలను ధరించినవారికి
సమస్తలోకాలు...పాదాక్రాంతం
ఎప్పటికైనా అఖండవిజయం...వారిసొంతమే
సూర్యునిచుట్టూ భూమిలా
విజయలక్ష్మి వారిచుట్టే తిరుగుతుంది...ఇదిసత్యమే
28. అణుబాంబు కన్న ఆత్మవిశ్వాసమే మిన్న
అది
సన్నగిల్లితే
బలహీనతే
బలమే జీవనం
బలహీనతే మరణం
ఆకాశం నుండి పిడుగు
పడినా చెలించని మీరు
కుక్క పిల్లల అరుపులకు
కుమిలి కుమిలి ఏడుస్తారా?
మీలో అనంతమైనశక్తి దాగి ఉంది
ఏదైనా సాధించగలసత్తా మీలోఉంది
వెనుకటి ఋషులు మహర్షులు
మహాపురుషులే మీరు ఈ జన్మలే వేరు
ఆత్మవిశ్వాసంతో
ఆత్మదర్శనం విశ్వదర్శనం
ఆ పరమాత్మ దర్శనం సాధ్యమే
ఊహకందని ఉజ్వలభవిష్యత్తు మీసొంతం
నిరాశ పడకండి నిద్రమేల్కోండి
మేమేమీ చేయలేము అనకండి
మేమేదైనా సాధించగలమనండి
తరగని ఆత్మవిశ్వాసంతో ఉండండి
మీలోని ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేయండి
అణుబాంబులకన్నా అతి శక్తివంతమైన
ఆరకరగిలే అనంతమైన ఆత్మవిశ్వాసంతో
సమసమాజానికి మీరు పునాదులు వేయవచ్చు
ఈభారతావని పునర్మించవచ్చు చరిత్రను సృష్టించవచ్చు
29.పోలన్న కవి సుభాషితాలు...
ఓ ప్రియ మిత్రులారా !
నా శ్రేయోభిలాషులారా!!
ఎల్లప్పుడూ ఆనందంగా వుండండి !
అనవసరంగా ఆందోళన చెందకండి!
నిదానమే ప్రధానం అన్నది నిన్నటి మాట!
వేగమే ప్రధానం ఈకంప్యూటర్ యుగంలో !
నిజానికి పేదవారిగా పుట్టడం తప్పు కాదు!
కానీ, పేదవాళ్ళుగా మరణించడం పెద్దనేరమే !
మీ చిరునవ్వులే చీకటిలో వెలిగే చిరుదీపాలు!
మీ కోపతాపాలే తీరనిశాపాలు నరకకూపాలు!
ప్రతినిత్యం మరుక సత్యమునే బోధించండి!
నటించకండి నమ్మినవారిని నట్టేటముంచకండి!
పురోభివృద్ధికే మీ ఆలోచనలు పునాది కావాలి!
సమయాన్ని సత్సంకల్పాలను సమాధిచేయకండి!
ఏనాడైనా ఎవరిని కూడా భయపెట్టకండి బాధించకండి!
ఎప్పుడైనా ఎవరైనా ఆపదలోవున్న తక్షణమే ఆదుకోండి!
బిందువులే సింధువైనట్లు నేటిపొదుపే రేపటిమదుపు!
దేనినీ నేడు వృధాచేయకండి రేపు లేదని వ్యధచెందకండి!
కదలని మెదలని ఉలుకు పలుకులేని శిలలా వుండకండి!
నిరంతరం ఉవ్వెత్తున ఎగిసిపడే కడలికెరటంలా వుండండి!
ఔను నేడు నిరుపేదలకు అనాధలకు ఇష్టంతో ఇచ్చువారు!
రేపు ఆ పరమాత్మ నుండి పుష్కలంగా పుచ్చుకుంటారు!
ఎప్పుడైనా ఏనాడైనా పడినా సరే పైకి లేవడానికి! పక్షుల్లా హాయిగా ఎగరడానికి మొక్కల్లా పచ్చగా ఎదగడానికే తప్ప
ఏనాడు విడిపోవడానికి చెడిపోవడానికి పాతాళంలో పడిపోవడానికి పతనమైపోవడానికి ప్రయత్నించకండి!
ప్రతివారిని ప్రేమించండి అందరిలో ఆ దైవాన్ని దర్శించండి!
ఎవరినీ అకారణంగా ద్వేషించకండి కోపంతో దూషించకండి!
అన్న పోలన్న ఈ సుమధుర సుభాషితం!
విన్న చాలును మీ జీవితం సువర్ణశోభితం !
30. అఖండ విజయం
మన సమస్యలను
మనమే పరిష్కరించుకోవాలి
అంతులేని ఆత్మవిశ్వాసం
ఉన్నవారికి అపజయమే ఉండదు
ఓర్పు ఉన్నవారికి ఓటమే ఉండదు
సత్యం... శ్రద్ధ... పవిత్రత
నిస్వార్ధం... దృఢసంకల్పం
పవిత్రమైన ఆశయం...వీరత్వం
ఆత్మజ్ఞానం... ఆత్మబలం అను
ఆయుధాలను ధరించినవారికి
సమస్తలోకాలు...పాదాక్రాంతం
ఎప్పటికైనా అఖండవిజయం...వారిసొంతమే
సూర్యునిచుట్టూ భూమిలా
విజయలక్ష్మి వారిచుట్టే తిరుగుతుంది...ఇదిసత్యమే
31. అణుబాంబు కన్న
ఆత్మవిశ్వాసమే మిన్న
అది
సన్నగిల్లితే
బలహీనతే
బలమే జీవనం
బలహీనతే మరణం
ఆకాశం నుండి పిడుగు
పడినా చెలించని మీరు
కుక్క పిల్లల అరుపులకు
కుమిలి కుమిలి ఏడుస్తారా?
మీలో అనంతమైనశక్తి దాగి ఉంది
ఏదైనా సాధించగలసత్తా మీలోఉంది
వెనుకటి ఋషులు మహర్షులు
మహాపురుషులే మీరు ఈ జన్మలే వేరు
ఆత్మవిశ్వాసంతో
ఆత్మదర్శనం విశ్వదర్శనం
ఆ పరమాత్మ దర్శనం సాధ్యమే
ఊహకందని ఉజ్వలభవిష్యత్తు మీసొంతం
నిరాశ పడకండి నిద్రమేల్కోండి
మేమేమీ చేయలేము అనకండి
మేమేదైనా సాధించగలమనండి
తరగని ఆత్మవిశ్వాసంతో ఉండండి
మీలోని ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేయండి
అణుబాంబులకన్నా అతి శక్తివంతమైన
ఆరకరగిలే అనంతమైన ఆత్మవిశ్వాసంతో
సమసమాజానికి మీరు పునాదులు వేయవచ్చు
ఈభారతావని పునర్మించవచ్చు చరిత్రను సృష్టించవచ్చు
32. స్నేహబంధం
ఓ కవి స్నేహాన్ని ఇలా వర్ణిస్తున్నాడు
నిజమైన మిత్రులకు మించిన ఆస్తిలేదని....
స్నేహానికి ఎల్లలు లేవని...
అది సరిహద్దుల్ని చెరిపి వేస్తుందని...
అది వికాసానికి వినోదానికి బాటలు వేస్తుందని....
మంచి మిత్రుడు తోడుంటే
ఆయుధం ధరించినంత ధైర్యమని...
జీవితమనే ఉద్యానవనంలో
అందమైన పుష్పం స్నేహమని...
హృదయపు తలుపును ఒక్కసారి తడితే...
అందులోని మాధుర్యమంతా
ప్రతిహృదిలో గుబాళిస్తుందని...
ప్రతిఫలాన్ని ఆశించని ఆ స్నేహబంధం
మొగ్గలా ప్రారంభమై..
మహావృక్షంగా ఎదిగి...
జీవితాంతం తోడుగా ఉంటుందని...
ఇద్దరు వ్యక్తులకు,
ఇరువురి మనసులకు సంబంధించిన
ఈ 'స్నేహం' తరతరాలకు
తీపిని పంచుతుందని...
కాలాలకతీతంగా మైత్రి
మధురిమను పెంచుతోందని...
కన్నవారితో, కట్టుకున్నవారితో,
తోడబుట్టినవారితో చెప్పుకోలేని
విషయాలను మిత్రులతో చెప్పుకోవడం
మిత్రత్వలోని గొప్పదనమని...
స్నేహం అంటే...
ఓ మధురమైన అనుభూతి అని...
ప్రవిత్రమైన స్నేహం ప్రకృతి వంటిదని...
అది ఎంతో ఓదార్పునిస్తుందని...
జీవనయానంలో
స్నేహం శ్వాస వంటిదని...
సృష్టిలో నా అనేవారు,
బంధువులులేని వారు
ఎవరైనాఉంటారేమే గాని
స్నేహితులులేని వారుండరని...
కష్టాల్లో సుఖాల్లో అండగా ఉండేవారు..
నిస్వార్థ సహాయంఅందించే వారే
నిజమైన మిత్రులని...
స్నేహమే జీవితమని.. స్నేహమే శాశ్వతమని...
స్నేహమెంతో ఎంతో తియ్యనైనదని...
అమ్మ ప్రేమ, స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యమని... స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిదని... అట్టి స్నేహంలో అనంతమైన ఆత్మ సంతృప్తి దాగిఉందని...
ఆ స్నేహానుభూతిని ఒకసారి అనుభవిస్తేనే తెలుస్తుందని...
33. మననోటి మాటలు
మననోటి మాటలు
రత్నాలరాసులు
ముత్యాలమూటలు
కావాలి అంతే కానీ...
ముళ్ళబాటలు కారాదు
మననోటి మాటలు
వినోదాన్ని పంచాలి
విజయాన్ని అందించాలి
అంతే కానీ...
పగా ప్రతీకారాలతో
రగిలిపోరాదు
కసిగా విషాన్ని
చిమ్మరాదు
విమర్శనాత్మకంగా
ఉండరాదు
మననోటి మాటలు
హరివిల్లులా
విరిజల్లులా
మరుమల్లెలా
మంచిగంధంలా
మురిపించాలి
మైమరపించాలి
మత్తెక్కించాలి
మంచిని పంచాలి
అంతే కానీ...
కత్తిలా
మనసును
గాయపరచరాదు
కాలిలో ముల్లులా
గుండెలో గునపంలా
గుచ్చుకోరాదు
కంటిలో కొరివికారంలా
మంటలు రేపరాదు
మిత్రులారా ! మీ నోటిమాటలు జాగ్రత్త !
34. ఓ కవీ ఏమిటి నీకర్తవ్యం ?
ఓ కవి నీ కలాన్ని "హలంగా" మార్చి
సాహితీ క్షేత్రంలో "సేద్యం"చేసి
సమాజంలోని రుగ్మతలకు "వైద్యం"చేసి
పదకవితలతో పద్యాలతో
కళామతల్లికి "నైవేద్యం"పెట్టినప్పుడే
నీ జీవితానికి ఒక అర్ధం పరమార్ధం
కవిగా సాహితీలోకంలో ధ్రువతారగా
చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో
లిఖించబడుతుంది
"తరతరాలుగాా"
"అవివేకం అజ్ఞానం"
"అమాయకత్వమే వరాలుగా"
బానిసత్వపు బ్రతికే బంగారుమయంగా
అవివేకంలో అజ్ఞానంలో అంధకారంలో
బ్రతుకుబండి నీడ్చే బడుగుజీవులకు
పీడిత తాడిత బడుగు బలహీనవర్గాలకు
నీవు కొండంత అండగా ఉండాలి
నివురుగప్పిన నిప్పులాంటివారిని
చైతన్యవంతుల్ని చేయాలి
ఖణఖణమండేనిప్పు కణికలుగా మార్చాలి
వారి జీవితాల్లో కమ్ముకున్న చిమ్మచీకట్లను
నీ కవితా కరవాలంతో చీల్చి వేయాలి
వారి గుండెలనిండా పండువెన్నెల్ని నింపాలి
వారి జీవితాలకు బాహుబలిలా భరోసా నివ్వాలి
నిర్భయంగా నిశ్చింతగా ప్రశాంతంగా
సుఖజీవనం చేసేలా
సులభమైన మార్గాలను అన్వేషించాలి
నాటి నేటి జీవన స్థితిగతులను
లోతుగా అధ్యయనం చేయాలి
నిప్పులాంటి నిజాలను వెలికితీయ్యాలి
వారి బానిసత్వపు బ్రతుకుల్లో వాడని
నవ్వుల పువ్వులు పూయించాలి
అందీ అందని ద్రాక్షగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని
సమానత్వం సౌభ్రాతృత్వాల్ని
రక్షణకవచంలాంటి రాజ్యాంగ రక్షణల్ని
కోల్పోయిన హక్కుల్ని తిరిగి పొందేలా
అందరినీ ఏకంచెయ్యాలి ఏనుగులుగా మార్చాలి
ఆత్మగౌరవమే వారికి "ఆయుధంలా"
ఆత్మవిశ్వాసమే వారికి "ఆక్సిజన్ గా"
ఆత్మబలమే వారికి "అమృతంలా" అందివ్వాలి
వారి గుండెల్లో చిరస్థాయిగా నీవు నిలిచిపోవాలి
ఓ కవి ఇదే నీ కర్తవ్యం
ఇదే నీ బాధ్యత నీ ఆశయం కావాలి
నీవు ఓ అరుణోదయకిరణమై
నిరుపేదల జీవితాలను వెలిగించాలి
35. సమస్య ఏదైనాఎదురీదు
ఏ సమస్య
ఎప్పుడు వచ్చినా
ఎదురీదు లేదా ఏటిలో దూకు
పిరికి పందలా పారిపోకు
పిచ్చివాడిలా దిక్కులు చూడకు
దిగులు చెందకు
కుక్కలా తోక వూపుతూ
ప్రక్కకు తప్పుకోకు కసితో
కక్షతో దీక్షతో పగతో పట్టుదలతో
పిడికిలి బిగించి ఉక్కులా మారు
ఉపాయం దొరుకుతుంది
దైర్యం చేసి ఎదుర్కో!
లేదా చిరునవ్వునవ్వి లొంగిపో!
ఎదుర్కొంటే ఏదో ఒక రోజు
విజయగర్వంతో పొంగిపోతావు!
లొంగిపోతే ఏదో ఒకరోజు
కృంగిపోతావు
లోలోన కుమిలిపోతావు!
అందుకే ఓ మిత్రమా !
కలనైనా ఓ నిజం మరువకు !
విశ్రమంచక నిత్యం శ్రమించేవారినే
విజయం "విందుకు" పిలుస్తుందని!
36. *సహనమే సంపద...*
*క* క్షలు కార్పణ్యాలు...
*వ* ద్దు వద్దు వద్దు
*న* మ్మినవారిని మోసం చేయవద్దు
*ప* గా ప్రతీకారాలు అసలే
*వ* ద్దు వద్దు వద్దు
*న* లుగురిని గౌరవించు పదిమందిని ప్రేమించు
*వీ*రున్ని నేను శూరున్ని అంటూ విరవీగకు
*చి*రుతపులినంటూ చిందులు వేయకు
*క*డుపులో కత్తులుంచుకొని కౌగలించుకోకు
*జ*నంపైకి విరుచుపడకు జగడానికి కాలుదువ్వకు
*న* వ్వు నవ్వుతూ జీవించు
*దీ* పమై పదిమందికి దారిచూపు
*పి* లిచిన ఆ పరమాత్మ
*క*న్ను మూసి కటికెళ్ళక తప్పదే
*స*ర్బుద్ధి సహనం తరగని సంపదే
*దా*నవత్వం వద్దు దైవత్వమే ముద్దు
ఈ సత్యం కలనైనా మరువవద్దు
37. జై బోలో జై బోలో!
గిడుగు తాతకు జైబోలో!!
జై బోలో జై బోలో! గిడుగు తాతకు జైబోలో!
జై బోలో జై బోలో !తెలుగు భాషకు జైబోలో!
జై బోలో జై బోలో !తెలుగు తల్లికి జైబోలో!
