ఏది ప్రధానం ? ఏది ప్రమోదం? కవిత

 



ఏది ప్రధానం ? ఏది ప్రమోదం ? 

దీపాన్ని...

మట్టితో చేశారా ? 

బంగారంతో చేశారా ? 

అన్నది కాదు  

అది చిమ్మచీకటిని చీల్చి 

వెలుగులు విరజిమ్ముతుందా ? లేదా 

అన్నదే ప్రధానమన్నారు...మన పెద్దలు


అమ్మాయికి...

ఆస్తిఅంతస్తులు అందచందాలు 

ఉన్నతమైన ఉద్యోగం ఉన్నదా ? 

లేదా అన్నది కాదు 

ఆ అమ్మాయి గుణవంతురాలా ? కాదా 

అన్నదే ప్రధానమన్నారు...మన అమ్మానాన్నలు


అబ్బాయి... 

ప్రణాళికబద్దంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడా?

నిర్భయంగా ఏకాగ్రతతో పరీక్షలు వ్రాశాడా ?

లేదా అన్నది కాదు 

ఆ పరీక్షలో మంచిర్యాంకును సాధించాడా? లేదా 

అన్నదే ప్రధానమన్నారు...మన గురుతుల్యులు


ఆటగాడు...

ఎన్నిరోజులు కఠోరమైన శిక్షణ తీసుకున్నాడు

ఆటలో ఎంతటి ప్రావీణ్యతను ప్రదర్శించాడు? 

అన్నది కాదు 

ఆ పోటీల్లో బంగారు పతకాన్ని కొట్టాడా ? లేదా 

అన్నదే ప్రధానమన్నారు...ఒక ప్రముఖ ట్రైనర్ 


ఒక నిరుద్యోగి...

పట్టుదలతో ఎన్ని పరీక్షలు వ్రాశాడు 

ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండయ్యాడు? 

అన్నది కాదు

ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించాడా? లేదా 

అన్నదే ప్రధానమన్నారు...ఓ సంస్థ హెచ్ ఆర్ 


నిజమే కానీ...

హఠాత్తుగా సమస్యల సుడిగుండంలో

చిక్కుకోవడమంటే...తలపై తాటికాయ పడడమే

తక్షణమే ఒక సమస్యకు పరిష్కారం దొరకడమంటే

నక్కతోకను త్రొక్కడమే...ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమే


ఏదేమైనా... 

ప్రశ్న కాదు ప్రధానం...సమాధానం...

అంటే "తగిలిన" దెబ్బలు మానడం...

సమస్య కాదు ముఖ్యం...పరిష్కారం...

అంటే "రగిలిన" పగ ప్రతీకారాలు చల్లారడం...

నా కవితను చదివిన మీకు సకలశుభాలు కలగడం...


రచన: 

"కవి రత్న" 

"సహస్ర కవి"

పోలయ్య కూకట్లపల్లి

అత్తాపూర్ హైదరాబాద్

చరవాణి...9110984502





Comments