"మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ బట్
అనౌన్సుడు ఆన్ ఎర్త్ "అంటారు
పూజారులు...పుణ్యమూర్తులు
రెండు జాతకాల కలయిక దివిలో...
ఆ రెండు జంటల బంధం భువిలో...
మనందరి తలరాతలు వ్రాసిన
ఆ పరమాత్మ చింత తీరాలంటే...
అంగరంగ వైభవంగా జంటను కలిపి
కాపురానికి పంపిన అమ్మానాన్నల
అత్తామామల మురిసే ముఖాలలో...
చిరునవ్వులు చిగురించాలంటే...
"ఆ ఇద్ధరి కొత్త కాపురం
అనురాగ గోపురం కావాలి"...ఔను
ఆ ఇద్దరు చిలకాగోరింకల్లా ఉంటే
ఇక చిక్కేముంది..? ఇక చింతేముంది..?
ఇక కొట్లాట లెక్కడ..?
కోర్టులమెట్లు ఎక్కడాలెక్కడ..?
విడాకులెక్కడ..? విడిపోవడాలెక్కడ..?
విషాదగాధల ఆరని కన్నీటిధారలెక్కడ..?
నిన్న కలకాలం...
కలిసి ఉండాలని కలలు కన్నారు
నేడు ఆ కలలు నిజం చేసుకుంటే...
ఇక ఆ ఇంట కలతలెక్కడ..? కన్నీళ్ళెక్కడ..?
జీవితం అంటే ఒక ప్రేమ తక్కెడ..!
రెండు వైపులా రెండు వందల గ్రాముల
ప్రేమేఉంటే ఇక ఎక్కువతక్కువ తేడాలెక్కడ..?
సందేహం లేదిక ఆపై...
ఆ జంట కన్నుల పంటే...
ఆ కాపురం పచ్చని కాపురమే ...
ఆ దాంపత్యం అన్యోన్య ఆదర్శ దాంపత్యమే...
ఆ ఇంట అంబరాన్నంటే సంతోషాల సంబరాలే...
రచన:
"కవిరత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments
Post a Comment