గ్రాంధిక భాషను గంగలో కలిపి తేనెకన్న తీయనైన అచ్చతెనుగు భాషను తెచ్చే మన గిడుగు తాత
గిడుగు తాతంటే గ్రాంధిక భాష మీద పడ్డ పిడుగు
గిడుగు తాత అంటే తెలుగు భాష తలపై గొడుగు
అందుకే ||జై బోలో జై బోలో||
మన తెలుగు భాషకు అక్షరాలు యాబైయారన్నాడు
అవే మన తెలుగు జాతికి కోటివరాలన్నాడు
వద్దు వద్దు పరబాషలు మనకొద్దన్నాడు
మన తెలుగు భాషే మనకు ముద్దన్నాడు
అందుకే ||జై బోలో జై బోలో||
మన తెలుగు సంస్కృతి, మన తెలుగు తల్లి
నుదుట దిద్దిన కుంకుమతిలకమన్నాడు
మన తెలుగు సాంప్రదాయాలు,మనతెలుగుతల్లికి
వెలకట్టలేని స్వర్ణాభరణాలన్నాడు
అందుకే ||జై బోలో జై బోలో||
తెలుగు పండితుల కావ్యాలు బృహత్ గ్రంథాలు
మన తెలుగు తల్లికి కట్టబెట్టిన పట్టుచీరలన్నాడు
తెలుగు కవులు వ్రాసిన పద్యాలు మన తెలుగు తల్లి
మెడలో మెరిసే పచ్చని కెంపుల హారాలన్నాడు
అందుకే ||జై బోలో జై బోలో||
నేను తెలుగు వాడిని
నా బాష తెలుగు భాష
నా జాతీయ జెండాలో
తెలుగుతనమున్నది
నా అందమైన తెలుగు భాషలో అమృతమున్నది
నా కమ్మనైన తెలుగు భాషలో అమ్మతనమున్నది
నా తెలుగు భాష నా జాతి ఆత్మ ఘోషన్నాడు
నా తెలుగు యాస నా జాతి జీవనశ్వాసన్నాడు
అందుకే ||జై బోలో జై బోలో||
ఏమని వర్ణింతు నా
తెలుగుభాష వైభవాన్ని
ఏమని వర్ణింతు నా
తెలుగువాడి పౌరుషాన్ని
తెలుగుతల్లి కడుపున పుట్టడమే
మన పూర్వజన్మ సుకృతమన్నాడు
ఎక్కడ తెలుగు వుంటుందో
అక్కడ వెలుగు వుందన్నాడు
ఎక్కడ వెలుగు వుంటుందో
అక్కడ విజ్ఞానం వికాసం విజయముందన్నాడు
అందుకే
జై బోలో జై బోలో !గిడుగు తాతకు జైబోలో!
జై బోలో జై బోలో !గాంధీ తాతకు జైబోలో!
జై బోలో జై బోలో !తెలుగు భాషకు జైబోలో!
జై బోలో జై బోలో !తెలుగు తల్లికి జైబోలో !
జై బోలో జై బోలో !
జాతీయ జెండాకు జైబోలో !
జై బోలో జై బోలో !భారతమాతకు జైబోలో!
జై బోలో జై బోలో !
స్వాతంత్రయోధులకు జైబోలో!
జై బోలో జై బోలో !అమరవీరులకు జైబోలో!
38. ఓ తెలుగు భారతీ!
మీకు ప్రణామం ..ప్రణామం...
ఓ తెలుగు తల్లీ !
మీకు వందనం! అభివందనం! పాదాభివందనం!
ఓ గిడుగు తాతయ్యా!
మీకిదే మా అక్షర నీరాజనం
తెలుగు భారతికి ! నా అక్షర హారతి?
నా తెలుగు భాష! నా జాతి ఆత్మ ఘోష!
నా తెలుగు యాస! నా జాతి జీవనశ్వాస!
నేను తెలుగువాన్ని!
నా భాష తెలుగు భాష!
యాబైఆరు అక్షరాలే!
నాతెలుగుజాతికి వరాలు!
ఆ అక్షరాలే...
నా తెలుగునేలపై కురిసిన
విరిజల్లులు!
ఆ అక్షరాలే...
నా తెలుగుజాతి గుండెల్లో విరిసిన హరివిల్లులు!
ఆ అక్షరాలే...
నా తెలుగుతల్లి సిగలో మురిసే ముద్దమందారాలు!
నా కవులు వ్రాసిన పద్యాలే...
నా తెలుగుతల్లికి సమర్పించే పారిజాతపుష్పాలు!
నా తెలుగు పండితుల
కావ్యాలే బృహత్ గ్రంథాలే...
నా తెలుగుతల్లికి అలంకరించే పట్టుపీతాంబరాలు !
నా తెలుగు సంస్కృతే...
నా తెలుగుతల్లి నుదుట దిద్దిన కుంకుమతిలకం!
నా తెలుగు సాంప్రదాయాలే...
నా తెలుగుతల్లికి వెలకట్టలేని బంగరుఆభరణాలు!
నా తెలుగు గాయకులు ఆలపించే మధురగీతాలే...
నా తెలుగుతల్లి మెడలో మెరిసేటి పూలహారాలు!
ఎక్కడ తెలుగు వుంటుందో!
అక్కడ వెలుగు వుంటుంది!
ఎక్కడ వెలుగు వుంటుందో!
అక్కడ వికాస ముంటుంది!
ఏమని వర్ణింతు తెలుగుభాష వైభవం తెలుగువాడి పౌరుషం!
తెలుగుతల్లి కడుపున పుట్టడం
మన పూర్వజన్మ సుకృతం!
అందుకే ఆ తల్లికి ప్రణామం !..
ప్రణామం!... ప్రణామం!...
నా తెలుగుతల్లికి వందనం!
అభివందనం!పాదాభివందనం!
39. విలువ ఎరిగినవారే విజ్ఞులు
గుడ్డివారికేం తెలుసు ?
...గులాబీల విలువ !
గాడిదలకేం తెలుసు ?
...గంధం చెక్కల విలువ !
గాఢాంధకారంలో తిరిగే
గబ్బిలాలకేం తెలుసు ?
...వెలుతురు విలువ !
అనాధలకేం తెలుసు ?
... అమ్మానాన్నల విలువ !
మందబుద్దులకేం తెలుసు ?
...మహాభారతం విలువ
పరమనాస్తికులకేం తెలుసు ?
...పరమాత్మ మహిమ !
ఆటలో ఓడినోళ్ళకేం తెలుసు !
... విజయం విలువ !
ఇంటిబాధ్యత లేనోళ్ళకేం తెలుసు ?
...ఇన్సూరెన్స్ విలువ !
విడాకులు పుచ్ఛుకున్నోళ్ళకే తెలుసు !
...వివాహబంధమెంత విలువైనదో !
గుండుసూదులు గుచ్చుకున్నోళ్ళకే తెలుసు !
...గుండెల్లో భరించలేని ఆ బాధెంతో !
కరోనా కోరల్లో చిక్కుకున్న వారికే తెలుసు !
...ప్రాణమెంత ఖరీదైనదో !
ప్రాణత్యాగం చేసిన భగ్నప్రేమికులకే తెలుసు !
...ఆ ప్రేమ ఎంత మధురమైనదో !
40.ఎవరితరం కాదు
"కళ్లు" చెమర్చకుండా
సంసారాన్ని...ఈదడం
"కాళ్ళు" తడవకుండా
సముద్రాన్ని...దాటడం
"పళ్ళు" కనిపించకుండా
విరగబడి నవ్వడం
వికటాట్టహాసం...చెయ్యడం
"ఒళ్ళు" గుల్లకాకుండా
శిక్షణలో ఒలింపిక్స్ లో
పసిడిపతకం...సాధించడం
"విల్లు" వంచకుండా
బాణాలను...సంధించడం
"ముల్లు" గుచ్చుకోకుండా
గులాబీపువ్వును...త్రుంచడం
ఎవరితరం కాదు ఇది పచ్చినిజం
41. వద్దువద్దు...ముద్దుముద్దు
కక్షలు కార్పణ్యాలు
పగలు ప్రతీకారాలు
కుట్రలు కుతంత్రాలు
అసూయా ద్వేషాలు
అహంకారం
అధికార దాహం వద్దేవద్దు
అనుమానాలు
అవమానాలు అపార్థాలు
శాపనార్థాలు
ఆరని కోపతాపాలు వద్దేవద్దు
ఎదిగే వారిని ఆటంకపరచడాలు
పైకి ప్రాకేవారిని వెనక్కిలాగడాలు
వెన్నుపోటు పొడవడాలు వద్దేవద్దు
విమర్శించడాలు విషం చిమ్మడాలు
నిరాశ పరచడాలు రాళ్లు విసరడాలు
కళ్ళల్లో ముళ్ళు గుచ్చడాలు వద్దేవద్దు
మచ్చలేని వ్యక్తిత్వమే ముద్దుముద్దు
దాతృత్వం దైవత్వమే ముద్దుముద్దు
సహనం సమానత్వమే ముద్దుముద్దు
మంచితనం మానవత్వమే ముద్దుముద్దు
42. పోలన్న కవి సూక్తి సుధలు
1
ఎవరెస్టు శిఖరం ఎక్కడం
ఎంతో సులభంరా
దూకుడమే శిఖరం నుండి
పరమ దుర్లభమురా
సాధన చేస్తే,సాహసమే ఉంటే
సాధ్యం కానిదేముందిరా ?
2
నావ ఎక్కి నీవు
నడిసంద్రం చేరాక
ఇక తిరిగి చూడకురా
వెనక్కి తీరం చేరేదాకా
గట్టి పట్టుదల ఉన్నవాడే
కదరా గట్టుకు చేరేది
3
ప్రయత్నించగా ప్రయత్నించగా
ప్రతిభ పండురా
తీవ్ర ప్రయత్నంలోనే
తీయని ఫలితం ఉందిరా
కష్టించి పని చేసేవాడే
కదరా కార్యసాధకుండు
4
లాగరా లాగరా
తెగేదాక వస్తే ఆగరా
ఆగరా ఆగరా ఆలోచించి
ముందుకు సాగరా
సాగరా సాగరా
ఆపై విజయామృతాన్ని త్రాగరా
43. నిద్రలో సైతం నీలక్ష్యాన్ని మరువకు!
ఎవరెస్టు శిఖరం ఎక్కడం సులభం
దూకడమే అక్కడనుండి దుర్లభం
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం సులభం
అక్కడికి చేరుకోవడమే బహుకష్టం
ఐతే తపనంటూ వుంటే...
సాధన చేస్తే... సాహసం చేస్తే...
ప్రయత్నిస్తే... ప్రతిబందకాల్ని దాటేస్తే...
గట్టి పట్టుదలతో గమ్యాన్ని చేరకోవచ్చు
ఏలక్ష్యసిధ్ధికైనా సరే ఆత్మశుద్ధి కావాలి, కొంత
త్యాగం చెయ్యాలి కొత్తమార్గాలను కనిపెట్టాలి
నేను అగ్నిని మింగేస్తానని...
నేను పర్వతాలను కదిలిస్తాని...
నేను సముద్రాన్ని త్రాగేస్తానని...
అడ్డంకులకు వెరవక...లక్ష్యాన్ని మరువక
అకుంఠదీక్షతో గమ్యంకోసం ముందుకుసాగితే...
చివరి అడుగు ఆవలితీరం వరకే ...
కొండంత వెలుగు నిచ్చేది గోరంతదీపమే...
చిమ్మచీకటిని చీల్చుకు వచ్చేది
వేకువవెలుగే...ఆపై
విధిని ఎదురించవచ్చు విజయశిఖరాలను చేరవచ్చు
గురితప్పని లక్ష్యమెంతటి కష్టమైనా సంక్లిష్టమైనా
కసితో కృషితో నిరంతర సాధనతో ఛేదించుట సాధ్యమే...
లక్షలమైళ్ళదూరమైనా ప్రారంభం ఒక్కఅడుగుతోనే...
లక్ష్యసాధనంటేనే ప్రఙ్ఞను నిరూపించే ఓ మహాయజ్ఞమే..
44. గతం...ఒక పెనుభూతం ?
గతాన్ని గమనించనివారు
గతించినవారి నుండి గుణపాఠాలు
నేర్చుకోనివారు బ్రతుకును మార్చుకోనివారు
స్వచ్ఛమైన జీవితాన్ని స్వాగతించనివారు
బయటపడని మానసిక వ్యాధులకు బలైపోతారు
ఒంటరిగా రేయింబవళ్ళు ఏడ్చిఏడ్చి
కడవలు కడవలు కన్నీరు కార్చికార్చి
కునుకేలేక కంటికి కుమిలిపోతారు
బయటపడని మానసిక వ్యాధులకు బలైపోతారు
తెలిసి తాము చేసిన తప్పే
తమని రోజు చెంపమీద కొడుతుంటే
నిలువునా నిప్పులా దహించివేస్తుంటే
తట్టుకోలేక పోతారు తల్లడిల్లిపోతారు
వ్యధలతో బాధలతో మదనపడి మదనబడి
క్రుంగిపోతారు కృషించి నశించిపోతారు
బయటపడని మానసిక వ్యాధులకు బలైపోతారు
తస్మాత్ జాగ్రత్త తప్పుచేస్తే తక్షణమే ఒప్పుకోండి
కార్చిచ్చులా కాల్చి మిమ్ము బూడిదచేయకముందే
ఆపై ఒక్కరే ఒంటరిగా బ్రతకునీడ్చలేక
మానని గాయాలతో మతిభ్రమించి
మాయమైపోతారు చిట్టచివరికి మట్టిలో
కలిసిపోతారు మాయనిమచ్చగా మిగిలిపోతారు
45. సాహసమే ఊపిరైతే సమస్తం సాధ్యమే !
అన్నీ మహాఅద్భుతాలే...
అవి ఎవరూ చేయనంత కాలం !
అన్నీ వింతలు విశేషాలే...
అవి ఎవరూ కనిపెట్టనంత కాలం !
అన్నీ మహా ఘనవిజయాలే...
అవి ఎవరూ అందుకోనంత కాలం !
అన్నీ చిత్రవిచిత్రమైన విషయాలే...
అవి వెలుగులోనికి రానంత కాలం !
అన్నీ అందరికీ అసాధ్యాలే...
అవి ఎవరూ సాధించనంత కాలం !
అన్నీ గొప్ప గొప్పపనులే...
అవి ఎవరూ ప్రారంభించనంత కాలం !
అన్నీ మహా సాహసకార్యాలే...
అవి ఎవరూ ప్రయత్నించనంత కాలం !
అన్నీ గొప్ప గొప్పఆలోచనలే...
అవి ఎవరూ ఆచరణలో పెట్టనంత కాలం !
ఒక్కసారి ఎదురులేని ఏకాగ్రతతో
గట్టినమ్మకంతో గట్టిపట్టుదలతో
సరైన శిక్షణతో దృఢమైన దీక్షతో కసితో
కృషితో తరగని తపనతో కష్టపడితే...
కాలమే కలిసివచ్చి జ్వలించే కోరిక ఫలిస్తే...
ఎన్ని రికార్డులు బ్రద్దలో ఎన్ని రివార్డులో...
ఎన్ని ప్రశంసలో ఎన్ని సన్మానాలు సత్కారాలో...
కలనైనా ఊహించని ఎన్ని అఖండమైన కీర్తిప్రతిష్టలో...
ఔను సాహసమే...ఊపిరైనవారికి సమస్తమూ సాధ్యమే !
46. స్పందించు స్నేహహస్త మందించు
నేమనిషినే మానును కాను
ఐతే నా మాట తప్పక విను
ఏదైనా ఎప్పుడైనా
వీడియో చూసినప్పుడు
మంచి సందేశం చదివినప్పుడు
మంచి దనిపిస్తే, మనసుకు నచ్చితే
వెంటనే స్పందించు
చిరునవ్వు చిందించు
స్నేహహస్త మందించు
ప్రతివారిని ప్రేమించు
ఆప్యాయంగా పలకరించు
ఆపదలో ఉన్నవారిని ఆదుకో
నేనున్నానన్న భరోసా నివ్వు
నేను మనిషివేనని మంచితనానికి
మానవత్వానికి మారుపేరని
నేను నిప్పులాంటి వాడవని
నీతికి నిజాయితీకి
నిలువుటద్దమని నిరూపించుకో
ఆడలేనివాడే మద్దెల ఓడంటాడు
మాటరానివాడే మౌనంగా వుంటాడు
చేతకానివాడే చేతులు ముడుచుకుంటాడు
అరిచే కాకిని కరిచే కుక్కనుకసురుకుంటారు
ఆడే నెమలికి పాడే కోకిలకి ఫ్యాన్స్ వుంటారు
అందుకే
సకాలంలో స్పందించనివారంతా
కదలని కట్టెలతో సమానమంటారు
అవునంటారా? కాదంటారా? మరి మీరేమంటారు?
47. కాలంచేసే ఇంద్రజాలం...
శతృవుతో పోట్లాడితే సమస్య
శతృవుతో మాట్లాడితే పరిష్కారం
ఈ జీవితం...సంద్రమైతే
సుఖసంతోషాలు జలచరాలైతే
వాటిని...పట్టుకోవాలంటే
కాలమనే...గాలాన్ని విసరాలి
ఈ జీవితం...విషాదభరితమైతే
కష్టనష్టాలు బాధలు భయాలు భూతాలైతే
వాటిని...తట్టుకోవాలంటే
కాలమనే...శూలాన్ని విసరాలి
కొందరు ప్రాణమిత్రులే బద్దశతృవులౌతారు
కొందరు బద్దశతృవులే ప్రాణమిత్రులౌతారు
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం
కొందరిని కాలం క్షణంలో చిత్రంగా కలుపుతుంది
కొందరిని కాలం క్షణంలో కౄరంగా విడదీస్తుంది
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఇద్దరు ఒక్కటౌతారు
రేపు విడిపోయి దూరమైతారు దుఖ్ఖితులౌతారు
కారణం ఒక్కటే కలికాలం విధిఆడే వింతనాటకం
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం
కాలం తల్లక్రిందులైతే భూగోళమంతా గందరగోళం
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం
నిజమే కలిసివుంటే కలదు సుఖం ముందు ముందు
జీవితంలో తగిలే గాయాలకు కాలమే మంచిమందు
48. పెళ్లినాటి ప్రమాణం....
