నేను...నా భారత దేశం...
బుద్ధం శరణం గచ్చామి
సంఘం శరణం గచ్చామి
ధర్మం శరణం గచ్చామి అన్న
....శాంతమూర్తి బుద్దుడు..!
ఆంగ్లేయుల నెదిరించి
వారి గుండెల్లో నిదురించి
వారిని తరిమి తరిమికొట్టి
భరతమాత దాస్యశృంఖలాలను త్రెంచిన
భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వంటి
...సాహసవీరులు..!
గాంధీ నెహ్రూ
బాలగంగాధర్ తిలక్
సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ వంటి
...స్వాతంత్ర సమరయోధులు..!
గరీబీ హటావో
జై జవాన్ జై కిసాన్
ఇంక్విలాబ్ జిందాబాద్
నినాదాల పునాదులపై
...నిర్మించబడిన దేశం నా భారతదేశం..!
లాల్ బహదూర్ శాస్త్రి ఇందిర
రాజీవ్ అటల్ అబ్దుల్ కలాం వంటి
...జాతినేతలు పుట్టిన దేశం నా భారతదేశం..!
రక్షణ కవచంవంటి రాజ్యాంగమున్న
...అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం నా భారతదేశం..!
నాలుగు వేదాలు
హిమాలయాలు సజీవనదులు
గంగా యమునా బ్రహ్మపుత్రలు
పవిత్ర గ్రంథాలైన భగవద్గీత రామాయణ
...మహాభారతాలు పుట్టిన దేశం నా భారతదేశం..!
విభిన్న జాతుల మతాల కులాల వర్గ
వర్ణ ప్రాంతీయ భాషాబేధాలెన్నున్నా
సహనం సమానత్వం సౌబ్రాతృత్వం
...భిన్నత్వంలో ఏకత్వమున్నదేశం నా భారతదేశం..!
ఎందరో మహారాజులు ఏలిన ఈ నేలలో
ఎందరో పుణ్యమూర్తులు త్యాగధనులు పుట్టిన
ఈ మట్టిలో నేను పుట్టడం నా పూర్వజన్మ సుకృతం..!
అందుకే నా "జాతీయ జెండాకు" వందనం..!
స్వరాజ్యం కోసం తృణప్రాయంగా ప్రాణాలొడ్డిన
నా"స్వాతంత్ర సమరయోధులకు" అభివందనం!
నా "బంగారుతల్లి భరతమాతకు" పాదాభివందనం ..!
జైహింద్...జైహింద్...జైభారత్...జై భారత్
రచన:
"కవిరత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502




Comments
Post a Comment