హంస"లా... హాయిగా...జీవించు...!
ఓ నా ప్రియ నేస్తమా ! నీ పరుగు ఆపకు
నీ గమ్యం చేరేవరకు...నీ లక్ష్యం నెరవేరేవరకు
నీ మాటలో నీ బాటలో భారతీయతనే "జపించు"
విశ్వశాంతికై నిత్యం "తపించు"
.....స్వామి వివేకానందలా...
నీలోని పగాప్రతీకారాన్ని...అసూయాద్వేషాన్ని
కోపాన్ని క్రోధాన్ని తక్షణమే "త్యజించు"
.....గౌతమ బుధ్ధునిలా...
నీ శత్రువులను సైతం "ప్రేమించు"
నిన్ను హింసించిన వారిని "క్షమించు"
మంచిని మానవత్వాన్ని "ప్రబోధించు"
.....ప్రభువైన యేసుక్రీస్తులా...
అట్టడుగు వర్గాల హక్కులకై
నీ రక్తాన్ని స్వేదంలా "చిందించు"నిప్పులా "జ్వలించు"
అణగద్రొక్కబడిన నీ జాతి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం
నిరంతరం "పోరాడు"
.....డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ లా...
రక్తపాత రహితంగా..
అహింసే ఆయుధంగా...
ఊపిరి ఓపిక ఉన్నంతవరకూ...
ఉక్కు సంకల్పంతో."ఉద్యమించు"
పులులనైనా సింహాలనైనా "ఎదురించు"
పోయిన నీ హక్కుల్ని "సాధించు"
.....జాతిపిత మహాత్మాగాంధీలా...
అమాయకుల అజ్ఞానుల నేత్రాలు"తెరిపించు"
వారికి సుఖజీవన నవజీవన సూత్రాలను"బోధించు"
సుఖంగా...సంతోషంగా...హాయిగా...ఆనందంగా...
ఆరోగ్యంగా...అందరికీ ఆదర్శంగా...ప్రశాంతంగా "జీవించు"
.....శ్రీ రామకృష్ణ పరమ"హంస"లా...
రచన:
"కవిరత్న"
"సహస్రకవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502
.jpeg)
Comments
Post a Comment