ప్రియా ! ఓ నా ప్రియా...
అందరిలో పెళ్లిపందిరిలో
మూడుముళ్ళు వేసి
ఏడడుగులు నడిచి,
పంచభూతాలసాక్షిగా నేడు
నీకు ప్రమాణం చేస్తున్నాను...
ప్రియా ! ఓ నా ప్రియా ! నేను
నీ చేతికి గాజునౌతానని
నీ కాలికి మెట్టెనౌతానని
నీ బుగ్గన చుక్కనౌతానని
నీ మెడలో హారమౌతానని
నీ నుదుట బొట్టునౌతానని
నీ కంటికి కాటుక నౌతానని
నీ ఇంటికి వెలుగునౌతానని
నీ కడుపులో బిడ్డనౌతానని
నీ సిగలో సిరిమల్లె నౌతానని
నేడు నీకు ప్రమాణం చేస్తున్నాను...
ప్రియా ! ఓ నా ప్రియా ! నేను
నీ కష్టాలలో నీ కన్నీళ్ళలో
నీ సుఖంలో నీ దుఃఖంలో
నీకు కొండంత అండగా ఉంటానని
కంటికిరెప్పలా నిన్ను
కాపాడుకుంటాని
నిన్ను విడువనని
కాటికైనా నీ వెంటే నడుస్తానని
చితిలో సైతం నీ వెంటే వుంటానని
కాలిబూడిదయ్యేందుకైనా
సదా నేను సిద్దమని
నా గుప్పెడుగుండె గుడికట్టి
నిన్ను ఓదేవతగా నిత్యం కొలుస్తానని
నేడు నీకు ప్రమాణం చేస్తున్నాను......
నేడే ఆ భగవంతుడికి
ఓ విజ్ఞాపన" చేసుకొంటున్నాను
మనిద్దరిని జన్మజన్మలకు
"విడిపోని జంటగా"ముడివేయమని
భార్యగా నిన్నే బహుమతిగా" ఇమ్మని
49. ప్రతిమనిషి పరమాత్మ స్వరూపమే
నిరాకారుడైన
ఆ భగవంతుడు కోరుకునేది
భక్తులు సమర్పించే కోట్లు ఖరీదుచేసే
బంగారు ఆభరణాలా ?
అందమైన అలంకరణలా ? లేదే
ఫల పుష్పాదులతో
ధూపదీప నైవేద్యాలతో
సుగంధ ద్రవ్యాలతో సుప్రభాత వేళ
నిస్వార్థంగా నీతిగా నిజాయితీగా
నియమనిష్టలతో నిత్యం
నీవు చేసే నిజమైన పూజలు
హారతులు అర్చనలు అభిషేకాలే కదా!
సర్వాంతర్యామియైన
ఆ భగవంతుడు కోరుకునేది
కోట్లు ఖర్చు చేసి నీవు నిర్మించే
అందమైన సుందరమైన కోవెలా? కాదే
నిర్మలమైన నిష్కల్మషమైన
జాలి ప్రేమ కరుణ దయ క్షమా
సద్గుణాలకు నిలయమైన
నీ హృదయదేవాలయమే కదా!
ఆ భగవంతుని విగ్రహాన్ని
ఆ సుందర దేవతా శిల్పాన్ని
ఆ గర్భగుడిలో ప్రతిష్టించేది
కళ్ళెంలేని గుర్రంలా, ప్రాపంచిక
విషయాలవెంట పరుగులుపెట్టే
నీ చంచలచిత్తంలో ఏకాగ్రత కోసమే
నీలోని కోపతాపాల నిగ్రహం కోసమే
ఆ భగవంతుని చల్లని అనుగ్రహం కోసమే
ఈ నగ్నసత్యాన్ని గుర్తెరిగి,పరిణితి చెంది
ప్రతి మనిషిలోనూ నీవు ఆ పరమాత్మను
దర్శించగలిగితే నిజంగా నీ ఈ జన్మధన్యమే
50.పోరాడితేపోయేదేముంది చెప్పండి?
ఓ బహుజన బిడ్డలారా! మీరు
బావిలో కప్పల్లాగ
గుడ్డిగా దూకే గొర్రెల్లా
ఆకులు మేసే మేకల్లా
తోకలు ఊపే కుక్కల్లా
బెదురు చూపుల జింకల్లా
గొడ్డు చాకిరి చేసే గాడిదల్లా
పంజరాల్లోపక్షుల్లా బ్రతక్కండి !
గర్జించే సింహాల్లా
గాండ్రించే పులుల్లా
బుసలు కొట్టే కోడెనాగుల్లా
ఘీంకరించే మదపుటేనుగుల్లా
ఎగిరే తారా జువ్వల్లా
రగిలే నిప్పురవ్వల్లా బ్రతకండి !
ఓ బహుజన బిడ్డలారా! మీరు
ఒకరిపై ఆధారపడినంత కాలం
మీరు అనాధలే....
అడుగునుండే బడుగువర్గాలే
అణగారిన అణద్రొక్కబడిన
అమాయకులే....
ఓ పీడిత తాడిత ప్రజల్లారా !
పిడుగుల్లా మారండి ! పిడికిలి
బిగించి ముందుకు దూకండి !
ప్రశ్నించండి !
ప్రతిఘటించండి !
ప్రచండశక్తితో సమిష్టిగా
పులుల్లాగ పోరాడండి.!
పోరాడితే పోయేదేముంది చెప్పండి?
వెయ్యేళ్ళ మీ బానిసత్వం తప్ప
కానీ తప్పక వస్తుంది
సమాజంలో మీకు సమానత్వం
మరవకండి ! మరువకండి !
కలనైనా మరవకండి....!
ఆకులుమేసే అమాయకపు
మేకల్నితప్ప...
పులుల్ని సింహాలనెవరూ
పూజకు బలివ్వరన్న...
అంబేద్కర్ అమృతవాక్కుల్ని
కలనైనా మరవకండి..........
51. పోలన్న కవి సూక్తి సుధలు
గుండెగల వారందరికి
గులామ్ నన్నదిరా
శ్రమజీవులందరికి
లాల్ సలాము లన్నదిరా
వీరజవాన్ల బాటలోనే
విజయమున్నదిరా
కోకిల రాగాలు నేర్పేరురా
కావ్ కావ్ మని అరిచే కాకులకు
బ్రతుకు దారి చూపేరురా
బావిలో తిరిగే కప్పలకు
సాధ్యం కానిది ఏముందిరా
సాహసవీరులకుసంఘసంస్కర్తలకు
బీడీ వ్యాపారులైనను
బిర్లాలు టాటా లైనను
బిజినెస్ చేసేవారెన్నడు
భిక్షగాళ్ళు కాదురా
కృషిని నమ్మినవారే కదరా
కుబేరులయ్యేదిఇలలో
52. నిండునూరేళ్ళు...(ని అక్షరంతో కవిత)
నీతిగా...
నిష్టగా...
నిర్మలంగా...
నిశ్చలంగా...
నిదానంగా...
నిప్పులా...
నిస్వార్థంగా...
నిర్భయంగా...
నిజాయితీగా...
నిర్మొహమాటంగా...
నిగ్రహంతో...
నిబద్దతతో...
నియమనిష్టలతో...
నిండుమనసుతో...
నిర్వేదం...
నిరాశానిస్పృహలు...
నిట్టూర్పులు లేకుండా...
నిండునూరేళ్ళు జీవించిన...ఇక
నీకన్న భాగ్యవంతులెవరు ఈఅవనిలో ఈ
నిత్యసత్యాన్ని కాదనగలవారెవరు? ఈధరణిలో
53. ఆశతో అర్థించా.!..భక్తితో ప్రార్థించా !
నా ఆలాచనా అక్షరాలను ఆకాశంలో
విసిరేస్తే నవ్వేనక్షత్రాలయ్యాయి
ఆ నక్షత్రాల మధ్యన
మెరిసే చంద్రున్ని అడిగా
ఇంతటి చక్కదనం నీకెక్కడిదని?
పక్కుననవ్వి ప్రక్కనున్న
సూర్యున్ని ఒక్కసారి అడగమనే
సూర్యున్ని అడిగితే సృష్టికర్త నడగమనే
సృష్టికర్తను ఆశతో అర్థించా...
భక్తితో ప్రార్థించా
అందమంటే అర్థమేమని?
అదెక్కడ దాక్కొని ఉందని?
ఆ దైవం నవ్వి నాచెవిలో ఇలా ఊదే
ఓ భక్తా అదెక్కడో లేదు నీవుచూసే నీచూపుల్లోనేననే
గోడపక్కన గొర్రె పిల్లను పెట్టుకొని ఊరంతావెతికినట్టు
అందంకోసం ఎందెందో వెతికిన అంధున్నినేను....ఔను
దుప్పటి కప్పుకున్నంతసేపే...
ఏవెచ్చదమైనా
గుట్టురట్టుకానంతకాలమే...
గుప్పెట దాగినంతకాలమే.....
ఏగుట్టు విలువైనా
పూజారి అనుగ్రహం ఉన్నంత కాలమే...
గుడితలుపుల్ని మూయనంతకాలమే...
ఏదైవదర్శనమైనా
ఎవరికీ తెలియనంతకాలమే.....
ఏ చిదంబర రహస్యమైనా
54. ముందుజన్మలో ముక్తి
నిత్యం
స్మశానాల్లో
సమాధుల మధ్య
సంచరించే శివుని
కరమున త్రిశూలం
మెడలో విషసర్పాలు
శివునికి పూలహారాలు
శిరమున పాతాళగంగ
కంఠంలో కాలకూటవిషం
మీరు సైతం శంకర స్వరూపులే
మీరు
బలహీనులుకాదు
భగవత్ స్వరూపులు
మీ కళ్ళను మీ కలలను
మీ కండరాలను విశ్వసించాలి
ఆత్మబలంతో ఆత్మవిశ్వాసంతో
అనంతాత్మను నమ్మాలి
పురాణాల్లో పుట్టిన
ముక్కోటిదేవతలపై విశ్వాసమున్నా
మీపై మీకు విశ్వాసం లేకున్న
ముందుజన్మలో మీకు ముక్తి సున్న
55. వచ్చేసింది టీకా - పిసికేస్తాం నీ పీక...
కనికరమేలేని
కంటికే కనిపించని
ఓసీ కరోనా రాక్షసీ !
ఎక్కడ పుట్టావో ఏమో?
ఎలా పుట్టావో ఏమో ?
ఏమి తింటావో ఏమో?
మనుషుల ప్రాణాలను
మాత్రం మింగేస్తున్నావ్
మానవత్వం లేనిదానవు
మనిషికి పుట్టిన దానివి కాదు
ఏ జంతువుకో జన్మించి వుంటావ్
కారణం నీకన్నీ మృగలక్షణాలే
నీవు ఏ విమానం ఎక్కక్కర్లేదు
ఏ పాస్ పోర్టు నీకక్కర్లేదు
అన్ని దేశాల సరిహద్దులను
ఎదేచ్చగా క్షణాల్లో దాటేస్తున్నావ్
వెయ్యి అణుబాంబులు వేసినా
నాశనం కానంటున్నావ్
నాకు చావేలేదంటున్నావ్
విశ్వమంతా విస్తరిస్తున్నావ్
విచ్చలవిడిగా విహరిస్తున్నావ్
వీరవిహారం చేస్తున్నావ్
విధ్వంసం సృష్టిస్తున్నావ్
ఓసీ కరోనా రాక్షసి !
ఎందుకే మామీద నీకింత కసి?
రెప్పపాటులో మరఫిరంగులతో
యుద్దవిమానాలతో సబ్ మెరైన్లతో
బాంబుల వర్షం కురిపించి
ఉగ్రవాద శిబిరాలను
పేల్చి కూల్చి శత్రుసైన్యాలను
చీల్చి చండాడి మట్టుపెట్టే
అత్యంత శక్తివంతమైన
అగ్రరాజ్యాలను సైతం అల్లాడిస్తున్నావ్
అన్నిదేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నావ్
ఓసీ కరోనా రాక్షసి ! నీకెంతటి ధైర్యమే !
మానవులమని మా చెంత మందులేదనేకదా
వచ్చేసిందే టీకా...
త్వరలో పిసికేస్తాం నీ పీక...
56. నా భారతనారి...అంటే ?
అలంకరణ పేర
అంగడిబొమ్మలా...అర్థనగ్నంగా...
అందం పేర గుడి మీద
బూతుబొమ్మలా
గుట్టురట్టయ్యేలా...అసహ్యంగా...
నాగరికత పేర
వాత్సాయనుడి కామశాస్త్రంలో
శృంగారభంగిమలా...అసభ్యంగా...
అందరికళ్ళు కొంగుమీదే పడేలా
కొరుక్కుతినేలా బరితెగించి నవ్వుతూ
నడిబజార్లో తిరిగేది నా భారతనారి కాదు...
హొయలు పడుతూ
వంకర్లు తిరుగుతూ పబ్లిక్ గా రోడ్డుమీద
పగలబడి నవ్వేది నా భారత నారి కాదు...
దూరదర్శన్ లో ప్రవహించే ఫారిన్
కల్చర్ కి ప్రతిరూపం నా భారతనారి కాదు...
అందని తన అందాలను
ప్రపంచ సుందరిలా ప్రబంధ నాయకిలా
అందరిముందారబోసేది నా భారతనారి కాదు...
నా భారతనారి...అంటే
ఎముకల గూడుగా మార్చే
ఎయిడ్స్ ను దిగుమతిచేసే దిష్టిబొమ్మ కాదు...
నా భారతనారి...అంటే
తలనిండా పూలుపెట్టి తల్లిలా కనిపించు
చేతినిండా గాజులు తొడిగి చెల్లిలా అనిపించు
నా భారతనారి...అంటే
సీతలా అగ్నిగుండములో దూకే ఆదిపరాశక్తి !
నా భారతనారి...అంటే
సతీసావిత్రిలా సంప్రదాయానికి
సంస్కృతికి సహనానికి సంస్కారానికి సంకేతం!
నా భారతనారి...అంటే
నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనమై మదర్
థెరిసాలా ప్రపంచానికి ప్రేమనుపంచే శాంతిపావురం!
57. కాదు కాదు ఆ కొంగ...
నీవే నిజమైన దొంగ
ఓ కొంగ ఆకలేసి
చెరువుగట్టున చేపపిల్లలకోసం
ఒంగి ఒంగి తిరుగుతుంటే నీటిలో
తొంగి తొంగి చూస్తుంటే
మనందరం ఆ కొంగను దొంగాఅంటాం
కాని ఆ కొంగను
చెరువులో ఆ చేపల్ని
పుట్టించింది ఆదైవమేఐతే
ఆ చేపలే ఆ కొంగకు ఆహారమైతే
అదే దేవుడి నిర్ణయమైతే
మరి చేపల్ని తిని ఆకలి తీర్చుకునే
ఆ కొంగ పాపం దొంగ ఎలా ఔతుంది?
కానీ ఓ మనిషీ!
నీ అనుదిన ఆహారం చేపలుకాదు
నీవు రోజు చెరువులో
ఏ గాలం వేసో ఏ వలవిసిరో
స్వేచ్చగా తిరిగే చేపల్ని పట్టుకుంటావ్
కమ్మగా కూర వండుకుంటావ్ తింటావ్
నిజానికి నీవే దొంగవి ఆ కొంగకాదు
58. ఆర్జిస్తే ఆస్తి - నిద్ర నాస్తి
పచ్చడిమెతుకులు తింటేనేమి
అర్దాకలితో ఉంటేనేమి
గుడ్డిదీపం వెలుగులో
గురకలుపెట్టి హాయిగా
ప్రశాంతంగా నిద్రపోతున్నాడు
పూరిగుడిసెలో నిశిరాత్రి వేళ ఓ నిరుపేద !
ఇంటికి కాపలా కాసే
కుక్కసైతం పీకలదాకా మెక్కి
కాసేపు కునుకు తీస్తుంది
కానీ ఖర్మకాలి అదిగో ఆ
ఏడంతస్తుల ఇంద్రభవనంలో
కళ్ళముందే నోరూరించే
కమ్మని పదార్థాలెన్ని ఉన్నా
అన్నీ తినాలనిపిస్తున్నా
ఏమీ తినలేక ఏంచెయ్యాలో
అర్థంకాక ఎవరికీ చెప్పుకోలేక
ఆకలికి అలమటిస్తున్నాడు
నిరాశతో నిట్టూరుస్తున్నాడు
సుఖనిద్రను...
సంపూర్ణ ఆరోగ్యాన్ని...
ప్రశాంతమైన జీవితాన్ని...
