అమ్మకు వందనం ! పాదాభివందనం.!!.. (కుటుంబ కవిత)

 


అమ్మా ! 

మీకు వందనం !! 

పాదాభివందనం !!!


అమ్మా ! ఓమాయమ్మా!

ఎక్కడున్నావమ్మా ?

ఎక్కడికెళ్ళిపోయావమ్మా ?

స్వర్గానికే వెళ్ళి వుంటావు 

నిన్న నీవు ‌దూరమైనందుకు...

దుఃఖంలో మునిగి పోయాము


కానీ అమ్మా ! ఓ మాయమ్మా!

నిన్న నీవు కన్ను మూసినా... 

కాటికెళ్ళినా కాలి బూడిదైనా...

నీవింకా సజీవంగానే వున్నావన్న...

నీవు మా గుండెల్లో ఆరనిదీపమై...

నిత్యం వెలుగుతూనే వున్నావన్న...

తీపిజ్ఞాపకాలతో ఆత్మతృప్తితోఉన్నాం...


కానీ అమ్మా ! ఓ మాయమ్మా! 

నీవులేని మా జీవితాన చిమ్మచీకట్లే...

అడుగడుగునా లెక్కలేనన్ని ఇక్కట్లే...

ఆ దివినుండి మమ్ము చల్లగా చూడమ్మా... 

కంటికిరెప్పలా నీ‌‌ బిడ్డల్ని కాపాడవమ్మా...


అమ్మా ! ఓ మాయమ్మా !

నిత్యం నీ మరణాన్ని మేము కోరుకొనివుంటే...

నీవు మాకు బరువైపోయావని భావించివుంటే...

నీ కోరికలు తీర్చకపోతే నీ ఆశలు నెవేర్చకపోతే...

నీవు మంచాన పడితే ఇన్ని మందులివ్వకపోతే...


అమ్మా ! ఓ మాయమ్మా.!

నిన్ను ఏనాడైనా గట్టిగా ఒక తిట్టు తిట్టివుంటే...

నిస్సహాయురాలను చేసి ఏనాడైనా నిన్ను కొట్టివుంటే...

ఏనాడైనా ఏ ఒక్కరోజైనా నీ ఆకలి తీర్చకపోయివుంటే...

అడిగినా నీకు కడుపునిండా తిండి పెట్టకపోయికుంటే...

క్షమించమ్మా నీ అమృతహస్తాలతో మమ్ము దీవించమ్మా...

అమ్మా ! ఓ మాయమ్మా !‌ మీకు వందనం ! పాదాభివందనం !


రచన:

"కవి రత్న" 

"సహస్ర కవి" 

పోలయ్య కూకట్లపల్లి

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9110784502 



Comments