చిరునవ్వులే చిరుజల్లులు...!
ముసిముసి నవ్వులు
రువ్వే "అందమైన ఆ అధరాలు"
ఎదలో చెరగని ముద్రలు వేస్తాయి
ఎంతో స్వాంతన కలిగిస్తాయి
"మధువొలకబోసే ఆ అధరాలు"
మధురమైన మాటలే పలుకుతాయి
అవి ఎదలోతుల్ని తాకుతాయి
ఆ గుండెల్లో "ఆరనిమంటల్ని" ఆర్పుతాయి
మానని గాయాలకు "మందులౌతాయి"
చెదరని స్నేహానికి బంధాలకు అనుబంధాలకు
పెదవులే తీయని పదాలతో "ప్రాణం పోస్తాయి"
కానీ అనురాగాలు ఆవిరై
అంతరంగం అల్లకల్లోలమైతే...
గుండెల్లో అగ్నిపర్వతాలే బద్దలై
కళ్ళు కన్నీటి వరదలౌతాయి...
చిరునవ్వుల పువ్వులు పూసి
మధురానుభూతిని మిగిల్చిన
ఆ చిలిపి ఆధరాలే చివరకు
"చిగురుటాకుల్లా" వణికిపోతాయి...
నిజానికి మన
పెదాలలో......ప్రేమ ఉంది
అధరాలలో....అమ్మ వుంది
అధరాలలో ...అందముంది
అధరాలలో ...అమృతముంది
మన అధరాలే ఆత్మకు "ఔషధాలు"
మన అధరాలే మనకు "ఆయుధాలు"
నవ్వితే రాలేను
"నవరత్నాలు
ఆణిముత్యాలు"
నవ్వడం...ఒక భోగం
నవ్వకపోవడం...ఒకరోగం
నవ్వితే పోయేదేముంది?చెప్పండి
మీ ఆందోళన...తరగడం తప్ప...
మీ ఆయుష్షు...పెరగడం తప్ప...
నామాట నమ్మండి... మిత్రులారా !
"నవ్వేవారికి లేదట...నరకంలో చోటు"
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments
Post a Comment