కోట్లున్నా సరే కొనలేక
కంటిమీద కునుకులేక
కుమిలిపోతున్నాడు
ఓ అపరకుబేరుడు !
కారణం ఒక్కటే
అక్రమంగా ఆర్జించి
పట్టు పరుపుల కింద
దాచుకున్న ఆ ధనాన్ని
పరులెవరైనా కాజేస్తారేమో ?
దొంగలెవరైనా దోచుకుంటారేమో?
అన్న ఒకేఒక్క,"చోరభయంతో"...
ఔనిది నిజమే దొంగల్ని దోచుకునే దొంగలుంటారుగా !
59. నీకు నాకేం తెలుసు...
నిమ్మకాయ పులుసు !!
పచ్చని...ఆ పండ్లచెట్టును...
నవ్వుతూ గొడ్డలితో నరికెయ్యకు
మున్ముందు...ఆ పండ్లచెట్టు...
ఇంకెన్ని తియ్యని ఫలాలను
ఇంకెంత మందికి అందించాలో
ఎవరికి తెలుసు ?
విత్తనం నాటిన ఆ వ్యక్తికి
పెంచిన ఆ ప్రకృతికి తప్ప...
చక్కని...ఆ పూలమొక్కను...
మొగ్గలోనే త్రుంచివెయ్యకు
మున్ముందు...ఆ పూల మొక్క...
ఇంకెన్ని అందమైన సుందరమైన
గుభాళించే పూలను పూయాలో
ఎవరికి తెలుసు ?
నారుపోసి నీరుపోసి ప్రేమతో
పెంచిన ఆ తోటమాలికి తప్ప...
బిస్కట్లు ఆశచూపి...ఆ పసిబిడ్డను...
కామాంధుడివై కసిగా కాటెయ్యకు
చిన్ననాడే ఆమె బంగారుభవిష్యత్తును
చిదిమెయ్యకు ఛిద్రం చెయ్యకు
రేపు...ఆ చిట్టితల్లి... పెరిగి పెద్దదై
ఎవరికి భార్యకావాలో
ఎంతమంది ప్రయోజకులైన
భారతమాత ముద్దుబిడ్డల్ని కనాలో
ఎవరికితెలుసు ?
నిన్నకని,నేడు కమ్మని కలలుకనే
ఆ అమాయకపు అమ్మనాన్నలకు
ప్రాణం పోసిన ఆ పరమాత్మకు తప్ప...
ఆదిలోనే...ఆ చిరుదీపాన్ని...
ఆర్పివేయకు మున్ముందు,
వెలిగే...ఆ దీపం... చీకటిలో ఉన్న
ఇంకెన్ని దీపాలను వెలిగించాలో
ఇంకెంతమందికి వెలుగుల్ని పంచాలో
ఎవరికి తెలుసు ?
వేయి ఆశలతో...ఆ దీపాన్ని...
వెలిగించిన ఆ వ్యక్తికి తప్ప...
మార్కుల పేర ర్యాంకుల పేర
మధ్యలోనే...ఆ విద్యార్థిని...
ఆవేశంతో ఆత్మహత్యకు పురికొల్పకు
మరణానికి చేరువయ్యేలా మంత్రించకు
విజేయుడై...ఆ విద్యార్థి... మున్ముందు
ఇంకెంతమందికి మార్గదర్శకుడు కావాలో
మర్రిమ్రానులా మారి ఇంకెంతమందికి
నీడనివ్వాలో ఎవరికి తెలుసు ?
భవిష్యత్తును నిర్ణయించే
ఆ భగవంతునికి తప్ప...
60. కరోనా ముప్పు తప్ప...
ఈ పదిసూత్రాలు పాటీస్తే....
1.
విందులకు వినోదాలకు
సభలకు సమావేశాలకు దూరంగా ఉండండి
షాపింగ్ మాల్స్ కు సినిమా హాల్స్ కు వెళ్ళకండి
2.
ఆరడుగుల నేలకు దగ్గరకాకండి
ఆరడుగుల భౌతిక దూరం పాటించండి
3.
ముఖానికి డబుల్ మాస్కులు వీలైతే
ఫేస్ షీల్డ్ లు ధరించండి మనకవే రక్షణకవచాలు
4.
శానిటైజర్ వాడండి సోపుతో చేతులు శుభ్రంగా
కడుక్కోండి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి
5.
ఇంటిల్లిపాది వాక్సిన్ రెండు డోసులు వేసుకోండి
కోవిడ్ కొమ్ములు విరిచే ఇమ్యూనిటీని పెంచుకోండి
6.
వీలైతే రోజు వ్యాయామం యోగ ధ్యానం తప్పకుండా చేయండి...ఎండలో కనీసం
30 నిమిషాలు గడపండి
7.
కంటినిండా ప్రశాంతంగా 8 గంటలు గాఢనిద్రపొండి
8.
మసాలాలులేని విలువైన
పోషకాహారాన్ని తీసుకోండి
9.
హంసలా ప్రతిదానిలో మంచినే వెతకండి
సానుకూలంగా ఆలోచించండి
అతిభయం వద్దండి
జరగనిదానిని గురించి ఆందోళన చెందకండి
అనుమానం పెనుభూతమని మరవకండి
తొందరపడొద్దు అలాగని ఆలస్యం చేయవద్దు
అవగాహన ఉండాలి ప్రశాంత
చిత్తంతో పనులు చేయాలి
10.
అందరూ ఆరోగ్యకరమైన
జీవనశైలిని అలవర్చుకోవాలి
61. ఇది కలకాదు పచ్చినిజం...???
నిన్న ఉదయం పార్కులో కలిసిన
సాయంకాలం ఫోన్లో మాట్లాడిన
రాత్రి బజారులో గలగలమని నవ్విన
మా ప్రియమిత్రుడు మా ప్రాణమిత్రుడు
నేడు నిద్రలేవలేదంటే...
సూర్యోదయాన్ని చూడలేదంటే...
హఠాత్తుగా తెల్లారక మునుపే కన్నుమూసి
కళ్ళముందే కనుమరుగై పోయాడంటే...
నమ్మలేకపోతున్నాం
ఇది కలయా నిజమా ?
అర్థంకాక కలవరపడి పోతున్నాం...
నిజమే నిన్న వెలిగిన ఆదీపాన్ని
కరోనాభూతం నేడు కసిగా ఆర్పేసింది
మా మిత్రున్ని మాకు దూరం చేసింది
ఆ కుటుంబంలో అంధకారాన్ని నింపింది
ఐనా ఇంకా వారి తీపి జ్ఞాపకాలు
మాచుట్టే తేనెటీగల్లా తిరుతున్నాయి...
వారింకా బ్రతికే వున్నట్లుగాా...
ప్రేమతో చిరునవ్వుతో పలకరించినట్లుగా...
కలిసి మనసు విప్పి మాట్లాడినట్లుగా...
చేయి కలిపినట్లుగా భుజం తట్టినట్లుగా...
గలగల గంభీరంగా నవ్వినట్లుగా...
లోకవిషయాలన్నీ గంటలతరబడి చర్చించినట్లుగా...
ఎన్నో ప్రశ్నలకు చక్కని సమాధానాలనిచ్చినట్లుగా...
కోవిడ్ విషయాలో మమ్మల్ని హెచ్చరించినట్లుుగా...
ఎన్నో ఉచిత సలహాలనిచ్చినట్లుగా...
విలువైన సూచనలు చేసినట్లుగా...
అనేక ఆర్థిక ఆరోగ్య ఆథ్యాత్మిక
విషయాల అన్వేషణలో కొత్తదారులను
జటిలమైన అనేక సమస్యలకు
పరిష్కారమార్గాలను చూపినట్లుగా...
మాకెంతో ఆత్మ స్థైర్యాన్ని
నూరిపోసినట్లుగానే ఉంది
ఇంకా ఇది కలయా నిజమా ?
అర్థంకాక అల్లాడిపోతున్నాం
అయ్యో ఓ దైవమా !
మా జీవితం ఇంత క్షణికమా?
గడ్డిపువ్వులా........ వాడిపోవడమేనా?
మల్లెపువ్వులా.......మాడిపోవడమేనా?
నీటిబుడగలా.........పేలిపోవడమేనా?
ఎండుటాకులా....... రాలిపోవడమేనా?
గాలిలో ధూళిలో.....కలిసిపోవడమేనా?
అయ్యే ఓ దైవమా !
మా జీవితం ఇంత క్షణికమా ? ఇది
ఎవరికీ అంతుచిక్కని ఇంత వింత రహస్యమా?
62. ఏలనోయ్ నీ కింత ఆశ
ఏలనోయ్ ఏలనోయ్
నీకింత ఆశ ఇలలోఅన్నీ
శాశ్వతమని తలచేవు
నాది నాది అనుకున్నది
ఏదీ నీది కాదన్న
నిజం తెలిసినా
అంతులేని ధనాన్ని
ఆర్జించేవు ఏందుకోయ్?
నీవు అనుభవించక
ఆకలికి అలమటిస్తూ
అస్థిపంజరాలై నీచుట్టే
నీ కళ్ళముందరే తిరిగే
అభాగ్యులకింత పంచవోయ్
కన్నుమూసిన మరుక్షణమే
నీ ప్రయాణం పరలోకానికేనోయ్
నీ కష్టార్జితం పరులపాలేనోయ్
ఈ భూమిపైన
ఈ భోగభాగ్యాలు
ఈ సిరి సంపదలు
ఈ కళ్ళు తిరిగే ఖరీదైన విల్లాలు
ఈ బ్రాండెడ్ బట్టలు
ఈ బంగారు ఆభరణాలు
ఈ విలాసవంతమైన జీవితాలు
ఈ కోట్ల వ్యాపారాలతాలూకు
ఆనందం అహంకారం ఈబొందిలో
ప్రాణమున్నంత వరకేనోయ్
అన్నీ అశాశ్వితమేనోయ్
కలలో కనిపించిన కోట్లు
కళ్ళు తెరవగానే
కరిగిపోయినట్టే
మేలు కొన్నమరుక్షణమే
మాయమైపోయినట్టేనోయ్
నీటిమీద బుడగలు
నిముషమే నిలబెట్టునోయ్
63. సంస్కారం! సాస్టాంగ నమస్కారం!!
నీ మంచితనాన్ని
నీ అమాయకత్వాన్ని
ఆసరా చేసుకొని ఒకడు
నీ యింటికే నిప్పెడుతుంటే
అది తప్పుఅని చెప్పకపోతే
వద్దు అని వారించకపోతే ఎలా?
నీ ఇల్లు కాలి బూడిదైతే
నీకా నష్టం వాడికా ?
మన కన్నబిడ్డలు తప్పుచేస్తే
మంచిమాటలు చెప్పకపోతే
మందలించక పోతే ఎలా?
శపించవద్దు కాని గద్దించాలిగా
మన క్రింది ఉద్యోగులు తప్పుచేస్తే
కఠినంగా వుండాలి కళ్ళెర్ర చెయ్యాలి
కస్సుబుస్సు మనాలి కాని
కడుపు మీద కొట్టకూడదుగా
విద్యార్ధి ఒకరు విఫలమై ప్రేమలో
విరక్తి చెంది బ్రతుకులో
నీ కళ్ళ ముందరే నదిలోదూకి
ఆత్మ హత్య చేసుకుంటూవుంటే
ఈత వచ్చిన నీవు రక్షించకపోతే ఎలాగ?
కత్తులు కటారులు పట్టుకొని
త్రాగుబోతు ఒకడు
వీధిలో వీరంగం చేస్తూవుంటే
ఖాకీ డ్రస్సులో వున్న నీవు
కంట్రోల్ చెయ్యకపోతే ఎలాగ?
సహనం మంచిదే కాని
సమయానికి స్పందించక పోతే
ఆపదలోవున్నవారని ఆదుకోకపోతే
ఆయుధముండి చేతిలో ఏం లాభం?
సమయముండి స్పందిస్తే
సకాలంలో సహాయమందిస్తే
అదే కదా... నిలువెత్తు సంస్కారం
అట్టి నిస్వార్థపరులకు చేస్తారందరూ
నిస్సందేహంగా సాస్టాంగ...నమస్కారం
64. అక్కకాదు తులసిమొక్క
అది ఏ దేవివరమో
ఏ జన్మ పుణ్యఫలమో
ఓ చల్లనితల్లి గర్భాన
అక్కాతమ్ముళ్ళుగా
జన్మించడం
ఎంతటి అదృష్టమో కదా
అక్కా తమ్ముళ్ల అన్నా చెల్లెళ్ల
ఆత్మీయతలు...అనుబంధాలు
అపురూపం...అద్వితీయం
ప్రేమానురాగాలు...పలకరింపులు
అనిర్వచనీయం...అనుభవైకవేద్యం
అమ్మ ఆసుపత్రిలో డాక్టరాయె
కరోనా డ్యూటీ కరోనా డ్యూటీ అంటూ
కంటికి కనపడదాయె ఇంటికి రాదాయె
పండగ పూట కూడా శెలవు పెట్టదాయె
అన్నీ తానై అక్కే అమ్మై తన తమ్ముడికి
తలంటుస్నానం చేయిస్తోంది ఎంతో ప్రేమగా
ఔను ఆమె "అక్కకాదు" ఆ ఇంటి "తులసిమొక్క"
65. పోలన్న కవి సూక్తి సుధ!
కండలు కరిగిన నేమిరా
కాయకష్టం చేయరా
కష్టించి పని చేయకుండా
కడుపేల నిండేనురా
కునికే కుంభకర్ణుడేల
కుబేరుడయ్యేనురా ?
క్రమశిక్షణ సత్ప్రవర్తన
ఏకాగ్రత ఉన్న ఎదురే లేదురా
పట్టుదల కృషి దీక్షగలవాడే
ప్రతిభావంతుడురా
ప్రతిభావంతుడే ప్రచండభానుడై
నిత్యం ప్రకాశించునురా !
చింతిస్తూ కూర్చుంటే
చీకటి పడిపోతుందిరా
ఆలస్యమైన కొద్దీ
అవకాశాలు అస్తమించేనురా
అందిన అవకాశం చేజారితే
బ్రతుకు అంధకారమేరా !
66.విజయానికి దారులెన్నో ...
పుట్టినరోజు
పండగే అందరికీ...
మరి పుట్టింది
ఎందుకో తెలిసేది
ఎందరికీ ఎందరికీ.....
కృషి ఉంటే
మనుషులు
ఋషులౌతారు...
మహాపురుషులౌతారు...
తరతరాలకు
తరగని నిధులౌతారు...
ఇలవేలుపులౌతారు.....
సాధన
చేయుమురా నరుడా
సాధ్యం కానిది లేదురా...
అలవాటైతే విషమేఐనా
హాయిగా త్రాగుట సాధ్యంరా...
అంటూ
వీరులెవ్వరో...
విశ్వవిజేతలెవ్వరో...
విజయానికి దారులెన్నో ...
కనిపెట్టి ముందుతరాలకందించారు...
అభ్యుదయ సినీగేయరచయితలెందరో...
ఔను
ఒక మనిషి
మహాత్ముడిగా
గుర్తింపు పొందాలంటే
ఆ మనిషినిండా మానవత్వముండాలి
ఒక వ్యక్తి దైవంగా ఆరాధించబడాలంటే
ఆ వ్యక్తి అలనాడు ఆ శ్రీహరి మొసలి
గండం నుండి గజరాజును రక్షించినట్టు
ఎందరినో ఆపదలో ఆదుకొని ఉండాలి
67. మూర్ఖులు - ముసలి లక్షణాలు!
పుట్టుకతో
అబ్బాయిలకు
అమ్మాయిల లక్షణాలు
అమ్మాయిలకు
అబ్బాయిల లక్షణాలోస్తే
భయం లేదు బాధలేదు నష్టంలేదు
కాని కోడెవయసులో ఉన్న
వేడిరక్తం మరుగుతున్న
యువతీయువకులకు
ముసలివాళ్ళ లక్షణాలొస్తేనే ముప్పు
యవ్వనం నివురుగప్పిన నిప్పు
అందమైన ఆ నవయవ్వనవైభవాన్ని
అనుభవించలేరు
అందచందాలను ఆస్వాదించలేరు
మగువలపొందులోని మాధుర్యాన్ని
సరసాన్ని శృంగారాన్ని
మన్మధబాణాల మధుర భాధను
విరహాన్ని వినోదాలను ఆశలు ఆకలి తీర్చి
అదిపంచే అమృతభాండాన్ని రుచిచూడలేరు
పొంగే కొత్తకొత్త కోర్కెలను
సరదాలను తిరిగి వారు తీర్చుకోలేరు
ఈ ముసలి లక్షణాల ముసుగును
వేసుకున్నవారంతా మూర్ఖులే
ఈ ముసలి లక్షణాల సంకెళ్లు
తెంచుకున్నవారే విజ్ఞులు విశ్వవిజేతలు
వాడిన ఆకు చిగురించదు
గడిచిన కాలం తిరిగి రాదు
చేజారిన అవకాశాన్ని
కరిగిపోయిన యవ్వనాన్ని
మళ్లీ మళ్లీ ఎవరూ పొందలేరు
భగవంతుడిచ్చేది బాల్యమే
యవ్వనం వార్ధక్యం మనిషి నిర్మితమే
68. చక్కని సంసార సందేశం !
