ఓ మిత్రమా !
నీ నిర్లక్ష్యమే
నీకు నిజమైన శత్రువు
ఇది కలనైనా మరువకు
ఓ మిత్రమా!
నీ ముఖానికి మాస్కే
నీకు దగ్గరి చుట్టమైతే
నీ చేతుల శుభ్రతే
నీకు సంతోషమైతే
నీ భౌతిక దూరమే
నీకు కరోనా రక్షణకవచమైతే
నీ స్వీయ నియంత్రణే
నీకు శ్రీ రామరక్ష ఐతే
ఆపై ఆ కరోనా భూతం ఖతమైపోదా...
ఇక భయమేలనోయీ ! ఓ బాల్య మిత్రమా?
ఆ కరోనా వన్నీ
జిత్తులే నక్కజిత్తులే...
నీ నిర్లక్ష్యమే
నీకు నిజమైన శత్రువు
ఇది కలనైనా మరువకు
ఓ మిత్రమా!
నీ ముఖానికి మాస్కే
నీకు దగ్గరి చుట్టమైతే
నీ చేతుల శుభ్రతే
నీకు సంతోషమైతే
నీ భౌతిక దూరమే
నీకు కరోనా రక్షణకవచమైతే
నీ స్వీయ నియంత్రణే
నీకు శ్రీ రామరక్ష ఐతే
ఆపై ఆ కరోనా భూతం ఖతమైపోదా...
ఇక భయమేలనోయీ ! ఓ బాల్య మిత్రమా?
శ్వాస మీదనే కరోనా ధ్యాస....
కనిపించనిఆ కరోనా వన్నీ
జిత్తులే నక్కజిత్తులే...
దాని ధ్యాసంతా
మనిషి శ్వాస మీదనే
అది చిత్తుచిత్తు చేసేది
మనిషి తిత్తులే ఊపిరితిత్తులే...
ఆ కరోనా కాలనాగు
కాటేయకుండా
కట్టడి చేయాలంటే
అథఃపాతాళానికి
అణగద్రొక్కాలంటే
సమాధి చెయ్యాలంటే
వెయ్యక తప్పదు
మనం ఎత్తుకు పైఎత్తులే...
లేదంటే కరోనా వైరస్ సోకిన
వారంతా రాలిపోయే పిట్టలే
ఆరిపోయే వత్తులే కొవ్వొత్తులే...
ఆపై అశృనయనాలతో
ఆ పార్థివదేహాలపై వుంచేది
నిశ్శబ్దంగా,నివాళుర్పించేది
గుత్తులే పూలగుత్తులే.....
కరోనా వచ్చింది...కళ్ళు తెరిపించింది
కరోనా వచ్చిందివిషపురుగుల
చరిత్రను తిరగరాసింది
కరోనా వచ్చింది
ఇల్లే శ్రీరామ రక్షని
గొప్ప సందేశాన్నిచ్చింది
కరోనా వచ్చింది
వలసకార్మికలకు
పుట్టెడు దుఃఖాన్ని తెచ్చింది
కరోనా వచ్చింది
కోట్లకన్న ప్రాణం మిన్నంటూ
అందరి కళ్ళు తెరిపించింది
కరోనా వచ్చింది
ఉద్యోగం కన్న
కుటుంబమేమిన్నంటూ
గొప్ప కనువిప్పు కలిగించింది
గొప్ప కనువిప్పు కలిగించింది
కరోనా వచ్చింది
అన్ని అనుబంధాలు
అశాశ్వతమంటూ
గొప్ప గుణపాఠం నేర్పింది
గొప్ప గుణపాఠం నేర్పింది
కరోనా వచ్చింది
కరోనా ముందు
కరోనా తర్వాతంటూ
కాలాన్ని రెండుగా విభజించింది
కాలాన్ని రెండుగా విభజించింది
కరోనా వచ్చింది
పుష్టికరమైన ఆహారం తీసుకోమన్నది
అందరికి ఆరోగ్యామే మహాభాగ్యమన్నది
కరోనా వచ్చింది
కాలం అతి విలువైనదని
ప్రాణం వెల కట్టలేనిదని తెలిపింది
కరోనా వచ్చింది
మనిషి మనుగడలో, జీవనశైలిలో
చేసేఆలోచనలో, పెనుమార్పులు తెచ్చింది
కరోనా వచ్చింది
సామాజిక దూరం కాదు
భౌతిక దూరం
పాటించమని ప్రతి మనిషికి నేర్పింది
కరోనా వచ్చింది
తన పుట్టుకకు కారణం కనిపెట్టమని
ఎందరో మేధావులకు,
సైంటిస్టులకు సవాలు విసిరింది
రచన:
"కవి రత్న"
"సహస్ర కవి"
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి...9110784502

Comments
Post a Comment