కరుణించవమ్మా ! ఓ కనకదుర్గమ్మ !
సర్వమంగళ
మాంగల్యే శివే
సర్వార్థ సాధికే...
శరణ్యే త్రంబకే దేవీ
నారాయణి నమోస్తుతే...
తల్లీ ! ఓ తల్లీ ! ఓ మా కల్పవల్లీ !
కరుణించవమ్మా ! ఓ కనకదుర్గమ్మ !
ఈ శుభప్రదమైన...
ఈ అద్భుతమైన..
ఈ ఆనందకరమైన...
ఈ సుందరమైన...
ఈ శుభకరమైన...
ఈ మధురమైన...
ఈ మనోహరమైన...
ఈ మంగళకరమైన...
ఈ శుభదినాన...
ఈ సుప్రభాతవేళ...
మా చింతలు చీకాకులు
అగ్నిలో ధగ్దమైపోనియ్...
నిన్న కన్నీటి వరదలైన మా కంట
నేడు ఆనంద భాష్పాలు రాలనియ్...
తరతరాలకు తరగని సిరిసంపదలు
శాంతిసౌభాగ్యాలు మా ఇంట పొంగిపొర్లనియ్...
అంబరాన్నంటే సంతోష సంబరాలతో
చిరునవ్వులతో మమ్ము చిందులు వేయనియ్...
సూర్యోదయమే ఎరుగక చితికిపోయిన
మా చీకటి జీవితాలు సుఖశాంతులతో వర్థిల్లనియ్...
ఆకలి కేకలు...చిమ్మచీకటి తప్ప
వ్యాధులు...వ్యధలు...వేదనలు తప్ప
చింతలు చీకాకులు...బాధలు భయాలు తప్ప
విషాదమే తప్ప వినోదం వికాసం లేని మోడువారిన
మా ఎడారి బ్రతుకుల్లో వేయివెన్నెలలను కురవనియ్...
తల్లీ ! ఓ మా చల్లని తల్లీ ! మా ఇంటి కల్పవల్లీ !
కరుణించి మమ్ము కాపాడవమ్మా ! ఓ కనకదుర్గమ్మ !
తల్లీ ! ఓ మా తల్లీ ! మీకు వందనాలు ! శతకోటి వందనాలు !
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502





Comments
Post a Comment