మూడుముళ్ళు పడగానే
ఏడడుగులు నడవగానే
ఇద్దరిని గదిలో బంధిస్తారు
శోభనం పేరుతో...........
ఒక్కటవ్వాలన్నకోరికతో...
ఇద్దరు ముగ్గురవ్వాలన్నఆశతో...
కోటిఆశలతో కాపురానికెళ్లే
కొత్తజంటలకిదే నా "సంసారసందేశం"
రుచికరమైన వంటకాలతో
అందరి "కడుపులు" నింపాలి
మమతానురాగాలతో
"మనసులు" గెలవాలి
అత్తా మామల" మెప్పును" పొందాలి
ప్రతిపగలు "పండువెన్నెలగా"
"ప్రతిరాత్రి నవరాత్రిగా"
పడకగదిని...పరవశింపచేయాలి
మగనిమదిలో ప్రేమపరిమళాలు
వెదజల్లాలి ముద్దు మురిపాలతో
మురిపించాలి...మైమరిపించాలి
"కొత్తమొగున్ని కొంగున" ముడేసుకోవాలి
సఖ్యత సభ్యతా సహనం సమయస్ఫూర్తి
సర్దుబాటుగుణం అనురాగం ఆప్యాయతలే
"అదృశ్య ఆభరణాలుగా" అలంకరించుకోవాలి
ఐతే రాక్షసత్వం ఇంట...రాజ్యమేలే వేళ
అత్తమామలు ఇంట...పెత్తనం చెలాయించే వేళ
నిప్పులా మండాలి...నిర్భయంగా ఉండాలి
కనకదుర్గలా కనిపించాలి...కత్తిని ఝలిపించాలి
ఒకటి మాత్రం ఎవరూ కాదనలేని పచ్చినిజం
చిరకాలముండవు ఈ...
చింతలుచీకాకులు
పచ్చని కాపురాన చిచ్చురేపు లోకులుపలుగాకులు
పంతాలు పట్టింపులు...
పగప్రతీకారాలొద్దే వద్దు
ప్రేమించుకొని...
పెనవేసుకుంటేనే హద్దు ముద్దు
ఒకరినొకరు ద్వేషించుకొంటూ సాధించుకుంటూ
వేదనలకు వెతలకు గురికారాదు...వేరైపోరాదు
చిరుబురులాడుతు ఎందుకు...చీకట్లోచిందులు
ముఖాముఖిచర్చలే...
మనస్పర్థలకు మందులు
69. పోలన్నకవి సూక్తి సుధామృతం
సమస్యలను ఎప్పుడూ
భూతద్దంలో చూడకు
చీమల్లాంటి సమస్యలు
సైతం సింహాల్లా కనిపిస్తాయి
ప్రేమ ఒక హాబీ కాదు ఊబి
ప్రేమ ఒక సరదా కాదు బురద
ప్రేమ ఒక మాయ కాదు లోయ
ప్రేమ ఒక నిప్పు కాదు ముప్పు
మరిచిపోలేని మంచి
ముద్రలు కొన్ని మిగిల్చిపో
నిన్ను నిత్యం స్మరించుకునేందుకు
నీవు శాశ్వతంగా నిద్రపో యేముందు
దూరదృష్టి
దృఢసంకల్పముంటే
చలించే బుద్ధిని జ్వలించే కోరికలను
ఆరక రగిలే ఆశలను అదుపులో పెట్టుకోవచ్చు
70. విజయం - అపజయం
అపజయం...
పడుకున్న వాడిచుట్టే
తిరుగుతూ ఉంటుంది
లేస్తే వాని
ముఖాన నీళ్ళు
...పొయ్యడానికి
అవకాశాల తలుపులు
...ముయ్యడానికి
"బద్దకస్తుడన్న"
...ముద్రను వెయ్యడానికి
విజయం...
పరిగెత్తే వాడివెంటే
పరుగులు పెడుతుంది
ఆగితే వాని
మెళ్ళో గజమాల
...వెయ్యడానికి
బంగారు నిధిని
...అందివ్వడానికి
"బాహుబలి అన్న"
...బిరుదుతో సన్మానించడానికి
71. నడిసంద్రంలో నావ
కనులున్నాక "కలలు" తప్పవు
సముద్రమన్నాక"అలలు" తప్పవు
కాని ఆ అలల తాకిడికి
నీ కలలు విలవిలలాడినా
విధికి వినిపించేలా విలపించకు
కడలి ఎంతగా పొంగినా ఉప్పొంగినా
ఒక్క కన్నీటిచుక్కను సైతం
ఆ "కష్టాలకడలిలో" కలవనియ్యకు
ఎన్ని తుఫాన్లు వచ్చినా
ఎంతటి అల్లకల్లోలం సృష్టించినా
అదరకు...బెదరకు...అలసిపోకు
ధైర్యసాహసాలతో దరిచేరు
ఆ దైవమే నీకు దారి చూపు
నావను "నడిపేది" నీవే కావొచ్చు కాని
"నడిపించేది" కనిపించని ఆదైవమేకదా
నావ తీరం చేరడం ఒక "తియ్యనివరమే"
సాహసంచేస్తే చేరవచ్చు"ఆసాగరతీరమే"
72. ప్రేమిస్తే పచ్చదనమే !!
పాముతో కలిసి
"అక్కర"
అనగానే చక్కగా
"స్పందించే"
వారి జీవితాలు
"ఆపద"
అనగానే
స్నేహహస్తం
"అందించే"
వారి జీవితాలు
ప్రతినిత్యం
చిరునవ్వులు
"చిందించే"
వారి జీవితాలు
అందరి
ఆకలి బాధల్ని
"బంధించే"
వారి జీవితాలు
పేదలకు
అనాధలకు
"ప్రేమను...పంచే"
వారి జీవితాలు
అందరి శ్రేయస్సు
గురించి నిరంతరం
"ఆలోచించే"
వారి జీవితాలు
ఎప్పుడు
ఎల్లప్పుడూ
పచ్చపచ్చగానే ఉంటాయి
వారి జీవితం ఎందరికో ఆదర్శం
వారే పరమాత్మకు ప్రతిరూపాలు
వారే చిరంజీవులు చిరస్మరణీయులు
73. నేడే తెలిసింది ఓనిండునిజం ...
పాముతో కలిసి
వేడివేడి పాలు త్రాగాలని
పాము పడగ నీడన
ప్రశాంతంగా పవళించాలని
కమ్మని కలలు గనే
ఆ అమాయకపు కప్పలకు
తెలియదు పాపం ఓ పచ్చినిజం
తమకు ప్రాణగండమున్నదని
తమకు పాముకు బద్దవైరమని
తాము పాములకు ఆహారమని
కప్పలు పదివేలేకమైనా
ఒక్కపామునైనా సంహరించలేవని
చీమలు పాములకు శతృవులని
ముల్లును ముల్లుతోనే తియ్యాలని
ఆ అమాయకపు కప్పలకు
తెలియదు పాపం ఒక పచ్చినిజం
కసిపట్టి బుసలు కొట్టే కోడెనాగుల
విషపు కోరల నుండి
విముక్తి లభించాలంటే
కప్పలన్నీ చలిచీమల సహకారం
తప్పక తీసుకోవలసిందేనని
ఆ అమాయకపు కప్పలకు
నేడే తెలిసింది ఒక నిండునిజం
74. అడుగు... వెతుకు...తట్టు...
అడగండి ! అడగండి !
అడుగుతూనే వుండండీ ! తప్పక
మీ అవసరం తీరుతుందండి !
వెతకండి ! వెతకండి !
వెతుకుతూనే వుండండి ! తప్పక
మీరు కోరుకున్నది దొరుకుతుందండి !
తట్టండి ! తట్టండి !
తడుతూనే వుండండి ! తప్పక
విజయం తలుపు తెరుచుకుంటుందండి !
కానీ
అడగాలి...అడగాలి !
కొండంత ఆశతో అందిందన్న ఆత్మతృప్తితో
వెదకాలి....వెదకాలి !
గట్టినమ్మకంతో అంతులేని ఆత్మవిశ్వాసంతో
తట్టాలి......తట్టాలి !
గట్టిపట్టుదలతో ఆవగింజంతైనా అనుమానం లేకుండా
75. రక్షా బంధన్ ...రక్త సంబంధం
అన్నాతమ్ముళ్లుగా అక్కచెల్లెలుగా ఓ చల్లనితల్లి
గర్భాన జనియించడమే పూర్వజన్మసుకృతం
ఆ చిన్ననాటి
ఆ అల్లరిచేష్టలు ఆ కోపతాపాలు
ఆ కిల్లికజ్జాలు ఆ కొట్లాటలు
ఆ అలకలు ఆ బుజ్జగింపులు
ఆ ఏడ్పులు ఆ ఊరడింపులు
ఆ కిలకిలా నవ్వులు ఎన్నటికీ
ఎప్పటికీ మరిచిపోలేని మధురజ్ఞాపకాలే అందరికీ
కాలచక్రం గిర్రున తిరగ్గానే
వయసురాగానే ఆ రక్తసంబంధాలే
అంతులేని ప్రేమానురాగాలుగా
ఆప్యాయతలుగా అభిమానాలుగా
మారి విడిపోని అనుబంధాలౌతాయి
చెరిగిపోని ఆత్మీయబంధాలౌతాయి
అదే అదే నిజమైన రక్తసంబంధం
రాఖీ పౌర్ణమినాడు బంగారురంగు దారాలతో
అల్లిన రాఖీలు చేతికికట్టగానే
అన్నాతమ్ముళ్ల
ముఖాలు వెయ్యి ట్యూబ్ లైట్లుగా వెలిగిపోతుంటే
రాఖీసాక్షిగా ప్రమాణం చేస్తారు దీవిస్తారు
ఓ అక్కా ఓ చెల్లీ ! ఓ మా బంగారు తల్లులారా ! భయపడకండి ! ఈ రాఖీహస్తాలే! మీకు రక్షణకవచాలని !
రాఖీ పౌర్ణమినాడు అన్నాతమ్ముళ్లు
పెట్టే నూతన వస్త్రాలు
ఇచ్చే ఖరీదైన బహుమతులు
చూడగానే అక్కాచెల్లెళ్ల
ముఖాలు నింగిలోని
చంద్రబింబాల్లా వెలిగిపోతువుంటే
మనసులో ముక్కోటి దేవుళ్ళకు
మొక్కి ప్రార్థిస్తారు
ఒరే అన్నయ్యాలూ ! ఒరే తమ్ముళ్ళూ !
మీరు విజయశిఖరాలను చేరుకోవాలిరా!
మీరు తలపెట్టిన ప్రతికార్యం సఫలమవ్వాలిరా...అని
అదే అదే నిజమైన రక్షాబంధన్
76. చింతకాయ...ఎంతమాయ...
నేనొక చింతకాయను
తింటూ... తింటూ ఉంటే...
నా చుట్టూరా కూర్చున్న
మీరంతా ఆ చింతకాయను
చూస్తూ...చూస్తూ ఉంటే...
మీ అందరి నోళ్ళల్లో
"లాలాజలం" పొంగుతుంది
ఉప్పొంగుతుంది తప్పక
ఊరితీరుతుంది ఇది పచ్చినిజం...
మరి నా నోటిలో ఉన్న
ఆ చిన్న చింతకాయకు
మీనోట్లో లాలాజలాన్ని ఊరేలా
చేసే "ఓ అద్భుతశక్తే' ఉంటే
మరి వింతైన విచిత్రమైన
అనంతమైన అద్భుతమైన
విశాలమైన ఈ విశ్వసృష్టికి
కారణభూతుడైన ఆ పరమాత్మకు
మన ఆలోచనలను పసికట్టగల
మన కష్టాలను తెలుసుకోగల
మన కన్నీళ్లను తుడువగల
మన కలలను పండించగల
మన కోరికలను ఆశలను తీర్చగల
ఇంకెంతటి"అద్భుతమైన"
"అఖండమైన" అపురూపమైన
అతీంద్రియ శక్తి" ఉంటుందోకదా....
77. కామాంధులుంటారు కాస్త జాగ్రత్త!
పిల్లల ఫీజులరూపంలో డబ్బుల
"కట్టలు" సమర్పించుకొని
కార్పొరేట్ స్కూళ్లలో పిల్లలను
చేర్పించి వారి ఖరీదైన పుస్తకాలకు
"అట్టలు" వేయకుంటే స్కూలులో
పిల్లలను టీచర్లు తిట్టరా ? కొట్టరా ?
ఆ పిల్లలే పెరిగి పెద్దవారై
కార్పొరేట్ కాలేజీలకెళ్ళినప్పుడు
వారు పబ్బులు క్లబ్బులంటూ
ఫ్యాషన్ల పేరుతో విచ్చలవిడిగా
బరితెగించి తిరుగుతున్నప్పుడు
అందాలపోటీలంటూ పారిస్ లోని
ఒంపుసొంపులుఒలకబోస్తూ
ఒయ్యారి భామల్లా ఫ్యాషన్లపేరిట
దిక్కుమాలిన ఫారిన్ కల్చర్ ను
దిగుమతి చేసుకొని కురుచ
"బట్టలు" వేసుకొని నడిరోడ్డుపైన
నవ్వుతూ కవ్విస్తూ పోతూవుంటే
పోకిరివెధవలు వెంటపడరా?
దొంగచూపులు చూడరా ?
వెకిలి చేష్టలు చేయరా ?
గుర్తుంచుకోండి ! ఓ అమ్మాయిలారా !
"కట్టెలు" పెట్టి పాలకుండ కింద
మంట పెట్టిన వేళ పొంగిపొరలేది
పాలుకాదు మీ ఇంటి పరువేనని...
గుర్తుంచుకోండి ! ఓ తల్లిదండ్రులారా !
బరితెగించి తిరిగేది బాపుబొమ్మలు కాదు
దిగుమతి చేసుకున్న దిష్టిబొమ్మలేనని...
అందుకే అందాలు ఆరబోసే ఓ అమ్మాయిల్లారా !
మన సంస్కృతీసాంప్రదాయాలను మరువకండి!
ఇకనైనా కళ్ళు తెరచి చూడండి !
మీ ప్రక్కనే
నక్కినక్కి కామాంధులుంటారు
కాస్త జాగ్రత్తండి !
78.ఎవరితరం కాదు
"బరి"(యుద్దం)లోనికి
దిగిన తర్వాత
గురి ఉరి సిరి మాత్రమే గుర్తుండాలి
"గురి"(లక్యం)చూసి
ఏకాగ్రతతో బాణాన్ని
సంధించాలి
గురి తప్పితే
"ఉరి"(ప్రాణత్యాగం)కైనా
సిద్దంగా వుండాలి
గురి చూసి లక్ష్యాన్ని చేధిస్తే
"సిరి"(విజయం)సంతోషం, స్వర్గం
సర్వం నీ సొంతమౌతాయి
సందేహం లేదు లేదు లేదు
79.నీళ్ళు నిద్రపోతాయి...
నీకు నాకు
తెలియని నిజమిది
నీళ్ళు నడుస్తాయని...
నీళ్ళు ఏడుస్తాయని...
నీళ్ళు నవ్వుతాయని...
నీళ్లు నిద్రపోతాయని...
నీళ్ళు ఎగురుతాయని...
నీళ్ళు పరుగుతీస్తాయని...
నీళ్ళు నిట్టూర్చుతాయని...
నీవు నీళ్లలో మునిగి
తిరిగి తేలాలనుకుంటే
నీవు నీళ్ళపై పడుకుని
నిదురపోవాలనుకుంటే
నీవు సజీవమైతేనే అది సాధ్యం
నీవు నిర్జీవమైతే నీటిలో మునగలేవు
నీటిపై తేలియాడూతూ ఉండాల్సిందే
ఆగని అలలొచ్చి ఛీఛీ పోపో అంటూ
గడ్డిపోచలా నీకట్టెను గట్టుకు విసిరేస్తాయి
కనిపించిన ప్రతిదాన్ని
కాల్చివేయడం నిప్పుచేసే తప్పు
అందుకే నీళ్లంటే నిప్పుకు భయం
కానీ ఆ నీళ్ళే మనిషికి జీవనాధారం
ఆ నీళ్లే నిప్పైతే మనిషి బ్రతుకు నరకం
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు? అవిఏడుస్తాయని...
తాము ఎవరి దాహం
తీర్చలేని నిస్సహాయులమని
కడలి కడుపులోనే కలకాలముండాలని
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు ?అవి నిట్టూర్ఛుతాయని...
తాము తీరందాటితే ప్రళయమేనని
ఎన్నో ప్రాణాలు హరీ అంటాయని
ఊళ్ళుఊళ్ళే ఊడ్చిపెట్టుకు పోతాయని
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు ? అవి నిద్రపోతాయని...
అలలు అలిసిపోయినప్పుడు
అల్లకల్లోలమైన సముద్రం చల్లబడినప్పుడు
అది ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడు
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు ? అవి ఎగురుతాయని...
అప్పుడప్పుడు ఆకాశంలో విహారయాత్రలకెళ్లాలని
మేఘాల్లో విహరించాలని విశ్వమంతా విస్తరించాలని
పాపం సముద్రంలోని
ఆ నీళ్లకేం తెలుసు ? అవి నవ్వుతాయని...
చినుకులైరాలి నేలపై ప్రవహించినప్పుడు
సాగు త్రాగునీరై పశువుల పక్షుల పంటపొలాల
సృష్టిలోని సకలజీవరాశుల దాహార్తిని తీర్చినప్పుడు
పాపం నీళ్లు అమాయకంగా అడుగుతాయి
నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగన్నది నిజమేనా అని
నిజమేనంటే నవ్వినీళ్ళు పక్షుల్లాఎగురిపోతాయి నింగిలోకి
80. మృత్యువు ముందే మూడుముళ్ళు
(మ అక్షరంతో భావకవిత)
మ...ధురమైన పలకరింపుతో కళ్ళురెండు కలిశాయి
మ...నసులు రెండు మురిశాయి
మ...మతానురాగాలు పెనవేసుకున్నాయి
మ...తాలు కులాలు వేరైనా ప్రేమ
మ...త్తులో ఆ జంట ఊరంతా ఊరేగింది
మ...సక మసక చీకటిలో
మ...ల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో నీ
మ...నసైనది దొరుకుతుందన్న రింగ్టోన్ విని
మ...ల్లెతోటకు కెళ్తే ఆశపడి ఆవేశపడి
మ...హమ్మారి కరోనాకోరల్లో చిక్కిమృత్యువుఒడిలో ఒరిగి
మ...త్తుగా మూలుగుతూ కోరింది
తన ప్రాణసఖి
మం..గళసూత్రం కట్టి ముత్తైదువుగా పంపమని నేడు
మ...రణించినా మరుజన్మలోనైనా
మళ్ళీ మనం లైలా
మ...జ్నూలమై పుడదామన్న ప్రేయసి
కోరిక మన్నించి
మం..చితనం మానవత్వంతో ఆ భగ్నప్రేమికుడు
మం..గళసూత్రం కట్టిన మరుక్షణమే కన్నుమూసింది తన అనురాగ దేవత
మం..గళ వాయిద్యాలమధ్య తనను ముద్దాడింది ఆ మృత్యుదేవత
81. మానవత్వంలేని మానవజన్మ...
నేడిక్కడ తప్పించుకున్నా
రేపు అక్కడ ఆ పరమాత్మ
ఈ "పిల్లికి బిక్షం" వేయని
"ఈ పిసనారులందరిని"
ప్రశ్నించక మానడు...
చేయగలిగి..."చేతులుండీ"...
సహాయం చెయ్యలేని
కాలినడకన వెళ్ళే ఆ వలసకూలీల
కష్టాలను కన్నీళ్ళను "కళ్ళుండీ"...చూడలేని
వారి ఆకలికేకలు "చెవులుండీ"...వినలేని
"కోట్లుండీ"...ఇంత అన్నం పెట్టి...ఆదుకోని
"హృదయముండీ"...స్పందించని
పాషాణ హృదయులైన
"ఆ ప్రభుత్వాధికారులను"
కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులైన
"ఆ బడా వ్యాపారులను"
విలాసవంతంగా జీవించే
విశ్వాసంలేని "ఆ సినీసెలబ్రిటీలను"
బ్రతికి వున్నంతకాలం తినలేని
పోయేనాడు ఏమీ పట్టుకు పోలేని
పరులకు పంచని దోచుకుని దాచుకున్న
ఆ కోట్ల ఆస్తి ఎందుకని ? అంత ఆశ ఎందుకని?
కాసింతైనా దయాగుణం దాతృత్వం మంచితనం
మానవత్వంలేని ఈ మానవజన్మ ఎత్తి లాభమేమని?
82. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు...
పేదవాడిగా పుట్టడం నీ
...తప్పు కాదు కానీ
పుట్టి పేదవాడిగా మరణించడమే
...గొప్పనేరం
అప్పులు చేయడం నీ
...తప్పుకాదు కానీ
చేసిన అప్పుల్ని తీర్చకపోవడమే
...పెద్దతప్పు
తప్పు చేయడం నీ
...తప్పుకాదు కానీ
చేసిన తప్పును సరిదిద్దుకోకపోవడం
అదే తప్పును పదేపదే చేయడమే
...పెద్దతప్పు
తాళి కట్టడం నీ
...తప్పుకాదు కానీ
కట్టి భార్యాబిడ్డలను పోషించకపోవడం
వారిని పూర్తిగా విధికి వదిలివేయడమే
...పెద్దతప్పు
విదేశాలకు వెళ్లడం నీ
...తప్పుకాదు కానీ
వెళ్లి అమ్మానాన్నలను పూర్తిగా మర్చిపోవడం
ప్రేమతో అప్పుడప్పుడు పలకరించకపోవడమే
...పెద్దతప్పు
పెద్ద చదువులు చదవక పోవడం నీ
...తప్పుకాదు కానీ
అసలు చదువు విలువ తెలియకపోవడమే
...పెద్దతప్పు
రెండు చేతులతో ఆస్తులు ఆర్జించడం నీ
...తప్పుకాదు కానీ
ఆర్జించినదానిని పదిమందికి పంచకపోవడమే
...పెద్దతప్పు
అపారమైన విచ్చిజ్ఞానాన్ని ఆర్జించడం నీ
...తప్పుకాదు కానీ
ఆర్జించినజ్ఞానాన్ని అందరికీ అందించకపోవడమే
...పెద్దతప్పు .
ఆకలి గొనడం అది ప్రకృతి ధర్మం నీ
...తప్పుకాదు కానీ
ఆకలిని తీర్చుకునే మార్గాలు తెలియకపోవడమే
...పెద్దతప్పు
పెద్దల వద్ద సలహాలు సూచనలు స్వీకరించడం నీ
...తప్పుకాదు కానీ
స్వీకరించిన ఆ సలహాలను ఆచరించకపోవడమే
...పెద్దతప్పు
పరమాత్మను ప్రతిరోజు పూజించడం ప్రార్థించడం నీ
...తప్పుకాదు కానీ
నిత్యం పూజించే ఆ పరమాత్మపై
నిజమైనభక్తి విశ్వాసం లేకపోవడమే
...పెద్దతప్పు
ఆస్తులు ఆర్జించడం నీ
...గొప్ప కాదు కానీ
ఆర్జించిన ఆస్తులను
కాపాడుకోలేకపోవడం
వాటిని కొంచెమైనా
అనుభవించక అస్తమించడమే
...పెద్దతప్పు
83. ఆఫ్గనిస్తానా? ...అగ్నిగుండమా?
నేడు
ఆఫ్గనిస్తాన్
భగభగమండే
ఒక అగ్నిగుండం
రాబందులు
రాక్షసమూకలు
రాజ్యమేలుతున్నాయచట
రక్తం ఏరులై పారుతుందచట
ప్రేమ దయ జాలి కరుణ
శాంతి సమాధానం మతసామరస్యం
ప్రజాస్వామ్యమను పదాలు నిషేధమచట
కక్షలు కార్పణ్యాలతో
పగలు ప్రతీకారాలతో
కుట్రలు కుతంత్రాలతో
అసూయా ద్వేషాలతో
అధికార దాహంతో నిత్యం నరమేధమేనచట
మంచితనం మానవత్వం
మచ్చుకైనా కనిపించదచట
మానవీయ విలువలు
మట్టి కరిచాయచట
కఠినమైన కట్టుబాట్లతో
కళ్ళకుగంతలే నచట
క్రూరత్వం కుటిలత్వం
మూర్ఖత్వమే ముద్దు అచట
భయంతో కాపరి పారిపోగ
నిత్యం మరఫిరంగుల మ్రోతచట
గొర్రెలమందల్లో చొరబడిన తోడేళ్ళవిచ్చలవిడి వీరంగమచట
ప్రజలు పగబట్టిన పాములు
చుట్టుముట్టిన కప్పలే అచట
పులులవేటలో ప్రాణభయంతో
పరుగులుతీసే జింకపిల్లలేనచట
మానవ మృగాల మతోన్మాదుల కామాంధుల రక్తంత్రాగే రాక్షసుల వికృత పాలనలో మహిళలకు రక్షణ లేదచట
చోద్యం చూడక ప్రపంచదేశాలన్నీ
ఏకమై ఈ నరరూప రాక్షసుల
అరాచకాలను అక్రమాలను
ఆగడాలను కఠినమైన
ఆర్థికఆంక్షలతో కట్టడి చేయాలి
ఈ ఘోర నరమేధాన్ని ఆపాలి ఆత్మబంధువులై ఆదుకోవాలి
రాజ్యకాంక్షతో రెచ్చిపోతూ
అమాయకపు ప్రజల రక్తంత్రాగే
ఆ రాక్షసమూకలకు తక్షణమే
తగిన గుణపాఠం నేర్పాలి
ఆఫ్గనిస్తాన్ ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ప్రసాదించాలి
84. మై ఫ్రెండ్లీ ఎనిమీస్
O God !
నేను అలా
ఎదురుపడగానే
నన్ను ఇంద్రుడంటారు
శ్రీరామచంద్రుడంటారు
O God !
నేను ఇలా
ప్రక్కకు వెళ్ళగానే
పనికిమాలినవాడంటారు
నన్ను పరమ దరిద్రడంటారు
పగలబడి నవ్వుతువుంటారు
O God !
నా వెనుక గుసగుసలాడే వారిని
చూస్తే నాకు..."గుంటనక్కలే" గుర్తొస్తాయి
నా వెనుక పక్కుననవ్వే వారిని
చూస్తే నాకు..."పందికొక్కులే" గుర్తొస్తాయి
నా వెనుక చీప్ గా కామెంట్ చేసే వారిని
చూస్తే నాకు..."చీడపురుగులే" గుర్తొస్తాయి
నా వెనుక చెవులు కొరుక్కునే వారిని
చూస్తే నాకు...చెప్పులు కొరుక్కుతినే శునకాలే"గుర్తొస్తాయి
O God !
టెల్ మీ వెదర్ దె ఆర్
మై ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్
ఇఫ్ దె ఆర్ మై ఫ్రెండ్లీ ఎనిమీస్
ప్లీజ్ చేంజ్ దెమ్ ఇన్ ఫ్యూచర్
బికాజ్ దె ఆర్ ఆల్ యానిమల్స్ ఇన్ నేచర్
85. ఉంటే - ఉంటే - ఉంటే?
ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి
ట్యాంక్ లో - నీళ్లు ఉంటే
స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది
లైటు వెలుగుతుంది - కరెంటు ఉంటే
మొండి రోగాలు సైతం నయమౌతాయి
రోజూ - మందులు వేసుకుంటే
కాపురంలో కలతలు కలహాలుండవు
ఇద్దరూ - కలిసి ఉంటే
ఇద్దరిలో - ఐక్యత సఖ్యతఉంటే
పశువులు చిక్కని పాలిస్తాయి
ప్రతిరోజు పచ్చగడ్డి - వేస్తూ వుంటే - మేస్తూ ఉంటే
విధిని ఎదిరించవచ్చు, విజయాన్ని
సాధించవచ్చు గుండెలో - దమ్ము ధైర్యముంటే
ఎట్టి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనవచ్చు
ఆత్మవిశ్వాసం - అధికంగా ఉంటే
ఎట్టి పోటీ పరీక్షనైనా పాస్ కావచ్చు
గట్టిగా, ప్రణాళికాబద్ధంగా, శ్రద్ధగా -
చదివి ఉంటే
ఎన్ని బాధలనైనా, వేదనలనైనా
భరించవచ్చు భగవంతుడే -
మనకు తోడుంటే
86. పురోభివృద్ధికి పునాదిరాళ్ళు
ఉద్యోగం అంటే
ఉగాది పచ్చడి కాదు
సంక్రాంతి సంబరం కాదు
ఉద్యోగం అంటే ఒక బాధ్యత
ఉద్యోగం అంటే ఒక కర్తవ్యం
కాని, నిజానికి ఉద్యోగమంటే
అందరికీ అర్థంకాని ఆర్థికపరమైన
సైలెంట్ గా జరిగే ఓ శ్రమదోపిడి
మన కళ్ళముందే మన కష్టాన్ని
మరొకరు నోట్లకట్టలుగా
మార్చుకుంటూ వుంటారు
కోట్లల్లో ఆదాయాన్ని ఆర్జిస్తూ వుంటారు
మనల్ని మెట్లుగా మార్చుకొని
ఎవరెస్ట్ శిఖరంలా వారెదుగుతూ వుంటారు
బోనస్ కొంచెం మనకు పంచుతారు
బిక్షగాళ్ళపాత్రలో చద్దన్నంలా వేస్తారు
ఉద్యోగులు నెలనెలా జీతాలనడుక్కుంటూ
ఎదుగు బొదుగులేకుండా జీవిస్తుంటారు
బానిసల్లా బతికేస్తుంటారు
చట్టపరంగా వారికెన్ని హక్కులున్నా
అనేక చిక్కులు, మెలికలు పెట్టి
ఏళ్ళతరబడ ఎన్నిచర్చలు జరిపినా
సమ్మెలు, పోరాటాలు చేసినా చివరకు
సంస్థకు ప్రాణమైన సిబ్బందిని ఇబ్బంది పెట్టి
ఎంగిలి విస్తరాకుల్లో విసిరేస్తారు ఇన్ని
ఎరియర్స నే పచ్చడిమెతుకులు
ఎందుకో సంస్థ యజమానులకు
ప్రభుత్వ ప్రతినిధులకు
ఉద్యోగుల జీతాలు పెంచేందుకు
మనసు రాదు వారి
చేతుల్లో చలనముండదు
పెన్నుల్లో ఇంకుండదు
కాళ్ళలో కదలిక వుండదు
హృదయంలో స్పందన వుండదు
కాని ఒక్కటి మాత్రం పచ్చినిజం
ఏ సంస్థకైనా కష్టమర్లే
కళ్ళకుకనిపించే దేవుళ్ళు
ఉద్యోగస్తులే దాని
పురోభివృద్ధికి పునాదిరాళ్ళు
87. గుణపాఠాలే మన గురువులు
మనం
మన జీవితంలో
తెలిసో తెలియకో
చేసిన తప్పొప్పులనుండి
తీసుకున్న తప్పుడు
నిర్ణయాలనుండి
తగిలిన ఎదురు దెబ్బలనుండి
పొందిన చేదు అనుభవాలనుండి
మిత్రులనుండి
శతృవులనుండి
పండితులనుండి
పామరులనుండి
పైవారినుండి క్రింది పనివారినుండి
ఇంకా ఇంకా ఎందరినుండో నేర్చుకుంటాం
ఎన్నో ఎన్నెన్నో
పాఠాలు గుణపాఠాలు
కొన్ని బాధాకరమైనవి...
కొన్ని భరించలేనివి..
కొన్ని విలువైన వజ్రాలు
కొన్ని వెలకట్టలేని రత్నాలు
మణులు మాణిక్యాలు...
స్వీకరించాలి మంచిని చెడులోనుండి
కాస్త వివేకంతో విచక్షణాజ్ఞానంతో ...
సహనంతో సమయస్పూర్తితో...
పాలనుండి నీటిని వేరుచేసే రాజహంసల్లా...
ఔను నిజాలెప్పుడూ నిప్పులే...
గుణపాఠాలెప్పుడూ గురువులే...
అనుభవాలెప్పుడూ అరుణకిరణాలే...
తప్పొప్పులెప్పుడూ తీర్చవలసిన అప్పులే...
88. మూగజీవులను ప్రేమిద్దాం...
కుక్కనక్క
పోలిక ఒక్కటైనా
ఈ విశాల విశ్వంలో
ఆ రెండింటిని
విడదీసేది విశ్వాసమే
అందుకే అన్నారు
పురుషుల్లో
పుణ్యపురుషులు వేరని
కుక్కల్లో
విశ్వాసంగల కుక్కలు వేరని
ఇంటికుక్కఒక్కటే
కడుపునిండ తినేది
కంటినిండా నిద్ర పోయేది
అరిచేది కరిచేది తక్కువే
అది కాపలా కాసేది కూడా
ఇంటిని,ఇంటి యజమానినే
వీధిలో కుక్క ఒక్కోసారి
ఆకలికి అలమటిస్తుంది
ఖర్మకాలిఎప్పుడైనా
ఆకలికి తాళలేక
చిన్న తప్పుచేస్తే చాలు
దొంగగా మారితే చాలు
ఏదైనా ఇంట్లో దూరితే
చాలు కాళ్ళు విరగడం ఖాయం
చెట్టుతాను నేలకొరిగే వరకు
తనను గొడ్డలితో నరికే వారికి
నీడనిచ్చినట్టే ఆ కుంటి కుక్క
వీధుల్లో రాత్రంతా తిరిగితిరిగి
ఊరంతా కాపలా కాస్తూవుంటుంది
కంటపడితే దొంగల వెంటపడుతుంది
భయపెడుతుంది వారి భరతంపడుతుంది
అందుకే ఇంటికుక్కలకే కాదు
వీధికుక్కలకు సైతం విలువనిద్దాం
కరుణ చూపి కడుపులు నింపుదాం
తమ వ్యధల్ని వ్యాధుల్ని కన్నీటి గాథల్ని
వ్యక్తం చేయలేని మూగజీవాలను ప్రేమిద్దాం
మనలోని మానవీయతను మేల్కొల్పుదాం
89. మందులా ? కాదు...మానవత్వమే కొరత
షాపుల్లో మందుల కొరత
ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత
ఆక్సిజన్ సిలిండర్ల కొరత
ఐసీయూలో వెంటిలేటర్స్ కొరత
శవాలను తరలించ అంబులెన్సుల కొరత
శ్మశానంలో శవాలను కాల్చేందుకు
కట్టెలకు కొరత పూడ్చేందుకు స్థలాలకొరత
శ్మశానాల్లో క్యూలో అంబులెన్సులా?
అయ్యో ఓ దైవమా ఏమిటీ కొరతలకొరడా
నిజానికి ఈ కొరత యదార్థం కాదుకాదు
ఇది ఒక విషప్రయోగం...ధనార్జనకు దారి
ఇది మూటికి ముమ్మాటికీ కృత్రిమకొరతే
చీకట్లో సిగ్గూఎగ్గూలేని చిల్లర వ్యాపారమే
డిమాండ్ ఎక్కువైతే సప్లై తక్కువన్నది
గొప్ప ఆర్థికసూత్రమే జగమెరిగిన సత్యమే
తరిచిచూడ ఇది మందుల కొరతకాదు
మనిషిలో మానవత్వమే...కొరత
దాతృత్వమే దైవత్వమని
మంచితనమే మానవత్వమని
మనసున్న ప్రతిమనిషి గ్రహించాలి
అసలెందుకింతటి ధనదాహం?
ఆపదలో ఉన్న అత్యవసరంలో ఉన్న
ఇరుగు పొరుగువారిని ఆదుకోవాలి
నిప్పుల్లో కాలిపోతున్నవారిని రక్షించాలి
నీ కళ్మముందే నీళ్ళలో పడి మునిగిపోతున్న
వారిని గాజఈతగాళ్లను రప్పించి గట్టుకు చేర్చాలి
కరోనా నేర్పిన ఈగుణపాఠం నిత్యం గుర్తుపెట్టుకోవాలి
ఏదీ నీది కాదని...
ఏది శాశ్వతం కాదని...
ఎవరూ నీ వెంటరారని...
ఊపిరన్నది ఒక నీటిబుడగని...
రేపన్నది ఒక మాయేనని నేడే నిజమని...
ఏక్షణమైనా కోట్లు ఆర్జించిన కోటీశ్వరులైనా ...
కన్నుమూయడం ఖాయమని కాటికెళ్ళడం తథ్యమని.
90. నిన్న లేని కొత్తదారి
కొందరు కష్టపడి
నిన్న మొన్న ఉన్న
కాలిబాటనే - నేడు బండ్ల బాటగా
బండ్ల బాటనే - మట్టి రోడ్డుగా
మట్టి రోడ్డునే - కంకర రోడ్డుగా
కంకర రోడ్డునే - తారు రోడ్డుగా
తారు రోడ్డునే - సిమెంటు రోడ్డుగా
మారుస్తారు
మరి కొందరు
ఆ సిమెంటు రోడ్డు మీదే
ఫ్లయ్ఓవర్ని నిర్మిస్తారు
అట్టి వారందరు గట్టివారే గొప్పవారే
కాని నిన్న లేని ఒక కొత్తదారిని
నేడు కనిపెట్టినవాడే
కష్టాలు తీర్చినవాడే
అందరికంటే గొప్పవాడు
ఆపద్భాంధవుడు,ఆదర్శవంతుడు
91.ముందు పోల్చుకో !
తరువాత తేల్చుకో!!
ఓ నా ప్రియ మిత్రమా !
ముందు నిన్ను నీవు
నీటిలోని కప్పతోనో
లేదా
నింగిలోని పక్షితోనో
పోల్చుకో
ఆ తర్వాత
ఎగిరే పక్షిలా ఎదగడమా
లేక
బావిలోని కప్పలా బ్రతకడమా
తేల్చుకో
మంచి ఆలోచనలకు
జన్మస్థానమేది?
మంచి ఆలోచనలు
పార్కులో తిరుగుతుంటే
పుట్టవచ్చు
బస్సులోనో రైళ్లను
ప్రయాణంచేస్తున్నప్పుడు
పుట్టవచ్చు
గాఢంగా నిద్రపోయి
తెల్లవాఱు జామున
మూడు లేదా నాలుగు గంటలకు
మెలుకువ రాగానే
పుట్టవచ్చు
కుమార్ తో సరదాగా
ఫోన్లో మాట్లాడుతూ వున్నప్పుడు
పుట్టవచ్చు
92. రోగాలు లేని రాని రోజు ?
అనుభవం పండిన నిపుణులు
రాత్రి 10 గంటలకు "పడక"
తెల్లవారుజామున 4 గంటలకు "నడక"
సూత్రాన్ని తు.చ.తప్పక పాటించినరోజు
నిద్ర మేల్కొన్న తర్వాత, లేచి
మంచంపైనే కూర్చుని చిరు ప్రార్థనచేసినరోజు
క్రమం తప్పకుండా ప్రతిరోజూ
వ్యాయామం, యోగా, ధ్యానంచేసినరోజు
ఉదయం 5 గంటలలోపు
కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానంచేసినరోజు
సూర్యోదయానికి ముందే ప్రతిరోజు
పూజా కార్యక్రమాలను పూర్తిచేసినరోజు
టీవీ చూడకుండా & ప్రశాంతంగా
అల్పాహారం తిసుకుంటే భోజనంచేసినరోజు
WhatsApp Facebook లకు
వీలైనంత తక్కువ సమయం కేటాయించినరోజు
24 గంటలు మంచి ప్రవర్తనను కొనసాగించి
అందరినీ పలకరించిమర్యాదగా మాట్లాడినరోజు
సొంత భార్యను పిల్లలను
ప్రేమించి వారితో కలిసి
తిన్న తిరిగిన మాట్లాడిన
ఆనందంగా గడపినరోజు
మీ వెంటే ఆరోగ్యం...మీ ఇంటే ఆనందం...బ్రహ్మానందం ...
ఆరోగ్యమెక్కడ? ఇదిగో ఇక్కడే...
ఆ పరమానందంలోనే
93. మంచితరుణం మించిపోతే???
అనుభవం పండిన నిపుణులు
చెప్పింది విని మనం అర్థం చేసుకున్న తర్వాత
మన మంచికళ్ళతో మనం చూసి తృప్తి చెందిన తర్వాత
మన మనసుకు సంపూర్ణంగా నచ్చిన తర్వాత
ఇంకా ఆలస్యం చేస్తే
ఆలోచనలు పరిపరి విధాలుగా పోతాయి
నిముషాల్లో నిర్ణయాలు మారిపోతాయి
పనులు వాయిదా పడిపోతాయి
లేదా అతిగా ఆలోచిస్తే
లేని అనుమానాలు పుడతాయి
సందేహాలు ఎక్కువై ఉక్కిరిబిక్కిరి చేస్తాయి
కాని ముందుచూపు లేని మూర్ఖుల దగ్గర
సగం మాత్రమే తెలిసిన సన్యాసులు దగ్గర
సలహాలు తీసుకోరాదు భారీగా నష్టపోతాము
ఏదిఏమైనా ఎవరినుండైనా
సలహాలు స్వీకరించవచ్చు కాని
నిర్ణయాలు మాత్రం మనమే తీసుకోవాలి
పది పుస్తకాలలో చదివినదాని కన్నా
రెండు చెవులతో విన్నదాని కన్నా
రెండు కళ్ళతో ప్రత్యక్షంగా చూసిందే మిన్న
మంచితరుణం మించిపోయినా
ఆపై ఎంత తపించినా తిరిగి లభించునా చెప్పండి
అందుకే అమృతం విషం కాకముందే
అదృష్టం దురదృష్టంగా మారకముందే, మేల్కొని
అడుగు ముందుకు వేసినవారే అదృష్టవంతులండి
బంగారమంటి అవకాశం చేజిక్కించుకున్న వారే భాగ్యవంతులండి.
94. పరమాత్మమెచ్చిన"పచ్చని కాపురం"
ఆనాడు అందరిలో
పెళ్ళిపందిరిలో చేసిన
ఆ పెళ్లినాటి ప్రమాణాలకు
ఖచ్చితంగా మీరు కట్టుబడివుంటే
మీ భార్య ఎంత పెద్దతప్పుచేసినా
మీరు వెంటనే క్షమిస్తారు
"డోంట్ వరీ డార్లింగ్"అంటారు
"కమాన్ మైడియర్ డార్లింగ్ కమాన్"
అంటూ "గట్టిగా" కౌగలించుకొంటారు
ఒకవేళ మీరేదైనా చిన్నతప్పుచేసినా
వెనువెంటనే మీ భార్యచేతులు పట్టుకొని
"సారీ డార్లింగ్ ఐయాం వేరీసారీ "అంటారు
ముందుకు వంగి ముద్దు పెట్టుకుంటారు,
మూతిముడుచుకుంటే
"ఎందుకో మాపైఅంత కోపమంటారు
ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు
ఇద్దరు మురిసిపోతారు అన్ని మరచిపోతారు
మైమరచిపోతారు మరోలోకంలో విహరిస్తారు
సమస్యలెన్ని చుట్టుముట్టినా
కట్టకట్టుకొని వరదలా వచ్చినా
పరిష్కరించుకోవడానికిద్దరు
శతవిధాల ప్రయత్నాలు చేస్తారు
అసలు"విడాకులన్న"పదాన్ని
వినడానికే ఎవరూ ఇష్టపడరు, కానీ
ఇందుకు "భిన్నంగా" బ్రతుకు మారితే
"విధి విందుకు" హాజరై
"విడాకులు" తీసుకుంటారు
భయపడుతూ, భయపెడుతూ
బాధపడుతూ, బాధపెడుతూ
కృంగిపోతూ,కుమిలిపోతూవుంటారు
ఇలా జీవశ్చవంలా ఒంటరిగా బ్రతికేకన్న
ప్రతిక్షణం ప్రత్యక్ష నరకాన్ననుభవించేకన్న
ఇంత"విషంపుచ్చుకోవడం"
మిన్ననుకుంటారు
కానీ ముఖాముఖి చర్చలకు
ఒక్కరు ముందుకొచ్చినా చాలు
ఇంతకాలం ఇంట రేగిన ఆ ఆరని
అపార్థపుమంటలు చల్లారిపోతాయి
ఆ కలహాలన్నీ ఆ కలతలన్నీ అలకలన్నీ
మంచులా కరిగి కరిగి మాయమైపోతాయి
ఔను ఆ కారుచిచ్చు చల్లారినవేళ
ఆ ఇద్దరు బిగికౌగిళిలో బందీలైనవేళ
ఆ ఇళ్ళే ఒక స్వర్గసీమ..
ఆ జంటే ఒక కనులపంట, ఆ కాపురమే
పరమాత్మ మెచ్చిన ఒక "పచ్చని కాపురం"
95. వన్ సైడ్ లవ్" అంటే???
రెండు సార్లు ఇంటర్వ్యూ కెళ్తే
ఆఫీస్ లో ఒక్క ఉద్యోగమైనా దొరకకపోదు
నిన్న నీ ప్రేమ
పువ్వులా విరబూసిందని
విరజాజిలా వికసించిందని
మురిసిపోయావు
ముద్దులవర్షంలో తడిసిపోయావు
నిన్న ప్రతి నిమిషం వాడి తలంపే
వాడికోసం ఎదురు చూపులే
కళ్ళు మూసినా తెరిచినా వాడి రూపమే
వాడి పిలుపు కోసమే తపించావు
గుట్టు చప్పుడు కాకుండా గుమ్మం దాటేశావు
నిన్న ఒక్కటి ఇమ్మంటే వంద ఇచ్చావు - ముద్దులు
ఒక్కసారి రమ్మంటే వంద సార్లు వెళ్ళావు - పార్కుకి
ప్రేమపిచ్చి పట్టి కుక్కలా వాడివెంట పడ్డావు
పదిసార్లు రమ్మంటే ఒక్కసారే వెళ్ళావు - లాడ్జీకి
అంతే ఇచ్చిందంతా నచ్చిందంతా పుచ్చుకున్నాడు
నేడు వాడు
సెల్ కట్ చేస్తున్నాడంటే
ముద్దు వద్దంటున్నాడంటే
మూడుముళ్లకు నో అంటున్నాడంటే
మునిలా మౌనంగా వున్నాడంటే
ముళ్ళులా గుచ్చుకుంటున్నాడంటే
మూడ్ మారివుంటుందేమో
నీ ప్రేమకు పుల్ స్టాప్ పెట్టేశాడేమో
మరిప్పుడేం చెయ్యాలి ?
తప్పటడుగులు పడిపోయాయి
తప్పు జరిగిపోయింది
ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళావు
భయపడి ఓ పసికందును హత్య చేశావు
నిలదీసి అడిగే ధైర్యం నీకు లేదు
కారణం "వన్ సైడ్ లవ్"
నిన్న కన్నవారిని మోసం చేశావు
నేడు ఘోరంగా నీవే మోసపోయావు
ఇలా అమ్మానాన్నలను లెక్కచేయకుండా
కామంతో కళ్లు పొరలుకమ్మి కాలుబయట పెట్టిన
ఆడపిల్లల జీవితాలన్నీ అగ్నిగుండాలే
సుఖము శాంతిలేని సుడిగుండాలే
96. రెండు సార్లు ......
రెండు సార్లు ఇంటర్వ్యూ కెళ్తే
ఆఫీస్ లో ఒక్క ఉద్యోగమైనా దొరకకపోదు
రెండు సార్లు రాళ్ళు విసిరితే
చెట్టునుండి ఒక్క పండైనా రాలకపోదు
రెండు సార్లు గాలం విసిరితే
చెరువులో ఒక్క చేపైనా దొరకకపోదు
రెండు సార్లు వలలు విసిరితే
వలలో ఒక్క పక్షి ఐనా చిక్కకపోదు
రెండు సార్లు గట్టిగా ప్రయత్నిస్తే
పోటీలో ఒక్కవిజయమైనా దక్కకపోదు
97. సలహాలు వారివి నిర్ణయాలు మనవి
తినాలనుకున్న స్వీటు తినండి
కొనాలనుకున్న వస్తువు కొనండి
దయచేసి ఆలస్యం చేయకండి
ఆలోచనలు పరిపరి విధాలపోతాయి
ఎప్పుడైనా అవసరమైతే ఎవరినుండైనా
సలహాలు సూచనలు స్వీకరించండి
కాని నిర్ణయాలు మాత్రం మీరే తీసుకోండి
కొందరు కొన్నికొనరు మరొకర్ని కొననివ్వరు
వారు తినరు మరొకర్ని తిననివ్వరు
అందుకే బయటి వారి సలహాలు సూచనలు
మనకు మంచి కన్న చెడునే ఎక్కువ చేస్తాయి
కాలచక్రం గిర్రున తిరగ్గానే బలమైన
ఆలోచనలు సైతం బలహీనమైపోతాయి
ఒక్కోసారి ఉచిత సలహాలు కొన్ని
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి ఊపిరాడనివ్వవు
సందేహాల కందిరీగలై కుడతాయి
భూతాలై భయపెడతాయి మనల్ని బాధ పెడతాయి
మన మంచి ఆలోచనల్ని సైతం బంధిస్తాయి
సమస్యలౌతాయి కాళ్ళకు సంకెళ్లవుతాయి
ముళ్ళబాటలౌతాయి మనల్ని ముందుకెళ్ళనివ్వవు
అతిగా ఆలోచిస్తాము ఆలస్యం చేస్తాము
చూద్దాం చేద్దాంలే తొందరేముంది అనుకుంటాం
అవగాహనలేని అమాయకులు సలహాలతో
మన మనసులు మారిపోతాయి
మన ఆశల దీపాలు ఆరిపోతాయి
ఆలోచించండి కానీ ఆలస్యం చేయకండి
కుటుంబ సభ్యులందరు కూర్చొని
సకాలంలో సత్సంకల్పబలంతో
సమయస్ఫూర్తితో సమిష్టిగా తీసుకొనే సరైన
నిప్పులాంటి నిర్ణయాలే సత్ఫలితాలనిస్తాయి
సందేహాం లేదు లేనేలేదు ఇది ముమ్మాటికీ నిజం
98. చూడకు ఎవరినీ చులకనగా....
ఎదుటి వారిని చులకనగా చూడడం
వారు బాధ పడుతూవుంటే సంతోషించడం
వారు ఆర్థిక ఇబ్బందుల్లో వుంటే ఆదుకోకపోగా
ఆనందంతో చిందులు వెయ్యడం
ఇతరులముందు తక్కువ చేసి మాట్లాడడం
అవమానంగా అసహ్యంగా అతినీచంగా
అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడడం
ఎగతాళిగా హేళనగా నవ్వడం
ఏవగించుకోవడం ఏహ్యభావం కలిగివుండడం
అట్టివారెవరైనా అదేవారి పతనానికి పరాకాష్ట
వీరి సత్సంబందాలన్నీ సమాధి అవుతాయి
వారు నలుగురిలో నవ్వులపాలైపోతారు
అట్టివారికి అంతటా ఓటమే తప్ప విజయాలుండవు
అంతటా అవమానాలే తప్ప గౌరవాలుండవు
ఒంటరితనం వారిని వెక్కిరిస్తుంది వెంటాడుతుంది,
ప్రతినిత్యం మృత్యువు వారిని తప్పక వేటాడుతుంది
వారి జీవితం మోడువారుతుంది
చివరికి వారి బ్రతుకు చితికిపోతుంది
అందుకే
ప్రతి జీవిని ప్రేమించు కోపాన్ని అధిగమించు
ధర్మాన్ని అనుసరించు అహింసను ఆచరించు
ఆర్జించింది అనుభవించు ఆనందంగా జీవించు
99. విధిఆడే వింతనాటకం
వండిన వంట...
ఆశతో వండినవారి ఆకలి తీరవచ్చు
కష్టపడనివారి కడుపులు నిండవచ్చు
పాపం ధనం వెచ్చించినా దక్కకపోవచ్చు
ప్రక్కనున్న కుక్కలు పీకలదాకా మెక్కవచ్చు
పండిన పంట...
రేయింబవళ్ళు రెక్కలు ముక్కలుచేసి
రక్తం ధారపోసిన రైతన్నలు పొందవచ్చు
విత్తనం వెయ్యని వారికీ చెందవచ్చు
దళారులకు దగాకోరులకు అందవచ్చు
కలిపిన జంట...
సహనంతో సఖ్యతతో సర్దుబాటుగుణంతో
పదికాలాలపాటు పచ్చనికాపురం చేయవచ్చు
విడిపోనిబంధంగా వుండవచ్చు విడిపోవచ్చు
విధివిషం చిమ్మితే అదిమూడునాళ్ళముచ్చట కావచ్చు
రగిలితే ఆకలి మంట...
ప్రశ్నించవచ్చు
ప్రతిఘటించవచ్చు
పిడికిళ్ళు బిగించవచ్చు
భీకర పోరాటం చేయవచ్చు
దారుణ మారణహోమం జరగవచ్చు
అమాయకుల రక్తం ఏరులై పారవచ్చు
రామరాజ్యం రావణకాష్టమై రగలవచ్చు
ఏదేమైనా అంతా కనిపించని ఆ కాలనిర్ణయం కావొచ్చు
అంతుపట్టని ఆవిధి ఆడుతున్న ఓ వింతనాటకం కావచ్చు
100. ఒద్దురా వొద్దురా ! వెలిగితేనెే ముద్దురా!!
ఒద్దురా వొద్దురా !
ఒడ్డు చేరని నావ బ్రతుకు
గడ్డితినే గాడిద బ్రతుకు
ఒద్దురా వొద్దురా !
బావిలో కప్ప బ్రతుకు
యెడారిలో ఒంటె బ్రతుకు
ఒద్దురా వొద్దురా !
పంజరంలో పక్షి బ్రతుకు
కలుగులో కప్ప బ్రతుకు
ఒద్దురా వొద్దురా !
పరిగెత్తలేని గుడ్డి గుర్రం బ్రతుకు
నట్టేట ముంచే మట్టేనుగు బ్రతుకు
ఒద్దురా వొద్దురా !
వీధిలో కుక్క బ్రతుకు
ఆకలితీరని అనాధ బ్రతుకు
ఒద్దురా వద్దురా! ఆ చెత్త బ్రతుకు
బ్రతికితే బ్రతకరా ఓ కొత్త బ్రతుకు
బ్రతికితే నిప్పులా బ్రతకాలిరా !
ఆ నలుగురికైనా నీడ నివ్వాలిరా!
బ్రతికితే అడవిలో
పులిలా బ్రతకాలిరా !
రారాజులా అస్తమించాలిరా!
బ్రతికితే మంచిగా బ్రతకాలిరా !
మహాత్ముడిలా మరణించాలిరా!
జన్మకు సార్ధకతలేని
ఈ బ్రతుకులెందుకురా ?
వెలిగించినా వెలుగునివ్వని
ఆ నూనెలేని దీపాలెందుకురా?
మరి మీ పుట్టుకకు
అర్థం పరమార్థమేమిటో
తెలుసుకొని బ్రతకాలి! అసలు
లోపమెక్కడుందో తక్షణమే వెతకాలి!
101. నమ్మకు నమ్మకు నమ్మితే నరకమే!
ఓ తిండిబోతు
వాడిఇంటికి
వాడిఒంటికి వాడేశత్రువు !
ఓ సోమరిపోతు
ఇతరులకంటికి
అన్నింటికి వాడేశత్రువు !
ప్రతిదానికి
పొంగిపోయే తిండిబోతు
తప్పక లొంగిపోతాడు !
ప్రతిదానికి
లొంగిపోయే సోమరిపోతు
తప్పక కృంగిపోతాడు !
అందుకే అట్టివారు నీ
ప్రాణస్నేహితులైనా సరే
ఆ సోమరిపోతు నక్కల్ని
ఆ తిండిబోతు కుక్కల్ని
అర్థంకాని వారి కాకిలెక్కల్ని
ఆ పెరిగే కలుపు మొక్కల్ని
నమ్మకు నమ్మకు నమ్మితే నరకమే !
నమ్మకు నమ్మకు నమ్మితే చిక్కులే !
ముందరి బ్రతుకంతా ముక్కలుచెక్కలే!
102. ఒక చిన్న కండీషన్ ఏమిటది?
తల్లీ! ఓ సాగర మాతా!
నీలో దూకి ఈ తనువు
చాలించాలనుకుంటున్నాను
ఓకే బిడ్డా! అలాగే కాని
ఒక చిన్న కండీషన్!
నాలో అలలు ఆగిన తర్వాత
మాత్రమే నీవు దూకాలి
ఎంత కాలమైనా
ఎన్ని ఏళ్ళు గడిచినా
ఆ అలలు ఆగలేదు
ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు
మహోన్నత మైనది
మహా ఉత్కృష్టమైనదీ
ఈ మానవ జన్మ
అట్టి జన్మను మట్టిలో కలపడం
ఎంతటి దారుణం!
అజ్ఞానంలో అంధకారంలో
దుర్వసనాలకు బానిసలై
ఆకర్షణతో అమాయకత్వంతో
క్షణికావేశాలకు గురై
బంగారు భవిష్యత్తును
బలి తీసుకోవడం
ఎంతటి ఘోరం!
కష్టపడి కని పెంచి పెద్ద చేసి
ఆశలెన్నో పెట్టుకున్న
కలలెన్నో కంటున్న
కన్న తల్లిదండ్రులను
మానసిక క్షోభకు గురిచేయడం
ఎంతటి నేరం!
అందుకే ఓ బిడ్డలారా!
ఆ దారుణానికి పాల్పడే ముందు
ఒక్కసారి ఆలోచించండి
మీకు జన్మనిచ్చి మీ అమ్మానాన్నల్ని
మీకు ప్రాణం పోసిన ఆ భగవంతున్ని
నిండునూరేళ్లు బ్రతికిన
మీ తాతా ముత్తాతలను
కోట్లు ఖర్చు పెట్టినా బ్రతుకని
కోటీశ్వరులను
ఒక్కసారి ఒకే ఒక్కసారి
గుర్తుచేసుకోండి చాలు, ఇక నుండి
"ఆశే నా ఆస్తి" అంటారు
"ఆత్మహత్యకు స్వస్తి" అంటారు
103. ప్రేమిస్తే పచ్చదనమే
"అక్కర"అనగానే చక్కగా
స్పందించే వారి జీవితాలు
"ఆపద" అనగానే స్నేహహస్తం
అందించే వారి జీవితాలు
ప్రతినిత్యం చిరునవ్వులు
చిందించే వారి జీవితాలు
పేదలకు అనాధలకు
ప్రేమనుపంచే వారి జీవితాలు
అందరి శ్రేయస్సు గురించి నిరంతరం
ఆలోచించే వారి జీవితాలు
ఎప్పుడు పచ్చపచ్చగానే ఉంటాయి
104. ఎవరు వారు ?
వారే మన వీరజవాన్లు
ఎవరు వారు ? వారే మన వీరజవాన్లు
భద్రతాదళాలు మన భరతమాత ముద్దుబిడ్డలు
వారు నిద్రలేచి జపించే మంత్రం వందేమాతరం
వారు కలలో సైతం కలవరించేది త్రివర్ణపతాకం
ఎవరు వారు ? వారే మన వీర సైనికులు
వారు వీరులు,విక్రమార్కులు, వారుపిడుగులు
వారు శత్రువుల గుండెల్లో పేలే మరఫిరంగులు
వారే భద్రతాదళాలు మన భరతమాత ముద్దుబిడ్డలు
ఎవరు వారు ? వారే మన వీర సైనికులు
వారి గుండె చప్పుడు లబ్ డబ్ అనికాదు
దేశరక్షణ తల్లిఋణం దేశరక్షణ తల్లిఋణమనే
వారే భద్రతాదళాలు మన భరతమాత ముద్దుబిడ్డలు
ఎవరు వారు ? వారే మన వీర సైనికులు
ఎముకలుకొరికే చలిలోఎత్తైన మంచుకొండల్లో
నిత్యం మనకు నిద్రాభంగం కాకుండా నిఘాపెట్టే
భద్రతా దళాలు మన భరతమాత ముద్దుబిడ్డలు
వారి చేతుల్లో తుపాకులెందుకు ?దొంగచాటుగా
దేశంలో శతృవులు చొరబడితే మట్టుపెట్టడానికి
రాత్రింబవళ్ళు సరిహద్దుల్లో పహారా కాసేదెందుకు?
దేశప్రజలంతా సుఖంగా సురక్షితంగా జీవించేందుకు
వారు పోరాడేది శతృవులతోను మృత్యువుతోను
వారు ప్రతిక్షణం సిద్దమే చొరబాటుదారులనెదుర్కోవడానికి
మృత్యువును ముద్దాడడానికి,రక్తాన్ని చిందించడానికి
మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్య ఫలాలను అందించడానికి
105. "నవసమాజ నిర్మాణం"
ఈ "అణిచివేతల"
సమాజం మారాలంటే...
బలహీనులకు ధైర్యం నూరిపోయాలి
అజ్ఞానులను చైతన్యవంతం చెయ్యాలి
నిరుపేదలకు,కూలీలకు, శ్రమజీవులకు
దోపిడీని గురించి అవగాహన కలిగించాలి
ఈ "అసమానతల"
సమాజం "సమాధి"కావాలంటే...
ధనవంతులంతా ఆస్తి అంతస్తుల
మీద ఆశ ఉన్నా
నాది అనుకున్నదేదీ నీదికాదన్న
నిజం తెలియాలి
సేవాగుణం,దయాగుణం, దాతృత్వం,మంచితనం మానవత్వం, మచ్చలేని వ్యక్తిత్వం కలిగి వుండాలి
"సమసమాజానికి
పునాదిరాయి" పడాలంటే...
ముందు మధ్యతరగతి వారిలో
మార్పు రావాలి
వారెంతటి శక్తిస్వరూపులో వారికి తెలియజేయాలి
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడరాదు
నమ్మితే నరకమని,స్వశక్తియే
స్వర్గమని తెలియాలి
"నవసమాజ
నిర్మాణం" జరగాలంటే...
కులాలు,మతాలంటూ కుమ్ములాటలుండరాదు
ప్రజలను,ప్రభుత్వాలు
ఓట్లకోసమే వాడుకోరాదు
ప్రజా సంక్షేమమే పునాదిగా
సుపరిపాలన సాగాలి
ప్రజలందరు సమానత్వం
సౌభ్రాతృత్వంతో మెలగాలి
106. ఓ నవదంపతులారా !
ఓ నవదంపతులారా !
వినండి ! ఓ మంచిమాట చెబుతా !
అల్లకల్లోలమైన నీటిలో
మురికిపట్టిన పగిలిపోయిన
ముక్కలైన అద్దంలో కాదు
నిశ్చలమైన నీటిలోనే
స్వచ్చమైన అద్దంలోనే
మన ప్రతిబింబాలను
మనం స్పష్టంగా చూసుకోగలం
మన మనసు ప్రశాంతంగా ఉంటేనే
మన ప్రశ్నలకు, జవాబులు
మన సందేహాలకు, సమాధానాలు
మన చిక్కుసమస్యలకు,
చక్కనిపరిష్కారాలు దొరుకుతాయి
గద్దింపులు,గాండ్రింపులు
ఘర్షణలు గొడవలు వద్దేవద్దు
ఒకరినొకరు గౌరవించుకోండి
ఒకరినొకరు ప్రేమించుకోండి...
పంతాలు, పట్టింపులు
పగలు, ప్రతీకారాలు వద్దేవద్దు
ఒకరినొకరు అభిమానించుకోండి
ఒకరినొకరు ఆరాధించుకోండి...
అప్పుడు మీ కాపురాలు....
పచ్చని కాపురాలు
అనురాగగోపురాలు
అప్పుడు మీ జీవితాలు.
ఆనందనిలయాలు
అందాల బృందావనాలు
107. ఏమీటో ఈ సృష్టిరహస్యం?
పంజరంలోని పక్షికి
వేళకింత తిండి
దొరుకుతుంది అది
ఏ ప్రాణభయం
ఏ శత్రుభయం లేకుండా
కంటి నిండ నిద్రపోతుంది
కాని అది స్వేచ్చలేని బ్రతుకు...
ఆకాశంలో ఎగిరేపక్షి
తిండికోసం ఎక్కడెక్కడో
తిరగాలి ఎంతో దూరమెళ్లాలి
తిరిగి గూడు చేరేవరకు
అడుగడుగునా గండాలే
సుడి గుండాలే
ప్రతిక్షణం ప్రాణభయమే
ఎవరు వల విసురుతారోనని
ఎక్కడ ప్రాణం తీస్తారోనని
కానిదాని స్వేచ్చ ఆకాశమంత...
చిన్న ఆక్వేరియంలోని చేపకు
వేళకింత మేతదొరుకుతుంది అది
ఏభయంలేక సుఖంగా ఉంటుంది
కాని అది స్వేచ్చలేని బ్రతుకు....
సముద్రంలోనోవున్న చేపకు
క్షణక్షణం ప్రాణభయమే
ఏతిమింగళం మింగేస్తుందోనని
ఏ వలలో చిక్కుకొని, గిలగిలా
కొట్టుకోవలసి వస్తుందోనని
ఏ గాలానికో తగులుకొని
విలవిలలాడాల్చి వస్తుందోనని
కానిదాని స్వేచ్చ సముద్రమంత...
కానీ అర్థం కానిదొక్కటే
స్వేచ్చవున్న చోట సుఖంలేదు
సుఖమున్న చోట స్వేచ్చలేదు
ఏమీటో ఈ సృష్టి రహస్యం?
వెలుగెక్కడో...చీకటక్కడ
సుఖమెక్కడో...దుఃఖమక్కడ
జననమెక్కడో...మరణమక్కడో
స్వేచ్చఎక్కడో...ప్రాణభయమక్కడ
ప్రక్కప్రక్కనే వుంటాయి, కలిసే
వుంటాయి కానీ కంటికే కనిపించవు
ఏమీటో ఈ సృష్టి రహస్యం?
108. రెండు వైపులా...
రెండువందల గ్రాములే ?
ఈ సంసారమే ఓ తక్కెడ !
అందులో
ఓ ప్రేమ
ఓ గౌరవం
ఓ సరసం
ఓ సరదా
ఓ సంతోషం
ఓ అనురాగం
ఓ ఆప్యాయత
ఓ మంచితనం
ఓ మానవత్వం
ఓ సహనం శాంతం
ఓ సమానత్వం
ఓ సర్దుబాటుగుణం
ఓ సమయస్ఫూర్తి అనే
ఓ రెండు వందల
గ్రాముల ప్రేమే
రెండు వైపులాఉంటే
ఇక ఆ ఇద్దరి మధ్య
ఎక్కువ తక్కువ తేడాలెక్కడ ?
అట్టి ఆ సంసారం
ఓ మధురమైన
ఓ మంగళకరమైన
ఓ మనోహరమైన
ఓ సుమధురమైన
ఓ సుందరమైన
ఓ శుభకరమైన
ఓ నందనవనమే
ఓ ఆనందసాగరమే
అందులో
సందేహం లేదు...
ఓ ఆవగింజంతైనా...
Comments
Post a Comment